ప్రజాస్వామ్యమా షర్మిలను చూసి సిగ్గుపడు.
మన కల్లముందే పదిమంది మహిళలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చితే మనమైతే ఎంచేస్తాం...కాసేపు బాధ పడతాం,కాసేపు కన్నీరు కారుస్తాం, కల్లముందే జరిగిన మారణహోమాన్ని పదిమందికి కథలుకథలుగా చెప్పి బోరున విలపిస్తాం కావొచ్చు... కాని ఆమె మాత్రం మన అందరికంటే భిన్నంగా స్పందించింది....తన కల్ల ముందే జరిగిన ఘటనకు స్పందనగా ప్రపంచంలో ఇప్పటివరకు ఎవ్వరు చేయలేని సాహాసాన్ని చేసి చుపుతుంది...అమె ఇరోం చాను షర్మిలా....
నవంబర్ 2, 2000 సంవత్సరం మణిపాల్ లోయలోని మలోం బస్టాండ్ల్ లో నిలుచున్న వారిపై అస్సాం రైఫిల్స్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో పది మంది మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సాయుధ దళ కౄరత్వం అందరిని కలచివేసింది. ఇరోం షర్మిలా స్థానిక పత్రికలో జర్నలిస్టు. కవయిత్రీ కూడా. కనికరం లేని తీరుతో కలతచెందిన షర్మిలా కటిన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4న ఆమరణ దీక్షకు దిగింది. యమపాశంగా మారిన భద్రత దళాల ప్రత్యేక అధికారల చట్టం అంతు చూసేదాకా దీక్ష సాగిస్తానని శపధం చేసింది. తన చావుతోనైనా తన జాతికి పట్టిన పీడనను వొదిలించాలని పట్టుదలతో దీక్ష చేపట్టింది. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు షర్మిలాను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏంత బలవంతం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో నాసోగ్యాస్ట్రిక్ ఇన్ ట్యుబ్యెషన్ పద్దతిలో ముక్కుద్వారా ద్రవ పదార్థాలను పంపించడం మొదలు పెట్టారు. షర్మిలా బైల్ తీసుకోవడాంకి నిరాకరించింది. ఆత్మహత్య నేరం కింద జైలు శిక్ష సంవత్సరం మాత్రమే కాని ఏడాది కాగానే జైలు నుంచి విడుదల చెయడం మళ్ళీ అరెస్టు చేయడం.. 12 ఏండ్లుగా మణిపూర్ పోలిసులు అదే పని చేస్తున్నారు. ఇప్పటికే 500 సార్లు కోర్టు, జైలు, హాస్పిటల్ వార్డుకు తిరిగించి. 12 ఏండ్లుగా షర్మిలా నోటిద్వారా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. ముక్కుద్వారా పైపుతో ప్లూయిడ్ ఎక్కించడం నిజంగా ఒక హింస. షర్మిలా శరీరం రోజురోజుకు కుషికంచిపోతుంది. అవయవాలు మెళ్ళగా దెబ్బతింటున్నాయి. 38 ఏళ్ళ షర్మిలా బరువు ఇప్పుడు 37 కిలోలు. 2006లో విడుదలైనప్పుడు. షర్మిలా ఢిల్లీ రాజ్ఘడ్ చేరుకోని మహాత్ముడికి మొరపెట్టుకుంది. జంతర్ మంతర్ వద్ద దీక్ష సాగించింది. కేంద్రం వెంటనే అరెస్టు చేసి ఆసుపత్రిలో నిర్భందించింది. తరువాత ఇంఫాల్ కు తరలించింది. సంచలన వార్తల గుంపులో కొట్టుకుపోతున్న జాతీయ మీడియాకు షర్మిలా దీక్ష వార్త కాదు. అసలే గుర్తింపుకు నోచుకోని ఈశాన్య రాష్ట్రాలు. పైగా కనీస కవరేజ్ ఇవ్వని మీడియా. సంవత్సరాలు గడుస్తున్న కదలిక లేని తోలు మందం