‘ప్రాంతేతరుడు దోపిడీచేస్తే ప్రాంతం దాటేవరకు పారదోలుదాం. ప్రాం తం వాడు దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతరపెడదాం’ అని కాళోజీ పిలుపిచ్చాడు. ఇవ్వాళ ప్రాంతేతరుని దోపిడీని ప్రశ్నిస్తున్న సందర్భంలో, ప్రాంతంవాడు కూడా దోపిడీచేస్తే ఏంచేయాలనేది కూడా చర్చిం చాలి. వందల సంవత్సరాలుగా దొరల,పటేళ్ళ, దేశ్ ముఖ్‌ల చేతిలో ఘోరాతి ఘోరంగా అనుభవించిన పీడన,అణిచివేత, వెట్టిచాకిరిల నుండి విముక్తికోసం జనం దండు కట్టిన చరిత్ర తెలంగాణది. ఆ పోరా టం అంతిమంగా ఏ లక్ష్యాన్ని చేరుకున్నదనేది పక్కన పెడితే, ఆ పోరాటచెైతన్యం తెలంగాణలో జరిగిన అనేకఉద్యమాలకు స్ఫూర్తి నింపింది. అయితే ఈ ప్రజాస్వామిక పోరాటాలకు ప్రధానంగా శ్రామికవర్గం నాయకత్వం వహించింది.
కానీ నేడు జరుగుతున్న ప్రత్యేకవాద ఉద్యమంలో- శ్రామిక వర్గం క్రీయాశీలంగా పాల్గొంటున్నప్పటికీ ప్రధానశక్తిగా మాత్రం భూస్వామ్య, పెట్టుబడి దారీవర్గం నాయకత్వం విహస్తోంది. ప్రజాఆకాంక్షను ఓట్లుగా మలుచుకునే అవకా శం ఉండడంవల్ల ఈ వర్గాలు తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవచ్చనే లక్ష్యంలో ప్రాంతీయవాద ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాయి. అయితే ఈ వర్గాల ఉద్దే శం నేరవేరనప్పుడు వారు తమ సొంతగూటికి చేరిన విషయం చరిత్రలోచూశాం. గతంలో తెలంగాణ ఉద్యమంలోకివచ్చిన ఇంద్రారెడ్డి వంటివారు చివరికి ఎక్కడికి చేరారో తెలిసిందే. ఇప్పుడు గ్రామ పునాదులను తాకిన తెలంగాణ ప్రజాఉద్య మంలో విప్లవపార్టీలనుండి మతోన్మాదుల వరకు అందరూ కలగలిసిపోయారు. అందరి లక్ష్యం తెలంగాణే అంటున్నారు. నిన్నటివరకు దొరల, భూస్వాముల దళారి రాజకీయపార్టీలతో విభేదించి వారికి వ్యతిరేకంగా ఉద్యమించిన విప్లవపార్టీలు, విప్లవోద్యమ సానుభూతిపరులు, మాజీ నక్సలెైట్లు ఆ దొరల న్యాయకత్వంలో ఒక డిమాండుపెై కలిసి పనిచేయడం ఆసక్తి కలిగించే విషయం.
అయితే పరస్పర విరు ద్ధ భావాలతోఉన్న పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఏక సూత్రంపెై నేడు కలిసిపనిచేస్తూ సామాన్యప్రజల్లోకి పంపుతున్న సంకేతాలు ఏవర్గ ప్రయోజనాలను నెరవేరుస్తాయనేది చర్చించాలి. నేడు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానపార్టీ టీఆర్‌ఎస్,రాజకీయ జేఏసీ. వాటిలోని వ్యక్తు లు (కేసీఆర్‌తో సహా) వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేసి, పదవులు అనుభవించి, అక్కడ ఇమడలేక తమ అస్తిత్వంకోసం బయటకు వచ్చి తెలంగాణఉద్యమంలో పని చేస్తున్నారు. వీళ్లు ప్రజల్లో ఎన్నాళ్లుగానో నిగూఢంగాఉన్న ప్రత్యేకఆకాంక్షను అందిపుచ్చుకొని దానికొక రాజకీయ రూపును,జాతీయస్థాయిలో స్థానాన్ని కల్పించినప్ప టికీ వీరినాయకత్వంలో ఉద్యమం రేపు ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో అంచనా వేయవచ్చు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్న కాలంలో తెలంగాణ ప్రజలకు ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనేది గమనంలో ఉంచుకోవాలి. పుట్టిన కులం,పనిచేస్తున్నసంస్థ-ఇవే వారి సామాజిక అస్తిత్వాన్ని నిర్ణయిస్తాయి.
తెలంగాణ నేలపెై నక్సల్బరీ ఉద్యమ ప్రభావంతో, ప్రజల పోరాటాలు, త్యాగాల మూలంగా భూస్వాములు, దొరలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పట్నానికి తరలివచ్చారు. ఇక్కడికివచ్చి తమరూపాన్ని మార్చుకుని దొరలు పెట్టుబడి దారులు గా, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోయారు. ఎప్పుడెైతే తెలంగాణ ఉద్యమం తీవ్రరూపం దాల్చిందో అప్పుడు ఈ దొరలు, భూస్వాములు రాజకీయ నాయకులు గా కొత్త అవతారం ఎత్తినారు. ఈ ఉద్యమం సందర్భంగా దొరల, భూస్వాముల స్వరూపం మారిందేతప్ప స్వభావంమారలేదు. అందుకే రాయలసీమఐనా, సీమాం ధ్రఐనా, తెలంగాణ ప్రాంతామైనా- ప్రాంతాలు వేరుకావచ్చు, కానీ భూస్వామ్య విధానం, పాలకవర్గాల నెైజంలో మార్పుఉండదు. సామాన్య ప్రజల పట్ల వారి వెైఖరి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. తెలంగాణలోని సంపన్నవర్గానికి తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పడితే- ఆంధ్రలోని పెట్టుబడిదారుల, భూస్వాములు ఆధిపత్యం ఉండదు కాబట్టి, అప్పుడు సంపదను తామే యథేచ్ఛగా అనుభవించవచ్చు, దోచు కోవచ్చు అనే భావన నిండుగా ఉంది.
కనుక ఈ వర్గాలకు ఉండే స్వభావ రీత్యా దోిపిడీ, పీడన లేని తెలంగాణ రావాలని కోరుకోరు, పెైగా యథాస్థితి అమలుకు వారి ప్రయత్నాలు, పాలనా వ్యవహారాలు సాగుతాయి.
తెలంగాణ ఉద్యమంలో సబ్బండ కులాల ప్రజలు చురుకుగా పాల్గొంటున్న తరుణంలో- వచ్చే తెలంగాణలో ఏ సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుంది, అంతిమంగా ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి అనేది ప్రశ్నించడం ప్రస్తుత పరిస్థితుల్లో సాహసంగానే కనిపించవచ్చు.కానీ ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్న సందర్భంగా ఆ ఉద్యమ లోటుపాట్లను, అంతిమలక్ష్యాలను చర్చించడం అని వార్యమే అవుతుంది. ఒకవెైపు టీఆర్‌ఎస్‌పార్టీ, రాజకీయ జేఏసీ తెలంగాణ ఉద్య మంలో క్రియాశీలంగా పాల్గొంటున్న సందర్భంలోనే కేసీఆర్ నాయకత్వాన్ని వ్యతిరే కిస్తూ కొన్ని ఫ్రంట్‌లు, గ్రూపులు, దొరల తెలంగాణ కాదు, సామాజికతెలంగాణ కావాలంటూ ప్రత్యేకఉద్యమాలు నిర్వహిస్తున్నాయి.
ఈసందర్భంలోనే ఈగ్రూపు లు- దొరల నాయకత్వంలో వచ్చే తెలంగాణలో దళితులకు, బడుగులకు ఒరిగేది ఏముండదు, మళ్ళీ దొరలరాజ్యమే వస్తుంది-అని వివిధ సందర్భాల్లో తమ అభిప్రా యాన్ని వ్యక్తంచేశాయి. ఈ విమర్శలు ఎక్కుపెట్టిన వారిపెై సహజంగానే చాలా వ్యతి రేకత వచ్చింది. మొదట ఏదో ఒక తెలంగాణ రానీయండి, తర్వాత మనకు కావా ల్సిన తెలంగాణను తెచ్చుకోవచ్చు అన్నారు. ఈ దళిత బహుజనులు ఎప్పుడు ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తూనేఉంటారంటూ అగ్రవర్ణాలనుంచి దళితులలోఒక సెక్షన్‌వరకు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. వీలయితే అప్పుడప్పుడు దళిత బహుజన కూట ములపెై దాడులు, విమర్శలుకూడా చేస్తూన్నారు. మొన్న కాకతీయ యూనివర్సి టీలోజరిగిన పోలికేకలో మందకృష్ణపెై జరిగిన దాడినుంచి నిన్న మిలియన్ మార్చ్ లో విమలక్క మాటలపెై వచ్చిన విమర్శలే ఇందుకు ఉదాహరణ. దళిత బహుజనులు తమఅనుమానాన్ని వ్యక్తంచేసిన ప్రతిసారీ ఇలాంటి దాడు లు కొనసాగుతూనే ఉన్నాయి.
అది తెలంగాణ విషయంలోనేకాదు, గతంలో మహి ళా బిల్లుపెై పార్లమెంటులో జరిగిన చర్చలసందర్భంలో దళిత బహుజనులకు నాయ కత్వంవహిస్తున్న పార్టీలు మహిళా రిజర్వేషన్‌లో దళిత,బహుజన మహిళలకు కోటా కావాలని డిమాండుచేసిన సందర్భంలోకూడా ఇలాంటి వ్యతిరేకత అగ్రవర్ణ పార్టీల నుంచి వచ్చింది. మొదట మహిళా బిల్లు రానీయండి తర్వాత చూసుకుందామంటూ వ్యాఖ్యానించారు.ఈ డిమాండును లేవనెత్తిన వారిని విమర్శించారు. ఇటువంటి సందర్భంలోనే ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న పార్టీలను, జేఏసీలను ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉన్నది.1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి భిన్నంగా గత 2009 నవంబర్ నుండి ఇప్పటివరకు వివిధవిశ్వవిద్యాలయాల్లో దళితబహుజన విద్యార్థుల నాయకత్వంలో నే ఉద్యమాలు సాగుతున్నాయి. 1969 తెలంగాణ ఉద్యమంలో అగ్రవర్ణ వ్యక్తులు, పార్టీలు, అగ్రవర్ణ విద్యార్థులు ఉద్యమం ముందువరుసల్లో ఉండగా, 2009 నుంచి జరుగుతున్న ఉద్యమంలో దళిత, బహుజన విద్యార్థులే నాయకత్వం వహిస్తున్నారు.
పోలీసులు పెట్టిన కేసుల్లో కూడా ఈ వర్గాలకు చెందిన విద్యార్థులే ఉంటున్నారు. చివరకు తెలంగాణకోసం ఆత్మహత్యలు చేసుకోవడంలోను ఈ సమూహాలకు చెందిన విద్యార్థులే ముందు వరుసలో ఉంటున్నారు. అటువంటి సందర్భంలో సహ జంగానే తెలంగాణరాష్ర్టం ఏర్పడితే దళిత, బలహీనవర్గాల విద్యార్థులకు ఏంప్ర యోజనం చేకూరుతుంది అనేది ప్రశ్నించాల్సిందే. షోయబుల్లాఖాన్, చాకలి ఐల మ్మ, కొమురం భీం మొదలు బెల్లి లలిత, శ్రీకాంత్‌చారి, సంపత్ కుమార్ వరకు తెలంగాణ బిడ్డలు వెన్నెల లాంటి తెలంగాణను స్వప్నించి ప్రాణాల్ని అర్పించారు. ఇంతమంది తెలంగాణ దళిత బహుజనులు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే, వారి త్యాగాలను ముడిసరుకుగావాడుకొని ఫలితాలను అనుభవిస్తూ నాయకత్వా నికి ఎగబాకుతున్న వారిని ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ.
అన్ని రాజకీయపార్టీలూ తాము అధికారంలోకి రావడానికిచేసే వాగ్దానాల వలెనే, తెలంగాణఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్- టీఆర్‌ఎస్‌ను ఏర్పాటుచేసి న నాటినుంచి నిన్నజరిగిన సూర్యాపేట సమరభేరిసభవరకు తెలంగాణ ఏర్పడితే ఎవరెవరికి ఏపదవులు కట్టబెడతారో, ఏపథకాలు అమలుచేస్తారో తెలుపుతూ చాలా ఉపన్యాసాలు ఇస్తూవచ్చారు. కానీ, ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరించే విధానాలే రాష్ర్ట భవిషత్తును నిర్ణయిస్తాయి. అయితే ఇక్కడ కేసీఆర్‌ను ఒక విషయంలో అభినందించవచ్చు. అది- వచ్చే తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని తొలిముఖ్యమంత్రిగా నియమిస్తాననడం. అయితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తే సమస్యలు తీరుస్తాడాఅంటే అనుమానమే?ఎందుకంటే ఒక అగ్రవరపార్టీకి చెం దిన, అగ్రవర్ణవ్యక్తి చేతిలో రాజ్యాధికారం ఉంచుకొని దళితుడిని ముఖ్యమంతిని చేసినా, గిరిజనుడిని ముఖ్యమంతినిచేసినా ఒరిగేది ఏఉండదు.
కాకపోతే, దళితు డు ముఖ్యమంత్రి అయ్యాడు అనే ఆనందంతప్ప! కాంగ్రెస్‌పార్టీ దామోదరం సంజీవ య్యను ముఖ్యమంత్రిని చేసింది. క్రిిందివర్గాలకు ఏమీ చేయకుండా ఆయనకు అడ్డుపడ్డ సందర్భాలు చాలాఉన్నాయి. కాబట్టి దళితుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంతి అయినా ఒరిగేది ఏముండదు.రాష్ర్టంలోని లక్షలాది వ్యవసాయ భూములకు నీటి సదుపాయం కల్పిస్తానని ప్రకటించారు. ఇది ఆచరణసాధ్యమా? ఒక వేళ చిత్తశుద్ధితో అమలు చేసినా నేరవేరేది ఎవరి ప్రయోజనాలు? ఈరోజు ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా గోదావరి నదీ జలాలు పుష్కలంగా ఉండి మూడు కాలాలు పంటలు పండిస్తున్నా దాని ప్రతిఫలం ఏ వర్గాలకు దక్కుతోంది? తెలంగాణలో దళిత బహుజనులకు ఉన్న భూమి నామమాత్రమే. నీరుఉన్నా, లేకున్నా ఆంధ్ర ప్రాంత బహుజనుల జీవన విధానంలో ఎలాంటి మార్పులేదు.
రేపు తెలంగాణకు నదీజలాలు వచ్చినా ఎవరి భూములకు నీరు అందుతుంది, నీటి వనరులు ఉపయోగంగా ఉండేది ఎవరికి? అగ్రవర్ణాల నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే అది అగ్రవర్ణ ఆధిపత్య కులాలకే ప్రయోజనం.అధిపత్య కులాలు ఆర్థికంగా మరింత బలపడితే అది క్రింది వర్గాలను ఇంకా అణచివేసేందుకు, వారిని రాజకీయంగా, సాంఘికంగా అణగదొక్కేందుకు ఉపయోగపడుతుంది. రాష్ర్టంలో దళితుల మీద దాడులు తెలంగాణలోకంటే ఆంధ్రప్రాంతంలోనే ఎక్కువగాజరిగాయి. ఎందుకంటే అగ్రవర్ణాల చేతిలోనే భూమి ఉంది కాబట్టి. వారు ఆర్థికంగా బలపడడంవల్ల రాజకీయ రంగాన్ని, పోలీసు శాఖను, న్యాయస్థానాలనూ నియంత్రించగలుగుతున్నారు. ఒకనాడు అన్నల భయంతో పల్లెలు వదిలి పట్నాల బాట పట్టిన దొరలు, రెడ్లు తెలంగాణ రాష్ర్ట ఉద్య మం ఊపందుకున్న తర్వాత నేడు తిరిగి పల్లెలకు పయనిస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని డబ్బుసంచులతో కొనడానికి ప్రయత్నిస్తున్నారు.
రేపు తెలంగాణ రాష్ర్టంలో పాలకుల విధానాలు ఎలా ఉండబోతాయనేదే అభివృ ద్ధిని నిర్ణయిస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వస్తే ఓపెన్‌కాస్ట్ రద్దు అయి పోతుందా, మిగులు భూముల పంపకం జరుగుతుందా, సహజ సంపద ప్రజలకు దక్కుతుందా, కామన్ స్కూల్ సిస్టమ్‌లో శాస్త్రీయ విద్య అందుతుందా, వెైద్య, సంక్షేమ, ఉద్యోగ, ఉపాధి, సేవా రంగాలు ప్రెైవేట్ పరం కాకుండా చూస్తారా, నక్స లెైట్ల పేరుతో జరుగుతున్న హత్యలు ఆగుతాయా, ప్రజాస్వామిక, మానవహక్కులకు హామీ ఉంటుందా, మూసివేసిన పరిశ్రమలను తెరిపిస్తారా, రెైతుల, చేతివృత్తి దారుల ఆత్మహత్యలు ఆగుతాయా, మహిళలకు కనీస రక్షణ ఉంటుందా, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో సమస్త ప్రజలు ఎదుర్కొనే సమస్య లకు కచ్చితమైన పరిష్కారంఉంటుందా? ఈ ప్రశ్నలన్నింటిపెై ఉద్యమ నాయకత్వా లనుంచి సమాధానాలు రాబట్టాల్సిందే.
నేడు అన్ని రంగాలలో విస్తరించిన సంక్షోభా నికి ప్రధాన కారణమైన ప్రపం చీకరణ పట్ల ఎటువంటి విధానం ఉండబోతుంది అనేది కూడా అంతిమంగా పెైన పేర్కొన అన్ని సమస్యలను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు అగ్రవర్ణ పార్టీతో, వారి నాయకత్వంలో ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం జట్టుకట్టి పనిచేస్తున్నారు. కానీ రేపు వీరితోనే కొట్లాట ఉంటుందని గుర్తెరిగి, వారిస్వభావం, వారి సామాజిక, చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకుని పోరాటంలో పాల్గొంటేనే దళిత, బహుజనులు తమ గమ్యాన్ని చేరల్గొ గలరు. లేదంటే ఈవర్గాల పరిస్థితి పెనంలోనుంచి పొయ్యిలోపడ్డ చందంగా తయా రవుతుంది.
(సూర్య 1-12-12)
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment