చీకటి బతుకులు - సెక్స్ వర్కర్స్ తో ఇంటర్వ్యూ


''అందమైన లోకమని రంగురంగులుంటాయని...
అందరూ అంటుంటారు రామ రామా....
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా...''
అంటూ ఆచార్య ఆత్రేయ లోకం గురించి 1979లో రాశాడు.
      దేశం వెలిగిపోతుంది, అభివృద్ధివైపు దూసుకెళుతున్నామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్న దేశంలో ఆడది అంగడి సరుకుగా మారిపోయింది. ఒక వైపు పాలకులుగా, చట్టసభలకు నాయకులుగా మహిళలు ఉన్న సందర్భంలోనే దేశ నిర్మాణంలో భాగం పంచుకోవాల్సిన 3 కోట్ల మంది మహిళలు, బాలికలు నేడు నరక కూపంలాంటి వ్యభిచారంలో మ్రగ్గుతున్నారు. వీరిలో దాదాపు 60 శాతం మంది అట్టడుగు కులాలకు చెందిన వారు, 30 శాతం మంది 18 ఏండ్లు నిండని బాలికలు ఉన్నారు. 66 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో, పాలకుల నిర్లక్ష్యం మూలంగా బ్రతకడానికి ఆధారం లేకజానెడు పొట్ట కోసం, కుటుంబాన్ని పోషించుకోవడానికి, పిల్లల భవిష్యత్కోసం గత్యంతరం లేక ఆడది తన శరీరాన్నే పరాయివాళ్ల చేతిలో పణంగా పెడుతున్నారు. దేశంలోని ప్రతి నగరంలో ఇలాంటి వాళ్ళు నిత్యం మనకు కనిపిస్తారు. హైదరాబాద్నగరాన్ని అభివృద్ధి చేశామని, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లామని  గొప్పలు చెప్పుకుంటున్న సమయంలో రాష్ట్ర రాజధానిలోని సికింద్రాబాద్రైల్వే స్టేషన్‌, మహాత్మాగాంధీ బస్స్టాండ్‌, పంజాగుట్టా, ట్యాంక్బండ్‌, దిల్సుఖ్నగర్‌, ఆర్టీసీ క్రాస్రోడ్‌, ఇందిరా పార్క్లాంటి చాలా సెంటర్స్లో ఇలాంటి మహిళలు వందలాది మంది కనిపిస్తారు.


విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్రాసినట్లు...

''తను శవమై, ఒకరి వశమై
తనువు పుండై ఒకరికి పండై
ఎప్పుడూ ఎడారై
ఎందరికో ఒయాసిస్సై '' 
జీవచ్ఛవల్లా బతుకుతున్నారు.
      వ్యభిచారాన్ని జీవనోపాధిగా స్వీకరించి బహిరంగంగా తిరుగుతున్న వాళ్లు నగరంలో రెండు రకాలుగా కనిపిస్తున్నారు. కొందరు ఎవరికి వారు ఒంటరిగా వ్యాపారాన్ని చేసుకుంటుంటే, గ్రూపులుగా ఏర్పడి వ్యాపారాన్ని  కొనసాగిస్తున్న వారు ఇంకొందరు. కాకినాడ, వైజాగ్‌, రాజమండ్రి వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా గ్రూపులుగా ఉంటే హైదరాబాద్చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు మాత్రం ఒంటరిగానే వ్యభిచారాన్ని చేస్తున్నారు. గ్రూపుల కింద ఉండేవారు నెలసరి కాంట్రాక్ట్కింద ఒక నిర్వాహకురాలి కింద వ్యభిచారాన్ని జీవనోపాధిగా స్వీకరిస్తున్నారు. వాళ్ల ఫుడ్డ్‌, బెడ్అంతా చూసుకుంటాను అనే పేరుతో ఒక్కొక్క మనిషి మీద నిర్వాహకురాలు ఈజీగా 30 వేలు సంపాధిస్తుంటే, ప్రతి రాత్రీ 6 గురు మనుషులకు తన శరీరాన్ని పణంగా పెట్టే వీళ్లకు మాత్రం నెలకు పదిహేను వేల రూపాయలు మాత్రమే మిగులుతాయంటారు.       
     తమ పిల్లల చదువులు సాగాలన్నా, తమ భర్తలు చేసిన అప్పులు తీరాలన్నా కష్టాలు తప్పవంటారు. వ్యభిచారిన్ని జీవనాధారంగా నమ్ముకొని నాలుగు గోడలు దాటి నగరం బాట పట్టిన ప్రతి ఆడవారి వెనుక ఒక విషాదమైన జీవితం దాగుంది. జీవితాన్ని నమ్ముకున్న వాళ్లలో పదిహేనేళ్ల బాలికల నుంచి 45 ఏండ్ల ఆడాళ్ల వరకు ఉన్నారు. వీళ్లు శరీరాన్ని పణంగా పెడుతున్నా చాలా సార్లు కష్టమర్లు డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్నాయంటున్నారుతాగుబోతుగాళ్లు హత్యలు, హత్యాచారాలు చేసిన సంఘటలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు వృత్తికోసం రోడు్డపౖకి వచ్చాక  తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతామనే నమ్మకం లేదంటున్నారు వీళ్లు. అయితే రోడ్డుమీదకు వచ్చే ఆడాళ్లకు గుట్టుచప్పుడు కాకుండా హోటళ్లలో వ్యభిచారాన్ని నిర్వహించే కాల్గర్స్కు చాలా తేడ ఉంది. వీళ్లంతా తమ కుటుంబ పోషణ కోసం వృత్తిని ఎంచుకుంటే హోటళ్లలో వ్యభిచారం చేసే కాల్గర్స్ల్లగ్జర్లకు, ఫ్యాషన్లకోసం శరీరాన్ని అమ్ముకుంటుంటారు. రోడ్లమీద వ్యభిచారం చేసుకునే వాళ్లు సిటీ మొత్తం మీద మూడు వేల మంది ఉంటే, కాల్గర్స్ల్మాత్రం  ఐదు వేల మందిపైగానే ఉన్నారంటున్నారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. ఇలా హైదరాబాద్లోని ఒక్కో సెంటర్ఒక కథ చెబుతుంది. వెలుగులో ఉండేవారు చీకట్లో బతుకుతుంటే, చీకట్లో ఉండేవాళ్లు వెలుగుకోసం తపిస్తున్నారు. నాలుగు గోడల మధ్య రహస్యంగా సంసారం చేసుకునే ఆడవాళ్లు రోడ్లపాలు కావడం వెను ఒక్కోక్కరిది ఒక్కో కథ...హైదరాబాద్అభివృద్ధి వెలుగు నీడలవెనుక దాగున్న చీకటి బతుకులను పాఠకుల దృష్టికి తీసుకొచ్చెందుకు ముగ్గురం మిత్రులం ఒక పత్రిక కొసం హైదరాబాద్ నగరంలోని కొంతమంది సెక్స్ వర్కర్స్ తో చేసిన ఇంటర్వ్యూ ఇక్కడ.



స్థలం : సికింద్రాబాద్రైల్వే స్టేషన్
#మీ గురించి చెప్పండి, మీది ఊరు? ఇందులోకి ఎలా వచ్చారు?
నా పేరు నాగమణి (పేరు మార్చాము). నా వయసు 38 సంవత్సరాలు. మాది కాకినాడ దగ్గర. మా ఇంట్లో ముగ్గురం ఆడపిల్లలం.నా చిన్నప్పుడు నాన్న రోజు పనికి పోయేవాడు. కానీ ఎందుకో కొన్ని రోజుల తర్వాత పనిదొరకడం లేదని చాలారోజులు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాడు. మా అమ్మ ఇండ్లల్లో పనికిపోయేది. మా నాన్న పనికిపోకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడని రోజు గొడవ జరిగేది. ఒక రోజు ఏమైందో ఏమో బయటకు వెళ్ళిన మా నాన్న ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత తెలిసింది. ఆయన ఇంకో మా అమ్మను వదిలిపెట్టి ఆంకో ఆమెతో ఉంటున్నాడని. అప్పుడు నాకు 12 ఏండ్లు. తర్వాత మా అమ్మె కష్టపడి పెద్దచేసింది. అప్పుచేసి నా కన్న పెద్దామే పెండ్లి చేసింది. కొన్నేండ్లుకు పట్నంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి వచ్చి నన్ను పెండ్లి చేసుకుంటానని చెబితే 16 ఏండ్లప్పుడు నా పెళ్లిచేశారు. కానీ ఇక్కడికు వచ్చిన కొంతకాలానికే తెలిసింది ఆయన మాంచి వ్యక్తి కాదని, అమ్మాయిలను వృత్తిలోకి తీసుకొచ్చి అమ్ముతున్నాడని. రోజు నన్ను బాగా కొట్టేవాడు. రెండు మూడు రోజులు తిండికూడా పెట్టలేదు. కొన్ని రోజల తర్వాత ఎవరో వస్తే వాళ్లకు అప్పగించాడు. అప్పుడు నేను కడుపుతో ఉన్నాను. వాళ్ళు నన్ను 'పూనే'కు తీసుకపోయి ఒకామెకు అమ్మేశారు. అదే నేను మొదటి సారి ప్రాంతాన్ని చూడటం, అక్కడకు నాలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. అక్కడ నాకు వాళ్లభాష తెలియదు, ఎవరికితో మాట్లాడాలో కూడా తెలియదు. చాలా సార్లు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించా కానీ కుదరలేదు. పారిపోవాలని ప్రయత్నిచిన ప్రతి సారి బాగా కొట్టేవాళ్లు. కొంత కాలానికి అక్కడున్న తెలుగు వాళుపరిచయం కావడంతో, కొంత ధైర్యం వచ్చింది. వాళ్లతోపాటే రెండు సంవత్సరాలు అక్కడ ఉన్నా.

#మరి ఇక్కడకు ఎలా వచ్చారు?
పోయిన సంవత్సరం మన రాష్ట్రం నుంచి అమ్మాయిలను బలవంతగా ఎత్తుకొచ్చి అక్కడకు అమ్మేస్తున్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మన రాష్ట్రం పోలీసులు రైడ్చేసి 39 మంది తెలుగు వాళ్ళను ఇక్కడకు తీసుకొచ్చారు. అట్లా మళ్లీ ఇక్కడకు తిరిగొచ్చాను.


(telugu girls rescued from pune)
#ఇక్కడకు వచ్చాక ఇందులోనే ఎందుకున్నారు. ఏదైనా పనిచేసుకోవచ్చుగా?
మొదట ఏదైన పనిచేద్దామని ప్రయత్నించాం కానీ ఒకరోజు పనిదొరుకుతే ఇంకోరోజు దొరికేది కాదు. పైగా మా గతం తెలిశాక మేము ఇట్లాంటి వాళ్ళమని ఎవ్వరూ పనికి ఇచ్చేవారు కాదు. వృత్తిలో ఉండటం వలన ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఇక్కడకు వచ్చాక స్వచ్చంధ సంస్థ వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొంత కాలం మందులు కూడా ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెపుతుంటారు. చేసుకోవడానికి పని దొరకపోవడంతో రెండు మూడు రోజులకు ఓసారి పనిలోకి వస్తాను

స్థలం : ట్యాంక్బండ్
#మీ గురించి చెప్పండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు?
నాపేరు లక్ష్మీ (పేరు మార్చాము) మాది వరంగల్జిల్లా. ఇంట్లో మొత్తం 6 పిల్లలం. 5గురం అమ్మాయిలం. ఒక్క బాబుమా అమ్మ మా ఆరోగ్యం బాగాలేక మా చిన్నప్పుడే చనిపోయింది. మాకు కొంత పొలం ఉండే దాన్ని మా అమ్మకు హాస్పిటల్లో చూపించడానికి అమ్మెసిండు. పనిచేసుకోవడానికి పొలం కూడా లేకపోవడంతో మా నాన్నే కూలీకి పోయేవాడు. అది మేము తినడానికి సరిపోయేది కాదు. కొన్ని సార్లు చేసుకోవడానికి పనులు దొరకపోయేది. దాంతో మేము చాలా సార్లు పస్తులున్నాం. నాకు 15 ఏండ్లప్పుడు నాకంటే వయసులో పెద్దాయనతో నా పెళ్లి చేశారు. అప్పుడు నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. సంవత్సరం తిరగకముందే ఒక బాబు పుట్టాడు. పిల్లగాడు (కొడుకు) పుట్టిన కొన్ని రోజులకే పోలియో సోకడంతో సరిగ్గా నడవడం రాదు. తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. పెండ్లి చేసుకున్న ఆయన సరిగ్గా చూసుకునేవాడు కాదు. కనీసం ఇంట్లోకి కూడా ఏవీ తెచ్చేవాడు కాదు. దీని గురించి మా నాన్న మాట్లాడితే తాగి గొడవచేసేటోడు. నన్ను బాగా కొట్టేవాడు. ఆయన్ని భరించలేక పిల్లలతో దూరంగా ఉంటున్నాను. ఊర్లో పనిదొరకక, ఇబ్బంది పడుతుంటే తెలిసిన ఒక ఆమె ఇక్కడ (హైదరాబాద్‌)పనిచేసేది. ఇక్కడ ఇబ్బంది పడేకన్నా హైదరాబాద్కు వస్తే ఏదైనా పని చూపిస్త కదా అంటే ఇక్కడకు వచ్చాను. ఇక్కడకు వచ్చాక ఆమె పనిచూపించింది. ఇక్కడ బతకాలంటే ఇంతకన్నా వేరే మార్గం లేదని చెప్పింది. కానీ నాకు నచ్చక కొంత కాలం ఇండ్లల్లో పనిచేశాను. కానీ బతకడానికి, ఇళ్లు కిరాయికి డబ్బులు సరిపోయేవి కావు. ఇండ్లల్లో పనిచేస్తున్నా డబ్బులు సరిపోకపోవడంతో మళ్లీ ఆమె ద్వారానే వృత్తిలోకి వచ్చాను. వారానికి రెండు మూడు రోజులు ఇలా చేస్తాను. వృత్తిలోకి వచ్చి ఇప్పటికి పది సంవత్సరాలైంది.
#మీ పిల్లలకు, మీ బంధువులకు మీరు పనిచేస్తున్నావని తెలుసా?
తెలియదు. వాళ్లకు హస్పిటల్లో పనిచేస్తున్నానని చెప్పాను. అందరూ హస్పిటల్ల్లోనే పనిచేస్తున్నాననే అనుకుంటున్నారు.
#మరి, మీరు పనిలో ఉన్నారని మీ పిల్లలకు తెలిస్తే ఏంటి పరిస్థితి?
ఏం చేస్తాం. ఇప్పడివరకైతే తెలియకుండా జాగ్రత్తగా ఉంటున్నాం. తెలియకుండా చూసుకోవాలి. ఒక రోజు మేము పనిలో ఉంటే పోలీసులు వచ్చి అరెస్టు చేశారు. రాత్రంతా పోలీసు స్టేషన్లోనే (గోపాల్పురం పోలీసు స్టేషన్‌)ఉంచి ఇబ్బంది పెట్టారు. మరుసటి రోజు మధ్యాహ్నాం విడిచిపెట్టారు. అప్పుడు మాత్రం ఇంట్లో తెలుస్తుందేమో అని చాలా భయపడ్డాం. కానీ ఏదో రాసుకొని విడిచిపెట్టారు.
#ఇది ప్రమాధకరమైనది కదా దీని నుంచి బయటపడాలని మీకు అనిపించలేదా?
చాలా సార్లు అనిపిస్తుంది. కానీ దీన్ని కూడా వదులుకుంటే బతకడం కష్టం. పిల్లలను మంచి జీవితాన్ని ఇచ్చేందుకైనా మేము కొంతకాలం ఒళ్లమ్ముకోవాల్సిందే.
#ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపిస్తే దీన్ని మానేస్తారా?
మానేయాలనే ఉంది. కానీ చదువుకోనోల్లకు మాకేం పనిచూపిస్తుంది?  వృత్తిలో నా జీవితం ఎలాగు నాశనమైంది. కనీసం నా పిల్లల జీవితమైనా బాగుండాలని వాళ్ళను చదివిస్తున్నా


స్థలం : దిల్సుఖ్నగర్.
#మీగురించి చెప్పండీ? ఇందులోకి ఎలా ప్రవేశించారు?
నా పేరు జయమ్మ, మాది నల్గోండ జిల్లాలోని నకిరేకల్‌. అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోవడం వల్లా మా అమ్మమ్మా, తాతయ్యల దగ్గరే పెరిగాను. నేను పదోతరగతి చదువుతుండగా మా మేనమామ నాకు పెళ్లిసంబంధాలు చూడం మొదలెట్టాడు. ఏవో తిప్పలు పడి ఇద్దరక్కలకు ముడిపెట్టి పంపించారు. నా వరకు వచ్చేసరికి కట్నం ఇవ్వలేక రెండోపెళ్ళి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. మా ఇంటి పక్కన ఒక ఇంజనీరు దగ్గర పనిచేసే సాగర్తో నాకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మా ఇద్దరి విషయం ఇంట్లో తెలిసి గొడవ చేశారు. దాంతో మేమిద్దరం ఎవరికీ చెప్పకుండా పారిపోయి యాదగిరి గుట్టలో పెళ్ళిచేసుకున్నాం. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్వచ్చి ఉప్పల్లో స్థిరపడ్డాం. పెళ్ళి తర్వాత అతనికీ, నాకు పుట్టింటి వాళ్లతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రెండేళ్లపాటు బాగానే చూసుకున్నాడు. పాప పుట్టాక, తన అసలు రూపం బయటపడింది. రెండు నెలలపాటు పనీ చేయకుండా ఖాళీగా ఉన్నాడు. ఇంట్లోకి సరుకులు కూడా తేలేదు. ఇలాగైతే ఎలా మనం బతకడమెలా? అని నిలదీస్తే 'పట్టణంలో గొప్పగా బతకాలంటే నువ్వు వ్యభిచారం చేయాలి' అన్నాడు. కట్టుకున్నవాడు అలా మాట్లాడితే ఏం చేయాలో అర్థం కాలేదు, నమ్మినవాడి చెయ్యి పట్టుకుని మోసపోయినందున బోరున ఏడ్చాను. నా వాళ్లకు చెప్పుకుందామంటే వారిని కాదనుకుని వచ్చాను. పోనీ ఉన్నచోటే ఏదైనా పనిచేసుకుని బతుకుదామంటే ఒంటరిగా బతికే ధైర్యం లేదు. కొన్ని రోజులపాటు అతనితో పోట్లాడి బతికాను. తర్వాత బిడ్డను బతకనివ్వనంటూ బెదిరించాడు. దాంతో చేసేదిలేక అతని చెప్పినట్లే విన్నాను. రెండ్లేపాటు నన్ను ఇంట్లో బంధించి నాతో వ్యభిచారం చేయించాడు. తర్వాత సికింద్రాబాద్దగ్గరున్న వ్యభిచారగృహాలకు తనే స్వయంగా తీసుకెళ్లేవాడు. అక్కడ సాగర్లాంటి వారు చాలామంది కనిపించారు.
#మరి మీరు ఇందులోనుంచి బయటపడాలని అనుకోవడంలేదా?
చాలామంది బలవంతగా వృత్తిలోకి వస్తున్నారు. వచ్చాకా అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఆరోగ్యం పాడవుతుంది. అందుకే నా జీవితం ఎలాగూ పాడైంది కాబట్టి ఇంకొకరి జీవితం పాడుకాకూడదని, ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తూ వృత్తిలో ఉన్న వాళ్లు ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రచారం చేస్తుంటాను. నాలాంటి సెక్స్వర్కర్కుకు మంచి చెడు చెబుతుంటాను. సేఫ్సెక్స్పద్దతుల గురించి వివరిస్తుంటాను. వాళ్ళను తీసుకెళ్ళి ఆరోగ్య పరీక్షలు చేయిస్తుంటా. హెచ్ఐవి బారిన పడితే మందులు వాడేలా వారికీ ధైర్యం చెబుతుంటా. ఒకప్పుడు సెక్స్వర్కర్ల వలె హెచ్ఐవి వ్యాప్తి చెందిందనే ప్రచారం ఉండేది. కానీ ఇపుడు మేమే హెచ్ఐవి/ ఎయిడ్స్వ్యతిరేక ప్రచారంలో పాల్గోంటూ హెచ్ఐవి తగ్గుముఖం పట్టేందుకు కృషి చేస్తున్నార.

#దీంట్లో చాలా కాలంగా ఉన్న మీరు, ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలో కూడా పనిచేస్తున్నారు కదా? దీంట్లో ఎదురయ్యే సమస్యల గురించి వివరించండి.
ఇదొక నరకకూపం లాంటి జీవితం. బతకడానికి ఒళ్ళు అమ్ముకునే వాళ్ళంటే ప్రతి ఒక్కరికి చులకనే. డబ్బులిస్తున్నాం కదా అని చాలామంది మగాళ్ళు మృగాలుగా ప్రవర్తిస్తారు. డబ్బుల కోసం పనిచేస్తున్నా మేము కూడా మనుషులమే కదా? కానీ మా దగ్గరకు వచ్చే కష్టమర్లు (విటులు) నీచంగా ప్రవర్తిసారు. ఆరోగ్యం పాడుకాకూడదని మా సంఘాల్లో ( సెక్స్వర్కర్స్బాధితుల కోసం స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన సంఘం) చెప్పినట్లు కండోం వాడమని మా దగ్గరకు వచ్చిన వాళ్ళతో చెబితే చాలా మంది ఒప్పుకోరుకొందరైతే వాళ్ల రూంల్లోకి తీసుకెళ్ళి ఏదో సినిమాలు చూపిస్తూ (నీలి చిత్రాలు) మాతో ఆవిధంగా మృగవాంఛ తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు. కాదంట్లే నోటికొచ్చినట్లు తిడుతుంటారు. కావాలంటే డబ్బులు ఎక్కువ తీసుకొమ్మంటూ విసిరేస్తుంటారు. ఇంకొందరూ మాతో పనిపూర్తిచేసుకొని డబ్బులు ఇవ్వకుండా మాపైనే దాడులకు పాల్పడుతుంటారు.

స్థలం : స్వచ్ఛంద సంస్థ ఆఫీస్‌ - సికింద్రాబాద్‌.
# సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది. మొత్తం నగరంలో వ్యభిచార కూపంలో ఎంత మంది ఉన్నారు. మీ సంస్థలో ఎంతమంది సభ్యులుగా ఉన్నారు.
హైదరాబాద్నగరంలో దాదాపు 3000 మందికి పైగా మహిళలు వృత్తిలో ఉన్నారు. మా సంస్థలో 750 మంది సభ్యులు ఉన్నారు. చాలా మంది మహిళలు నమ్మిన వాళ్ళచేతుల్లో మోసపోయి వృత్తిలో చిక్కుకున్న వారు ఉన్నారు. ఇంకొంత మంది కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆర్థికస్తోమత  లేకపోవడం వలన, పని దొరకపోవడం  వలనఈ వృత్తిని ఎంచుకున్నవాళ్ళు ఉన్నారు. వ్యభిచార కూపంలో చిక్కుకొని చాలా మంది తన ఆరోగ్యాన్ని పాడుచేసుకొని మృత్యువాత పడుతున్నారు. ఇట్లాంటి వారికి చేయూత ఇవ్వాలనే మేము సంస్థను స్థాపించార. కొందరికి ప్రత్యామ్నాయ పనుల్లో శిక్షణకూడా ఇస్తున్నాం.
#ఒక సంస్థ నిర్వాహకులుగా వ్యభిచార గృహంలో ఉండి వ్యభిచారంలో ఉన్న వాళ్ళకు, బయట రోడ్లపై ఉండేవాళ్ళకు తేడా ఏంటీ?
వ్యభిచార గృహాలలో ఉన్న అమ్మాయిలు చాలా మంది బలవంతగా వృత్తిలోకి నెట్టివేయబడిన వాళ్ళే. దేశ వ్యాపితంగా ఇట్లాంటి గృహాలు చాలా ఉన్నాయి. ఢిల్లీ లోని 'జీబిరోడ్‌', కలకత్తాలోని 'సోనగాచి', ముంబాయ్లోని 'కామటిపూర', పూణే లోని  బుధవార్పేట్లలో వేలాది మంది మహిళలను బలవంతగా వృత్తి చేయిస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళు దాదాపు వివిధ రాష్ట్రాలనుంచి అక్రమంగా తరలించబడి ఇక్కడకు అమ్ముడుపోయిన వాళ్ళే. వాళ్ళకు ఎలాంటి స్వేచ్ఛ ఉండదు. కుటుంబాలతో సంబంధాలు ఉండవు. ఒక చోట డిమాండ్అయిపోతే మరోచోటకు తరలించబడతారు. ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. హెచ్ఐవి బారిన పడితే రోడ్డుమీదకు నెట్టేస్తారు. అదే రోడ్లమీద ఉండి, స్వతంత్రంగా వృత్తిచేసే వాళ్థైతే ఆరోగ్యం కాపాడుకుంటూ, రహస్యంగా వృత్తి చేసుకొంటూ కుటుంబ సభ్యులతో ఉంటుంటారు. స్వతంత్రంగా వృత్తిచేసే వాళ్ళకు మిగితా వాళ్ళతో పోలిస్తే కొంత మేరకు స్వేచ్ఛ వుంటుంది.

ప్రొ|| అంజూ అగర్వాలు, సోషయాలజిస్టు - ఢిల్లీ యూనివర్సిటి.
#అసలు వ్యభిచారాన్ని వృత్తిగా గుర్తించవచ్చాంటారా?
వ్యభిచారాన్ని ఎంత మాత్రం వృత్తికాదుఅది డబ్బు మారకం ద్వారా జరిగే లైంగిక దోపిడి, డబ్బు చెల్లించి చేసే అత్యాచారమిది. ఇది అంతర్గతంగా మహిళలకు హానికరమైనది. బాధకరమైనది. 90 శాతం మంది మహిళలు నరకకూపంలోనుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ నిర్ణయం తీసుకునే శక్తి తమ చేతుల్లో లేకపోవడం మూలంగా వారు అక్కడే ఉంటున్నారని అనేక సంస్థల సర్వేల ద్వారా తెలుస్తుంది.
#అసలు వ్యభిచారంలోకి మహిళలు ఎందుకు వస్తున్నారు. మధ్య కాలంలో మధ్యతరగతి మహిళలు కూడా కాల్గర్స్ల్గా మారుతున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణాలేంటి?

(call girls arrested by mumbai police)
వ్యభిచారం వృత్తిలోకి వచ్చినవారిలో చాలామంది తమను, తమ పిల్లలను పోషించుకోవడానికి ఆధారం దొరకకపోవడం, వివాహం విచ్చిన్నం కావడం, కుటుంబ సభ్యులు ఆదరించకపోవడం, ఇంట్లో నుంచి గెంటివేయడం తదితర కారణాల వలన మహిళలు అనివార్య పరిస్థితిలో వృత్తిని ఎంచుకుంటున్నారని అనేక స్టడీస్చెబుతున్నాయి. ఇక మధ్య తరగతి మహిళలు వృత్తిలోకి రావడానికి ప్రధాన కారణం. వ్యవస్థలో వస్తున్న మార్పులు. పెరుగుతున్న వినియోగదారి విధానం. భారతీయ మహిళలు ఉన్నత స్థానాన్ని కోరుకునే క్రమలో అనేక ఒత్తిడిలకు గురవుతున్నారు, సులభంగా డబ్బు సంపాధించేందుకు కూడా చదువుకున్న అమ్మాయిలు, మహిళలు కాల్గర్ల్గా మారుతున్నారు. అయితే గత దశాబ్దం క్రితం ఇది యూరోపియన్దేశాల్లోనే చూశాం మనం. అతి తక్కువ కాలంలో ఇది మన దేశానికి విస్తరించింది.

#కొన్ని స్వచ్ఛంద సంస్థలు వ్యభిచారం చేసే వాళ్ళకు లైసెన్స్ఇవ్వాలని డిమాండ్చేస్తున్నాయి? దీనిని సమర్థించవచ్చంటారా?

ఇలా డిమాండ్చేస్తున్న వాళ్ళు గతంలో లో కలకత్తాలో కార్నివాల్లాంటి ఉత్సవాన్ని నిర్వహించడం మనం చూశాం. వాస్తవానికి వాళ్ళ డిమాండ్వెనుక ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే. చాలా కాలంగా వ్యభిచారాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వాలు (వామపక్ష ప్రభుత్వాలు సహితం) విఫలమయ్యాయి. ప్రభుత్వ ఆర్థిక విధానాల మూలంగా ఎలాంటి ఉపాధి దొరకపోవడం మూలంగా వృత్తిలోకి ఇంకా ఎక్కువమంది నెట్టివేయబడుతున్నారు  కాబట్టి కనీసం లైసెన్స్ఇస్తేనన్న వాళ్ళకు ప్రభుత్వ పరంగా మెడికల్ఫెసిలిటి మరియు కార్మిక చట్టాలు మొదలైనవి పొందవచ్చు అనే ఉద్దేశ్యంతో అడుగుతున్నారు. చాలా దేశాల్లో వ్యభిచారాన్ని లీగలైజ్చేశారు కాబట్టి, అనుభవాల ద్వారా డిమాండ్వస్తుంది. కానీ ప్రభుత్వాలు దీన్ని నిర్మూలించడంలో విఫలమైనంత మాత్రాన దీన్ని లీగలైజ్చేయడమనేది సరైనది కాదు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి నిర్మూలించడం ఒక్కటే మార్గం.

వ్యభిచారం అనేది కుట్టుపనీ, నేతపనీ, వడ్రంగం పనీ వంటి వృత్తే అయితే. వృత్తుల్లాగే ఇది (వ్యభిచారం) కూడా సమాజానికి ఎప్పుడూ కావాలి. ఇంటింటికి కావాలి. కానీ సెక్స్అనేది శరీర ధర్మం. శరీర ధర్మాలేవీ శ్రమలు కావు. శ్రమలు కానీవేవీ వృత్తులు కాలేవు. వృత్తిగా కనపడే ప్రతీదీ వృత్తి కాదంటుంది ప్రముఖ రచయిత్రీ రంగనాయకమ్మ.

ప్రముఖ కవి. సిని రచయిత డాక్టర్సి. నారాయణ రెడ్డి రాసినట్లు.
ఎవరు వీరు ఎవరు వీరు...
దేశ మాత పెదవిపైన మాసిన చిరునవ్వులు..
మనసులేని పిడికిలిలో నలిగిన పువ్వులు...

ఎవరు వీరు ఎవరు వీరు
ఆకలికి అమ్ముడుపోయిన అపరంజి బోమ్మలు..
చెక్కిలి వన్నెలు చిరిగిన చిగురాకు కొమ్మలు...
నవ్వలేక ఏడ్వలేక నిట్టూర్చే శవాలు.
నడిచే జీవచ్చవాలు

ఎవరో కాదు వీరెవరో కాదు
మనిషే దిగజార్చిన పతితలు..
ఎవరో తెలుసా
మన రక్తం పంచుకున్న ఆడపడచులు
మనం జారవిడుచుకున్న జాతి పరువులు.

      ప్రకృతి పరంగా స్త్రీ, పురుషుల మధ్య ప్రేమతో ఉండాల్సిన శారీరక ధర్మం పెట్టుబడిదారీ విధానం వల్ల, పితృస్వామ్య వికృత రూపం మూలంగా అనివార్యపరిస్థితిలో మహిళలు వ్యభిచారంలోకి నెట్టివేయబడుతున్నారు. ప్రాచీన సమజాల్లో అమోదం పొందిన వ్యభిచారం మోనోగమీ మూలంగా ఆదర్శంగా మారి దాన్ని అసహించుకునే స్థితికి వచ్చింది. కానీ నేడు అర్థ,భూస్వామ్య, అర్థ పెట్టుబడిదారి విధానానికి పురుష్యాధిపత్యం తోడవ్వడం మూలంగా తమపై ఆధారపడిన మహిళల్నే అమ్మేసే స్థితికి చేరుకున్నారుఒక అమాయకమైన మహిళను, తను నిండుగా ప్రేమించిన మనిషే తనను అమ్మేసే స్థితికి వచ్చినప్పుడు  మనుషుల మీదా, సమాజం మీదా, సున్నితమైన భావాలమీదా నమ్మకాన్ని పొగొట్టుకుంటుంది. ఇక మహిళకు మిగిలేదంతా బతుకు పోరాటమే. పోరాటంలో అనివార్యంగా ఇటువైపు నెట్టబడుతుంది. దీనికి లైసెన్సులిచ్చినా, ఇవ్వకపోయినా వృత్తిలోకి వచ్చేవాళ్ళు పెరగటమే తప్ప తరగటం ఏమీ ఉండదు. పితృస్వామ్య సమాజ వికృత రూపం మూలంగా రకరకాల సమస్యలతో వ్యభాచారంలో కూరుకుపోయిన మహిళలకు విముక్తి లభిస్తే తప్పా దీనికి పరిష్కారం దొరకదు. దిశగా ఉద్యమాలు జరగాలి. మహిళలను కూడా సమానంగా చూసే సమాజం కోసం పోరాటం నిర్వహించాలి.

ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?


ఐరోపా ఖండంలో వైశ్యాల్యం రీత్యా రష్యా తర్వాత పెద్ద దేశమైన ఉక్రెయిన్‌లో నేడు రక్తపు మడుగులో మునిగితేుతోంది. ప్రపంచాన్నే గుప్పిట్లో పెట్టుకుని, తన మార్కెట్‌గా మార్చుకోలవానే అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాల స్వార్థం మూలంగా నేడు ఉక్రెయిన్‌ సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సంక్షోభం తీవ్రమై సైనిక జోక్యం వరకు వెళ్లింది. యూరోపియన్‌ యూనియన్‌ (ఇ.యు) లో చేరడానికి నిరాకరించినందుకు ఆమెరికా, ఐరోపాలు ఉక్రెయిన్‌లో గత నవబంర్‌ నుంచి హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. ఆ హింసాత్మక ఆందోళనలు చివరకు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నిక కాబడిన అధ్యక్షుడు యనుకోవిచ్‌ను దేశం విడిచి వెళ్ళిపోయేలా చేసి, తాత్కాలిక అధ్యక్షుడిగా పశ్చిమ దేశాలకు అనుకూల వ్యక్తిని నియమించాయంటే ఇ.యు, అమెరికా దాష్టికం ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యూరోపియన్‌ యూనియన్‌, ఆమెరికా అనుకూల శక్తులు, ఉక్రెయిన్‌లో అవంభిస్తున్న విధానం నాటి నాజీ తరహాను గుర్తుకుతెస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమ దేశాల అండదండతో రెచ్చిపోయిన ఆందోళనకాయి ప్రభుత్వ కార్యాయాలను, పార్లమెంట్‌ను స్వాధీనం చేసుకున్నాయి.ఈ పొరుగున ఉన్న రష్యా చురుకుగా కదిలింది. రష్యన్లు మెజారిటీ సంఖ్యలో నివసించే స్వయంప్రతిప్రత్తి ప్రాంతమైన క్రిమియాలో రక్షణ చర్యలు చేపట్టింది.దీంతో అగ్రరాజ్యాలు ఉక్రెయిన్‌ విషయంలో జోక్యం చేసుకోవడంతో ఐరోపా తూర్పు ప్రాంతంలో యుద్ధ వాతావారణ నెలకొంది.
ఉక్రెయిన్‌ ఒకప్పటి సోవియట్‌ రష్యాలో అత్యంత కీలకమైన, వ్యూహాత్మక భూభాగం. మొత్తం నాలుగున్నర కోట్ల జనాభా. అందులో దాదాపు 77 శాతానికిపైగా ఉక్రెయిన్‌ జాతీయుంటే, రష్యా జాతీయులు 17 శాతం మంది ఉన్నారు. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నత తర్వాత 1991లో స్వతంత్ర దేశంగా ఉక్రెయిన్‌ ఆవిర్భవించింది. సోవియట్‌ యూనియన్‌లో భాగంగా ఉన్న ఉక్రెయిన్‌ ఒకప్పుడు ఆర్థిక శక్తిగా వెలుగొందింది. ఉత్పత్తి రంగంలో తిరుగులేని శక్తిగా ఉండేది. అయితే సోవియట్‌ విచ్ఛిన్నంతోనే ఉక్రెయిన్‌ ఆర్థిక కష్టాలు మొదయ్యాయి. ఈ దశలోనే సంస్కరణ వైపు పయనించింది. ఫలితంగా ప్రజారోగ్యం మూలనపడింది. సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టారు. ప్రైవేటీకరణ ఊపందుకుంది. వీటి ఫలితంగా 2008 ఆర్థి సంక్షోభం ఉక్రెయిన్‌ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చింది. పేదరికం, ఆకలికేకలు, నిరుద్యోగం పెరిగింది. కడుపు నింపుకోవడానికి వ్యభిచారం సర్వసాధారణమయ్యాయి. ఫలితంగా ప్రజాందోళను మొదలయ్యాయి. దీన్ని అవకాశాంగా తీసుకున్న యూరోపియన్‌ యూనియన్‌ ఒకప్పుడు రష్యాకు అనుకూంగా ఉన్న ఉక్రెయిన్‌ను తమ యూనియన్‌లో కలుపుకునేందుకు పావులు కదిపింది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతం (క్రిమియా)లో రష్యా అనుకూల జనాభా ఉంటే, పశ్చిమ ప్రాంతంలో అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల అనుకూల జనాభా అధికంగా ఉన్నారు. ఉక్రెయిన్‌పై పట్టు సాధించడం మూలంగా ఆర్థికంగా లాభపడటమే కాకుండా పొరుగున ఉన్న రష్యాలో కూడా పరోక్షంగా తన ఎగుమతుతో ముంచెత్తవచ్చని పశ్చిమ రాజ్యాలు ప్రయత్నిస్తున్నాయి. దీంట్లో భాగంగానే ఉక్రెయిన్‌ను యూరోపియన్‌ యూనియన్‌లో చేర్చాలని గత కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నాయి.

గత కొంత కాలాంగా ఇ.యులో చేరడానికి సుముఖత వ్యక్తం చేసిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు యనుకోవిక్‌ ఇ.యు చేరడం మూలంగా లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని, యూరో జోన్‌లో చేరడం మూలంగా ఉక్రెయిన్‌లోకి ఐరోపా దేశాల దిగుమతులు ముంచెత్తుతాయని, ఫలితంగా దేశీయ ఉత్పత్తి పడిపోతుందని  గ్రహించి, లిధుయేనియా రాజధానిలో గత నవంబర్‌లో జరిగిన ఇ.యు సమావేశాల్లో యురోపియన్‌ యూనియన్‌లో చేరే ఆలోచనను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆందోళను చెలరేగాయి. ప్రశ్చిమ దేశాల ప్రొత్సాహంలో మొదలైన గందరగోళం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది. నవంబర్‌ 23 నుంచి ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాల్లో విధ్వంసం మొదలైంది. అంతేకాకుండా ఈ అందోళనకు మద్దతుగా జాన్‌ మెక్‌కెయిన్‌ లాంటి పలువురు అమెరికా సెనేటర్లు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వచ్చి ప్రసంగాలు చేసి ఆందోళనకారును రెచ్చగొట్టారు. పొలాండ్‌ లాంటి ఇ.యు సభ్య దేశాు కూడా బహిరంగంగానే ఉక్రెయిన్‌ ఆందోళనకారులకు మద్దతుగా, ఉక్రెయిన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు, పిలుపులు జారీ చేశాయి. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు ప్రభుత్వ కార్యాలయాను స్వాధీనం చేసుకోవడం, వాహనాలకు, భవనాలను తగబెట్టడం, అధికారును నిర్భంధించడం చేయడంతో చివరకు దేశ అధ్యక్షుడు ప్రాణాలను రక్షించుకోవడానికి రష్యాను అశ్రయించాడు.
ఇదే సందర్భంలో ఉక్రెయిన్‌ తూర్పు భాగంలో రష్యా అనుకూ ఆందోళనకు ఆకాశాన్నంటాయి. స్వతంత్ర క్రిమియాలో ఈ ప్రదర్శను భారీగా జరిగాయి. నల్ల సముద్రంలో మూడు వైపుల సముద్రంతో చుట్టిఉండే క్రిమియా, ఉక్రెయిన్‌లో భాగమే అయినప్పటికీ సొంత పార్లమెంట్‌, రక్షణ బలగాలు కలిగి ఉన్న ప్రాంతం. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది రష్యన్లు కాగా టార్‌టార్‌ ముస్లిరు మైనారిటీలుగా ఉన్నారు. (క్రిమియాను సోవియన్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు కృచ్చెవ్‌ ఉక్రెయిన్‌కు కానుకగా ఇచ్చాడు). ఉక్రెయిన్‌లోని రష్యన్లు ఆందోళనకు దిగడంతో రష్యన్ల ప్రయోజనాలు కాపాడవసిన బాధ్యత తనపై ఉందని రష్యా జోక్యం చేసుకొంది.  

ఉక్రెయిన్‌లో హింసాత్మక ఆందోళనను చ్లబరచడానికి ఇ.యు, అమెరికా మధ్యవర్తిత్వంలో ఆందోళనకారుకు, అధ్యక్షుడికి మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ దాన్ని అమలుచేయించే బాధ్యతను ఇ.యు, అమెరికాు గాలికి వదిలేశాయి. పైగా ఆందోళనకారులు ప్రభుత్వ భవనాలను, వివిధ మంత్రిత్వ శాఖల కార్యాలయాను ఆక్రమించుకుంటున్నా వారిని వదిలి ప్రభుత్వానికే నీతులు చెప్పారు. పెట్రోల్‌ బాంలు విసురుతూ, కనిపించిందల్లా తగబెడుతూ, పోలీసుపై క్పాుులు జరుపుతూ భారీ విధ్వంసం సాగించడంతో ఒప్పందం అమలు కాలేదు. అధ్యక్షుడు యనుకోవిచ్‌ నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి బదులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం మొదట సొంత నగరానికి, అనంతరం అక్కడి నుంచి రహస్యంగా సరిహద్దు దాటి రష్యాలో రాజకీయ ఆశ్రయం పొందాడు. ఈ విధంగా ఉక్రెయిన్‌ పూర్తిగా ఇ.యు, అమెరికా చేతుల్లోకి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఐరోపానుండి, అమెరికా నుండి వివిధ నాయకులు, మంత్రులు, అధికారులు ఉక్రెయిన్‌ వచ్చి సంప్రదింపు జరుపుతూ సలహాలు ఇస్తూ తామే ప్రభుత్వాన్ని నడిపేస్తున్నారు. దీంతో రష్యా జోక్యం చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ఒబమా, బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌, జర్మనీ ఛాన్సర్‌ ఏంజెలా మెక్కెల్‌, ఫ్రాన్స్‌ ప్రధాని ఫ్రాంషా ఒలాండే తదితర నేతలు సైనిక చర్యకు దిగరాదంటూ రష్యాను హెచ్చరికు చేస్తుండగానే ఉక్రెయిన్‌లో సైనిక జోక్యానికి రష్యా పార్లమెంట్‌ నుండి అనుమతి పొందాడు. పార్లమెంట్‌ నుండి అనుమతి తీసుకున్న తర్వాత పుతిన్‌ కొన్ని క్రియాశీలక చర్యలు తీసుకున్నాడు. స్వయం ప్రతిపత్తి ప్రాంతమైన క్రిమియాకు రష్యా సైన్యాన్ని పంపింది. స్థానికంగా ఉన్న సైనిక స్థావరం నుండి సైనికులను పంపి వివిధ ప్రభుత్వ భవనాకు రక్షణ ఇవ్వాని ఆదేశాలు ఇచ్చాడు. రష్యా సైనిక చర్య పట్ల అమెరికా అధ్యక్షుడు ఒబామా, విదేశాంగ మంత్రి జాన్‌ కేర్రీ నిరసన తెలిపినప్పటికీ  పుతిన్‌ వాటిని పట్టించుకోలేదు.     రష్యాను, దాని ఆర్థిక ప్రయోజనానూ సమూలంగా నాశం చేసే ఉద్దేశ్యంతోనే పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌లో రగిల్చిన కుంపటిని ఆర్పకుండా అట్టే ఉంచాని ఒబామా కోరితే దానిని మన్నించాలా లేక సొంత భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలా అన్నది పుతిన్‌ ముందున్న ప్రశ్న .

ఉక్రెయిన్‌లో జరుగుతున్న ఆందోళను 2004నాటి ‘ఆరంజ్‌ రిమ్యాషన్‌’ ను గుర్తుకు తెస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరంజ్‌ రిమ్యాషన్‌ నిజానికి రిమ్యాషన్‌ కాదు. అప్పటి అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీ ఓట్లతో అధ్యక్ష పదవి చేపట్టిన యనుకోవిక్‌ ఐరోపా దేశా అడుగుకు మడుగులు ఒత్తడానికి నిరాకరించారు. పశ్చిమ దేశాలు తమ నిధుతో నడిచే ఎన్‌.జి.ఓ సంస్థ సహాయంతో ఆందోళనలు రెచ్చగొట్టాయి. న్యాయమూర్తులు సైతం అమ్ముడుబోయి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన యనుకోవిక్‌ను అధ్యక్ష పదవి నుండి తప్పించారు. దీనికే ‘ఆరంజ్‌ రిమ్యాషన్‌’గా పశ్చిమ దేశాలు, పత్రికలు సంతోషంగా చెప్పుకుంటాయి. ఇ.యు ప్రతిపాదించిన ‘అసోసియేషన్‌ అగ్రిమెంట్‌’ ని చదివినవారు ఎవ్వరూ ఇ.యులో చేరాని ఆందోళన చెయ్యరని ప్రధాని అజరోవ్‌ ప్రకటించడం గమనించాల్సిన విషయం. ఇ.యు ఒప్పందాన్ని వాయిదా వేయడానికికే తాము నిర్ణయించుకున్నామని అధ్యక్షుడు యనుకోవిక్‌, లిధువేనియా రాజధాని విలినియస్‌లో నవంబర్‌ 30 తేదీన ముగిసిన ఇ.యు సమావేశాల్లో స్పష్టం చేశాక ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఆందోళను తీవ్రం అయ్యాయి. వీటిని పోలీసు అదుపులోకి తెచ్చినప్పటికీ మరికొంతమంది ఇంకా ఆందోళనల్లో ఉన్నారు. రాజధానిలో తిష్టవేసిన ఆందోళనకారు వల్ల తమకు తీవ్ర అసౌకర్యంగా ఉన్నదని నగరవాసు ప్రభుత్వాధికారుకు ఫిర్యాదు చేయడం విశేషం.

ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం ఇవ్వడంతో ఇ.యు విఫం అయిందని అందుకే తాము ఒప్పందం వాయిదా వేస్తున్నామని అధ్యక్షుడు విక్టర్‌ యనుకోవిక్‌ విలినియస్‌ చర్చల్లో స్పష్టం చేశాడు. ఈస్టన్‌ పార్లనర్‌ షిప్‌ శిఖరాగ్ర సమావేశా కోసం అనేక సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ఉక్రెయిన్‌ లాంఛనంగా ఇ.యులో చేరుతుందని అందరూ భావించారు. అందరి అంచనాను తారుమారు చేస్తూ ఇ.యు చేరికను వాయిదా వేస్తున్నట్లు సమావేశాకు వారం ముందు ఉక్రెయిన్‌ ప్రకటించడంతో అమెరికా, ఇయు షాక్‌ తిన్నాయి. రష్యా ఒత్తిడితోనే ఉక్రెయిన్‌ వెనక్కి వెళ్లిందని అవి ప్రకటించడంతో అమెరికా, ఇ.యు షాక్‌ తిన్నాయి. రష్యా ఒత్తిడితోనే ఉక్రెయిన్‌ వెనక్కి వెళ్లిందని అవి ఆరోపించాయి. నాగరిక ఐరోపా సమాజంలో చేరకపోవడం ద్వారా ఉక్రెయిన్‌ తప్పు చేసిందని ప్రశ్చిమ పత్రికులు గగ్గోు పెట్టాయి. అయితే ఇ.యు ప్రతిపాదించిన ఒప్పందంలోని షరతు చూస్తే ఉక్రెయిన్‌ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని అర్థం అవుతుంది. రష్యాకు సంవత్సరానికి 16 బిలియన్‌ డార్ల మేరకు ఉక్రెయిన్‌ ఎగుమతులు చేస్తుంది. యూరోపియన్‌ యూనియన్‌కు చేసే ఎగుమతులు 17 బిలియన్లని అంచనా. అయితే ఉక్రెయిన్‌` రష్యా మధ్య ఉండే చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు విడదీయలేనివి. ఇయులో చేరాంటే ఉక్రెయిన్‌ అనేక షరతును అమలు చేయాల్సి ఉంటుంది. నేమ్‌ బోర్డ్‌కు వాడే ఇనుప శిల దగ్గర్నుండి రైలు పట్టా వరకు సర్వం మార్చుకోవసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇ.యు చేరిక వల్ల ఉక్రెయిన్‌పై 33 బిలియన్‌ యూరో భారం పడుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.ఇంత భారం భరిస్తున్నా కేవం 1 బిలియన్‌ యూరోలు మాత్రమే సహాయం ఇవ్వడానికి ఇ.యు అంగీకరించింది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా తమ సరుకుతో ఉక్రెయిన్‌ను ముంచెత్తడానికి తద్వారా ఆర్థికంగా లాభం పొందడానికి ఇ.యు ప్రయత్నిస్తోంది. పైగా ఉక్రెయిన్‌ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు శిక్ష పడి జైులో ఉన్న మాజీ అధ్యక్షురాలిని ‘వైద్య చికిత్స’ పేరుతో విడుద చేసి విదేశాలకు పంపాలని ఇ.యు షరతు విధించింది. ఈ షరతును ఉక్రెయిన్‌ పార్లమెంటు తిరస్కరించింది.

యూరోపియన్‌ యూనియన్‌లో చేరడం వన ఉక్రెయిన్‌కు జరిగే నష్టం.
ప్రస్తుతం ఇ.యుకు ఉక్రెయిన్‌ చేస్తున్న ఎగుమతు 17 బిలియన్‌ డాలర్లు. రష్యాకు చేసే ఎగుమతులు 16 బిలియన్‌ డాలర్లు. ఇ.యుతో ఒప్పందం చేసుకుంటే రష్యా ఎగుమతి మార్కెట్‌ మొత్తాన్ని ఉక్రెయిన్‌ కోల్పోతుంది. రష్యా మార్కెట్‌ మొత్తం కోల్పోతే ఉక్రెయిన్‌ 35 బిలియన్‌ యూరోలు నష్టపోతుందని రష్యా అంచనా. ఉక్రెయిన్‌ కార్‌ మార్కెట్‌లో 13 శాతం ఇ.యు నుండి దిగుమతి అవుతున్నాయి. ఇ.యు చేరిక వల్ల దిగుమతి ఇంకా పెరిగి స్వదేశీ ఉత్పత్తిదాయి తీవ్రంగా నష్టపోతారు. ప్రారంభంలో కొన్ని రక్షణలు ఇస్తామని ఇ.యు చెబుతున్నప్పటికీ ఆ తర్వాత ఎమిటనేది ఉక్రెయిన్‌ వెంటాడుతున్న ప్రశ్న. అంతే కాకుండా దేశీయ గ్యాస్‌ వినియోగదారు నుండి వసూలు చేసే ధరల్ని బాగా పెంచాని ఐ.ఏం.ఎఫ్‌ సిఫారసు చేసింది. గ్యాస్‌ సబ్సిడీ తగ్గించేసి ధరలు పెంచితే భవిష్యత్తులో గ్యాస్‌ మార్కెట్‌ని పశ్చిమ బహుళజాతి కంపెనీు ఆక్రమించే ప్రమాదం ఉంది. ఐ.ఎం.ఎఫ్‌కి పశ్చిమ దేశాలు అప్పగించిన పని ఇదే. అప్పుతో ఆదుకుంటునట్లు కనిపిస్తూ పశ్చిమ బహుళజాతి కంపెనీ మార్కెట్‌గా దేశాలను మార్చడం ఐ.ఎం.ఎఫ్‌ పని. ఇండియాలో ఐ.ఎం.ఎఫ్‌ అదే పని చేసింది ఋణ సంక్షోభం అడ్డం పెట్టుకుని ఐరోపాలోను అదే చేసింది. ఉక్రెయిన్‌లోనూ అదే చేయడానికి నడుం బిగించింది.

యూరోపియన్‌ ఎకనమిక్‌ యూనియన్‌ (ఇ.ఇ.యు)లో చేరడం వన ఉక్రెయిన్‌కు కలిగే లాభం:
ఉక్రెయిన్‌ ఇ.యుని కాదని రష్యా నేతృత్వంలోని కస్టమ్స్‌ యూనియన్‌ (2015 నుండి ఇ.ఇ.యు)లో సభ్యత్వం పొందితే మిలట్రీ సహకారం కూడా ఉంటుంది. ఇ.యు. ఒప్పందంలో ఇది లేదు.పొరుగున ఉన్న అర్మీనియా, తజకిస్తాన్‌, కిర్ఘిస్తాన్‌, బెలారస్‌ లాంటి దేశాలు ఇ.ఇ.యులో చేరుతున్నాయి. ఉక్రెయిన్‌ దానికి బదు ఇ.యులో చేరితే అది దాదాపు ఆత్మహత్యతో సమానం అని చెప్పవచ్చు. ఇ.యు సాహసర్యంలో నిరంతరం చస్తూ బతకడమే ఉక్రెయిన్‌కి మిగుతుంది. దీనితో పాటు ఇ.ఇ.యులో చేరితే రష్యాలోని నాలుగు ప్రధాన బ్యాంకు ఇచ్చిన 20 బిలియన్‌ డార్ల రుణానికి భద్రత ఉంటుంది. ఒత్తిళ్ళు ఉండవు.పైగా ఇ.ఇ.యుని కాదని రష్యా నుండి దూరం అయితే ఉక్రెయిన్‌ కొత్త గ్యాస్‌ సంబంధాల కోసం చూడాలి. అప్పుపెట్టి గ్యాస్‌ పొందే సౌకర్యం పోతుంది. అంతేకాకుండా యూరోపియన్‌ యూనియన్‌తో గానీ, అమెరికాతో గానీ వాణిజ్య సంబంధాలు పెట్టుకుంటే, అది కూడా వారి షరతు మేరకు పెట్టుకుంటే పరిస్థితి అగ్రరాజ్యం చేతుల్లోకి వెళ్ళిపోతుందనే నేపధ్యంతో ఉక్రెయిన్‌ తాత్కాలికంగా ఇ.యులో చేరడానికి వెనకడుగు వేసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి అది తాత్కాలికమే అయినా, మంచి నిర్ణయం. వచ్చే మార్చిలో ఇ.యులో చేరడానికి ఆమోదిస్తే కనుక ఆ దేశ ప్రజకు తీవ్ర నష్టకరం. ఇ.యు చేరికను ఉక్రెయిన్‌ ప్రజు వ్యతిరేకించాల్సిందిపోయి ఆహ్వానించడం సరికాదు. తమను నడిపిస్తున్న శక్తు నేరుగా నిప్పు కొలిమిలోకి తమను నడిపిస్తున్నాయని వారు గుర్తెరగాలి.

యూరోపియన్‌ యూనియన్‌, పశ్చిమ దేశాు భయపడటానికి కారణాలు:
ఉక్రెయిన్‌, ఇ.యు మధ్య మార్చి 2014లో మరో విడత చర్చలు జరగనున్నాయి. అప్పటికి యూరోసియన్‌ ఎకనామిక్స్‌ యూనియన్‌ ఏర్పాటులో బెలారస్‌, రష్యా, కజకిస్తాన్‌లు నిండా మునిగి ఉంటాయి. యూరోపియన్‌ యూనియన్‌కు ప్రత్యామ్నాయంగా రష్యా ముందుకు తెస్తున్న యూరేసియన్‌ ఎకనామిక్‌ యూనియన్‌కే ఇ.యు ప్రధానంగా భయపడుతోంది. ప్రస్తుతం రష్యా, కజకిస్తాన్‌తో కూడిన కస్టమ్స్‌ యూనియన్‌నే యూరోసియన్‌ ఎకనామిక్‌ యూనియన్‌గా రష్యా విస్తరిస్తోంది. ఇది గనుకు విజయవంతమైతే ఇ.యు, పశ్చిమ దేశా ఆర్థిక ఆధిపత్య విస్తరణ అవకాశాకు మూడినట్లే. మధ్య, పశ్చిమ అసియా దేశాను కుపుకోవడం ద్వారా రష్యాను ఒంటరిని చేసి లొంగ దీసుకోవాలన్న ఐరోపా, అమెరికా దురాలోచనకు ఈ కొత్త కూటమి మంగళం పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌ ప్రధానంగా ఇంధన (గ్యాస్‌, చమురు) వనరు రష్యాయే. మెజారిటీ రుణాు రష్యా ఇచ్చినవే. ప్రధాన వాణిజ్య భాగస్వామి రష్యాయే. అలాంటి రష్యాను దారికి తెచ్చుకునేందుకు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌ను మార్గంగా ఎంచుకున్నాయి. ఉక్రెయిన్‌ను ఇ.యులో చేర్చుకుంటే రష్యా నేతృత్వంలో నిర్మితం అవుతున్న యూరేసియన్‌ కూటమిని అడ్డుకోవచ్చన్నది పశ్చిమ దేశా పథకం. కానీ ఇ.యు ఎటువంటి ప్రతిఫం చూపకపోవడంతో ఇ.యులో చేరే ఒప్పందాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు యనుకోవిచ్‌ చివరి నిమిషంలో వాయిదా (కేవం వాయిదా మాత్రమే. రద్దుకాదు) చేసుకున్నాడు. ఆ మాత్రానికే ఉక్రెయిన్‌లో అజడు సృష్టించాయి అమెరికా, ఇయు. అమెరికా ఎంపిు, ఇ.యు అధికారులు అనేకమంది స్వయంగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వచ్చి ఆందోళనకారును రెచ్చగొడుతూ ప్రసంగాలు ఇచ్చారు. ఇంకా విధ్వంసం సృష్టించండి అని ప్రొత్సహిస్తూ తినడానికి, తాగడానికీ పోట్లాు పంచి వెళ్లారు. ఇపుడు వీళ్లకి

ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం గుర్తుకు రాలేదా?

ఇపుడు ఉన్న ప్రపంచ పరిస్థితుల్లో అమెరికా, ఇయు ఆధిపత్యాన్ని బహీనపరచడమే తక్షణ అవసరం. అందుకోసం ప్రపంచంలో వివిధ ప్రాంతీయ కూటము అవతరించి సొంత ప్రయోజనాల కోసం పాటుపడాలి. తద్వారా పశ్చిమ బహుళజాతి కంపెనీ మార్కెట్‌ దాహానికి అడ్డుకట్ట వేయాలి. మార్కెట్‌ దాహంతో తపించిపోతూ అడుగు పెట్టిన చోటల్లా విధ్వంసం సృష్టిస్తూ హింసాత్మక రాజకీయాలు నిర్వహిస్తూ, ప్రజాస్వామిక ఎన్నికల్లో నెగ్గిన ప్రభుత్వాను సైతం హింసాత్మకంగా కూలదోస్తూ ప్రపంచ శాంతికి భంగకరంగా మారిన పశ్చిమ దేశా (అమెరికా, ఇయు) ఆధిపత్యాన్ని నిువరించడం ఇప్పటి అవసరం. ఆ పని రష్యా చేసినా, చైనా చేసినా ఆహ్వానించాలి.
   

ఉసురు తీస్తున్న స్వార్థ రాజకీయాలు

ఆత్మహత్యలూ పోరాట రూపమేనా?
ఆందోళన కలిగిస్తున్న బలిదానాలు. 
పోరాడి ఒరిగిన తెలంగాణ వారసత్వం. 
కారకులు ఉద్యమ నేతలా, పాలకులా? 
మెడలు వంచాలి తప్ప మరణాలు కాదు! 

తెలంగాణ నినాదమే కీలకమైన నేటి సందర్భంలో ఆత్మబలి దానాలు కొనసాగడం పలువురిని విషాదపరుస్తోంది. ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ తల్లి తన బిడ్డల్ని కోల్పోతు న్నది. బంగారు భవిష్యత్తును వదులుకొని విద్యార్థి, యువత తృణప్రాయంగా తమ ప్రాణాల్ని వదులు కుంటు న్నారు. ప్రాణాల్ని- శత్రువును ఎదిరించే యుద్ధ భూమిలోనే పోరాడుతూ వదలాలి. విలువైన ప్రాణాల్ని చంపుకోవడం వల్ల శత్రువుకు అవకాశమిచ్చినట్లవుతుంది. తెలంగాణ ప్రజల పోరాటం ఈనాటిది కాదు. భూమి కోసం, భుక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన ఘనత ఈ ప్రజలది. చరిత్రలో వీరోచిత పోరాట గాథలు కోకొల్లలు. దొరలు, జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఇక్కడి ప్రజల త్యాగాలు వెల కట్టలేనివి. షేక్‌ బందగీ, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ- భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తికోసం పోరాడి నేలకొరిగారు. అటువంటి వారసత్వం తెలంగాణ ప్రజలది. సందర్భం వేరుకావచ్చు కాని, నిరంతర ప్రవాహంగా సాగుతున్న ఉద్యమాలు తెలంగాణ ప్రజల ఆర్తిని చూపిస్తున్నాయి. 



నేటికి ప్రజల ఆకాంక్షలు తీరలేదు. వనరుల పరాయూకరణలో ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా బ్రతుకీడుస్తున్నారు. ఈరోజు ఉద్యమంలో ఆత్మహత్యలు సాగుతున్నాయంటే కారణం నేటి రాజకీయ నాయకుల వైఖరి, వందల కోట్లు డబ్బులు ముట్టజెప్పి తెలంగాణను అడ్డుకుంటున్న ఆంధ్ర పెత్తందార్లదని స్పష్టంగా తెలుస్తుంది. ఇంత ఉద్యమం నడుస్తున్నా, బలిదానాలవుతున్నా కొందరు తెలంగాణ రాజకీయ నాయకులు తమ పదవులను వదలకుండా కూర్చుంటున్నారు. పోరాటం ద్వారా తెలంగాణ సాధించుకోవచ్చు అనే బలమైన విశ్వాసాన్ని ప్రజలలో కల్పించడం లేదు. 
ప్రపంచ చరిత్రలో తెలంగాణ ప్రాంతానికి చెందిన పోరాటాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణలో జరిగిన ప్రతి పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదే. ఒకనాడు బాంచన్‌ నీ కాల్మొక్త అన్న బక్కోనితో బందూకు పట్టించిన తెలంగాణ నేల గత కొంత కాలంగా ఆత్మహత్యల నేలగా మారిపోతుంది. ఒకనాడు దొరకు ఎదురుతిరిగి పోరాడిన నేల నేడు నైరాశ్యంతో ఆత్మహత్యలతో నిండిపోతుంది. ప్రపంచంలో ఎక్కడ పోరాటం జరిగినా అక్కడి ప్రజలు తమ శక్తి వంచన లేకుండా పోరాడి నేలకొరిగారే తప్ప ఎవరూ నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర ప్రపంచంలో ఎక్కడా కానరాదు.



కానీ ఒక్క తెలంగాణలోనే అన్యాయానికి ఎదురు నిలిచి పోరాడాల్సిన యువతీ యువకులు ఆత్మహత్యలను ఆశ్రయిస్తున్నారు. నాటి వీరోచిత తెలంగాణ నేడు ఆత్మహత్యల తెలంగాణగా ఎందుకు మారింది? నాడు అన్యాయానికి ఎదురు తిరిగిన యువత నేడు ఎందుకు ఆత్మహత్యలను ఆశ్రయిస్తోంది? ఈ ఆత్మహత్యలకు కారకులు ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులదా లేక ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న పాలకులదా అనేది ఆలోచించాలి.సామాజిక శాస్త్రవేత్త ఇమైల్‌ దుర్క్‌హైమ్‌- ఆత్మహత్యలు మూడు రకాలుగా జరుగుతాయని చెబుతాడు. మొదటిది - అత్మాభిమానం దెబ్బతినడం వలన, వ్యవస్థ తనకు ఏమీచేయదు అనే ఒక మానసిక స్థితికి లోనై ఆత్మహత్య (ఇగోయిస్టిక్‌ సూసైడ్‌) వైపు మొగ్గుతారని, ఇక రెండోవది అల్ట్రూస్టిక్‌ సూసైడ్‌- అంటే పరహిత బలవన్మరణాలు. నా చావుతోనైనా ఈ పరిస్థితి మారాలని ఒక స్థితికి లోనై చేసుకునే బలవన్మరణాలు. 



మూడవది అనోమియా సూసైడ్స్‌- ఈ రకమైన ఆత్మహత్యలు తనను తానూ ఆత్మ బలిదానం చేసుకోవడమే కాకుండా, తన ఆత్మహత్యలకు కారణమైన వారినికూడా బలితీసుకునే విధంగా ఉంటాయి. నేడు తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలు రెండో రకానికి చెందిన ఆత్మహత్యలుగా గుర్తించవచ్చు. తమ మరణం ద్వారా నైనా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరి ఈ ప్రాంతంలో దాదాపు 12 వందల మంది యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ వ్యవస్థమీద, తన మీద నమ్మకంలేని వ్యక్తులు ఇటువంటి రూపాలను ఎంచుకుంటారు. 
2009 డిసెంబర్‌ నుండి ఇప్పటి వరకు జరిగిన ఆత్మహత్యలను ఒసారి గమనించించే ఒక ఆశ్చర్యకరమైన, ఆందోళన కలిగించే అనేక నిజాలు మనకు తెలుస్తాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు కోసం 1969లో జరిగిన పోరాటంలో దాదాపు 370 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా, ఏ ఒక్కరూ ఆత్మహత్మకు పాల్పడలేదు. అందరూ పోరాడుతూనే, పోలీసుల కాల్పులకు, దెబ్బలకు, చిత్ర హింసలకు గురై చనిపోయారే తప్ప ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలేదు.



2009 నుండి జరుగుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, దానికి నాయకత్వం వహిస్తున్నామని చెప్పుకుంటున్న శక్తులు ఒక విచిత్రమైన పరిస్థితిని తీసుకొని వచ్చాయి. 2009 డిసెంర్‌లో తెలంగాణకోసం, హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌ నుంచి మినహాయించాలని కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నించడంతో, ఆయన ఆత్మహత్య చేసుకునైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తానని ఆసుపత్రిలో ప్రకటించారు. అదే సమయంలో తెరాస ఎమ్మేల్యే హరిష్‌రావు కేసీఆర్‌ను ఆరెస్టు చేయడానికి ప్రయత్నిస్తుంటే- తన ఒంటిపై కిరోసిన్‌ పోసుకుం టానని పోలీసులను బెదిరించారు. ఇటు వంటి సందర్భంలో తమకు దిశా నిర్దేశం చేయాల్సిన నాయకులే ప్రభుత్వాల, పోలీసుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఉద్యమాన్ని నడిపించాల్సింది పోయి, ఆత్మహత్మలకు ప్రయత్నించడంతో నాయకత్వాన్ని గుడ్డిగా నమ్మి పోరాట బాట పట్టిన తెలంగాణ యువతీ యువకులూ ఆదే మార్గాన్ని పట్టారు. కేసీఆర్‌, హరీష్‌రావు కేవలం ప్రభుత్వాన్ని, పోలీసులను నిలువరించడానికే ఆత్మహత్య నాటకం ఆడి ఉండవచ్చు. 



కానీ తెలంగాణ యువతీ యువకులు దానిని సీరియస్‌గా తీసుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. దీక్షా శిబిరం వద్ద కేసీఆర్‌, హరీష్‌రావ్‌ ఒంటిపై కిరోసిన్‌ నాటకం ఆడిన కొద్దిసేపటికే ఎల్బినగర్‌లో శ్రీకాంత్‌ చారి ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ప్రాణత్యాగం చేశాడు. వేణుగోపాల్‌ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంటల్లో మాడిపోయాడు. సువర్ణ శరీరం దివీ అయి మండింది. వరంగల్‌ జిల్లాలో చెరుకు అంజయ్య విద్యుత్‌ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకు న్నాడు. అదే జిల్లాకు చెందిన జాగోత్‌ సోమ్లా నాయక్‌ చెట్టునుంచి దూకి ఆత్మహత్మకు పాల్ప డ్డాడు. కానిస్టేబుల్‌ కిష్టయ్య తుపాకితో కాల్చుకొని చనిపోయాడు. ఇట్లా ప్రతి జిల్లాలో వందలాది మంది యువతీ యువకులు నైరాశ్యంతో తమ ప్రాణాలను అర్పించారు. దీనికి కారణం ఎవరంటే స్పష్టంగా ఉద్యమ నాయకత్వమే అని చెప్పవచ్చు. ప్రపంచంలో ఎక్కడా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నాయకులు ఇటువంటి పోరాట రూపాలను ప్రజలకు అందించరు. కేవలం ఒక్క తెలంగాణ రాజకీయ నాయకులే ఈ పోరాటరూపానికి దారి చూపారు. 



నిజానికి తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేక పోరాట చరిత్ర ఉన్నది. తరతరాలుగా తమ శ్రమనంతా ధారపోసి దున్నుకుంటున్న భూమిపై, పండించిన పంటపై తమకే హక్కు దక్కాలని బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా, వారికి మద్దతుగా ఉన్న నైజాంకు వ్యతిరేకంగా గోండు రాజు రాంజీ మూడు రోజులు రోజులపాటు వీరోచితంగా పోరాడి ఉరికంబాన్ని ముద్దాడిన నేల తెలంగాణది. తన చిన్న సైన్యం బ్రిటిష్‌ వారిని, నైజాంను ఓడించలేదని తెలుసు, అయినా వారికి లొంగదలచుకోలేదు. తన ప్రాణం పోయే వరకూ వీరోచింగా పోరాడాడు. ఇది ఈ ప్రాంత ధిక్కార చరిత్ర. ఏ నేలలో గోండు రాంజీ బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాడో అదే నేలలో ఆ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కొమురం భీం 85 సంవత్సరాల తర్వాత పంట కొసం, భూమి కోసం, గోండు సంస్కృతి పరిరక్షణ కోసం- కొత్త పోరాటరూపంతో ముందుకొచ్చాడు. పంట మీద, భూమి మీద, సంస్కృతి సాంప్రదాయాల మీద- ఈ రాజ్యం మీద ఎవరికి అధికారముంటుందో వాడికే సర్వ హక్కులు కాబట్టి, 



అంతిమంగా ఈ పోరాటం ‘మాగోండు రాజ్యం మాక్కావాలి’ అనే నినాదంతో పన్నెండు గోండు గూడేలను ఏకంచేసి జోడెం ఘాట్‌ కేంద్రంగా బ్రిటిష్‌ వారికి, నైజాంకు వ్యతిరేకంగా వీరోచితమైన పోరాటం నిర్వహించి వీరమరణం పొందాడు కోమురం భీం. ఇదీ తెలంగాణ ధిక్కారమంటే! అయితే తెలంగాణ, దక్కన్‌ గత వెయ్యి సంవత్సరాలుగా ఈ నేలమీద హక్కు తనదే అని ప్రకటన చేస్తూనే ఉన్నది. ఈ ప్రకటనలో భాగమే, ఈ స్వయం నిర్ణయాధికారంలో భాగమే, ఈ ధికార్క సంప్రదాయంలో భాగమే- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కంటే ముందే 30, 40 సంత్సరాల పాటు అనేక మంది చరిత్రకెక్కని మహాయోధులు పోరాటం చేశారు. 1857లో హైదరాబాద్‌లో నైజాంకు వ్యతిరేకంగా పోరాడి వీరమరణం పొందిన తుర్రెబాజ్‌ ఖాన్‌, మోల్వీ అల్లావుద్దీన్‌ వంటి యోధులు కనిపిస్తారు. నైజాం నియంతృత్వ పాలనను ఎదిరించి తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం స్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఏకమై 1946 నుండి 1951 వరకు వీరోచితంగా పోరాటం నడిపిన చరిత్ర ఈ తెలంగాణది. 



పండించిన పంటను బలిసిన దొర విసునూరు రామచంద్రారెడ్డి దోచుకోవడానికి ప్రయత్నిస్తే, దొర సైన్యాన్ని ఎదిరించి పంటను కాపాడుకున్న చాకలి ఐలమ్మ పోరాట గడ్డ ఈ తెలంగాణ. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో రజాకార్లను ఎదిరించారనే సాకుతో 11 మంది యువకులను చెట్టుకు కట్టేసి కాల్చి చంపడానికి ప్రయత్నిస్తుంటే రజాకార్లను తన్ని తరిమి ఆ యువకుల ప్రాణాలను కాపాడిన మాదిగ ముత్తమ్మ ధీరత్వం తెలంగాణ. పండించిన పంటను భూస్వామి లాక్కోవడానికి ప్రయత్నిస్తే, పోరాడి ప్రాణమిచ్చిన ముస్లిం యువకుడు బందగీ అమరత్వం గావించిన నేల ఈ తెలంగాణ. దొర పొలంలో వెట్టిచాకిరి చేస్తున్న మహిళలు, తమ పిల్లలకు పాలివ్వడానికి అనుమతికోరితే, పాలు ఉన్నాయోలేవో ఒక పాత్రలో పిండి చూపించమన్న దొరను తన్ని తరిమేసిన గొల్ల సత్తెమ్మ ధిక్కారస్వరం తెలంగాణ. ఇట్లా వేలాది మంది ప్రజలు కుల, మత భేదాలు లేకుండా పోరాడిన రక్తంతో తడిసిన నేల తెలంగాణ. అట్లాంటి వీరోచిత తెలంగాణ గత కొంత కాలంగా ఆత్మహత్మల నిలయంగా మారిపోయింది. 



ఒకనాడు పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్ళు- బాంచన్‌ నీ కాల్మొక్త అన్న బక్కోనితో బందూకు పట్టించి దోపిడీ దొరలను తన్ని తరిమేస్తే, నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారు మాత్రం తమ రాజకీయ జిమ్మిక్కులతో తెలంగాణ యువతీ యువకుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ, వారీలో నైరాశ్యాన్ని నింపుతూ ఆత్మహత్యలకు పాల్పడేలా పురికొల్పుతున్నారు. తెలంగాణ వీరగడ్డను నేటి తెలంగాణ నాయకత్వం బొందల గడ్డగా మార్చివేసింది. 2009 నుంచి నేటి వరకు జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది యువతి యువకులు పిట్లల్లా రాలిపోతున్నారు. తెలంగాణ అమరుల ఆత్మఘోషకు కారణం ముమ్మాటికి తెలంగాణ నాయకత్వమే. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆ ప్రాంతంలోని ఉద్యమ సంస్థలు, యూనివర్సిటీ విద్యార్థులు రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా క్రియాశీలంగా ఉండి పోరాటాన్ని నడిపి చూపించారు.



విద్యార్థుల పోరాటాన్ని, నిబద్ధతను చూసిన తెలంగాణ పల్లెలు యూనివర్సిటీ విద్యార్థులనే తమ నాయకత్వంగా భావించి ఉద్యమంలో ముందుకు దూకారు. కానీ విద్యార్థులు ఉద్యమంలో ముందుండి పాల్గొంటే తమ భవిష్యత్తు రాజకీయాలకు ప్రమాదమని గ్రహించిన తెలంగాణ రాజకీయ పాలకవర్గ పార్టీలు జాక్‌ల పేరుతో ఏకమై, ప్రలోభాలు కల్పించి ఉద్యమాన్ని విద్యార్థుల చేతులోంచి లాక్కున్నారు. ఒక నాడు యూనివర్సిటీలకు వచ్చి ప్రమాణాలు చేసిపోయిన రాజకీయనాయకులు క్రమంగా తమ వైపు విద్యార్థులను తిప్పుకునేలా చేసుకున్నారు. ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా ఆర్ట్‌‌స కాలేజీలో లక్షలాదిమందితో బహిరంగ సభ నిర్వహించిన విద్యార్థులే- తరువాత రాజకీయ పార్టీల చుట్టూ ప్రదిక్షణలు చేసే స్థితికి, వారి పిలుపులకు స్పందించే స్థితికి చేరుకున్నారు. 




చైతన్య వంతమైన మేధావులుగా తెలంగాణ పోరాట వారసత్వాన్ని ప్రజలకు వివరించి వారిని పోరాలమార్గాన పట్టించాల్సిన విద్యార్థులు నైరాశ్యానికి గురై ఆత్మహత్మలు చేసుకుంటే, వారిని ఊరేగించి ఇంకా ఆత్మహత్యలు చేసుకునేందుకు పరోక్షంగా కారకులయ్యారు స్వార్ధపర నేతలు. తెలంగాణ ప్రజానీకమంతా తమ ఆశలను విద్యార్థుల మీద వారి పోరాటాల మీద ఉంచుకుంటే, తెలంగాణ విద్యార్థులు మాత్రం పాలక వర్గ రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతూ పోరాటాన్ని తప్పు దారి పట్టించారు.తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్మలకు రాజకీయ పార్టీలు ఎంత బాధ్యతనైతే వహిస్తాయో విద్యార్థులు, ఉద్యోగస్థులు కూడా అంతే బాధ్యత వహించాలి. ప్రత్యేక తెలంగాణ కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఈ ప్రాంత విద్యార్ధులు, యువకులు నిరాశతో ఇంకా ఇంకా ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండాలంటే. ఇప్పటికైనా తెలంగాణ ధిక్కార స్వరాన్ని, పోరాట వారసత్వాన్ని యువతీ యువకుల్లో నూరిపోయాలి. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనుకాకుండా ఈ ప్రాంత సబ్బండ వర్ణాలు తమకు వారసత్వంగా వచ్చిన పోరాట రూపాన్ని ప్రదర్శించి పాలకుల మెడలు వంచాలి తప్ప మరణం వైపు వెళ్ళకూడదు.

(సూర్య 12-11-13)

ప్రజాస్వామ్యమా షర్మిలను చూసి సిగ్గుపడు.


మన కల్లముందే పదిమంది మహిళలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చితే మనమైతే ఎంచేస్తాం...కాసేపు బాధ పడతాం,కాసేపు కన్నీరు కారుస్తాం, కల్లముందే జరిగిన మారణహోమాన్ని పదిమందికి కథలుకథలుగా చెప్పి బోరున విలపిస్తాం కావొచ్చు... కాని ఆమె మాత్రం మన అందరికంటే భిన్నంగా స్పందించింది....తన కల్ల ముందే జరిగిన ఘటనకు స్పందనగా ప్రపంచంలో ఇప్పటివరకు ఎవ్వరు చేయలేని సాహాసాన్ని  చేసి చుపుతుంది...అమె ఇరోం చాను షర్మిలా....   



నవంబర్ 2, 2000 సంవత్సరం మణిపాల్ లోయలోని మలోం బస్టాండ్ల్ లో  నిలుచున్న వారిపై  అస్సాం  రైఫిల్స్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ ఘటనలో పది మంది మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సాయుధ దళ కౄరత్వం  అందరిని కలచివేసింది. ఇరోం షర్మిలా స్థానిక పత్రికలో జర్నలిస్టు. కవయిత్రీ కూడా. కనికరం లేని తీరుతో కలతచెందిన షర్మిలా కటిన నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4న ఆమరణ దీక్షకు దిగింది. యమపాశంగా మారిన భద్రత దళాల ప్రత్యేక అధికారల చట్టం అంతు చూసేదాకా దీక్ష సాగిస్తానని శపధం చేసింది. తన చావుతోనైనా తన జాతికి పట్టిన పీడనను వొదిలించాలని పట్టుదలతో దీక్ష చేపట్టింది. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు షర్మిలాను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏంత బలవంతం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో నాసోగ్యాస్ట్రిక్ ఇన్ ట్యుబ్యెషన్ పద్దతిలో ముక్కుద్వారా ద్రవ పదార్థాలను పంపించడం మొదలు పెట్టారు. షర్మిలా బైల్ తీసుకోవడాంకి నిరాకరించింది. ఆత్మహత్య నేరం కింద జైలు శిక్ష సంవత్సరం మాత్రమే కాని ఏడాది కాగానే జైలు నుంచి విడుదల చెయడం మళ్ళీ అరెస్టు చేయడం.. 12 ఏండ్లుగా మణిపూర్ పోలిసులు అదే పని చేస్తున్నారు. ఇప్పటికే 500 సార్లు కోర్టు, జైలు, హాస్పిటల్ వార్డుకు తిరిగించి. 12 ఏండ్లుగా షర్మిలా నోటిద్వారా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. ముక్కుద్వారా పైపుతో ప్లూయిడ్ ఎక్కించడం నిజంగా ఒక హింస. షర్మిలా శరీరం రోజురోజుకు కుషికంచిపోతుంది. అవయవాలు మెళ్ళగా దెబ్బతింటున్నాయి. 38 ఏళ్ళ షర్మిలా బరువు ఇప్పుడు 37 కిలోలు. 2006లో విడుదలైనప్పుడు. షర్మిలా ఢిల్లీ రాజ్ఘడ్ చేరుకోని మహాత్ముడికి మొరపెట్టుకుంది. జంతర్ మంతర్ వద్ద దీక్ష సాగించింది. కేంద్రం వెంటనే అరెస్టు చేసి ఆసుపత్రిలో నిర్భందించింది. తరువాత  ఇంఫాల్ కు తరలించింది.  సంచలన వార్తల గుంపులో కొట్టుకుపోతున్న జాతీయ మీడియాకు షర్మిలా దీక్ష వార్త కాదు. అసలే గుర్తింపుకు నోచుకోని ఈశాన్య రాష్ట్రాలు. పైగా కనీస కవరేజ్ ఇవ్వని మీడియా.  సంవత్సరాలు గడుస్తున్న కదలిక లేని తోలు మందం ప్రభుత్వం. శారీరక బహహీనత, మానసిక సంఘర్షణ చుట్టూ తుపాకులు.  ఐతే హాస్పిటల్ లేదంటే జైల్. కత్తుల వంతేనమీద పయనం. ఆటు కానరానీ పరిష్కారం.  ఐతేనేం ఆమె మానసిక దృడత్వం ముందు ఏ అవంతరాలు నిలువలేదు. ఆమె సంకల్ప బలం ముందు నిరాశ, నిశ్పృహలు వెలవలేదు. నిబద్ధత, నిజాయితి, తన జాతి జనుల పట్ల ప్రేమ, అమానవీయ చట్టాలను ఆంతం చేయాలన్న కర్తవ్యం. అమెను ముందుకు నడిపించాయి. ఈ నవంబర్ 4వ తారికుతో అమె దీక్ష 12 ఏండ్లు నిండిపోతాయి. పుష్కర కాలంగా అదే సహసం అదే సహనం. 12 ఏండ్లుగా పుస్తకాలు, కవితలే ఆమె నేస్తాలు. ఈ ప్రస్తానంలో ఒక ఇంట్రెస్టింగ్ యాంగ్ల్ షర్మిలా లవ్ స్టోరీ.. షర్మిలా దీక్ష కాలంలోనే ప్రేమలో పడింది. అతని పేరు డెస్మాండో  కొటినో. బ్రిటన్ లో పుట్టిన భారతీయుడు .  మానవ హక్కుల కార్యకర్త. మరి పెండ్లెప్పుడు అని అడిగితే. సైనిక చట్టం రద్దై  , శిక్ష ముగిశాక అని చెప్పేసింది  ఆ వనిత సాహస దీక్షకు ఏన్నో అవార్డులు వచాయి. ఎషియన్ హుమన్ రైట్స్ ఫోక్ స్కూల్ మానవ హక్కుల పురస్కారం 2007 లభించింది. కాని మన ప్రభుత్వం కనికరించలేదు. సెవెన్ సిస్టర్స్ లో ఒకటైన మణిపూర్ సిస్టర్ కన్నీళ్ళను తుడవడానికి చేయి రాలేదు. నామమాత్రంగా ఒక కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. అన్నా హజారే దీక్షకు, కేజ్రివాల్ ధర్నాలకు విపరితమైన ప్రాచుర్యం కల్పించే మీడియా 12 ఏండ్లుగా కొనసాగిస్తున్న దీక్షకు తగినంత ప్రాచుర్యం కల్పించడం లేదు.  రాజకియ నాయకుల యాత్రలకు రోజులతరబడి కవరేజిలు ఇస్తున్న మన తెలుగు పత్రికలు ఇరొం షర్మిల 12 ఏండ్ల దీక్షకు ఓ మూల నాలుగు లైన్ల స్థానం కల్పించారు. ఇది మన పత్రికల స్థితి....శ్రీశ్రీ అన్నట్లు మన పత్రికలు "పెట్టుబడికి, కట్టుకథకు పుట్టిన విష పుత్రికలు పత్రికలు" అనేది నిజమే అనిపిస్తుంది.  ఇప్పుడు ప్రశ్న ఈ దీక్ష ఇంకెంత కాలం సాగుతున్నదన్నది కాదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇంకెన్నాలు ఉలుకూ పలుకూ లేకుండా కుర్చుంటాయన్నదే ప్రశ్న. ఒక మహిళ గాంధీ  మార్గంలో సాగిస్తున్న సత్యాగ్రహం పాలకులను  కదిలించ్లేకపోవడం మహా విశాదం.  ప్రజాస్వామ్యంలో పెద్ద విఘాతం.  షర్మిలా హిమాలయమంత ఎత్తున ఎదిగిన ఉద్యమ మూర్తి.  అన్యాయాన్ని ఎదిరించి నిపుస్తున్న వాళ్ళకు కొండంత స్పూర్తి . ఆమె నుండి ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళు నేర్చుకోవాల్సిన విలువైన పాటాలు ఏన్నో. నలుగురి కోసం బతకడం. నలుగురి కోసం చావడానికి సిద్దపడటం ఈ భూమ్మీద  అదే అంతటా ఆదర్శం. ఆ ఆదర్శాన్ని అంతటా ఆవిష్కరించిన షర్మిలాజి రెండు చేతులెత్తి వందనం చేయాలి.
మన తెలుగు పత్రికలు (ఈనాడు,సాక్షి,ఆంద్రజ్యోతి,) ఇరొం షర్మిల 12 ఏండ్ల దీక్షకు ఇచ్చిన కవరేజ్


మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ` ఓ విశ్లేషణ

 పపంచీకరణ నేపథ్యంలో సమాచార సాంకేతిక విప్లవం పరిఢవిల్లింది. ఈ క్రమంలోనే భావజా పతనం కొనసాగింది. పెట్టుబడిదారీ విధానానికి ఎదురులేని పరిస్థితును ప్రసార సాధనాు కల్పించాయి. సోవియట్‌ రష్యా పతనం, జర్మనీ ఏకీకరణ పెట్టుబడిదారీ పంథా విజయపరంపరకు గీటురాళ్లుగా నిలిచాయి. కమ్యూనిజం లేదా మార్క్సిస్టు`లెనినిస్టు పంథా లేదా భావజాలానికి ఇక ఏమాత్రం మనుగడ లేదని క్యాపిటలిస్టు`సామ్రాజ్యవాద సమర్థకు గట్టిగా వాదించడం మొదుపెట్టారు. మాస్‌ మీడియా వారి వాదనకు విపరీతమైన ప్రచారం కల్పించింది. కమ్యూనిస్టు దేశమైన చైనా 1980వ దశకం నాటికే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపు మొగ్గు చూపింది. కేవం మూడు చిన్న దేశాలైన క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియాు మాత్రమే కమ్యూనిజం జెండాను మోస్తూ వచ్చాయి. క్యాపిటలిస్టు వ్యవస్థ 1990 దశకం చివరి నాటికి శిఖర స్థాయికి చేరుకుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నతస్థితికి చేరుకున్నప్పుడే అంతర్గత వైరుధ్యాలాతో కుప్పకూుతుందని కార్ల్‌ మార్క్స్‌ పేర్కొని ఉన్నాడు. 2008లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం మార్క్స్‌ సూత్రీకరణకు అద్దం పడుతోంది. ఈ సమాంతర చరిత్రలో మావోయిస్టు ఉద్యమాన్ని విశ్లేషించవసిన అవసరం ఎంతైనా ఉంది.

భారతదేశ వామపక్ష ఉద్యమ చరిత్రలో అనేక సంక్షోభాు తలెత్తాయి. వాటిలో మొదటిది 1964లో భారతీయ కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన చీలిక. సిపిఐ రివిజనిస్టు పంథాను నిరసిస్తూ పుచ్చపల్లి సుందరయ్య నేతృత్వంలో ఏర్పడిన చీలిక వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు)గా అవతరించింది. మార్క్సిస్టు పార్టీలో జరిగిన తీవ్ర భావజా సంఘర్షణ 1967 నాటికి పతాక స్థాయికి చేరుకుంది. చారూ మజుందార్‌, కానూ సన్యాల్‌, తదితయి సాయుధ విప్లవ పోరాటం వైపు మొగ్గు చూపారు. పశ్చిమ బెంగాల్‌ లోని నక్సల్‌బరీలో ప్రారంభమైన ఈ సాయుధ ప్రతిఘటన నక్స్బరీ ఉద్యమంగా ప్రఖ్యాతి గాంచింది. అయితే అనతికాంలోనే ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. బెంగాల్‌లో ఉద్యమం నీరుగారిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో బమైన స్థావరాన్ని ఏర్పరుచుకుంది. 1969 శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం చారిత్రక ఘటనగా మిగిలిపోయింది. ప్రత్యేక తెంగాణ రాష్ట్రం కోసం 1969లో జరిగిన పోరాటంలోనూ నక్సలైట్లు క్రియాశీ పాత్రను పోషించారు. ఆంధ్రతో సమానంగా బీహార్‌లోనూ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ (ఎంసిసి) దళితు, వెనుకబడిన తరగతు వారి సహాయంతో బపడిరది. 1970 దశకంలో ఆంధ్ర నక్సలఉద్యమం క్రమంగా విస్తరించింది. మహారాష్ట్ర, అప్పటి మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలో ఉద్యమ కమిటీు ఏర్పాటయ్యాయి. 1975 ఎమర్జెన్సీ కాంలో తొలిసారిగా నక్సల్‌ ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేరళలో రాజన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కబళించింది. ఎన్‌కౌంటర్ల విధానం అన్ని రాష్ట్రాలో సర్వసాధారణమైపోయింది.
 
ఎమర్జెన్సీ అనంతర కాంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో నక్సల్‌ ఉద్యమం తన వ్యూహాన్ని మౌలికంగా మార్చుకుంది. సాయుధ పోరాట పంథాను వీడి దశ వారీగా ప్రాంతాను కైవసం చేసుకోవాని 1978లో తీర్మానించారు. అటవీ, మారుమూ గ్రామీణ ప్రాంతాను స్వాధీనం చేసుకున్న తర్వాత క్రమంగా పట్టణాు, నగరాను స్వాధీనం చేసుకునేలా వ్యూహం రచించారు. ప్రజాసమీకరణ కోసం రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌, రాడికల్‌ యూత్‌ లీగ్‌, రైతు కూలీ సంఘాన్ని స్థాపించారు. సిరిస్లి, జాగిత్యా జైత్రయాత్రు ప్రజాఉద్యమానికి ఉపమానాుగా మిగిలాయి. ఈ ఉద్యమాు జయప్రదం కావడంతో సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ను స్థాపించారు. అలాగే వ్యూహాత్మక పంథానూ మార్చుకున్నారు. ప్రజాసంఘా ఉద్యమ కార్యకలాపా కంటే సాయుధ దళా ఏర్పాటుపైనే దృష్టి సారించారు. దీని కారణంగా ప్రజాక్షేత్రంలో ఉద్యమ సంఘా ప్రభావం క్రమంగా క్షీణించింది. రైతు కూలీ సంఘం ఒక్కటే క్రియాశీంగా వ్యవహరించగలిగింది. 1980 దశకంలో పీపుల్స్‌ వార్‌ క్రమంగా ప్రజా మద్దతును కోల్పోయింది. మరోవైపు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాు కూడా ప్రత్యేక బగాను మోహరించి సాయుధ దళా దాడుకు ఆంధ్రలో ఉద్యమం సెట్‌బ్యాక్‌కు గురైంది. ఈ దశలోనే తొలిసారిగా పీపుల్స్‌ వార్‌ నక్సలైట్లు పొరుగున ఉన్న బస్తర్‌ అడవుకు తరలివెళ్లారు. సరిగ్గా రెండు దశాబ్దా అనంతర ఈ బస్తర్‌ అడవులే పీపుల్స్‌ వార్‌కు అభేద్యమైన కోటుగా మారాయి. 1990 దశకంలో అనూహ్యమైన మార్పు వచ్చాయి. 1991లో రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యాడు. అనంతరం ఆంధ్రలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పీపుల్స్‌వార్‌పై నిషేధం విధించింది. 
 
ఇక్కడ ఆంధ్ర పరిస్థితిని పక్కన పెడదాం. తెంగాణా నుండి తరలిపోయి అప్పటి మధ్యప్రదేశ్‌లోని దంతేవాడ ప్రాంతంలో స్థావరాన్ని ఎర్పాటు చేసుకున్న నక్సలైటు ఉద్యమ నాయకు క్రమంగా స్థానిక పోరాటాతో గిరిజనులో తమ పట్టును పెంచుకున్నారు. ముఖ్యంగా బహుళ జాతి సంస్థు, మైనింగ్‌ కంపెనీు, భారీ విద్యుత్‌, నీటిపారుద ప్రాజెక్టుతో తమ భూమును, ఇళ్లను కోల్పోతామని ఆందోళనచెందిన గిరిజను ప్రభుత్వ విధానాకు వ్యతిరేకంగా ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకున్నారు. వీరికి సాయుధ నక్సల్‌ దళాు రాజకీయ నాయకత్వం వహించాయి. ఈ స్థానిక ప్రతిఘటను నక్సల్‌ ఉద్యమ వ్యాప్తికి ఎంతగానో దోహదపడ్డాయి. మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్‌,బీహార్‌ (ఇక్కడ ఎంసిసి రూపంలో), కర్ణాటక, గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలో నక్సల్‌ఉద్యమం త్వరితగతిన విస్తరించింది. ఇక్కడి ప్రభుత్వా ఆర్థిక, పారిశ్రామిక, ఖనిజ సంపద విధానాతో ప్రజలో ఏర్పడ్డ పరాయీకరణ భావన నక్సల్‌ ఉద్యమవ్యాప్తికి తోడ్పాటునందించింది.

2004 నాటికి దేశంలోని సాయుధ విప్లవ పార్టీ మధ్య వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. బీహార్‌, జార్ఖండ్‌,  తదితర ప్రాంతాలో పట్టుకలిగిన ఎంసిసి, దేశంలోనే ప్రధాన విప్లవ పార్టీ అయిన సిపిఐ`ఎంఎల్‌ పీపుల్స్‌వార్‌ు విలీనమై సెప్టెంబర్‌ 21న సిపిఐ (మావోయిస్టు)గా అవతరించాయి. అప్పటికే సాయుధ విప్లవ పంథాను సమాజంలోని అట్టడుగు వర్గాతో పాటు బుద్ధిజీవు కూడా బంగా సమర్థిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూంగా పానావ్యవస్థను తీర్చిదిద్దే ప్రయత్నాు హింసారూపాన్ని సంతరించుకున్నాయి. గుర్‌గావ్‌లో సమ్మె చేస్తున్న కార్మికుపై కేంద్ర పారామిలిటరీ దళాు విచక్షణారహితంగా క్పాుు జరిపి 67 మందిని బలితీసుకున్నాయి. గుజరాత్‌లోనూ కార్మిక వ్యతిరేక చర్యు ఊపందుకున్నాయి. ఇదే క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని గత సిపిఎం ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం పేరుతో పేద భూము సేకరణపై దృష్టి సారించింది. టాటా కోసం నందిగ్రామ్‌లో పేద రైతు నుండి భూమును బవంతంగా సేకరించింది. ఇక్కడి పోరాటం సంకుచిత రాజకీయా కారణంగా అంత ప్రభావాన్ని చూపలేకపోయింది. మరోవైపు ఒరిస్సాలోని గిరిజను పోస్కో, జిందాల్‌ కంపెనీకు వ్యతిరేకంగా ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకున్నారు. రaజ్జర్‌లో ఒరిస్సా పోలీసు జరిపిన క్పాుల్లో దాదాపు 57 మంది గిరిజను బయ్యారు. మావోయిస్టు పార్టీ ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించి స్థానిక మద్దతును కూడగట్టుకుంది. బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో పెట్రోఫార్మసూటికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికు జరిపిన పోరాటం మావోయిస్టు పార్టీకి మంచి అవకాశాన్ని కల్పించింది. 2008 నవంబరులో బెంగాల్‌ పోలీసుతో పాటు సిపిఎం కార్యకర్తు జరిపిన క్పాుల్లో దాదాపు 30 మంది వరకూ హతమయ్యారు. అలాగే వందలాది గృహాు దహనమయ్యాయి. మహిళ మానప్రాణాు గాలిలో కలిసిపోయాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇక్కడ అవకాశవాద రాజకీయాకు ప్పాడినప్పటికీ మావోయిస్టు పార్టీ ముస్లిం మైనారిటీ పక్షాన నిలిచి పోరాటాన్ని ఉధృతం చేసింది. బెంగాల్‌ ప్రభుత్వం చివరికి తన విధానాన్ని మార్చుకోవడంతో నందిగ్రామ్‌ పోరాటానికి తెరపడిరది. అయితే అడపాదడపా అక్కడ సిపిఎం కార్యకర్తకు, స్థానికుకు మధ్య ఘర్షణు చెరేగుతూనే ఉన్నాయి. నందిగ్రామ్‌ పోరాటం జాతీయ అంశంగా మారితే, లాల్‌గఢ్‌లో జరిగిన సంఘటను అంతర్జాతీయ స్థాయిలో పతాకశీర్షికుగా మారాయి. లాల్‌గఢ్‌లో గిరిజను నుండి భూము సేకరించి అక్కడ మైనింగ్‌ కంపెనీకు ప్రవేశం కల్పించాని బెంగాల్‌ ప్రభుత్వం నిర్ణయించింది కానీ స్థానికు ప్రతిఘటనతో ఈ ప్రక్రియను నెమ్మదిగా చేపట్టాని భావించింది. ఈ తరుణంలోనే ఇక్కడ మావోయిస్టు పక్క రాష్ట్రమైన జార్ఖండ్‌ నుండి వస వచ్చి స్థానికంగా మద్దతును కూడగట్టుకున్నారు. పోలీసు దమనకాండను నిరసిస్తూ చక్రధర్‌ మహతో నేతృత్వంలోని ‘‘పోలీసు అత్యాచార వ్యతిరేక పౌర కమిటీ’’ ప్రజాఉద్యమం నిర్మించింది. ఈ ఉద్యమానికి మావోయిస్టు పార్టీ పూర్తి తోడ్పాటునందించింది. 2009 ఆగస్టులో కేంద్ర బగా నాయకత్వం బెంగాల్‌ సాయుధ పోలీసు లాల్‌గఢ్‌ గిరిజనుపై నిర్బంధకాండను మొదుపెట్టాయి. మావోయిస్టు ఏరివేత పేరుతో అమాయక గిరిజన యువకుతో పాటు మహిళను సైతం తీవ్ర అత్యాచారాకు గురిచేశారు. ఈ క్రమంలోనే సిపిఎం ముఖ్య కార్యకర్తను మావోయిస్టు ముట్టబెట్టడం మొదుపెట్టారు. అక్టోబరులో జార్ఖండ్‌ పోలీసు అధికారి ఫ్రాన్సిస్‌ ఇందూవర్‌ శిరచ్ఛేదనం మావోయిస్టు పార్టీకి దేశవ్యాప్తంగా తఒంపును తీసుకువచ్చింది. కేంద్ర హోం శాఖ సైతం మావోయిస్టు హింసకు వ్యతిరేకంగా ప్రచార సంరంభాన్ని ప్రారంభించింది. ఈ దశలోనే దేశ రాజధాని ఢల్లీిలో మావోయిస్టు పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యుడు కోబడ్‌ గాంధీ అరెస్టెయ్యాడు.  గాంధీ అరెస్టు, కోర్టు విచారణ దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైంది. అలాగే హజారీబాగ్‌ పోలీసు జార్ఖండ్‌ మావోయిస్టు ఉద్యమ నాయకుడు   రవిశర్మను, ఆయన సతీమణి అనురాధను అరెస్ట్‌ చేశారు. వాస్తవానికి వీరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారైనా జార్ఖండ్‌లో ఉద్యమ వ్యాప్తి బాధ్యతను భుజాన వేసుకున్నారు.
 
దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాు, భావజాం వ్యాప్తి చెందుతుండడం, వాటికి అడ్డుకట్ట వేయడంలో ఆయా రాష్ట్రాు విఫం కావడంతో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది. 2009 నుచి  ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరుతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో 70 వే కేంద్ర రిజర్వు బగాు,రెండు క్షకు పైగా రాష్ట్ర బగాతో దేశంలో గతంలో ఎన్నడూ లేని  విధంగా మవోయిస్టుపై సైనిక చర్యను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన భీకర పోరులో 76 మంది  మృతి పోలీసు మృతి చెందారు. అయితే కేంద్ర బగాకు కోుకోలేని దెబ్బతగడంతో ఐదు రోజుకే ఈ ఆపరేషన్‌ను ముగించారు. పారామిలిటరీ దళా జవాన్లు వంద సంఖ్యలో మృత్యువాతపడ్డా ఈ సమాచారాన్ని కేంద్ర హోం శాఖ బహిరంగంగా వ్లెడిరచలేదు. దీనికి తోడు మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలో అక్టోబరు 8న మావోయిస్టు పార్టీ కేంద్ర బగాపై దాడి చేసి 27 జవాన్లను హతమార్చి మివైన ఆయుధసామాగ్రిని పట్టుకెళ్లింది. ఆంధ్ర సరిహద్దుల్లో కూడా 2008లో బలిమెర్ల వద్ద మావోయిస్టు గ్రేహౌండ్స్‌ దళాపై ఇదే విధంగా దాడి చేసి 57 మంది జవాన్లను బలితీసుకున్నారు. అప్పటి నుండి రాష్ట్రంలో పెద్ద సంఘటను జరగకపోయినా 2009 మే 24న మావోయిస్టు సాయుధ వ్యూహకర్త పటేల్‌ సుధాకర్‌రెడ్డి వరంగల్‌ జిల్లా వ్వా గ్రామంలో ఎన్‌కౌంటర్‌కు గురి కావడంతో మావోయిస్టు ఆలోచనలో పడ్డారు.  మహారాష్ట్ర, బీహార్‌, ఒరిస్సా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, బెంగాల్‌ తదితర రాష్ట్రాలో అనేక హింసాత్మక సంఘటను జరిగాయి. అక్టోబరు 2009 నాటికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని దేశ భద్రతకు ఎదురవుతున్న గొప్ప సవాుగా ప్రకటించింది. పీపుల్స్‌ ఇనీషియేటివ్‌ పేరిట దేశంలోని మేధావు మాజీ లోక్‌ సభ స్పీకర్‌ రబీ రే నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞాపనా పత్రాన్ని సమర్పించారు. మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చు జరపాని వీరు సూచించారు. ఆయుధాు పక్కన పెట్టి చర్చకు రావాని అప్పటి వరకూ కేంద్రం కోరుతూనే ఉంది. కేంద్ర హోంమంత్రి చిదంబరం మే 11న ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌కు లేఖ రాస్తూ చర్చకు మావోయిస్టును ఒప్పించాని కోరాడు. చర్చకు మావోయిస్టును అగ్నివేశ్‌ ఒప్పించడంతో మే 31న సిపిఐ మావోయిస్టు అధికార ప్రతినిధి ఆజాద్‌ స్పందించి షరతును, ఆజెండాను ప్రతిపాదించాడు. మేధావు విజ్ఞప్తితో మావోయిస్టు పార్టీ చర్చకు అనువైన వాతావరనాన్ని కల్పించడానికి కృషిచేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మావోయిస్టుతో చర్చకు సిద్దంగా ఉన్నామంటూనే మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వాన్ని హతమార్చేందుకు పథకాన్ని రూపక్పన చేసింది. కేంద్ర ఫాసిస్టు గ్రీన్‌హంట్‌లో భాగంగా విప్లవకారునూ, సాధారణ ప్రజను హత్యచేస్తూ పచ్చినెత్తురు తాగుతున్న పాకవర్గాు మరోసారి తమ నరహంతక నగ్న స్వరూపాన్ని నిసిగ్గుగా బట్టబయు చేసుకున్నారు.
 
జులై1 సిసిఐ మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్‌ను ఆయనతోపాటే ప్రయాణిస్తున్న హేమచంద్రపాండే అనే పాత్రికేయుడినీ పట్టుకొని పాశవికంగా హత్యచేశారు. దీంతో మేధావివర్గం ఎంతో కృషిచేసి సానుకూ వాతావరణాన్ని తీసుకురావాన్న ప్రయత్నానికి ఆజాద్‌  హత్యతో బ్రేక్‌ పడిరది. చర్చకు సంబంధించి మావోయిస్టు పార్టీ నుంచి మాట్లాడుతున్న మానిషినే చంపేస్తే శాంతి చర్చకు అవకాశం ఎక్కడని అగ్నివేశ్‌ తన నిరసనను ప్రభుత్వానికి వ్యక్తం చేశాడు. ‘‘మావోయిస్టుపై దాడిలో నా రక్తం బొట్టు వరకు చిందించడానికి సిద్ధం’’ అని ప్రకటించిన చిదంబరంకు మావోయిస్టుతో చర్చు జరపాని, శాంతి కోసం దాడు అపాని వుంటుందని ఎవరైనా ఆశించడం హస్యాస్పదంగానే వుంటుంది. . మరోవైపు మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్‌, ఛత్తీస్‌గడ్‌, బెంగాల్‌లోని లాల్‌గఢ్‌లో కేంద్ర బగాు మావోయిస్టు ఏరివేత కార్యకలాపాను ముమ్మరం చేశాయి. ఈ పోరాటంలో వందలాది మంది అమాయక గిరిజను ప్రాణాు కోల్పోతున్నారు. వేలాది మంది రోజూ ఇతర సురక్షిత ప్రాంతాకు తరలిపోతున్నారు.  మావోను ఏరివేసిన తర్వాతే అభివృద్ధి ప్రకియను చేపడతామని కేంద్రప్రభుత్వం వాదిస్తోంది. మరో వైపు దేశంలోని మేధావివర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు సాయుధ పోరాటానికి మద్దతు తొపుతున్నది. వాస్తవ పరిస్థితును పరిగణనలోకి తీసుకుంటే (రాజ్యహింస, దోపిడీ), మావోయిస్టు హింసకు అంతగా ప్రాధాన్యం లేదని అరుంధతిరాయ్‌ వంటి మేధావు సమర్థిస్తున్నారు.ప్రజాపునాదిని పెంచుకొంటూ దేశవ్యాప్తంగా విముక్తి ప్రాంతాు ఏర్పాటు చేయాని సర్వశక్తు ఒడుతున్న మావోయిస్టు ఉద్యమం ఒకవైపు, రాజ్య గుత్తాధికారాన్ని బంగా చాటాని తహతహలాడుతున్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు సమస్యను మరింత జటిం చేస్తున్నాయి. ఈ సమస్యకు ఆచరణీయమైన, తార్కికమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత మేధావుపై ఉన్నా రాజ్య అనుకూ, వ్యతిరేక శిబిరా మధ్య చీలిపోయి ఎవరి వాదనను వారు బంగా వినిపిస్తున్నారు.