అస్తిత్వ సంక్షోభాల అంతరంగ ఘోషకు నోబెల్.
శతాబ్దానికి పైనున్న సాహిత్య నోబెల్ చరిత్రలో ఒక చైనీస్ రచయితను అది వరించడం ఇదే ప్రప్రథమం. 1901లో మొదటిసారి సాహిత్య రంగా నికి నోబెల్ బహుమతి ఇవ్వడం ప్రారంభించారు. మొదటిసారి ఈ అవార్డు ఫ్రెంచ్ కవి, తత్వవేత్త సుల్లీ ప్రూడోమిని వరించింది. సాహిత్యంలో నోబెల్ బహు మతి ఇవ్వడం వెనుక ఒక చిన్న చరిత్ర ఉంది. ధన వంతుడైన ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌కు మొదటినుంచి సాహి త్యమన్నా కళలన్నా చాలా ఇష్టం ఉండేది. నోబెల్ తన దగ్గర ఉన్న డబ్బు మానవాళికి తోడ్పడే రంగాలకు ఉపయోగ పడాలనే ఉద్దేశంతో 1895లో మానవాళి కి ఉపయోగ రంగాల్లో విశేషంగా కృషి చేసిన వారికి నోబెల్ బహుమతి ఇవ్వడం ప్రారంభించాడు. అయితే మొదటి నోబెల్ ప్రైజ్ భౌతిక, రసాయన శాస్త్రం, మెడిసిన్, శాంతి రంగాలకు మాత్రమే పరి మితమై ఉండేది. కానీ తదనంతరం దీన్ని సాహిత్య రంగాలకు కూడా ఇవ్వడం ప్రారంభించారు.
ఆ ్‌ఫ్రెడ్ నోబెల్‌కు సాహిత్యమంటే అభిమానం ఉండటం తో దానికి నోబెల్ బహుమతుల్లో నాలుగవ స్థానం కల్పించాడు. 2012 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ అందుకున్న మో యాన్ (57)1955లో తూర్పు మధ్య షాండాన్ ప్రావీన్స్‌లో జన్మించాడు. ఆయన అసలు పేరు గుయాన్ మోయె. 12 సంవత్సరాల వయసులో చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవంలో పాల్గొనడానికి తన చదువు కూడా మధ్యలోనే వదిలే శాడు. 1976లో పీపుల్స్ ఆర్మీలో చేరాడు. సాంస్కృ తిక విప్లవంలో పనిచేస్తూన్న కాలంలో అతనికి సాహిత్యం పట్ల అభిరుచి పెరిగింది. పీపుల్స్ లిబరేష న్ ఆర్మీలో కొనసాగుతూ ‘మో యాన్’ కలం పేరుతో రచనలు కొనసాగించాడు. మో యాన్ అంటే ‘మాట్లా డొద్దు’, ‘మౌనంగా ఉండడం’ అని అర్థం. మో యాన్ 1981 తన చిన్న కథలు ప్రారంభించాడు. తన తొలి నవల ‘వగరుబోతు’ ను సైైన్యంలో పని చేస్తూ రాశాడు. తన రెండో నవల ‘ఎర్ర జొన్న’ పలు అవార్డు లు అందుకోగా, తద నంతర కాలంలో సిని మాగా రూపొంది ప్రతిష్ఠాత్మక బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకున్నది.
తన రచనల్లో మో యాన్ ఎక్కువగా యవ్వన దశలో అనుభవించిన విషయాలను, అస్తిత్వ సంక్షో భాలను వ్యక్తం చేసేవాడు. తన నవలల్లో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఆదర్శవంతంగా జీవించిన పాత్రలకు ఆయన ఊపిరిపోశాడు. చైనాలోని ప్రాచీ న సాహిత్యాన్ని, జానపద గేయ సంప్రదాయాన్ని సమర్థవంతంగా వాడుకొని కాల్పనిక, చారిత్రక, సామాజిక రచనలు చేశాడు. మో తన రచనల్లో ఎక్కువగా జానపద సాంప్రదాయాన్ని అనుసరించ డంతో ఆయన జానపద మాంత్రికుడుగా మారిపో యాడు. అతనికి అనేక భాషలలో పాండిత్యం ఉండ డంతో ఇంగ్లీష్, చైనా, జర్మనీ, స్వీడీస్, ఫ్రెంచ్ భాషల్లో రచనలు కొనసా గించాడు. 2006లో ఇంగ్లీష్‌లో ‘లైఫ్ అండ్ డెత్ ఆర్ వేరింగ్ మీ అవుట్’ అనే రచన చేశాడు. ఈ రచనలో నల్లజాతి వాళ్ళ పట్ల సమాజం ఏవిధంగా ఎగతాళిని వ్యక్తం చేస్తుందో హృదయ విదారకరంగా రాశాడు.
హింసాత్మకత ఒక స్థాయి నుంచి ఇంకోస్థాయికి ఏ విధంగా మారుతుందో ఆయన ఆ రచనల్లో రాశాడు. అంతే కాకుండా చైనా లో ‘ఒక్క బిడ్డ’ విధానం అమలులోకి వచ్చిన తర్వాత దాని దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయం లో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు . అయితే చైనీస్ రచయిత గావో జింగ్జాన్‌కు 2000 సంవత్స రంలోనే నోబెల్ బహుమతి దక్కినా అతను ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి ఫ్రాన్స్‌కు వలసపో వడంతో ఆ అవార్డును కమ్యూనిస్టు దేశం తిరస్కరిం చింది. 2012కు సంబంధించి మో రచనా శైలి ‘భ్ర మాజనిత వాస్తవికత’ (హెలూసినేటరీ రియాలిజం) కు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి లభించింది.
సూర్య 16-10-12
ఆ ్‌ఫ్రెడ్ నోబెల్‌కు సాహిత్యమంటే అభిమానం ఉండటం తో దానికి నోబెల్ బహుమతుల్లో నాలుగవ స్థానం కల్పించాడు. 2012 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ అందుకున్న మో యాన్ (57)1955లో తూర్పు మధ్య షాండాన్ ప్రావీన్స్‌లో జన్మించాడు. ఆయన అసలు పేరు గుయాన్ మోయె. 12 సంవత్సరాల వయసులో చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవంలో పాల్గొనడానికి తన చదువు కూడా మధ్యలోనే వదిలే శాడు. 1976లో పీపుల్స్ ఆర్మీలో చేరాడు. సాంస్కృ తిక విప్లవంలో పనిచేస్తూన్న కాలంలో అతనికి సాహిత్యం పట్ల అభిరుచి పెరిగింది. పీపుల్స్ లిబరేష న్ ఆర్మీలో కొనసాగుతూ ‘మో యాన్’ కలం పేరుతో రచనలు కొనసాగించాడు. మో యాన్ అంటే ‘మాట్లా డొద్దు’, ‘మౌనంగా ఉండడం’ అని అర్థం. మో యాన్ 1981 తన చిన్న కథలు ప్రారంభించాడు. తన తొలి నవల ‘వగరుబోతు’ ను సైైన్యంలో పని చేస్తూ రాశాడు. తన రెండో నవల ‘ఎర్ర జొన్న’ పలు అవార్డు లు అందుకోగా, తద నంతర కాలంలో సిని మాగా రూపొంది ప్రతిష్ఠాత్మక బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకున్నది.
తన రచనల్లో మో యాన్ ఎక్కువగా యవ్వన దశలో అనుభవించిన విషయాలను, అస్తిత్వ సంక్షో భాలను వ్యక్తం చేసేవాడు. తన నవలల్లో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఆదర్శవంతంగా జీవించిన పాత్రలకు ఆయన ఊపిరిపోశాడు. చైనాలోని ప్రాచీ న సాహిత్యాన్ని, జానపద గేయ సంప్రదాయాన్ని సమర్థవంతంగా వాడుకొని కాల్పనిక, చారిత్రక, సామాజిక రచనలు చేశాడు. మో తన రచనల్లో ఎక్కువగా జానపద సాంప్రదాయాన్ని అనుసరించ డంతో ఆయన జానపద మాంత్రికుడుగా మారిపో యాడు. అతనికి అనేక భాషలలో పాండిత్యం ఉండ డంతో ఇంగ్లీష్, చైనా, జర్మనీ, స్వీడీస్, ఫ్రెంచ్ భాషల్లో రచనలు కొనసా గించాడు. 2006లో ఇంగ్లీష్‌లో ‘లైఫ్ అండ్ డెత్ ఆర్ వేరింగ్ మీ అవుట్’ అనే రచన చేశాడు. ఈ రచనలో నల్లజాతి వాళ్ళ పట్ల సమాజం ఏవిధంగా ఎగతాళిని వ్యక్తం చేస్తుందో హృదయ విదారకరంగా రాశాడు.
హింసాత్మకత ఒక స్థాయి నుంచి ఇంకోస్థాయికి ఏ విధంగా మారుతుందో ఆయన ఆ రచనల్లో రాశాడు. అంతే కాకుండా చైనా లో ‘ఒక్క బిడ్డ’ విధానం అమలులోకి వచ్చిన తర్వాత దాని దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయం లో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు . అయితే చైనీస్ రచయిత గావో జింగ్జాన్‌కు 2000 సంవత్స రంలోనే నోబెల్ బహుమతి దక్కినా అతను ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి ఫ్రాన్స్‌కు వలసపో వడంతో ఆ అవార్డును కమ్యూనిస్టు దేశం తిరస్కరిం చింది. 2012కు సంబంధించి మో రచనా శైలి ‘భ్ర మాజనిత వాస్తవికత’ (హెలూసినేటరీ రియాలిజం) కు ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి లభించింది.
సూర్య 16-10-12
అణు విలయానికి ఆహ్వానమా?
ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైన, ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపే, పర్యావరణాన్ని కాలుష్యంతో నింపివేసే అణువిద్యుత్ కేంద్రాల నిర్మాణాలను నిరసిస్తూ ప్రపంచ వ్యాపితంగానూ ముఖ్యంగా మన దేశంలోనూ వ్యతిరేకత, ఆందోళనలు పెద్దఎత్తున వ్యక్తమౌతున్నాయి. గత సంవత్సరం మార్చినెలలో జపాన్ దేశంలో సంభవించిన సునామీ, భూకంపాలకు దైచీ అణువిద్యుత్ కేంద్రంలో సంభవించిన వినాశనం ప్రపంచ ప్రజలను ఉలిక్కిపడేట్లు చేసింది. దీనితో అన్ని దేశాలలోనూ అణవిద్యుత్ వ్యతిరేక నిరసనాందోళనలు తీవ్రమయ్యాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాపితంగా 30 దేశాల్లో 443 అణురియాక్టర్లు విద్యుదుత్పత్తి సాగిస్తుండగా పుకిషిమాలోని అణువిద్యుత్తు కేంద్రాలలోని పరిణామాల అనంతరం వివిధ దేశాలలోని ప్రజల ఆందోళనల ఫలితంగా ఈ కేంద్రాలలో కొన్నింటి మూసివేతలు, మరికొన్నింటి పాక్షిక మూసివేతలు, మొత్తంగా సమగ్ర సమీక్షలకు సిద్దమౌతున్నాయి. దేశ భద్రతను సైతం నడివీధిలో వేలం వేయటానికి సిద్ధపడిన మన పాలకులు మాత్రం మన దేశంలో అణువ్యవస్థ దుర్భేద్యమైనదని ఢంకా బజాయిస్తున్నారు. ఇందుకు పూర్వరంగం అమెరికాతో సహకార అణు ఒప్పందం; అణు ప్రమాద నష్టపూరిత చట్టాలను నిండు పార్లమెంటులో నిస్సంకోచంగా ఆమోదించుకోవటంలో వివిధ పాలక వర్గ పార్టీలన్నీ 'చేయి' కలిపాయి. తదనుగుణంగా వాటి నిర్మాణాలకు పాలకులు వేగిరపడుతున్నారు.
మనదేశంలో 1960లో నిర్మించిన తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం మొదలుకొని ఇప్పటికి మొత్తంగా ఆరు అణు విద్యుత్ కేంద్రాలలో 20 అణు రియాక్టర్ల ద్వారా 4780 మెగావాట్ల విద్యుదుత్పాదన జరుగుతున్నది. ఇంకా, మహారాష్ట్రలోని జైతాపూర్ (9900 మె.వా) హర్యానాలోని గోరఖ్‌పూర్ (2800 మె.వా), గుజరాత్‌లోని మిథివిర్ధి (6000 మె.వా), మధ్యప్రదేశ్‌లోని ఛుట్కా (1400 మె.వా), ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడ (6000 మె.వా) తమిళనాడులోని కూడంకుళం (9200 మె.వా) అణువిద్యుత్ కేంద్రాలు నిర్మాణంలో వివిధ దశలలో నుండగా, మరికొన్ని అణు విద్యుత్ కేంద్రాలు ప్రతిపాదనల దశలో వున్నాయి. ప్రజల నిరసన, ఆందోళనల నేపథ్యంలో ఇటీవల పక్షిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం 4800 మె.వా స్థాపిత స్థామర్థ్యంతో తూర్పు మిడ్నపూర్ జిల్లా హరిపూర్‌లో నిర్మించ తలపెట్టిన అణువిద్యుత్ కేంద్రాన్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించింది.
ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని కుడంకుళం అణు విద్యత్ కేంద్రానికి వ్యతిరేకంగా సాగుతున్న నిరసన ఆందోళనలు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో తొలిదశ నిర్మాణం పూర్తిచేసుకున్నది. తిరునెల్వేలి జిల్లాలోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఒప్పందం భారత రష్యా ప్రధాన మంత్రుల మధ్య 1988లో జరిగింది. తొలుత ఈ విద్యుత్ కేంద్రాన్ని కేరళ తీరంలో నెలకొల్పాలని ప్రయత్నించినారు కానీ, ప్రజావ్యతిరేకత, ప్రతిఘటనల ఫలితంగా 2003 నాటికి తమిళనాడు తీరంలోని కూడంకుళంలో చివరికి ఖాయం చేశారు.
ఈ అణు విద్యుత్ కేంద్రం పట్ల తమిళనాడులోనూ ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని తిరునెల్వేలి, కన్యాకూమారి, తూత్తుకుడి జిల్లాల ప్రజానీకం, వివిధ ప్రజాసంఘాలు ఆదినుండీ తమ భయాందోళనలను, వ్యతిరేకతను వ్యక్తంచేస్తూ వస్తున్నప్పటికీ వాటిని బేఖాతరుచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అణువిద్యుత్ కేంద్ర తొలిదశ నిర్మాణాలను కొనసాగించి పూర్తిచేశాయి. 13,700 కోట్ల వ్యయం అంచనాతో నిర్మిస్తున్న ఈ అణు విద్యుత్ కేంద్రంలో 1000 మె.వా సామర్థ్యంతో రెండు యూనిట్ల నిర్మాణం దాదాపు పూర్తికావస్తున్నది. మరో ఆరు యూనిట్ల నిర్మాణం జరగవలసివుంది. ఈ సంవత్సరం డిసెంబర్‌లో మొదటి యూనిట్‌లో విద్యుదుత్పాదనకు ఎస్.పి.సి.ఎల్ సన్నాహాలలో వుంది.
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) ఆధ్వర్యంలో నిర్మాణమవుతున్న కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని తమిళనాడు రాష్ట్రంలోని అధికార ఎఐడిఎమ్‌కె, ప్రతిపక్ష డిఎంకె పార్టీలతో సహా ఇతర పాలక వర్గ పార్టీలన్ని స్వాగతించినవే, సానుకూలంగా వ్యవహరించినవే! తమిళనాడులో అధికారంలోనున్న ఎఐడిఎంకె పార్టీ అధినాయకురాలు జయలలిత ఈ అణువిద్యుత్ కేంద్ర నిర్మాణంలో అన్ని రకాలైన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లూ; ఈ ప్రాంతం 'భూకంప మండలం-2' లో వున్న కారణంగా భూకంపాలకు గురయ్యే ప్రమాదం లేదనీ, నిశ్చితంగా వుండవచ్చుననీ ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు కూడా! అయినప్పటికీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు, ఆందోళన కొనసాగింది.
జపాన్‌లోని పుకిషిమా అణువిద్యుత్ కేంద్ర విషాద పరిణామాల తర్వాత దేశంలో నిర్మాణంలోవున్న అణువిద్యుత్ కేంద్రాలన్నింటితోపాటు కూడంకుళం అణు విద్యుత్ కేంద్ర ప్రాంతంలోనూ మరింత ఆందోళన అధికమైంది. 'అణు విద్యుత్ కేంద్ర వ్యతిరేక పోరాట కమిటీ'గా ఏర్పడిన ఈ ప్రాంత ప్రజానీకం ఆగస్టు 15 నాటికే వివిధ గ్రామ సభలు జరిపి, తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. విజ్ఞప్తులు, ధర్నాలు, నిరసనలు ప్రకటించారు. సెప్టెంబర్‌లో వారి ఆందోళనను తీవ్రతరం చేశారు. అణు విద్యుత్ కేంద్ర ప్రభావిత ప్రాంతంలోని వివిధ గ్రామాలకు ప్రాతినిధ్యం వహించే 127 మంది ఆందోళన కారులు అణు విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కూడంకుళం సమీపంలోని ఇందితకరాయ్ గ్రామంలో సామూహిక నిరవధిక నిరాహారదీక్ష చేబూని 12 రోజుల పాటు సాగించారు. ఈ ఆందోళనలు సాగిన కాలమంతటా తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాలో విద్యాసంస్థలను బహిష్కరించి విద్యార్థులు ఈ ఆందోళనల్లో భాగస్వాములయ్యారు. ఈ జిల్లాల మత్య్సకారులు తమ జీవనోపాధి అయిన చేపలవేటను ప్రక్కనబెట్టి అణువిద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కుల, మతాతీతంగా ప్రజలంతా ఒక్క గొంతుతో ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఆందోళనకారులతో కూడిన వివిధ ప్రజాసంఘాల, పార్టీల ప్రతినిధి బృందం అక్టోబర్ 7వ తేదీన ప్రధానిని కలిసి అణువిద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలనే తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం పట్ల కేంద్ర ప్రభుత్వం నిశ్చయాత్మకంగా వుండటంతో 'పోరాట సమితి' తన ఆందోళనను ఆక్టొబర్ 9 నుండీ తిరిగి ప్రారంభించి ఉదృతం చేసింది. అక్టోబర్ 13 నుండి కుడంకుళం అణువిద్యుత్ కేంద్రంలో పనులేవి సాగనివ్వకుండా, బయటనుండి కార్మికులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఎవ్వరినీ లోనికి వెళ్ళనీయకుండా దిగ్భందించారు. రోజుల తరబడి ప్రజలు వంతులవారిగా రేయింబవళ్ళూ అణువిద్యుత్ కేంద్రానికి దోవతీసే రోడ్లన్నింటిపై బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఒక వైపు ప్రపంచ వ్యాపితంగా ప్రమాదకరమైన అణువిద్యుత్‌కు వ్యతిరేకంగా ప్రజానీకం అందోళనలు నిర్వహిస్తుంటే భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాత్రం అణువిద్యుత్‌ను స్వాగతిస్తూ మాట్లాడడం దేశ ప్రజానీకాన్ని విస్మయానికి గురిచేసింది. అబ్దుల్ కలాం కుడంకుళం ప్లాంటును సందర్శించి ప్రభుత్వం తరపునా, కంపెనీ తరపునా వకాల్తా పుచ్చుకుని ప్లాంటులో భద్రతా ఏర్పాట్లు భేషుగ్గా ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చాడు. సమస్త భద్రతా అంశాలను పరిగణలోని తీసుకుని ప్లాంటు నిర్మిస్తున్నారని, ప్లాంటు భూకంప కేంద్ర పాయింటుకు 1300 కి.మీ దూరంలో, సముద్ర మట్టానికి 13.5 మీటర్ల ఎత్తులో ఉందని, ప్లాంటుకు సంబంధించిన భద్రత విషయంలో ఆందోళన అనవసరమని సెలవిచ్చాడు.
జపాన్‌లో భూకంపాలు సహజం. కనుక భూకంపం తట్టుకునేలా ప్లాంటు నిర్మించారు. సునామీని తట్టుకోవడానికి పది మీటర్ల ఎత్తున రక్షణ గోడ నిర్మించారు కానీ సునామి అలలు ఇరవై మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. పుకుషిమా వద్ద విద్యుత్ సరఫరా విఫలమైతే ఆటోమేటిక్‌గా ప్రారంభమయ్యే జరరేటర్లు ఉన్నాయి భూకంపం వచ్చిన వెంటనే ప్లాంటు పనిచేయకుండా ఆగిపొయ్యే ఏర్పాట్లు ఉన్నాయి అయినా పెద్ద ప్రమాదం సంభవించింది. సునామీ అలల ద్వారా వచ్చిన సముద్రనీటిలో జనరేటర్లు నిండా మునిగిపోవడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడలేదు. దానితో కూలింగ్ వ్యవస్థ పని చేయడం మానేసింది. ఫలితంగా రియాక్టర్లలో ఇంధనం వేడెక్కి కరిగిపోయి బైటికి లీకు కావడంతో పెద్ద ఎత్తున రేడియేషన్ వాతావరణంలోకి విడుదలయింది. కుడంకుళం వద్ద ఏ కారణం వల్లనైనా విద్యుత్ సరఫరా ఆగిపోతే జనరేటర్లు ఉన్నాయని కలాం తెలిపాడు. జనరేటర్లు మహా అయితే కొద్ది గంటలపాటు మాత్రమే విద్యుత్ అందిస్థాయి తప్ప నిరంతరాయంగా సూదీర్ఘకాలం పాటు విద్యుత్ అందించలేదు. ఆ తర్వాత ఏమిటన్నది సమాధానం లేదు. ''అంతా సవ్యంగా ఉంది'' అని భరోసా ఇవ్వడం వేరు నిజంగానే అంతా సవ్వంగా ఉండటం వేరు అని పుకిషిమా ప్రమాదం తెలియజెప్పింది పుకిషిమా అణు విద్యుత్ ప్లాంటును పనిచేయకుండా చేసి, పూడ్చిపెట్టి, పరిసరాలు శుభ్రం చేయడానికి కనీసం 30 సంవత్సరాలు పడుతుందని జపాన్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. కుడంకుళం వద్ద సైతం అనుకోని ప్రమాదాలు సంభవించవన్న గ్యారంటి లేదు. మన కన్నా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో ముందంజ సాధించిన జర్మనీయే అణు విద్యుత్ వల్ల ప్రమాదం లేదని గ్యారంటీ ఇవ్వలేక అణువిద్యుత్ వినియోగాన్ని రద్దు చేసుకోగా అంతకంటే మెరుగైన వ్యవస్థలు ఇండియా వద్ద ఉన్నాయని భావించగలమా?
ప్రపంచ దేశాల 'వెనకడుగు' - భారత పాలకుల బరితెగింపు:
ప్రమాదరహితంగా అణువిద్యుత్ కేంద్రాల నిర్వహణ సాధ్యంకాదనే విషయాన్ని మనదేశంతో సహా వివిధ ప్రపంచ దేశాల్లో సంభవించిన ప్రమాదాలు నిర్వివాదంగా రుజువుచేస్తున్నాయి. 1984లో రష్యాలోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రేలుడులో వేలాదిమంది మృత్యువాతపడగా, దాని నుండి వెలువడిన అణుధార్మిక దుష్పలితాలను ఆ దేశ ప్రజలు ఈనాటికీ అనుభవిస్తున్నారు. అనాటి నుండి మొదలుకొని, ఈ సంవత్సరం పుకిషిమా అణువిద్యుత్ కేంద్ర విలయం వరకు అణువిద్యుత్ కేంద్ర ప్రమాదాల జాబితా చాలా పెద్దదే వుంది. వీటి ఫలితంగా అనాటికి జరిగినే ప్రాణ, ఆస్థి నష్టమేకాక, వాటినుండి వెలువడే అణుధార్మికతతతో ఈనాడేకాగ రానున్న తరాలుకూడా తీవ్ర దుష్బ్రభావాలు ఎదుర్కొనున్నాయి. పుకుషిమా అణువిద్యుత్ కేంద్ర వినాశనం అనంతరం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఎఐఇఏ) నిపుణుల బృందంతో నిర్వహించిన అధ్యయనంలో సునామీలాంటి
ఉత్పాతాల్ని సమర్థంగా కాచుకునే వ్యవస్థ ఇప్పటికింకా ఏర్పాటు కాలేదని తేల్చిచెప్పింది. సునామీ, భూకంపాలవంటి ఉత్పాతాలు సంభవించినపుడు తక్షణ నిర్ణయాలు తీసుకోలేని సంక్లిష్ట అధికార వ్యవస్థలు అవరోధంగా మారాయని తన నివేధికలో పేర్కొంది.
పుకిషిమా ఘోర పరిణామాలనంతరం జపాన్, తన దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలన్నింటినీ పునస్సమీక్ష చేయాలని నిర్ణయించింది. 2022 నాటికి జర్మనీ, తన దేశంలోని అణు విద్యుత్ కేంద్రాలన్నింటినీ మూనివేయాలని, 2034 నాటికి దశలవారిగా స్విట్జర్లాండ్ తమ దేశంలోని అణు విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా ఆపివేయాలని నిర్ణయించుకోగా, అణువిద్యుత్ కేంద్రాల నిర్వహణపై ఇటలీలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలంతా వాటి రద్దునుకోరుతూ తీర్పునిచ్చారు. ఈ పరిణామాలనంతరం జపాన్ సైతం అణువిద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నది. సెప్టెంబర్ 19న జపాన్ రాజధాని టోక్యోలో 'అణువిద్యుత్‌కు వీడ్కోలు పలకండంటూ'' 60 వేల మంది పౌరులు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు.
వివిధ రంగాలలో ప్రపంచాలనే శాసించే అభివృద్ధిని సాధించామంటున్న అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర సామ్రాజ్యవాద దేశాలన్నీ తమతమ దేశాలలోని అణువిద్యుత్ కేంద్రాలలో సంభవించే ప్రమాదాలనే నివారించలేక చేతులెత్తివేస్తూండటాన్ని మనం గమనించవచ్చు. ఆయా దేశాలలో వీటిపట్ల ప్రజలనుండి వ్యక్తమౌతున్న వ్యతిరేకతల కారణంగా అవి తమ దేశంలోని అణువిద్యుత్ కేంద్రాల మూసివేతలకో, పాక్షిక మూసివేతలకో, పునస్సమీక్షలకో పూనుకుంటూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారిస్తున్నాయి. అత్యున్నత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నామన్న దేశాలే కల్పించలేని భద్రతను అణువిద్యుత్ కేంద్రాల విషయంలో మన పాలకులు తాము కల్పిస్తామనటం ప్రగల్భాలాలు పలకటమేకాదు. ప్రజలను నిలువుగా వంచించటమే.
ఈ నేపథ్యంలో మనదేశ ప్రజల అవసరాల కనుగుణమైన దేశీయ విద్యుత్ విధానాన్ని రూపొందించాలని, దేశ ప్రజల జీవితాలలో పెను విషాదాన్ని నింపే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణం సాగిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని నిలిపివేయాలని, మన దేశంలో లభ్యమయ్యే ప్రమాద రహితమైన జల,వాయు, సూర్యరశ్మి, గ్యాస్ తదితర వనరులపై అధారపడి విద్యుత్ అవసరాలను అందుకోవాలని విద్యుత్‌ను ప్రజా అవసరాలకు రైతాంగాని, దేశీయ పరిశ్రమలకు ప్రాధాన్యతా క్రమంలో అందించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు, ప్రజాతంత్ర వాదుల, దేశభక్తియుత శక్తులు ఉద్యమించాల్సిన అవసరం ఉంది.
సూర్య 09-10-2012దండకారణ్యంలో యుద్దం
సోవియట్ రష్యా పతనం, జర్మనీ ఏకీకరణ పెట్టుబడిదారీ పంథా విజయపరంపరకు గీటురాళ్లుగా నిలిచాయి. కమ్యూనిజం లేదా మార్క్సిస్టు లెనినిస్టు పంథా లేదా భావజాలానికి ఇక మనుగడ లేదని క్యాపిటలిస్టు సామ్రాజ్యవాద సమర్థకులు గట్టిగా వాదించడం మొదలుపెట్టారు. మాస్ మీడియా వారి వాదనలకు విపరీతమైన ప్రచారం కల్పించింది. ఈ సమాంతర చరిత్రలో నక్సల్బరీ ఉద్యమాన్ని విశ్లేషించవలసిన అవసరం ఉంది.భారతదేశ వామపక్ష ఉద్యమ చరిత్రలో అనేక సంక్షోభాలు తలెత్తాయి. వాటిలో మొదటిది 1964లో భారతీయ కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన చీలిక. సిపిఐ రివిజనిస్టు పంథాను నిరసిస్తూ పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో ఏర్పడిన చీలిక వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు)గా అవతరించింది. మార్క్సిస్టు పార్టీలో జరిగిన భావజాల సంఘర్షణ 1967 నాటికి పతాక స్థాయికి చేరుకుంది.
చారూ మజుందార్, కానూ సన్యాల్ తదితరులు సాయుధ విప్లవ పోరాటం వెైపు మొగ్గు చూపారు. పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరీలో ప్రారంభమైన ఈ సాయుధ ప్రతిఘటన నక్సల్బరీ ఉద్యమంగా ప్రఖ్యాతి గాంచింది. అనతికాలంలోనే ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. బెంగాల్‌లో ఉద్యమం నీరుగారి పోయింది. 1969 శ్రీకాకుళ రెైతాంగ సాయుధ పోరాటం చారిత్రక ఘటనగా మిగిలిపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం కోసం 1969లో జరిగిన పోరాటంలోనూ నక్సలెైట్లు క్రియాశీల పాత్ర పోషించారు. ఆంధ్రతో సమానంగా బీహార్‌లోనూ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసిసి) దళితులు, వెనుకబడిన తరగతుల వారి సహాయంతో బలపడింది. 1970 దశకంలో ఆంధ్ర నక్సల్ ఉద్యమం క్రమంగా విస్తరించింది. 1975 ఎమర్జెన్సీ కాలంలో నక్సల్ ఉద్యమంపెై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేరళలో రాజన్ ఎన్‌కౌంటర్ కేసు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కబళించింది. ఎన్‌కౌంటర్ల విధానం అన్ని రాష్ట్రాలలో సర్వసాధారణ మైపోయింది.
ఎమర్జెన్సీ అనంతర కాలంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో నక్సల్ ఉద్యమం తనవ్యూహాన్ని మౌలికంగా మార్చుకుంది.తర్వాత సిపిఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ గ్రూప్‌ను స్థాపించారు.
ప్రజాసంఘాల ఉద్యమ కార్యకలాపాల కంటే సాయుధ దళాల ఏర్పాటుపెైనే దృష్టి సారించారు. దీని కారణంగా ప్రజాక్షేత్రంలో ఉద్యమ సంఘాల ప్రభావం క్షీణించింది.1980 దశకంలో పీపుల్స్ వార్ క్రమంగా ప్రజా మద్దతును కోల్పోయింది. మరోవెైపు రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక బలగాలను మోహరించి సాయుధ దళాలను నిర్వీర్యం చేశాయి. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. అనంతరం ఆంధ్రలోని కాంగ్రెస్ ప్రభుత్వం పీపుల్స్‌వార్‌పెై నిషేధం విధించింది. తెలంగాణ నుండి తరలిపోయి అప్పటి మధ్యప్ర దేశ్‌లోని దంతేవాడ ప్రాంతంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న నక్సలెైటు ఉద్యమ నాయకులు స్థానిక పోరాటాలతో గిరిజనులలో తమ పట్టు పెంచుకున్నారు. బహుళ జాతి సంస్థలు, మైనింగ్ కంపెనీలు, భారీ విద్యుత్, నీటిపారుదల ప్రాజెక్టులతో తమ భూములను, ఇళ్లను కోల్పోతామని ఆందోళనచెందిన గిరిజనులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకున్నారు. వీరికి సాయుధ నక్సల్ దళాలు రాజకీయ నాయకత్వం వహించాయి.
మహారాష్ర్ట, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ (ఇక్కడ ఎంసిసి రూపంలో), కర్ణాటక, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో నక్సల్ ఉద్యమం త్వరితగతిన విస్తరించింది.
2004 నాటికి బీహార్, జార్ఖండ్, తదితర ప్రాంతాలలో పట్టు కలిగిన ఎంసిసి, దేశంలోనే ప్రధాన విప్లవ పార్టీ అయిన సిపిఐఎంఎల్ పీపుల్స్‌వార్‌లు విలీనమై సిపిఐ (మావోయిస్టు)గా అవతరించాయి. 2009 ఆగస్టులో కేంద్ర బలగాల నాయకత్వం, బెంగాల్ సాయుధ పోలీసులు లాల్‌గఢ్ గిరిజనులపెై నిర్బంధకాండను మొదలుపెట్టాయి. మావోయిస్టులఏరివేత పేరుతో అమాయక గిరిజన యువకుల తోపాటు మహిళలను సైతం తీవ్రఅత్యా చారాలకు గురిచేశారు. ఈ క్రమంలోనే సిపిఎం ముఖ్య కార్యకర్తలను మావోయి స్టులు ముట్టబెట్టడం మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు, భావజాలం వ్యాప్తి చెందుతుండడం, వాటికి అడ్డుకట్ట వేయడంలో ఆయా రాష్ట్రాలు విఫలం కావడం తో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది.
ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో చత్తీస్‌గఢ్ రాష్ర్టంలో కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన భీకర పోరులో 76 మంది మృతి చెందారు. అయితే కేంద్ర బలగాలకు కోలుకోలేని దెబ్బతగలడంతో ఐదు రోజులకే ఈ ఆపరేషన్‌ను ముగించారు. పారామిలిటరీ దళాల జవాన్లు వందల సంఖ్యలో మృత్యువాతపడ్డా ఈ సమాచారాన్ని కేంద్ర హోం శాఖ బహిరంగంగా వెల్లడించ లేదు. దీనికి తోడు మహారాష్ర్ట గడ్చిరోలీ జిల్లాలో అక్టోబరు 8న మావోయిస్టు పార్టీ కేంద్ర బలగాలపెై దాడి చేసి 27 జవాన్లను హతమార్చి విలువెైన ఆయుధసామాగ్రిని పట్టుకెళ్లింది. ఆంధ్ర సరిహద్దుల్లో కూడా 2008లో బలిమెర్ల వద్ద మావోయిస్టులు గ్రేహౌండ్స్ దళాలపెై ఇదే విధంగా దాడి చేసి 57 మంది జవాన్లను బలితీసుకు న్నారు.
అప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పెద్ద సంఘటనలు జరగకపోయినా 2009 మే 24న మావోయిస్టు సాయుధ వ్యూహకర్త పటేల్ సుధాకర్‌రెడ్డి వరంగల్ జిల్లా లవ్వాల గ్రామంలో ఎన్‌కౌంటర్‌కు గురి కావడంతో మావోయిస్టులు దేశవ్యాప్తంగా హింసకు పాల్పడ్డారు.
మహారాష్ర్ట, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బెంగాల్ తదితర రాష్ట్రాలలో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. అక్టోబరు 2009 నాటికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని దేశ భద్రతకు ఎదురవుతున్న గొప్ప సవాలుగా ప్రకటించింది. మేధావుల విజ్ఞప్తితో ఆయుధాల మాట పక్కన పెట్టి హింసను ఆపాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మావోయిస్టులను కోరారు. హింసను ఆపితేనే చర్చలకు అవకాశం ఉంటుందని హోం మంత్రి స్పష్టం చేశారు.మరోవెైపు మహారాష్ర్ట, ఒరిస్సా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్- బెంగాల్‌లోని లాల్‌గఢ్‌ల లో కేంద్ర బలగాలు మావోయిస్టు ఏరివేత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.
ఈ పోరాటంలో వందలాది మంది అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతు న్నారు. వేలాది మంది రోజూ ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మావోయిస్టులను ఏరివేసిన తర్వాతే అభివృద్ధి ప్రకియను చేపడతామని కేంద్రప్రభుత్వం వాదిస్తోంది. ప్రజా పునాదిని పెంచుకొంటూ దేశవ్యాప్తంగా విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సర్వశక్తులు ఒడుతున్న మావోయిస్టు ఉద్యమం ఒకవెైపు, రాజ్య గుత్తాధికారాన్ని బలంగా చాటాలని తహతహలాడుతున్న
చారూ మజుందార్, కానూ సన్యాల్ తదితరులు సాయుధ విప్లవ పోరాటం వెైపు మొగ్గు చూపారు. పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరీలో ప్రారంభమైన ఈ సాయుధ ప్రతిఘటన నక్సల్బరీ ఉద్యమంగా ప్రఖ్యాతి గాంచింది. అనతికాలంలోనే ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. బెంగాల్‌లో ఉద్యమం నీరుగారి పోయింది. 1969 శ్రీకాకుళ రెైతాంగ సాయుధ పోరాటం చారిత్రక ఘటనగా మిగిలిపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం కోసం 1969లో జరిగిన పోరాటంలోనూ నక్సలెైట్లు క్రియాశీల పాత్ర పోషించారు. ఆంధ్రతో సమానంగా బీహార్‌లోనూ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసిసి) దళితులు, వెనుకబడిన తరగతుల వారి సహాయంతో బలపడింది. 1970 దశకంలో ఆంధ్ర నక్సల్ ఉద్యమం క్రమంగా విస్తరించింది. 1975 ఎమర్జెన్సీ కాలంలో నక్సల్ ఉద్యమంపెై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేరళలో రాజన్ ఎన్‌కౌంటర్ కేసు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కబళించింది. ఎన్‌కౌంటర్ల విధానం అన్ని రాష్ట్రాలలో సర్వసాధారణ మైపోయింది.
ఎమర్జెన్సీ అనంతర కాలంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో నక్సల్ ఉద్యమం తనవ్యూహాన్ని మౌలికంగా మార్చుకుంది.తర్వాత సిపిఐ (ఎంఎల్) పీపుల్స్ వార్ గ్రూప్‌ను స్థాపించారు.
ప్రజాసంఘాల ఉద్యమ కార్యకలాపాల కంటే సాయుధ దళాల ఏర్పాటుపెైనే దృష్టి సారించారు. దీని కారణంగా ప్రజాక్షేత్రంలో ఉద్యమ సంఘాల ప్రభావం క్షీణించింది.1980 దశకంలో పీపుల్స్ వార్ క్రమంగా ప్రజా మద్దతును కోల్పోయింది. మరోవెైపు రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక బలగాలను మోహరించి సాయుధ దళాలను నిర్వీర్యం చేశాయి. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. అనంతరం ఆంధ్రలోని కాంగ్రెస్ ప్రభుత్వం పీపుల్స్‌వార్‌పెై నిషేధం విధించింది. తెలంగాణ నుండి తరలిపోయి అప్పటి మధ్యప్ర దేశ్‌లోని దంతేవాడ ప్రాంతంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న నక్సలెైటు ఉద్యమ నాయకులు స్థానిక పోరాటాలతో గిరిజనులలో తమ పట్టు పెంచుకున్నారు. బహుళ జాతి సంస్థలు, మైనింగ్ కంపెనీలు, భారీ విద్యుత్, నీటిపారుదల ప్రాజెక్టులతో తమ భూములను, ఇళ్లను కోల్పోతామని ఆందోళనచెందిన గిరిజనులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకున్నారు. వీరికి సాయుధ నక్సల్ దళాలు రాజకీయ నాయకత్వం వహించాయి.
మహారాష్ర్ట, ఒరిస్సా, జార్ఖండ్, బీహార్ (ఇక్కడ ఎంసిసి రూపంలో), కర్ణాటక, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో నక్సల్ ఉద్యమం త్వరితగతిన విస్తరించింది.
2004 నాటికి బీహార్, జార్ఖండ్, తదితర ప్రాంతాలలో పట్టు కలిగిన ఎంసిసి, దేశంలోనే ప్రధాన విప్లవ పార్టీ అయిన సిపిఐఎంఎల్ పీపుల్స్‌వార్‌లు విలీనమై సిపిఐ (మావోయిస్టు)గా అవతరించాయి. 2009 ఆగస్టులో కేంద్ర బలగాల నాయకత్వం, బెంగాల్ సాయుధ పోలీసులు లాల్‌గఢ్ గిరిజనులపెై నిర్బంధకాండను మొదలుపెట్టాయి. మావోయిస్టులఏరివేత పేరుతో అమాయక గిరిజన యువకుల తోపాటు మహిళలను సైతం తీవ్రఅత్యా చారాలకు గురిచేశారు. ఈ క్రమంలోనే సిపిఎం ముఖ్య కార్యకర్తలను మావోయి స్టులు ముట్టబెట్టడం మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు, భావజాలం వ్యాప్తి చెందుతుండడం, వాటికి అడ్డుకట్ట వేయడంలో ఆయా రాష్ట్రాలు విఫలం కావడం తో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది.
ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో చత్తీస్‌గఢ్ రాష్ర్టంలో కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన భీకర పోరులో 76 మంది మృతి చెందారు. అయితే కేంద్ర బలగాలకు కోలుకోలేని దెబ్బతగలడంతో ఐదు రోజులకే ఈ ఆపరేషన్‌ను ముగించారు. పారామిలిటరీ దళాల జవాన్లు వందల సంఖ్యలో మృత్యువాతపడ్డా ఈ సమాచారాన్ని కేంద్ర హోం శాఖ బహిరంగంగా వెల్లడించ లేదు. దీనికి తోడు మహారాష్ర్ట గడ్చిరోలీ జిల్లాలో అక్టోబరు 8న మావోయిస్టు పార్టీ కేంద్ర బలగాలపెై దాడి చేసి 27 జవాన్లను హతమార్చి విలువెైన ఆయుధసామాగ్రిని పట్టుకెళ్లింది. ఆంధ్ర సరిహద్దుల్లో కూడా 2008లో బలిమెర్ల వద్ద మావోయిస్టులు గ్రేహౌండ్స్ దళాలపెై ఇదే విధంగా దాడి చేసి 57 మంది జవాన్లను బలితీసుకు న్నారు.
అప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పెద్ద సంఘటనలు జరగకపోయినా 2009 మే 24న మావోయిస్టు సాయుధ వ్యూహకర్త పటేల్ సుధాకర్‌రెడ్డి వరంగల్ జిల్లా లవ్వాల గ్రామంలో ఎన్‌కౌంటర్‌కు గురి కావడంతో మావోయిస్టులు దేశవ్యాప్తంగా హింసకు పాల్పడ్డారు.
మహారాష్ర్ట, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బెంగాల్ తదితర రాష్ట్రాలలో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. అక్టోబరు 2009 నాటికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని దేశ భద్రతకు ఎదురవుతున్న గొప్ప సవాలుగా ప్రకటించింది. మేధావుల విజ్ఞప్తితో ఆయుధాల మాట పక్కన పెట్టి హింసను ఆపాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మావోయిస్టులను కోరారు. హింసను ఆపితేనే చర్చలకు అవకాశం ఉంటుందని హోం మంత్రి స్పష్టం చేశారు.మరోవెైపు మహారాష్ర్ట, ఒరిస్సా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్- బెంగాల్‌లోని లాల్‌గఢ్‌ల లో కేంద్ర బలగాలు మావోయిస్టు ఏరివేత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.
ఈ పోరాటంలో వందలాది మంది అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతు న్నారు. వేలాది మంది రోజూ ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మావోయిస్టులను ఏరివేసిన తర్వాతే అభివృద్ధి ప్రకియను చేపడతామని కేంద్రప్రభుత్వం వాదిస్తోంది. ప్రజా పునాదిని పెంచుకొంటూ దేశవ్యాప్తంగా విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సర్వశక్తులు ఒడుతున్న మావోయిస్టు ఉద్యమం ఒకవెైపు, రాజ్య గుత్తాధికారాన్ని బలంగా చాటాలని తహతహలాడుతున్న
నెత్తురోడిన లక్షింపేట
లక్షింపేట దళితుడు పిడికెడు ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలుచున్నందుకు అగ్రకుల నరమేధానికి గురికావల్సి వచ్చింది. ఈ దేశంలోని దళితులకి ఇలాంటి దాడులు కొత్తేమికాదు. అంటరానితనం అవమానాలు,అణిచివేతలు ఇక్కడి దళితులకి నిత్య అనుభవాలే. కారంచేడు,చుండూరు,తిమ్మసముద్రం,వేంపేంటలలో దళితులపై జరిగిన దాడులను మరువకముందే లక్షింపేట మాలపల్లె అగ్రకుల నరమేధానికి బలైంది. దళితులపై జరుగుతున్న దాడుల్లో ప్రాంతాలు వేరుకావచ్చు. పాత్రదారులు వేరుకావచ్చు. రెండ్లు,కమ్మల స్థానంలో కొత్తగా తూర్పు కాపులు రావొచ్చు కాని దళితులే లక్ష్యంగా సాగుతున్న అగ్రకుల దాడుల్లో ఒకటే తీరు కనిపిస్తుంది. ఆర్థికంగా పైకెదుగుతూ, ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలుచున్న ప్రతిసారి ఆయా సామాజిక వర్గాలు, తమ ఆధిపత్యాన్ని, కుల దురంహకారాన్ని ప్రదర్శించడం కోసం నిరుపేదలైన నిరాయుధులైన దళితులపై దాడులు చేయడం పరిపాటయ్యింది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేటలో జూన్ 12న జరిగిన సంఘటనని రెండు సామాజిక వర్గాల మధ్య పాత కక్షల వల్ల అనుకోకుండా జరిగిన ఘటనగా పాలక వర్గాలకు వత్తాసు పలుకుతున్న మీడియా ప్రచారం చేస్తుంది. కానీ ఈ నరమేధానికి ఒక ఆర్థిక,సామాజిక నేపథ్యముంది. ముఖ్యంగా ఈ సమస్య భూమి చుట్టూ అల్లుకొని ఉంది. ఉత్తర కోస్తాలో సంఖ్యారీత్యా బలంగా వున్న తూర్పున కాపులు గత పది,పదిహేను ఏండ్లుగా భూమి మీద ఉన్న పట్టుతో రాజకీయంగా అధికారానికి ఎగబాకారు. తూర్పు కాపులు పేరుకి మాత్రమే బి.సిలుగా చెలామణి అవుతున్నా ఆర్థికంగా, రాజకీయంగా బలిసిన కులంగా ఎదిగింది. మరోవైపు సంఖ్యారీత్యా అంతే బలంగా వున్న దళితులు భూమి, అధికారం వంటివి లేకపోయిన ఆత్మగౌరవంతో తలెత్తుకొనే స్థాయిలో ఉన్నారు. రాజ్యంగ పరంగా తమకున్న హక్కులను పోరాటం ద్వారా పరిరక్షించుకోవాలన్న స్పృహ కలిగివున్నారు. దీంట్లో భాగంగానే 2006 ఎన్నికల్లో సర్పంచు సీటు ఎస్సీ మహిళకు రిజర్వు అయితే మాలపల్లె అంతా ఐక్యమత్యంతో చిత్తిరి సింహాలమ్మను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. మాలపల్లె ఐక్యమత్యాన్ని, ఆత్మగౌరవాన్ని, జీర్ణించుకోలేని తూర్పుకాపులు కుల దురంహకారంతో బాంబులతో,బరిసెలతో, బండరాళ్లతో,గొడ్డల్లతో దళితులపై పాశవికంగా దాడి చేసి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నరమేధానికి ఒడిగట్టారు. మూకుమ్మడిగా చేసిన ఈ డాడికి మాలపల్లె విలవిల లాడింది.
దాడికి అసలు కారణం
వంగర,రేగడి అముదాల వలస, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు మండలాల్లో 104 గ్రామాల్లోని 24,700 ఎకరాల సాగుభూమికి నీరందించే ఉద్దేశ్యంతో సువర్ణముఖి,వేగావతి నది సంగమ ప్రాంతంలో మడ్డువలస ప్రాజెక్టును 1976వ సంవత్సరంలో ప్రారంభించారు.ఈ ప్రాజెక్టు కింద 7 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వం ముంపునకు గురవుతున్న భూములతోపాటు, నివాసిత గ్రామాలకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చట్టం కింద భూమిని తీసుకున్నారు. భూములు కోల్పోయిన తూర్పుకాపులకు నష్టపరిహారంగా ఎకరానికి రెండున్నర లక్షలు, గృహాలకు రూ. 50 వేల నుండి రెండు లక్షల వరకు చెల్లించారు. భూములు,ఇళ్లు కోల్పోయిన తూర్పు కాపులకు, మాలలకు ముత్యాలమ్మ ట్యాంకు సమీపంలో (ప్రస్తుతం మాలలు నివాసం ఉంటున్న ప్రాంతం) పునరావాసం కల్పించారు. పునరావాస ప్రాంతానికి మాలలు 2000 సంవత్సరంలో వచ్చి స్థిరపడ్డారు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు తూర్పు కాపులు అక్కడి వచ్చి స్థిరపడ్డారు. పునరావసం క్రింద తూర్పు కాపులకు 40 ఉద్యోగాలు ప్రాజెక్టులో ఇచ్చారు కానీ ఒక్క దళితుడికి ఉద్మోగం ఇవ్వలేదు. దళితులకు భూమిలేకపోవడంతో పూరి ఇళ్లు అయినందుకు వారికి రూ.8 వేల నుండి 10 వేల వరకు ఇచ్చారు. కానీ ఈ 8 వేలల్లో కూడా గ్రామంలో గుడి కడతామంటూ గ్రామ కాపులు ప్రతి దళిత కుటుంబం నుంచి 3 వేల రూపాయలను వసూలు చేశారు. అయితే మడ్డువలస ప్రాజెక్టు కోసం సేకరించిన మొత్తం భూమిలో సుమారు 250 ఎకరాల భూమి ముంపునకు గురికాకుండా మిగిలిపోయింది. ఈ భూమి ఖాళీగా ఉండటం వల్ల లక్షింపేట కాపులు 190 ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. మిగిలిన 60 ఎకరాలు అలాగే ఉన్నది. అందులో 40 ఎకరాలు పక్క గ్రామమైన దేవకవాడ వాళ్లది. వాళ్లు భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసి నష్టపరిహారం తీసుకొని పక్కగ్రామానికి వెళ్లి స్థిరపడిపోయారు. తర్వాత ఆ గ్రామం వైపు ఎప్పుడు తిరిగిచూడలేదు. ఇక మిగిలిన 20 ఎకరాలు లక్షింపేట కాపులవే కానీ ఆ కాపు కుటుంబాలు కూడా ఇప్పుడు అక్కడ లేవు. వారు ఎక్కడికో వెళ్లి స్థిరపడిపోయారు. ఆ 60 ఎకరాల భూమి ఖాళీగా ఉండటంతో గత 12 ఏండ్లుగా లక్షింపేట మాలలు ఒక్కొక్కరు 45 సెంట్ల చొప్పున దీనిని సాగుచేయటం మొదలుపెట్టారు. భూమిని సాగుచేసుకుంటున్నందుకు భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఈ మొత్తం 250 ఎకరాల మీద లక్షింపేట,దేవకవాడ కాపులకు ఏ సంబంధమూ లేదు. ఎందుకంటే వారు నష్టపరిహారం తీసుకున్నారు కాబట్టి. కాపులు సాగుచేసుకుంటున్న 190 ఎకరాలు, మాలలు సాగుచేసుకుంటున్న 60 ఎకరాలు మొత్తం 250 ఎకరాలు కలిసే ఉంది. లక్షింపేటలో తమ ఇళ్ల పక్కనే మాలల ఇళ్లు ఉండటం, తమతో పాటు మాలలు భూమిని సాగుచేసుకోవడాన్ని, వాళ్లు ఆర్థికంగా ఎదగడాన్ని సహించలేని కాపులు ఏవిధంగానైనా మాలలను ఆ గ్రామం నుంచి తరిమివేయాలని కంకణం కట్టుకున్నారు.
2010 నుంచి మాలలపై జరిగిన దాడులు:
గత రెండేళ్లుగా మాలన్ని ఈ భూమి సాగుచేసుకోవద్దని బెదిరించడం, అడపదడప దాడులకు పాల్పడడం చేస్తున్నారు. 2010లో మాలవాడకు చెందిన దడాసి లత, కలమటి చిన్నమ్మడు ప్రాజెక్టు మిగులు భూమిలో పుల్లలు ఏరుకుంటుండగా తూర్పుకాపులు కర్రలతో దాడిచేసి కులంపేరుతో దూషిస్తూ వారిని కొట్టారు. మాలలు ఈ దాడికి పాల్పడిన తూర్పు కాపులపై వంగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికి కేసు రిజిష్టర్ చేయలేదు.
గత సంవత్సరం ఆగస్టు 22వ తేదీన నివర్తి రాముడమ్మ పిడకల కోసం ప్రాజెక్టు భూముల్లో పేడ పోగుచేసుకుంటుండగా తూర్పు కాపులు ఆమెను కులం పేరుతో అసభ్యంగా తిడుతూ కర్రలతో దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు కేసు నమోదు చేయలేదు. తీవ్రంగా గాయపడిన రాముడమ్మ ఆ తర్వాత మరణించడం జరిగింది.
తూర్పు కాపులకు చెందిన పొలంలో పశువులు పడ్డాయనే నెపంతో చిత్తిరి శ్రీదేవిని కులం పేరుతో దుర్భాషలాడి కర్రలతో దాడిచేశారు. అప్పుడు కొత్తగా వచ్చిన సబ్‌డివిజన్ పోలీసు అధికారికి ఈ దాడి విషయం ఫిర్యాదు చేయగా ఎస్సీ,ఎస్టీ యాక్ట్ 1989 కింద కేసు రిజిస్టర్ చేశారు. ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా మూడోరోజు బెయిలు మీద వచ్చి మా మీదనే కేసులు పెడతారా అని మాలపల్లెలో మూడు నాలుగు శాల్తీలు లెస్తేకానీ, భూములు వదిలి, ఊరు వదిలి వెళ్లరని బెదిరించారు.
పథకం ప్రకారం దాడి:
కాపులతో సమానంగా ఆర్థికంగా,రాజకీయంగా ఎదుగుతున్న మాలలను సహించని కాపులు వారిపై పథకం ప్రకారం దాడిచేయడానికి కాచుకొని కూర్చున్నారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు వారికి ఆ అవకాశాన్ని తెచ్చి పెట్టాయి. గ్రామంలో అడపదడప కాపులకు, మాలలకు భూమి కోసం గొడవలు జరుగుతూ ఉంటే 6 నెలల క్రితం పోలీసులు పికెటింగ్ ఏర్పాడు చేశారు. కానీ జూన్ 12న నరసన్నపేట ఉప ఎన్నికల దృష్ట్యా లక్షింపేట గ్రామంలో జూన్ 11 ఉదయం ఉన్న పోలీసు పికెట్‌ను ఎత్తివేశారు. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కాపులు 11వ తేదీ రాత్రి చుట్టుపక్కల గ్రామాల తూర్పు కాపులను మూడు ఆటోలలో, ఒక ట్రాక్టర్‌లో లక్షింపేటకు తరలించారు. బాంబులు, కత్తులు, బడిసెలు, శూలాలు, గొడ్డలు, కారం తదితర మరణాయుధాలను సమకూర్చుకున్నారు. పక్కా పథకం ప్రకారం 12వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో సద్ది అన్నం తిని పనికి వెళ్లడానికి సిద్ధమౌతున్న మాలలపై పాశవికంగా దాడికి పాల్పడ్డారు. మాలపల్లెపై ఈ మూకుమ్మడి దాడిని గమనించిన ఊరి సర్పంచు చిత్తిరి సింహాలమ్మ భర్త గంగులు వంగర పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. కానీ లక్షింపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగర పోలీసులు సరైన సమయంలో స్పందిచకపోవడంతో దీనికి అవకాశంగా తీసుకున్న కాపులు పథకం ప్రకారం గ్రూపులుగా విడిపోయి మాలపల్లెను నాలుగు వైపుల నుంచి చుట్టు ముట్టి దాడికి పాల్పడ్డారు. మాలలను భయభ్రాంతులను చేసేందుకు మొదట బాంబులు వేయడంతో మాలలు భయపడి ఇంట్లోకి పారిపోయారు, పారిపోతున్న మాలలపై కాపులు వెంటాడి, దాడి చేసి మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో కాపులకు తోడుగా వారి స్త్రీలు,పిల్లలు కారం పొడి ,రాళ్లను అందిచి పాశవికానందం పొందారు. దాదాపు నాలుగు గంటలపాటు తూర్పు కాపులు బరిసెలతో, బండరాళ్లతో,గొడ్డల్లతో దళితులపై పాశవికంగా దాడి చేశారు. ఈ మారణకాండలో నివర్తి సంగమేశు, నివర్తి వెంకట్రావు, బురాడ సుందర్రావు, చిత్తిరి అప్పడు అక్కడిక్కడే మరణించారు. దాడిలో తీవ్రంగా గాయపడి రెండు కళ్లుపోయి, మూత్రపిండాలు ఛిద్రమై విశాఖలోని కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత బొద్దూరి పాపయ్య మరణించాడు. ఈ హంతక డాడిలో 20 మంది తీవ్రంగా గాయపడి కాళ్లూ, చేతూలూ విరిగిపోయి, తలలు పగిలి, పిల్లలు, వృద్దులు, స్త్రీలు, పురుషులు జీవశ్చావాల్లా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాడితో గాయపడి మరణించిన నివర్తి సంగమేష్ 43 కత్తిపోట్లకు గురయ్యాడని డాక్టర్ రిపోర్టులో రాశాడంటే దుండగులు పథకం ప్రకారం ఎంత నరమేధం సాగించారో అర్థంచేసుకోవచ్చు. నాలుగు గంటలపాటు కాపు హంతకముటా చేసిన పాశవిక దాడిలో లక్షింపేట దళితవాడ రక్తపు మడుగుతో నిండిపోయింది. తమపై కాపులు దాడిచేస్తున్నారని సర్పంచు భర్త చిత్తిరి గంగులు ఉదయం 7 గంటలకు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు ఈ నరమేధం ముగిసాకా మధ్యాహనం 12:30 గంటలకు ఆ గ్రామానికి తాపీగా చేరుకున్నారు.
ఒక మాల కులానికి చెంది కొండ్రు మురళి ఎమ్మెల్యే మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తన కులానికే చెందిన ప్రజలు తూర్పుకాపుల పాశవిక నరమేధానికి గురయ్యారు. దళితుల ఓట్లతో గెలిచి మంత్రిగా కొనసాగుతున్న కొండ్రు మురళి వారికి అండగా ఉండాల్సిందిపోయి అధికార పార్టీకి దళారిగా వ్యవహరిస్తూ కాపుకుల దురంకారులకే కొమ్ముకాస్తూ తన పదవిని కాపాడుకోవటానికే పరిమితమయ్యాడు తప్పా లక్షింపేట దళితుల సమస్యను చొరవతీసుకొని పరిష్కరించేందుకు, వారికి అండగా నిలిచేందుకు ప్రయత్నించలేదు.
దళితులపై జరుగుతున్న సాగుతున్న ఈ దాడులకు మూలం భూమి సమస్యతో ముడిపడి ఉంది. దళితులంతా మెజారిటీగా గ్రామీణ ప్రాంతాల్లో భూమిపై ఆధారపడి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ భూమిపై హక్కు, అధికారం కలిగివున్నవారంతా ప్రధానంగా అగ్రకుల పెత్తందారీ భూస్వామ్య వర్గంగాను, అధికార రాజకీయ పలుకుబడి గలవారుగానూ ఉన్నారు. కనుక గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య, అగ్రకుల పెత్తందార్ల అధికారానికి, అహంకారానికి మూలమైన, ప్రధాన ఉత్పత్తి సాధనమైన భూమిపై హక్కు సాధించకుండా దళిత సమస్యలకు మౌళిక పరిష్కారం లేదు. ప్రభుత్వాలు ప్రవచించే 'భూసంస్కరణలు' వంటివేవీ భూసంబంధాల్లో మార్పులు తీసుకురావని, తీసుకురాలేవని రుజువైన వాస్తవం. దున్నేవానికి భూమి నినాధంగా వ్యవసాయక విప్లవం ఇరుసుగా దళితులపై జరిగే దాడులకు, అంటరానితరాన్ని సమూలంగా పరిష్కరించగలుగుతుంది. దళితులపై దాడులకు , అణచివేతకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలు, తక్షణ డిమాండ్ల సాధనతో పాటు ఈ దాడులకు మూలమైన వ్యవస్థపై ఎక్కుపెట్టే దిశగా సాగాలి.
(ఈ వ్యాసం రచయిత లక్షింపేట బాధితులను సందర్శించాక రాయబడింది.)
ఉన్నత విద్యారంగం: సమస్యలు - సవాళ్ళు
ప్రముఖ విద్యావేత్త డి.ఎస్.కొఠారి ఉన్నత విద్యా లక్ష్యాలను పేర్కోంటూ విద్య సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉంటూ,సామాజిక చైతన్యానికి హృదయంలా పనిచేసి తాను పనిచేస్తున్న సామాజిక జీవన విధానాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించే సాధనంగా ఉండాలి అని పేర్కోన్నాడు. దీనికి భిన్నంగా నేషనల్ నాలెడ్జ్ కమీషన్ ఛెర్మన్ శ్యాం పెట్రోడా విద్య ద్వారా ఉత్పత్తి పెంచి, పెంచిన ఉత్పత్తికి వినియోగించే శక్తిని కల్పించాలని పేర్కోన్నాడు. ఈ రెండు దృక్పథాలు నిజానికి రెండు భిన్న ధృవాలు. విశ్వవిద్యాలయాల పాత్ర ఏ దృక్పథం మీద ఆధారపడి ఉంటున్నదనేది ప్రధాన సవాళు. సమాజ శ్రేయస్సు,సమిష్టి జీవన మలువనుపెంచే దిశగా విద్యావ్యవస్థ ఉండాలి. నిజానికి విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి అర్థం అవి రాజ్యాధికారం నుండీ మార్కెట్ శక్తులనుండి కాపాడబడాలనే కాని సామాజిక బాధ్యతలేదని కాదు. ఉన్నత విద్య నిరంతరంగా ప్రజకు బాధ్యతవహించి ప్రజల ఆకాంక్షకనుగుణంగా, వాళ్ళ సమస్యలకు ధర్పణంగా, సామాన్య, శ్రమజీవు జీవితం మెరుగపడే మార్గాలు వెతకాలి. పౌర సమాజ నిర్మాణంలో దేశ వ్యాపితంగా యువతను భాగస్వాములను చేయడంలో విద్య కీలక పాత్ర నిర్వహించాలి. విద్యా విదానం వ్యక్తి ప్రతిభను ఎంత పెంచినా ఆ వ్యక్తి తన చుట్టూ ఉండే పరిస్థితులకి స్పందించకపోతే అతను మానవత్వాన్ని కొల్పోయే ప్రమాదం ఉంటుంది. మానవీయ దృక్పథాన్ని విస్మరించి విద్య వ్యక్తి ప్రయోజనం కొరకే అనే అమానుష భూమిక మీద ఇప్పుడు విశ్వవిద్యాయాలని నిర్మించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాయాలను అహ్వానిస్తున్నారు.
భారత ప్రభుత్వం దేశంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)తో నడిచే విద్య సంస్థల ఏర్పాటుకు కూడా అమోదం తెలిపింది. దీంతో ఉన్నత విద్యారంగంలో లాభదాయకమైన సంస్థను నెలకొల్పుకునేందుకూ, ప్రయివేట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుకు భారీ ఎత్తున అవకాశాలు కల్పించేందుకూ బడా వ్యాపార సంస్థలు సిద్ధపడుతున్నాయి. విద్యారంగంలో చోటుచేసుకున్న ఈ మార్పు నేపధ్యంలో మొదటిసారిగా ప్రపంచ వాణిజ్య సంస్థ (ఉబ్ల్యుటీవో) చర్చ అజెండాలో విద్యరంగాన్ని కూడా చేర్చారు. ‘‘సేవల్లో వ్యాపారంపై సాధారణ ఒప్పందం’గాట్స్ 2000’’ అనే శీర్షిక కింద ఈ చర్చ జరిగాయి.
గాట్స్ ఆధారంగా ఉన్నత విద్యా వ్యవస్ధ తలుపులు తెరిస్తే ప్రయివేటీకరణ, వ్యాపారీకరణ, ప్రపంచీకరణ, ఉన్నత విద్యపై నియంత్రణ తొగింపు పెద్దఎత్తున చోటుచేసుకుంటాయి. అంతేకాకుండా ప్రభుత్వం నిధులను కుదిస్తుంది. ఉన్నత విద్య సరళీకరించబడి విదేశీ, స్వదేశీ స్వయం నిర్వహణ (సెల్ఫ్‌ఫైనాన్స్) సంస్ధలు పెరుగుతాయి. గాట్స్ 2000 చర్చ ఒప్పందం తరువాత మనదేశంలో విద్య వ్యాపారీకరణ వేగవంతమయింది. విద్యా వ్యాపారు లాభార్జనకు అవకాశాలు పెరిగాయి. ఉన్నత విద్యలో పెరుగుతున్న డిమాండ్‌ను ప్రయివేట్ సంస్ధలు అందుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నియంత్రణను గాలికొదిలేస్తోంది. గాట్స్ చర్చలు ఈ ధోరణికి మరింత ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. ఉన్నత విద్యారంగంపై నియంత్రణ తొలగింపు, సరళీకరణలు తీవ్రమైన దుష్బ్రవాన్ని చూపుతున్నాయి నాణ్యత లేకుండా ప్రయివేటు విద్యాసంస్ధలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. పేద ప్రజలు, ముఖ్యంగా సామాజిక వివక్ష నెదుర్కొంటున్న బహినవర్గ ప్రజలు విద్యకు దూరమవుతున్నారు. విద్య వ్యాపారీకరణను అరికట్టాని, విద్యరంగ సరళీకరణను తొగించాని భవిష్యత్తులో ప్రభుత్వాలు భావించినప్పటికి అది అమలు చేయడం కష్టమౌతుంది. ఎందుకంటే ‘గాట్స్ 2000’ చర్చ ప్రకారం అలాచేస్తే వ్వాపార భాగాస్వామికి సష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల ఉన్నత విద్యలో అసమానతలు పెరుగుతాయి. మన విద్యవిధానం స్వతంత్రతను కోల్పోయి, ఇతర దేశా సంస్ధమీద అధారపడే స్థితికి పోతుంది.
గాట్స్ ఆధారంగా ఉన్నత విద్యా వ్యవస్ధ తలుపులు తెరిస్తే ప్రయివేటీకరణ, వ్యాపారీకరణ, ప్రపంచీకరణ, ఉన్నత విద్యపై నియంత్రణ తొగింపు పెద్దఎత్తున చోటుచేసుకుంటాయి. అంతేకాకుండా ప్రభుత్వం నిధులను కుదిస్తుంది. ఉన్నత విద్య సరళీకరించబడి విదేశీ, స్వదేశీ స్వయం నిర్వహణ (సెల్ఫ్‌ఫైనాన్స్) సంస్ధలు పెరుగుతాయి. గాట్స్ 2000 చర్చ ఒప్పందం తరువాత మనదేశంలో విద్య వ్యాపారీకరణ వేగవంతమయింది. విద్యా వ్యాపారు లాభార్జనకు అవకాశాలు పెరిగాయి. ఉన్నత విద్యలో పెరుగుతున్న డిమాండ్‌ను ప్రయివేట్ సంస్ధలు అందుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నియంత్రణను గాలికొదిలేస్తోంది. గాట్స్ చర్చలు ఈ ధోరణికి మరింత ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. ఉన్నత విద్యారంగంపై నియంత్రణ తొలగింపు, సరళీకరణలు తీవ్రమైన దుష్బ్రవాన్ని చూపుతున్నాయి నాణ్యత లేకుండా ప్రయివేటు విద్యాసంస్ధలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. పేద ప్రజలు, ముఖ్యంగా సామాజిక వివక్ష నెదుర్కొంటున్న బహినవర్గ ప్రజలు విద్యకు దూరమవుతున్నారు. విద్య వ్యాపారీకరణను అరికట్టాని, విద్యరంగ సరళీకరణను తొగించాని భవిష్యత్తులో ప్రభుత్వాలు భావించినప్పటికి అది అమలు చేయడం కష్టమౌతుంది. ఎందుకంటే ‘గాట్స్ 2000’ చర్చ ప్రకారం అలాచేస్తే వ్వాపార భాగాస్వామికి సష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల ఉన్నత విద్యలో అసమానతలు పెరుగుతాయి. మన విద్యవిధానం స్వతంత్రతను కోల్పోయి, ఇతర దేశా సంస్ధమీద అధారపడే స్థితికి పోతుంది.
గాట్స్ చర్చ ద్వారా విదేశీ విద్య సంస్థకు మన విద్య వ్యవస్థ ద్వారాలు తెరవడం వల్ల సంభవించే నష్టాలను అంచనా వేయడంలో కేంద్ర విద్య సహాయమండలి (సిఎబిఇ) విఫలమైంది. దానివల్ల భారత అభివృద్ధికి జరిగే నష్టాలను సిఎబిఒ నివేదిక విస్మరించింది. విద్య అంతర్జాతీయ వ్యాపార వస్తువుగా మారిన తర్వాత ఉన్నత విద్యను నియంత్రిచండంలో డబ్ల్యుటీవో, ప్రపంచబ్యాంక్, ఇతర బహుళజాతి సంస్థల ప్రభావం పెరిగింది. ఉన్నత విద్యలో వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఉన్నత విద్యను ప్రపంచీకరించారు. ఇతర దేశాలకు వెళ్ళకుండానే స్వదేశంలో విదేశీ చదువు సాగించే వ్యక్తుల సంఖ్య ఈ కాలంలో బాగా పెరిగింది. 1995`2005 మధ్యకాలంలో ఈ విధంగా చదువుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15 క్ష నుండి 25 ల్లక్షకు అంటే దాదాపు 60 శాతం పెరిగింది. పూర్తి దూర విద్యా కోర్సుల్లో చేరడం ద్వారానో లేక విదేశాల్లోని యూనివర్శిటీలు, కాలేజీలు లేదా విదేశీ ఎగ్జామినేషన్ బోర్డు భాగాస్వామంతో ఏర్పరచిన స్థానిక ప్రభుత్వ లేదా ప్రయివేట్ సంస్థల్లో అధ్యయనం ద్వారానో వీరంతా విదేశీ విద్యర్హతలు పొందుతున్నారు. అగ్నేయాసియాలో ఉమ్మడి ఒప్పందాలు సర్వసాధారణమయ్యాయి. ఈ విధమైన సంస్థాపరమైన ఒప్పందాల ద్వార విదేశీ యూనివర్సిటీనూ, విదేశీ ప్రయివేట్ ఉన్నత విద్య సంస్థనూ ఏర్పాటు చేసి కోర్సును నిర్వహిస్తూ డిగ్రీ పట్టాను అందిస్తున్నాయి. స్వదేశీ సంస్థలు విదేశీ ‘భాగాస్వామ్యంతో’ విద్యాయాలు నడుపుతూ వారి కోర్సు ‘స్వదేశం’లో చెల్లుబాటు అయ్యేలా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. విదేశీ భాగాస్వామికి చెందిన బోధనాపద్థతులు, పరీక్ష ప్రమాణాలు కూడా చెల్లుబాటు అవుతున్నాయి. విదేశీ సంస్థలు దేశంలో తమ స్వంత విద్య కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి.
విద్య ఎగుమతుల్లో అగ్రగామి అమెరికా:
విద్య ఎగుమతుల్లో అగ్రగామి అమెరికా:
2005లో ఉన్నత విద్యరంగంలో 500 కోట్ల డాలర్ల అంతర్జాతీయ వ్యాపారం జరిగిందని అంచనా. ఇది ఒఇసిడి (అభివృద్థిచెందిన) దేశాల్లోని మొత్తం సేవ వ్యాపారంలో మూడవ శాతానికి సమానం. విద్యసేవల్లో అంతర్జాతీయ వ్యాపారం త్వరలోనే 1000 కోట్ల డాలర్లు దాటుతుందని గ్రాండ్ అయెన్స్ ఫర్ ట్రేడ్ ఇన్ ఎడ్యుకేషన్ (బిఎటిఇ) అంచనా వేసింది. విద్య సేవను ఎగుమతి చేయడంలో అమెరికా అగ్రభాగాన ఉండగా అ తరువాత స్థానాల్లో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ ఉన్నాయి. అమెరాకాలో విద్యాసేవ ఎగుమతి వ్యాపారం 2005 లో 200 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇది అన్ని రకాల సేవ ఎగుమతిలో ఐదో స్థానంలో ఉంది. విద్యా ఉన్నత విద్య సేవలు అమెరికాకు మంచి వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో 40 లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న విద్యాసేవల వ్యాపారాన్ని విస్తరించుకోవాని ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉన్నత విద్యలో అమెరికాకు 64 శాతం మార్కెట్లు ఆసియా దేశాలైన చైనా, జపాన్ కొరియా,భారత్, తైవాన్, ధాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియాలో లభిస్తుండగా మిగిలిన మార్కెట్ యూరప్, లాటిన్ అమెరికా దేశాల్లో ఉంది. బ్రెజిల్, చైనా, భారత్ కొరియా, మలేషియా దేశాల్లో విద్యకు పెరుగుతున్న గిరాకీ రీత్యా విద్యావ్యాపార విస్తరణకు అవకాశాలు పెరుగుతున్నాయి.
అయితే ప్రస్తుతం విద్యాసేవ వ్యాపారంలో అమెరికాకు ఆస్ట్రేలియా, బ్రిటన్ నుండి పోటి ఎదురవుతుంది. ఈ వ్యాపారానికి స్వేచ్ఛా మార్కెట్ లేక పోవడం బడా వ్యాపార వర్గాల్లో అసంతృప్తిని పెంచుతొంది. అసియా దేశాల విద్యార్థుల కోసం ప్రధానంగా పోటి నెలకొంది. ఈ దేశాల్లో ప్రాధాన్యత వారీగా వ్యాపార అస్థిత్వాన్ని సుస్థిరం చేసుకొవాలని లేదా విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులు పెట్టాలని బడా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి, డబ్ల్యుటీవో చర్చ ద్వారా జాతీయ అడ్డంకులను తొగించుకొని ఈ దేశాల్లో ప్రయివేట్ ఉన్నత విద్యా మార్కెట్‌ను విస్తరించుకోవాని బడా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అభివృద్ది చెందుతున్న దేశాల్లో విద్యారంగ రక్షణకు అనేక చట్టపరమైన నియంత్రణలున్నాయి. జాతీయ ప్రయోజానాలు, ఆర్థిక అవసరా రీత్యా ఈ నియంత్రణలు, పరిమితలు ఖచ్చితంగా అవసరం. అయితే వీటిని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ు ఆటంకాలుగా పేర్కోన్నాయి. విద్యా వ్యాపారంలో డబ్ల్యుటివో గుర్తించిన నాుగు విభాగాల్లోనూ సభ్యదేశా మధ్య ఒప్పందం జరగాని ఈ దేశాు కోరుతున్నాయి.
ఈ నిబంధనను అమోదించే ముందు విద్య సేవల్లో అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహించాడం ద్వారా ఉత్పన్నమయ్యే అన్ని పరిణామాల గురించి మన దేశంలో విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరంముంది. గాట్స్ చర్చు నేటికి అస్పస్టంగానే ఉన్నాయి. చర్చ ఫలితమే కాదు, గాట్స్ సాధారణ నిబంధనల్లో కూడా అస్పస్టత నెకొని ఉంది. ఉదాహారణకు జాతీయ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ నిబంధను మొత్తం భారత విద్యారంగ మంతటికీ అంటే రాష్ట్రాకు కూడా వర్తిస్తాయా అనేది సందిగ్థం. ఒకవేళ వర్తిస్తే లాభా కోసం స్థాపించే విదేశీ విద్య సంస్థలు కూడా ప్రభుత్వ నిధుల కోసం జాతీయ విద్య సంస్థతో పోటిపడతాయి. ప్రభుత్వ నిధుల్లో కోతపెట్టే అవకాశం ఉంది. ఈ స్థితి అధిక ఫీజుకు కారణమై విద్యారంగంలో అసమానతను తీవ్రంగా పెంచుతుంది.
గాట్స్ చర్చల్లో భారత స్థానం :డబ్ల్యుటివో చర్చల్లో భాగంగా ఉన్నత విద్యను సరళీకరిస్తామని అమెరికా, యురోపియన్ యూనియన్, కెనడా, ఆఫ్రికన్ అరబ్ దేశాతో పాటు పొరుగు దేశాలు కూడా హామీ ఇవ్వాని భారత్ కోరుతుంది. గాట్స్ ప్రతిపాదన వల్ల దీర్ఘకాంలో విద్యా నాణ్యత దెబ్బతినడమే కాకుండా ప్రజాప్రయోజనాలకు కూడా నష్టం కుగుతుంది. ఎందుకంటే గాట్స్ నిబంధన వల్ల విద్యా వ్యవస్థపై ప్రభుత్వాలకు పట్టు, నియంత్రణ లేకుండా పోతుంది. నాలుగు రకాల వ్యాపార విధానాలతో మార్కెట్‌ను సరళీకరించడం వైపే భారత ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. విదేశీ విద్యా సంస్థలు భారత విద్యార్థులకు బయోటెక్నాజీ, కంప్యూటర్ సైన్సెస్, మెటీరియల్ సెన్స్ లాంటి అభివృద్థి చెందుతున్న సైన్స్ కోర్సులను అందిస్తాయని భారత ప్రభుత్వం భావిస్తోంది. కీలక అంశాల్లో విదేశీ పెట్టుబడును ఆకర్షించేందుకు వాటిని 74 శాతానికి మాత్రమే పరిమితం చేసి ప్రోత్సాహాకాలు ఇవ్వడం ద్వారా విదేశీ విద్యా సంస్థను నియత్రించవచ్చునని అది పేర్కోంటోంది. అయితే సాంకేతిక వ్యవహారాలను ప్రభుత్వమే నేరుగా నియంత్రించినప్పుడు మాత్రమే మనకు విదేశానుండి నాణ్యమైన సాంకేతిక పరిజ్ఞానం భిస్తుందని లేకుంటే మనం పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని మన ప్రభుత్వ విస్మరిస్తోంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుపై పరిమిత రూపంలో పరోక్ష నియంత్రణలు ఉండాని ప్రభుత్వం అంటోంది. కాని ఇది కనీసం మనకు దిగుమతి అవుతున్న టెక్నాజీ ఏమిటనే విషయం తొనుకునేందుకు కూడా సరిపోదు. గత 50 ఏళ్ళ అనుభవాన్ని గమనిస్తే విదేశీ కంపెనీలు తమ ముఖ్యమైన టెక్నాజీలను ఇతరులకు పంచాలని ఎన్నడూ ప్రయత్నించలేదు.ఉక్కు చమురు, ఎక్ట్రానిక్స్, ఔషదాలు, సూపర్ కంప్యూటరింగ్‌లో మన అనుభవాలను ఎలా మరిచిపోగం?
భారత ప్రభుత్వం విద్యారంగంలో 100 శాతం ఎఫ్‌డిఐను ఆహ్వానించింది. ఎఐసిటిఇ, యుజిసి గుర్తింపు పొందిన సంస్థ కేటగిరీ కింద విదేశీ సంస్థను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఐదేళ్ళ కాంట్రాక్ట్ కింద ఈ సంస్థను అనుమతిస్తున్నారు. సరిగ్గా నిర్వహించకుంటే మూడేళ్ళ తరువాత వాటి అనుమతిని సమీక్షించే నిబంధన కూడా కాట్రాక్ట్‌లో పొందపరుస్తున్నారు. 1990 నుండి వ్యాపార వర్గ ప్రయోజనాకు అనుగుణంగా భారతపాలకులు మన విద్యా విధానాన్ని రుపొందిస్తున్నారు. ఈ పరిణామాు భారత ఉన్నత విద్యలో ప్రయివేటీకరణ. లాభార్జనను విపరీతంగా పెంచాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా సామార్థ్యాన్ని పెంచుకొవడానికి ప్రయివేట్ నిధులు సమీకరించుకోవాలని, ఆ నిధులతో కొత్త సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ప్రారంభించాని వాటిపై ఒత్తిడి వస్తోంది.
ఉన్నత విద్యా సంస్థల స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఉన్నత విద్య సరళీకరణ, ప్రయివేటీకరణను మరింత వేగవంతం చేయాని ఈ కమిటీ కూడా ప్రతిపాదించింది. దీనికితోడు మన ఉన్నత విద్యా రంగంలోని సంగీతం, ఆర్ట్స్ అండ్ క్చర్, సైన్స్ అండ్ టెక్నాజీ విభాగాలను ప్రపంచస్థాయిలో మార్కెటింగ్ చేసుకోవాలని దేశంలోని ఎగువ మధ్యతరగతి వర్గం భావిస్తున్నది. మేనేజ్‌మెంట్ విద్య, ఆయుర్వేద, ఆర్ట్స్ అండ్ కల్చర్, ఇంజనీరింగ్, ఐటి విద్య, యోగా మరియు విదేశీ భాష విద్య వ్యవసాయం, గ్రామీణాభివృద్థి విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు మార్కెట్ అవకాశం కల్పించాని గాట్స్ చర్చల్లో భారత్ కోరుతోంది.
ఉన్నత విద్యపై గాట్స్ ప్రభావం
ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి విద్యారంగ బడ్జెట్ 10,000 కోట్ల డార్ల వరకు ఉంది. ఈ రంగం ఐదు కోట్ల మంది ఉపాధ్యాయుకు ఉపాధి కల్పిస్తుండగా ఏడాదికి 10 కోట్ల మంది విద్యార్థు చేరుతున్నారు. విద్యా సేవల్లో వ్యాపార ధోరణి పెరగడం వ్ల విద్యారంగంలో అంతర్జాతీయ సహాకార ప్రక్రియ దెబ్బతింటుంది. ఇప్పటి వరకు వర్థమాన దేశాు ఈ సహాకారంతోనే తమ ప్రభుత్వరంగ సంస్థను అభివృద్థి చేసుకుంటూ వస్తున్నాయి. ఉదాహారణకు మనదేశంలో ఐఐటిు. గత 20 ఏళ్ల కాంలో విద్యకు ప్రభుత్వ నిధుల్లో కోత విదించడం, ఉన్నత విద్యపై నియంత్రణ తొగించడం వ్ల ఇప్పటికే భారత విద్య వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోయింది. ప్రభుత్వ యూనివర్శిటీు, ఇతర వృత్తి సంస్థనుండి నాణ్యమైన విద్యను పొందగమనే నమ్మకం మధ్యతరగతి ప్రజల్లో సడలింది ఈ నేపధ్యంలో ఉన్నత విద్యలో బలీయమైన శక్తిగా ఎదుగుతున్న బడా వ్యాపారవర్గం భారత్‌లో ప్రవేశించింది.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు ఉన్నత విద్యారంగంలోకి వస్తాయనే ఆశతో భారత ప్రభుత్వం గాట్స్ చర్చలో పాల్గోంది.విదేశీ యూనివర్శిటీు అందించే కోర్సుపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఐఇపిఎ) చేసిన విశ్లేషణ నిజానికి చేదు అనుభవాు తొపుతుంది. అవి అందించే కోర్సుల్లో అత్యధిక భాగం హాస్పిటాలిటీ సర్వీసు, మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాజీకి సంబంధించినవి. చాలా కోర్సులో ఏక కాంలోనే రెండు డిగ్రీను అందిస్తున్నాయి. ప్రవేశానికి మార్కు శాతం లాంటి కనీస అర్హతను కూడా పాటించడం లేదు. డిగ్రీకోర్సు కావ్యవధి అదే డిగ్రీకు మనదేశంలో అమల్లో ఉన్న కా వ్యవధికన్నా తక్కువగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ స్థాయిలో మంచి ప్రతిభ చూపలేని విద్యార్థు మాత్రమే విదేశీ డిగ్రీు కావానుకుంటున్నారన్న విషయం స్పష్టంగా అర్థమౌతుంది. భారత యూనివర్శిటీు, కాలేజీల్లో ప్రవేశం పొందలేని వారే అత్యధికంగా విదేశీ డిగ్రీు కావానుకుంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి విద్యారంగ బడ్జెట్ 10,000 కోట్ల డార్ల వరకు ఉంది. ఈ రంగం ఐదు కోట్ల మంది ఉపాధ్యాయుకు ఉపాధి కల్పిస్తుండగా ఏడాదికి 10 కోట్ల మంది విద్యార్థు చేరుతున్నారు. విద్యా సేవల్లో వ్యాపార ధోరణి పెరగడం వ్ల విద్యారంగంలో అంతర్జాతీయ సహాకార ప్రక్రియ దెబ్బతింటుంది. ఇప్పటి వరకు వర్థమాన దేశాు ఈ సహాకారంతోనే తమ ప్రభుత్వరంగ సంస్థను అభివృద్థి చేసుకుంటూ వస్తున్నాయి. ఉదాహారణకు మనదేశంలో ఐఐటిు. గత 20 ఏళ్ల కాంలో విద్యకు ప్రభుత్వ నిధుల్లో కోత విదించడం, ఉన్నత విద్యపై నియంత్రణ తొగించడం వ్ల ఇప్పటికే భారత విద్య వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోయింది. ప్రభుత్వ యూనివర్శిటీు, ఇతర వృత్తి సంస్థనుండి నాణ్యమైన విద్యను పొందగమనే నమ్మకం మధ్యతరగతి ప్రజల్లో సడలింది ఈ నేపధ్యంలో ఉన్నత విద్యలో బలీయమైన శక్తిగా ఎదుగుతున్న బడా వ్యాపారవర్గం భారత్‌లో ప్రవేశించింది.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు ఉన్నత విద్యారంగంలోకి వస్తాయనే ఆశతో భారత ప్రభుత్వం గాట్స్ చర్చలో పాల్గోంది.విదేశీ యూనివర్శిటీు అందించే కోర్సుపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌ఐఇపిఎ) చేసిన విశ్లేషణ నిజానికి చేదు అనుభవాు తొపుతుంది. అవి అందించే కోర్సుల్లో అత్యధిక భాగం హాస్పిటాలిటీ సర్వీసు, మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాజీకి సంబంధించినవి. చాలా కోర్సులో ఏక కాంలోనే రెండు డిగ్రీను అందిస్తున్నాయి. ప్రవేశానికి మార్కు శాతం లాంటి కనీస అర్హతను కూడా పాటించడం లేదు. డిగ్రీకోర్సు కావ్యవధి అదే డిగ్రీకు మనదేశంలో అమల్లో ఉన్న కా వ్యవధికన్నా తక్కువగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ స్థాయిలో మంచి ప్రతిభ చూపలేని విద్యార్థు మాత్రమే విదేశీ డిగ్రీు కావానుకుంటున్నారన్న విషయం స్పష్టంగా అర్థమౌతుంది. భారత యూనివర్శిటీు, కాలేజీల్లో ప్రవేశం పొందలేని వారే అత్యధికంగా విదేశీ డిగ్రీు కావానుకుంటున్నారు.
విదేశీ విద్య సంస్థు విద్యార్థును ఆకర్షించేందుకు అనేక జిమ్మిక్కుకు ప్పాడుతున్నాయి. విద్యార్థుకు ఇంటివద్దనే విద్య అందిస్తున్నాయి. కాని దీనివ్ల విద్యార్థు నాణ్యమైన విద్య పొందలేకపొతున్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో అనేక విద్యా కేద్రాను నెకొల్పిన ఆస్ట్రేలియా ఇందుకు పెద్ద ఉదాహరణ. ఈ సంస్థల్లో విద్యా నాణ్యత ప్రమాణాను అధ్యయనం చేసిన సంస్థు వ్లెడిరచిన వివరా ప్రకారం ఇవి ఆస్ట్రేలియా ఉన్నత విద్య సంస్థకు గుదిబండుగా మారిపోయాయి. దీంతో ఆ సంస్థల్లో ఖర్చును తగ్గించుకునేందుకు అవి అందించే చాలా సౌకర్యాల్లో కోత విధిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఈ సంస్థు అందిస్తున్న విద్య నాణ్యత ప్రమాణాపై ప్రభావం చూపుతుంది. బహుజాతి సంస్థ అవసరాల్లో వచ్చిన మార్పు దృష్ట్యా కొన్ని ఎంపిక చేసిన వృత్తివిద్యా కోర్సు కోసం భారత్‌లో విద్యావ్యాపారం చేయాని ప్రపంచ మార్కెట్ శక్తు ఆసక్తి గా ఉన్నాయి. ఈ విదేశీ సంస్థు కొత్త కోర్సుల్లో విద్యా సంస్థు తెరవడం కాకుండా స్థానికు కూడా సునాయసంగా నిర్వహించగల్గిన మార్కెట్‌ను కైవసం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. వృత్తి సేమ అంతర్జాతీయీకరించబడుతున్న కొద్దీ ఉన్నత విద్య ప్రపంచీకరణ ప్రక్రియ వేగవంతమవుతోంది. లాభాు ఆర్జించే మేనేజ్‌మెంట్, బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, ఆడిట్ అండ్ అకౌంట్స్ కోర్సు మంచి అవకాశాు కల్పించేందుకు సిద్థంగా ఉన్నాయి. అందుకే ఆంగ్ల భాషా ప్రావీణ్యం కల్గిన భారత యువతను బుట్టలో వేసుకునేందుకు భారత్‌లో విద్యా వ్యాపార సంస్థు నెకొల్పాని ప్రపంచ మార్కెట్ శక్తు భావిస్తున్నాయి. అటానమస్ విద్యాసంస్థకు అనుమతివ్వడం ద్వారా ప్రభుత్వం విదేశీ విద్యసంస్థకు తుపు తెరిచింది.
భారత్‌లో ఉన్నత విద్య ఇప్పటికీ వేగంగా అభివృద్థిచెందుతున్న రంగమే. అయితే ఈ రంగలో ప్రభుత్వ ఖర్చు తగ్గిపోబట్టే ప్రయివేట్ మార్కెట్‌కు డిమాండ్ ఏర్పడిరది. ప్రభుత్వ ఖర్చు ఉన్నత విద్యపై ప్రణాళికా వ్యయంలో 1.24 శాతం నుండి 0.35 శాతానికి తగ్గిపొయింది. దాదాపు 75 శాతం కాలేజీు ప్రయివేట్ రంగంలోనే ఉన్నాయి. ఉన్నత చదువుకయ్యే ఖర్చును విద్యార్థులే భరించానే ధోరణి రోజురోజుకీ పెరుగుతోంది. అధిక ఆదాయాున్న కుటుంబాకు చెందినవారు అత్యధిక ప్రయోజనాను చేజిక్కించుకుంటున్నారు. మరోవైపు ప్రయివేట్ కాలేజీ పెరుగుద వ్ల విద్యప్రమాణా నాణ్యత క్షీణిస్తోంది. ఉన్నత చదువు ఖర్చును విద్యార్థులే భరించడం పేదకు సాధ్యంకాదు. ఉన్నత విద్య ప్రయివేటీకరించబడితే అది పేదకు శాశ్వతంగా దూరమైపోతుంది.
తెంగాణ విద్యార్థి గళం, జులై`ఆగస్టు 2012
తెంగాణ విద్యార్థి గళం, జులై`ఆగస్టు 2012
ప్రపంచీకరణ యుగంలో దళిత యువత భవిష్యత్తు ఏమిటి?
నూతన ఆర్థిక విధానాు ప్రభుత్వ రంగాన్ని రోజు, రోజుకి కుదించి వేస్తున్నాయి. ఉన్న ఉపాధి హరించుకు పోతోంది. పాకు చెబుతున్న ప్రయివేటు, విదేశీ పెట్టుబడులో పెరుగుద కనిపిస్తోంది. కానీ ఉపాధికి మాత్రం పెరగడం లేదు. ప్రయివేటు పెట్టుబడి వీలైనన్ని తక్కువ ఉద్యోగాను, తక్కువ వేతనాను ఇచ్చే ఉద్యోగాును మత్రమే సృష్టిస్తోంది. దీని వన యువత విపరీతంగా నష్టపోతోంది. ఈ ప్రక్రియలో మొదట బవుతున్నది దళిత యువతే. తరతరా నుంచి అణగదొక్కబడి విద్యా, ఉద్యోగాకు దూరంగా ఉంచబడిన దళితు రాజ్యాంగం కల్పించిన రాయితీ కారణంగా వాటిలోకి ప్రవేశించగలిగారు. ప్రస్తుతం ప్రభుత్వాు తెస్తున్న సంస్కరణు రాజ్యాంగం దళితుకు కల్పించిన భద్రతను సవాు చేస్తున్నాయి.
1990లో ప్రకటించిన పారిశ్రామిక విధానంలో కేవం ఆరు నుంచి ఎనిమిది రకా పరిశ్రమను మాత్రమే ప్రభుత్వ ఆజమాయిషీ కింద ఉంచి మిగిలిన వాటిలోకి ప్రయివేట్ సంస్థను అనుమతించింది. ప్రస్తుతం వాటిని కూడా ప్రయివేట్ వారికే అప్పగించి తను తప్పుకునే ప్రయత్నాలో ఉంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాు పొందుతున్న దళితు ప్రస్తుతం ఉద్యోగాకు దూరమవుతున్నారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాలో వాటాను పొందుతున్న వారు నేడు ప్రభుత్యోగాపై ఆశు వదుకొని చేతి వృత్తు చేసుకుంటున్నారు. అనేక మంది దళిత గ్రాడ్యుయేట్లు నగరాకు వస వచ్చి పను వెతుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దళిత యువత భవిష్యత్తు ఆందోళనలో పడుతోంది. ప్రస్తుతం పాకు సంస్కరణతో అభివృద్ధిని నిలిపివేసి స్వాతంత్య్రనికి పూర్వపు రోజును ప్రసాదించబోతున్నారా అనే అనుమానం కుగుతోంది.
దళితు ఉపాధి ఎలా ఉంది:
దళితు ఉపాధి ఎలా ఉంది:
2001 జనాభా లెక్క ప్రకారం రాష్ట్రంలో దాదాపు కోటి యాబై క్ష మంది దళితున్నారు. వారిలో 10 క్ష మంది దారిద్య్ర రేఖకు ఎగువన ఉండగా, మిగిలిన కోటీ నభై క్ష మంది రెక్క కష్టంపై ఆధారపడి బతుకుతున్నారు. దళితులో అక్షరాస్యత దాదాపు 40 శాతం ఉన్నా కేవం 10 నుండి 15 శాతం మాత్రమే ఉద్యోగాకు అర్హత సంపాదించగుగుతున్నారు. రిజర్వేషన్ల వ్ల విద్య, ఉద్యోగాలో చోటు సంపాదించుకున్న ఈ సెక్షనే ప్రస్తుతం దళితులో కొంత మెరుగైన జీవితం గడుపుతున్నది. మిగిలిన వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికుగాను, దిగువ స్థాయి కార్మికుగాను జీవితాను వెళ్ళదీస్తున్నారు. ప్రస్తుతం జనాభాలో నాుగు శాతం ఉన్న ప్రభుత్వోద్యోగాు ప్రభుత్వాు అనుసరిస్తున్న విధానా వన రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. దీని వస ఙప్రపంచీకరణ యుగంలో యువత భవిష్యత్తు ఏమిటి?యువకుకు ఉపాధి మార్గాు మూసుకుపోతున్నాయి.
దళితు ప్రత్యేకించి కోల్పోతున్నదేమిటి?
ప్రయివేటీకరణ వన ప్రత్యేకంగా, అతి ఎక్కువగా నష్టపోతున్నది దళిత యువతే. రాష్ట్రంలో రిజిస్టేషన్ చేయించుకున్న దళిత నిరుద్యోగు 9.5 క్ష మంది ఉన్నారు. మిగిలిన వర్గాలో ఇంత కంటే ఎక్కువ మందే ఉన్నా ఈ పరిస్థితి లేదు. వారు ప్రభుత్వోద్యోగాపై ఎక్కువ ఆశ పెట్టుకోకుండా వేరే ఉద్యోగాను వ్యాపారాను చూసుకుంటున్నారు. ప్రభుత్వోద్యోగాలో వారి ప్రతిభకు తగ్గ రీతిలో ప్రాతినిధ్యం లేదన్న అసంతృప్తి ఉంది. వారు తమకున్న పరిచయా ద్వారాను, కొంత కష్టపడి ఇతర రంగాలో రాణించగుగుతున్నారు. ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగితను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ప్రయివేటు సంస్థలో దళితు ప్రధానంగా ఆన్‌స్కిల్డ్ కార్మికుగా ఉండగా దళితేతయి మేనేజ్‌మెంట్, క్లరికల్ స్థాయిలో ఉంటున్నారు. డిగ్రీు చదివిన తరువాత దళితుకు ప్రభుత్యోద్యోగాు రాకపోతే ఆటో డ్రైవర్లుగానో రాడ్ బెండిరగ్ వర్కర్లుగానో, మరే ఇతర సాధారణ కార్మీకుగా స్థిరపడుతున్నారు. మరలా ప్రభుత్యోగాు వస్తేనే వీరి జీవితాకు మెగు. లేదంటే క్రింది స్థాయి వృత్తులో స్థిరపడసి వస్తోంది. వీరికి వస్తే ప్రభుత్యోగాు లేదంటే మరే ఉద్యోగాు రావడం లేదు. పరిశ్రము అధికంగా ప్రయివేటు రంగంలో వస్తున్నాయి. వీటిలో రిజర్వేషన్లకు స్థానం లేదు. దీనిలో దళితుకు ఇక్కడ ప్రవేశం దుస్సాధ్యమవుతోంది. స్వదేశీ పరిశ్రము కానీ, వీదేశీ కంపెనీ అనుబంధ సంస్థు, ఏజెన్సీు అన్నీ అగ్రవర్ణా చేతుల్లోనే మెస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న, కొత్తగా ఏర్పడుతున్న పరిశ్రము దాదాపుగా పూర్తిగా దళితేతర వర్గా చేతుల్లోనే ఉన్నాయి. ప్రయివేట్ సంస్ధల్లో ఉద్యోగాకు ప్రతిభతోబాటు బంధుత్వాు, పరిచయాలే అర్హతుగా పనిచేస్తున్నాయి. చదువు పూర్తి చేసుకున్న అగ్ర వర్ణా యువత వాటితో ఉద్యోగాు దక్కించుకోగుగుతున్నారు. అగ్రవర్ణా కోటల్లోకి దళితు ప్రవేశం ఎలా సాధ్యం? అంతేకాక వారిలో ఇన్నాళ్ళుగా ఉన్న రిజర్వేషన్ వ్యతిరేకత కూడా ఇక్కడ బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. దళితు చేతులో ఉపాధిని ఇవ్వగలిగే పరిశ్రము గానీ, భూఖండాు గానీ లేవు. దీని వన వారికి ఉద్యోగా భ్యత ఇబ్బందిగా మారింది. రాజ్యాంగం దళితుకు కల్పించిన రక్షణు ప్రపంచీకరణ గాలివానకు కుప్పకూుతున్న తీరిది. అగ్రవర్ణాకు ఉన్న సంబంధాు, పరిచయాు వారిని కొంత మేరకు రక్షిస్తుండగా, దళిత యువకుకు మాత్రం దుర్భర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న టీచర్, పోలీసు ఉద్యోగాు కూడా రాకపోతే వీరు మరిన్ని ఇబ్బందు ఎదుర్కొనేవాటరు. రానున్న కాంలో ఈ పరిస్థితిని కూడా చూడవచ్చు.
ప్రయివేటీకరణ వన ప్రత్యేకంగా, అతి ఎక్కువగా నష్టపోతున్నది దళిత యువతే. రాష్ట్రంలో రిజిస్టేషన్ చేయించుకున్న దళిత నిరుద్యోగు 9.5 క్ష మంది ఉన్నారు. మిగిలిన వర్గాలో ఇంత కంటే ఎక్కువ మందే ఉన్నా ఈ పరిస్థితి లేదు. వారు ప్రభుత్వోద్యోగాపై ఎక్కువ ఆశ పెట్టుకోకుండా వేరే ఉద్యోగాను వ్యాపారాను చూసుకుంటున్నారు. ప్రభుత్వోద్యోగాలో వారి ప్రతిభకు తగ్గ రీతిలో ప్రాతినిధ్యం లేదన్న అసంతృప్తి ఉంది. వారు తమకున్న పరిచయా ద్వారాను, కొంత కష్టపడి ఇతర రంగాలో రాణించగుగుతున్నారు. ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగితను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ప్రయివేటు సంస్థలో దళితు ప్రధానంగా ఆన్‌స్కిల్డ్ కార్మికుగా ఉండగా దళితేతయి మేనేజ్‌మెంట్, క్లరికల్ స్థాయిలో ఉంటున్నారు. డిగ్రీు చదివిన తరువాత దళితుకు ప్రభుత్యోద్యోగాు రాకపోతే ఆటో డ్రైవర్లుగానో రాడ్ బెండిరగ్ వర్కర్లుగానో, మరే ఇతర సాధారణ కార్మీకుగా స్థిరపడుతున్నారు. మరలా ప్రభుత్యోగాు వస్తేనే వీరి జీవితాకు మెగు. లేదంటే క్రింది స్థాయి వృత్తులో స్థిరపడసి వస్తోంది. వీరికి వస్తే ప్రభుత్యోగాు లేదంటే మరే ఉద్యోగాు రావడం లేదు. పరిశ్రము అధికంగా ప్రయివేటు రంగంలో వస్తున్నాయి. వీటిలో రిజర్వేషన్లకు స్థానం లేదు. దీనిలో దళితుకు ఇక్కడ ప్రవేశం దుస్సాధ్యమవుతోంది. స్వదేశీ పరిశ్రము కానీ, వీదేశీ కంపెనీ అనుబంధ సంస్థు, ఏజెన్సీు అన్నీ అగ్రవర్ణా చేతుల్లోనే మెస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న, కొత్తగా ఏర్పడుతున్న పరిశ్రము దాదాపుగా పూర్తిగా దళితేతర వర్గా చేతుల్లోనే ఉన్నాయి. ప్రయివేట్ సంస్ధల్లో ఉద్యోగాకు ప్రతిభతోబాటు బంధుత్వాు, పరిచయాలే అర్హతుగా పనిచేస్తున్నాయి. చదువు పూర్తి చేసుకున్న అగ్ర వర్ణా యువత వాటితో ఉద్యోగాు దక్కించుకోగుగుతున్నారు. అగ్రవర్ణా కోటల్లోకి దళితు ప్రవేశం ఎలా సాధ్యం? అంతేకాక వారిలో ఇన్నాళ్ళుగా ఉన్న రిజర్వేషన్ వ్యతిరేకత కూడా ఇక్కడ బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. దళితు చేతులో ఉపాధిని ఇవ్వగలిగే పరిశ్రము గానీ, భూఖండాు గానీ లేవు. దీని వన వారికి ఉద్యోగా భ్యత ఇబ్బందిగా మారింది. రాజ్యాంగం దళితుకు కల్పించిన రక్షణు ప్రపంచీకరణ గాలివానకు కుప్పకూుతున్న తీరిది. అగ్రవర్ణాకు ఉన్న సంబంధాు, పరిచయాు వారిని కొంత మేరకు రక్షిస్తుండగా, దళిత యువకుకు మాత్రం దుర్భర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న టీచర్, పోలీసు ఉద్యోగాు కూడా రాకపోతే వీరు మరిన్ని ఇబ్బందు ఎదుర్కొనేవాటరు. రానున్న కాంలో ఈ పరిస్థితిని కూడా చూడవచ్చు.
దళితుపై ప్రపంచీకరణ ప్రభావం
ప్రపంచీకరణ ఫలితా గురించి తొసుకుంటున్న దళితు ఈ ప్రపంచీకరణే తమ పరిస్థితికి కారణమంటున్నారు. ప్రపంచీకరణ వ్ల వేగంగా ప్రభుత్వ రంగం హరించుకపోతోందన్న ఆందోళన వీరిలో కనిపిస్తోంది. ఉత్పత్తిలో ప్రభుత్వ పాత్ర తగ్గి మార్కెట్ శక్తు పాత్ర పెరగడం వన దళిత యువకుకు అవకాశాు రోజు రోజుకూ కుచించుకు పోతున్నాయి. దీనీ వ్ల ప్రపంచీకరణపై దళితు నిరసన పెరుగుతోంది. ఇదే సమయంలో ప్రపంచీకరణ వ్ల దళితుకు మేు జరుగబోతుందని, అమెరికా, నుంచి వచ్చిన దొరు అక్కడి న్లవారిని చూసినట్లే దళితును ఉద్ధరిస్తారని, కనుక బహుళజాతి సంస్థను ఆహ్వానించాని చంద్రభాను ప్రసాద్ వంటి దళిత మేధావు చెబుతున్నారు. కానీ ఆమెరికన్లు తమ దేశ:లో చేసుకున్న చట్లాలే విదేశీయు చేస్తే ఊరుకోరన్న విషయం ఆయనకు తెలియనట్లుంది. ఆమెరికాలో ఉన్న పెటేంట్ చట్టం, గుత్తాధిపత్య వ్యతిరేక చట్టం వంటివి విదేశాు చేస్తే అమెరికా సహించదు. తన పౌరును ప్రేమగా చూసుకునే అమెరాకి పాకు వేరే దేశా పట్ట వివక్ష భావంతోనే ఉంటున్నారన్నది స్పష్టం. వారు ఇక్కడ వ్యాపారం కోసం బం, బగం ఉన్న భూస్వాము, జాతీయ పెట్టుబడిదారు వైపై ఉంటారన్నది. తిరుగులేని సత్యం. అంతే కాకుండా అమెరికాలో న్ల జాతి ప్రజు సుధీర్ఘ పోరాటం నడిపిన తర్వాత వారికి విముక్తి భించింది. బహుళ జాతి సంస్థ దయా దాక్షిణ్యా వ్ల కాదు. అయినా ఇప్పటికీ అక్కడ న్లజాతి వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. న్లవారు ఎక్కువగా క్రిందిస్థాయి ఉద్యోగాలోనూ, సైన్యంలోనూ పనిచేస్తున్నారు. సంపద ప్రధానంగా త్లెజాతి వారి చేతులో ఉండగా న్లవారు గెట్టోుగా పివబడే మురికివాడలో జీవిస్తున్నారు. బహుళజాతి సంస్థు దళితు ప్రయోజాకు అనుకూమని చేస్తున్న ప్రచారం ఎవరికి అనుకూమో త్చేుకోవచ్చు.
ప్రభుత్వ సంస్థ ప్రయివేటీకరణను గట్టిగా వ్యతిరేకించని దళిత సంస్థు నేడు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కావాని కోరుతున్నాయి. సంస్థలో ఉన్న కార్మికు ప్రాథమిక హక్కునే లాక్కోజూస్తున్న ప్రభుత్వాు కొత్తగా దళితుకు రిజర్వేషన్లు ఇస్తాయని అనుకోలేము. యాజమాన్యా మెప్పు కోసం బరి తెగిస్తున్న ప్రభుత్వాు ఇటువంటి సాహసోపేత నిర్ణయాను ఎట్టి పరిస్థితిలోను తీసుకోవు. ఎందుకంటే పరిశ్రమాధిపతు నుండి ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత ఎదురు కావచ్చు. ప్రస్తుతం ప్రభుత్యోద్యోగాు లేక, ప్రయివేటు ఉద్యోగాు రాక దళిత యువకు భవిష్యత్తు అంధకారమయమవుతోంది. నిపుఉ గప్పిన నిప్పులా ఉన్నఈ ప్రమాదం నానాటికీ పెరుగుతున్నది. రాబోయే రోజులో ప్రపంచీకరణ ప్రదర్శించబోయే విశ్వరూపం దళిత యువతి, యువకు భవిష్యత్తును పూర్తిగా నాశనం చేయ్యక ముందే దానిని ప్రతిఘటించి తిప్పికొట్టాలి. దళిత యువత ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమాలో పాు పంచుకోవాలి.
ఈజిప్టులో నిరసన ఉద్యమం
గత డిసెంబరు-జనవరి నెలల్లో ట్యూనీసియాలో సాగిన ప్రజా ఉద్యమం 23 ఏళ్ల బెన్ అలీ ప్రభుత్వాన్ని తొలగించింది. పశ్చిమాసియా దేశాలన్నింటా దీని ప్రభావం పడింది. ముఖ్యంగా ఈజిప్టూలో 20 ఏళ్లుగా అత్యంత నిరంకుశ పాలన సాగిస్తున్న హోస్ని ముబారక్ ప్రభుత్వం ప్రజా ఉద్యమ వెల్లువతో గద్దెదిగింది. యెమెన్, బెహరీన్, మొరాకో, సిరియా, లిబియా మొదలగు దేశాల్లోని ప్రభుత్వాలు వెల్లువెత్తిన ప్రజా ఉద్యమాలతో గడగడలాడాయి. ఈ నిరసనోద్యమాల సందర్భం, కారణాలు, రూపాలు, నాయకత్వాలు భిన్నంగా వున్నాయి. అయితే అవన్నీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగానూ, రాజకీయ మార్పులకొరకూ సాగిన రాజకీయ ఉద్యమాలు.
ఈజిప్టులోని ప్రజావెల్లువకు ప్రత్యేక రాజకీయ ప్రాధన్యత వున్నది. నేటి ప్రపంచంలో అనుకూల భౌతిక పరిస్థితికి అది అద్దం పట్టింది. సమాజంలో మార్పులు తీసుకురావటంలో ప్రజలెంతటి నిర్ణయాత్మక పాత్ర నిర్వహించగలరో అది చూపింది. ప్రజా ఉద్యమపు బలాన్నీ, బలహీనతనూ, పోరాట ఫలాలు ప్రజలకందేట్లు చూడటానికి సరైన రాజకీయ నాయకత్వపు అవశ్యకతనూ ఎత్తి చూపింది.
నిరసనోద్యమ క్రమం: 8కోట్ల జనాభా కలిగిన ఈజిప్టు, పశ్చిమాసియాలో పెద్దదేశం. ఒక సమయంలో వలసవాద వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామయ్య వ్యతిరేక పోరాటాలు సాగించిన చరిత్ర దానికుంది. ఇజ్రేలి జియోనిస్టులు దురాక్రమించిన మాతృభూమి కొరకు పాలస్తీనా ప్రజల పోరాటాలకు పెట్టని కోటగా వుండేది. అయితే గత నాలుగు దశాబ్దాలుగా ఈజిప్టును పాలిస్తున్న వర్గాలు విద్రోహబాటన నడిచాయి. సామ్రాజ్యవాదులకు, ప్రత్యేకించి అమెరికా సామ్రాజ్యవాదులకు దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పాలకవార్గాలు అత్యంత నిరంకుశ, అణచివేత, దోపిడీ పాలనను ఈజిప్టు ప్రజలపై రుద్దాయి. ముబారక్ 30 ఏళ్లు దేశాన్ని పాలించాడు. ఇతని పాలన ప్రజలకు దుర్భరమైంది. ఈ పాలనకు వ్యతిరేకంగా ప్రజాఉద్యమ వెల్లువెత్తడం సహజ పరిణామం.
ముబారక్ పాలన తీరు గురించి సామ్రాజ్యవాదుల పత్రిక ది న్యూయార్క్ టైమ్స్ ఇలా రాసింది: ''కైరోలో ధనికులకూ, పేదలకూ మధ్య నానాటికీ పెరిగిపోతున్న వ్యత్యాసం కైరో నగర జీవనంలో ప్రభుఖంగా కనిపించే అంశాలలో ఒకటి. అక్కడి సామాజిక ఘర్షణకు అదే మూలం. అయినా ముబారక్ పాలన కొద్దిమందికి ఆర్థిక లాభాలు చేకూరుస్తూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించింది. ధనికులు నగరాన్ని విడిచి వెళ్లారు. అమెరికా ధనికుల ఇళ్ల తరహాలో ఎతైన ప్రహరీ గోడలమధ్య బయటివారితో సంబంధంలేని భవంతుల సముదాయాల్లో నివశిస్తున్నారు. సామాన్య ఈజిప్టియన్ల నుండి వారు వేరుపడి ఒంటరిగా వుండటం కొట్టవచ్చినట్లు కన్పిస్తుంది.''. ఈ ప్రైవేటీకరణను రుద్దిందీ, దాని నుండి లాభపడిందీ సామ్రాజ్యవాదులూ, వారి దళారీలేనన్న వాస్తవాన్ని అది చెప్పకుండా వదిలివేసింది.
''ముబారక్ దిగిపో'', ప్రజాస్వామిక పాలననూ, ప్రజాస్వామిక హక్కులను పున:స్థాపించాలి''-ఇవి నిరసనోద్యమ ప్రధాన నినాదాలయ్యాయి. కొద్ది రోజుల్లోనే రాజధాని కైరోనుండి ప్రజాఉద్యమం అన్ని నగరాలకూ వ్యాపించింది. విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, ఉద్యోగులు, మేధావులు, జనాభాలోని ఇతర సెక్షన్లు లక్షలాదిగా వీధుల్లోకి వచ్చారు. వివిధ రుపాల్లో నిరసన వ్యక్తం చేశారు. తహ్రీర్ స్క్వేర్ సమీకరణ కేంద్రంగానూ, మార్గదర్శిగానూ రూపొందింది.
ఈ నిరసన ''ఆగ్రహ దినం''గా పిలువబడుతున్న జనవరి 25న ప్రారంభమైంది. ట్యూనిషియా పరిణామాలు ఈజిప్టులో పునరావృతం కానివ్వరాదన్న తలంపులోనే ముబారక్ ప్రభుత్వం మొదటి నుండీ వ్యవహరించింది. ప్రదర్శనలను నిషేధించింది. బుల్లెట్ల వర్షం కురిపించింది. అరెస్టులు సాగించింది. అయితే ఈ చర్యలు ప్రజల ఆగ్రహాన్ని మరింతగా పెంచాయి. వారిని మరింతగా మిలిటెంటు చర్యలలోకి తెచ్చాయి.
జనవరి 28న ప్రజలను బుజ్జగించేందుకు మంత్రి వర్గాన్ని రద్దుపరిచినట్లు ముబారక్ ప్రకటించాడు. అంతరంగిక భద్రత ముఖ్య అధికారి ఒమర్ సులేమాన్‌ను ఉపాధ్యక్షుడిగానూ, వైమానిక దళకమాండర్ అహ్మద్ సఫీకిని ప్రధానమంత్రిగానూ నియమించాడు. ప్రజలు దీనిని తిరస్కరించారు. ''ముబారక్ దిగిపో'' అని ముక్తకంఠంతో నినదించారు. జనవరి 29న పాలక పార్టీ నాయకులపైనా, మంత్రులపైనా, కార్యాలయాలపైన ప్రజలు విరుచుకుపడ్డారు.
జనవరి 30న ప్రజల ద్వేషానికి గురైన అంతరంగిక భద్రతా దళాన్ని రంగం నుండి తప్పించి, టాంకులతో, సాయుధ శకటాలతో సైన్యం ప్రవేశించింది. నిరసనోద్యమ కార్యకర్తలు ప్రదర్శనలను నిర్వహించే కృషిలో నిమగ్నమై వుండగా, అసాంఘికశక్తులు సూపర్ మార్కెట్లు, షాపులు, హోటళ్లను దోచుకొన్నాయి. దీనిని అడ్డుకునేందుకు నిరసనోద్యమారులు ప్రయత్నించారు. వారు బృందాలుగా ఏర్పడి రోడ్లను దిగ్బంధించి పేటలలో అరాచకాన్ని అదుపు చేశారు. దక్షిణ కైరో మసీదులల్లోని మైకులలో దోపిడీని అపేందుకు ముందుకురమ్మని యువతకు విజ్ఞప్తి చేశారు. జాతి మ్యూజియంను దోచుకునే ప్రయత్నాన్ని నివారించేందుకు 3000 మంది నిరసనకారులు మ్యూజియం చుట్టూ గొలుసుకట్టి రక్షణగా నిలిచిన సంఘటనను ఒక విలేఖరి సవివరంగా పేర్కొన్నారు.
అదే రోజున 5 సంస్థలు కలిసి ''మార్పు కొరకు జాతీయ కూటమి''గా ఏర్పడ్డాయి. ఫిబ్రవరి 2న తహ్రీర్ స్క్వేర్‌లో పెద్ద ప్రజా ప్రదర్శనకు పిలుపు నిచ్చింది. దేశం నలుమూలలనుండీ 20 లక్షల మంది అక్కడకు చేరి ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించారు. దీనితో 2011 సెప్టెంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటిచేయబోనని ముబారక్ ప్రకటించాడు. దీనితో సెప్టెంబరు వరకూ అధికారంలో వుండి రాజకీయ మార్పుల క్రమాన్ని తానే నడిపిస్తానని స్పష్టం చేశాడు.
విచ్ఛిన్నకుల తరిమివేత: వేలాది ప్రజలు కూడిన తహ్రీర్ స్క్వేర్‌తో సహా కైరో అంతటా గూండాలనూ, అసాంఘిక శక్తులనూ ఫిబ్రవరి 3న ముబారక్ పంపాడు. ప్రజాఉద్యమాన్ని విచ్ఛిన్నంచేసేందుకూ తీసుకున్న అసహ్యకర చర్య యిది. ప్రదర్శకుపై విచ్ఛిన్నకారులు రాళ్లు, పెట్రోలు బాంబులు విసిరారు. తుపాకీ కాల్పులు చేశారు. దీనితో ప్రదర్శకులకూ విచ్ఛిన్నకులకూ మధ్య ఘర్షణలు సాగాయి. సైన్యం చూస్తూ వూరకుంది. విచ్ఛిన్నకులనేమీ చేయకుండా స్వేచ్ఛనిచ్చి ప్రదర్శకులను గుర్తింపుకార్డులు చూపమని వేధించింది. అయితే ప్రదర్శకులు అద్భుత ధైర్యాన్ని, ఐక్యతనూ చూపారు. ప్రజల సహాయ సహకారాలు పొందారు. చీకటి పడేసరికి విచ్ఛిన్నకారులను తరిమి వేశారు. తహ్రీర్ స్క్వేర్‌ను తమ ఆధీనంలో వుంచుకున్నారు. వారి ప్రభావం కైరోలో విస్తరించింది.
అదేరోజు రాత్రి ముబారక్ రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. తాను పదవినుండి తప్పుకోబోనని, కొత్తమంత్రి వర్గాన్ని ఏర్పాటుచేస్తాననీ, తన నాయకత్వంలో తరువాయి చర్యలుంటాయని ప్రకటించాడు. దీనికి ప్రతి స్పందనగా నిరసనకారులు ఫిబ్రవరి 4ను ''ముబరాక్‌ను దించివేసే రోజు''గా పరిగణించి దేశవ్యాపిత ప్రదర్శనలు చేయమని పిలుపునిచ్చారు.
ప్రజాగ్రహాన్ని చవిచూసిన పాలకులు ప్రజలను శాంతపరిచేందుకు నిరసనకారులపై హింసకు పాల్పడిన వారందరినీ శిక్షిస్తాననీ, అరెస్టుచేసిన నిరసనకారులను విడుదల చేస్తాననీ ఉపాధ్యక్షుడు సులేమాన్ ప్రకటించాడు. శాంతియుతంగా వున్న ప్రదర్శకులపై (ముబారక్ పంపిన గూండాలు) దాడిచేసినందుకు (ముబారక్ నియమించిన) ప్రధానమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాడు. ఆ చర్యలను ''వినాశకర పొరపాట''ని ఖండించాడు. కొత్త మంత్రివర్గం కొన్ని ప్రజాకర్షక పథకాలను ప్రకటించింది. సంభాషణలకు సిద్ధంగా వున్నానని సూచించింది. తన తర్వాత పదవిని అప్పగించేందుకు ముబారక్ ప్రయత్నిస్తున్నాడు అతని కుమారుడు పాలక పార్టీ ఎన్.డి.పి. ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసినట్టు ఫిబ్రవరి 6న ప్రకటించాడు. తన తర్వాత తన కొడుకును వారసుడిగా చేయాలన్న ముబారక్ ప్రయత్నం ఈజిప్టు పాలక ముఠాల్లో వివాదాంశంగా వుంది.
శాంతియుతంగా అధికార మార్పిడి చేసేందుకు ముబారక్ ప్రభుత్వం సుముఖంగా వుందని ఉపాధ్యక్షుడు ఒమర్ సులేమాన్ సూచించాడు. ఫిబ్రవరి 10న ఒక సైన్యాధికారి తెహ్రీర్ స్క్వేర్‌కు వచ్చి ''మీరు కోరుకుంటున్నంతా జరుగుతుందని'' నిరసనకారులకు హామీ యిచ్చాడు. ముబారక్ దిగిపోయి సైన్యానికి అధికారమప్పగించాడనీ, అధ్యక్ష భవనం నుండి ఎర్ర సముద్ర తీరాన వున్న షర్మ్ ఎల్ షేక్‌లోని భవనానికి మారాడనీ ఫిబ్రవరి 11న వార్తలు వెలువడ్డాయి. ప్రజాస్వామ్య పరివర్తనను నడిపిస్తాననీ, కొత్త ప్రభుత్వమేర్పడేవరకూ ఇప్పటి పౌర పరిపానా యంత్రాగమే కొనసాగుతుందనీ సైన్యం ప్రకటించింది. సైన్య సర్వోచ్ఛ సమితి అద్యక్షుడైన రక్షణమంత్రికే సర్వాధికారాలుంటాయి. ఫిబ్రవరి 13న సైనిక పాలకులు రాజ్యాంగ చట్టాన్ని సస్పెండ్ చేశారు. పార్లమెంటును రద్దుచేశారు. అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికలు జరుపుతాననీ, రాజ్యాంగ చట్టానికి సవరణ వంటి తదితర చర్యలు తీసుకుంటాననీ వాగ్దానం సైన్యం చేసింది. 1979లో ఇజ్రాయిల్‌తో గత ప్రభ్వుం చేసుకున్న శాంతి ఒప్పందమనే దానితో సభా అన్ని అంతర్జాతీయ ఒప్పందాలనూ గౌరవిస్తానని హామీ యిచ్చింది.
నియంత వైదొలిగాడు-నియంతృత్వం వుంది: ముబారక్ తొలగిపోవటాన్ని అందరూ ఆహ్వానించారు. ఈజిప్టులో ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్‌ద్వారా నిరసనకు ఆజ్యంపోసిన గూగుల్ ఉద్యోగి వాయోల్ ''గోనిమ్'' కర్తవ్యం పూర్తయిందని'' ప్రకటించాడు. మార్పు కొరకు జాతీయ కూటమి అధ్యక్షుడి ఎల్‌బరాడీ ''నా జీవితంలో ఇది గొప్పరోజ''ని అన్నాడు. ఈజిప్టులో ప్రధాన పక్షమైన ముస్లిం బ్రదర్ హుడ్ (ముస్లిం సహోదరత్వం) ''ఈజిప్టు ప్రజలు ప్రధాన లక్ష్యాన్ని సాధించారని'' వ్యాఖ్యానించింది. అయితే ప్రజలూ, నాయకత్వంలో వున్న కొందరూ ఈ పరిణామంపై భిన్న అంచనానూ, వైఖరులనూ, ఈజిప్టు రాజకీయ భవితత్వంపై ఆందోళననూ వ్యక్తం చేశారు. వాటిలో కొన్ని: ''సైన్యాన్ని నమ్మటమంటే, మన గోతిని మనం తవ్వుకోవటమే'', ''నియంత పోయాడు కానీ నియంతృత్వం వుంది'', '' అన్ని డిమాండ్లు తీరేవరకూ నిరసన కొనసాగించి తీరాలి'', '' వెంటనే రాజ్యాంగ చట్టాన్ని రద్దు చేయాలి. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకనుగుణంగా కొత్త తాత్కాలిక రాజ్యాంగ చట్టాన్ని తేవాలి'',''రాజకీయ పరివర్తనను సరైన దిశలోయనడిపేందుకు జాతీయ ఐకత్యా ప్రభుత్వాన్నేర్పాటుచేసి సైన్యం ప్రజలతో అధికారాన్ని ప్రంచుకోవాలి'', ''అత్యయిక పరిస్థితి చట్టాలను రద్దుచేయాలి. రాజ్యభద్రతా యంత్రాగాన్ని క్షాళనచేయాలి''. దీని తర్వాత ప్రజలనేక రూపాల్లో తన నిరసనను వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 18న రాజకీయ ఖైదీల విడుదల, మంత్రుల తొలగింపు, అత్యయిక పరిస్థితి చట్టాల రద్దు తదితర డిమాండ్లతో లక్షలాది ప్రజలు ప్రదర్శనలు చేశారు. సైన్యం లాఠీలు, కొరడాలు నిరసనకారులపై వాడింది. మరోవైపున అవినీతి ఆరోపణలున్న కొందరు మంత్రులపై చట్ట పర చర్యలు తీసుకోవటం ప్రధాన మంత్రి తొలగింపు, రాజకీయ పరివర్తన త్వరితంగా ముగిస్తానన్న వాగ్దానంతో ప్రజలను బుజ్జగించచూసింది. ప్రజలకూ, సైన్యానికీ మధ్య ఘర్షణ, నిరసనోద్యమం కొనసాగుతున్నాయి.
కొన్ని నిర్థారణలు: ఈజిప్టులోని పరిణామాలు కొన్ని విషయాలను స్పష్టంచేశాయి. దశాబ్దాలపాటు ఈజిప్టు ప్రజలు దారిద్య్రం, నిరుద్యోగం, దోపిడీ, అభద్రత, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధిక ధరలు, అణచివేత, నిరంకుశ పాలన క్రింద నలిగిపోయారు. పేరుకుపోతున్న ఆగ్రహం అగ్ని పర్వతంలా పేలి నిరసనోద్యమం వెల్లువెత్తింది. దశాబ్దాల నిరంకుశపాలన పాలకవర్గాల్లో వైరుధ్యాలను తీవ్రంచేసి రాజకీయ సంక్షోభంలోకి నెట్టింది. మూడు దశాబ్దాల ముబారక్ నిరంకుశ పాలన ఈజిప్టును సామ్రాజ్యవాద ప్రత్యేకించి అమెరికా సామ్రాజ్యవాద దోపిడీ, అణచివేతలకు గురిచేసింది. పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయిలు యూదు దురహంకారులతో సిగ్గులేకుండా రాజీపడింది. ప్రస్తుత నిరసనోద్యమం ఈ అంశాలను విమర్శించడకపోవటం, తన డిమాండ్లుగా చేర్చకపోవటం నిజమే. అయినా ప్రజలలో ముబారక్ పాలనపై అసంతృప్తి పెరగడానికి ఇవి కూడా తోడ్పడ్డాయి.
ముబారక్ పాలనపై తిరగబడేందుకు ట్యునీషియాలో బెన్‌ఆలీని పదవీచ్చుతుడ్ని చేసిన ప్రజా ఉద్యమం స్ఫూర్తినిచ్చింది. ఉత్సాహవంతులైన కొందరు యువకులు ఇంటర్నెట్‌ద్వారా దేశమంతటా సందేశాలు పంని అగ్నిరగిల్చారు. నిరసన ప్రదర్శనలు హఠాత్తుగా ఎలాంటి నిర్మాణ ప్రయత్నాలూ లేకుండా ప్రధానంగా ప్రారంభమయ్యాయి. ఒక నిరిష్ట రాజకీయ నాయకత్వమూ లేకుండింది. ఆంక్షలూ, నిషేధాలూ వుండటంతో ప్రజాఉద్యమానికి బహిరంగంగా, ప్రత్యక్షంగా నాయకత్వం వహించలేని స్థితిలో ప్రతిపక్షాలున్నాయి. ప్రధాన ప్రతిపక్షపార్టీ ముస్లిం బ్రదర్‌హుడ్ కూడా ఇదే స్థితిలో వుంది. నిసనోద్యమం ఊపందుకున్న తర్వాతే రాజకీయపార్టీలు దానితో కలిసాయి. ''ఏప్రిల్ 6 యువజనోద్యమం'' ముస్లిం బ్రదర్ హుడ్ మార్పుకోరకు ఈజిప్టు ఉద్యమం, మాది ఖాలిద్ సయీద్ ఉద్యమం. కపాయా(ఇకచాలు) ఉద్యమం వంటి సంస్థలు నిరసనోద్యమంలో చురుకుగా వున్నాయి. అవన్నీ కలిసి ఎల్ బరాడే నాయకుడిగా ''మార్పు కొరకు జాతీయ కూటమి'' అన్న ఐక్యవేదికను ఏర్పరచుకున్నాయి. ముబారక్ నిరంకుశ పాలన ముగియాలన్న , ఈజిప్టులో బూర్జువా ప్రసాజ్వామిక వ్యవస్థ ఏర్పడాలన్న డిమాండుపై ఈ శక్తులన్నీ చివరివరకూ ఐక్యంగా వున్నాయి. అదే సమయంలో పరిస్థిపై అంచనాలు, వైఖరులు, లక్ష్యాలలో అవి విబేధించాయి. ముబారక్ ఎత్తుగడలను ఎదుర్కోవటంలో వారి నాయకత్వంలో కొరవడిన ఐక్యత, రాజకీయ అసమగ్రత కూడా వ్యక్తమైంది.
ప్రజలు అత్యుహ్సంతో నాయకత్వమిచ్చిన పిలుపులకు స్పందించారు. సూయెజ్ నగరంలోనూ, నైలునదీ తీరానవున్న పారిశ్రామిక వాడల్లోనూ కార్మికులు తమ డిమాండ్ల సాధననకు సార్వత్రిక సమ్మె చేశారు. కొన్ని చోట్ల నిరసనోద్యమానికీ సంఘీభావంగా సమ్మె చేశారు. వేలాది మహిళలూ, పురుషులూ రోజుల తరబడి తహ్రీర్ స్క్వేర్‌లో బైఠాయించారు. ముబారక్ గూండాల నెదుర్కోవటంలో నిరసనకారులకు ప్రజలండగా నిలిచారు. వారికి నీరు. ఆహారం, అందించారు. వీధులలో వారికి స్వాగతం పలికారు. మహిళలు వెనుకనుండి వారికి రాళ్ళందించారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్సచేసి తాత్కాలిక అసుపత్రులకు తరలించారు. అసాంఘిక, గూండాశక్తుల జాతీయ సంపదను దోచుకునే ప్రయత్నాలను అడ్డుకున్నారు. పిల్లలు, యువత, మహిళలు వీధుల్లో పేరుకున్న చెత్తను తొలగించే పని కూడా ఉత్సాహంతో చేపట్టారు. ఒక్కమాటలో నిరసనోద్యమానికి ప్రజా స్వభావం వుంది. నిరంకుశపాలన ప్రజలనుండి ఏకాకి అయిపోయింది.
చివరి క్షణం వరకూ ముబారక్ గద్దెను పట్టుకునే వున్నాడు. ఇంకా అధికారాన్ని అంటిపెట్టుకుని వుంటే మరింత వినాశనకర ఫలితాలే తనకు వస్తాయన్న నిర్ణయానికొచ్చి తర్వాతే, ఈజిప్తులో పశ్చిమాసియాలో సామ్రాజ్యవాద ప్రయోజనాలకు హానికలగకుండా వుండాలంటే ముబారక్ గద్దె దిగల తప్పదన్న నిర్థారణకు ముబారక్‌కు వత్తాసు పలికిన సామ్రాజ్యవాదులు వచ్చిన తర్వాతే ముబారక్ అధికారాన్ని వదులుకునేందుకు సిద్ధపడ్డాడు. తాను అధికారాన్ని బదలాయించిన సైన్యమూ, తాను నియమించిన ఉపాధ్యక్షడూ, ప్రధానమంత్రి ముబారక్‌కు విశ్వసనీయులు. అతని నిరంకుశపాలనకు మూలసంభాలుగా వుండినవారే. సామ్రాజ్యవాద, ప్రత్యేకించి అమెరికా సామ్రాజ్యవాద అనుకూల విధానాలను అమలు పరిపినవారే. పాలస్తీనీయులకు వ్యతిరేకంగా ఇజ్రాయిలు యూదు దురంహాకారులతో సిగ్గుమాలిన ఒప్పందాలు చేసుకున్న వారే.
ఈపిప్టులో ప్రజావ్యతిరేక, ప్రజాస్వామిక వ్యతిరేక, సామ్రాజ్యవాద అనుకూల విధానాలను రూపుదిద్దటంలో 1990ల నుండీ చురుకైన పాత్ర వహించిన ఒమర్ సులేమాన్‌నే ఉపాధ్యక్షుడిగా ముబారక్ నియమించాడు. అతడు అమెరికా బంటు. అమెరికా గుఢచారి సంస్థ ''అప్పగింత' కార్యక్రమం అమలులో ముఖ్యవాహకంగా పనిచేశాడు. ''అప్పగింత'' కార్యక్రమంమంటే ప్రపచంలో ఎకైడైనా అమెరికాను వ్యతిరేకిస్తున్న లేదా వ్యతిరేకిస్తున్నారని అనుమానించిన వ్యక్తులను ఎత్తుకొచ్చి అమెరికా గుఢాచిరి సంస్థ వారిని పశ్చిమాసియాలోని తమ అనుకూల ప్రభుత్వాలకు అప్పగిస్తుంది. ఆ ప్రభుత్వాలు వారిని హింసించి, ఒప్పందాల ప్రకటనలు రాబట్టుతాయి. లేదా చంపివేస్తాయి.
ముబారక్ అధికారాన్ని బదలాయించిన సైన్యం ఈజిప్టు రాజకీయాల్లో ప్రధాన పాత్రధారిగా వుంది. అమెరికాకు ఈ సైన్యంతో సన్నిహిత సంబంధాలున్నాయి; దానికి ద్రవ్యం సమకూరుస్తున్నది. అదెలా ప్రవర్తించాలో ఆదేశిస్తున్నది. నిరసనోద్యమం ఉచ్ఛస్థాయిలో వున్పప్పుడు ఈజిప్టు సైన్య ప్రధాన అధిపతి సామి హఫీజ్ అమెరికాలో వున్నాడు. ఈజిప్టుకు తిరిగి వచ్చేలాగా నిరసనోద్యమంతో ఎలా వ్యవహరించాలో అక్కడ పాఠాలు నేర్చుకుని వచ్చాడని పత్రికలే వ్యాఖ్యానించాయి. అమెరికా సామ్రాజ్యవాదులు ఈజిప్టు సైన్యాన్ని ''నిజమైన అధికార కేంద్రం''గానూ, అధికార బదలాయింపు క్రమాన్ని ఒడిదుడుకులు లేకుండా సాఫీగా నిర్వహించగల సామర్థ్యం వున్నదానిగానూ పరిగణించారు. నిరసనోద్యమం సాగిన 18 రోజులూ, ప్రజల ద్వేషానికి గురైన అంతరంగిక భద్రతాదళం కంటే తాను భిన్నమైన దానిగా నిష్ఫక్షనాతమైనదిగా చూపెట్టుకునేందుకూ సైన్యం నాటకాలాడింది. ప్రదర్శకులతో స్నేహాన్ని నటించింది. వారితో ఘర్షణ పడకుండా ఆగింది. సైన్యానికి అధికార బదలాయింపు జరగగానే, అది తన అసలు రూపు బయట పెట్టుకుంది. రాజకీయ పరివర్తనను ఈజిప్టు పాలక వర్గాలకూ, వారి సామ్రాజ్యవాద వత్తాసుదారులకు అనుకూలంగా మలిచేందుకు పూనుకుంది. సామ్రాజ్యవాద యాజమానులు నిర్దేశించిన పద్ధతిలోనే ఈజిప్టు సైన్యం వ్యవహరించింది.
వలసవాదులకూ, సామ్రాజ్యవాదులకూ పశ్చిమాసియా దేశాలు లాభాల పంట భూమిగా కన్పిస్తున్నాయి. అమెరికా తన ప్రపంచాధిపత్య వ్యూహంలో ఈ ప్రాంతాన్ని కీలకమైనదిగా పరిగణిస్తున్నది. అపార ముడిచమురు వనరులూ, ముఖ్యమైన సముద్ర మార్గాలూ ఇక్కడ వున్నాయి. మాతృభూమి కొరకు పాలస్తీనా ప్రజలు పోరాడుతున్నారు. లెబనాన్‌లో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రాజీపడని శక్తిగా హిజ్‌బొల్లా వుంది. ఇరాక్ ప్రజలు అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అమెరికా ఆధిపత్యం ముందు లొంగిపోవటానికి ఇరాన్ ప్రజలు నిరాకరిస్తున్నారు. ఆప్ఘన్ల ప్రతిఘటన సాగుతూనేవుంది. అరబ్ దేశాలలో సామ్రాజ్యవాద వ్యతిరేక జాతీయ ఉద్యమాలు అణచివేయలేని విధంగా సాగుతున్నాయి. ఇవన్నీ అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్యానికి సవాలుగా వున్నాయి.
నాజర్ అనంతరం, ప్రత్యేకించి ముబారక్ పాలనాకాలంలో ఈజిప్టు అమెరికా మితృడిగా వుంటున్నది. 1979లో ఇజ్రాయిలుతో శాంతి ఒప్పందమనే దానిని చేసుకుంది. ముబారక్ పాలనతో అమెరికా ఆయుధాలను కొనే దేశంగా ఈజిప్టు మారింది. ఇటీవల అమెరికానుండి 6 వేల కోట్ల డాలర్ల ఆయుధాల కొనుగోలుకు ఈజిప్టు అంగీకరించింది. ఈజిప్టు అంతరంగిక భద్రత కొరకు అమెరికా ప్రతియేటా 200 కోట్ల డాలర్లు సహాయంగా ఇస్తున్నది. ముబారక్ నిరంకుశ పాలనకు అమెరికా ఇన్నాళ్ళూ మద్దతునిస్తే వచ్చింది. పాలస్తీనా పోరాటాన్ని చీల్చి బలహీనపరచటంలో ముబారక్ ప్రభుత్వం ముఖ్య పాత్ర వహించింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగాన్ని తిరిగి ఇచ్చివేయవలసిన పరిస్థితి ఇజ్రాయిలుకు ఏర్పడినప్పుడు ఇజ్రాయిలు యూదు దురహంకారులకు తోడ్పడింది. పాలస్తీనా భూభాగాన్ని మరింత ఆక్రమించుకునే ధైర్యాన్ని ఇజ్రాయిలు కిచ్చింది. గాజా ప్రాంతంనుండి ఈజిప్టులోకి పాలస్తీనియన్లు రాకుండా 14 కి.మీ పొడవునా ముబారక్ ప్రభుత్వం గోడను కట్టింది. గాజా ప్రాంతాన్ని దిగ్బంధనం చేసే ఇజ్రాయిలు వ్యూహానికి తోడ్పడింది. ఈజిప్లులోని అమెరికా అనుకూల ప్రభుత్వం కూలిపోతే, ఇజ్రాయిలు పాలకులకు ఇబ్బందులు పెరుగుతాయి. పశ్చిమాసియాలో అమెరికా ఆయుధ వ్యాపారం దెబ్బతింటుంది. అమెరికా ప్రపంచాధిపత్య వ్యూహం అమలు మందగిస్తుంది.
కనుక ఈజిప్టులోని పరిణామాలు అమెరికా సామ్రాజ్యవాదులకు ఆందోళన కలిగించాయి. ముబారక్‌ను కాపాడేందుకు చివరిక్షణం వరకూ ప్రయత్నించాయి. ముబారక్‌ను నిలపటం సాధ్యం కాదని తేలిన తర్వాత అతన్ని తప్పించారు. అధికారం సైన్యానికి బదలాయింపు జరిగేట్లు చేసారు. రాజకీయ పరివర్తనను తన ప్రయోజనాలకనువుగా తిప్పేందుకు పూనుకున్నారు. ట్యూనీషియా పరిణామాలు వచ్చిన వెంటనే ఈజిప్టు సైన్యాధిపతి అమెరికా వెళ్లాడు. ఈజిప్టులో అలాంటి పరిస్థితే తలెత్తితే ఏంచేయాలో చర్చించాడు. నిరసనోద్యమం ఉచ్ఛదశలో వుండగా, ఈజిప్టులో అమెరికా గూఢచారిగా 40 ఏళ్లు పనిచేసిన ఫ్రాంక్ వీజ్నర్‌ను ఈజిప్టుకు ప్రత్యేక దూతగా అమెరికా పంపింది. సామ్రాజ్యవాద వ్యతిరేక నినాదాలు, డిమాండ్లు నిరసనోద్యమం లేవనెత్తలేదు; అమెరికాకు విశ్వాసంగా వుండే వర్గానికీ రాజకీయ శక్తులకూ అధికార బదిలీ జరిగింది. గత ప్రభుత్వపు ఒప్పందాలన్నింటినీ గౌరవిస్తానని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. దీనితో అమెరికా ఈజిప్టుకు సహాయమందిస్తానని ప్రకటించింది.
అయితే అమెరికా నిర్ధేశించిన మార్గంలోనే ఈజిప్టులోని రాజకీయ పరిణామాలక్రమం సాగిందని చెప్పలేము. ఈజిప్టు ప్రజలు తమ అసంతృప్తినీ, నిరసననూ, ఆకాంక్షలనూ వ్యక్తపరచగల ప్రతి అవకాశాన్నీ వినియోగించుకున్నారు. సమగ్రతగల రాజకీయ నాయకత్వం లేకపోయినా, ప్రధానంగా అసంఘటితంగానే అప్రయత్నంగానే నిరంకుశ పాలనను వ్యతిరేకించారు. నిరసనోద్యమం ప్రజలకు ఒక పాఠశాల అయింది. తమ బలాన్నీ, బలహీనతలను గుర్తించేట్లు చేసింది. నిజమైన, బూటకపు మిత్రులను గుర్తించేట్లు చేసింది. శతృవు ఉపయోగిస్తున్న ఎత్తుగడలనూ, పద్ధతులనూ అర్థం చేసుకునేట్లు చేసింది. వలసవాదానికీ, సామ్రాజ్యవాదానికీ, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడిన అనుభవం ఈజిప్టు ప్రజలకుంది. పాలస్తీనా, ఇరాక్, ఆప్ఘనిస్తాన్, లెబనాన్ దేశాలలో సామ్రాజ్యవాద జోక్యం, పెత్తనం, బెదిరింపులు దురాక్రమణ విధానాలపై పోరాడుతున్న ప్రజలపట్ల సంఘీభావం వుంది.ఈజిప్టు ప్రజలు కూడా ప్రపంచీకరణ, ఆయుధ వ్యాపారం, టెర్రరిజంపై పోరు విధానాలతో పీడింపబడుతున్నారు. కనుక వారీ పోరాటాలనుండి తగిన గుణపాఠాలు తీసుకుంటారు. నిరసనోద్యమం ఇంకా సాగుతున్నది. ఒక నిరంకుశ పాలకుడు తొలగినంతనే ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థకు పరివర్తన ముగియలేదని వారు గుర్తించారు. ప్రజాస్వామ్యానికి శతృవులపై చైతన్యయుత, నిర్మాణయుత నిరంతర పోరాటం లేకుండా చిన్న విజయాలను కూడా నిలబెట్టుకుని, అనుభవించటం సాధ్యం కాదు. నిరంకుశ పాలనకు మూలస్థంబాలుగా వున్న భూస్వామ్య విధానానికీ, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా నిరంతరరాయ పోరాటం సాగించకుండా నిజమైన అర్థంలో ఈజిప్టులో ప్రజాస్వామిక వ్యవస్థను నెలకొల్పటం సాధ్యంకాని పోరాట జీవిత అనుభవం నుండి ఈజిప్టు ప్రజలు గుర్తిస్తారని ఆశిద్దాం.
Subscribe to:
Posts
(
Atom
)


