ఎన్నికల నుంచి గట్టేందుకే ఆహార భద్రత పథకం
ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుత్ను సమస్య ఆహార భద్రత. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు వెనుకబడిన దేశాలు సహితం నేడు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ దీనిని అధికమించలేకపోతున్నాయి. 'ఆరోగ్యకరంగా జీవించేందుకు అవసరమైన ఆహారాన్ని అన్ని వేళలా, అన్ని వర్గాల ప్రజలకు అభింపజేయటమే ఆహార భద్రత' అని అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ నిర్వచించింది. ప్రపంచలో ఏ ఒక్కరికి ఆకలి బాధ ఉండకూడదనే సంకల్పంతో ఐక్యరాజ్య సమితి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గరైజేషన్‌ను 1945 అక్టొబర్ 16న కెనడాలో నెలకొల్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు తనవంతుగా 3 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రకటించింది. అయితే కేటాయించిన ఈ నిధులు చాలవని 2030 నాటిని ఆహార సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో నివారిలంచాలంటే ఏడాదికి కనీసం 20 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టాలని సూచించింది. తీవ్ర కరువుకోరల్లో చిక్కుకున్న ఆఫ్రికా దేశాలతో పాటు ప్రపంచంలోని దాదాపు 30 దేశాల్లో ప్రజల ఆహార పరిస్థితి ప్రమాధంలో
ఉందన్ని తెలిపింది. ఈ ఆహార సంక్షోభాన్ని సకాలంలో ఎదుర్కొనక పోతే ప్రపంచలోని దాదాపు 50 శాతం మంది పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాధం ఉందని తెలిపింది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేధికలో ప్రపంచంలోని మొత్తం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 25 శాతం భారత్‌లోనే ఉన్నారని పేర్కొంది. మన దేశంలోని మొత్తం పిల్లల్లో దాదాపు 22 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని, 5 సంవత్సరాలలోపు పిల్లల్లో 43.5 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో ఉంటున్నారని, దాదాపు 7 శాతం మంది పిల్లలు పుట్టిన 5 సంవత్సరాల్లోనే మరణిస్తున్నారని తన నివేదికలో వెల్లడించింది. భారతదేశంలోని 76 శాతం ప్రజలకు కావాల్సిన కేలరీల్లో ఆహారం లభించడంలేదు. గ్రామీణ జనాభాలో 80 శాతం, పట్టణ జనాభాలో 64 శాతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దేశంలోని మహిళల్లో సగం కాన్నా ఎక్కువమంది పిల్లల్లో మూడింట నాలుగోంతులు రక్తహీనతతో బాధపడుతున్నారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో 30 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. భారతదేశంలోని ప్రతి ముగ్గురు వయోజనుల్లో ఒకరు ఉండాల్సిన బరువు, ఎత్తులో లేరు. అంటే వారిలో దీర్ఘకాల శక్తిహీనత
ఉన్నట్లేనని వైద్యశాస్త్రం చెబుతోంది. భారత రాజ్యంగం జీవించే హక్కును ప్రజలందరికీ ప్రాథమిక హక్కుగా ఇస్తోంది. ఆహార హక్కు జీవించే హక్కులో భాగమే. అందరికి అది దక్కాలంటే మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి సేవలు, తదితర పౌష్టికాహార పథకాలను ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకురావాలి.
జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు 2400 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. కానీ గ్రామాల్లో 49 శాతం మంది, పట్టణాల్లో 53 శాతం మంది ఇన్ని క్యాలరీల ఆహారాన్ని తీనలేకపోతున్నారు. ప్రపంచ సగటు కేలరీలు 2718, అభివృద్ధి చెందిన దేశాల సగటు కేలరీలు 3206, వర్థమాన దేశాల సగటు కేలరీలు 2573 కాగా మన దేశంలో వర్థమాన దేశాల సగటు కేలరీల కంటే తక్కువగా వినియోగిస్తున్నారు. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ఉత్సా పట్నాయక్ వేసిన లెక్కల ప్రకారం గ్రామాల్లో 87 శాతం మందికి 2400 కేలరీల ఆహారం కూడా అందుబాటులో లేదు. దీనీకి ఆదాయం లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. ప్రపంచ ఆహార ఉత్పతిల్లో మూడవ స్థానాన్ని ఆక్రమించిన భారత్ వంటి దేశాల్లో పౌష్టికాహార లోపంతో పిల్లలు మరణించడం పాలకుల నిర్లక్ష్యం, ఆర్థిక విధానాలే కారణమని నిపుణు పేర్కొంటున్నారు. మరోవైపు వైపు నిల్వ సదుపాయాలు లేకపోవడం వల్లా భారీ ఎత్తున ఆహార ధాన్యాలు గోదాముల్లో ముక్కిపోతున్నాయని భారత ఆహార సంస్థ ప్రభుత్వానికి నివేధిక సమర్పించింది. ఆహార నిల్వలు పర్వతాల్లా పేరుకుపోతున్నా, దాచుకునే సామార్థం లేక వృథా కావడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సహితం గతంలో తప్పు పట్టింది. ధాన్యాన్ని ప్రజలకుఉచితంగా పంచవచ్చు కదా అంటూ మొట్టికాయ వేసింది. ఇది నేడు దేశంలో వున్న పరిస్థితి.
అయితే ఈ పరిస్థితిని అధికమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత పథకాన్ని త్వరలో అమలుచేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని ప్రతి ఒక్కరూ 'చాలినంత ఆహారం' పొందే హక్కును చట్టంద్వారా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం మేరకు జాతీయ ఆహార భద్రత చట్టన్ని రూపొందిస్తున్నట్లు నాటీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ జూన్4, 2009న ప్రకటించింది. అయితే ఈ ఆహార భద్రత బిల్లు అమలులోకి వస్తే దేశంలోని దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు చౌకధరల బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతుంది. అయితే ప్రజలను రెండు వర్గాలుగా విభజించడంలోనే పాలకుల కుట్ర దాగివుందని వామపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దేశంలోని ప్రజలందరికి ఆహారభద్రత కల్పించే విధంగా ఈ పథకాన్ని విస్తరించాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దారిద్య్రాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం సురేష్ టెండూల్కర్ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ.11.80 , పట్టణ ప్రాంతంలో రోజుకు రూ.17.8 సంపాదిస్తున్న వారినే దారిద్య్ర రేఖకు దిగువన
ఉన్నవారిగా గుర్తిస్తున్నారు. మిగిలిన వారిని దారిద్య్ర రేఖకు ఎగువ ఉన్నవారిగా గుర్తిస్తున్నారు. అదే విధంగా ప్రణాళిక సంఘం గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూపాయలు 22, పట్టణ ప్రాంతంలో రూ.28 కంటె ఎక్కువ సంపాదించేవారంతా దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు అని విభజించింది. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సర్వేల్లో వేటిని తీసుకున్నా దేశ జనాభలోని అత్యధికులు ఈ పథకానికి దూరంగానే ఉండవలసి వస్తుంది. ఇది కేవలం ప్రజలను మోసపుచ్చేందుకు ప్రకటించిన పథకంగానే మిగిలిపోతుంది. ఒకవైపు ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలకు క్రమంగా ఎత్తివేస్తున్న ప్రభుత్వాలు ఇన్నివేల కోట్ల రూపాయల సబ్సిడీలను భరించి పేదలకు ఆహారభద్రత కల్పించేందుకు ముందుకు వస్తుందంటే దీనివెనుక ఏదో కుట్ర దాగివుందని,2014లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఈ పథకాన్ని రూపకల్పన చేసిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వానికి ఇంత ఆకస్మత్తుగా ప్రజలపై ప్రేమ ఎందుకు కలిగింది. దేశంలో లక్షలాధిమంది పిల్లలు పౌష్టికాహారంతో బాధ పడుతున్నారని, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు ఎన్నొ సంవత్సరాలుగా ఆహార భద్రత కోసం పట్టుబడుతున్నా ఏనాడు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇంత అడావుడిగా ప్రభుత్వం ఎందుకు అమలు చేసేందుకు సిద్ధపడుతుందనే ఆలోచించాలి.
ప్రస్తుతం దేశంలో ఏడున్నర కోట్ల టన్నుల ఆహార నిల్వలు పేరుకుపోయాయని, ఇవి త్వరలో చెడిపోయి ఆహార వినిమయానికి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని భారత ఆహార సంస్థ హెచ్చరించింది. దీనిని అధికమించాలంటే రాష్ట్రాలకు ఇస్తున్న కేంద్ర కోటాను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి నివేధిక పంపింది. గోదాముల్లో పేరుకుపోయిన ఆహార నిల్వలను త్వరలో పంపిణి చేయకపోతే దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగుని స్థాయిలో ఆహార నిల్వలు పాడైపోయే ప్రమాధం ఉందని సూచించింది. గతంతో గోదాముల్లో ఆహార నిల్వలు పాడైపోతున్న విషయాన్ని సుప్రీం కోర్టు సహితం తప్పు పట్టిన విషయం గమనంలో ఉంచుకున్న కేంద్రం ఆహార నిల్వలు పాడైపోతే పెద్ద అపవాదును మూటకట్టుకోవాల్సి వస్తుందని ఆలోచించింది. దీని నుంచి అధికమించేందుకు మరియు 2014 ఎన్నికల్లో గట్టెక్కెండుకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో విపక్షాలు, మేధావుల అనుమానిస్తున్నట్లు ఆహార భద్రత పథకం ఒట్లను ఆకర్షించే పథకంగా మారుతుందా లేదా పేదలకు ఉపయోగపడుతుందా? బ్లాక్ మార్కెట్ దారులకుఉపయోగపడే పథకం అవుతుందా అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఎన్నికల కోసం ప్రభుత్వం గోదాముల్లో పేరుకుపోయిన నిల్వలను పంపిణి చేసి తాత్కాలికంగా ప్రజల ఆహార కోతను తీర్చగలిగిన భవిష్యత్తులో ఆహారకోరతను ఎలా ఎదుర్కొంటారు అనేది పెద్ద ప్రశ్నగా మిగులుతుంది.
మన దేశం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కారణమేంటనేది ఆలోచించకుండా పరిష్కారాన్ని కనుగొనలేము. భారతదేశంలో ఆహార సంక్షోభం అకస్మాత్తుగా తలెత్తినది కాదు. గత దశాబ్దానికి పైగా అనుసరిస్తున్న ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచబ్యాంకు, డబ్లూటిఓ అదేశిత విధానాన్ని అమలుచేయడం కారణంగా ఏర్పడింది. 90వ దశకంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పుట్టుకువచ్చిన వాణిజ్య సరళితో, జన్యుమార్పిడి పంటలతో ఆహార సంక్షోభం తీవ్రమయింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ద్వారా పారిశ్రామిక దోపిడి పెరిగింది. మన దేశంలో రైతులను ప్రభుత్వాలు వ్యాణిజ్య పంటలు పండించేందుకు ప్రొత్సహించడంతో రైతలకు సరైన అవగాహన లేకపోవడం, వాటికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతాంగం తీవ్ర నష్టాలను చవిచూశారు. అనవసర ఖర్చుల కారణంగా రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం జరిగాయి. దీనిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నియమించిన జయతి ఘోష్ కమిలీ, స్వామినాథన్ కమిటీ అనేక సూచనలు చేసింది కానీ పాలకులు వీటిని పట్టించుకోకపోవడంతో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆహారసంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయ రంగానికి నిధులు పెంచడం ఒక్కటే పరిష్కారమని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి కార్యదర్శి బాన్‌కిమూన్ సెలవిచ్చాడు. వ్యవసాయానికి ఉపయోగపడే భూములను వ్యవసాయేతర రంగాలకు మళ్లించకుండా సమగ్ర చట్టం చేయాలి. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. పండించే పంట నిల్వచేసుకునేందుకు గ్రామాల్లోనే శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. అప్పుడే ఆహారభద్రత ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగానికి ప్రత్యేక దృష్టిపెట్టి అధిక నిధులు కేటాయించని పక్షంలో ఆహారం కోసం అలమటించేవారి సంఖ్య రాబోయే రోజుల్లో అనుహ్యంగా పెరిగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
నిజానికి మొన్నటి పాత 'పనికి ఆహార పథకమూ', నేటి కొత్త 'ఆహార భద్రతా పథకమూ' బడా కార్పోరేటు ఆర్థిక వ్యవస్థ బుర్రలో పుట్టిన పథకాలే? ఇవేవి సోషలిస్టు, లేదా సోషటిస్టు తరహా భావాల నుంచి పుట్టినవి కావు. పెటుట్బడిదార్ల కోసం, పెట్టుబడి దార్ల చేతి, పెట్టుబడిదార్ల యొక్క పథకాలు ఇవి. విస్తృతమైన మన గ్రామీణ వ్యవస్థను కార్పోరేటు వాణిజ్య, పారిశ్రామిక వ్యవస్థకు అనుసంధానం చేసే ప్రణాళికలో భాగంగానే రూపొందిన పథకాలివి. పనికి ఆహార పథకం తమను రాజకీయ సంక్షోభం నుంచి కాపాడిందని నిర్ధారించుకున్నాయి. దాని వల్ల గ్రామీణ ప్రజల చేతికి అందిన సొమ్ముతో సాగించిన అదనపు కొనుగోళ్ళ కష్టకాలంలో తమకు ఒకింత చేయూత నిచ్చినట్లు కార్పొరేటు కంపెనీలు గుర్తించాయి. ఆ స్పూర్తితో అలాంటి మరికొన్ని సంక్షేమ పథకాలను రూపకల్పన చేశాయి. అందులో భాగమే తాజా ఆహార భద్రత. పట్టణ మధ్య తరగతి కుటుంబం తమ ఆదాయంలో 20-30 శాతం సొమ్మునే ఆహారావసరాలకు ఖర్చు చేస్తున్నది. మిగిలిందే ఆహారేతర వస్తే సామాగ్రికి, ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నది. కానీ కోట్లాది గ్రామీణ పేదలు తమ అల్ప రాబడిలో 60 శాతం పైగా ఆహారావసరాలకే ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా నిరుపేదల విషయంలో ఉపాధి హామీ సొమ్ములో తొంభై శాతం ఆహారావసరాలకే మళ్లించబడుతున్నదని అవి నిర్ధారించాయి. గ్రామీణ పేదల ఆహార బడ్డెట్ వ్యయాన్ని తగ్గిస్తే తప్ప తమకు తగినంత లాభం చేకూరదని కూడా అవి గుర్తించాయి. అందుకే రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రజాధనంతో తక్కువ ధరలకు పేద ప్రజల ఆహారావసరాలను తీర్చదలచింది. తద్వారా వారి డబ్బును ఆహారేతర ఖాతాలోకి మళ్ళించి పథకం పన్నింది. అందుకోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని ఆహార భద్రత, జాతీయఉపాధి పథకం. ఇలాంటిదే ఆరోగ్యశ్రీ పథకమైనా! అంతిమంగా డబ్బు ప్రవహించేది కార్పోరేట్ ఆసుపత్రులకే మరి! ఆ రూపంగా ఓ ప్రక్క ఓటు కొనుగోలు చేసుకుంటుంది. మరో ప్రక్క కార్పోరేటు కంపెనీలకి చైతన్యానిచ్చే వ్యాపారాన్ని ప్రవహింపచేస్తున్నది. బదులుగా కంపెనీల నుండి భారీ మొత్తాలని పార్టీ ఫండులుగా, వ్యక్తిగత కానుకలుగదా లేదా లంచాలుగా రాబట్టుకుంటుంది. ఇలా ఇదో వలయం, దోపిడి మూలం.
18-12-12
18-12-12
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment