ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?
ఐరోపా ఖండంలో వైశ్యాల్యం రీత్యా రష్యా తర్వాత పెద్ద దేశమైన ఉక్రెయిన్‌లో నేడు రక్తపు మడుగులో మునిగితేుతోంది. ప్రపంచాన్నే గుప్పిట్లో పెట్టుకుని, తన మార్కెట్‌గా మార్చుకోలవానే అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల స్వార్థం మూలంగా నేడు ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సంక్షోభం తీవ్రమై సైనిక జోక్యం వరకు వెళ్లింది. యూరోపియన్ యూనియన్ (ఇ.యు) లో చేరడానికి నిరాకరించినందుకు ఆమెరికా, ఐరోపాలు ఉక్రెయిన్‌లో గత నవబంర్ నుంచి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఆ హింసాత్మక ఆందోళనలు చివరకు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక కాబడిన అధ్యక్షుడు యనుకోవిచ్‌ను దేశం విడిచి వెళ్ళిపోయేలా చేసి, తాత్కాలిక అధ్యక్షుడిగా పశ్చిమ దేశాలకు అనుకూల వ్యక్తిని నియమించాయంటే ఇ.యు, అమెరికా దాష్టికం ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యూరోపియన్ యూనియన్, ఆమెరికా అనుకూల శక్తులు, ఉక్రెయిన్‌లో అవంభిస్తున్న విధానం నాటి నాజీ తరహాను గుర్తుకుతెస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమ దేశాల అండదండతో రెచ్చిపోయిన ఆందోళనకాయి ప్రభుత్వ కార్యాయాలను, పార్లమెంట్‌ను స్వాధీనం చేసుకున్నాయి.ఈ పొరుగున ఉన్న రష్యా చురుకుగా కదిలింది. రష్యన్లు మెజారిటీ సంఖ్యలో నివసించే స్వయంప్రతిప్రత్తి ప్రాంతమైన క్రిమియాలో రక్షణ చర్యలు చేపట్టింది.దీంతో అగ్రరాజ్యాలు ఉక్రెయిన్ విషయంలో జోక్యం చేసుకోవడంతో ఐరోపా తూర్పు ప్రాంతంలో యుద్ధ వాతావారణ నెలకొంది.
ఉక్రెయిన్ ఒకప్పటి సోవియట్ రష్యాలో అత్యంత కీలకమైన, వ్యూహాత్మక భూభాగం. మొత్తం నాలుగున్నర కోట్ల జనాభా. అందులో దాదాపు 77 శాతానికిపైగా ఉక్రెయిన్ జాతీయుంటే, రష్యా జాతీయులు 17 శాతం మంది ఉన్నారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నత తర్వాత 1991లో స్వతంత్ర దేశంగా ఉక్రెయిన్ ఆవిర్భవించింది. సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ ఒకప్పుడు ఆర్థిక శక్తిగా వెలుగొందింది. ఉత్పత్తి రంగంలో తిరుగులేని శక్తిగా ఉండేది. అయితే సోవియట్ విచ్ఛిన్నంతోనే ఉక్రెయిన్ ఆర్థిక కష్టాలు మొదయ్యాయి. ఈ దశలోనే సంస్కరణ వైపు పయనించింది. ఫలితంగా ప్రజారోగ్యం మూలనపడింది. సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టారు. ప్రైవేటీకరణ ఊపందుకుంది. వీటి ఫలితంగా 2008 ఆర్థి సంక్షోభం ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చింది. పేదరికం, ఆకలికేకలు, నిరుద్యోగం పెరిగింది. కడుపు నింపుకోవడానికి వ్యభిచారం సర్వసాధారణమయ్యాయి. ఫలితంగా ప్రజాందోళను మొదలయ్యాయి. దీన్ని అవకాశాంగా తీసుకున్న యూరోపియన్ యూనియన్ ఒకప్పుడు రష్యాకు అనుకూంగా ఉన్న ఉక్రెయిన్‌ను తమ యూనియన్‌లో కలుపుకునేందుకు పావులు కదిపింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం (క్రిమియా)లో రష్యా అనుకూల జనాభా ఉంటే, పశ్చిమ ప్రాంతంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల అనుకూల జనాభా అధికంగా ఉన్నారు. ఉక్రెయిన్‌పై పట్టు సాధించడం మూలంగా ఆర్థికంగా లాభపడటమే కాకుండా పొరుగున ఉన్న రష్యాలో కూడా పరోక్షంగా తన ఎగుమతుతో ముంచెత్తవచ్చని పశ్చిమ రాజ్యాలు ప్రయత్నిస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఉక్రెయిన్‌ను యూరోపియన్ యూనియన్‌లో చేర్చాలని గత కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నాయి.
గత కొంత కాలాంగా ఇ.యులో చేరడానికి సుముఖత వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు యనుకోవిక్ ఇ.యు చేరడం మూలంగా లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని, యూరో జోన్‌లో చేరడం మూలంగా ఉక్రెయిన్‌లోకి ఐరోపా దేశాల దిగుమతులు ముంచెత్తుతాయని, ఫలితంగా దేశీయ ఉత్పత్తి పడిపోతుందని గ్రహించి, లిధుయేనియా రాజధానిలో గత నవంబర్‌లో జరిగిన ఇ.యు సమావేశాల్లో యురోపియన్ యూనియన్‌లో చేరే ఆలోచనను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆందోళను చెలరేగాయి. ప్రశ్చిమ దేశాల ప్రొత్సాహంలో మొదలైన గందరగోళం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది. నవంబర్ 23 నుంచి ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో విధ్వంసం మొదలైంది. అంతేకాకుండా ఈ అందోళనకు మద్దతుగా జాన్ మెక్‌కెయిన్ లాంటి పలువురు అమెరికా సెనేటర్లు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి ప్రసంగాలు చేసి ఆందోళనకారును రెచ్చగొట్టారు. పొలాండ్ లాంటి ఇ.యు సభ్య దేశాు కూడా బహిరంగంగానే ఉక్రెయిన్ ఆందోళనకారులకు మద్దతుగా, ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు, పిలుపులు జారీ చేశాయి. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాను స్వాధీనం చేసుకోవడం, వాహనాలకు, భవనాలను తగబెట్టడం, అధికారును నిర్భంధించడం చేయడంతో చివరకు దేశ అధ్యక్షుడు ప్రాణాలను రక్షించుకోవడానికి రష్యాను అశ్రయించాడు.
గత కొంత కాలాంగా ఇ.యులో చేరడానికి సుముఖత వ్యక్తం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు యనుకోవిక్ ఇ.యు చేరడం మూలంగా లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని, యూరో జోన్‌లో చేరడం మూలంగా ఉక్రెయిన్‌లోకి ఐరోపా దేశాల దిగుమతులు ముంచెత్తుతాయని, ఫలితంగా దేశీయ ఉత్పత్తి పడిపోతుందని గ్రహించి, లిధుయేనియా రాజధానిలో గత నవంబర్‌లో జరిగిన ఇ.యు సమావేశాల్లో యురోపియన్ యూనియన్‌లో చేరే ఆలోచనను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆందోళను చెలరేగాయి. ప్రశ్చిమ దేశాల ప్రొత్సాహంలో మొదలైన గందరగోళం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది. నవంబర్ 23 నుంచి ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో విధ్వంసం మొదలైంది. అంతేకాకుండా ఈ అందోళనకు మద్దతుగా జాన్ మెక్‌కెయిన్ లాంటి పలువురు అమెరికా సెనేటర్లు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి ప్రసంగాలు చేసి ఆందోళనకారును రెచ్చగొట్టారు. పొలాండ్ లాంటి ఇ.యు సభ్య దేశాు కూడా బహిరంగంగానే ఉక్రెయిన్ ఆందోళనకారులకు మద్దతుగా, ఉక్రెయిన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు, పిలుపులు జారీ చేశాయి. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాను స్వాధీనం చేసుకోవడం, వాహనాలకు, భవనాలను తగబెట్టడం, అధికారును నిర్భంధించడం చేయడంతో చివరకు దేశ అధ్యక్షుడు ప్రాణాలను రక్షించుకోవడానికి రష్యాను అశ్రయించాడు.
ఇదే సందర్భంలో ఉక్రెయిన్ తూర్పు భాగంలో రష్యా అనుకూ ఆందోళనకు ఆకాశాన్నంటాయి. స్వతంత్ర క్రిమియాలో ఈ ప్రదర్శను భారీగా జరిగాయి. నల్ల సముద్రంలో మూడు వైపుల సముద్రంతో చుట్టిఉండే క్రిమియా, ఉక్రెయిన్‌లో భాగమే అయినప్పటికీ సొంత పార్లమెంట్, రక్షణ బలగాలు కలిగి ఉన్న ప్రాంతం. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది రష్యన్లు కాగా టార్‌టార్ ముస్లిరు మైనారిటీలుగా ఉన్నారు. (క్రిమియాను సోవియన్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కృచ్చెవ్ ఉక్రెయిన్‌కు కానుకగా ఇచ్చాడు). ఉక్రెయిన్‌లోని రష్యన్లు ఆందోళనకు దిగడంతో రష్యన్ల ప్రయోజనాలు కాపాడవసిన బాధ్యత తనపై ఉందని రష్యా జోక్యం చేసుకొంది.
ఉక్రెయిన్‌లో హింసాత్మక ఆందోళనను చ్లబరచడానికి ఇ.యు, అమెరికా మధ్యవర్తిత్వంలో ఆందోళనకారుకు, అధ్యక్షుడికి మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ దాన్ని అమలుచేయించే బాధ్యతను ఇ.యు, అమెరికాు గాలికి వదిలేశాయి. పైగా ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలను, వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాను ఆక్రమించుకుంటున్నా వారిని వదిలి ప్రభుత్వానికే నీతులు చెప్పారు. పెట్రోల్ బాంలు విసురుతూ, కనిపించిందల్లా తగబెడుతూ, పోలీసుపై క్పాుులు జరుపుతూ భారీ విధ్వంసం సాగించడంతో ఒప్పందం అమలు కాలేదు. అధ్యక్షుడు యనుకోవిచ్ నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి బదులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం మొదట సొంత నగరానికి, అనంతరం అక్కడి నుంచి రహస్యంగా సరిహద్దు దాటి రష్యాలో రాజకీయ ఆశ్రయం పొందాడు. ఈ విధంగా ఉక్రెయిన్ పూర్తిగా ఇ.యు, అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఐరోపానుండి, అమెరికా నుండి వివిధ నాయకులు, మంత్రులు, అధికారులు ఉక్రెయిన్ వచ్చి సంప్రదింపు జరుపుతూ సలహాలు ఇస్తూ తామే ప్రభుత్వాన్ని నడిపేస్తున్నారు. దీంతో రష్యా జోక్యం చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ఒబమా, బ్రిటన్ ప్రధాని కామెరాన్, జర్మనీ ఛాన్సర్ ఏంజెలా మెక్కెల్, ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంషా ఒలాండే తదితర నేతలు సైనిక చర్యకు దిగరాదంటూ రష్యాను హెచ్చరికు చేస్తుండగానే ఉక్రెయిన్‌లో సైనిక జోక్యానికి రష్యా పార్లమెంట్ నుండి అనుమతి పొందాడు. పార్లమెంట్ నుండి అనుమతి తీసుకున్న తర్వాత పుతిన్ కొన్ని క్రియాశీలక చర్యలు తీసుకున్నాడు. స్వయం ప్రతిపత్తి ప్రాంతమైన క్రిమియాకు రష్యా సైన్యాన్ని పంపింది. స్థానికంగా ఉన్న సైనిక స్థావరం నుండి సైనికులను పంపి వివిధ ప్రభుత్వ భవనాకు రక్షణ ఇవ్వాని ఆదేశాలు ఇచ్చాడు. రష్యా సైనిక చర్య పట్ల అమెరికా అధ్యక్షుడు ఒబామా, విదేశాంగ మంత్రి జాన్ కేర్రీ నిరసన తెలిపినప్పటికీ పుతిన్ వాటిని పట్టించుకోలేదు. రష్యాను, దాని ఆర్థిక ప్రయోజనానూ సమూలంగా నాశం చేసే ఉద్దేశ్యంతోనే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లో రగిల్చిన కుంపటిని ఆర్పకుండా అట్టే ఉంచాని ఒబామా కోరితే దానిని మన్నించాలా లేక సొంత భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలా అన్నది పుతిన్ ముందున్న ప్రశ్న .
ఉక్రెయిన్‌లో జరుగుతున్న ఆందోళను 2004నాటి ‘ఆరంజ్ రిమ్యాషన్’ ను గుర్తుకు తెస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరంజ్ రిమ్యాషన్ నిజానికి రిమ్యాషన్ కాదు. అప్పటి అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీ ఓట్లతో అధ్యక్ష పదవి చేపట్టిన యనుకోవిక్ ఐరోపా దేశా అడుగుకు మడుగులు ఒత్తడానికి నిరాకరించారు. పశ్చిమ దేశాలు తమ నిధుతో నడిచే ఎన్.జి.ఓ సంస్థ సహాయంతో ఆందోళనలు రెచ్చగొట్టాయి. న్యాయమూర్తులు సైతం అమ్ముడుబోయి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన యనుకోవిక్‌ను అధ్యక్ష పదవి నుండి తప్పించారు. దీనికే ‘ఆరంజ్ రిమ్యాషన్’గా పశ్చిమ దేశాలు, పత్రికలు సంతోషంగా చెప్పుకుంటాయి. ఇ.యు ప్రతిపాదించిన ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ ని చదివినవారు ఎవ్వరూ ఇ.యులో చేరాని ఆందోళన చెయ్యరని ప్రధాని అజరోవ్ ప్రకటించడం గమనించాల్సిన విషయం. ఇ.యు ఒప్పందాన్ని వాయిదా వేయడానికికే తాము నిర్ణయించుకున్నామని అధ్యక్షుడు యనుకోవిక్, లిధువేనియా రాజధాని విలినియస్‌లో నవంబర్ 30 తేదీన ముగిసిన ఇ.యు సమావేశాల్లో స్పష్టం చేశాక ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఆందోళను తీవ్రం అయ్యాయి. వీటిని పోలీసు అదుపులోకి తెచ్చినప్పటికీ మరికొంతమంది ఇంకా ఆందోళనల్లో ఉన్నారు. రాజధానిలో తిష్టవేసిన ఆందోళనకారు వల్ల తమకు తీవ్ర అసౌకర్యంగా ఉన్నదని నగరవాసు ప్రభుత్వాధికారుకు ఫిర్యాదు చేయడం విశేషం.
ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం ఇవ్వడంతో ఇ.యు విఫం అయిందని అందుకే తాము ఒప్పందం వాయిదా వేస్తున్నామని అధ్యక్షుడు విక్టర్ యనుకోవిక్ విలినియస్ చర్చల్లో స్పష్టం చేశాడు. ఈస్టన్ పార్లనర్ షిప్ శిఖరాగ్ర సమావేశా కోసం అనేక సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ఉక్రెయిన్ లాంఛనంగా ఇ.యులో చేరుతుందని అందరూ భావించారు. అందరి అంచనాను తారుమారు చేస్తూ ఇ.యు చేరికను వాయిదా వేస్తున్నట్లు సమావేశాకు వారం ముందు ఉక్రెయిన్ ప్రకటించడంతో అమెరికా, ఇయు షాక్ తిన్నాయి. రష్యా ఒత్తిడితోనే ఉక్రెయిన్ వెనక్కి వెళ్లిందని అవి ప్రకటించడంతో అమెరికా, ఇ.యు షాక్ తిన్నాయి. రష్యా ఒత్తిడితోనే ఉక్రెయిన్ వెనక్కి వెళ్లిందని అవి ఆరోపించాయి. నాగరిక ఐరోపా సమాజంలో చేరకపోవడం ద్వారా ఉక్రెయిన్ తప్పు చేసిందని ప్రశ్చిమ పత్రికులు గగ్గోు పెట్టాయి. అయితే ఇ.యు ప్రతిపాదించిన ఒప్పందంలోని షరతు చూస్తే ఉక్రెయిన్ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని అర్థం అవుతుంది. రష్యాకు సంవత్సరానికి 16 బిలియన్ డార్ల మేరకు ఉక్రెయిన్ ఎగుమతులు చేస్తుంది. యూరోపియన్ యూనియన్‌కు చేసే ఎగుమతులు 17 బిలియన్లని అంచనా. అయితే ఉక్రెయిన్` రష్యా మధ్య ఉండే చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు విడదీయలేనివి. ఇయులో చేరాంటే ఉక్రెయిన్ అనేక షరతును అమలు చేయాల్సి ఉంటుంది. నేమ్ బోర్డ్‌కు వాడే ఇనుప శిల దగ్గర్నుండి రైలు పట్టా వరకు సర్వం మార్చుకోవసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇ.యు చేరిక వల్ల ఉక్రెయిన్‌పై 33 బిలియన్ యూరో భారం పడుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.ఇంత భారం భరిస్తున్నా కేవం 1 బిలియన్ యూరోలు మాత్రమే సహాయం ఇవ్వడానికి ఇ.యు అంగీకరించింది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా తమ సరుకుతో ఉక్రెయిన్‌ను ముంచెత్తడానికి తద్వారా ఆర్థికంగా లాభం పొందడానికి ఇ.యు ప్రయత్నిస్తోంది. పైగా ఉక్రెయిన్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు శిక్ష పడి జైులో ఉన్న మాజీ అధ్యక్షురాలిని ‘వైద్య చికిత్స’ పేరుతో విడుద చేసి విదేశాలకు పంపాలని ఇ.యు షరతు విధించింది. ఈ షరతును ఉక్రెయిన్ పార్లమెంటు తిరస్కరించింది.
యూరోపియన్ యూనియన్‌లో చేరడం వన ఉక్రెయిన్‌కు జరిగే నష్టం.
ప్రస్తుతం ఇ.యుకు ఉక్రెయిన్ చేస్తున్న ఎగుమతు 17 బిలియన్ డాలర్లు. రష్యాకు చేసే ఎగుమతులు 16 బిలియన్ డాలర్లు. ఇ.యుతో ఒప్పందం చేసుకుంటే రష్యా ఎగుమతి మార్కెట్ మొత్తాన్ని ఉక్రెయిన్ కోల్పోతుంది. రష్యా మార్కెట్ మొత్తం కోల్పోతే ఉక్రెయిన్ 35 బిలియన్ యూరోలు నష్టపోతుందని రష్యా అంచనా. ఉక్రెయిన్ కార్ మార్కెట్‌లో 13 శాతం ఇ.యు నుండి దిగుమతి అవుతున్నాయి. ఇ.యు చేరిక వల్ల దిగుమతి ఇంకా పెరిగి స్వదేశీ ఉత్పత్తిదాయి తీవ్రంగా నష్టపోతారు. ప్రారంభంలో కొన్ని రక్షణలు ఇస్తామని ఇ.యు చెబుతున్నప్పటికీ ఆ తర్వాత ఎమిటనేది ఉక్రెయిన్ వెంటాడుతున్న ప్రశ్న. అంతే కాకుండా దేశీయ గ్యాస్ వినియోగదారు నుండి వసూలు చేసే ధరల్ని బాగా పెంచాని ఐ.ఏం.ఎఫ్ సిఫారసు చేసింది. గ్యాస్ సబ్సిడీ తగ్గించేసి ధరలు పెంచితే భవిష్యత్తులో గ్యాస్ మార్కెట్‌ని పశ్చిమ బహుళజాతి కంపెనీు ఆక్రమించే ప్రమాదం ఉంది. ఐ.ఎం.ఎఫ్‌కి పశ్చిమ దేశాలు అప్పగించిన పని ఇదే. అప్పుతో ఆదుకుంటునట్లు కనిపిస్తూ పశ్చిమ బహుళజాతి కంపెనీ మార్కెట్‌గా దేశాలను మార్చడం ఐ.ఎం.ఎఫ్ పని. ఇండియాలో ఐ.ఎం.ఎఫ్ అదే పని చేసింది ఋణ సంక్షోభం అడ్డం పెట్టుకుని ఐరోపాలోను అదే చేసింది. ఉక్రెయిన్‌లోనూ అదే చేయడానికి నడుం బిగించింది.
యూరోపియన్ ఎకనమిక్ యూనియన్ (ఇ.ఇ.యు)లో చేరడం వన ఉక్రెయిన్‌కు కలిగే లాభం:
ఉక్రెయిన్ ఇ.యుని కాదని రష్యా నేతృత్వంలోని కస్టమ్స్ యూనియన్ (2015 నుండి ఇ.ఇ.యు)లో సభ్యత్వం పొందితే మిలట్రీ సహకారం కూడా ఉంటుంది. ఇ.యు. ఒప్పందంలో ఇది లేదు.పొరుగున ఉన్న అర్మీనియా, తజకిస్తాన్, కిర్ఘిస్తాన్, బెలారస్ లాంటి దేశాలు ఇ.ఇ.యులో చేరుతున్నాయి. ఉక్రెయిన్ దానికి బదు ఇ.యులో చేరితే అది దాదాపు ఆత్మహత్యతో సమానం అని చెప్పవచ్చు. ఇ.యు సాహసర్యంలో నిరంతరం చస్తూ బతకడమే ఉక్రెయిన్‌కి మిగుతుంది. దీనితో పాటు ఇ.ఇ.యులో చేరితే రష్యాలోని నాలుగు ప్రధాన బ్యాంకు ఇచ్చిన 20 బిలియన్ డార్ల రుణానికి భద్రత ఉంటుంది. ఒత్తిళ్ళు ఉండవు.పైగా ఇ.ఇ.యుని కాదని రష్యా నుండి దూరం అయితే ఉక్రెయిన్ కొత్త గ్యాస్ సంబంధాల కోసం చూడాలి. అప్పుపెట్టి గ్యాస్ పొందే సౌకర్యం పోతుంది. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్‌తో గానీ, అమెరికాతో గానీ వాణిజ్య సంబంధాలు పెట్టుకుంటే, అది కూడా వారి షరతు మేరకు పెట్టుకుంటే పరిస్థితి అగ్రరాజ్యం చేతుల్లోకి వెళ్ళిపోతుందనే నేపధ్యంతో ఉక్రెయిన్ తాత్కాలికంగా ఇ.యులో చేరడానికి వెనకడుగు వేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి అది తాత్కాలికమే అయినా, మంచి నిర్ణయం. వచ్చే మార్చిలో ఇ.యులో చేరడానికి ఆమోదిస్తే కనుక ఆ దేశ ప్రజకు తీవ్ర నష్టకరం. ఇ.యు చేరికను ఉక్రెయిన్ ప్రజు వ్యతిరేకించాల్సిందిపోయి ఆహ్వానించడం సరికాదు. తమను నడిపిస్తున్న శక్తు నేరుగా నిప్పు కొలిమిలోకి తమను నడిపిస్తున్నాయని వారు గుర్తెరగాలి.
యూరోపియన్ యూనియన్, పశ్చిమ దేశాు భయపడటానికి కారణాలు:
ఉక్రెయిన్, ఇ.యు మధ్య మార్చి 2014లో మరో విడత చర్చలు జరగనున్నాయి. అప్పటికి యూరోసియన్ ఎకనామిక్స్ యూనియన్ ఏర్పాటులో బెలారస్, రష్యా, కజకిస్తాన్‌లు నిండా మునిగి ఉంటాయి. యూరోపియన్ యూనియన్‌కు ప్రత్యామ్నాయంగా రష్యా ముందుకు తెస్తున్న యూరేసియన్ ఎకనామిక్ యూనియన్‌కే ఇ.యు ప్రధానంగా భయపడుతోంది. ప్రస్తుతం రష్యా, కజకిస్తాన్‌తో కూడిన కస్టమ్స్ యూనియన్‌నే యూరోసియన్ ఎకనామిక్ యూనియన్‌గా రష్యా విస్తరిస్తోంది. ఇది గనుకు విజయవంతమైతే ఇ.యు, పశ్చిమ దేశా ఆర్థిక ఆధిపత్య విస్తరణ అవకాశాకు మూడినట్లే. మధ్య, పశ్చిమ అసియా దేశాను కుపుకోవడం ద్వారా రష్యాను ఒంటరిని చేసి లొంగ దీసుకోవాలన్న ఐరోపా, అమెరికా దురాలోచనకు ఈ కొత్త కూటమి మంగళం పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ప్రధానంగా ఇంధన (గ్యాస్, చమురు) వనరు రష్యాయే. మెజారిటీ రుణాు రష్యా ఇచ్చినవే. ప్రధాన వాణిజ్య భాగస్వామి రష్యాయే. అలాంటి రష్యాను దారికి తెచ్చుకునేందుకు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌ను మార్గంగా ఎంచుకున్నాయి. ఉక్రెయిన్‌ను ఇ.యులో చేర్చుకుంటే రష్యా నేతృత్వంలో నిర్మితం అవుతున్న యూరేసియన్ కూటమిని అడ్డుకోవచ్చన్నది పశ్చిమ దేశా పథకం. కానీ ఇ.యు ఎటువంటి ప్రతిఫం చూపకపోవడంతో ఇ.యులో చేరే ఒప్పందాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు యనుకోవిచ్ చివరి నిమిషంలో వాయిదా (కేవం వాయిదా మాత్రమే. రద్దుకాదు) చేసుకున్నాడు. ఆ మాత్రానికే ఉక్రెయిన్‌లో అజడు సృష్టించాయి అమెరికా, ఇయు. అమెరికా ఎంపిు, ఇ.యు అధికారులు అనేకమంది స్వయంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ వచ్చి ఆందోళనకారును రెచ్చగొడుతూ ప్రసంగాలు ఇచ్చారు. ఇంకా విధ్వంసం సృష్టించండి అని ప్రొత్సహిస్తూ తినడానికి, తాగడానికీ పోట్లాు పంచి వెళ్లారు. ఇపుడు వీళ్లకి
ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం గుర్తుకు రాలేదా?
ఇపుడు ఉన్న ప్రపంచ పరిస్థితుల్లో అమెరికా, ఇయు ఆధిపత్యాన్ని బహీనపరచడమే తక్షణ అవసరం. అందుకోసం ప్రపంచంలో వివిధ ప్రాంతీయ కూటము అవతరించి సొంత ప్రయోజనాల కోసం పాటుపడాలి. తద్వారా పశ్చిమ బహుళజాతి కంపెనీ మార్కెట్ దాహానికి అడ్డుకట్ట వేయాలి. మార్కెట్ దాహంతో తపించిపోతూ అడుగు పెట్టిన చోటల్లా విధ్వంసం సృష్టిస్తూ హింసాత్మక రాజకీయాలు నిర్వహిస్తూ, ప్రజాస్వామిక ఎన్నికల్లో నెగ్గిన ప్రభుత్వాను సైతం హింసాత్మకంగా కూలదోస్తూ ప్రపంచ శాంతికి భంగకరంగా మారిన పశ్చిమ దేశా (అమెరికా, ఇయు) ఆధిపత్యాన్ని నిువరించడం ఇప్పటి అవసరం. ఆ పని రష్యా చేసినా, చైనా చేసినా ఆహ్వానించాలి.
Subscribe to:
Post Comments
(
Atom
)


No comments :
Post a Comment