Showing posts with label సామాజికం. Show all posts
Showing posts with label సామాజికం. Show all posts
అగ్రకులతత్వంతో అధ్యాపక స్పందన
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అధ్యాపకులను, అధికారులను మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు అనేక సార్లు అవమానించి, భౌతిక దాడులకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేసినప్పుడు ఔటా నాయకులు ఎందుకు స్పందించలేదు? అనేక మంది ప్రొఫెసర్లపై మతోన్మాద విద్యార్థులు దాడులకు పాల్పడినప్పుడు రాజీనామాలు చేయని అగ్రవర్ణ డీన్‌లు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఇప్పుడే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారో వివరించాలి.
భ్రష్ఠత్వానికి పరాకాష్ట (డిసెంబర్ 20, ఆంధ్రజ్యోతి) అన్న వ్యాసంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయునిపై ఒక విద్యార్థి దాడిచేసిన విషయాన్ని ఖండిస్తూ అఖిలేశ్వరి గారు చర్చను లేవనెత్తారు. ఆ వ్యాసంలో లేవనెత్తిన విషయాన్ని కాస్త సీరియస్‌గా పరిశీలిస్తే ఆ వ్యాసకర్తలో ఎక్కడో ఒక దగ్గర అగ్రకుల భావజాలం పనిచేసిందనేది స్పష్టమౌతుంది. ఎందుకంటే మొన్న విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనను వ్యాసకర్త ఖండిస్తూ పరుషమైన పదజాలంతో విమర్శిస్తూ ఒక వర్గం విద్యార్థులపై విరుచుకపడి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 'మన కళ్లముందే జరుగుతున్న విషాదానికి మనమందరమూ బాధ్యత వహించాలని, ఇది యావత్ సమాజాన్ని దిగజారుస్తోంది, సమాజంలోని ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోందని' ఆవేదన వ్యకం చేశారు. సమాజంలోని ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేసే స్థాయిలో ఆ ఘటన జరిగిందా అనేది సీరియస్‌గా చర్చించాలి. నిజానికి ఉపాధ్యాయునిపై దాడి జరగడానికి కారణాలు ఏమిటనేది ఆలోచించకుండా చర్చలు లేవనెత్తితే విషయం పక్కదారి పట్టి, ఒక వర్గం విద్యార్థులను అపార్థం చేసుకొనే అవకాశం ఉంటుంది. అఖిలేశ్వరి గారి చర్చ అలాగే ఉంది. మొన్న విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయునిపై జరిగిన దాడిని అక్కడ ఉన్న విద్యార్థులందరూ ఖండించారు. దాడికి పాల్పడిన అలెగ్జాండర్ అనే విద్యార్థి వైస్ ఛాన్స్‌లర్ ముందే ఆ ఉపాధ్యాయునికి క్షమాపణలు కూడా చెప్పాడు. తను ఏ బలహీన క్షణంలో దాడికి పాల్పడిందీ వివరించాడు.
గతంలో తన సోదరి స్నేహితురాలు ఉపాధ్యాయుని వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుర్తొచ్చి తాను భావోద్వేగానికి గురయ్యానని వివరించాడు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు. ఇంత జరిగాక తన తప్పును ఒప్పుకున్న విద్యార్థిని పెద్దమనసుతో క్షమించాల్సిన ఉపాధ్యాయులు ర్యాలీలు తీస్తూ, మీడియాకు ఎక్కుతూ, ఈ దాడులకంతటికీ ఒక వర్గం విద్యార్థులే కారణం అంటూ దుష్ప్రచారం చేయడం ఆ వర్గాల విద్యార్థులను అవమానించడమే అవుతుంది. నిజానికి దాడికి పాల్పడిన విద్యార్థికి కానీ, ఆ ఘటన సందర్భంగా అక్కడ ఉన్న విద్యార్థులకు కానీ గతంలో ఉపాధ్యాయులను వేధించిన చరిత్ర కానీ, దాడులు చేసిన చరిత్రకానీ లేదు. ఈ ఘటన జరిగిన తర్వాత దాడికి గురైన అధ్యాపకుడు, నాపై దాడికి పాల్పడిన విద్యార్థి క్షమాపణలు చెప్పడం, అరెస్టు కావడం జరిగింది కనుక ఇంతటితో నేను ఈ విషయాన్ని వదిలేస్తున్నానని చెప్పాడు. యూనివర్సిటీలోని మెజారిటీ అధ్యాపకులు కూడా ఈ విషయాన్ని ప్రొఫెసర్, విద్యార్థులు కూర్చొని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలని కూడా సూచిస్తున్నారు. కానీ తమ స్వప్రయోజనాలను రక్షించుకొనేందుకు ఔటా నాయకులు ఆ దాడిని ఒక సాకుగా తీసుకొని అగ్రవర్ణ భావజాలంతో ర్యాలీలు తీస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య వైషమ్యాలు పెంచి తమ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు.
అయితే గతంలో ఇదే విశ్వవిద్యాలయంలో కొందరు ప్రొఫెసర్స్‌పై విద్యార్థులు దాడులకు పాల్పడిన సంఘటనలపై ఈ అధ్యాపకులుగానీ, ఉపాధ్యాయ సంఘం(ఔటా)గానీ స్పందించిన తీరును కూడా చర్చించాలి. మరికొద్ది సంవత్సరాల్లో ప్రథమ శతాబ్దిని పూర్తిచేసుకోబోతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేకమంది బడుగు, బలహీన వర్గాల ఉపాధ్యాయులు ఒక అగ్రవర్ణ విద్యార్థి సంఘం చేతిలో అనేక అవమానాలు, దాడులకు గురయ్యారు. గతంలో ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఒక ప్రొఫెసర్‌పై అగ్రవర్ణ విద్యార్థి సంఘానికి చెందిన కొందరు విద్యార్థులు దాడిచేసి ఆయనను గాయపరచడం జరిగింది. అంతేకాకుండా ఆ ప్రొఫెసర్ భార్యను, కూతురును అవమానిస్తూ కావేరి హాస్టల్ గోడలపై రాతలు రాశారు. ఆయన తోటి ఉపాధ్యాయుల దగ్గర తన బాధను, తనకు జరిగిన అవమానాన్ని వివరించాడు. కానీ ఆ ప్రొఫెసర్‌కు ఏనాడూ ఉపాధ్యాయ సంఘం (ఔటా) మద్దతు తెలుపలేదు. ర్యాలీలు తీయలేదు. దాడికి పాల్పడి, అవమానించిన విద్యార్థి సంఘంపై చర్యతీసుకోలేదు. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో చీఫ్ వార్డన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ కేశవులును అగ్రవర్ణ విద్యార్థి సంఘం తమ కార్యక్రమాల కోసం చందాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అందుకు అంగీకరించని ప్రొఫెసర్‌పై ఆ విద్యార్థి సంఘ నాయకులు ఆయనపై 'సాంబారు' పోసి కొట్టి, అవమానించారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా ప్రొఫెసర్ కేశవులు ఆనాడు ధర్నా నిర్వహించారు, బాధ్యులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని వీసీకి మొరపెట్టుకున్నారు. ఒక ఎస్సీ ప్రొఫెసర్‌పై దాడులకు పాల్పడిన విద్యార్థులపై చర్య తీసుకోవాలని యూనివర్సిటీలో వామపక్ష, ఎస్టీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఆనాటి వీసీ కానీ ఔటా కానీ చర్య తీసుకోవాలని డిమాండ్ చేయలేదు. ఇదే యూనివర్సిటీలో లా కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న గిరిజన ప్రొఫెసర్ పంతునాయక్‌ను ఏబీవీపీ విద్యార్థి సంఘానికి చెందిన విద్యార్థులు చెప్పులతో కొట్టి, అవమానించినా ఏనాడూ కనీసం ఔటా నాయకులు ఖండించనూలేదు. మైనారిటీ వర్గానికి చెందిన ఒక ప్రొఫెసర్ తన విద్యార్థినితో క్లాస్ రూంలో సబ్జెక్ట్ విషయమై చర్చిస్తుంటే ఇదే మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు ఉపాధ్యాయునికి, విద్యార్థికి మధ్య లైంగిక సంబంధాన్ని అంటగట్టి అవమానించి కొట్టడం జరిగింది.
మొన్నటికి మొన్న ఆర్ట్స్ కాలేజీలో ఏబీవీపీకి చెందిన ఒక విద్యార్థి మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే మందలించిన లేడీ ప్రొఫెసర్‌ను ఆ విద్యార్థి దుర్భాషలాడి, అవమానిస్తే ఆ ప్రొఫెసర్ ఎగ్జామ్ హాల్ నుంచి ఏడ్చుకుంటూ నిష్క్రమించింది. ఇలాంటి ఘటనలు విశ్వవిద్యాలయంలో గత కొన్నేళ్లలో అనేకం జరిగినప్పటికీ ఏనాడూ ఖండించని ఔటా నాయకులు, అధికారులు మొన్న జరిగిన ఘటనను మాత్రం పెద్దది చేసి ఒక వర్గం విద్యార్థులను శత్రువులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే మేము యూనివర్సిటీ అధికారులను, ఔటా నాయకులను ప్రశ్నిస్తున్నాము. యూనివర్సిటీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అధ్యాపకులను, అధికారులను మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు అనేక సార్లు అవమానించి, భౌతిక దాడులకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేసినప్పుడు ఔటా నాయకులు ఎందుకు స్పందించలేదో వివరించాలి. అనేక మంది ప్రొఫెసర్లపై మతోన్మాద విద్యార్థులు దాడులకు పాల్పడినప్పుడు రాజీనామాలు చేయని అగ్రవర్ణ డీన్‌లు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఇప్పుడే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారో వివరించాలి.
అనేక సందర్భాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధ్యాపకులు దాడులకు గురైతే ఈ ఔటా నాయకులు ఎందుకు ర్యాలీలు తీయలేదో, మానవహక్కుల కమిషన్‌ను ఎందుకు ఆశ్రయించలేదో వివరించాలి. దాడులకు గురైన ప్రొఫెసర్లు యూనివర్సిటీ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఏనాడూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వని రిజిష్టార్ ఇవాళ ఎస్సీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి అగ్రవర్ణ ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడితే యూనివర్సిటీ అధికారులంతా ఆగమేఘాలమీద స్పందించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే యూనివర్సిటీ అధికారుల నిజస్వరూపం, అగ్రవర్ణ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొఫెసర్లపై జరిగిన దాడికి ఆ విద్యార్థి క్షమాపణలు చెప్పి, పోలీసుల ఎదుట స్వచ్చందంగా లొంగిపోయినప్పటికీ ఔటా నాయకులు ఆ విషయాన్ని అంతటితో వదిలి పెట్టకుండా మానవహక్కుల సంఘాన్ని, గవర్నర్‌ను కలుస్తూ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కదోవ పట్టిస్తున్నారు. యాదృచ్ఛికంగా జరిగిన ఆ ఘటనను ఖండిస్తూనే కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులతో, ప్రిన్సిపాల్‌తో చర్చించి, యూనివర్సిటీలో సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయాలని ఒకవైపు ప్రయత్నిస్తున్నారు. ఔటా నాయకులు మాత్రం విద్యార్థుల ప్రతిపాదనను తోసిపుచ్చుతూ విషయాన్ని మరింత జఠిలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
యూనివర్సిటీలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్యవర్తిత్వం వహించాల్సిన ఉపాధ్యాయులు, బాధ్యత కలిగిన అఖిలేశ్వరి లాంటి వ్యక్తులు సమస్యను సరిగ్గా అర్థం చేసుకోకుండా దానిని ఇంకా జటిలం చేస్తే ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయో ఆలోచించాలి. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులను సన్నిహితంగా గమనిస్తున్న అఖిలేశ్వరి గారు విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడిచేయడం, పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడిచేయడం కంటే తక్కువేమీ కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఒక విద్యార్థి భావోద్వేగానికిలోనై ఒక ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడితే ఆ ఘటనను ఉగ్రవాద చర్యతో పోల్చడం ఏవిధంగా సరైనదో అఖిలేశ్వరిగారే విజ్ఞతతో ఆలోచించుకోవాలి. సమాజం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దాని నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపంచి, పరిష్కారాన్ని కనుగొనాల్సిన బాధ్యత మేధావివర్గంపై ఉంటుంది. కానీ మేధావులుగా పిలవబడుతున్న విశ్వవిద్యాలయ అధ్యాపకులు సమస్యను జటిలం చేస్తూ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే దీనిద్వారా ఎవరి ప్రయోజనాలు నేరవేరుతాయో విజ్ఞులే ఆలోచించాలి.
డేవిడ్, వంగపల్లి శ్రీనివాస్, కంతి జగన్, మర్పల్లి ఆనంద్
రీసెర్చ్ స్కాలర్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం
డేవిడ్, వంగపల్లి శ్రీనివాస్, కంతి జగన్, మర్పల్లి ఆనంద్
హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలు
మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో సుమారు 700 తెగలకుచెందిన 9 కోట్ల మందికి పైగా ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు. వీరిలో 92 శాతానికి ప్రధాన జీవనాధారం అటవీ భూములే. మన రాష్ర్టంలో 30 తెగలకు చెందిన ఆదివాసులు, మరో ఐదుతెగలకు చెందిన మైదాన ప్రాంతవాసు లు- 60 లక్షల మందికి పైగా 9 జిల్లాలోని షెడ్యూలు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాజ్యాంగ పరంగా షెడ్యూలు 5,6లలో ప్రత్యేక రక్షణలు కల్పించిన ఆది వాసుల జీవనం నేడు పెనుసంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నది. మైదాన ప్రాంత షావుకార్ల, వడ్లీవ్యాపారుల మోసాలకు, అన్యాయాలకు, దోపిడీ దౌర్జన్యాలకు, ఫారెస్టు అధికారుల వేధింపులకు గురౌతూ ఆదివాసులు మనుగడకోసం, మెరుగైన జీవనంకోసం పోరాతున్నారు.
ఈ సమస్యలన్నింటికీ తోడు వేలాది, లక్షలాది ఎకరాల అటవీ భూములను పరిశ్రమల స్థాపన పేరిట, ప్రాజెక్టుల నిర్మాణం పేరిట, గనుల తవ్వకం పేరిట బడా, బహుళజాతి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టటం ద్వారా వారిని అడవుల నుండి శాశ్వతంగా దూరం చేసేందుకు పాలకులు పూనుకున్నారు. ప్రభుత్వాలులు గత ఆరున్నర దశాబ్దాలుగా చేపడుతున్న విధానాల ద్వారా ఆదివాసులకు కల్పించామన్న రక్షణలన్నింటినీ గత రెండు దశాబ్దాలుగా ఒక్కొక్కటిగా తొలగించివేస్తున్నారు.శ్రీకాకుళ గిరిజన రైతాంగఉద్యమానంతరం అటవీ ప్రాంతంలో ఆదివాసుల భూమిహక్కును నామమాత్రంగానైనా పరిరక్షించే 1/70 చట్టాన్ని రాష్ర్టప్రభుత్వం చేసింది. ఈ చట్టాన్ని నీరుగారుస్తూ వచ్చిన ప్రభుత్వాలన్నీ, అటవీ భూములను గిరిజనేతర భూస్వాముల పరం చేయడంతో పాటు, పెద్దఎత్తున బడా పారిశ్రామిక సంస్థలకు కట్టబెడుతూ వచ్చాయి. ఆదివాసుల స్వయంపాలనలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ 1996లో ‘పంచాయితీరాజ్ గిరిజన ప్రాంతాల విస్తరణ చట్టం’ (పెసా) తెచ్చింది. 15 సంవత్సరాల తర్వాత ఇటీవల ప్రభుత్వం దాని అమలుకు నిబంధనలు రూపొందించడంలోనే- ఆదివాసుల హక్కుల అధికారాలను పంచాయితీలకు, మండల పరిషత్తులకూ కట్టబెట్టింది. తద్వారా ఆదివాసుల అటవీభూములను అన్యాక్రాంతంచేసే చర్యలను వేగవంతం చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారమే లక్షఎకరాల అటవీభూములను ఆక్రమించుకుని అనుభవిస్తు న్నారని ప్రభుత్వం నియమించిన గిర్‌గ్లానీ కమిటీ వెల్లడించేసింది. కోనేరు రంగారావు భూ కమిటీ ఆదివాసుల భూముల దురాక్రమణను ప్రధానంగా ప్రస్తావించింది. ప్రపంచీకరణ విధానాలను అమలుచేయటం ప్రారంభమైన తర్వాత అదివాసుల జీవనం ‘పెనం మీదనుండి పోయ్యిలో పడిన’ చందం అయ్యింది. విదేశీ, సామ్రాజ్యవాద బడా కంపెనీలు విచ్చలవిడిగా అడవులలోని భూగర్భ, ఉపరితల సహజ సంపదలన్నింటినీ కొల్లగొట్టు కెళ్ళేందుకు పాలకులు అన్నిరకాల అనుమతు లూ ఇచ్చివేస్తున్నారు. విద్యను అందని ద్రాక్షగా మార్చి కార్పొరేటీకరించిన పాలకులు మరో చేత్తో విద్యాహక్కు చట్టం చేసిన విధంగానే; వైద్యాన్ని ఖరీదైన అంగడిసరుకుగా మార్చిన పాలకులే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలతో భ్రమలు కల్పిస్తున్నట్లుగానే; ఆహార భద్రతచట్టం అంటూనే ఆదివాసుల హక్కులన్నింటినీ హరించి వేస్తున్న పాలకులు, ఆదివాసీహక్కుల చట్టం-2006 పేరిట మరో చట్టాన్ని ముందుకు తెచ్చారు.అటవీ ఉత్పత్తులు సేకరించి సంతల్లోనో, ఐటిడిఏ ద్వారానో అమ్ముకుంటూ, పోడు వ్యవసాయం చేసుకుంటూ సాప్రదాయక ఆదివాసుల జీవనం సాగిస్తూ వస్తున్నారు. తాము వ్యవసాయంచేస్తున్న ప్రాంతంలో భూసారం తగ్గాక మరో ప్రాంతాన్నెంచుకొని వ్యవసాయం చేయటమనే పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. అయితే వీరు సాగుచేసుకుంటున్న అటవీ భూములకు చట్టబద్ధ పట్టాలను, వాటిపై మరొకరి ఆధిపత్యాన్ని ఎరగరు. పాలకులు తీసుకువచ్చిన ఆదివాసీ హక్కుల చట్టం వీరికి అదనంగా హక్కులు కల్పించకపోగా, సాంప్రదాయకంగా అడవిపై సంక్రమించిన హక్కులను హరించివేయటానికే మరోరూపంలో పూనుకున్నది. ఒక్కో ఆదివాసీ కుటుంబానికి 5 ఎకరాల నిర్దిష్ఠ, నిర్ణీత అటవీ భూమిపై ప్రభుత్వ పట్టానిచ్చి, వారిని శాశ్వతంగా అక్కడివరకే కట్టడి చేయబూనుకోవడం ఈచట్టం అసలు ఉద్దేశ్యం. తద్వారా పాలకులు, మిగిలిన అటవీ భూములన్నింటినీ యథేచ్ఛగా దోపిడీ వర్గాలకు కట్టబెట్టేందుకు చట్టపరంగా వెసులుబాటు పొందే ఆలోచన దీని వెనుక దాగిఉంది.సమతా కేసులో సుప్రీంకోర్టు 1/70ని పునరుద్ఘాటిస్తూ ఏజన్సీ ప్రాంత భూములను గిరిజనేతరులకు ఇవ్వరాదని పేర్కొన్నది. పాలకులు ఈ తీర్పును నీరుగార్చుతూ వచ్చారు. ఏజన్సీ ప్రాంత భూములు ప్రభుత్వ ఆధ్వర్యంలో వినియోగిస్తున్నట్లుగా నాటకమాడి జిందాల్ వంటి వివిధ సంస్థలకు కట్టబెడుతూ వస్తున్నారు. ఈ విధానాలకు, చర్యలకు వ్యతిరేకంగా తీవ్రనిర్బంధాన్ని, అణచివేతలను ఎదుర్కొంటూ దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ముందుకు సాగుతున్నారు. ఒరిస్సాలోని కళింగ నగర్‌లో తమ భూములను ఆక్రమించి నిర్మిస్తున్న టాటా ఉక్కు కర్మాగార స్థాపనను నిరసించిన ఆదివాసులపై ప్రభుత్వం కాల్పులు జరిపి 12 మందిని బలిగొంది.‘పోస్కోకు ‘వేదాంత’ కోసం అటవీ భూఆక్రమణలకు వ్యతిరేకంగా ఆదివాసులు పోరాటం సాగిస్తున్నారు. మన రాష్ర్టంలోని విశాఖ జిల్లా చింతపల్లి ఏజన్సీలోని బాక్సైట్ గనుల తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కన్నెధారకొండ మైనింగ్ లీజుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 9 మండలాల పరిధిలోని 276 ఆదివాసీ గ్రామాలకు చెందిన లక్షాయాభైవేల మందిని నిర్వాసితుల్ని చేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఉభయగోదావరి, ఖమ్మం జిల్లాల్లోని ఆదివాసులు బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ‘ఆడవికి ఆడవి’, ‘భూమికి భూమి’ నినాదంతో ఉద్యమిస్తున్నారు.ఆదివాసుల జీవనాన్ని ఈ విధంగా విధ్వంసం చేయడంతో పాటు, వారి సంస్కృతిని, జీవన విధానాన్ని కూడా కనుమరుగుచేసేందుకు పాలకులు విష సాంస్కృతిక దాడిని తీవ్రం చేశారు. గత రెండు దశాబ్దాల కాలంలో సామ్రాజ్యవాద సాంస్కృతిక మాధ్యమాలను ఆదివాసుల మధ్యకు జొప్పిస్తున్నారు.ఆధునిక సౌకర్యాల పేరిట, విద్యుత్తు వెలుగుల మాటున వినోదం, విజ్ఞానం బదులుగా వస్తు వ్యామోహ సంస్కృతితో ముంచెత్తుతున్నారు. టీవిలను, సెల్‌ఫోన్లను ఆదివాసులకు కూడా అందుబాటులోకి తేవడమే వారి అభివృద్ధికి నిదర్శనంగా పాలకవర్గ మేధావులు పేర్కొంటున్నారు. ఆగస్టు 15, జనవరి 26ల సందర్భంగా మువ్వన్నెల జెండాలను ఎగురవేసి దళిత, పీడిత, తాడిత ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యంగా గొంతుచించుకొనే పాలకులు, ఆదివాసీల సంక్షేమానికి చేపడుతున్న విధానాలు, చర్యలు శూన్యమని స్పష్టమవుతున్నది. ఆదివాసుల విద్య, వైద్యం, సంక్షేమం కోసం కేటాయించిచే నిధులనుకూడా కుదించివేస్తున్నారు. రాష్ర్ట బడ్జెట్‌లో గిరిజన సబ్‌ప్లాన్‌క్రింద 6.6 శాతం నిధులను ఖర్చుచేయాలి. కానీ కేటాయించిన నిధులనైనా వెచ్చించకుండా ఇతరేతర పద్దులలోకి దారి మళ్ళిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆదివాసుల్లో 50 శాతం మందికి కనీస పౌష్ఠికాహారం అందడం లేదు. మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత, పౌష్ఠికాహార లోపం కారణంగా పురిట్లోనే ప్రాణాలు విడుస్తున్న పసిబిడ్డల సంఖ్య అత్యధికంగా ఉంది. ప్రతి వెయ్యి మంది శిశువులకు శిశు మరణాలు150 నుండి 250 వరకూ ఉంటున్నాయి. అత్యధిక ఆదివాసీ గ్రామాల్లో నేటికీ కనీస వైద్య సదుపాయం కానీ, తగిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, పరికరాలు, మందులు, వసతి సౌకర్యాలు కానీ అందుబాటులో లేవు.1999లో విశాఖ ఏజన్సీలో విషజ్వరాల బారినపడి 3 వేల మందిి పైగా జనం మరణించిన సంఘటనపై నాటి మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ డా వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషన్ ప్రభుత్వానికి అందజేసిన నివేదికను పాలకులు ఏనాడో పాతిపెట్టేశారు. ఈ సంవత్సరం జులై నాటికే విశాఖ ఏజన్సీలోనే 100 మందికి పైగా ఆదివాసులు మరేరియా, డయేరియా, కామెర్లవ్యాధులతో చనిపోయారు. గత సంవత్సరం విజయనగరం జిల్లాలోనే 4 వేలమంది ఆదివాసులు మరేరియా బారిన పడ్డారు. ఇప్పటికే ఈ ఏడాది ఆదివాసీ ప్రాంతాల్లో 280 మంది డెంగ్యూ, మలేరియా వ్యాధులకు గురయ్యారు. ఫాల్సీఫారమ్ మలేరియా మెదడుకు సోకి మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ నాటికీ అదివాసుల్లో అక్షరాస్యత 16 శాతానికి మించలేదు. సంక్షేమ హాస్టళ్ళు నరక కూపాలను తలపిస్తున్నాయి. ఇప్పు గిరిజన సంక్షేమహాస్టళ్ళను, గురుకుల పాఠశాలలను కుదించి వేస్తున్నారు. గురుకుల ఆదివాసీ పాఠశాలల్లో ఆడపిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. వీరిపై వేధింపులు, లైంగిక దాడులు, దౌర్జన్యాలు సర్వసాధారణమయ్యాయి. ఇటీవల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిరోధిస్తుందని చెబుతూ ‘గర్దాసిల్’ అనే టీకాను గురుకుల పాఠశాలలో చదువుకునే ఆదివాసీబాలికలపై ప్రభుత్వ ప్రోద్బలంతో ప్రయోగించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ అనైతిక ఔషధప్రయోగాల ఫలితంగా వీరిలో కొందరు మరణించగా అనేకమంది ఔషధ పరీక్షల దుష్ఫలితాలనెదుర్కొంటున్నారు.అదివాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కుదించి వేస్తున్నారు. ఎలాంటి హక్కులు, భద్రత లేని తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతుల్లో మాత్రమే కొన్నైనా అవకాశాలు కల్పిస్తున్నారు. గత 10 సంవత్సరాలలో 15 వేల అదివాసుల పోస్టులు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయలేదు.ఆదివాసీ యువకులకు ఈ మధ్యకాలంలో ఎమైనా ఉద్యోగాలు కల్పించారంటే అవి పోలీసు కానిస్టేబుల్ ఉద్యగాలు మాత్రమే!ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసుల పోరాటాలను ఏఎఫ్‌ఎస్‌పిఏ వంటి క్రూర చట్టాలతో పాలకులు అణయివేయ చూస్తున్నారు. అస్సాంలో ఆదివాసుల గుడిసెలను ఏనుగులతో తొక్కిస్తే, గుత్తికోయల గ్రామాలను మన రాష్ర్టంలో తగులబెట్టించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్నారు. ‘గ్రీన్‌హంట్’ పేరిట పోలీసు, సైనిక బలగాలను మోహరిస్తున్నారు. నక్సలైట్లను అణచి వేసేందుకోసం ‘సాల్వజుడుం’ పేరిట ఆదివాసుల నుండే ప్రత్యేక బలగాలను రూపొందించి, శిక్షణ, ఆయుధాలుఇచ్చి వారిని ప్రయోగిస్తున్నారు.ఆదివాసీ ప్రాంతా ల వారు దోపిడీ వ్యవస్థపై పోరాటం ఎక్కుబెట్టకుండా అనేక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. సమస్తవనరులనూ కొల్లగొట్టేనిమితం మానవరహి త అడవులుగా మార్చేందుకు పూనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ పోరాట యోధులు బిర్సాముండా మొదలు కొమురంభీం వరకూ సాగించిన సమరశీల పోరాట స్ఫూర్తిని ఆదివాసీ ఉద్యమాలు స్వంతం చేసుకోవాలి. అటవీ భూముల సేకరణకు వ్యతిరేకంగా ఆదివాసులు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సాగిస్తున్న ఉద్యమాలను ఇతర పీడిత వర్గాల సమన్వయంతో సాగించాలి
(సూర్య 22-12-2012)
శామీకోద్యమ నాయకుడు - డా||బి.ఆర్.అంబేద్కర్
''డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్'' ఈ పేరు తలిస్తేనే దళితుల గుండెల్లో ఉత్తేజం, ఉద్వేగం కలుగుతాయి. తరతరాలుగా నిచ్చనమెట్ల కుల సమాజంలో బానిసత్వం కంటే ఘోరమైన అస్పృశ్యత కారణంగా సమాజంచే చీదరించబడుతూ అనేక అవమానాలు ఎదుర్కొంన్న ఒక అస్పృశ్యుడు భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దవాడై విదేశాలలో ఉన్నత చదువులు చదివి కూడా ఈ నిచ్చెన మెట్ల కుల సమాజంలో అనేక అవమానాలను, బాధలను సహించాల్సి వచ్చింది. ఈ అమానుషమైన అస్పృశ్యతకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడాడు. అదేవిదంగా వెట్టి చాకిరీకి, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల కోసం, కనీస వేతన చట్టం కోసం, 10 గంటల పని దినాన్ని 8 గంటలకు తగ్గించేందుకు, స్త్రీ అభ్యున్నతి కోసం పోరాడాడు.
అయితే చాలా మంది అంబేద్కర్‌ను అస్పృశ్యుల నాయకుడిగా, కేవలం ఆయన అస్పృశ్యుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తిగానే చూస్తారు. కానీ ఆయన అస్పృశ్యుల అభ్యున్నతి కొరకు ఎంత పోరాటం నిర్వహించాడో అంతే పోరాటాన్ని ఈ దేశంలో అణిచి వేయబడుతున్న వర్గాలైన కార్మికులు, రైతులు, స్త్రీల పక్షాన పోరాటం నిర్వహించాడు అనే విషయం చాలా మందికి తెలియదు. తెలిసిన వ్యక్తులు వాటిని మరుగున పరిచి ఆయనను ఒక అస్పృశ్యుల నాయకుడిగానే ముద్రవేశారు. అబేద్కర్ తరతరాలుగా జమీందారుల దౌర్జన్యాలకు, దాష్టీకాలకు గురువుతున్న రైతులను, వ్యవసాయ కార్మికులను ఆయన చూసి చలించిపోయాడు. వారి హక్కుల సాధనకై ఆందోళన నిర్వహించాడు.
ఆనాటి మహారాష్ట్రలోని కొంకణ ప్రాంతంలో రైతులు, రైతు కూలీలు భూమిని దున్ని పండిస్తూంటే ఆ భూమి మీద హక్కులు మాత్రం 'ఖోటీ'లనబడే భూస్వామీ వర్గాల చేతులల్లో ఉండేవి. పెద్ద మొత్తాల్లో బీదరైత్నులుండి భూమి శిస్తులు వసూలు చేస్తూ అందులో వారు కొంత తీసుకొని, మిగతాది ప్రభుత్వినికి చెల్లించేవారు. రైతాంగం పండించే పంటలను కూడా కొంత భాగం స్వాధినం చేసుకుంటూ, రైతులను రైతూ కూలీలను బానిసలకంటే ఆధ్వానంగా చూసేవారు. ఈ 'ఖోటీ' అనబడే ఘోర దుర్భర పరిస్థితి కొన్ని దశాబ్దాల పాటు కొనసాగుతూ వచ్చింది. రైతు కూలీలను దోపిడీ చేస్తున్న యీ ఖోటీ పద్దతిని నిర్మూలించాలని అంబేద్కర్ కంకణం కట్టుకున్నాడు. 1929 ఏప్రిల్ 14న రత్నగిరి జిల్లా చిప్లాన్‌లో జరిగిన రైతాంగ మహాసభలో అంబేద్కర్ రైతాంగాపు రక్త మాంసాలను పీల్చి పిప్పి చేస్తున్న ఖోటీ పద్దతికి తక్షణమే స్వస్తి చెప్పాలని ఆ ఖోటీ పద్దతికి వ్యతిరేకంగా రైతాంగాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపాడు. రత్నగిరి, సతారా, నాసిక్, ప్రాంతాల నుండి వేలాఏది మంది రైతాంగాన్ని సమీకరించి, పెద్ద ఉరేగింపుతో బొంబాయి శాసన సభ వరకు వారిని తీసుకెళ్లి ఖోటీ నిర్మూలన గూర్చి ఆందోళన చేసారు. నాటి బ్రిటీష్ ప్రభుత్వంపై ఖోటీ నిర్మూలన కోసం, రైతాంగపు స్వేచ్ఛా జీవనం కోసం ఎంతో ఒత్తిడి తెచ్చారు. అంబేద్కర్ ఆందోళన ఫలితంగా 1937 సెప్టెంబర్ 17న ఖోటీ నిర్మూలన బిల్లును ప్రవేశపెట్టించడంలో విజయం సాధించాడు. అంబేద్కర్ చేసిన ఆందోళన ఫలితంగా 1949లో ఖోటీ నిర్మూలన బిల్లు చట్ట రూపంలో అమలులోకి వచ్చింది. దాని ఫలితంగా భూస్వాములకు కొంత నష్టపరిహారాన్ని చెల్లిస్తూ రైతులకు భూమిని దున్నుకునే స్వేచ్ఛ హక్కులను ప్రభుత్వం కల్పిచింది. ఈ విధంగా దున్నే వాడిదే భూమి అనే నినాదానికి అంబేద్కర్ ఆద్యుడయ్యాడు.
అలాగే మహార్ కులాల ప్రజలు రాత్రనకా పగలనక వెట్టిచాకిరి చేయడం, ఊళ్లో ఉన్న అగ్రకులాల పెద్దలను ఒక స్థలం నుండి మరో స్థలానికి భూజాలమీద కావడీల మీద మోసుకెళ్లడం, చచ్చిన శవాలను పారేయడం, గ్రామాన్ని శుద్ధి చేయడం వంటి అమానుష దూరాచారాలు చేయవలసి ఉండేవి. ఈ వెట్టి పనులకు గానూ చారెడు గింజలు పండించుకోవడానికి కొద్దిగా భూమిని ఉపయోగించుకోనిచ్చేవారు దానినే ''మహార్‌వతన్'' అని పిలిచేవారు. ఈ వెట్టి చేసే జనానికి చారెడు గింజలు తప్ప వాళ్ళు ఏ ఇతర హక్కులు కలిగి ఉండేవారు. కాదు. కానీ దేశ్‌పాండే, దేశ్‌ముఖ్, కులకర్ణి, పటేల్ తలాతి మొదలైన వాళ్ళు ఏ పన్నులు కట్టకుండా ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకొని నిరుపేద కూలీల చేత వెట్టి పనులు చేయించుకొనేవారు. వారిచేతనే పన్నులు కూడా కట్టించుకునేవారు. భూమి మీద వచ్చే ఫలితాలను మాత్రం ఉన్నత కూలాల వారు అనుభవించేవారు. ఇలాంటి అమానుష దురాచాలైన వెట్టి పనులను వ్యతిరేకిస్తూ ప్రజానీకాన్ని కూడగట్టి డా||బి.ఆర్. అంబేద్కర్ ఆందోళన నిర్వహించి ''మహార్‌వతన్'' నిర్మూలనకు కృషిచేశాడు. ఫలితంగా వెట్టిచాకిరీకి గురైన వ్యవసాయ కూలీలకు భూస్వాముల కబంధ హస్తాలనుండి విముక్తి లభించింది.
ఇదే సందర్భంలో 1938 డిసెంబర్‌లో శ్రామికులు సమ్మెలు చేయడానికి వ్యతిరేకంగా పారిశ్రామిక వివాదం గురించిన ఒక బిల్లు బొంబాయి విధానసభలో ప్రవేశపెట్టబడింది. ఈ బిల్లు ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితిలో శ్రామికులు హర్తాళ్ చేయడం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. ఈ బిల్లు శ్రామికుల పాలిట శాపం అని డా||బి.ఆర్ ఆంబెద్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ''స్వాతంత్య్రం కోసం సహాయం నిరాకరణ ఒక పవిత్రమైన హక్కు అయితే శ్రామికులకు హర్తాళ్ చేసే హక్కు కూడా అంతే పవిత్రమైనదని'' ఈ బిల్లు శ్రామికులకు పౌరస్వేచ్చని నేలరాసే చట్టం అవుతుందని అన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మజ్‌దూర్ యూనియన్, స్వతంత్ర మజ్‌దూర్ పార్టీలు రెండూ కలిసి ఈ చట్టానికి విరుద్దంగా హర్తాల్ చేయడానికి యుద్ధ ఢంకా మోగించారు. ఈ సందర్భంగా జరిగిన హర్తాళ్‌లో పరులేకర్, డాంగే, నింబ్‌కర్ మొదలైన నాయకులతో పాటుగా అంబేద్కర్ పాల్గోన్నాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సుమారు ఎనభై వేల మంది శ్రామికులను సంభోదిస్తూ అంబేద్కర్ ''శ్రామికుల చేతికి పరిపాలనాధికారం రానంతవరకూ వారి సమస్యలు పరిష్కరించబడవు'' అని పిలుపు నిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ''కార్మిక, కర్షకుల పాలనలోనే నా ప్రజలు యీ దేశంలో సామ్యవాదాన్ని స్థాపించగలరు. అని పెర్కోన్నాడు.
డా||బి.ఆర్ అంబేద్కర్ కార్మిక శాఖ మంత్రిగా ఉన్నకాలంలో కూడా (1942 నుండి 1946) శ్రామికుల ప్రయోజనార్థం అనేక చట్టాలు చేశాడు. టీ తోటల్లో పనిచేసే శ్రామికుల పరిస్థితి మెరుగుపడాలని ఇండియన్ టీ కంట్రోలు సంస్కరణ బిల్లుని ఆమోదింపచేశారు. మిల్లులో పనిచేసే కార్మికులకు యుద్ధకాలంలో నష్టం వాటిల్లితే కార్మికులకు నష్టపరిహారాన్ని యాజమాన్యమే చెల్లించే విధంగా బిల్లు అమలయ్యేటట్టు చూశాడు. గనుల్లో పనిచేసే గర్భవంతులైన మహిళా శ్రామికులకు ప్రసవకాలపు సెలవులున్ని. జీతం ఏర్పాటును కలిగించే బిల్లును కూడా ఆయన ఆమోదింపచేశాడు. ఫలితంగా1945 మార్చిలో గనుల్లో పనిచేసే మహిళా కార్మికుల ప్రసవకాల గైరుహాజరు సెలవు విషయంలో ముఖ్యమైన బిల్లుని పాసు చేయించారు. 1846 ఫిబ్రవరిలో ఆయన 10 గంటల పనిదినాన్ని 8 గంటల పనిదినంగా తగ్గించటానికి బిల్లును పాసు చేయించి భారతదేశపు కార్మికుల జీవితంలో విప్లవాత్మకమైన సంస్కరణను తెచ్చారు. 1943 సెప్టెంబర్ 9న ప్లీనరీ లేబర్ పరిషత్తులో పారిశ్రామీకరణ మీద ఉపన్యాసం ఇస్తూ ''పెట్టుబడిదారీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో రెండు విషయాలు తప్పకుండా ఉంటాయని, పనిచేసే వాళ్ళు బీదరికంలో ఉండవలసి వస్తుంది. పనిచేయని వారి దగ్గర లెక్కపెట్టలేనంత పెట్టుబడి పొగవుతుందని తెలిపారు. ఒక వైపు రాజకీయ అసమానత్వం రెండోవైపు ఆర్థిక వ్యత్యాసాలు. శ్రామికులకి కూడు, గూడు, గుడ్డ, ఆరోగ్యమైన జీవితం లభించనంతవరకు, విశేషించి గౌరవంగా తలెత్తుకుని నిర్భయంగా జీవితాన్ని గడపనంతవరకు స్వాతంత్య్రానికి ఏమి అర్ధం లేదు'' అన్నాడు. భారతీయ కార్మిక సమాఖ్య వారు 1943 మే నెల 11వ తేదిన బొంబాయిలో ఏర్పాడు చేసిన ఉత్సవాల్లో డా||బి.ఆర్ అంబేద్కర్ పాల్గోని మాట్లాడుతూ ''కార్మిక ఉద్యమంలో కావలసింది ప్రయోజన శూన్యమైన పైపై మెరుగులు కాదు. కార్మిక నాయకులు తమ తమ విభేదాలు మరచి, ఒక ఐక్యవేదికగా ఏర్పడి పెట్టుబడి దారి విధానాన్ని ఎదుర్కొవాలని అన్నాడు. కార్మికులు ఉద్యమించి బ్రిటన్‌లో రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని చేజిక్కించుకోగలిగారు. బ్రిటన్‌లో జరిగినట్టుగానే భారతీయ కార్మి వ్యవస్థ ఈ దేశంలో కూడా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని. అందుకు కార్మిక నాయకులంగా ఐక్యంగా సంఘటితం కావాల్సిన అవసరం ఎంతయిన ఉందని పేర్కోన్నాడు. కార్మిక వర్గం యొక్క శక్తి సామార్ధాలమీదనే ఈ దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని పేర్కొన్నాడు. ఆయన కార్మిక వర్గం యొక్క శక్తి సామార్ధాలను గుర్తించి మీరు అధికారాన్ని చేపట్టేందుకు సంఘాలు కట్టి ఐక్యంగా ఉద్యమించండి అని పిలుపునిచ్చాడు.
ఈ దేశంలో వున్న ప్రత్యేక పరిస్థితుల్లో కుల,వర్గ పోరాటాలు రెండూ జరగాలని అంబేద్కర్ అశించారు. అయితే సామాజిక సమస్య పరిష్కారమైతేనే ఆర్థిక సమస్యపై పోరాటం నిర్వహించడానికి ప్రజలు ఏకమౌతారని ఆయన తన వాదనను వినిపించాడు. కానీ వర్గపోరాటాలను విస్మరించి, కేవలం సామాజిక పోరాటాలు మాత్రమే నిర్వహించాలని ఆయన చెప్పినట్లు చాలామంది దళిత మేధావులు ఆయన సిద్ధాంతాన్ని వక్రికరిస్తునారు. ఆయన జీవించి ఉన్న కాలమంతా వర్గ-కుల సమస్యలపై ఆయన పోరాటం నిర్వహిచాడు. చాలామంది దళిత మేధావులు పోరాటాలు నిర్వహించకుండా కేవలం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటే అన్ని సమస్యలు పరిష్కారమౌవుతాయని ప్రచారం నిర్వహిస్తున్నారు. కులపరంగా విభజించబడిన భారత్ వంటి పరిస్థితుల్లో దోపిడికి గురవుతున్న ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు వర్గపోరాటాలు నిర్వహిస్తూనే సామాజిక న్యాయం కోసం కూడా పోరాటం చేయాలి. ఈ రెండింటి సమన్వయం ద్వారా దోపిడికి గురవుతున్న కులాల-వర్గాలను సంఘటితపర్చడం అవసరం. అంటే అంబేద్కరిజాన్ని, మార్కిజాన్ని సృజనాత్మకంగా అన్వయించి కుల-వర్గపోరాల్ని జతపరచి అగ్రకుల భూర్జువా, భూస్వామ్య వర్గాలపై పోరాటం నిర్వహించడం ద్వారానే ఈదేశంలో ఉన్న కుల-వర్గ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనగలము. కానీ నేడు ఆయన వారసులం అని అనుకుంటున్న వాళ్ళు ఏ ఆశయాల కోసం డా|| బి.ఆర్ అంబేద్కర్ గారు పోరాటం చేశాడో వాటిని విస్మరిస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలు కొనసాగించడం అంటే కేవలం ఆయన జయంతికి, వర్థంతికి నివాళ్ళు అర్పించడమే అనుకుంటున్నారు. ఆయన జయంతి వర్థంతిలలో తప్పా ఆయన పోరాటాలను గుర్తుకు తెచ్చుకోవడం లేదు. డా|| అంబేద్కర్ 119 జయంతి సందర్భంగానైనా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి పునరంకితమవుదాం.
అగ్రవర్ణ పాలకుల కుట్ర !
ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంధ్ర ప్రభుత్వం ఈ మధ్య రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించి విఫలం అయింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష పార్టీల ద్వంద్వ బుద్దులు దేశ ప్రజల ముందు నగ్నంగా ప్రదర్శితమయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ, శివసేన పార్టీలు బిల్లుకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నాయి. కోల్-గేట్ కుంభకోణాన్ని సాకుగా చూపి ప్రయోషన్ల బిల్లుకి బి.జె.పి మోకాలడ్డింది. ''ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడం వలన జూనియర్లు సీనియర్లవుతారు. ఇదేం జోకా? ప్రభుత్వ పాలనే జోకైపోయింది'' అని మూలాయం ఎస్సీ,ఎస్టీల జీవితాలపై పరిహాసమాడాడు. నలభై యేళ్లు కూడా నిండని తన కొడుకుని దేశంలోని అతిపెద్ద రాష్రానికి ముఖ్యమంత్రిగా రుద్దిన ములాయం అగ్రకుల సినియర్లపై, ఎస్సీ,ఎస్టీ జూనియర్లు పెత్తనం సాగిస్తారని తెగ ఆందోళన పడ్డాడు. కోడలిని పోటీలేకుండా పార్లమెంటుకి ఎంపిక చేసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థనే పెద్ద జోక్‌గా మార్చిన ములాయం, న్యాయబద్దమైన చట్టాన్ని జోకుగా చెప్పేందుకు బరితెగించాడు. ఈ బిల్లు సందర్భంగా అగ్రవర్ణాల ఓట్ల కోసం ఒక పార్టీ, హిందూ ఓట్ల కోసం మరోక పార్టీ ఈ బిల్లును అడ్దుకోవడమే కాక, తమ కుల దురహంకారాలను కూడా నిస్సిగ్గుగా బైట పెట్టుకున్నాయి.
ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన బిల్లు సమావేశాల చివరి రోజుల్లో ప్రవేశపెట్టడమే ఆ పార్టీ చిత్తశుద్దిని తెలుపుతోంది. ప్రమోషన్ల బిల్లుని ఈ సమావేశాల్లో ఆమోదం పొందడం కష్టమని మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించడమే దీనికి రుజువు. కోల్‌గేట్ కుంభక్షోణానికి సంబంధించి ప్రధాని రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌కి తలొగ్గితే ఎస్సీ,ఎస్టీ ప్రమోషన్ బిల్లుపై చర్చకు సిద్ధమని బి.జె.పి ప్రకటించడం బి.జె.పి మార్కు మోసం. ప్రమోషన్ల బిల్లుపై చర్యకు అనుమతీస్తే కోల్-గేట్ డిమాండ్‌కి వచ్చే నష్టం ఏమిటట? ప్రమోషన్ల బిల్లుపై చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ కోల్-గేట్ కుంభకోణం నుంచి బైటపడుతుందా? కేవలం ఒక న్యాయమైన బిల్లు చట్టంగా మారే అవకాశం ఇచ్చినంత మాత్రాన బి.జె.పి పోరాట పటిమ మొద్దుబారుతుందా?
భారత దేశ బ్యూరోక్రటిక్‌లో ఒక మెట్టు ఎక్కడానికి అవకాశన్నిచ్చే ముఖ్యమైన,న్యాయమైన బిల్లు, పాలక,ప్రతిపక్ష ముఠాల రాజకీయ వికృత క్రీడలో పావుగా మారిపోయింది. ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించిన లెక్కల ప్రకారమే 149 సెక్రటరీ స్థాయి అధికారుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఎస్సీ వ్యక్తి లేడు. 180 మంది అదనపు కార్యదర్శుల్లో ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీ అధికారులు మాత్రమే ఉన్నారు. ఇక జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు 477 మంది ఉంటే ఎస్సీలు 31 మంది(6.5%), ఎస్టీలు 15 మంది(3.1%) మాత్రమే ఉన్నారు. ఇక డైరెక్టర్లు 590 మంది ఉంటే వారిలో ఎస్సీలు 17 మంది (2.9%) కాగా ఎస్టీలు 7గురు (1.2%) మాత్రమే. ఉన్నతాధికారుల లెక్క మొత్తం చూస్తే 1324 మందిలో 50 మంది (3.78%)ఎస్సీలు, 28 మంది (2.11%) ఎస్టీలు మాత్రమే ఉన్నారు. ఎస్సీ ఉద్యోగులు 15%, ఎస్టీ ఉద్యోగులు 7.5% రిజర్వేషన్లు ఉండవలసిన చోట కేవలం 3.7, 2.11 శాతం మాత్రమే ఉండడాన్ని బట్టి ఉన్నత స్థానాలను అక్రమించింది ప్రతిభా సంపన్నులని చెప్పుకుంటున్నవారేనని గ్రహించవచ్చు. ఈ సమాచారం అంతా ప్రభుత్వం ఇచ్చినదే. పార్లమెంటులో చర్చజరుగుతున్న సందర్భంగా పి.ఎం.ఓ సహాయ మంత్రి పి.నారాయణ స్వామి ఈ గణాంకాలు ప్రకటించాడు.
ఇక ఉన్నత పదవుల్లోకి వచ్చే వారిలో అత్యధికులు ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ,ఎఫ్.ఎస్ క్యాడర్ వారే ఉంటారు. ఇతర్లు ప్రమోషన్ల ద్వారా ఈ క్యాడర్‌లోకి నేరుగా నియమించిచడతారు. ఐ.ఏ.ఎస్ కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్లు 2011 మార్చి నాటికి 3251 మంది ఉంటే వారిలో ఎస్సీలు 454 మంది (13.9 శాతం), ఎస్టీలు 240 మంది (7.3 శాతం), ఓబిసీలు కేవలం 420 మంది, (12.9 శాతం) మొత్తం 34.1% మంది మాత్రమే ఉన్నారు. రాజ్యాంగం నిర్దేశం ప్రకారం 15 శాతం ఎస్సీలు, 7.5 శాతం ఎస్టీలు ఈ టాప్ కేడర్లలో నియమించవలసి ఉండగా అలా జరగలేదు. అంటే ఉన్నత స్థానాల్లో రిజర్వేషన్లు సరిగ్గా అమలు జరగడం లేదని గమనించవచ్చు. అంతేకాకుండా ఇతర ఉన్నత, మధ్యస్థాయి స్థానాల్లో ఎస్సీ,ఎస్టీల కోసం రిజర్వ్ చేసిన అనేక పోస్టులు నేటికి ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభలో గత నవంబర్‌లో వి. నారాయఱ స్వామి చేసిన ప్రకటన ప్రకారం 73 ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో ఎస్సీల కోసం రిజర్వ్ చేసిన పోస్టులు 25,034 ఖాళీగా ఉన్నాయి. ఇందులో 4,518 పోస్టుల్లో ప్రమోషన్ ఇవ్వడానికి ఎస్సీ అభ్యర్ధులెవరూ అందుబాటులో లేనందున ఖాళీగా పడి ఉన్నాయి. ఇక ఎస్టీ పోస్టులు 28,178 ఖాళీగా ఉంటే 7,416 పోస్టులు ప్రమోషన్ల కోసం అభ్యర్ధులు లేనందువలస ఖాళీగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఖాళీగా పడి ఉన్న పోస్టులను నింపడానికి ప్రమోషన్ల బిల్లు అవసరం అయింది. ఈ బిల్లు వలన అగ్రవర్ణాలకు చెందిన ప్రతిభాసంపన్నులు కోల్పోతున్న ఉద్యోగాలు ఏమీ లేవు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టంగానే చెబుతున్నారు. అయినా సరే పోస్టులు ఖాళీగా అయినా ఉండొచ్చు గానీ ప్రజలకు సేవలు అందకపోయినా, పరిపాలన కుంటుబడినా పర్వాలేదు గాని ఎస్సీ,ఎస్టీలు ఉన్నత స్థానాల్లో చేరడానికి వీలే లేదు. ఇలా నియమించడం వల్ల బ్యూరోక్రసిలో ఎస్సీ,ఎస్టీలు ప్రవేశిస్తారని, దీని వల్ల ప్రతిభ దెబ్బతింటుందని అగ్రవర్ణాలు గగ్గోలు పెడుతున్నారు.
ఈ బిల్లును అడ్డుకుంటున్నారు. రిజర్వేషన్ కోటాలో కేటాయించిన పోస్టుల్లో కూడా ఎస్సీ,ఎస్టీలు నియమించకుండా నిరోధించడమంటే ఇది స్పష్టంగా కుల వివక్షతే. మాదిగలు, మాలలు, కొండ జాతులు ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లోకి చేరకుండా నిరోధించే కులవివక్ష. ఓట్ల కోసం రిజర్వేషన్లు ప్రకటిస్తూ, ప్రకటించిన రిజర్వేషన్లు కూడా భర్తీ కాకుండా ప్రయత్న పూర్వకంగా నిరోధిస్తున్న అత్యంత నగ్నమైన కుల వివక్ష. భారత దేశ పరిపాలనా వ్యవస్థకు ఒక మూల స్తంభంగా ఉన్న బ్యూరోక్రసీలో ఎస్సీ,ఎస్టీలు లేరు.
ఉన్నవారి చేతుల్లో అధికారం ఉండదు. ఒక వేళ ఉన్నా అది పైఅధికారుల అదుపాజ్ఞలకు లోబడి ఉండవలసిందేనని, తామేమి చేయలేకపోతున్నామంటూ కొందరూ ఎస్సీ,ఎస్టీ ఉన్నతాధికారులు వివిధ సందర్భాలలో తన ఆవేధనను వ్యక్తం చేశారు. అంటే దేశ పాలనా పగ్గాలన్నీ అగ్రకుల ప్రతిభా సంపన్నుల చేతుల్లోనే ఉన్నది తప్ప ప్రతిభ లేదని చెప్పబడుతున్న ఎస్సీ, ఎస్టీ చేతుల్లో లేదని స్పష్టంగా తెలుస్తోంది.
అరవైయారేళ్ల స్వతంత్ర భారతం ప్రపంచంలోని సగం దరిద్రానికి నిలయంగా మగ్గుతోందంటే, శక్తివంతమైన మందులు ఉన్నప్పటికీ బీద గిరిజన జనం ఇప్పటికీ మలేరియా,టైఫాయిడ్ జ్వరాలతో చస్తున్నారంటే, మురుగు కాలవల కోసం కూడా అతి చిన్న యూరప్ దేశాలముందు దేహీ అంటూ బిచ్చమెత్తుతున్నదంటే, మానవాభివృద్ధి సూచికలో 134వ స్థానంలో, తలసరి ఆదాయంలో 128వ స్థానంలో, విద్యా సూచికలో 147వ స్థానంలో దేశం కునారిల్లుతున్నదంటే, బల్లకింద చేయి తడిపితే తప్ప కార్యదర్శి నుంచి క్లర్కు దాకా పైలు ఒక్క అంగుళం కూడా కదలదంటే, దేశ వనరులను ప్రజలకు ఉపయోగపెట్టకుండా విదేశీ కంపెనీలకు అమ్ముకుని అవి విదిల్చే డాలర్ల మెతుకులను ఎరుకునే పాలకులు ఉన్నారంటే కారణం ఎవరు? దీనికంతటికి ఉన్నత పదవుల్లో ఉన్న అగ్రకుల ప్రతిభా సంపన్నులు కారణం కాదా?.... ఈ దేశం ఎస్సీ,ఎస్టీ,బిసి, ముస్లింల చేతుల్లో లేదు. ఈ దేశం ప్రతిభా! ప్రతిభా! అంటూ గొల పెడుతున్న అగ్రకుల సంపన్నుల చేతుల్లో ఉంది. ఎస్సీ, ఎస్టీలు,బిసిలు ప్రధానంగా శ్రమచేసి దేశాన్ని నిర్మిస్తున్న వర్గాల్లో ఉన్నారు తప్ప పెత్తందారుల్లో లేదు. ఒకరు ఇద్దరు ఆ కోవలో ఉన్నా పెత్తందారులకు సేవకులే. కనుక నేటి భారత దేశ దుస్థితికి కారణం అగ్రకుల సంపన్నులే. కులం కులం అంటూ గోక్కుంటున్న అగ్రకుల పేదలకు కూడా అగ్రకుల ప్రతిభావాదంతో ఒరిగిందేమీ లేదు.
ఈ ప్రతిభా సంపన్నుల ఆరవైయారేళ్ల ఏలుబడిలో ఈ దేశం ఊడబొడిచింది ఏమన్నా ఉందంటే అది 18 లక్షల కోట్ల విదేశీ అప్పు, 40 లక్షల కోట్ల స్వదేశీ అప్పు. ప్రపంచ బ్యాంక్ అప్పు ఇస్తే తప్ప ఈ దేశంలో సిమెంట్ రోడ్డు పడని స్థితికి దేశాన్ని దిగజార్చారు. మురుగు కాల్వలు తవ్వాలన్నా నార్వే, హాలాండ్ లాంటి అతి చిన్న దేశాల ముందు జోలె పట్టవలసిందే. 75 శాతం వ్యవసాయ భూములు నీటి పారుదల సౌకర్యం లేక వర్షపు చుక్క కోసం చాతక పక్షుల్లా ప్రతిఏడూ మోరఎత్తి చూడవలసిందే. వీరు ప్రవచించిన ఆధునిక దేవాలయాలు నేర్రెలిచ్చి కారుతోంటే పూడ్వడానికి మళ్లీ ప్రపంచబ్యాంకు పథకాలు కావాలి. ప్రపంచలో సగం దరిద్రం భారతదేశంలోనే నివాసం. దారిద్య్ర రేఖని కిందకి, ఇంకా కిందకి తొక్కేస్తే తప్ప దరిద్రాన్ని తగ్గించలేని దరిద్రం ఈ ప్రతిభా సంపన్నులది.
భారత దేశమే భారత దేశ ప్రజల చేతుల్లో లేదు. బ్రిటిష్ వాడు ఉన్నదాకా వాడొక్కడే ఈదేశానికి ప్రభువు. ఇప్పుడయితే ప్రభువులకు కొదవలేదు. అమెరికా,ఫ్రాన్స్,రష్యా,జపాన్,జర్మనీ, చీమ తలకాయంత హాలండ్, బెల్జీయంలు చివరికి నిన్నగాక మొన్న లేచి నిలబడిన దక్షిణకోరియా కూడా భారత పాలకులకు ప్రభువులే. ఈ దేశాలన్నింటా గొలుసుకట్టులా వ్యాపించి ఉన్న బహుళజాతి కంపెనీలే భారత దేశంతో పాటు అనేక పేదదేశాలకు ప్రభువులు. అరవైయారేళ్ల పాటు ఈ ప్రభువులకు సేవ చేయడంలోనే అగ్రకుల పాలకులు, ప్రతిభావాదులు గడిపారు తప్ప భారత ప్రజలకు సేవ చేయడంలో కాదు. వెలికి తీసిన వనరుల్లో,వినియోగంలోకి తెచ్చిన సంపదల్లో అత్యధిక భాగం విదేశాలకు తరలిపోయింది. వాల్‌స్ట్రీట్ బ్యాంకుల్లో, లండన్ పైనాన్స్ కంపెనీల్లో, స్విస్ బ్యాంకుల్లో, ప్యారిస్, బెర్లిన్,టోక్యో తదితర ఆధునిక నగరాల ప్రవేటు ఆకాశహర్మ్యాలలో భారత దేశ సంపద కుప్పలుగా పేరుకుపోయింది. ఆ కుప్పల నుంచి భారత దేశాంలోకి తిరిగి వస్తున్నదే విదేశీ పెట్టుబడులు. మన డబ్బుని మనం ఎఫ్.డి.ఐ, ఎఫ్.ఎఫ్.ఐల రూపంలో కొద్దిగా విదిలించడానికి దేశ సార్వభౌమాధికారిన్ని బలితీసుకుంటున్నాయి బహుళజాతి కంపెనీలు. ప్రతిభా సంపన్నులు చూడవలసింది, ఆవేశపడవలసింది ఈ దోపిడిని చూసి గానీ, ఆరకొర వేతన బతుకుల కోసం అతృత పడుతున్న ఎస్సీ,ఎస్టీ,బిసిలను చూసి కాదు. చేతనైతే తమ ప్రతిభను సరిహద్దు దాటిపోతున్న సంపదను అడ్డుకోవడంలో ప్రతిభావాదులు చూపాలి. భారత ప్రజల చేజారిపోయిన భారత సార్వభౌమాధికారాన్ని తిరిగి ప్రజల చేతుల్లోకి చేర్చడంలో చూపాలి. ఆదివాసుల కాళ్ళకింద ఉన్న ఖనిజవనరులను కొల్లగొట్టడం కోసం సల్వాజుడుంలనూ, రణవీర్ సేనలను సృష్టిస్తున్న పాలకుల కుట్రలను నిలవరించడంలో చూపాలి. ప్రపంచ సామాజిక పటంపై దేశాన్ని అట్టడుగు స్థాయిలో నిలిపిన కుల వ్యవస్థను రూపుమాపి సమానత్వం నెలకొల్పడం కోసం తమ ప్రతిభను సానపెట్టాలి. నిస్సహాయ ఆదివాసీ ప్రజలపైనా, ఈనాన్య ప్రజలపైనా లక్షలాది సైనికులతో యుద్ధం చేస్తున్న పాలకుల దురన్యాయాలను ఎదుర్కొవడంలో ప్రతిభను వినియోగించాలి. కూలీ డబ్బులతో, ఖాళీ కడుపులతో, దీక్షలు అవసరం లేని నిరసనలతో, కులాల ఉక్కు సంకేళ్లతో బతుకులీడుస్తున్న బీదాబిక్కి జనానికి దక్కుతున్న కాసిన్ని మెతుకులలో భాగం కోసం పోటీపడే ప్రతిభ అసలు ప్రతిభే కాదని ప్రతిభావాదులు గుర్తించాలి.
నెత్తురోడిన లక్షింపేట
లక్షింపేట దళితుడు పిడికెడు ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలుచున్నందుకు అగ్రకుల నరమేధానికి గురికావల్సి వచ్చింది. ఈ దేశంలోని దళితులకి ఇలాంటి దాడులు కొత్తేమికాదు. అంటరానితనం అవమానాలు,అణిచివేతలు ఇక్కడి దళితులకి నిత్య అనుభవాలే. కారంచేడు,చుండూరు,తిమ్మసముద్రం,వేంపేంటలలో దళితులపై జరిగిన దాడులను మరువకముందే లక్షింపేట మాలపల్లె అగ్రకుల నరమేధానికి బలైంది. దళితులపై జరుగుతున్న దాడుల్లో ప్రాంతాలు వేరుకావచ్చు. పాత్రదారులు వేరుకావచ్చు. రెండ్లు,కమ్మల స్థానంలో కొత్తగా తూర్పు కాపులు రావొచ్చు కాని దళితులే లక్ష్యంగా సాగుతున్న అగ్రకుల దాడుల్లో ఒకటే తీరు కనిపిస్తుంది. ఆర్థికంగా పైకెదుగుతూ, ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలుచున్న ప్రతిసారి ఆయా సామాజిక వర్గాలు, తమ ఆధిపత్యాన్ని, కుల దురంహకారాన్ని ప్రదర్శించడం కోసం నిరుపేదలైన నిరాయుధులైన దళితులపై దాడులు చేయడం పరిపాటయ్యింది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేటలో జూన్ 12న జరిగిన సంఘటనని రెండు సామాజిక వర్గాల మధ్య పాత కక్షల వల్ల అనుకోకుండా జరిగిన ఘటనగా పాలక వర్గాలకు వత్తాసు పలుకుతున్న మీడియా ప్రచారం చేస్తుంది. కానీ ఈ నరమేధానికి ఒక ఆర్థిక,సామాజిక నేపథ్యముంది. ముఖ్యంగా ఈ సమస్య భూమి చుట్టూ అల్లుకొని ఉంది. ఉత్తర కోస్తాలో సంఖ్యారీత్యా బలంగా వున్న తూర్పున కాపులు గత పది,పదిహేను ఏండ్లుగా భూమి మీద ఉన్న పట్టుతో రాజకీయంగా అధికారానికి ఎగబాకారు. తూర్పు కాపులు పేరుకి మాత్రమే బి.సిలుగా చెలామణి అవుతున్నా ఆర్థికంగా, రాజకీయంగా బలిసిన కులంగా ఎదిగింది. మరోవైపు సంఖ్యారీత్యా అంతే బలంగా వున్న దళితులు భూమి, అధికారం వంటివి లేకపోయిన ఆత్మగౌరవంతో తలెత్తుకొనే స్థాయిలో ఉన్నారు. రాజ్యంగ పరంగా తమకున్న హక్కులను పోరాటం ద్వారా పరిరక్షించుకోవాలన్న స్పృహ కలిగివున్నారు. దీంట్లో భాగంగానే 2006 ఎన్నికల్లో సర్పంచు సీటు ఎస్సీ మహిళకు రిజర్వు అయితే మాలపల్లె అంతా ఐక్యమత్యంతో చిత్తిరి సింహాలమ్మను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. మాలపల్లె ఐక్యమత్యాన్ని, ఆత్మగౌరవాన్ని, జీర్ణించుకోలేని తూర్పుకాపులు కుల దురంహకారంతో బాంబులతో,బరిసెలతో, బండరాళ్లతో,గొడ్డల్లతో దళితులపై పాశవికంగా దాడి చేసి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నరమేధానికి ఒడిగట్టారు. మూకుమ్మడిగా చేసిన ఈ డాడికి మాలపల్లె విలవిల లాడింది.
దాడికి అసలు కారణం
వంగర,రేగడి అముదాల వలస, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు మండలాల్లో 104 గ్రామాల్లోని 24,700 ఎకరాల సాగుభూమికి నీరందించే ఉద్దేశ్యంతో సువర్ణముఖి,వేగావతి నది సంగమ ప్రాంతంలో మడ్డువలస ప్రాజెక్టును 1976వ సంవత్సరంలో ప్రారంభించారు.ఈ ప్రాజెక్టు కింద 7 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వం ముంపునకు గురవుతున్న భూములతోపాటు, నివాసిత గ్రామాలకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చట్టం కింద భూమిని తీసుకున్నారు. భూములు కోల్పోయిన తూర్పుకాపులకు నష్టపరిహారంగా ఎకరానికి రెండున్నర లక్షలు, గృహాలకు రూ. 50 వేల నుండి రెండు లక్షల వరకు చెల్లించారు. భూములు,ఇళ్లు కోల్పోయిన తూర్పు కాపులకు, మాలలకు ముత్యాలమ్మ ట్యాంకు సమీపంలో (ప్రస్తుతం మాలలు నివాసం ఉంటున్న ప్రాంతం) పునరావాసం కల్పించారు. పునరావాస ప్రాంతానికి మాలలు 2000 సంవత్సరంలో వచ్చి స్థిరపడ్డారు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు తూర్పు కాపులు అక్కడి వచ్చి స్థిరపడ్డారు. పునరావసం క్రింద తూర్పు కాపులకు 40 ఉద్యోగాలు ప్రాజెక్టులో ఇచ్చారు కానీ ఒక్క దళితుడికి ఉద్మోగం ఇవ్వలేదు. దళితులకు భూమిలేకపోవడంతో పూరి ఇళ్లు అయినందుకు వారికి రూ.8 వేల నుండి 10 వేల వరకు ఇచ్చారు. కానీ ఈ 8 వేలల్లో కూడా గ్రామంలో గుడి కడతామంటూ గ్రామ కాపులు ప్రతి దళిత కుటుంబం నుంచి 3 వేల రూపాయలను వసూలు చేశారు. అయితే మడ్డువలస ప్రాజెక్టు కోసం సేకరించిన మొత్తం భూమిలో సుమారు 250 ఎకరాల భూమి ముంపునకు గురికాకుండా మిగిలిపోయింది. ఈ భూమి ఖాళీగా ఉండటం వల్ల లక్షింపేట కాపులు 190 ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. మిగిలిన 60 ఎకరాలు అలాగే ఉన్నది. అందులో 40 ఎకరాలు పక్క గ్రామమైన దేవకవాడ వాళ్లది. వాళ్లు భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసి నష్టపరిహారం తీసుకొని పక్కగ్రామానికి వెళ్లి స్థిరపడిపోయారు. తర్వాత ఆ గ్రామం వైపు ఎప్పుడు తిరిగిచూడలేదు. ఇక మిగిలిన 20 ఎకరాలు లక్షింపేట కాపులవే కానీ ఆ కాపు కుటుంబాలు కూడా ఇప్పుడు అక్కడ లేవు. వారు ఎక్కడికో వెళ్లి స్థిరపడిపోయారు. ఆ 60 ఎకరాల భూమి ఖాళీగా ఉండటంతో గత 12 ఏండ్లుగా లక్షింపేట మాలలు ఒక్కొక్కరు 45 సెంట్ల చొప్పున దీనిని సాగుచేయటం మొదలుపెట్టారు. భూమిని సాగుచేసుకుంటున్నందుకు భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఈ మొత్తం 250 ఎకరాల మీద లక్షింపేట,దేవకవాడ కాపులకు ఏ సంబంధమూ లేదు. ఎందుకంటే వారు నష్టపరిహారం తీసుకున్నారు కాబట్టి. కాపులు సాగుచేసుకుంటున్న 190 ఎకరాలు, మాలలు సాగుచేసుకుంటున్న 60 ఎకరాలు మొత్తం 250 ఎకరాలు కలిసే ఉంది. లక్షింపేటలో తమ ఇళ్ల పక్కనే మాలల ఇళ్లు ఉండటం, తమతో పాటు మాలలు భూమిని సాగుచేసుకోవడాన్ని, వాళ్లు ఆర్థికంగా ఎదగడాన్ని సహించలేని కాపులు ఏవిధంగానైనా మాలలను ఆ గ్రామం నుంచి తరిమివేయాలని కంకణం కట్టుకున్నారు.
2010 నుంచి మాలలపై జరిగిన దాడులు:
గత రెండేళ్లుగా మాలన్ని ఈ భూమి సాగుచేసుకోవద్దని బెదిరించడం, అడపదడప దాడులకు పాల్పడడం చేస్తున్నారు. 2010లో మాలవాడకు చెందిన దడాసి లత, కలమటి చిన్నమ్మడు ప్రాజెక్టు మిగులు భూమిలో పుల్లలు ఏరుకుంటుండగా తూర్పుకాపులు కర్రలతో దాడిచేసి కులంపేరుతో దూషిస్తూ వారిని కొట్టారు. మాలలు ఈ దాడికి పాల్పడిన తూర్పు కాపులపై వంగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికి కేసు రిజిష్టర్ చేయలేదు.
గత సంవత్సరం ఆగస్టు 22వ తేదీన నివర్తి రాముడమ్మ పిడకల కోసం ప్రాజెక్టు భూముల్లో పేడ పోగుచేసుకుంటుండగా తూర్పు కాపులు ఆమెను కులం పేరుతో అసభ్యంగా తిడుతూ కర్రలతో దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు కేసు నమోదు చేయలేదు. తీవ్రంగా గాయపడిన రాముడమ్మ ఆ తర్వాత మరణించడం జరిగింది.
తూర్పు కాపులకు చెందిన పొలంలో పశువులు పడ్డాయనే నెపంతో చిత్తిరి శ్రీదేవిని కులం పేరుతో దుర్భాషలాడి కర్రలతో దాడిచేశారు. అప్పుడు కొత్తగా వచ్చిన సబ్‌డివిజన్ పోలీసు అధికారికి ఈ దాడి విషయం ఫిర్యాదు చేయగా ఎస్సీ,ఎస్టీ యాక్ట్ 1989 కింద కేసు రిజిస్టర్ చేశారు. ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా మూడోరోజు బెయిలు మీద వచ్చి మా మీదనే కేసులు పెడతారా అని మాలపల్లెలో మూడు నాలుగు శాల్తీలు లెస్తేకానీ, భూములు వదిలి, ఊరు వదిలి వెళ్లరని బెదిరించారు.
పథకం ప్రకారం దాడి:
కాపులతో సమానంగా ఆర్థికంగా,రాజకీయంగా ఎదుగుతున్న మాలలను సహించని కాపులు వారిపై పథకం ప్రకారం దాడిచేయడానికి కాచుకొని కూర్చున్నారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు వారికి ఆ అవకాశాన్ని తెచ్చి పెట్టాయి. గ్రామంలో అడపదడప కాపులకు, మాలలకు భూమి కోసం గొడవలు జరుగుతూ ఉంటే 6 నెలల క్రితం పోలీసులు పికెటింగ్ ఏర్పాడు చేశారు. కానీ జూన్ 12న నరసన్నపేట ఉప ఎన్నికల దృష్ట్యా లక్షింపేట గ్రామంలో జూన్ 11 ఉదయం ఉన్న పోలీసు పికెట్‌ను ఎత్తివేశారు. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కాపులు 11వ తేదీ రాత్రి చుట్టుపక్కల గ్రామాల తూర్పు కాపులను మూడు ఆటోలలో, ఒక ట్రాక్టర్‌లో లక్షింపేటకు తరలించారు. బాంబులు, కత్తులు, బడిసెలు, శూలాలు, గొడ్డలు, కారం తదితర మరణాయుధాలను సమకూర్చుకున్నారు. పక్కా పథకం ప్రకారం 12వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో సద్ది అన్నం తిని పనికి వెళ్లడానికి సిద్ధమౌతున్న మాలలపై పాశవికంగా దాడికి పాల్పడ్డారు. మాలపల్లెపై ఈ మూకుమ్మడి దాడిని గమనించిన ఊరి సర్పంచు చిత్తిరి సింహాలమ్మ భర్త గంగులు వంగర పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. కానీ లక్షింపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగర పోలీసులు సరైన సమయంలో స్పందిచకపోవడంతో దీనికి అవకాశంగా తీసుకున్న కాపులు పథకం ప్రకారం గ్రూపులుగా విడిపోయి మాలపల్లెను నాలుగు వైపుల నుంచి చుట్టు ముట్టి దాడికి పాల్పడ్డారు. మాలలను భయభ్రాంతులను చేసేందుకు మొదట బాంబులు వేయడంతో మాలలు భయపడి ఇంట్లోకి పారిపోయారు, పారిపోతున్న మాలలపై కాపులు వెంటాడి, దాడి చేసి మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో కాపులకు తోడుగా వారి స్త్రీలు,పిల్లలు కారం పొడి ,రాళ్లను అందిచి పాశవికానందం పొందారు. దాదాపు నాలుగు గంటలపాటు తూర్పు కాపులు బరిసెలతో, బండరాళ్లతో,గొడ్డల్లతో దళితులపై పాశవికంగా దాడి చేశారు. ఈ మారణకాండలో నివర్తి సంగమేశు, నివర్తి వెంకట్రావు, బురాడ సుందర్రావు, చిత్తిరి అప్పడు అక్కడిక్కడే మరణించారు. దాడిలో తీవ్రంగా గాయపడి రెండు కళ్లుపోయి, మూత్రపిండాలు ఛిద్రమై విశాఖలోని కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత బొద్దూరి పాపయ్య మరణించాడు. ఈ హంతక డాడిలో 20 మంది తీవ్రంగా గాయపడి కాళ్లూ, చేతూలూ విరిగిపోయి, తలలు పగిలి, పిల్లలు, వృద్దులు, స్త్రీలు, పురుషులు జీవశ్చావాల్లా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాడితో గాయపడి మరణించిన నివర్తి సంగమేష్ 43 కత్తిపోట్లకు గురయ్యాడని డాక్టర్ రిపోర్టులో రాశాడంటే దుండగులు పథకం ప్రకారం ఎంత నరమేధం సాగించారో అర్థంచేసుకోవచ్చు. నాలుగు గంటలపాటు కాపు హంతకముటా చేసిన పాశవిక దాడిలో లక్షింపేట దళితవాడ రక్తపు మడుగుతో నిండిపోయింది. తమపై కాపులు దాడిచేస్తున్నారని సర్పంచు భర్త చిత్తిరి గంగులు ఉదయం 7 గంటలకు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు ఈ నరమేధం ముగిసాకా మధ్యాహనం 12:30 గంటలకు ఆ గ్రామానికి తాపీగా చేరుకున్నారు.
ఒక మాల కులానికి చెంది కొండ్రు మురళి ఎమ్మెల్యే మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తన కులానికే చెందిన ప్రజలు తూర్పుకాపుల పాశవిక నరమేధానికి గురయ్యారు. దళితుల ఓట్లతో గెలిచి మంత్రిగా కొనసాగుతున్న కొండ్రు మురళి వారికి అండగా ఉండాల్సిందిపోయి అధికార పార్టీకి దళారిగా వ్యవహరిస్తూ కాపుకుల దురంకారులకే కొమ్ముకాస్తూ తన పదవిని కాపాడుకోవటానికే పరిమితమయ్యాడు తప్పా లక్షింపేట దళితుల సమస్యను చొరవతీసుకొని పరిష్కరించేందుకు, వారికి అండగా నిలిచేందుకు ప్రయత్నించలేదు.
దళితులపై జరుగుతున్న సాగుతున్న ఈ దాడులకు మూలం భూమి సమస్యతో ముడిపడి ఉంది. దళితులంతా మెజారిటీగా గ్రామీణ ప్రాంతాల్లో భూమిపై ఆధారపడి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ భూమిపై హక్కు, అధికారం కలిగివున్నవారంతా ప్రధానంగా అగ్రకుల పెత్తందారీ భూస్వామ్య వర్గంగాను, అధికార రాజకీయ పలుకుబడి గలవారుగానూ ఉన్నారు. కనుక గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య, అగ్రకుల పెత్తందార్ల అధికారానికి, అహంకారానికి మూలమైన, ప్రధాన ఉత్పత్తి సాధనమైన భూమిపై హక్కు సాధించకుండా దళిత సమస్యలకు మౌళిక పరిష్కారం లేదు. ప్రభుత్వాలు ప్రవచించే 'భూసంస్కరణలు' వంటివేవీ భూసంబంధాల్లో మార్పులు తీసుకురావని, తీసుకురాలేవని రుజువైన వాస్తవం. దున్నేవానికి భూమి నినాధంగా వ్యవసాయక విప్లవం ఇరుసుగా దళితులపై జరిగే దాడులకు, అంటరానితరాన్ని సమూలంగా పరిష్కరించగలుగుతుంది. దళితులపై దాడులకు , అణచివేతకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలు, తక్షణ డిమాండ్ల సాధనతో పాటు ఈ దాడులకు మూలమైన వ్యవస్థపై ఎక్కుపెట్టే దిశగా సాగాలి.
(ఈ వ్యాసం రచయిత లక్షింపేట బాధితులను సందర్శించాక రాయబడింది.)
ప్రపంచీకరణ యుగంలో దళిత యువత భవిష్యత్తు ఏమిటి?
నూతన ఆర్థిక విధానాు ప్రభుత్వ రంగాన్ని రోజు, రోజుకి కుదించి వేస్తున్నాయి. ఉన్న ఉపాధి హరించుకు పోతోంది. పాకు చెబుతున్న ప్రయివేటు, విదేశీ పెట్టుబడులో పెరుగుద కనిపిస్తోంది. కానీ ఉపాధికి మాత్రం పెరగడం లేదు. ప్రయివేటు పెట్టుబడి వీలైనన్ని తక్కువ ఉద్యోగాను, తక్కువ వేతనాను ఇచ్చే ఉద్యోగాును మత్రమే సృష్టిస్తోంది. దీని వన యువత విపరీతంగా నష్టపోతోంది. ఈ ప్రక్రియలో మొదట బవుతున్నది దళిత యువతే. తరతరా నుంచి అణగదొక్కబడి విద్యా, ఉద్యోగాకు దూరంగా ఉంచబడిన దళితు రాజ్యాంగం కల్పించిన రాయితీ కారణంగా వాటిలోకి ప్రవేశించగలిగారు. ప్రస్తుతం ప్రభుత్వాు తెస్తున్న సంస్కరణు రాజ్యాంగం దళితుకు కల్పించిన భద్రతను సవాు చేస్తున్నాయి.
1990లో ప్రకటించిన పారిశ్రామిక విధానంలో కేవం ఆరు నుంచి ఎనిమిది రకా పరిశ్రమను మాత్రమే ప్రభుత్వ ఆజమాయిషీ కింద ఉంచి మిగిలిన వాటిలోకి ప్రయివేట్ సంస్థను అనుమతించింది. ప్రస్తుతం వాటిని కూడా ప్రయివేట్ వారికే అప్పగించి తను తప్పుకునే ప్రయత్నాలో ఉంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాు పొందుతున్న దళితు ప్రస్తుతం ఉద్యోగాకు దూరమవుతున్నారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాలో వాటాను పొందుతున్న వారు నేడు ప్రభుత్యోగాపై ఆశు వదుకొని చేతి వృత్తు చేసుకుంటున్నారు. అనేక మంది దళిత గ్రాడ్యుయేట్లు నగరాకు వస వచ్చి పను వెతుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దళిత యువత భవిష్యత్తు ఆందోళనలో పడుతోంది. ప్రస్తుతం పాకు సంస్కరణతో అభివృద్ధిని నిలిపివేసి స్వాతంత్య్రనికి పూర్వపు రోజును ప్రసాదించబోతున్నారా అనే అనుమానం కుగుతోంది.
దళితు ఉపాధి ఎలా ఉంది:
దళితు ఉపాధి ఎలా ఉంది:
2001 జనాభా లెక్క ప్రకారం రాష్ట్రంలో దాదాపు కోటి యాబై క్ష మంది దళితున్నారు. వారిలో 10 క్ష మంది దారిద్య్ర రేఖకు ఎగువన ఉండగా, మిగిలిన కోటీ నభై క్ష మంది రెక్క కష్టంపై ఆధారపడి బతుకుతున్నారు. దళితులో అక్షరాస్యత దాదాపు 40 శాతం ఉన్నా కేవం 10 నుండి 15 శాతం మాత్రమే ఉద్యోగాకు అర్హత సంపాదించగుగుతున్నారు. రిజర్వేషన్ల వ్ల విద్య, ఉద్యోగాలో చోటు సంపాదించుకున్న ఈ సెక్షనే ప్రస్తుతం దళితులో కొంత మెరుగైన జీవితం గడుపుతున్నది. మిగిలిన వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికుగాను, దిగువ స్థాయి కార్మికుగాను జీవితాను వెళ్ళదీస్తున్నారు. ప్రస్తుతం జనాభాలో నాుగు శాతం ఉన్న ప్రభుత్వోద్యోగాు ప్రభుత్వాు అనుసరిస్తున్న విధానా వన రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. దీని వస ఙప్రపంచీకరణ యుగంలో యువత భవిష్యత్తు ఏమిటి?యువకుకు ఉపాధి మార్గాు మూసుకుపోతున్నాయి.
దళితు ప్రత్యేకించి కోల్పోతున్నదేమిటి?
ప్రయివేటీకరణ వన ప్రత్యేకంగా, అతి ఎక్కువగా నష్టపోతున్నది దళిత యువతే. రాష్ట్రంలో రిజిస్టేషన్ చేయించుకున్న దళిత నిరుద్యోగు 9.5 క్ష మంది ఉన్నారు. మిగిలిన వర్గాలో ఇంత కంటే ఎక్కువ మందే ఉన్నా ఈ పరిస్థితి లేదు. వారు ప్రభుత్వోద్యోగాపై ఎక్కువ ఆశ పెట్టుకోకుండా వేరే ఉద్యోగాను వ్యాపారాను చూసుకుంటున్నారు. ప్రభుత్వోద్యోగాలో వారి ప్రతిభకు తగ్గ రీతిలో ప్రాతినిధ్యం లేదన్న అసంతృప్తి ఉంది. వారు తమకున్న పరిచయా ద్వారాను, కొంత కష్టపడి ఇతర రంగాలో రాణించగుగుతున్నారు. ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగితను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ప్రయివేటు సంస్థలో దళితు ప్రధానంగా ఆన్‌స్కిల్డ్ కార్మికుగా ఉండగా దళితేతయి మేనేజ్‌మెంట్, క్లరికల్ స్థాయిలో ఉంటున్నారు. డిగ్రీు చదివిన తరువాత దళితుకు ప్రభుత్యోద్యోగాు రాకపోతే ఆటో డ్రైవర్లుగానో రాడ్ బెండిరగ్ వర్కర్లుగానో, మరే ఇతర సాధారణ కార్మీకుగా స్థిరపడుతున్నారు. మరలా ప్రభుత్యోగాు వస్తేనే వీరి జీవితాకు మెగు. లేదంటే క్రింది స్థాయి వృత్తులో స్థిరపడసి వస్తోంది. వీరికి వస్తే ప్రభుత్యోగాు లేదంటే మరే ఉద్యోగాు రావడం లేదు. పరిశ్రము అధికంగా ప్రయివేటు రంగంలో వస్తున్నాయి. వీటిలో రిజర్వేషన్లకు స్థానం లేదు. దీనిలో దళితుకు ఇక్కడ ప్రవేశం దుస్సాధ్యమవుతోంది. స్వదేశీ పరిశ్రము కానీ, వీదేశీ కంపెనీ అనుబంధ సంస్థు, ఏజెన్సీు అన్నీ అగ్రవర్ణా చేతుల్లోనే మెస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న, కొత్తగా ఏర్పడుతున్న పరిశ్రము దాదాపుగా పూర్తిగా దళితేతర వర్గా చేతుల్లోనే ఉన్నాయి. ప్రయివేట్ సంస్ధల్లో ఉద్యోగాకు ప్రతిభతోబాటు బంధుత్వాు, పరిచయాలే అర్హతుగా పనిచేస్తున్నాయి. చదువు పూర్తి చేసుకున్న అగ్ర వర్ణా యువత వాటితో ఉద్యోగాు దక్కించుకోగుగుతున్నారు. అగ్రవర్ణా కోటల్లోకి దళితు ప్రవేశం ఎలా సాధ్యం? అంతేకాక వారిలో ఇన్నాళ్ళుగా ఉన్న రిజర్వేషన్ వ్యతిరేకత కూడా ఇక్కడ బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. దళితు చేతులో ఉపాధిని ఇవ్వగలిగే పరిశ్రము గానీ, భూఖండాు గానీ లేవు. దీని వన వారికి ఉద్యోగా భ్యత ఇబ్బందిగా మారింది. రాజ్యాంగం దళితుకు కల్పించిన రక్షణు ప్రపంచీకరణ గాలివానకు కుప్పకూుతున్న తీరిది. అగ్రవర్ణాకు ఉన్న సంబంధాు, పరిచయాు వారిని కొంత మేరకు రక్షిస్తుండగా, దళిత యువకుకు మాత్రం దుర్భర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న టీచర్, పోలీసు ఉద్యోగాు కూడా రాకపోతే వీరు మరిన్ని ఇబ్బందు ఎదుర్కొనేవాటరు. రానున్న కాంలో ఈ పరిస్థితిని కూడా చూడవచ్చు.
ప్రయివేటీకరణ వన ప్రత్యేకంగా, అతి ఎక్కువగా నష్టపోతున్నది దళిత యువతే. రాష్ట్రంలో రిజిస్టేషన్ చేయించుకున్న దళిత నిరుద్యోగు 9.5 క్ష మంది ఉన్నారు. మిగిలిన వర్గాలో ఇంత కంటే ఎక్కువ మందే ఉన్నా ఈ పరిస్థితి లేదు. వారు ప్రభుత్వోద్యోగాపై ఎక్కువ ఆశ పెట్టుకోకుండా వేరే ఉద్యోగాను వ్యాపారాను చూసుకుంటున్నారు. ప్రభుత్వోద్యోగాలో వారి ప్రతిభకు తగ్గ రీతిలో ప్రాతినిధ్యం లేదన్న అసంతృప్తి ఉంది. వారు తమకున్న పరిచయా ద్వారాను, కొంత కష్టపడి ఇతర రంగాలో రాణించగుగుతున్నారు. ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగితను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ప్రయివేటు సంస్థలో దళితు ప్రధానంగా ఆన్‌స్కిల్డ్ కార్మికుగా ఉండగా దళితేతయి మేనేజ్‌మెంట్, క్లరికల్ స్థాయిలో ఉంటున్నారు. డిగ్రీు చదివిన తరువాత దళితుకు ప్రభుత్యోద్యోగాు రాకపోతే ఆటో డ్రైవర్లుగానో రాడ్ బెండిరగ్ వర్కర్లుగానో, మరే ఇతర సాధారణ కార్మీకుగా స్థిరపడుతున్నారు. మరలా ప్రభుత్యోగాు వస్తేనే వీరి జీవితాకు మెగు. లేదంటే క్రింది స్థాయి వృత్తులో స్థిరపడసి వస్తోంది. వీరికి వస్తే ప్రభుత్యోగాు లేదంటే మరే ఉద్యోగాు రావడం లేదు. పరిశ్రము అధికంగా ప్రయివేటు రంగంలో వస్తున్నాయి. వీటిలో రిజర్వేషన్లకు స్థానం లేదు. దీనిలో దళితుకు ఇక్కడ ప్రవేశం దుస్సాధ్యమవుతోంది. స్వదేశీ పరిశ్రము కానీ, వీదేశీ కంపెనీ అనుబంధ సంస్థు, ఏజెన్సీు అన్నీ అగ్రవర్ణా చేతుల్లోనే మెస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న, కొత్తగా ఏర్పడుతున్న పరిశ్రము దాదాపుగా పూర్తిగా దళితేతర వర్గా చేతుల్లోనే ఉన్నాయి. ప్రయివేట్ సంస్ధల్లో ఉద్యోగాకు ప్రతిభతోబాటు బంధుత్వాు, పరిచయాలే అర్హతుగా పనిచేస్తున్నాయి. చదువు పూర్తి చేసుకున్న అగ్ర వర్ణా యువత వాటితో ఉద్యోగాు దక్కించుకోగుగుతున్నారు. అగ్రవర్ణా కోటల్లోకి దళితు ప్రవేశం ఎలా సాధ్యం? అంతేకాక వారిలో ఇన్నాళ్ళుగా ఉన్న రిజర్వేషన్ వ్యతిరేకత కూడా ఇక్కడ బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. దళితు చేతులో ఉపాధిని ఇవ్వగలిగే పరిశ్రము గానీ, భూఖండాు గానీ లేవు. దీని వన వారికి ఉద్యోగా భ్యత ఇబ్బందిగా మారింది. రాజ్యాంగం దళితుకు కల్పించిన రక్షణు ప్రపంచీకరణ గాలివానకు కుప్పకూుతున్న తీరిది. అగ్రవర్ణాకు ఉన్న సంబంధాు, పరిచయాు వారిని కొంత మేరకు రక్షిస్తుండగా, దళిత యువకుకు మాత్రం దుర్భర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న టీచర్, పోలీసు ఉద్యోగాు కూడా రాకపోతే వీరు మరిన్ని ఇబ్బందు ఎదుర్కొనేవాటరు. రానున్న కాంలో ఈ పరిస్థితిని కూడా చూడవచ్చు.
దళితుపై ప్రపంచీకరణ ప్రభావం
ప్రపంచీకరణ ఫలితా గురించి తొసుకుంటున్న దళితు ఈ ప్రపంచీకరణే తమ పరిస్థితికి కారణమంటున్నారు. ప్రపంచీకరణ వ్ల వేగంగా ప్రభుత్వ రంగం హరించుకపోతోందన్న ఆందోళన వీరిలో కనిపిస్తోంది. ఉత్పత్తిలో ప్రభుత్వ పాత్ర తగ్గి మార్కెట్ శక్తు పాత్ర పెరగడం వన దళిత యువకుకు అవకాశాు రోజు రోజుకూ కుచించుకు పోతున్నాయి. దీనీ వ్ల ప్రపంచీకరణపై దళితు నిరసన పెరుగుతోంది. ఇదే సమయంలో ప్రపంచీకరణ వ్ల దళితుకు మేు జరుగబోతుందని, అమెరికా, నుంచి వచ్చిన దొరు అక్కడి న్లవారిని చూసినట్లే దళితును ఉద్ధరిస్తారని, కనుక బహుళజాతి సంస్థను ఆహ్వానించాని చంద్రభాను ప్రసాద్ వంటి దళిత మేధావు చెబుతున్నారు. కానీ ఆమెరికన్లు తమ దేశ:లో చేసుకున్న చట్లాలే విదేశీయు చేస్తే ఊరుకోరన్న విషయం ఆయనకు తెలియనట్లుంది. ఆమెరికాలో ఉన్న పెటేంట్ చట్టం, గుత్తాధిపత్య వ్యతిరేక చట్టం వంటివి విదేశాు చేస్తే అమెరికా సహించదు. తన పౌరును ప్రేమగా చూసుకునే అమెరాకి పాకు వేరే దేశా పట్ట వివక్ష భావంతోనే ఉంటున్నారన్నది స్పష్టం. వారు ఇక్కడ వ్యాపారం కోసం బం, బగం ఉన్న భూస్వాము, జాతీయ పెట్టుబడిదారు వైపై ఉంటారన్నది. తిరుగులేని సత్యం. అంతే కాకుండా అమెరికాలో న్ల జాతి ప్రజు సుధీర్ఘ పోరాటం నడిపిన తర్వాత వారికి విముక్తి భించింది. బహుళ జాతి సంస్థ దయా దాక్షిణ్యా వ్ల కాదు. అయినా ఇప్పటికీ అక్కడ న్లజాతి వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. న్లవారు ఎక్కువగా క్రిందిస్థాయి ఉద్యోగాలోనూ, సైన్యంలోనూ పనిచేస్తున్నారు. సంపద ప్రధానంగా త్లెజాతి వారి చేతులో ఉండగా న్లవారు గెట్టోుగా పివబడే మురికివాడలో జీవిస్తున్నారు. బహుళజాతి సంస్థు దళితు ప్రయోజాకు అనుకూమని చేస్తున్న ప్రచారం ఎవరికి అనుకూమో త్చేుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ ప్రయివేటీకరణను గట్టిగా వ్యతిరేకించని దళిత సంస్థు నేడు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కావాని కోరుతున్నాయి. సంస్థలో ఉన్న కార్మికు ప్రాథమిక హక్కునే లాక్కోజూస్తున్న ప్రభుత్వాు కొత్తగా దళితుకు రిజర్వేషన్లు ఇస్తాయని అనుకోలేము. యాజమాన్యా మెప్పు కోసం బరి తెగిస్తున్న ప్రభుత్వాు ఇటువంటి సాహసోపేత నిర్ణయాను ఎట్టి పరిస్థితిలోను తీసుకోవు. ఎందుకంటే పరిశ్రమాధిపతు నుండి ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత ఎదురు కావచ్చు. ప్రస్తుతం ప్రభుత్యోద్యోగాు లేక, ప్రయివేటు ఉద్యోగాు రాక దళిత యువకు భవిష్యత్తు అంధకారమయమవుతోంది. నిపుఉ గప్పిన నిప్పులా ఉన్నఈ ప్రమాదం నానాటికీ పెరుగుతున్నది. రాబోయే రోజులో ప్రపంచీకరణ ప్రదర్శించబోయే విశ్వరూపం దళిత యువతి, యువకు భవిష్యత్తును పూర్తిగా నాశనం చేయ్యక ముందే దానిని ప్రతిఘటించి తిప్పికొట్టాలి. దళిత యువత ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమాలో పాు పంచుకోవాలి.
‘ఉప’నిధుల ‘స్వాహా’కారాలు!
అరవై నాలుగు సంవత్సరాల ‘స్వతంత్ర’ భారతావనిలో దళితుల, గిరిజనుల సమస్యలు పరిష్కారం కాకపోగా, పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలేవీ వారి జీవితాల్లో మార్పు తీసుకొని రాలేక పోయాయి. రాష్ర్టంలో దళితులు, గిరిజ నుల జనాభా 22.08 శాతం ఉంది. 56 వేల దళిత వాడలు, 20 వేల గిరిజన ఆవాసాలు ఉన్నా యి. ఈ వర్గాల అభివృద్ధికి నామమాత్రపు బడ్జెట్ కేటాయింపులతో సరిపెట్టడమే కాకుండా, వాటిని కూడా వారి కోసం ఖర్చు చేయడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విఫలమౌతూ వస్తున్నాయి. షెద్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కోసం కేటాయించే ఉప ప్రణాళికా నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలనే ఆందోళన కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ 20 లక్షల దళిత, గిరిజన కుటుంబాలకు ఇండ్ల స్థలాలను ప్రభుత్వం సమకూర్చలేక పోయింది. 60 శాతం ఇండ్లకు మంచినీటి సౌకర్యం, 80 శాతం కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజి సౌకర్యం పూజ్యం. రాష్ర్టంలో 40 శాతం దళిత కుటుంబాలకు, 12 వేల గిరిజన కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేదు. 15 వేల గ్రామాలకు స్మశాన వాటికలు సైతం లేవు.
షెడ్యూలు కులాల, తెగల ఉపప్రణాళిక ప్రకారం- రాష్ర్ట ప్రణాళికా బడ్జెట్‌లో వీరి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేయాల్సి ఉంది. అంటే రాష్ర్టంలో జనాభా నిష్పత్తి ప్రకారం దళితులకు 13.2 శాతం, గిరిజనులకు 6.6 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాలి. కేటాయింపులు అరకొరగానే చేసినా, వాటిని కూడా ఖర్చు చేయటంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైంది. కేటాయింపుల్లో 7 శాతం నిధులు కూడా ఖర్చు పెట్టలేదని స్వచ్ఛంద సంస్థల సర్వేలలో బయట పడింది. దారిమళ్ళించిన నిధులతో హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు, హుస్సేన్‌సాగర్ ఆధునికీకరణ, జలయజ్ఞంల కోసం 4 వేల కోట్లు మళ్లించారు. 2004-5 నుంచి 2010-11 వరకు షెడ్యూల్డ్ కులాల, తెగల ఉప ప్రణాళికలో రూ. 25,647 కోట్లు కేటాయించవలసి ఉండగా రూ.12,476 కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. మిగతా రూ.13,171 కోట్లు ఇతర రంగాలకు మళ్లించారు.
దళిత, గిరిజనుల పిల్లలు చదువుకోవడానికి, ఉద్యోగాలు పొందటానికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ఉచిత చదువు, హాస్టల్ సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా ఆచరణ అందుకు భిన్నంగా ఉంది. పాలకుల విధానాల ఫలితంగా అనేక గిరిజన జాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. గిరిజన పిల్లలలో అత్యధికులు ఇప్పటికీ విద్యకు దూరంగానే ఉంటున్నారు. గిరిజన విద్యార్థులకు గత సంవత్సరం బడ్జెట్‌లో రూ. 385.52 కోట్లు కేటాయించారు. ఖర్చు పెట్టింది మాత్రం రూ.274.57 కోట్లే.
గిరిజన సంక్షేమశాఖ పరిధిలో రాష్ర్టంలో 442 వసతి గృహాలుండగా, బాలురకు 331, బాలికలకు 111 కేటాయించారు. వీటిలో 72,420 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొ క్క వసతి గృహంలో 2 వం దల మంది వరకు ఉండడం వల్ల వారు అవస్థలు పడుతు న్నారు. అవసర మైనన్ని మరుగుదొడ్లు, స్నానాల గదులు లేవు. ఉన్నవి కూడా నిర్వహణా లో పం వల్ల వినియోగానికి అనుగుణంగా లేవు.
గిరిజన హాస్టళ్ళ విద్యార్థుల ఎడల అధి కారులకే కాక, వార్డెన్లకు, సిబ్బందికి కూడా చిన్న చూపు ఉంది. మెస్ ఛార్జీల కేటాయింపులు నామమాత్రంగా ఉండటంతో పాటు, సిబ్బంది అవినీతి వల్ల నాసిరకం ఆహారమే విద్యార్థులకు అందుతోంది. ఫలితంగా డయేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు. గిరిజన బాలికలను భయపెట్టి వారిపై కొందరు వార్డెన్లు, సిబ్బంది అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అత్యాచారానికి గురై గర్భవతులైన గిరిజన బాలికల ఉదంతాలు నిత్యం బయటపడుతూనే ఉన్నాయి. విద్యను కొనసాగించడంలో గిరిజనులు వెనుకబడి ఉన్నారు. వారు నివసిస్తున్న ప్రాంతాలలో పాఠశాలలు నామమాత్రం. చదువు కోవడానికి పట్టణ ప్రాంతాలకు పంపలేక పిల్లలను గిరిజనులు చదివించుకోలేక పోతున్నారు. ప్రాథమిక విద్యతోనే ఎక్కువ మంది గిరిజన విద్యార్థులు చదువు చాలిస్తున్నారు.
2001-10 సంవత్సరాల మధ్యకాంలో రాష్ర్ట వ్యాపితంగా 3,12,308 మంది గిరిజన బాల, బాలికలు 1వ తరగతిలో చేరినా 2009-10 నాటికి చదువు కొనసాగించిన వారి సంఖ్య 72,606కి తగ్గిపోయింది. గిరిజనులకు గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకొంటున్నది. 272 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 84, 876 మందికి విద్య, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెబుతున్నది. ఇవే కాక, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి 84,675 మందికి విద్య, వసతిని ఒకే చోట కల్పిస్తున్నట్లు విద్యాశాఖ తెలియచేస్తోంది. ఈ పాఠశాలల్లో 48 ప్రాథమిక పాఠశాలలు, 223 ప్రాథమికోన్నత పాఠశాలలు, 330 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ వీటిలో ప్రాథమిక పాఠశాలలు 48 మాత్రమే ఉండడం వల్ల- మొత్తం ఆశ్రమ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది.
ఈ పాఠశాలల్లోనూ సౌకర్యాలు సంక్షేమ హాస్టళ్ళకు భిన్నంగా లేవని విద్యార్థులు చెబుతున్నారు. ఇందుకు బడ్జెట్ కేటాయింపులు తక్కువగా ఉండడమే కారణం. అంతే కాకుండా కేటాయించిన బడ్జెట్‌లను పూర్తిగా విడుదల చేయకపోవటం, విడుదల చేసిన నిధులను పూర్తిగా ఖర్చుపెట్టటం కూడా జరగ డం లేదు. బడ్జెట్ కేటా యిం పులు, మంజూరు, ఖర్చు పరిశీలిస్తే, ఈ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సదుపాయా లకు, భోజనవసతికి ఏమాత్రం సరిపోదని అర్థమౌతుంది. వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టామని, అందుకు నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వప్రచారం సాగుతూనే ఉన్నా, వాస్తవంలో వీరు నిర్లక్ష్యానికి గురవు తున్నారు. వారికి కేటాయించిన నిధుల్ని కూడా దారిమళ్ళిస్తున్నారు. దళితుల జనాభా ప్రకారం బడ్జెట్‌లో కేటాయింపులు జరగడం లేదు.
స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్ ప్రకారం ఎస్సీలకు నిధులు కేటాయించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. 2004-05 నుండి 2010-11 వరకు సబ్ ప్లాన్ ప్రకారం బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు, మళ్లించిన నిధులు పరిశీలిస్తే వెనుకబడిన కులాల అభివృద్ధి పట్ల పాలకుల నిర్లక్ష్యం తేటత్లెమౌతుంది. ఈ ఆరు ఏళ్ళ బడ్జెట్ మొత్తం రూ,1,58,313 కోట్లు కాగా, ఎస్సీలకు కేటాయించింది రూ. 25,648, విడుదల చేసింది రూ.21,309, ఖర్చు చేసింది రూ.12,476, దారి మళ్లించినది రూ.13,171 కోట్లు. అంటే ఖర్చు చేసిన దానికంటె దారి మళ్లించిందే ఎక్కువ.
వెనుకబడిన కులాల వారు ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడి ఉండటం వలన చదువులో వారి పిల్లలు ముందుకు సాగలేక పోతున్నారు. ప్రాథమిక విద్యతోనే అత్యధికులు చదువుకి దూరమవుతున్నారు. గత 10 సంవత్సరాలలో 4,76,514 మంది పిల్లలు ఒకటవ తరగతి చేరగా, పదో తరగతికి 1,76,514 మంది మాత్రమే చేరుకోగా, దాదాపు మూడువంతుల పిల్లలు చదువు మానుకోవలసి వచ్చింది.దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడి ఉండడానికి, దుర్భరమైన జీవితాలు గడపటానికి భూ పంపిణీ జరగక పోవటమే కారణం. నేటికి 80 శాతం దాకా వ్యవసాయ భూము లు భూస్వాముల, సంపన్న వర్గాల చేతుల్లో ఉన్నాయి.
ఈ భూములు పేదల పరమైతే, ఆ సేద్యం ద్వారా వచ్చే ఆదాయం బడుగు బలహీన్వర్గాల వారి జీవితా ల్లో మార్పు తీసుకొస్తుంది. సాంస్కృతిక మార్పుతో బాటు వారి పిల్లలను చదివిం చుకోగలిగే స్థితి ఏర్పడుతుంది. భూస్వామ్య ప్రతినిధి వర్గాలైన పాలకులు భూ కామందుల వద్దనున్న భూములను పేదలకు పంచలేరని 64 సంవత్సరాల ‘స్వతంత్ర’పాలన స్పష్టంచేసింది. అన్ని కులాలలోని పేదలు ఉద్యమించి పంచుకో వడం ద్వారానే వారికి భూమిపైహక్కు ఏర్పడుతుంది. ఆ దిశగా గిరిజనులు, వెను కబడిన కులాలు, ఇతర కులాల పేదలు ఐక్యంగా పోరాటాన్ని నిర్వహించాలి.
(సూర్య 31-3-12)
దళితుల తొలి విప్లవ పోరాటం
1927 మార్చి 20వ తేదీ అది దళితులు విప్లవానికి శంఖారావం పూరించిన దినం. భారతదేశపు జాతీయ జీవితంలోనూ, సాంఘిక జీవితంలోనూ ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన దినం.దళిత సమాజం మొట్టమొదటి సారిగా వాస్తవమైన ఆందోళనలో పాల్గొన్న దినం. ఒక అస్పృశ్యుడి నాయకత్వంలో తరతరాలుగా తమను అంటరానివారిగా చూస్తూ, సాటి మానవుని కంటే హీనంగా చూస్తున్న మనువాద సమాజానికి సమాధి కట్టేెందుకు అంకురార్పన చేపట్టిన దినం. అదే తొలి దళిత విప్లవ పోరాటానికి నాంది. ''చవదార్ చెరవులో'' (మహాద్‌్ చెరువు) నీళ్ళు తాగి తతిమ్మా జనం లాగే దళితులు మనుషులే అని చాటి చెబుతూ డా|| బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వాన సమానత్వానికై జరిగిన పోరాటానికి ప్రారంభ సూచిక అయిన చవ్‌దార్ చెరువు ఘటన జరిగి మార్చి 20 నాటికి 85 సంవత్సరాలు గడుస్తూంది. ఈ సందర్భంగా ఈ ఘటనను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిది.
డా||బి.ఆర్.అంబేద్కర్ అప్పటి వరకు అస్పృశ్య సమాజంలో ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని మేలుకొల్పడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. దళిత సమాజంతో ఆత్మగౌరవం కలిగేటట్టు చూశాడు. మానసికంగా అస్పృశ్య సమాజం ఎంత ముందుకు వెళ్ళిందో అంచనా వేసుకున్నాడు. అస్పృశ్యుల గుండెల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని అయితే నాటగలిగాడు కాని వస్తాదుకు పోటిలో దిగేంతవరకూ తన శక్తి మీద తనకు నమ్మకం కుదరదు, తన బలాన్ని శత్రు సైనిక బలంతో పోల్చి అంచనా వేయడం కుదరదు. అట్లాగే ప్రయత్న పూర్వకంగా పోరాటంలోకి దిగిన తర్వాతే అస్పృశ్య సమాజానికి ఉన్న శక్తి ఎంత అనేది పరీక్షించడానికి వీలు కలుగుతుంది. డాక్టర్ అంబేద్కర్‌కు కూడా ఇదే భావం కలిగింది. అస్పృశ్య సమాజం తన శక్తి సామార్థ్యాలను నిరుపించుకునేందుకు సమయం ఆసన్నమైంది, దానికి మూహుర్తాన్ని మార్చి 20న నిర్ణయించారు. నిచ్చనమెట్ల కుల సమాజంలో మూడువేల సంవత్సరాలుగా పంచమ కులంగా అగ్రవర్ణ సమాజంచే చీదరించబడుతూ, మంచినీటి చెరువులకు, నదులకు, ఆస్పత్రులకు, విద్యాసంస్థలకు, కోర్టులకు, దేవాలయాలు లాంటి సార్వజనిన స్థలాలన్నింటికి దూరంగా ఉంచిన మనుధర్మాన్ని ధిక్కరించడానికి పూనుకున్నాడు. దీనికి వేదికగా మహాద్‌్‌ను ఎన్నుకున్నాడు. దీనికి కారణం మహాద్‌్ ఆయనకు బాగా తెలిసిన ప్రాంతం. సైనిక ఉద్యోగాల నుంచి పెన్షన్ పుచ్చుకున్న మహార్ జాతికి చెందిన జనం మహాద్‌్‌లోనే నివాసాలు ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా అక్కడ నివశిస్తున్న వారిలో చాలామందికి సాంఘీక కార్యకలాపాల గురించి అవగాహన ఉంది. వీళ్ళందరూ అవసరం వచ్చినప్పుడు జాతికోసం తమ ప్రాణాలని సైతం ఫణంగా పెట్టడానికి సిద్దపడతారనే నమ్మకం బాబాసాహెబ్‌కు ఉంది. అంతేకాకుండా వాళ్ళందరూ సైన్యం నుంచి రిటైర్ అయి వచ్చిన వాళ్ళవడం చేత క్రమశిక్షణ వాళ్ళ రక్తంలో ఉంది.
అనుకున్నట్టుగానే మార్చి 19వ తేదిన మహాద్‌్‌లో పరిషత్‌ను ప్రారంభించడానికి నిర్ణయించారు. దీనిలో పాల్గోనడానికి గుజరాత్, మహారాష్ట్రకి చెందిన పల్లెలనుండి సుమారు ఐదువేల మంది జనం వచ్చారు. సాయంత్రం పరిషత్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేయబోయే కార్యాన్ని గురించి బాబసాహెబ్ ప్రారంభ సూచకంగా ఉత్సాహపూరితమైన ప్రసంగాన్ని ఇచ్చాడు. ఈ ప్రసంగంలో మూడు సూత్రాలను చేపట్టమని బాబాసాహెబు పిలుపిచ్చాడు.
అవి 1. చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడం మానెయ్యండి. 2. ఎంగిలి భోజనాన్ని స్వీకరించకండి. 3. పెద్దా, చిన్నా అన్న ఊహని మనస్సులోంచి తీసేసి ఉన్నత వర్గాల జీవన విధానాలని స్వీకరించండి. అస్పృశ్య వర్గం వ్యవసాయాన్ని కూడా వృత్తిగా చేపట్టండి అని సలహా ఇచ్చాడు. దళితుల ఆత్మగౌరవాన్ని మేలుకొలిపేటట్లు ఆయన ఉపన్యసించాడు. ఈ ఉపన్యాసం ఆయన కోరుకున్న ప్రభావాన్ని జనంలో కలిగించింది.మహాద్‌్ చెరువు విషయంలో ఆ సమయంలోనే మహాద్ మున్సిపాలిటీ ఒక తీర్మానం చేసింది. '' ఈ చెరువు సార్వజనికమైనదని దీని నీటిని అస్పృశ్యులతో పాటు జనం యావన్మందీ వాడుకోవచ్చని'' ఈ తీర్మానం సారాంశం. ఈ తీర్మానం బాబాసాహెబ్‌కు పోరాటానికి మార్గాన్ని సులభతరం చేసినట్టయింది. రెండవరోజు మార్చి 20వ తేదిన ఉదయం తొమ్మిది గంటలకు సమావేశం మొదలయ్యింది. ముందస్తుగా మహాద్‌్ మున్సిపాలిటి చేసిన తీర్మానాన్ని అమోదించారు. ఈ తీర్మానాన్ని వెంటనే అమలు పెట్టాలని లక్ష్యంతో బాబాసాహెబు ముందు నడవగా ఐదువేల మంది దళిత సమాజం ఊరేగింపుగా, ఉత్సాహాంగా పాటలు పాడుతూ చవ్‌దార్ చెరువు గట్టుకు చేరుకున్నారు. బాబాసాహెబ్, ఆ తర్వాత దళిత సమాజం అంతా తరతరాలుగా తమ జాతికి దూరంగా ఉంచబడిన మంచి నీటిని దోసిట్లోకి తీసుకుని తృప్తిగా తాగి మనుధర్మాన్ని ధిక్కరించారు. ఒక పౌరుడిగా, మనిషిగా, మా హక్కుగా మేము తాగుతున్నాం అని మంచినీటిని తాగి తమ హక్కుని ఋజువు చేశారు. నీళ్ళు తాగిన వారందరి మొహాల్లోనూ వింతైన ఉత్సాహం, సంతోషం తాండవించాయి.ఈ ఉత్సాహంలో బాబాసాహెబ్ నాయకత్వంలో దేన్నయిన సాధించవచ్చనే నమ్మకం ఏర్పరచుకున్నారు. ఒక్కోక్కరుగా నీటిని త్రాగిన జనం జట్లుజట్లుగా విడిపోయి తిరిగి సభాస్తలికి చేరుకున్నారు. తరతరాలుగా తాము పవిత్రంగా భావిస్తున్న మనుధర్మానికి ఈ ఘటనతో పగుళ్ళు ఏర్పడ్డాయని భావించిన సనాతనులు దళితులను ఎదురుదెబ్బ తియడానికి రహస్య మంతనాలు మొదలెట్టారు. మతం విపత్తులో పడిందని సర్వత్రా ప్రచారం నిర్వహించారు. తమతమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడుతున్న దళితులపై అకస్మాత్తుగా సనాతన గుండాలు దండెత్తి వచ్చి లాఠీల వర్షం కురిపించారు. ఊరంతా తిరుగుతూ కనిపించిన ప్రతినిధులను కొట్టడం మొదలెట్టారు. ఈ వార్త బాబాసాహెబ్‌కు చేరింది. స్పృహ తప్పి పడిపోయిన జనాన్ని, దెబ్బల బాధని సహించలేక గిలగిల కొట్టుకుంటున్న ప్రతినిధులని చూసి బాబాసాహెబ్ నెత్తురు ఉడుకెత్తింది. అయిన తన కోపాన్ని అదుపులోకి తెచ్చుకొని ఎంతో గాంభీర్యంతో ఈ తరుణంలో మీరు కోపంతో ఉద్రిక్తులు కావద్దు, చెయ్యి చేసుకొవద్దు. మీరు మీ కోపాన్ని దిగమింగుకొని వారి దెబ్బలను సహిస్తూ ఈ సనాతనులకి అహింస మహాత్తు ఎంతో చూపించాలి అని దళిత సమూహానికి బోధించాడు. ప్రతికారేచ్చతో రగిలిపోతున్న దళిత సమాజం, ఆప్ఘను యుద్ధంలోనూ, తదితర యుద్ధాల్లోనూ తమ పరాక్రమాన్ని, వీరత్వాన్ని ప్రదర్శించిన సైనికులు తమ కోపాన్ని దిగమింగుకొని సనాతులు కురిపిస్తున్న రాళ్ళ వర్షానికి దెబ్బలు తగిలి ఒకరి తర్వాత ఒకరు నేలవాలిపోతున్న అస్పృశ్యులు తిప్పి కొట్టలేదు. తమ నాయకుడి అదేశాన్ని శిరసావహించి సహానం ప్రదర్శించారు. ఒకవేల అస్పృశ్యులు ఎదురు దెబ్బతియ్యాలని సంకల్పించుకోని ఉంటే, దాడిచేసి ఉంటే సనాతుల ప్రాణాలను కాపాడడం ఎవరి తరం కాకపోయేది. దెబ్బలు తిన్న వారిని బాబాసాహెబ్ స్వయంగా ఆస్పత్రితో చేర్చాడు, ఈ ఘటన జరిగాక సనాతన గుండాలపై కేసులు నమోదు చేయించాడు. 1927 జూన్ 6 వ తేదిన తొమ్మిది మంది నేరస్థుల్లో ఐదుగురికి కఠిన కారగార శిక్ష పడింది. ఈ సందర్భంగా '' ఈ కొట్లాట తరుణంలో హిందుయేతర అధికారులు ఉండి ఉండకపోతే విచారణ పక్షపాత రహితంగా జరగడం కష్టం అయ్యేది'' అని అంబేద్కర్ అన్నారు. ఆ తర్వాత ఊరూర పల్లెపల్లెలో అస్పృశ్యుల మీద హిందువులు చేసే అత్యాచారాలను, బహిష్కరణలను వారు ఎదుర్కోవలసి వచ్చింది. యావత్ భారతదేశంలో అక్కడక్కడా దీనికి ప్రతిస్పందన కనిపించింది. తరువాత సనాతులంతా కలిసి చావదార్ చెరువును శుద్ధి చేయ్యాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం చావదార్ చెరువులోంచి 108 బిందెల నీళ్ళు తీయించారు. ఇంటింటి నుంచి పేడ, గోమూత్రం పోగుచేసి పాలు, పెరుగు బిందెల్లో కలిపారు. మొత్తం వాటన్నింటిని చావదార్ చెరువులో పోసి, శుద్ధి అయ్యిందని ప్రకటించారు. ''మనువాద సమాజంలో మనిషి స్పర్శతో పోల్చితే ఆవుపేడా, గోమూత్రం అధిక పరిశుద్థంగా ప్రకిటించడంలో మనువాద సమాజంలో అస్పృశ్యుల స్థితి ఎలాంటీదో తెలియజేస్తూంది''.
ఈ ఘటన అనంతరం ఆగష్టు 4వ తేదిన మహాడ్ మునిసిపాలిటీ ఒక కొత్త తీర్మానాన్ని అమోదించి గతంలో ప్రకటించిన తీర్మానాన్ని రద్దుచేసుకుంది. ఈ తీర్మానాన్ని అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు చవ్‌దార్ చెరువులో సనాతులతో సమానంగా అస్పృశ్యులు హక్కుగా పొందేవరకు పోరాడాలని నిక్షయించుకున్నాడు. భవిష్యత్ కార్యక్రమాన్ని డిసెంబర్ 25 వ తేదికి పిలుపునిచ్చాడు, ఈ పిలుపును వ్యతిరేకిస్తూ సనాతులు కోర్టుకు వెళ్ళిన బాబాసాహెబు వెనక్కి తగ్గలేదు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ మాట్లాడుతూ '' చవ్‌దార్ చెరువులోని నీళ్ళు మనం తాగకపోతే మన ప్రాణాలు ఏమీపోవు, అయితే తతిమ్మా జనంలాగా మనమూ మనుషులమే అని వారందరికి చెప్పాలని మనం వాంఛిస్తున్నాం. సమానత్వానికి శ్రీకారం చుట్టడానికే ఈ ఘటన అని ఆయన పేర్కోన్నాడు''. ఈ హిందు సమాజాన్ని పునర్నిర్మాణం చేయ్యాలని దానికోసం సమానత్వం, జాతిరహిత సహాజం అనేవి మన లక్ష్యాలు కావాలని పిలుపునిచ్చాడు.1789 మే 5వ తేదిన ఫ్రాన్సులోని బర్సాయ దగ్గర జరిగిన జాతీయసభతో ఈ పరిషత్ సభను పోల్చుతూ ''ఫ్రెంచి విప్లవం కోసం వారు ఎలాగు సంఘటితం కావల్సివచ్చిందో అలాగే మనం కూడా సంఘటితం కావాల్సి ఉంది.ఈ సభలో నిర్దేశించబడిన మార్గమే హిందు సమాజపు అభ్యుదయానికి కావలసిన అత్యవసరమైన మార్గం'' అని చెప్పాడు. ''పుట్టుకరీత్యా అందరూ సమానంగా పుడతారు వారు చనిపోయేదాక సమానంగా ఉండాలి'', ''మనుస్మృతిని'' దగ్థం చేసేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ తీర్మానానికి పరిషత్‌లో పాల్గోన్న సమాజమంతా ముక్తకంఠంతో అమోదం తెలిపారు. అనుకున్నదే తడువుగా రాత్రి తొమ్మిది గంటలకు ఒక వేదిక మీద '' మనుస్మృతిని'' దగ్థం చేశారు. అనంతరం చెరువు విషయంలో మహద్‌్ మునిసిపాలిటీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ మహడ్ సబ్‌జడ్జీ ఎదుట ''విధించిన నిషేదాజ్ఞలకు'' వ్యతిరేకంగా తిరుగులేని వాదన చేశారు. అయన వాదాన్ని ఖండించడం అసంభమయ్యింది. ఫిబ్రవరి 23వ తేదిన జడ్జి ఆ ఆదేశాన్ని రద్ధు చేస్తూ తీర్పు నిచ్చాడు. ఈ సందర్భంగా మహాద్‌్‌లో జరిగిన విప్లవం గురించి డా|| అంబేద్కర్ మాట్లాడుతూ ''నోరు వాని లేని పీిడిత ప్రజలు, చెప్పకోదగిన ఏ ఆఘాయిత్యం జరగకుండా, అతి తక్కువ సమయంలో, సమాన హక్కులను పొందడం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ జరగని, అనుకోని, ఆశించని విప్లవం'' అని పేర్కోన్నారు.
అయితే ఈ తొలి దళిత విప్లవ పోరాటానికి నాంది అయిన సంఘటన జరిగి నేటికి 86 సంవత్సరాలు గడిచిపోయింది. స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కులవివక్షత, అంటరాతనం వివిధ రూపాల్లో నేటికి కోనసాగుతోంది. గతంలో సాక్షి హ్యూమన్ రైట్స్ నిర్వహించిన సర్వేలో నేటికి 74 శాతం గ్రామాల్లో మంచినీటిసేకరణ వద్ధ, 86 శాతం గ్రామాల్లో ఆలయ ప్రవేశం విషయంలో, 92 శాతం గ్రామాల్లో ఇళ్ళు అద్దెకు ఇవ్వడం దగ్గర, 54 శాతం గ్రామాల్లో హోటల్ల దగ్గర, 90 గ్రామాల్లో బట్టలుతకడం దగ్గర, 82 శాతం గ్రామాల్లో క్షౌరం దగ్గర వివక్ష కొనసాగుతుందని తెలియజేసింది. వీటి నిర్మూలన కోసం అనేక చట్టాలు వచ్చిన అంటరాని తనాన్ని కానీ, కులవివక్షను కాని అరికట్టలేక పోతున్నాయి. అంబేద్కర్ వారసులమని చెలామని అవుతున్న నాయకులు కాని సంఘాలు కాని వీటికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించలేకపోతున్నాయి. దళితులపేరు చెప్పుకొని దళిత ప్రతినిధులుగా చట్టసభల్లో ఎన్నికయిన నాయకులు చట్టసభల్లో వీటిగురించి పల్లెత్తు మాటైన మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఓట్లదగ్గర, సీట్లదగ్గర కులాన్ని వాడుకోనే నాయకులు అంబేద్కర్ వారసులుగా కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా నిర్మించిన పోరాటాల్లో, తమ భాగస్వామ్యం ఎంతో బేరీజువేసుకోవాలి. అంబేద్కర్ వారసులంగా ''బోధించు, సమీకరించు, పోరాడు'' అనే నినాదాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత,వీటికి వ్యతిరేకంగా పోరాడిల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.అదే డా|| బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వాన జరిగిన తొలి దళిత విప్లవ పోరాటం ఇచ్చిన పిలుపు.
(సూర్య 20-3-2012)
Subscribe to:
Posts
(
Atom
)