ప్రభుత్వం. శారీరక బహహీనత, మానసిక సంఘర్షణ చుట్టూ తుపాకులు. ఐతే హాస్పిటల్ లేదంటే జైల్. కత్తుల వంతేనమీద పయనం. ఆటు కానరానీ పరిష్కారం. ఐతేనేం ఆమె మానసిక దృడత్వం ముందు ఏ అవంతరాలు నిలువలేదు. ఆమె సంకల్ప బలం ముందు నిరాశ, నిశ్పృహలు వెలవలేదు. నిబద్ధత, నిజాయితి, తన జాతి జనుల పట్ల ప్రేమ, అమానవీయ చట్టాలను ఆంతం చేయాలన్న కర్తవ్యం. అమెను ముందుకు నడిపించాయి. ఈ నవంబర్ 4వ తారికుతో అమె దీక్ష 12 ఏండ్లు నిండిపోతాయి. పుష్కర కాలంగా అదే సహసం అదే సహనం. 12 ఏండ్లుగా పుస్తకాలు, కవితలే ఆమె నేస్తాలు. ఈ ప్రస్తానంలో ఒక ఇంట్రెస్టింగ్ యాంగ్ల్ షర్మిలా లవ్ స్టోరీ.. షర్మిలా దీక్ష కాలంలోనే ప్రేమలో పడింది. అతని పేరు డెస్మాండో కొటినో. బ్రిటన్ లో పుట్టిన భారతీయుడు . మానవ హక్కుల కార్యకర్త. మరి పెండ్లెప్పుడు అని అడిగితే. సైనిక చట్టం రద్దై , శిక్ష ముగిశాక అని చెప్పేసింది ఆ వనిత సాహస దీక్షకు ఏన్నో అవార్డులు వచాయి. ఎషియన్ హుమన్ రైట్స్ ఫోక్ స్కూల్ మానవ హక్కుల పురస్కారం 2007 లభించింది. కాని మన ప్రభుత్వం కనికరించలేదు. సెవెన్ సిస్టర్స్ లో ఒకటైన మణిపూర్ సిస్టర్ కన్నీళ్ళను తుడవడానికి చేయి రాలేదు. నామమాత్రంగా ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. అన్నా హజారే దీక్షకు, కేజ్రివాల్ ధర్నాలకు విపరితమైన ప్రాచుర్యం కల్పించే మీడియా 12 ఏండ్లుగా కొనసాగిస్తున్న దీక్షకు తగినంత ప్రాచుర్యం కల్పించడం లేదు. రాజకియ నాయకుల యాత్రలకు రోజులతరబడి కవరేజిలు ఇస్తున్న మన తెలుగు పత్రికలు ఇరొం షర్మిల 12 ఏండ్ల దీక్షకు ఓ మూల నాలుగు లైన్ల స్థానం కల్పించారు. ఇది మన పత్రికల స్థితి....శ్రీశ్రీ అన్నట్లు మన పత్రికలు "పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విష పుత్రికలు పత్రికలు" అనేది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఈ దీక్ష ఇంకెంత కాలం సాగుతున్నదన్నది కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇంకెన్నాలు ఉలుకూ పలుకూ లేకుండా కుర్చుంటాయన్నదే ప్రశ్న. ఒక మహిళ గాంధీ మార్గంలో సాగిస్తున్న సత్యాగ్రహం పాలకులను కదిలించ్లేకపోవడం మహా విశాదం. ప్రజాస్వామ్యంలో పెద్ద విఘాతం. షర్మిలా హిమాలయమంత ఎత్తున ఎదిగిన ఉద్యమ మూర్తి. అన్యాయాన్ని ఎదిరించి నిపుస్తున్న వాళ్ళకు కొండంత స్పూర్తి . ఆమె నుండి ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన విలువైన పాటాలు ఏన్నో. నలుగురి కోసం బతకడం. నలుగురి కోసం చావడానికి సిద్దపడటం ఈ భూమ్మీద అదే అంతటా ఆదర్శం. ఆ ఆదర్శాన్ని అంతటా ఆవిష్కరించిన షర్మిలాజి రెండు చేతులెత్తి వందనం చేయాలి.
మన తెలుగు పత్రికలు (ఈనాడు,సాక్షి,ఆంద్రజ్యోతి,) ఇరొం షర్మిల 12 ఏండ్ల దీక్షకు ఇచ్చిన కవరేజ్
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment