అవినీతిపై సమరం సమగ్రమేనా?
October 27, 2012
దేశానికి స్వాతంత్య్రం తేవడానికి ఏర్పడిందం టున్న కాంగ్రెస్ పార్టీ నిజానికి 1920ల వరకూ సంపూర్ణ స్వాతంత్య్ర నినాదం ఇవ్వలేదు. అప్పటి వరకూ ఉద్యమం రాయి తీల కోసమే జరిగింది. ఆతర్వాత అతివాదుల ప్రాబల్యం, కమ్యూని స్టు విప్లవకారుల ఉద్యమవ్యాప్తి కాంగ్రెస్ పార్టీని (గాంధీని) సంపూర్ణ్ణ స్వతంత్య్ర నినాదం ఇచ్చేలా చేశాయి. నేటి గాంధీగా చెలామణి అవుతున్న అన్నా హజారే,ఆరవింద్ కేజ్రీవాల్‌లు చేస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమం కూడా అలాంటిదే. డబ్బుఇచ్చిపుచ్చుకోవ డమే అవినీతిగా ప్రస్తుతం అంతా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ తరుణంలోఅవినీతికిచెంది న అనేక రూపాలను చర్చించు కోవలసిఉంది. ప్రజందరూ సమానులే, అంతస్తు, కుల మత ప్రాంతీయ అసమానతలు సమాజంలో ఉండరాదని అంగీకరించినట్లయితే, అందుకు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యవస్థలు వ్యవహరిస్తే, అది సామాజిక, పాలనాపర అవినీతి కిందికి రాదా? అవినీతి అన్నిరంగాల్లో ఉన్నదనీ, ఒక్క లంచంపుచ్చుకోవడమే అవినీతి కాదని అంగీకరిస్తే, ఇతర రూపాలలోని అవినీతిపెై పోరాట దృక్పథాన్ని కలిగి ఉండాలన్న నియమం అమలులోకి వస్తుంది. అవినీతిపెై పోరాటం చేస్తున్నవాళ్ళు ఇతర సామాజిక అవినీతులను వ్యతిరేకించక పోవడం, వ్యతిరేకించినా మొక్కుబడి ప్రకటనలతో సరిపెట్టడం దేనికిందకు వస్తుంది?
అది సంపూర్ణ అవినీతివ్యతిరేక ఉద్యమం కాగలదా? పాలకులు పంట భూముల్ని రెైతుల్నుండి లాక్కొని అభివృద్ధి పేరుతో విదేశీ పరిశ్రమలకు ఇచ్చేస్తున్నారు. రెైతు దేశానికి వెన్నెముక అని గాంధీ చెప్పిన సూక్తిని నమ్మితే, నియమగిరి వేదాంత, పోస్కో జగత్‌పూర్, నొయిడా భూముల కైవసం, సోంపేట కాల్పులు తదితర సమస్యలపెై పోరాడకపోయినా కనీసం మద్దతుగా ప్రకటన చేయాల్సి ఉంది. కాని అవేవీ మన పౌర సమాజ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. వీళ్ళిక్కడ నిరాహారదీక్ష జరుసాగిస్తున్న కాలంలోనే జగత్‌సింగ్‌పూర్‌లో పోస్కో వ్యతిరేక ఉద్యమాన్ని స్థానికులు కొనసాగించారు. వారి గురించి ఒక్క ముక్క పౌరసమాజ నేతలు మాట్లాడింది లేదు. వీరిలో స్వామి అగ్నివేశ్‌కు తప్ప ఎవరికీ జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో గిరిజనుల దుర్భరపరిస్థితి గురించి ఆలోచన ఉన్నట్లు దాఖలాలు లేవు. చత్తీస్‌గఢ్‌లో పోలీసుల ముట్టడిలోఉన్న గ్రామస్థులకు స్వామి అగ్నివేశ్ అన్నపానీయాలు తీసుకెళ్తుంటే ఆయనపెైన దాడిచేసి వాటిని నేలపాలు చేశారు పోలీసులు. స్వామి అగ్నివేశ్‌పెై జరిగిన దాడిపెై విచారణ జరపాలని అన్నా బృందం ఒక్క డిమాండ్ ఎందుకు చేయలేదు?పోస్కో ప్రాజెకుకు వ్యతిరేకంగా స్థానికంగా పదిగ్రామాలకుపెైగా ప్రజలు గత ఆరు సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నారు. వారికి సానుభూతిగా ఏఒక్క పౌర సమాజ కార్యకర్త రాలేదు.
శ్రీకాకుళం జిల్లా సొంపేటలో, తమ భూముల్లో ధర్మల్‌ప్రాజెక్టు కట్టడాన్ని వ్యతిరేకిస్తున్న వారిపెై పోలీసులు లాఠీచార్జీ, కాల్పులు జరిపి ఇద్దర్ని చంపేశారు. గత కొన్ని రోజుల క్రితమే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నోయిడా రెైతులపెై కాల్పులు జరిపించి ఇద్దరు రెైతుల్ని బలి తీసుకుంది. లాఠీచార్జీ, కాల్పులు సాగించినా, వారి ఆందోళన పౌరసమాజ కార్యకర్తలకు పట్టదు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అన్నా కానీ, కేజ్రీవాల్ కానీ అవినీతిపెై సమరం అంటే అటువంటి సమరానికి అర్థం ఉంటుందా? అది పాక్షిక అవినీతి పోరాటమే తప్ప సంపూర్ణ అవినీతి పోరాటం కాగలదా?పెట్టుబడుల్లో వాటాలు పొంది భూముల్ని విదేశీ, స్వదేశీ కంపెనీలకు ఇచ్చేయ్యడం అవినీతి కాదా? అవినీతిపెై సమరం చేస్తామని చెబుతున్నప్పుడు అన్ని రంగాల్లోని అవినీతి పరిగణలోకి రావాలి. అన్నాబృందాని కి జన్‌లోక్‌పాల్ బిల్లును అంగీకరిస్తే అంతా ముగిసినట్టే. దానిలో కూడా కొన్ని సవరణలు చేసి ఆమోదించడానికి భూమిక తయారవుతోంది. ఇక దానితో అవినీతిపెై సమరం ముగి సినట్టేనా? అవినిపెై యుద్ధం దీర్ఘకాలికమైనది. ప్రజలంతా దానికి సహకరించాలి. అటువంటి సమ స్యను ఒక్క జన్‌లోక్‌పాల్ బిల్లుతోనే అంతం చేస్తామని భావించడం సబబు కాదు.
ఇప్పుడు అవినీతి ఉద్య మానికి వస్తున్న స్పందనకంటే విస్తృత స్థాయి సమీకరణ, సహాకారం దానికి అవసరం. కేవలం పట్టణ మధ్యతర గతితో గ్రౌండు నిండిపోవడంతోనే ‘మా ఉద్యమం అయిపోదు, భూము లు లాక్కోవడంపెై కూడా’ అని ఒక ముక్తసరి ప్రకటన ఇచ్చినంత మాత్రాన అది చిత్తశుద్ధి కానేరదు.ఇక పౌరసమాజ కార్యకర్తల్లో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమకారులు ప్రముఖ భూమిక పోషిస్తున్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ‘ప్రతిభను రక్షించండి’ అన్న నినాదంతో పుట్టింది. ఈ దేశంలో ప్రతిభ ఏవర్గాల సోత్తో కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అన్ని సౌకర్యాలతో పెరిగి ప్రతిభ సంపాదించిన వారితో- గ్రామల్లో తరతరాల బానిసత్వంతో, సామాజిక అణచివేతకు గురవుతున్నవారిని పోటీ పడమని చెప్పడం ఏ నీతికి ప్రతీక? ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలలో ఇప్పటికీ 70 శాతం మంది అగ్ర కులస్థులేనని ఇటీవలి ప్రభుత్వసర్వే తెలిపినట్టు పత్రికలు పేర్కొన్నాయి. రిజర్వేషన్లు ఉండబట్టి ఒక మేరకు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశాలు వస్తున్నాయి తప్ప, లేకుంటే అవీ రావు. ఆ రిజర్వేషన్ల అమలులో కూడా లొసుగులతో నిండి ఉంటుంది.
కులపరమైన అణచివేత ఈ దేశంలో అమలులోఉన్న అతిపెద్ద అవినీతి. బ్యాంకుల్లో, ఎల్‌ఐసిలో అగ్రకులస్థులదే అధిపత్యం. చిత్రం ఏమిటంటే, ఎల్‌ఐసీలో వామపక్ష పార్టీకి అనుబంధంగాఉన్న అతిపెద్ద యూనియన్‌లోకూడా అగ్రకులస్థులదే ఆధిపత్యం. ప్రమోషన్లు ట్రాన్స్‌ఫర్లు మొదలెైన వాటిపెై యూనియన్ నాయకులుగా వీరి మాటే చెల్లుబాటు అవుతుంది. ఆ నిర్ణయాలు ప్రధానంగా అగ్రవర్ణం వారికే అనుకూలంగా జరుగుతాయి. ఎదుటివారూ తమలాగే మనుషులని అంగీకరిస్తూనే, ఒక కులంలో పుట్టినందుకు వారితో సామాజిక కార్యక్రమాలకు అంగీకరించకపోవడం, అద్దెకు ఇళ్లు ఇవ్వకపోవడం, పెళ్ళిళ్ళకు పేరం టాలకు నిరాకరించడం- ఇవన్నీ సామాజిక అవినీతి కిందకు వస్తాయి. డిగ్రీలు, పిజీలు, ఐఎఎస్, ఐపిఎస్‌లు చదివికూడా కులఅహం కారంతో కొట్టుమిట్టాడడం అతి పెద్ద సామాజిక అవినీతి. ఈ అవినీతి గురించి ఆ ఉద్యమ కార్యకర్తలు ఎందుకు మాట్లా డరు? అరవింద్ కేజ్రీవాల్ అటువంటి రిజర్వేషన్ వ్యతిరేక, ప్రతిభా పరిరక్షక ఉద్యమానికి నాయ కత్వం వహించి నవాడిగా ఏఅవినీతిపెై పోరాడుతు న్నట్లు?
ఇన్నాళ్ళూ దేశాన్ని ఏలింది ఈ సోకాల్డ్ అగ్రకులంవారే. వీరే గత 66 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తూ వచ్చారు. శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, పత్రికారంగం- ఇవి నాలుగూ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని చెప్పుకుంటున్నాం. ఈ నాలుగు రంగాలలోనూ ఇన్నాళ్ళూ అగ్రకులంవాళ్ళే అధిపత్యం వహిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మాటల్లో చెప్పా లంటే- ఇన్నాళ్ళూ దేశాన్ని ప్రతిభగలవాళ్ళే పాలించారు. మరి 66 సంవత్సరాల భారత దేశం అవినీతిలో ఎందుకు కూరుకున్నట్లు? అన్నా హజారే అన్నట్లు, ఇప్పటికీ నిజమైన స్వాతంత్య్రం ప్రజలకి ఎందుకు సమకూరనట్లు? వ్యవస్థను ఆమూలాగ్రం మార్చుకుంటే తప్ప అవినీతి అంతం కాదని అన్నా హజారే ప్రకటించిన స్థాయిలో భారతదేశం ఎందుకున్నట్లు? న్యాయవ్యవస్థలో లక్షలకోట్ల కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నట్లు? ప్రతిభ ఉన్నవాళ్ళ పాలనలో ప్రభ ుత్వరంగం ఎందుకు విఫలమైనట్లు?
గ్రామంలో ప్రతి కులంవాడు ఎవరి పని వారు చేసినట్లయితే అటువంటి గ్రామాలు స్వయం పోషకాలు అవుతాయని, అటువంటి గ్రామాలు ఆదర్శ గ్రామాలనీ మహాత్మ గాంధీ ప్రబోధించాడు.
భగవద్గీత ప్రభోధించిన వర్ణాశ్రమ ధర్మాన్ని మహాత్మా గాంధీ ఆమూలాగ్రం సమర్ధించాడు. అటువంటి గాంధీకి అనుచరుడిగా ఉన్న అన్నా హజారే నుండి ఈ దేశంలో 70 శాతం పెైగాఉన్న దళితులు, వెనుకబడ్డ కులాలవారు ఏ న్యాయాన్ని ఆశించగలరు? ఆ గాంధీ వర్ణాశ్రమ ధర్మాన్ని పుణికి పుచ్చుకున్న సంస్థలకు సానుభూతిపరుడుగా ఉన్న అన్నా హజారే, ఏ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు? ఏ నీతిని సమర్థిస్లున్నట్లు?అంతెందుకు? గుజరాత్‌లో ముస్లిం ప్రజలను ఊచకోత కోసిన నరేంద్రమోడి పాలనను అద్భుతమైనదని మెచ్చుకున్న అన్నా హజారేకి ‘సరెైన పాలన’ అంటే అవగాహన ఉన్నదా? గుజరాత్ అభివృద్ధి చెందినదని ఒకటే రొద. ఏమిటా అభివృద్ధి? విదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించగలగడమే అభివృద్ధిగా పాలకవర్గాలు చెలామణి చేస్తున్నాయి. అటువంటి అభివృద్ధే గుజరాత్‌లో జరుగుతోంది. అన్నా తన ప్రసంగాల్లో ‘వ్యవస్థ మారనిదే ప్రయోజనం లే’దని చెబుతున్నారు. అదే నిజమైతే ఈవ్యవస్థ మారడానికి ఆయన బృందం ఎందుకు కృషి చేయదు? లోక్‌పాల్ బిల్లును సాధించడమే ఏకైక కర్తవ్యంగా ఎందుకు పరిమితమైనట్ల్లు?
కులవ్యవస్థ సమాజం నుండి తొలగిపోలేదు.చదువు పెరిగేకొద్దీ కొత్త రూపాల్లో కుల వ్యవస్థ ముందుకొస్తోంది. గ్రామాల్లో సామూహిక హత్యలు, సంఘ బహిష్కరణలు, రెండు గ్లాసుల ఆచరణలు అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి.
ఇటువంటి పరమ అసమాన వ్యవస్థలో రిజర్వేషన్లు అవసరం లేకుండా ఉంటుందనీ, ప్రతిభ ఆధారంగా చదువు, ఉద్యోగాలు ఇవ్వాలని ఉద్యమం చేసిన అరవింద్ కేజ్రీవాల్ సామాజిక అవినీతి పల్లకీని మోస్తున్నవాడు కాదా?సమాజంలోని చెడులన్నీ ఏదో ఒక అనెైతికత నుండీ, అవినీతి నుండి ఉద్భవిస్తున్నవే.కనుకనే అవినీతిని అంతం చేయాలనుకున్న వారు వ్యవస్థ మూలాలపెైనే పోరాటం చేయవలసి ఉంటుంది.ఎన్నుకున్న సమస్యలపెై సమర శంఖం పూరించాలంటూ ఉద్యమం ప్రారంభిస్తే అది వారు చెప్పిన అవినీతి సమస్యను కూడా పరిష్కరించలేదు. చెైనాలో ఉరిశిక్షలు వేస్తున్నా అవినీతి కొనసాగుతోంది. ఇండియాలో జన్‌లోక్‌పాల్ బిల్లు వచ్చినా అదే పరిస్థితి. కాకుంటే ప్రజల నెత్తిన మరోక నిరంకుశ పాలనా వ్యవస్థ వచ్చి కూర్చుంటుంది.

Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment