వేసవిలో రాష్ర్టంలో, దేశంలో మంచినీటి కొరత ఆందోళన కలిగిస్తున్నది. నీటికోసం ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి పాలకులు చర్యలు తీసుకోకపోవటం, వారి నిర్లక్ష్య వైఖరికి అద్దంపడుతున్నది. ప్రపంచంలో అత్యంత వర్షపాతంగల దేశాల్లో భారత దేశం ఒకటి. సాలీనా 1170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది. అతితక్కువ వర్షపాతంగల అనతంపురం జిల్లాలోనే 600 మి.మీ ఉంటుంది. అమెరికాలో సాలీనా 200 మి.మీ. వర్షపాతం ఉంది. దీన్ని గమనిస్తే మనకు నీటి వనరులు ఎంత సమృద్ధిగా ఉన్నాయో అర్థమౌతుంది. వర్షపాతంలో 10 శాతం కూడా నిల్వ చేసుకోలేకపోతున్నాము. దేశంలో ఉన్న అనేక జీవనదులతోపాటు, ఆంధ్రరాష్ర్టంలో గోదావరి, కృష్ణ,ప్రాణహిత, వంశధార, పెన్నా, తుంగభద్ర మొదలైన నదులతో పాటు చెరువులు, బావులు, వాగులు, కుంటలు లక్షల సంఖ్యలో ఉన్నాయి.
ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఆనకట్టలు, చెక్‌డ్యాముల ద్వారా నదుల్లో నీటిని నిల్వ చేయగలిగి ఉంటే రాష్ర్టంలో నీటి సమస్య ఉత్పన్నం అయేది కాదు. ఐదు సంవత్సరాలు గడచినా రాష్ట్రంలో పూర్తి అయిన జల యజ్ఞం ప్రాజెక్టుల్ని వేళ్ళమీద లెక్కించవచ్చు. ఒకప్పుడు చెరువుల ద్వారానే సేద్యపు విస్తీర్ణం పెరిగింది.1896లో చెరువుల క్రింద 4 వేల హెక్టార్లు సాగుకాగా 1906 నాటికి 55వేల, 1936 నాటికి మూడు లక్షల హెక్టార్లకు చెరువుల సేద్యం విస్తరించింది. పాలకులు చెరువులను నిర్లక్ష్యంచేసి భారీ నీటి పారుదల రంగం వైపు మొగ్గుచూపారు. దీనిద్వారా కూడా సాగు, మంచి నీరు అందించలేకపోయారు. 1958లో 48 లక్షల హెక్లార్లు చెరువుల కింద సాగుకాగా, 1979 నాటికి 39, 1990 నాటికి 28 లక్షల హెక్లార్లకు చెరువుల సాగుపడిపోయింది. ప్రస్తుతం రాష్ర్టంలో 79 వేల చెరువులున్నాయి. వీటిద్వారా 16 లక్షల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉన్నా, ప్రస్తుతం మూడున్నర లక్షల ఎకరాలకుమించి సాగుకావటంలేదు. చెరువులను మరమ్మ తులుచేసి వర్షపు నీటిని వాటికి మళ్లించేచర్యలు పాలకులు తీసుకొని ఉంటే ముంపు నివారణతోపాటు గ్రామాల్లో సాగు, మంచి నీటి సమస్య చాలా వరకు పరిష్కారం అయ్యేది. వేసవి నీటి ఎద్దడి తగ్గేది.
సాగునీటికి, మంచినీటికి భూగర్భ జలాలపై ఆధారపడడం ఎక్కువైంది. ప్రస్తుతం రాష్ర్టంలో 22 లక్షల 23 వేల బావులున్నాయి. రాష్ర్టంలోని భూగర్భ జలాల్లో 42 శాతం మాత్రమే ఉపయోగించుకొంటున్నాము. వర్షపు నీటి ఇంకుడుపై భూగర్భ జలాల నీటిమట్టం ఆధారపడి ఉంటుంది. బావుల క్రింద సాగయ్యే భూమి విస్తీర్ణం 10 లక్షల నుండి 26.44 లక్షల హెక్లార్లకు పెరిగింది. ఒక్కో బావి కింద సాగయ్యే సగటు విస్తీర్ణం 1.22 ఎకరాలనుండి 1.19 ఎకరాలకు పడిపోయింది. బావుల నుండి నీటి లభ్యత తగుగ్గతోందని ఇది తెలియజేస్తున్నది. ప్రస్తుతం రాష్ర్టంలో బావుల సంఖ్య పెరుగుతున్నది. అందువల్ల బావుల సేద్యం పెరిగి భూగర్భ జలాల నీటి మట్టం తగ్గిపోతున్నది. భూగర్భ జలాలను 90 శాతం వరకు గ్రామీణ ప్రజలు మంచినీటికి ఉపయోగిస్తున్నారు. నీటి లభ్యత ఉన్న ప్రతి గ్రామంలో ఇంటిముందు చేతిపంపు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ చేతి పంపులు ఉన్న గ్రామాల్లో వేసవిలో కూడా మంచినీటికి ఎద్దడి ఉండదు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ బావుల నీటిని మంచినీరుగా వాడుతున్నారు. వ్యవసాయ పంటల్లో వస్తున్న మార్నుల వలన వరి తర్వాత మినుము, పెసర స్థానంలో మొక్కజొన్న, జొన్న పంటల్ని గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. ఈ పంటల తరుణంలో కాల్వలకు నీరు విడుదల కాకపోవటంతో బోర్లద్వారా నీరు పైరుకు మళ్లించటం వలన గ్రామాల్లో భూగర్భ నీటిమట్టం పడిపోయి, చేతిపంపుల నుండి నీరు రావడం తగ్గిపోయింది. ఫలితంగా ఈ కాలంలో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారు.
దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు, ప్రపంచ వాణిజ్య ఒప్పందంపై పాలకులు సంతకం చేయడంతో దేశ వనరులన్నీ సామ్రాజ్యవాద బహుళజాతి సంస్థల కైంకర్యం అవుతున్నాయి. ఇందుకు ప్రపంచబ్యాంక్ చోదకశక్తిగా పనిచేస్తున్నది. ప్రకృతి సిద్ధమైన అన్ని వనరులతోపాటు నీటిని కూడా బహుళజాతి సంస్థలు వ్యాపార సరకుగా మార్చాయి. అందుకు అనుగుణమైన విధానాలు అనుసరించేవిధంగా పాలకులపై ప్రపంచబ్యాంక్ ఒత్తిడి చేసింది. మంచినీరు, సాగునీరు అందించే బాధ్యత నుండి రాష్ర్ట ప్రభుత్వం తప్పుకోవాలని, అందుకు సాగునీటిరంగంలో సంస్కరణలు చేపట్టా లని, అలాచేస్తేనే సాగర్, కృష్ణ డెల్టాల ఆధునికీ కరణకు, చెరువుల మరమత్తులకు అప్పుఇస్తామని ప్రపంచబ్యాంక్ చెప్పిన విధంగా, రెగ్యులేటరీ ఆధారిటీ ఏర్పాటుచేసింది. కాల్వలకు ఎంత నీరు విడుదల చేయాలి, నీటి పన్ను ఎంత వసూలుచేయాలి అన్నది ఈ ఆధారటీ నిర్ణయిస్తుంది. దీని అమలుకోసం రైతు సంఘాల ను ఏర్పాటు చేసింది. మీటర్లద్వారా అందే సాగునీటి పరిమాణం ప్రకారం రైతుసంఘాలు నీటితీరువా వసూలు చేస్తాయి. ఇది రైతాం గానికి ఆర్థికంగా పెనుభారంగా తయారౌ తుంది. నీటి పొదుపు పేరుతో- ఉన్న నీటినే అదనపు సాగుకు మళ్లించి అదనపు ఆదాయాన్ని రాబట్టడానికే నీటిమీటర్ల ఏర్పాటు.ఆచరణలో ఇది సాగు నీరు భూస్వాములకు- అన్న రూపం తీసుకుంటుంది. చిన్న, సన్నకారు రైతాంగం సాగుకి దూరంకావాల్సి వస్తుంది. ఈ విధంగా సాగునీటిని వ్యాపార సరకుగా ప్రపంచబ్యాంక్ చేయించింది.
సాగునీటికి ముందే మంచినీరు వ్యాపారంగా మారింది. మంచినీటి వ్యాపారం సామ్రాజ్య వాద బహుళజాతి సంస్థలకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సమకూర్చిపెడుతున్నది. నదీ జలాలను, భూగర్భ జలాలను బహుళజాతి సంస్థలు అప్పనంగా వాడుకొంటు న్నాయి. రాజస్థాన్ లో కోకాకోలా కంపెనీ 14 పైసలకు వెయ్యిలీటర్ల చొప్పున లక్షల లీటర్ల నీటిని వాడుకొం టున్నది. ఇదే విధంగా అనేక రాష్ట్రాల్లో బహుళజాతి సంస్థలు నీటిని కొల్లగొడుతున్నాయి. మన దేశంలో ‘కిన్‌లే’ బ్రాండ్ వాటర్ లీటర్ ఖర్చు 25 పైసలు. నీటి ఖర్చుతో పాటు బాటిల్, బాటిల్స్ పెట్టే ప్లాస్టిక్ కార్బన్‌తో సహా రూ. 2.50 నుండి రూ. 3.75 కు మించదు. కానీ లీటర్ బాటిల్‌ను రూ. 20కి అమ్ముతున్నారు. పన్నులు పోను కంపెనీకి 50 శాతం నికరలాభం వస్తుంది. 2002లో భాత దేశంలో వెయ్యి కోట్ల రూపాయల నీటి వ్యాపారం జరిగింది. 1999-2004 మధ్య ప్రతి సంవత్సరం 25 శాతం చొప్పున ఈ వ్యాపారం పెరిగింది. భారతదేశంలో నీటిని శుద్ధిచేసి అమ్మేసంస్థలు వెయ్యి ఉన్నాయి. పార్లే బిస్‌లరీ 40 శాతం వ్యాపారాన్ని అక్రమించు కోగా, కోకోకోలాకు చెందిన ‘కిన్‌లే’ బ్రాండు 25 శాతం, పెప్సీకోలాకు చెందిన ఆక్వాఫేనా 10 శాతం వాటాలు పొందగా, మిగతా 25 శాతాన్ని దేశీయ వ్యాపారసంస్థలు పొందుతున్నాయి. ప్రపంచ వ్యాపి తంగా ప్రతి సంవత్సరం రూ. 30 లక్షల కోట్ల నీటి వ్యాపారం జరుగు తున్నది. అత్యధిక ధనిక కార్పొరేట్ సంస్థలు ప్రపచంలో ఐదువం దలు ఉంటే, నీటి వ్యాపారం చేసే సంస్థలు కూడా అంతే మొత్తంలో ఉన్నాయి. ప్రపంచలో ఐదుశాతం మంది ప్రజలు బాటిల్ నీళ్ళను తాగిేత సంవత్సరానికి రూ. 50 లక్షల కోట్ల నీటి వ్యాపారం చేయవ చ్చని మవుదే బార్లే అనే నీటి ఉద్యమ కార్యకర్త బ్లూగోల్డ్ పుస్తకంలో తెలియచేసినట్లు ప్రపంచబ్యాంక్ వెల్లడించింది. దీన్ని గమనిస్తే నీటి వ్యాపారం ఎంత పెద్దఎత్తున జరుగుతుందో అర్థమౌతుంది.
ప్రజలు సురక్షితమైన నీటిని కోరుకొంటున్నారు. పరిశ్రమలు వెదజల్లే వ్యర్థపదార్థాలు, కాలుష్య రసాయనాలు ఆ ప్రాంతాల నీటిని కలుషితం చేస్తుండటంతో ఆ నీరు అనారోగ్య కారణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వాటర్ బాటిళ్ళ నీటి గురించి బహుళజాతి సంస్థలు చేసే ప్రచారానికి ప్రజలు ఆకర్షితులై, బాటిళ్ళ నీళ్లు ఆరోగ్యకరమైనవిగా భావించి, ఆ నీటికి అలవాటుపడుతున్నారు. మాములు ఫిల్టర్ పంపునీళ్ళకన్నా బాటిళ్ళ నీళ్ళే కలుషితమైనవని అనేక పరిశోధనల్లో వెల్లడి అయింది. బాటిళ్ళ నీళ్ళకన్నా, ఫిల్టర్ చేతిపంపు నీళ్ళు తాగి ఆరోగ్యంగా ఉన్నారన్న వాస్తవాన్ని బహుళజాతి సంస్థలు మభ్యపరుస్తున్నాయి.నీటిని శుద్ధిచేసుకోవటం మన ప్రజలకు ఎప్పటినుండో తెలుసు. చిల్లగింజ గుజ్జు, పసటికమేసి ఎంతో పరిశుభ్రమైన నీటిని తాగేవారు. నీటివ్యాపారానికి మనదేశం లో ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని, భూగర్భ జలాలను బహుళజాతి సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రపంచబ్యాంక్ అనేక నివేదికలు విడుదల చేస్తున్నది. ‘డీప్ వెల్స్ ప్రూడెవ్’ పేరుతో ప్రపంచబ్యాంక్ వెలువరించిన నివేదికలో మనదేశంలో భూగర్భ జలాలలభ్యత, వినియోగం, భవిష్యత్తు పరిణామాల గురించి విశ్లేషిం చింది. దేశంలో భూగర్భజలాలను ఎలా వినియోగించుకోవాలో బ్యాంక్ శాసించనున్నది. నీటి పొదుపుకోసం నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పాలకులకు సూచనలు పంపింది.60 శాతం వ్యవసాయ అవసరాలను, 85 మంచినీటి అవసరాలను దేశంలో భూగర్భజలాలే తీరుస్తున్నాయి.
ఈ విధంగా భూగర్భజలాల వినియో గాన్ని బ్యాంక్ కోరుకోవటంలేదు. అందుకే వినియోగంపై పాలకులపై ఆంక్షలు విధింపచూస్తున్నది. భూగర్భ జలాలను విచ్చలవిడిగా వినియోగిస్తే మరో 20సంవత్సరాల్లో ప్రమాదపరిస్థితి ఏర్పడుతుంద ని నివేదికలో పేర్కొంటూ, అలాంటి పరిస్థితిరాకుండా నియంత్రణ కమిషన్ ఏర్పాటుచేయాలని చెబుతూనే, దేశంలో రెండుకోట్లదాకా బావులు ఉన్నాయని, వాటిని నియంత్రణా వ్యవస్థలోకి తీసుకొని రావడంకష్టమని, అందువల్ల మంచినీటికి ధర నిర్ణయించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నది. అందుకు అనుగుణంగానే రాష్ర్ట ప్రభుత్వం రూ.2కే బాటిళ్ళద్వారా మంచినీరు గ్రామాల్లో అందచేసా ్తననిచెప్పడం. దీనిద్వారా నీటివ్యాపారం ఇబ్బడిముబ్బడిగా పెరుగు తుంది. మొత్తం పరిస్థితిని గమనించినపడు మంచినీటి కొరతకు పాలకులే కారణం అన్న విషయం స్పష్టమౌతున్నది. ప్రభుత్వాలు బహుళజాతి సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాన్ని వెంటనే విరమించు కోవాలి. ఇటువంటి ప్రభుత్వ విధానాకు వ్యతిరేకంగా ప్రజలు పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి. దేశంలో బహుళజాతి సంస్థల నీటివ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలి.
5-2-13
అప్జల్ ఉరి వేస్తున్న ప్రశ్నలు
ఢిల్లీలో పన్నేండు సంవత్సరాల క్రితం 2001 డిసెంబర్ 13న ఐదుగురు సాయుధులు పార్లమెంట్‌పై దాడి జరిపారు. తీవ్రవాదులు జరిపిన దాడిలో 8 మంది జవాన్లు, ఒక పార్లమెంట్ ఉద్యోగి చనిపోయారు. కొంతమంది గాయపడ్డారు. ఈ నేరానికి పాల్పడిన 5 మంది తీవ్రవాదులను పార్లమెంట్ భద్రతా జావాన్లు కాల్చి చంపారు. ఈ దాడిలో తీవ్రవాదులకు సహకారం అందించాడనే కారణంతో మూడు రోజుల తర్వాత మహమ్మద్ అప్జల్ గురు అనే కాశ్మీరినీ, ఢిల్లీ ప్రొఫెసర్ ఎస్.ఎ.ఆర్.జిలానీని, శ్రీనగర్ పండ్ల వ్యాపారి షౌకత్‌ను అరెస్టు చేశారు. కింది కోర్టు జిలానీని,షౌకత్‌ను నిర్దోషులని తేల్చడంతో వాళ్లు శిక్ష నుంచి తప్పించుకున్నారు. 2 సంవత్సరాల విచారణ ప్రక్రియ తర్వాత 2002 డిసెంబర్‌లో న్యాయస్థానం అప్జల్‌కు మరణశిక్ష విధించింది. ఆ కేసుపై తరువాత హైకోర్డులోనూ, సుప్రీం కోర్డులోనూ అప్పీలు చేసుకున్నారు. సుప్రీంకోర్డు 2005 ఆగస్టులో ఆ శిక్షను సమర్థించిన అనంతరం చివరి అవకాశంగా అప్జల్ తరపున భార్య 2006 అక్టోబర్‌లో రాష్ట్రపతికి క్షమాభిక్ష దరఖాస్తును పంపారు. రాష్ట్రపతి 2013 ఫిబ్రవరి 3న ఆ దరాఖాస్తును నిరాకరించడంతో. ఆ తర్వాత ఐదు రోజుల తేడాతో ఫిబ్రవరి 9న ఉదయం 8 గంటలకు జైల్లో ఉరితీశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి పదవి బాధ్యతలు స్వీకరించాక అమలులోకి వచ్చిన రెండో ఉరిశిక్ష ఇది. ప్రతిభాపాటిల్ తన పదవి కాలంలో తీసుకోని నిర్ణయాన్ని ప్రణబ్‌ముఖర్జీ అతి తక్కువ కాలంలోనే రెండు దరఖాస్తులను తిరస్కరించడం బహుషా రికార్డుగా నమోదు చేయోచ్చేమో? అప్జల్ ఉరిని రహస్యంగా నిర్వహించడాన్ని తప్పుపడుతూనే దేశంలోని వామక్ష పార్టీలనీ ఉరిశిక్షను పరోక్షంగా సమర్థించాయి. ఈ చట్టబద్ద హత్యకు దేశంలో చాలామంది ఆనందోహాత్సహాలతోస్పందించి ఉత్సవంగా జరుపుకున్నారని ప్రచార సాధనాల తెలుస్తోంది. ప్రతి నేరానికి ఉరిశిక్షే పరిష్కారం అని భావిస్తున్న ప్రజలనుంచి బహుషా మనం ఇంతకంటే వేరే స్పందనను ఆశించలేము. పాలక వర్గాలు ప్రజలనుంచి ఆశిస్తున్నది కూడా ఇదే.
నిజానికి స్వతంత్య్ర భారతదేశంలో ఉరిశిక్షలు కొత్తేమి కాదు. అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌కు ఉరిశిక్షలను అమలుచేయడం కూడా కొత్త కాదు, గతంలో ఇదే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఉరిశిక్షను అమలు చేసింది. అయితే ఇక్కడ గతంలో అమలు చేసిన ఉరిశిక్షకు నేడు కసబ్, అప్జల్ గురి ఉరిశిక్షలను అమలు చేసిన విధానంలో తేడా ఉంది. 24 ఏళ్ల క్రితం ఇదే జైల్లో మాజీ ప్రధాని ఇందిరాను హత్య చేసిన నేరస్తులను నాటి ప్రభుత్వం 1989 జనవరి 6న తీహార్ జైల్లో ఉరితీశారు. ఒక దశాబ్దం పాటు అతలాకుతం చేసిన ఉగ్రవాద కోరల్లోంచి పంజాబ్ అప్పటికింకా పూర్తిగా బయటపడలేదు అయినా భారత్ ప్రజాస్వామ్యం పట్ల అకుంఠిత విశ్వాసాన్ని కనబరిచింది. ఇందిర హంతకులకు రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించిన విషయాన్ని రాజీవ్ ప్రభుత్వమేమీ దాచి పెట్టలేదు. క్షమాభిక్ష తిరస్కృతిపై ఆ ఇద్దరూ నేరస్తులు సుప్రీం కోర్టుకెళ్లారు. కోర్డు వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఆ తరువాతే వారి ఉరిశిక్ష తేదీని ప్రకటించారు. ఆ విషయాన్ని ముందుగానే వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జైలులోనే కడసారిగి కుటుంబ సభ్యులు కలుసుకొని తుది వీడ్కోలు పలికారు. ఆ విషయాలన్నీ బహిరంగంగానే జరిగాయి. నాడు నేరస్తులను కోర్టుచేత రుజువుచేయబడిన వారిని ఉరితీసింది కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు అప్జల్‌ను ఉరితీసింది. కానీ అప్పుడు పాటించిన కనీసం సంప్రదాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ పాటించకపోవడమే అనుమానాలకు తావిస్తోంది. ఉరి తీయడానికి ఎంచుకున్న సమయం కూడా పలు అనుమానాలకు ఆస్కారమిస్తోంది. యుపిఎ ప్రభుత్వం తన మనుగడ కోసమే ఇంత ఆదరాబాదరగా దీనిని అమలులో పెట్టిందనే విమర్శను కూడా ఆ కోణంలో ఆలోచించాల్సి వస్తుంది. 2005లోనే అప్జల్ గురు రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించగా ఐదేళ్ల పాటు గమ్మున ఉన్న ప్రభుత్వం ఇప్పుడే ఎందుకు హడివిడి చేసిందనేది ఆలోచించాలి. ఇంకోవైపు ఈ ఏడాది అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున తన ప్రత్యర్థి బిజెపి నుంచి విమర్శలను తిప్పికొట్టేందుకే అప్జల్ గురును ఇప్పుడు హడావిడిగా ఉరితీసినట్లుంది. ఉగ్రవాదంపై కాంగ్రెస్ మెతక వైఖరి అవలంబిస్తోందని విమర్శించే బిజెపి నోర్మూయించేందుకు దీనిని ఒక సాధనంగా ఉపయోగిచుకున్నట్లు ఉంది.
అయితే అప్జల్‌గురు ఉరితీయడం న్యాయమని చట్టబద్దమని ప్రభుత్వం విశ్వసిస్తే ఆ పని అంత రహస్యంగా జరపాల్సిన అవసరం లేదు. బతికున్నప్పుడు అప్జల్ నేరాలు చేశాడు కాబట్టి ప్రభుత్వ ఆధినంలో ఉండటంలో తప్పులేదు. కానీ అతను చనిపోయాక అతని శవంపై ప్రభుత్వానికి అధికారంలేదు. రహస్య నిర్వహన సమర్థతకు సంకేతం అనుకోవడం దురదృష్టకరం. జైల్ మాన్యువల్ ప్రకారం కూడా గురు కుటుంబానికి మరణ శిక్ష అమలు లేదిని సమయాన్ని తెయజేయడం బాధ్యత. అంతే కాకుండా వ్యక్తి మరణించిన తరువాత మృతదేహానికి జరపాల్సిన అంతిమ సంస్కారాలు కూడా అతని కుటుంబానికి చెందిన మతపరమైన సొంత బాధ్యత. ఈ బాధ్యతను కూడా ప్రభుత్వం తన సొంత వ్యవహారంగా చేయడాన్ని సమర్థనీయం కాదు. మరణశిక్ష నుంచి జీవితఖైదుగా మార్చమని అప్జల్ గురు తరపున అతని భార్య కోరితే రాష్ట్రపతి ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవలసిన అధికారం ఆమెకూ, అతనికీ కూడా ఉంది. తిరస్కరించడానికి చూపిన కారణాలను సమీక్షించాలని సుప్రీంకోర్టును అడిగే హక్కు ఉంది. కొందరికి ఈ అవకాశం కల్పించడం మరికొందరికి నిరాకరించడం న్యాయం కాదు. అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న పాలకులు తను చేసుకున్న చట్టాలను కూడా తుంగలో తొక్కి అప్రజాస్వామికంగా వ్యవహరించడం సరైనది కాదు.
అప్జల్ గురు అరెస్టు చేసినది మొదలు ఉరిశిక్షను అమలు చేసే వరకు అతని పట్ల ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా, కృరంగానే వ్యవహరించింది. పర్వేజ్ బుఖారి అనే ఫ్రిలాన్స్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డిఎస్పీ దావిందర్ సింగ్ అనే ఇంటరేషన్ అధికారి మాట్లాడుతూ అతని అరెస్టు ఎక్కడా ఏ పుస్తకకంలో కూడా మేము నమోదు చేయలేదని, తన క్యాంపుల్లోనే అప్జల్‌ను చిత్రహింసలు పెట్టినట్లు అతని జననాంగాల్లో పెట్రోల్ పోశామని, కరెంట్‌షాకులు ఇచ్చామని అయినా అతనితో ఏమీ చెప్పించలేకపోయానని చెప్పాడు. నాకు హింసించి నేరాలు ఒప్పించడంలో చాలా పేరుంది. నా ఇంటరాగేషన్ తరువాత కూడా ఏమీ చెప్పడానికి లేకపోతే అతను ఏమీ చేయనట్టే. అతను నేరస్తుడుకాడని మొత్తం డిపార్ట్‌మెంట్ ఒప్పుకుంటుంది అని దావిందర్ సింగ్ చెప్పాడు. ఒకవైపు అప్జల్‌ను ఇంటరాగేషన్ చేసిన అధికారే పత్రికా ముఖంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్జల్‌కు సంబంధించిన వాస్తవాలను చెబుతుంటే ఇంకోవైపు అప్జల్ గురు పార్లమెంట్‌పై దాడికి కుట్ర పన్నాడని ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది అంటూ పార్లమెంట్ తన తీర్పును ప్రకటించింది. అయినా ప్రభుత్వం అతనికి ఉరితీసింది ఇక్కడే ప్రభుత్వం యొక్క నిజాయితిని శంకించాల్సి వస్తోంది రాష్ట్రపతి క్షమాభిక్ష దరాఖాస్తును తిరస్కరించిన సందర్భంలో ప్రభుత్వం అతనిని న్యాయస్థానానికి కూడా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించకుండా ఆగమేఘాలమీద ఉరితీయడం ప్రజాస్వామ్యాన్ని అపహాసుపాలు చేయడమే అవుతుంది.
ఇదే సందర్భంలో నేరస్తుల పట్ల ప్రభుత్వ వైఖరిని కూడా ప్రశ్నించాల్సి ఉంది. లాహోర్‌లోనూ, పైసలాబాద్‌లోనూ వరుస బాంబు పేలుళ్ల కేసులో సరబ్ జిత్ నేరస్తుడని పాకిస్తాన్ న్యాయస్థానాలు నిర్థారించి 1991లోనే మరణశిక్ష విధించాయి. కానీ ఆ మరణ శిక్ష అమలులోకి రాలేదు. సరబ్‌జిత్‌కు క్షమాభిక్ష పెట్టాలని, వదిలెయ్యాలని, భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వంతో రాజభారాలు నడుపుతోంది. దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులు (సరబ్‌జిత్, అప్జల్) ఇరుదేశాల్లో నేరానికి పాల్పడారని ఇరుదేశాలకు చెందిన అత్యున్నత న్యాయస్థానాలు నిర్ధారించి శిక్షలు అమలు చేయాలని కోరితే, ఒకరి విషయంలో క్షమాభిక్ష పెట్టాలనీ భారత ప్రభుత్వం రాజభారం నడిపి తనూ మాత్రం క్షమా భిక్షను తిరస్కరించడం ఏవిధంగా అర్థం చేసుకోవాలి. ఇది ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణం కాదా? ఈ రెండు కాసేపు పక్కన పెట్టిన తీవ్రవాదులు భారత పార్లమెంట్‌పై దాడికి పాల్పడి కాలంలోనే గుజరాత్‌లో ముఖ్యమంత్రి నరేంద్రమోడి అధికారం సాక్షిగా దాదాపు మూడు వేల మందిని పొట్టన పెట్టుకొని భారతదేశ లౌకికత్వాన్ని ప్రశ్నిస్తే ఊచకోతకు కారణమైన నరేంద్రమోడిని శిక్షించలేని న్యాయస్థానాన్ని, ప్రభుత్వ ఉదసీనవైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి. 1993లో జరిగిన ముంబై అల్లర్లకు వెయ్యి మంది చనిపోవడానికి ప్రధాన కారణం బాల్‌ఠాక్రే రచనలు, శివసైనికులకు ఆయన చేసిన
ఉద్భోదలేనని బి.ఎస్ కృష్ణ న్యాయ విచారణ కమీషన్ నిర్ద్వందంగా ప్రకటించినా ఏనాడు బాల్‌ఠాక్రేపై ఒక్క కేసు నమోదు చేయని పాలక పక్షాన్ని, న్యాయవ్యవస్థను యొక్క పక్షపతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఒకవైపు గుజరాత్‌లో మూడువేల మంది సామన్యుల ఉచకోతకు కారణమైన వ్యక్తిని దేశానికి భావి ప్రధానిగా అభివర్ణిస్తుంటే, ఇంకోవైపు వేలాదిమంది మరణాలను కారకులైన వ్యక్తికి ప్రభుత్వంలోని వ్యక్తులు సంతాప సందేశాలు పంపడాన్ని ఏవిధంగా చూడాలి. ఇలాంటి చర్యల ద్వారానే ప్రభుత్వమంటే కేవలం మెజారిటి పక్షాలకు చెందిందే అనే అభిప్రాయం సామాన్యుల్లో కలిగే అవకాశం ఉంది.
అప్జల్ గురు గతంలో ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఉగ్రవాద మూలాల గురించి ఒక కాశ్మీరీగా తన విశ్లేషన చేశాడు. ఆయన ఇంటర్వ్యూలోని భావాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకునుంటే కొంతవరకైన ఉగ్రవాద దాడులను అరికట్టగలిగేది. అప్జల్ ఆ ఇంటర్వ్యూలో భారత ప్రభుత్వం ఉగ్రవాదులను అరికట్టే పేరుతో తన భద్రతా దళాల ద్వారా పాల్పడుతుందని తెలిపాడు. రాజ్య ఉగ్రవాదం గురించి, ముఖ్యంగా ఎస్టీఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ) వాళ్లు చేస్తున్న ఆరాచకాల గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని, ఈ రాజ్య ఉగ్రవాదమే నాలాంటి వాళ్లను ప్రతిరోజు తయారు చేస్తోందని నిజాయితిగా ఒప్పుకున్నాడు. అమాయకులైన టీనేజీ విద్యార్థులను ప్రజా భద్రతా చట్టం లాంటి క్రూర చట్టాల కింద అరెస్టు చేసి జైళ్లలో పడేస్తోందని, ఈ రాజ్య ఉగ్రవాదం ఉన్నంత కాలం ఇలాంటి దాడులకు ఎవరూ అపలేరని, భారత ప్రభుత్వమే కాశ్మీర్‌ను మినీ ఆప్ఘనిస్తాన్‌లా తయారుచేసిందని విమర్శించాడు. ప్రస్తుతం కాశ్మీర్‌లో పరిస్థితి అచ్చం ఆప్ఘన్‌లోలాగానే ప్రమాదంగా ఉందని, ఈ అగ్ని పర్వతం ఎప్పుడో ఒకప్పుడు పేలుతుందని, ఇది హెచ్చరిక కాదని భారత ప్రజలతో పాటు కాశ్మీర్ ప్రజల గురించిన ఆవేదన మాత్రమే, కాశ్మీరీలు ఎప్పుడూ భారతీయులకు వ్యతిరేకం కానే కారు. ప్రభుత్వ విధానాలే కాశ్మీరీ ప్రజలను భారతదేశం నుంచి వేరుచేశాయి. దీనికి పరిష్కారం కాశ్మీర్‌లోనే ఉంది తప్పా పాకిస్థాన్‌లో కాదని తెలిపాడు. ఇంత వివరంగా ఒక కాశ్మీరీ పౌరుడు దేశం ముందు ఉగ్రవాదానికి సంబంధించిన సమస్యను ఉంచితే పాలకులు మళ్ళీ తన రాజకీయ లబ్ది కోసం సమస్యలను జఠిలం చేస్తూ పోతే పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రభుత్వమే పెంచి పోషించినట్లవుతుంది. పాలకులు తమ సమస్యలను పరిష్కరించడంలో చిత్తసుద్దిని ప్రదర్శించుండా సమస్యను ఇంకా క్లిష్టతం చేస్తూ సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంబమైన అత్యంత భద్రతలో ఉన్న పార్లమెంట్‌పై దాడి జరిగిన తర్వాతనైనా సమస్య మూలాలలోకి వెళ్ళి పరిష్కారం కనుగొనాలి.
నేరానికి పాల్పడిన వారిని ఉరితీస్తే సమస్య పరిష్కారం అవుతోందని పాలకులు, సామాన్యులు భావిస్తున్నారు. పాలకులు కూడా ఇలాంటి క్రూరమైన శిక్షలనే అమలుచేస్తోంది. కానీ కఠినమైన శిక్షల ద్వారా నేరాలు తగ్గినట్టు ఎక్కడా ఆధారాలు లేవు. ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాల అనుభవం కూడా ఇదే చెబుతోంది. నేరస్తుడు అమాయకుల ప్రాణాలు తీసుకున్నాడు కాబట్టి చట్టబద్దంగా రాజ్యమే నేరస్తున్ని క్రూరంగా శిక్షించాలనడం అటవిక న్యాయమై అవుతోంది. నేరానికి శిక్ష మరణమే అని వాదిస్తే నేరస్తుడికి, సభ్య సమాజానికి, చట్టబద్ధ రాజ్యానికి ఏం తేడా వుండదు. ప్రతి నేరానికి ఉరిశిక్ష వేయండి అని అడిగే ఈ దేశ ప్రజలు అభద్రత భావంతో ఎక్కడో తన మానవత్వాన్ని కోల్నోతున్నట్టు అనిపిస్తోంది. కంటికి కన్ను, పంటికి పన్ను అని ప్రతి ఒక్కకూ అనుకుంటే మొత్తం సమాజమే గుడ్డిదై పోతుందని మహాత్మగాంధీ గారు మరణశిక్షనుద్దేసించి ఒక సందర్భంలో అన్నారు. గాంధీ విలువలపైనే పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలకులు కనీసం ఆయన మాటలనైనా ఆచరిస్తే బావుండు.
సంక్షోభం నుంచి గట్టేక్కెందుకే పాక్ దాడులు
జనవరి 8 అర్థరాత్రి సరిహ ద్దు దాటుకొని వచ్చి న పాక్ సైనికులు ఇద్దరు భారత సైని కుల తలల్ని తెగనరకడంతో ఇరుదేశాల మధ్య ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇటీవల కొన్ని రోజులుగా సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రవాణా వాహనాలకు అనుమతులు నిరాకరించడంతో ప్రజలకు నిత్యావసర ఆహార వస్తువులు అందక అష్టకష్టాలు పడ్డారు. ఒకవైపు దేశం అంతర్గత సంక్షోభంలో చిక్కుకొని, నిత్యం ఏదో ప్రాంతంలో ఉగ్రవాదుల దాడులకు వందలాదిమంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా, దాయది దేశం పాక్ మాత్రం భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. స్నేహ హస్తం అందిస్తూ భారత్ ముందుకొస్తుంటే ఆ చేయ్యినే నరికేసేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. పాక్ క్రూరచర్యలకు నిరసనగా దేశవ్యాపితంగా ప్రజానికం పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేస్తూంటే, వీర సైనికులు లాన్స్ నాయక్ హేమరార్, సుధాకర్‌ల కుటుంబాలు తమ వారిని పొట్టన పెట్టుకున్న పాక్ సైనికులకు తగిన బుద్ధి చెప్పాలని, అదే తమ సభ్యులకు భారత సైనికులు ఇచ్చే నివాళి అని భావిస్తున్నారు.
కవ్వించి, హద్దుమీరి క్రూరమృగాల్లా- ఇద్దరు భారత జవాన్లను హతమార్చి, తలలు తీసుకెళ్ళిన పాక్ వైఖరిని చూస్తూ ఊరుకోకూడదని, ఆ దేశంతో తక్షణం చర్చలు ఆపివేసి ప్రతికారం తీర్చుకొని తగిన గుణపాఠం చెప్పాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. పాక్ సైనికుల కుట్రలకు దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా, పాక్ మాత్రం తన భూభాగంలోని స్థావరంపై దాడికి పాల్పడి ఒక సైనికున్ని కాల్చి చంపారంటూ దొంగ నాటకం ఆడింది. జరిగిన ఘోరానికి చింతిస్తున్నామని, తమపై అనుమానం ఉంటే థర్డ్ పార్టీతో ఎంక్వయిరీ జరిపించుకోండని ఉచిత సలహా పారేసింది. ఒక వైపు కవ్వింపు చర్యలకు పాల్పడలేదని పాక్‌నేతలు బుకాయిస్తున్న సందర్భంలోనే వారి సైన్యం మరింత బరితెగించి జమ్మూ- కాశ్మీర్‌లోని పూంచ్, బట్టాల్ స్థావరాలపై విరుచుకపడింది. మరోవైపు చాకందాలోని పాక్ ఇండియా గేట్‌వేను పాక్ మూసేసింది. వందలాది సరుకు రవాణా వాహనాలను రాకుండా పాక్ అడ్డుకుంది. మొత్తానికి ఈ చర్యలను బట్టి, పాక్ కయ్యానికి కాలుదువ్వుతున్నదన్న వాదనలు బలపడుతున్నాయి.
పాకిస్థాన్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకొని ఉంది. సగటు పౌరుడు అభద్రతా భావంతో ఉన్నాడు. పేదరికం, నిరుద్యోగం, దారిద్య్రంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ను మరోవైపు ఉగ్రవాద దాడులు పట్టిపీడిస్తున్నాయి. సైన్యానికి, ప్రభుత్వానికి నిరంతరం సంఘర్షణ! ఉగ్రవాదులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నా వారిని నిలవరించలేని నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్ మిగిలి పోతోంది. సైన్యం, ఐఎస్‌ఐల మధ్య ప్రభుత్వాలు నగిలిపోతున్నాయి. ఈ పరిణామాలకుతోడు మార్చిలో పాక్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగను న్నాయి. స్వదేశంలో పాకిస్థాన్ ఏం చెయ్యలేక ప్రజల దృష్టిని మళ్లించేం దుకే భారత్‌పై దాడులకు పాల్పడు తోంది. భారత్‌పై తాము పోరాడుతు న్నామనే సంకేతాలు పంపేందుకే పాక్ పాలకులు పనిగట్టుకొని ఇలాంటిదాడు లను ప్రొత్సహిస్తున్నారు. పాలకులు, సైన్యం, ఐఎస్‌ఐ- మధ్య ముడుముక్కలుగా మారిన ప్రజాస్వా మ్యం ఆ దేశానికి పెను సవాళ్ళు విసరుతోంది. అవినీతిపై ప్రజా ఉద్యమం కార్చిచ్చులా వ్యాపించి పాలకుల పుట్టి ముంచుతోంది.
అవినీతి ఆరోపణలకు ప్రధానిని అరెస్టు చేయాలని సుప్రీం ఆదేశించిందంటే అది సంక్షోభానికి సూచనే అని రాజకీయ విశ్లేషకుల వాదన. ఇంట గెలవలేని పాకిస్థాన్ సరిహద్దుల్లో అలజడి సృష్టించి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకే ఈ ఎత్తుగడలకు పాల్పడుతోంది. నిజానికి పాక్ ఇలాంటి కవ్వింపు ఘటనలకు పాల్పడడం కొత్త కాదు. దేశ విభజన నాటినుంచీ పాక్ వైఖరే ఇంత! ప్రపంచంమొత్తం వేలేత్తి చూపించినా తన బుద్ధి చూపిం చుకుంటూనే ఉంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని తేలినా అఫిజ్ సయ్యద్ నుంచి దావుద్ ఇబ్రహీం దాకా అందరిని నెత్తిన పెట్టుకొని ఊరేగిన చరిత్ర పాక్‌ది. భారత్‌తో శాంతి సంబం ధాలు కొరుకొంటున్నామనే నీతులు చెబుతూనే సరిహద్దుల్లో గుంటనక్కల్లా గోతులు తవ్వుతోంది. మూడు సార్లు భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నా బుద్ధి తెచ్చుకోలేని పాక్ మరోసారి కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధపడుతోంది. పాక్ దొంగనాటకాల గురించి భారత్ కన్నా ఇంకేదేశం రుచిచూసి ఉండకపోవచ్చు. కానీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈమధ్య కయ్యానికి కాలుదువ్వుతోంది పాక్ సైన్యం. కేంద్ర ఇంటలిజెన్స్ అనుమానం వ్యక్తం చేసినట్లు ఈ దూకుడు వెనుక బలీయమైన రాజకీయ కారణాలే ఉన్నాయని తెలుస్తోంది.
12ఏళ్ల క్రితం కాల్పుల విరమణ ఒప్పందంపై రెండుదేశాలు సంతకాలు చేసినప్పటినుంచి భారత్ తన పరిధిని ఏనాడూ దాటలేదు. ఈ 12 సంవత్సరాల కాలంలో పాక్ అనేక మార్లు కవ్వింపులకు పాల్పడి, యుద్ధానికి కాలుదువ్వినా, మన దేశం ఎన్నో సార్లు స్నేహహస్తం అందిస్తూ పాక్‌తో మైత్రికి చెయ్యిచాచింది. 2001 డిసెంబర్‌లో కుదిరిన ఒప్పందంతో నమ్మకమైన మైత్రి కోసం భారత్ ఎన్నో అడుగులు ముందుకు వేసింది. భారత్ చర్యలతో ఇటు నేలపై, అటు నింగిలో ఉన్న ఆంక్షలన్నీ రద్దయ్యాయి. రెండు దేశాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. కానీ పాక్ మాత్రం కడుపులో కత్తులు నూరుతూ ముఖంపై నవ్వులు పులుముకుంది. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితిమెరుగు పడుతున్నదని అందరూ సంబర పడుతున్న దశలో 2008లో ముంబైైలో బాంబ్ పేలుళ్ళు జరిగాయి. ఈ ఘోర కలి పాక్ చొరవతోనే జరిగిందన్నది జగమె రిగిన సత్యం. దానికిసజీవసాక్ష్యంగా కసబ్‌ను చూపించినా, ఆ కసాయితో తమకేసంబంధం లేదని బుకాయించింది. ఇక సరిహద్దుల్లో హద్దులు మీరడం పాక్ సైనికులకు కొత్తకాదు.
2009లో 28 సార్లు అక్రమ చొరబాట్లు నమోదయ్యాయి. 2010లో అది 44 సార్లకు చేరింది. గత ఏడాది వాటి సంఖ్య 117కి పెరిగింది. ఇదంతా పాక్ ప్రభుత్వ కవ్వింపు చర్యల్లో భాగమేఅని అందరికి తెలుసు. మూడు సార్లు భారత్‌తో జరిగిన యుద్ధంలో పాక్ తోకముడిచినా తరచూ చొరబాట్లకు పాల్పడుతూ తలనొప్పులు సృష్టిస్తూ నియంత్రణ రేఖను అతిక్రమిస్తూనే ఉంది. ఇంతకీ పాక్ తరచూ ఇటువంటి పనికి పాల్పడడానికి కారణాలేమిటి అనేది ఆలోచిస్తే ఈ సమస్యను అర్థం చేసుకోవచ్చు. జమ్మూ- కాశ్మీర్ భారత్‌కు కీలకమైన ప్రాంతం. పాక్ కోరుకుంటున్న ప్రాంతం కూడా ఇదే. ఈప్రాంతలోని మెజారిటీ ప్రజలు తమతో కలవడానికి సిద్ధంగా ఉన్నారని పాక్ వాదిస్తూ దశాబ్దాలుగా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. 1947లో రెండు దేశాలకు స్వాతంత్య్రాన్ని సాధించి, అప్పుడప్పుడే స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న కాలంలో కాశ్మీర్ రాజ్యం కోసం పోరు మొదలయ్యింది. దేశ విభజన సమయంలో నాటి పాలకులు సంస్థానాలకు ఒక వెసులుబాటు కల్పించారు. తమకు ఇష్టమైతే ఏ దేశంతోనైనా కలిసేందుకు వారికి స్వేచ్ఛ ఉందని ప్రకటించారు. కానీ కాశ్మీర్‌రాజు హరిసింగ్ స్వతంత్రం గా ఉండాలని నిర్ణయించు కున్నాడు.
కానీ పాకిస్థాన్ దురాక్రమణకు దిగడంతో చివరి క్షణంలో రాజు హరిసింగ్ భారత్ తో ఒప్పందం చేసుకొ ని కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన భారత్ పాక్ సైన్యాన్ని తరిమికొట్టింది. పాక్ స్వంత భూభాగంలో లాహోర్‌ను దాటిపో యింది. భారత విజయం ఖాయమైన చివరి క్షణంలో అనుహ్యంగా నాటిప్రధాని నెహ్రు ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరాడు. ఆయన నిర్ణయం సరైనదా కాదా అన్నదానిపై భిన్నాభిప్రా యాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ ఆక్రమించిన కాశ్మీర్ భూభాగాన్ని వదిలేసి భారత్ ఏకపక్షంగా వెనక్కి తగ్గింది. చేతులారా పాక్ జుట్టును వదిలేసినట్లయింది. చివరికి యుద్ధంలో భారత్ గెలిచి కూడా ఓడినట్లయింది. 1948 డిసెంబర్ 31న రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అప్పుడే నియంత్రణ రేఖను నిర్ధారించుకున్నాయి. 1965 ఆగస్టు 5న పాక్ మరోసారి కాశ్మీర్ కోసం యుద్ధానికి కాలుదువ్వింది. భారత బలాన్ని, బలగా న్ని ఆంచనా వేయలేక తోక ముడిచింది. కేవలం 20 రోజుల్లోనే ఆ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలోను ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొంది కానీ నియంత్రణ రేఖను సరిగ్గా నిర్ధారించలేక పోయింది.
1999 మేలో కార్గిల్ యుద్ధం మొదలైంది. కాశ్మీర్ ఆక్రమణ కోసం మరోసారి ప్రయత్నించి పాక్ చేతులు కాల్చుకుంది. ఆసియాలో అణుబాంబు కలిగి ఉన్న దేశాల మధ్య యుద్ధంగా ఇది చరిత్ర కెక్కింది. ‘లైన్ ఆఫ్ కంట్రోల్’ను దాటి పాక్ చొరబాటుదారులు భారత్‌లోకి చొచ్చు కొచ్చారు. లడక్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ ప్రయత్నించింది. దాంతో యుద్ధం తప్పనిసరైంది. జర్నల్ పర్వేజ్ ముషారప్ అత్యుత్సాహంతో జరిగిన ఆ యుద్ధంలో పాక్‌కు అంతర్జాతీ యంగా చివాట్లు తప్పలేదు.రాజకీయ సంక్షోభం, మార్చిలో జరగనున్న ఎన్నికలు, లాడెన్‌ను చంపించారన్న విమర్శలు, అమెరికాకు తొత్తుగా మారిందనే వ్యతిరేకత, అతివాదుల్లో, ఛాందస వాదుల్లో అసహనం- పాక్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కొవడానికి పాక్‌కు కనిపించిన సాకు కాశ్మీర్. దేశప్రజల్లో ఉన్న భారత వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునేందుకు ఉన్న ఒకే ఒక అవకాశం. సరిహద్దు కవ్వింపులు అందుకే అంటున్నారు రక్షణ నిపుణులు.ప్రజల దృష్టిని మళ్ళించేందుకు యుద్ధమొక్కటే మార్గంగా తోచింది. ఈ యుద్ధంతో భారత్‌ను అశాంతికి గురిచే యవచ్చునని భావిస్తోంది. గత యుద్ధాలు నేర్పిన పాఠాలతో ఇటు భారత్- అటు పాక్ అణ్వాయుధాల నిల్వలకోసం పరుగులు పెట్టాయి. ఈమధ్యే మనదేశం అగ్ని-5 అనే అత్యాధునిక బ్యాలెస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. 5 వేల కిలోమీటర్లలో లక్ష్యాల ను సైతం చేధించేలా దాన్ని తయారు చేశారు.
ఫోక్రాన్ ప్రయోగం తర్వాత భారత్ ఎన్నో ఆయుధాలను సమకూర్చుకుంది.గత యుద్ధాల్లో అస్తి నష్టం, ప్రాణ నష్టం తక్కువే కాని ఈ సారి యుద్ధం వస్తే నష్టం ఊహకు అందదు. కేవలం భారత్, పాక్ మాత్రమే యుద్ధంలో పాల్గొన్నా, రెండు దేశాల్లో ఏ ఒక్క దేశం అదుపు తప్పి అణు బాంబులు దారిమళ్ళినా కష్టమే అంటున్నారు నిపుణులు. మరోవైపు పాక్ మాత్రం హైదరాబాద్‌ను లక్ష్యం చేసినట్టు కనిపిస్తోంది. రక్షణలో కీలక రంగాలైన డిఆర్‌డిఎల్, డిఆర్‌డివోతో పాటు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరా బాద్‌లో కొలువుండడం పాక్ లక్ష్యానికి కారణం. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులుజరిగినా మూలాలు హైదరాబాద్‌లోనే బయట పడుతుండడం ఈ అనుమానాల్ని బలపరుస్తోంది. ఇన్నాళ్లు మనదేశానికి పరోక్షంగా మద్దతుఇచ్చిన అమెరికా ఈసారి జోక్యం చేసుకోనంటోంది. నిజానికి యుద్ధం వస్తే భారత్ ఎదురు నిలవగలదా? పాక్ నక్కజిత్తులకు చైనా ఎత్తులు తోడైతే పరిస్థితి ఏమిటన్నది అసలు సమస్య!
కవ్వించి, హద్దుమీరి క్రూరమృగాల్లా- ఇద్దరు భారత జవాన్లను హతమార్చి, తలలు తీసుకెళ్ళిన పాక్ వైఖరిని చూస్తూ ఊరుకోకూడదని, ఆ దేశంతో తక్షణం చర్చలు ఆపివేసి ప్రతికారం తీర్చుకొని తగిన గుణపాఠం చెప్పాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. పాక్ సైనికుల కుట్రలకు దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా, పాక్ మాత్రం తన భూభాగంలోని స్థావరంపై దాడికి పాల్పడి ఒక సైనికున్ని కాల్చి చంపారంటూ దొంగ నాటకం ఆడింది. జరిగిన ఘోరానికి చింతిస్తున్నామని, తమపై అనుమానం ఉంటే థర్డ్ పార్టీతో ఎంక్వయిరీ జరిపించుకోండని ఉచిత సలహా పారేసింది. ఒక వైపు కవ్వింపు చర్యలకు పాల్పడలేదని పాక్‌నేతలు బుకాయిస్తున్న సందర్భంలోనే వారి సైన్యం మరింత బరితెగించి జమ్మూ- కాశ్మీర్‌లోని పూంచ్, బట్టాల్ స్థావరాలపై విరుచుకపడింది. మరోవైపు చాకందాలోని పాక్ ఇండియా గేట్‌వేను పాక్ మూసేసింది. వందలాది సరుకు రవాణా వాహనాలను రాకుండా పాక్ అడ్డుకుంది. మొత్తానికి ఈ చర్యలను బట్టి, పాక్ కయ్యానికి కాలుదువ్వుతున్నదన్న వాదనలు బలపడుతున్నాయి.
పాకిస్థాన్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకొని ఉంది. సగటు పౌరుడు అభద్రతా భావంతో ఉన్నాడు. పేదరికం, నిరుద్యోగం, దారిద్య్రంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ను మరోవైపు ఉగ్రవాద దాడులు పట్టిపీడిస్తున్నాయి. సైన్యానికి, ప్రభుత్వానికి నిరంతరం సంఘర్షణ! ఉగ్రవాదులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నా వారిని నిలవరించలేని నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్ మిగిలి పోతోంది. సైన్యం, ఐఎస్‌ఐల మధ్య ప్రభుత్వాలు నగిలిపోతున్నాయి. ఈ పరిణామాలకుతోడు మార్చిలో పాక్ పార్లమెంట్‌కు ఎన్నికలు జరగను న్నాయి. స్వదేశంలో పాకిస్థాన్ ఏం చెయ్యలేక ప్రజల దృష్టిని మళ్లించేం దుకే భారత్‌పై దాడులకు పాల్పడు తోంది. భారత్‌పై తాము పోరాడుతు న్నామనే సంకేతాలు పంపేందుకే పాక్ పాలకులు పనిగట్టుకొని ఇలాంటిదాడు లను ప్రొత్సహిస్తున్నారు. పాలకులు, సైన్యం, ఐఎస్‌ఐ- మధ్య ముడుముక్కలుగా మారిన ప్రజాస్వా మ్యం ఆ దేశానికి పెను సవాళ్ళు విసరుతోంది. అవినీతిపై ప్రజా ఉద్యమం కార్చిచ్చులా వ్యాపించి పాలకుల పుట్టి ముంచుతోంది.
అవినీతి ఆరోపణలకు ప్రధానిని అరెస్టు చేయాలని సుప్రీం ఆదేశించిందంటే అది సంక్షోభానికి సూచనే అని రాజకీయ విశ్లేషకుల వాదన. ఇంట గెలవలేని పాకిస్థాన్ సరిహద్దుల్లో అలజడి సృష్టించి ప్రజల దృష్టిని మళ్లీంచేందుకే ఈ ఎత్తుగడలకు పాల్పడుతోంది. నిజానికి పాక్ ఇలాంటి కవ్వింపు ఘటనలకు పాల్పడడం కొత్త కాదు. దేశ విభజన నాటినుంచీ పాక్ వైఖరే ఇంత! ప్రపంచంమొత్తం వేలేత్తి చూపించినా తన బుద్ధి చూపిం చుకుంటూనే ఉంటుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని తేలినా అఫిజ్ సయ్యద్ నుంచి దావుద్ ఇబ్రహీం దాకా అందరిని నెత్తిన పెట్టుకొని ఊరేగిన చరిత్ర పాక్‌ది. భారత్‌తో శాంతి సంబం ధాలు కొరుకొంటున్నామనే నీతులు చెబుతూనే సరిహద్దుల్లో గుంటనక్కల్లా గోతులు తవ్వుతోంది. మూడు సార్లు భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నా బుద్ధి తెచ్చుకోలేని పాక్ మరోసారి కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధపడుతోంది. పాక్ దొంగనాటకాల గురించి భారత్ కన్నా ఇంకేదేశం రుచిచూసి ఉండకపోవచ్చు. కానీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈమధ్య కయ్యానికి కాలుదువ్వుతోంది పాక్ సైన్యం. కేంద్ర ఇంటలిజెన్స్ అనుమానం వ్యక్తం చేసినట్లు ఈ దూకుడు వెనుక బలీయమైన రాజకీయ కారణాలే ఉన్నాయని తెలుస్తోంది.
12ఏళ్ల క్రితం కాల్పుల విరమణ ఒప్పందంపై రెండుదేశాలు సంతకాలు చేసినప్పటినుంచి భారత్ తన పరిధిని ఏనాడూ దాటలేదు. ఈ 12 సంవత్సరాల కాలంలో పాక్ అనేక మార్లు కవ్వింపులకు పాల్పడి, యుద్ధానికి కాలుదువ్వినా, మన దేశం ఎన్నో సార్లు స్నేహహస్తం అందిస్తూ పాక్‌తో మైత్రికి చెయ్యిచాచింది. 2001 డిసెంబర్‌లో కుదిరిన ఒప్పందంతో నమ్మకమైన మైత్రి కోసం భారత్ ఎన్నో అడుగులు ముందుకు వేసింది. భారత్ చర్యలతో ఇటు నేలపై, అటు నింగిలో ఉన్న ఆంక్షలన్నీ రద్దయ్యాయి. రెండు దేశాల మధ్య రాకపోకలు మొదలయ్యాయి. కానీ పాక్ మాత్రం కడుపులో కత్తులు నూరుతూ ముఖంపై నవ్వులు పులుముకుంది. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితిమెరుగు పడుతున్నదని అందరూ సంబర పడుతున్న దశలో 2008లో ముంబైైలో బాంబ్ పేలుళ్ళు జరిగాయి. ఈ ఘోర కలి పాక్ చొరవతోనే జరిగిందన్నది జగమె రిగిన సత్యం. దానికిసజీవసాక్ష్యంగా కసబ్‌ను చూపించినా, ఆ కసాయితో తమకేసంబంధం లేదని బుకాయించింది. ఇక సరిహద్దుల్లో హద్దులు మీరడం పాక్ సైనికులకు కొత్తకాదు.
2009లో 28 సార్లు అక్రమ చొరబాట్లు నమోదయ్యాయి. 2010లో అది 44 సార్లకు చేరింది. గత ఏడాది వాటి సంఖ్య 117కి పెరిగింది. ఇదంతా పాక్ ప్రభుత్వ కవ్వింపు చర్యల్లో భాగమేఅని అందరికి తెలుసు. మూడు సార్లు భారత్‌తో జరిగిన యుద్ధంలో పాక్ తోకముడిచినా తరచూ చొరబాట్లకు పాల్పడుతూ తలనొప్పులు సృష్టిస్తూ నియంత్రణ రేఖను అతిక్రమిస్తూనే ఉంది. ఇంతకీ పాక్ తరచూ ఇటువంటి పనికి పాల్పడడానికి కారణాలేమిటి అనేది ఆలోచిస్తే ఈ సమస్యను అర్థం చేసుకోవచ్చు. జమ్మూ- కాశ్మీర్ భారత్‌కు కీలకమైన ప్రాంతం. పాక్ కోరుకుంటున్న ప్రాంతం కూడా ఇదే. ఈప్రాంతలోని మెజారిటీ ప్రజలు తమతో కలవడానికి సిద్ధంగా ఉన్నారని పాక్ వాదిస్తూ దశాబ్దాలుగా భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. 1947లో రెండు దేశాలకు స్వాతంత్య్రాన్ని సాధించి, అప్పుడప్పుడే స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న కాలంలో కాశ్మీర్ రాజ్యం కోసం పోరు మొదలయ్యింది. దేశ విభజన సమయంలో నాటి పాలకులు సంస్థానాలకు ఒక వెసులుబాటు కల్పించారు. తమకు ఇష్టమైతే ఏ దేశంతోనైనా కలిసేందుకు వారికి స్వేచ్ఛ ఉందని ప్రకటించారు. కానీ కాశ్మీర్‌రాజు హరిసింగ్ స్వతంత్రం గా ఉండాలని నిర్ణయించు కున్నాడు.
కానీ పాకిస్థాన్ దురాక్రమణకు దిగడంతో చివరి క్షణంలో రాజు హరిసింగ్ భారత్ తో ఒప్పందం చేసుకొ ని కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేశాడు. దీంతో రంగంలోకి దిగిన భారత్ పాక్ సైన్యాన్ని తరిమికొట్టింది. పాక్ స్వంత భూభాగంలో లాహోర్‌ను దాటిపో యింది. భారత విజయం ఖాయమైన చివరి క్షణంలో అనుహ్యంగా నాటిప్రధాని నెహ్రు ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరాడు. ఆయన నిర్ణయం సరైనదా కాదా అన్నదానిపై భిన్నాభిప్రా యాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ ఆక్రమించిన కాశ్మీర్ భూభాగాన్ని వదిలేసి భారత్ ఏకపక్షంగా వెనక్కి తగ్గింది. చేతులారా పాక్ జుట్టును వదిలేసినట్లయింది. చివరికి యుద్ధంలో భారత్ గెలిచి కూడా ఓడినట్లయింది. 1948 డిసెంబర్ 31న రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. అప్పుడే నియంత్రణ రేఖను నిర్ధారించుకున్నాయి. 1965 ఆగస్టు 5న పాక్ మరోసారి కాశ్మీర్ కోసం యుద్ధానికి కాలుదువ్వింది. భారత బలాన్ని, బలగా న్ని ఆంచనా వేయలేక తోక ముడిచింది. కేవలం 20 రోజుల్లోనే ఆ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలోను ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొంది కానీ నియంత్రణ రేఖను సరిగ్గా నిర్ధారించలేక పోయింది.
1999 మేలో కార్గిల్ యుద్ధం మొదలైంది. కాశ్మీర్ ఆక్రమణ కోసం మరోసారి ప్రయత్నించి పాక్ చేతులు కాల్చుకుంది. ఆసియాలో అణుబాంబు కలిగి ఉన్న దేశాల మధ్య యుద్ధంగా ఇది చరిత్ర కెక్కింది. ‘లైన్ ఆఫ్ కంట్రోల్’ను దాటి పాక్ చొరబాటుదారులు భారత్‌లోకి చొచ్చు కొచ్చారు. లడక్ ప్రాంతాన్ని ఆక్రమించుకునేందుకు పాక్ ప్రయత్నించింది. దాంతో యుద్ధం తప్పనిసరైంది. జర్నల్ పర్వేజ్ ముషారప్ అత్యుత్సాహంతో జరిగిన ఆ యుద్ధంలో పాక్‌కు అంతర్జాతీ యంగా చివాట్లు తప్పలేదు.రాజకీయ సంక్షోభం, మార్చిలో జరగనున్న ఎన్నికలు, లాడెన్‌ను చంపించారన్న విమర్శలు, అమెరికాకు తొత్తుగా మారిందనే వ్యతిరేకత, అతివాదుల్లో, ఛాందస వాదుల్లో అసహనం- పాక్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కొవడానికి పాక్‌కు కనిపించిన సాకు కాశ్మీర్. దేశప్రజల్లో ఉన్న భారత వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునేందుకు ఉన్న ఒకే ఒక అవకాశం. సరిహద్దు కవ్వింపులు అందుకే అంటున్నారు రక్షణ నిపుణులు.ప్రజల దృష్టిని మళ్ళించేందుకు యుద్ధమొక్కటే మార్గంగా తోచింది. ఈ యుద్ధంతో భారత్‌ను అశాంతికి గురిచే యవచ్చునని భావిస్తోంది. గత యుద్ధాలు నేర్పిన పాఠాలతో ఇటు భారత్- అటు పాక్ అణ్వాయుధాల నిల్వలకోసం పరుగులు పెట్టాయి. ఈమధ్యే మనదేశం అగ్ని-5 అనే అత్యాధునిక బ్యాలెస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. 5 వేల కిలోమీటర్లలో లక్ష్యాల ను సైతం చేధించేలా దాన్ని తయారు చేశారు.
ఫోక్రాన్ ప్రయోగం తర్వాత భారత్ ఎన్నో ఆయుధాలను సమకూర్చుకుంది.గత యుద్ధాల్లో అస్తి నష్టం, ప్రాణ నష్టం తక్కువే కాని ఈ సారి యుద్ధం వస్తే నష్టం ఊహకు అందదు. కేవలం భారత్, పాక్ మాత్రమే యుద్ధంలో పాల్గొన్నా, రెండు దేశాల్లో ఏ ఒక్క దేశం అదుపు తప్పి అణు బాంబులు దారిమళ్ళినా కష్టమే అంటున్నారు నిపుణులు. మరోవైపు పాక్ మాత్రం హైదరాబాద్‌ను లక్ష్యం చేసినట్టు కనిపిస్తోంది. రక్షణలో కీలక రంగాలైన డిఆర్‌డిఎల్, డిఆర్‌డివోతో పాటు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరా బాద్‌లో కొలువుండడం పాక్ లక్ష్యానికి కారణం. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులుజరిగినా మూలాలు హైదరాబాద్‌లోనే బయట పడుతుండడం ఈ అనుమానాల్ని బలపరుస్తోంది. ఇన్నాళ్లు మనదేశానికి పరోక్షంగా మద్దతుఇచ్చిన అమెరికా ఈసారి జోక్యం చేసుకోనంటోంది. నిజానికి యుద్ధం వస్తే భారత్ ఎదురు నిలవగలదా? పాక్ నక్కజిత్తులకు చైనా ఎత్తులు తోడైతే పరిస్థితి ఏమిటన్నది అసలు సమస్య!
అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో ''ఆక్యూపై వాల్‌స్ట్రీట్'' తరహా ఆందోళనలు
ఉద్యమాల సెగ మధ్య ప్రాచ్చం నుండి పశ్చిమానికి మారింది. ఆరబ్ దేశాల నుంచి అమెరికా మీదుగా ప్రపంచవ్యాప్తం అవుతోంది. నిన్నటి ఉద్యమాల లక్ష్యం స్వేచ్ఛాగీతిక అయితే నేటి ఆందోళనల ఆశయం అసమానతలకు అంతం పలకడం. ప్రభుత్వాలను పెత్తందారీ పెద్ద చేతుల్లోంచి బైటకు తేవడమే నినాదంగా, స్వయం బందీలవడమే మార్గంగా మొదలైన ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. వేగంగా విస్తరిస్తూ విశ్వవ్యాప్తం అవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1500 నగరాలకు విస్తరించి విశేష ప్రజా మద్దతు కూడగట్టుకుంటూ పాలకుల్లో గుబులు పుట్టిస్తోంది. సమాధి అయిపోయిందనుకుంటున్న వాదాల వివాదాన్ని తట్టి లేవుతున్నాయి ఆ ప్రజాందోళనలు.
నిశ్శబ్దంగా మొదలై నిప్పులా రాజుకుంటున్న ''ఆక్యూపై వాల్‌స్ట్రీట్'' ఉద్యమం సరిగ్గా నెలరోజుల క్రితం సెప్టెంబర్ 17న అమెరికాలోని మాన్‌హట్టన్ లిబర్టీ స్వేర్ నుంచి ప్రారంభమైంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆర్థికశక్తులు, బహుళజాతీయ సంస్థల పెత్తనానికి నిరసన వారి ప్రధాన లక్ష్యం. వాల్‌స్ట్రీట్ పరిణామాలు ఆర్థికవ్యవస్థను ఎలా దెబ్బతీసి తరతరాల సంక్షోభాన్ని మిగుల్చుతున్నవైనాన్ని బహ్య ప్రపంచానికి తెలియ చెప్పడమే ఆశయం.
''ఆక్యూపై వాల్‌స్ట్రీట్'' పేరుతో నెల రోజుల క్రితం కేవలం కొద్ది డజన్ల మందితో ప్రారంభమైన ఆందోళన ఇపుడు ప్రపంచ స్థాయి ఆందోళనగా మారింది. రెండు వారాలకే అమెరికా అంతటా పాకిన ఆందోళనలు ఆ తర్వాత యూరప్ దేశాలకు కూడా విస్తరించాయి. ఇప్పుడు జపాన్ నగరం టోక్యోకు పాకి ''టోక్యోను ఆక్రమిద్దాం'' అంటూ జననీయులు నినదిస్తున్నారు. ఈజిప్ట్, తెహ్రీ స్క్వేర్ నిరసనల స్ఫుర్తితో సెప్టెంబర్ 17న ఒక్కసారిగా 2 వేల మంది ఆందోళనకారులు మాన్‌హట్టన్ వీధుల్లోకి వచ్చారు. సంపన్నుల కాలనీ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. 'అక్కడో జూకోటి పార్క్' వద్ద డేరాలు వేసుకుని శాంతియుత ఆందోళన ప్రారంభించారు. ''వుయ్ ఆర్ 99%'' పేరున ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రదర్శనలే కాక సామాజిక సంబంధాల వెబ్‌సైట్లలో ప్రచారం హోరెత్తించారు. ఉద్యోగాలు కోల్పోయి, సౌకర్యాలకు కోతపడి, దిక్కుతోచని స్థితితో ఉన్న లక్షలాది మంది ప్రజలు దానివైపు ఆకర్షితులు కావడానికి అట్టే సమయం పడ్డలేదు. అమెరికా స్టాక్ మార్కెట్లు, బహుళజాతి సంస్థల కేంద్రం వాల్‌స్ట్రీట్‌ను ఆక్రమిద్దాం అన్న నినాదంతో రోజురోజుకీ ఆందోళనకారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. సామాన్యులు, కార్మి సంఘాలు, సెలబ్రిటీల నుంచి సంఘీభావమూ పెల్లుబికీంది. రోజుల వ్యవధిలోనే అమెరికా నుంచి ఇతర దేశాలనూ ఊపేయడం ప్రారంభమైంది. లండన్, జర్మనీ, రోమ్, హంగ్‌కాంగ్‌లను ఆ వేడి తాకింది.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం పేరు చెప్పి ట్రిలియన్ల కొద్దీ ప్రజా ధనాన్ని ''బెయిలౌట్'' లుగా వాల్‌స్ట్రీట్ కంపెనీలకు పందేరం పెట్టిన సంగతి విదితమే. తీరా ఆ డబ్బంతా అమెరికా, యూరప్ దేశాలపైన అప్పుగా పేరుకుపోయింది. 'బడ్జెట్‌లోటు' తగ్గించాలనీ, 'అప్పుభారం' తగ్గించాలని చెబుతూ 'పొదుపు విధానాల' పేరున కంపెనీలకి పంచిన డబ్బుని ప్రజల వద్ద నుండే వసులు చేయడానికి అమెరికా యూరప్‌ల ప్రభుత్వాలు పూనుకున్నాయి. తమ సంబంధం లేని అప్పును తమపైన భారంగా వేయడానికి వ్యతిరేకంగా అమెరికన్లు నెలరోజులనుండి ఉద్యమిస్తున్నారు. అమెరికా, యూరప్ తదితర దేశాలలో ప్రారంభమైన ఆందోళనలు అక్కడి బ్యాంకర్లకు, రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. అయితే వివిద దేశాలలో జరుగుతున్న ఈ ఆందోళనలు కొన్ని చోట్ట చిన్న చిన్నవిగా ఉంటున్నాయి. కొన్ని చోట్ట రోడ్లలో ట్రాఫిక్కును ఆపగల శక్తిగా కూడా ఉంటున్నాయి. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో త్వరలో జరగనున్న ప్రదర్శనలో కనీసం 1 లక్ష మంది పాల్గోంటారని నిర్వాహకులు చెబుతున్నారు.
''ప్రపంచ స్థాయిలోనే ప్రభుత్వ అప్పు మనం ఏ మాత్రం భరించలేని స్థాయికి చేరుకుంది. దోపిడీ ప్రభుత్వాలు, అవినీతి బ్యాంకులు, స్పెక్యులేటర్లు కలిసి కూడబెట్టిన ఈ అప్పు ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేనిది. భారాన్ని ప్రజలపై వేస్తూ కూడా ప్రజల గురించి ఏ మాత్రం పట్టించుకోరు వీళ్ళు'' అని ప్రదర్శనకు హాజరవుతున్న యువతులు చెప్పినట్లుగా రాయిటర్స్ తెలిపింది. ''వాళ్ళు ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని తీసుకొచ్చారు. సంక్షోభం నుండి కూడా వాళ్ళు లాభాలు దండుకుంటున్నారు. వాళ్ళే ఇదంతా చెల్లించాలి'' అని ప్రదర్శనకు హాజరవుతున్న వారు నినదిస్తున్నారు.
న్యూయార్క్ నగరంలో ఓ ప్రైవేటు పార్కులో గుడారాలతో తిష్టవేసిన ఉదాహరణని ఇటలీ ఆందోళన కారులు అనుకరిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇటలీ ప్రధాన కార్యాలయం ప్రక్కన గత 20 రోజులుగా రోమ్ ఆందోళన కారులు తిష్టవేసి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇటలీ ప్రభుత్వం 60 బిలియన్ యూరోల పొదుపు ఆర్థిక పథకానికి ఇటలీలోని బెర్లుస్కోని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని వలన పన్నులు పెరగనున్నాయి. ప్రజారోగ్యం మరింత ప్రియం కానున్నది. గత శుక్రవారం అతిపెద్ద వాల్‌స్ట్రీట్ బ్యాంకు ''గోల్డ్‌మేన్ సాచ్' కి చెందిన మిలన్ ఇటలీ శాఖపైన ఆందోళనకారులు దండెత్తి గోడల నిండా నినాదాలతో నింపారు. ఇటలీలో అతి పెద్ద బ్యాంక్ 'యూనిక్రెడిట్'' ప్రధాన కార్యాలయంపై మరికొంత మంది కోడిగుడ్లు విసిరి తమ కోపం తీర్చుకోవడానికి ప్రయత్నించారు.
న్యూజిలాండ్‌లో పెద్ద నగరం ఆక్లండ్‌లో ప్రధాన వీధిలో కొన్ని వందలమంది ప్రదర్శన నిర్వహించి అప్పటికే అక్కడ ఉన్న మూడువేల మందితో చేరిపోయారు. డ్రమ్ములు, నినాదాలతో హోరెత్తించారు. వెల్లింగ్టన్‌లో రెండోందలమంది. క్రైస్ట్ చర్చ్ నగరంలో యాభైమంది ప్రదర్శన జరిపారు. ఫిలిప్పైన్ రాజధాని మనీలాలలోనూ ఆందోళన కారులు ప్రదర్శన నిర్వహించారు. అమెరికా ఎంబసీ వద్ద ప్రదర్శన జరిపి ''అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి'', ''ఫిలిప్పైన్ అమ్మకానికి లేదు'' అని నినదించారు. బ్యానర్లు ప్రదర్శించారు. తైవాన్ రాజధాని తైపి స్టాక్ ఎక్చేంజి వద్ద వందలాంది మంది ప్రదర్శన నిర్వహించారు. ''మేము తైవాన్‌లో 99 శాతం'' అని నినదించారు. అర్థికవృద్ధి కంపెనీలకే లాభించిందని వారు తెలిపారు. మధ్యతరగతి వేతనాల వలన ఇల్లు, విద్య, ఆరోగ్యం ఖర్చులు ఏమీ నడవడం లేదని వాపోయారు.
లండన్‌లో ప్రదర్శనకారులు ''ఆక్యూపై స్టాక్ ఎక్ఛేంజ్'' ఆందోళన నిర్వహించారు. లండన్‌లో ప్రతిరోజు అన్ని రంగాల ప్రజలు తమతో చేరుతున్నారని లండన్ ఆందోళనకారులు చెబుతున్నారు. వీరు నిర్వహిస్తున్న ఫేస్‌బుక్ పేజీకి ఇప్పటికే 12,000 మంది ఫాలోయర్లు రిజిస్టర్ అయ్యారని రాయిటర్స్ తెలిపింది. ''ద్రవ్య వ్యవస్థ'' తమ టార్గెట్ అని వారు చెబుతున్నారు. ''ఇప్పటి వరకు జరిగింది చాలు'' అని వారు నినదిస్తున్నారు. గ్రీకు ఆందోళనకార్లు శనివారం ''పొదుపు విధానాల వ్యతిరేక దినం'' జరపాలని పిలుపునిచ్చారు. ''గ్రీకు ప్రజలు ఈ రోజు ఎదుర్కొంటున్న పరిస్థితే త్వరలో ఇతర దేశాల ప్రజలకు కూడా పీడకలగా ఎదురుకానున్నది. పరస్పర సహకారమే ప్రజల శక్తివంతమైన ఆయుధం'' అని ''రియల్ డెమోక్రసీ'' సంస్థకు చెందినవారు ప్రకటించారు. ప్యారిస్‌లో జి 20 సమావేశాల సందర్భంగా తమ ప్రదర్శనలు నిర్వహించాలని ఫ్రాన్సు ఆందోలనకారులు పథకం వేసుకున్నారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఏడు చోట్ల మార్చ్‌లను నిర్వహించాలని పథకం వేసుకున్నారు. ఆ ఆందోళనలన్నింటా కొట్టవచ్చినట్లు ఒక లోపం కనిపిస్తున్నది. వీరిలో ఎవరికీ నిర్థిష్టమైన డిమాండ్లు లేవు. డిమాండ్లు ఉండాలన్న విషయాన్ని కూడా వీరు పట్టించుకోవడం లేదు. అమెరికాలో ఆందోళనకారులను డిమాండ్లు ఏమిటని ప్రశ్నిస్తున్నప్పటికీ వారు చెప్పడానికి నిరాకరిస్తున్నారు. ఈ ఆందోళనల వెనుక సోరోస్ అన్న అమెరికా ధనికుడు ఉన్నాడని ఇప్పటికే పుకార్లు వెల్లువెత్తాయి. ఆయన తనకు సంబంధం లేదని కూడా ప్రకటించినా అవి ఆగలేదు.
మార్కెట్ ప్రతికూలతల పేరు చెప్పి రోజూ వేలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు, వేలకోట్ల డాలర్ల పొదుపు మంత్రాలు. ఏ దేశంలో చూసినా 1% కూడా మించని కొందరి పెట్టుబడి దారుల రక్షణ కోసమని ప్రభుత్వాల విపరీత హైరనా. ఏడాది ప్రారంభం నుంచీ అదే తంతు. రెండో మాంద్యం ఛాయలన్న సంకేతాలతో ఎడాపెడా కోతలు మొదలు పెట్టారు. బ్యాంకులు, బహుళజాతి సంస్థలకు మాత్రం బారీ ఉద్ధీపనలు ఇచ్చి సామాన్యులను వారి చావుకు వాళ్లనే వదిలేశారు. ఆ క్రమంలో రోడ్డున పడ్డ లక్షలాది మంది బాధితుల గోడు ఎవరికి పట్టాలి? ఫలితం కడుపు రగిలిన అదే సామాన్యులు ఉద్యమ బాట పట్టారు. అయితే వీరి ఆందోళనకు నిర్థిష్ట డిమాండ్లంటూ ఏం లేవు. డిమాండ్లు లేని ఆందోళనలు ఉండడమే ఆశ్చర్యకరం. బ్యాంకులకు ఉద్ధీపనలు, పొదుపుమంత్రం, ధనవంతుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడమే వారి ప్రాథమిక ఉద్దేశం. బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు తదితర ద్రవ్య కంపెనీల అత్యాశ. ప్రజలను పన్నుల భారాలు కుంగదీస్తున్నాయని చెబుతున్నప్పటికీ సంబంధిత డిమాండ్లు ముందు పెట్టడం లేదు. పది సంవత్సరాల క్రితం ఉప్పెనలా విరుచుకుపడిన వరల్డ్ సోషల్ ఫోరం కూడా ఇదేరీతిన ఎగసి చప్పున చల్లారింది. అప్పట్లో కూడా దారితెన్నూ లేకుండా నమావేశాలు, మహాసభలు జరిగాయి. బడా కంపెనీల నిధులతోనే అవి జరిగాయనీ, ప్రజాగ్రహాలను పక్కదారి పట్టించడానికే అవి జరిపారని ససాక్ష్యాలతో కొంతమంది రుజువు చేశారు కూడా. అయితే అభివృద్ది చెందిన దేశాలలో జరుగుతున్న ఇప్పటి ఆందోళనలు కూడా అవే కోవలోకి వస్తాయా అన్నది కొంతకాలం పోతే గాని వెల్లడి కాదు. అంతవరకు వేచి చూడాల్సిందే.
అగ్రకులతత్వంతో అధ్యాపక స్పందన
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అధ్యాపకులను, అధికారులను మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు అనేక సార్లు అవమానించి, భౌతిక దాడులకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేసినప్పుడు ఔటా నాయకులు ఎందుకు స్పందించలేదు? అనేక మంది ప్రొఫెసర్లపై మతోన్మాద విద్యార్థులు దాడులకు పాల్పడినప్పుడు రాజీనామాలు చేయని అగ్రవర్ణ డీన్‌లు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఇప్పుడే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారో వివరించాలి.
భ్రష్ఠత్వానికి పరాకాష్ట (డిసెంబర్ 20, ఆంధ్రజ్యోతి) అన్న వ్యాసంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఉపాధ్యాయునిపై ఒక విద్యార్థి దాడిచేసిన విషయాన్ని ఖండిస్తూ అఖిలేశ్వరి గారు చర్చను లేవనెత్తారు. ఆ వ్యాసంలో లేవనెత్తిన విషయాన్ని కాస్త సీరియస్‌గా పరిశీలిస్తే ఆ వ్యాసకర్తలో ఎక్కడో ఒక దగ్గర అగ్రకుల భావజాలం పనిచేసిందనేది స్పష్టమౌతుంది. ఎందుకంటే మొన్న విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనను వ్యాసకర్త ఖండిస్తూ పరుషమైన పదజాలంతో విమర్శిస్తూ ఒక వర్గం విద్యార్థులపై విరుచుకపడి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 'మన కళ్లముందే జరుగుతున్న విషాదానికి మనమందరమూ బాధ్యత వహించాలని, ఇది యావత్ సమాజాన్ని దిగజారుస్తోంది, సమాజంలోని ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోందని' ఆవేదన వ్యకం చేశారు. సమాజంలోని ప్రతి వ్యవస్థను విచ్ఛిన్నం చేసే స్థాయిలో ఆ ఘటన జరిగిందా అనేది సీరియస్‌గా చర్చించాలి. నిజానికి ఉపాధ్యాయునిపై దాడి జరగడానికి కారణాలు ఏమిటనేది ఆలోచించకుండా చర్చలు లేవనెత్తితే విషయం పక్కదారి పట్టి, ఒక వర్గం విద్యార్థులను అపార్థం చేసుకొనే అవకాశం ఉంటుంది. అఖిలేశ్వరి గారి చర్చ అలాగే ఉంది. మొన్న విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయునిపై జరిగిన దాడిని అక్కడ ఉన్న విద్యార్థులందరూ ఖండించారు. దాడికి పాల్పడిన అలెగ్జాండర్ అనే విద్యార్థి వైస్ ఛాన్స్‌లర్ ముందే ఆ ఉపాధ్యాయునికి క్షమాపణలు కూడా చెప్పాడు. తను ఏ బలహీన క్షణంలో దాడికి పాల్పడిందీ వివరించాడు.
గతంలో తన సోదరి స్నేహితురాలు ఉపాధ్యాయుని వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుర్తొచ్చి తాను భావోద్వేగానికి గురయ్యానని వివరించాడు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు. ఇంత జరిగాక తన తప్పును ఒప్పుకున్న విద్యార్థిని పెద్దమనసుతో క్షమించాల్సిన ఉపాధ్యాయులు ర్యాలీలు తీస్తూ, మీడియాకు ఎక్కుతూ, ఈ దాడులకంతటికీ ఒక వర్గం విద్యార్థులే కారణం అంటూ దుష్ప్రచారం చేయడం ఆ వర్గాల విద్యార్థులను అవమానించడమే అవుతుంది. నిజానికి దాడికి పాల్పడిన విద్యార్థికి కానీ, ఆ ఘటన సందర్భంగా అక్కడ ఉన్న విద్యార్థులకు కానీ గతంలో ఉపాధ్యాయులను వేధించిన చరిత్ర కానీ, దాడులు చేసిన చరిత్రకానీ లేదు. ఈ ఘటన జరిగిన తర్వాత దాడికి గురైన అధ్యాపకుడు, నాపై దాడికి పాల్పడిన విద్యార్థి క్షమాపణలు చెప్పడం, అరెస్టు కావడం జరిగింది కనుక ఇంతటితో నేను ఈ విషయాన్ని వదిలేస్తున్నానని చెప్పాడు. యూనివర్సిటీలోని మెజారిటీ అధ్యాపకులు కూడా ఈ విషయాన్ని ప్రొఫెసర్, విద్యార్థులు కూర్చొని సామరస్యపూర్వకంగా చర్చించుకోవాలని కూడా సూచిస్తున్నారు. కానీ తమ స్వప్రయోజనాలను రక్షించుకొనేందుకు ఔటా నాయకులు ఆ దాడిని ఒక సాకుగా తీసుకొని అగ్రవర్ణ భావజాలంతో ర్యాలీలు తీస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య వైషమ్యాలు పెంచి తమ ప్రయోజనాలకోసం వాడుకుంటున్నారు.
అయితే గతంలో ఇదే విశ్వవిద్యాలయంలో కొందరు ప్రొఫెసర్స్‌పై విద్యార్థులు దాడులకు పాల్పడిన సంఘటనలపై ఈ అధ్యాపకులుగానీ, ఉపాధ్యాయ సంఘం(ఔటా)గానీ స్పందించిన తీరును కూడా చర్చించాలి. మరికొద్ది సంవత్సరాల్లో ప్రథమ శతాబ్దిని పూర్తిచేసుకోబోతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనేకమంది బడుగు, బలహీన వర్గాల ఉపాధ్యాయులు ఒక అగ్రవర్ణ విద్యార్థి సంఘం చేతిలో అనేక అవమానాలు, దాడులకు గురయ్యారు. గతంలో ఆర్ట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన ఒక ప్రొఫెసర్‌పై అగ్రవర్ణ విద్యార్థి సంఘానికి చెందిన కొందరు విద్యార్థులు దాడిచేసి ఆయనను గాయపరచడం జరిగింది. అంతేకాకుండా ఆ ప్రొఫెసర్ భార్యను, కూతురును అవమానిస్తూ కావేరి హాస్టల్ గోడలపై రాతలు రాశారు. ఆయన తోటి ఉపాధ్యాయుల దగ్గర తన బాధను, తనకు జరిగిన అవమానాన్ని వివరించాడు. కానీ ఆ ప్రొఫెసర్‌కు ఏనాడూ ఉపాధ్యాయ సంఘం (ఔటా) మద్దతు తెలుపలేదు. ర్యాలీలు తీయలేదు. దాడికి పాల్పడి, అవమానించిన విద్యార్థి సంఘంపై చర్యతీసుకోలేదు. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో చీఫ్ వార్డన్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ కేశవులును అగ్రవర్ణ విద్యార్థి సంఘం తమ కార్యక్రమాల కోసం చందాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అందుకు అంగీకరించని ప్రొఫెసర్‌పై ఆ విద్యార్థి సంఘ నాయకులు ఆయనపై 'సాంబారు' పోసి కొట్టి, అవమానించారు. తనకు జరిగిన అవమానానికి నిరసనగా ప్రొఫెసర్ కేశవులు ఆనాడు ధర్నా నిర్వహించారు, బాధ్యులపై చట్టపరమైన చర్య తీసుకోవాలని వీసీకి మొరపెట్టుకున్నారు. ఒక ఎస్సీ ప్రొఫెసర్‌పై దాడులకు పాల్పడిన విద్యార్థులపై చర్య తీసుకోవాలని యూనివర్సిటీలో వామపక్ష, ఎస్టీ, ఎస్టీ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఆనాటి వీసీ కానీ ఔటా కానీ చర్య తీసుకోవాలని డిమాండ్ చేయలేదు. ఇదే యూనివర్సిటీలో లా కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న గిరిజన ప్రొఫెసర్ పంతునాయక్‌ను ఏబీవీపీ విద్యార్థి సంఘానికి చెందిన విద్యార్థులు చెప్పులతో కొట్టి, అవమానించినా ఏనాడూ కనీసం ఔటా నాయకులు ఖండించనూలేదు. మైనారిటీ వర్గానికి చెందిన ఒక ప్రొఫెసర్ తన విద్యార్థినితో క్లాస్ రూంలో సబ్జెక్ట్ విషయమై చర్చిస్తుంటే ఇదే మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు ఉపాధ్యాయునికి, విద్యార్థికి మధ్య లైంగిక సంబంధాన్ని అంటగట్టి అవమానించి కొట్టడం జరిగింది.
మొన్నటికి మొన్న ఆర్ట్స్ కాలేజీలో ఏబీవీపీకి చెందిన ఒక విద్యార్థి మాస్ కాపీయింగ్‌కు పాల్పడితే మందలించిన లేడీ ప్రొఫెసర్‌ను ఆ విద్యార్థి దుర్భాషలాడి, అవమానిస్తే ఆ ప్రొఫెసర్ ఎగ్జామ్ హాల్ నుంచి ఏడ్చుకుంటూ నిష్క్రమించింది. ఇలాంటి ఘటనలు విశ్వవిద్యాలయంలో గత కొన్నేళ్లలో అనేకం జరిగినప్పటికీ ఏనాడూ ఖండించని ఔటా నాయకులు, అధికారులు మొన్న జరిగిన ఘటనను మాత్రం పెద్దది చేసి ఒక వర్గం విద్యార్థులను శత్రువులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే మేము యూనివర్సిటీ అధికారులను, ఔటా నాయకులను ప్రశ్నిస్తున్నాము. యూనివర్సిటీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అధ్యాపకులను, అధికారులను మతోన్మాద విద్యార్థి సంఘ నాయకులు అనేక సార్లు అవమానించి, భౌతిక దాడులకు పాల్పడి, భయభ్రాంతులకు గురిచేసినప్పుడు ఔటా నాయకులు ఎందుకు స్పందించలేదో వివరించాలి. అనేక మంది ప్రొఫెసర్లపై మతోన్మాద విద్యార్థులు దాడులకు పాల్పడినప్పుడు రాజీనామాలు చేయని అగ్రవర్ణ డీన్‌లు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఇప్పుడే ఎందుకు రాజీనామాలు చేస్తున్నారో వివరించాలి.
అనేక సందర్భాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధ్యాపకులు దాడులకు గురైతే ఈ ఔటా నాయకులు ఎందుకు ర్యాలీలు తీయలేదో, మానవహక్కుల కమిషన్‌ను ఎందుకు ఆశ్రయించలేదో వివరించాలి. దాడులకు గురైన ప్రొఫెసర్లు యూనివర్సిటీ ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా ఏనాడూ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వని రిజిష్టార్ ఇవాళ ఎస్సీ వర్గానికి చెందిన ఒక విద్యార్థి అగ్రవర్ణ ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడితే యూనివర్సిటీ అధికారులంతా ఆగమేఘాలమీద స్పందించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే యూనివర్సిటీ అధికారుల నిజస్వరూపం, అగ్రవర్ణ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొఫెసర్లపై జరిగిన దాడికి ఆ విద్యార్థి క్షమాపణలు చెప్పి, పోలీసుల ఎదుట స్వచ్చందంగా లొంగిపోయినప్పటికీ ఔటా నాయకులు ఆ విషయాన్ని అంతటితో వదిలి పెట్టకుండా మానవహక్కుల సంఘాన్ని, గవర్నర్‌ను కలుస్తూ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కదోవ పట్టిస్తున్నారు. యాదృచ్ఛికంగా జరిగిన ఆ ఘటనను ఖండిస్తూనే కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులతో, ప్రిన్సిపాల్‌తో చర్చించి, యూనివర్సిటీలో సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయాలని ఒకవైపు ప్రయత్నిస్తున్నారు. ఔటా నాయకులు మాత్రం విద్యార్థుల ప్రతిపాదనను తోసిపుచ్చుతూ విషయాన్ని మరింత జఠిలం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
యూనివర్సిటీలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్యవర్తిత్వం వహించాల్సిన ఉపాధ్యాయులు, బాధ్యత కలిగిన అఖిలేశ్వరి లాంటి వ్యక్తులు సమస్యను సరిగ్గా అర్థం చేసుకోకుండా దానిని ఇంకా జటిలం చేస్తే ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయో ఆలోచించాలి. ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులను సన్నిహితంగా గమనిస్తున్న అఖిలేశ్వరి గారు విద్యార్థులు ఉపాధ్యాయుడిపై దాడిచేయడం, పార్లమెంట్‌పై ఉగ్రవాదులు దాడిచేయడం కంటే తక్కువేమీ కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఒక విద్యార్థి భావోద్వేగానికిలోనై ఒక ప్రొఫెసర్‌పై దాడికి పాల్పడితే ఆ ఘటనను ఉగ్రవాద చర్యతో పోల్చడం ఏవిధంగా సరైనదో అఖిలేశ్వరిగారే విజ్ఞతతో ఆలోచించుకోవాలి. సమాజం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దాని నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపంచి, పరిష్కారాన్ని కనుగొనాల్సిన బాధ్యత మేధావివర్గంపై ఉంటుంది. కానీ మేధావులుగా పిలవబడుతున్న విశ్వవిద్యాలయ అధ్యాపకులు సమస్యను జటిలం చేస్తూ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తే దీనిద్వారా ఎవరి ప్రయోజనాలు నేరవేరుతాయో విజ్ఞులే ఆలోచించాలి.
డేవిడ్, వంగపల్లి శ్రీనివాస్, కంతి జగన్, మర్పల్లి ఆనంద్
రీసెర్చ్ స్కాలర్స్, ఉస్మానియా విశ్వవిద్యాలయం
డేవిడ్, వంగపల్లి శ్రీనివాస్, కంతి జగన్, మర్పల్లి ఆనంద్
హక్కుల్ని కాలరాస్తున్న ప్రభుత్వాలు
మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో సుమారు 700 తెగలకుచెందిన 9 కోట్ల మందికి పైగా ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు. వీరిలో 92 శాతానికి ప్రధాన జీవనాధారం అటవీ భూములే. మన రాష్ర్టంలో 30 తెగలకు చెందిన ఆదివాసులు, మరో ఐదుతెగలకు చెందిన మైదాన ప్రాంతవాసు లు- 60 లక్షల మందికి పైగా 9 జిల్లాలోని షెడ్యూలు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. రాజ్యాంగ పరంగా షెడ్యూలు 5,6లలో ప్రత్యేక రక్షణలు కల్పించిన ఆది వాసుల జీవనం నేడు పెనుసంక్షోభాన్ని ఎదుర్కొంటు న్నది. మైదాన ప్రాంత షావుకార్ల, వడ్లీవ్యాపారుల మోసాలకు, అన్యాయాలకు, దోపిడీ దౌర్జన్యాలకు, ఫారెస్టు అధికారుల వేధింపులకు గురౌతూ ఆదివాసులు మనుగడకోసం, మెరుగైన జీవనంకోసం పోరాతున్నారు.
ఈ సమస్యలన్నింటికీ తోడు వేలాది, లక్షలాది ఎకరాల అటవీ భూములను పరిశ్రమల స్థాపన పేరిట, ప్రాజెక్టుల నిర్మాణం పేరిట, గనుల తవ్వకం పేరిట బడా, బహుళజాతి, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టటం ద్వారా వారిని అడవుల నుండి శాశ్వతంగా దూరం చేసేందుకు పాలకులు పూనుకున్నారు. ప్రభుత్వాలులు గత ఆరున్నర దశాబ్దాలుగా చేపడుతున్న విధానాల ద్వారా ఆదివాసులకు కల్పించామన్న రక్షణలన్నింటినీ గత రెండు దశాబ్దాలుగా ఒక్కొక్కటిగా తొలగించివేస్తున్నారు.శ్రీకాకుళ గిరిజన రైతాంగఉద్యమానంతరం అటవీ ప్రాంతంలో ఆదివాసుల భూమిహక్కును నామమాత్రంగానైనా పరిరక్షించే 1/70 చట్టాన్ని రాష్ర్టప్రభుత్వం చేసింది. ఈ చట్టాన్ని నీరుగారుస్తూ వచ్చిన ప్రభుత్వాలన్నీ, అటవీ భూములను గిరిజనేతర భూస్వాముల పరం చేయడంతో పాటు, పెద్దఎత్తున బడా పారిశ్రామిక సంస్థలకు కట్టబెడుతూ వచ్చాయి. ఆదివాసుల స్వయంపాలనలో గ్రామసభలకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తూ 1996లో ‘పంచాయితీరాజ్ గిరిజన ప్రాంతాల విస్తరణ చట్టం’ (పెసా) తెచ్చింది. 15 సంవత్సరాల తర్వాత ఇటీవల ప్రభుత్వం దాని అమలుకు నిబంధనలు రూపొందించడంలోనే- ఆదివాసుల హక్కుల అధికారాలను పంచాయితీలకు, మండల పరిషత్తులకూ కట్టబెట్టింది. తద్వారా ఆదివాసుల అటవీభూములను అన్యాక్రాంతంచేసే చర్యలను వేగవంతం చేసింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారమే లక్షఎకరాల అటవీభూములను ఆక్రమించుకుని అనుభవిస్తు న్నారని ప్రభుత్వం నియమించిన గిర్‌గ్లానీ కమిటీ వెల్లడించేసింది. కోనేరు రంగారావు భూ కమిటీ ఆదివాసుల భూముల దురాక్రమణను ప్రధానంగా ప్రస్తావించింది. ప్రపంచీకరణ విధానాలను అమలుచేయటం ప్రారంభమైన తర్వాత అదివాసుల జీవనం ‘పెనం మీదనుండి పోయ్యిలో పడిన’ చందం అయ్యింది. విదేశీ, సామ్రాజ్యవాద బడా కంపెనీలు విచ్చలవిడిగా అడవులలోని భూగర్భ, ఉపరితల సహజ సంపదలన్నింటినీ కొల్లగొట్టు కెళ్ళేందుకు పాలకులు అన్నిరకాల అనుమతు లూ ఇచ్చివేస్తున్నారు. విద్యను అందని ద్రాక్షగా మార్చి కార్పొరేటీకరించిన పాలకులు మరో చేత్తో విద్యాహక్కు చట్టం చేసిన విధంగానే; వైద్యాన్ని ఖరీదైన అంగడిసరుకుగా మార్చిన పాలకులే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలతో భ్రమలు కల్పిస్తున్నట్లుగానే; ఆహార భద్రతచట్టం అంటూనే ఆదివాసుల హక్కులన్నింటినీ హరించి వేస్తున్న పాలకులు, ఆదివాసీహక్కుల చట్టం-2006 పేరిట మరో చట్టాన్ని ముందుకు తెచ్చారు.అటవీ ఉత్పత్తులు సేకరించి సంతల్లోనో, ఐటిడిఏ ద్వారానో అమ్ముకుంటూ, పోడు వ్యవసాయం చేసుకుంటూ సాప్రదాయక ఆదివాసుల జీవనం సాగిస్తూ వస్తున్నారు. తాము వ్యవసాయంచేస్తున్న ప్రాంతంలో భూసారం తగ్గాక మరో ప్రాంతాన్నెంచుకొని వ్యవసాయం చేయటమనే పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. అయితే వీరు సాగుచేసుకుంటున్న అటవీ భూములకు చట్టబద్ధ పట్టాలను, వాటిపై మరొకరి ఆధిపత్యాన్ని ఎరగరు. పాలకులు తీసుకువచ్చిన ఆదివాసీ హక్కుల చట్టం వీరికి అదనంగా హక్కులు కల్పించకపోగా, సాంప్రదాయకంగా అడవిపై సంక్రమించిన హక్కులను హరించివేయటానికే మరోరూపంలో పూనుకున్నది. ఒక్కో ఆదివాసీ కుటుంబానికి 5 ఎకరాల నిర్దిష్ఠ, నిర్ణీత అటవీ భూమిపై ప్రభుత్వ పట్టానిచ్చి, వారిని శాశ్వతంగా అక్కడివరకే కట్టడి చేయబూనుకోవడం ఈచట్టం అసలు ఉద్దేశ్యం. తద్వారా పాలకులు, మిగిలిన అటవీ భూములన్నింటినీ యథేచ్ఛగా దోపిడీ వర్గాలకు కట్టబెట్టేందుకు చట్టపరంగా వెసులుబాటు పొందే ఆలోచన దీని వెనుక దాగిఉంది.సమతా కేసులో సుప్రీంకోర్టు 1/70ని పునరుద్ఘాటిస్తూ ఏజన్సీ ప్రాంత భూములను గిరిజనేతరులకు ఇవ్వరాదని పేర్కొన్నది. పాలకులు ఈ తీర్పును నీరుగార్చుతూ వచ్చారు. ఏజన్సీ ప్రాంత భూములు ప్రభుత్వ ఆధ్వర్యంలో వినియోగిస్తున్నట్లుగా నాటకమాడి జిందాల్ వంటి వివిధ సంస్థలకు కట్టబెడుతూ వస్తున్నారు. ఈ విధానాలకు, చర్యలకు వ్యతిరేకంగా తీవ్రనిర్బంధాన్ని, అణచివేతలను ఎదుర్కొంటూ దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు ముందుకు సాగుతున్నారు. ఒరిస్సాలోని కళింగ నగర్‌లో తమ భూములను ఆక్రమించి నిర్మిస్తున్న టాటా ఉక్కు కర్మాగార స్థాపనను నిరసించిన ఆదివాసులపై ప్రభుత్వం కాల్పులు జరిపి 12 మందిని బలిగొంది.‘పోస్కోకు ‘వేదాంత’ కోసం అటవీ భూఆక్రమణలకు వ్యతిరేకంగా ఆదివాసులు పోరాటం సాగిస్తున్నారు. మన రాష్ర్టంలోని విశాఖ జిల్లా చింతపల్లి ఏజన్సీలోని బాక్సైట్ గనుల తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కన్నెధారకొండ మైనింగ్ లీజుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో 9 మండలాల పరిధిలోని 276 ఆదివాసీ గ్రామాలకు చెందిన లక్షాయాభైవేల మందిని నిర్వాసితుల్ని చేసేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఉభయగోదావరి, ఖమ్మం జిల్లాల్లోని ఆదివాసులు బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ‘ఆడవికి ఆడవి’, ‘భూమికి భూమి’ నినాదంతో ఉద్యమిస్తున్నారు.ఆదివాసుల జీవనాన్ని ఈ విధంగా విధ్వంసం చేయడంతో పాటు, వారి సంస్కృతిని, జీవన విధానాన్ని కూడా కనుమరుగుచేసేందుకు పాలకులు విష సాంస్కృతిక దాడిని తీవ్రం చేశారు. గత రెండు దశాబ్దాల కాలంలో సామ్రాజ్యవాద సాంస్కృతిక మాధ్యమాలను ఆదివాసుల మధ్యకు జొప్పిస్తున్నారు.ఆధునిక సౌకర్యాల పేరిట, విద్యుత్తు వెలుగుల మాటున వినోదం, విజ్ఞానం బదులుగా వస్తు వ్యామోహ సంస్కృతితో ముంచెత్తుతున్నారు. టీవిలను, సెల్‌ఫోన్లను ఆదివాసులకు కూడా అందుబాటులోకి తేవడమే వారి అభివృద్ధికి నిదర్శనంగా పాలకవర్గ మేధావులు పేర్కొంటున్నారు. ఆగస్టు 15, జనవరి 26ల సందర్భంగా మువ్వన్నెల జెండాలను ఎగురవేసి దళిత, పీడిత, తాడిత ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యంగా గొంతుచించుకొనే పాలకులు, ఆదివాసీల సంక్షేమానికి చేపడుతున్న విధానాలు, చర్యలు శూన్యమని స్పష్టమవుతున్నది. ఆదివాసుల విద్య, వైద్యం, సంక్షేమం కోసం కేటాయించిచే నిధులనుకూడా కుదించివేస్తున్నారు. రాష్ర్ట బడ్జెట్‌లో గిరిజన సబ్‌ప్లాన్‌క్రింద 6.6 శాతం నిధులను ఖర్చుచేయాలి. కానీ కేటాయించిన నిధులనైనా వెచ్చించకుండా ఇతరేతర పద్దులలోకి దారి మళ్ళిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆదివాసుల్లో 50 శాతం మందికి కనీస పౌష్ఠికాహారం అందడం లేదు. మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత, పౌష్ఠికాహార లోపం కారణంగా పురిట్లోనే ప్రాణాలు విడుస్తున్న పసిబిడ్డల సంఖ్య అత్యధికంగా ఉంది. ప్రతి వెయ్యి మంది శిశువులకు శిశు మరణాలు150 నుండి 250 వరకూ ఉంటున్నాయి. అత్యధిక ఆదివాసీ గ్రామాల్లో నేటికీ కనీస వైద్య సదుపాయం కానీ, తగిన డాక్టర్లు, వైద్య సిబ్బంది, పరికరాలు, మందులు, వసతి సౌకర్యాలు కానీ అందుబాటులో లేవు.1999లో విశాఖ ఏజన్సీలో విషజ్వరాల బారినపడి 3 వేల మందిి పైగా జనం మరణించిన సంఘటనపై నాటి మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ డా వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషన్ ప్రభుత్వానికి అందజేసిన నివేదికను పాలకులు ఏనాడో పాతిపెట్టేశారు. ఈ సంవత్సరం జులై నాటికే విశాఖ ఏజన్సీలోనే 100 మందికి పైగా ఆదివాసులు మరేరియా, డయేరియా, కామెర్లవ్యాధులతో చనిపోయారు. గత సంవత్సరం విజయనగరం జిల్లాలోనే 4 వేలమంది ఆదివాసులు మరేరియా బారిన పడ్డారు. ఇప్పటికే ఈ ఏడాది ఆదివాసీ ప్రాంతాల్లో 280 మంది డెంగ్యూ, మలేరియా వ్యాధులకు గురయ్యారు. ఫాల్సీఫారమ్ మలేరియా మెదడుకు సోకి మృత్యువాత పడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ నాటికీ అదివాసుల్లో అక్షరాస్యత 16 శాతానికి మించలేదు. సంక్షేమ హాస్టళ్ళు నరక కూపాలను తలపిస్తున్నాయి. ఇప్పు గిరిజన సంక్షేమహాస్టళ్ళను, గురుకుల పాఠశాలలను కుదించి వేస్తున్నారు. గురుకుల ఆదివాసీ పాఠశాలల్లో ఆడపిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. వీరిపై వేధింపులు, లైంగిక దాడులు, దౌర్జన్యాలు సర్వసాధారణమయ్యాయి. ఇటీవల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నిరోధిస్తుందని చెబుతూ ‘గర్దాసిల్’ అనే టీకాను గురుకుల పాఠశాలలో చదువుకునే ఆదివాసీబాలికలపై ప్రభుత్వ ప్రోద్బలంతో ప్రయోగించారు. అత్యంత ప్రమాదకరమైన ఈ అనైతిక ఔషధప్రయోగాల ఫలితంగా వీరిలో కొందరు మరణించగా అనేకమంది ఔషధ పరీక్షల దుష్ఫలితాలనెదుర్కొంటున్నారు.అదివాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కుదించి వేస్తున్నారు. ఎలాంటి హక్కులు, భద్రత లేని తాత్కాలిక, కాంట్రాక్టు పద్ధతుల్లో మాత్రమే కొన్నైనా అవకాశాలు కల్పిస్తున్నారు. గత 10 సంవత్సరాలలో 15 వేల అదివాసుల పోస్టులు వివిధ ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయలేదు.ఆదివాసీ యువకులకు ఈ మధ్యకాలంలో ఎమైనా ఉద్యోగాలు కల్పించారంటే అవి పోలీసు కానిస్టేబుల్ ఉద్యగాలు మాత్రమే!ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసుల పోరాటాలను ఏఎఫ్‌ఎస్‌పిఏ వంటి క్రూర చట్టాలతో పాలకులు అణయివేయ చూస్తున్నారు. అస్సాంలో ఆదివాసుల గుడిసెలను ఏనుగులతో తొక్కిస్తే, గుత్తికోయల గ్రామాలను మన రాష్ర్టంలో తగులబెట్టించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్నారు. ‘గ్రీన్‌హంట్’ పేరిట పోలీసు, సైనిక బలగాలను మోహరిస్తున్నారు. నక్సలైట్లను అణచి వేసేందుకోసం ‘సాల్వజుడుం’ పేరిట ఆదివాసుల నుండే ప్రత్యేక బలగాలను రూపొందించి, శిక్షణ, ఆయుధాలుఇచ్చి వారిని ప్రయోగిస్తున్నారు.ఆదివాసీ ప్రాంతా ల వారు దోపిడీ వ్యవస్థపై పోరాటం ఎక్కుబెట్టకుండా అనేక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. సమస్తవనరులనూ కొల్లగొట్టేనిమితం మానవరహి త అడవులుగా మార్చేందుకు పూనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ పోరాట యోధులు బిర్సాముండా మొదలు కొమురంభీం వరకూ సాగించిన సమరశీల పోరాట స్ఫూర్తిని ఆదివాసీ ఉద్యమాలు స్వంతం చేసుకోవాలి. అటవీ భూముల సేకరణకు వ్యతిరేకంగా ఆదివాసులు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో సాగిస్తున్న ఉద్యమాలను ఇతర పీడిత వర్గాల సమన్వయంతో సాగించాలి
(సూర్య 22-12-2012)
ఎన్నికల నుంచి గట్టేందుకే ఆహార భద్రత పథకం
ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుత్ను సమస్య ఆహార భద్రత. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు వెనుకబడిన దేశాలు సహితం నేడు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ దీనిని అధికమించలేకపోతున్నాయి. 'ఆరోగ్యకరంగా జీవించేందుకు అవసరమైన ఆహారాన్ని అన్ని వేళలా, అన్ని వర్గాల ప్రజలకు అభింపజేయటమే ఆహార భద్రత' అని అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ నిర్వచించింది. ప్రపంచలో ఏ ఒక్కరికి ఆకలి బాధ ఉండకూడదనే సంకల్పంతో ఐక్యరాజ్య సమితి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గరైజేషన్‌ను 1945 అక్టొబర్ 16న కెనడాలో నెలకొల్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు తనవంతుగా 3 బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రకటించింది. అయితే కేటాయించిన ఈ నిధులు చాలవని 2030 నాటిని ఆహార సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో నివారిలంచాలంటే ఏడాదికి కనీసం 20 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టాలని సూచించింది. తీవ్ర కరువుకోరల్లో చిక్కుకున్న ఆఫ్రికా దేశాలతో పాటు ప్రపంచంలోని దాదాపు 30 దేశాల్లో ప్రజల ఆహార పరిస్థితి ప్రమాధంలో
ఉందన్ని తెలిపింది. ఈ ఆహార సంక్షోభాన్ని సకాలంలో ఎదుర్కొనక పోతే ప్రపంచలోని దాదాపు 50 శాతం మంది పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాధం ఉందని తెలిపింది. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేధికలో ప్రపంచంలోని మొత్తం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న పిల్లల్లో దాదాపు 25 శాతం భారత్‌లోనే ఉన్నారని పేర్కొంది. మన దేశంలోని మొత్తం పిల్లల్లో దాదాపు 22 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధ పడుతున్నారని, 5 సంవత్సరాలలోపు పిల్లల్లో 43.5 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో ఉంటున్నారని, దాదాపు 7 శాతం మంది పిల్లలు పుట్టిన 5 సంవత్సరాల్లోనే మరణిస్తున్నారని తన నివేదికలో వెల్లడించింది. భారతదేశంలోని 76 శాతం ప్రజలకు కావాల్సిన కేలరీల్లో ఆహారం లభించడంలేదు. గ్రామీణ జనాభాలో 80 శాతం, పట్టణ జనాభాలో 64 శాతం ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దేశంలోని మహిళల్లో సగం కాన్నా ఎక్కువమంది పిల్లల్లో మూడింట నాలుగోంతులు రక్తహీనతతో బాధపడుతున్నారు. అప్పుడే పుట్టిన పిల్లల్లో 30 శాతం తక్కువ బరువుతో ఉన్నారు. భారతదేశంలోని ప్రతి ముగ్గురు వయోజనుల్లో ఒకరు ఉండాల్సిన బరువు, ఎత్తులో లేరు. అంటే వారిలో దీర్ఘకాల శక్తిహీనత
ఉన్నట్లేనని వైద్యశాస్త్రం చెబుతోంది. భారత రాజ్యంగం జీవించే హక్కును ప్రజలందరికీ ప్రాథమిక హక్కుగా ఇస్తోంది. ఆహార హక్కు జీవించే హక్కులో భాగమే. అందరికి అది దక్కాలంటే మధ్యాహ్న భోజన పథకం, సమగ్ర శిశు అభివృద్ధి సేవలు, తదితర పౌష్టికాహార పథకాలను ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకురావాలి.
జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం ప్రతి వ్యక్తి రోజుకు 2400 కేలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. కానీ గ్రామాల్లో 49 శాతం మంది, పట్టణాల్లో 53 శాతం మంది ఇన్ని క్యాలరీల ఆహారాన్ని తీనలేకపోతున్నారు. ప్రపంచ సగటు కేలరీలు 2718, అభివృద్ధి చెందిన దేశాల సగటు కేలరీలు 3206, వర్థమాన దేశాల సగటు కేలరీలు 2573 కాగా మన దేశంలో వర్థమాన దేశాల సగటు కేలరీల కంటే తక్కువగా వినియోగిస్తున్నారు. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ఉత్సా పట్నాయక్ వేసిన లెక్కల ప్రకారం గ్రామాల్లో 87 శాతం మందికి 2400 కేలరీల ఆహారం కూడా అందుబాటులో లేదు. దీనీకి ఆదాయం లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. ప్రపంచ ఆహార ఉత్పతిల్లో మూడవ స్థానాన్ని ఆక్రమించిన భారత్ వంటి దేశాల్లో పౌష్టికాహార లోపంతో పిల్లలు మరణించడం పాలకుల నిర్లక్ష్యం, ఆర్థిక విధానాలే కారణమని నిపుణు పేర్కొంటున్నారు. మరోవైపు వైపు నిల్వ సదుపాయాలు లేకపోవడం వల్లా భారీ ఎత్తున ఆహార ధాన్యాలు గోదాముల్లో ముక్కిపోతున్నాయని భారత ఆహార సంస్థ ప్రభుత్వానికి నివేధిక సమర్పించింది. ఆహార నిల్వలు పర్వతాల్లా పేరుకుపోతున్నా, దాచుకునే సామార్థం లేక వృథా కావడాన్ని సర్వోన్నత న్యాయస్థానం సహితం గతంలో తప్పు పట్టింది. ధాన్యాన్ని ప్రజలకుఉచితంగా పంచవచ్చు కదా అంటూ మొట్టికాయ వేసింది. ఇది నేడు దేశంలో వున్న పరిస్థితి.
అయితే ఈ పరిస్థితిని అధికమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత పథకాన్ని త్వరలో అమలుచేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని ప్రతి ఒక్కరూ 'చాలినంత ఆహారం' పొందే హక్కును చట్టంద్వారా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం మేరకు జాతీయ ఆహార భద్రత చట్టన్ని రూపొందిస్తున్నట్లు నాటీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ జూన్4, 2009న ప్రకటించింది. అయితే ఈ ఆహార భద్రత బిల్లు అమలులోకి వస్తే దేశంలోని దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు చౌకధరల బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతుంది. అయితే ప్రజలను రెండు వర్గాలుగా విభజించడంలోనే పాలకుల కుట్ర దాగివుందని వామపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దేశంలోని ప్రజలందరికి ఆహారభద్రత కల్పించే విధంగా ఈ పథకాన్ని విస్తరించాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దారిద్య్రాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం సురేష్ టెండూల్కర్ కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ.11.80 , పట్టణ ప్రాంతంలో రోజుకు రూ.17.8 సంపాదిస్తున్న వారినే దారిద్య్ర రేఖకు దిగువన
ఉన్నవారిగా గుర్తిస్తున్నారు. మిగిలిన వారిని దారిద్య్ర రేఖకు ఎగువ ఉన్నవారిగా గుర్తిస్తున్నారు. అదే విధంగా ప్రణాళిక సంఘం గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూపాయలు 22, పట్టణ ప్రాంతంలో రూ.28 కంటె ఎక్కువ సంపాదించేవారంతా దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు అని విభజించింది. కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సర్వేల్లో వేటిని తీసుకున్నా దేశ జనాభలోని అత్యధికులు ఈ పథకానికి దూరంగానే ఉండవలసి వస్తుంది. ఇది కేవలం ప్రజలను మోసపుచ్చేందుకు ప్రకటించిన పథకంగానే మిగిలిపోతుంది. ఒకవైపు ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలకు క్రమంగా ఎత్తివేస్తున్న ప్రభుత్వాలు ఇన్నివేల కోట్ల రూపాయల సబ్సిడీలను భరించి పేదలకు ఆహారభద్రత కల్పించేందుకు ముందుకు వస్తుందంటే దీనివెనుక ఏదో కుట్ర దాగివుందని,2014లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఈ పథకాన్ని రూపకల్పన చేసిందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ప్రభుత్వానికి ఇంత ఆకస్మత్తుగా ప్రజలపై ప్రేమ ఎందుకు కలిగింది. దేశంలో లక్షలాధిమంది పిల్లలు పౌష్టికాహారంతో బాధ పడుతున్నారని, వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు ఎన్నొ సంవత్సరాలుగా ఆహార భద్రత కోసం పట్టుబడుతున్నా ఏనాడు పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇంత అడావుడిగా ప్రభుత్వం ఎందుకు అమలు చేసేందుకు సిద్ధపడుతుందనే ఆలోచించాలి.
ప్రస్తుతం దేశంలో ఏడున్నర కోట్ల టన్నుల ఆహార నిల్వలు పేరుకుపోయాయని, ఇవి త్వరలో చెడిపోయి ఆహార వినిమయానికి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని భారత ఆహార సంస్థ హెచ్చరించింది. దీనిని అధికమించాలంటే రాష్ట్రాలకు ఇస్తున్న కేంద్ర కోటాను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి నివేధిక పంపింది. గోదాముల్లో పేరుకుపోయిన ఆహార నిల్వలను త్వరలో పంపిణి చేయకపోతే దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగుని స్థాయిలో ఆహార నిల్వలు పాడైపోయే ప్రమాధం ఉందని సూచించింది. గతంతో గోదాముల్లో ఆహార నిల్వలు పాడైపోతున్న విషయాన్ని సుప్రీం కోర్టు సహితం తప్పు పట్టిన విషయం గమనంలో ఉంచుకున్న కేంద్రం ఆహార నిల్వలు పాడైపోతే పెద్ద అపవాదును మూటకట్టుకోవాల్సి వస్తుందని ఆలోచించింది. దీని నుంచి అధికమించేందుకు మరియు 2014 ఎన్నికల్లో గట్టెక్కెండుకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో విపక్షాలు, మేధావుల అనుమానిస్తున్నట్లు ఆహార భద్రత పథకం ఒట్లను ఆకర్షించే పథకంగా మారుతుందా లేదా పేదలకు ఉపయోగపడుతుందా? బ్లాక్ మార్కెట్ దారులకుఉపయోగపడే పథకం అవుతుందా అనేది ఆలోచించాలి. ఎందుకంటే ఎన్నికల కోసం ప్రభుత్వం గోదాముల్లో పేరుకుపోయిన నిల్వలను పంపిణి చేసి తాత్కాలికంగా ప్రజల ఆహార కోతను తీర్చగలిగిన భవిష్యత్తులో ఆహారకోరతను ఎలా ఎదుర్కొంటారు అనేది పెద్ద ప్రశ్నగా మిగులుతుంది.
మన దేశం తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొవడానికి కారణమేంటనేది ఆలోచించకుండా పరిష్కారాన్ని కనుగొనలేము. భారతదేశంలో ఆహార సంక్షోభం అకస్మాత్తుగా తలెత్తినది కాదు. గత దశాబ్దానికి పైగా అనుసరిస్తున్న ప్రపంచీకరణలో భాగంగా ప్రపంచబ్యాంకు, డబ్లూటిఓ అదేశిత విధానాన్ని అమలుచేయడం కారణంగా ఏర్పడింది. 90వ దశకంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పుట్టుకువచ్చిన వాణిజ్య సరళితో, జన్యుమార్పిడి పంటలతో ఆహార సంక్షోభం తీవ్రమయింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ద్వారా పారిశ్రామిక దోపిడి పెరిగింది. మన దేశంలో రైతులను ప్రభుత్వాలు వ్యాణిజ్య పంటలు పండించేందుకు ప్రొత్సహించడంతో రైతలకు సరైన అవగాహన లేకపోవడం, వాటికి గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతాంగం తీవ్ర నష్టాలను చవిచూశారు. అనవసర ఖర్చుల కారణంగా రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు అనేకం జరిగాయి. దీనిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నియమించిన జయతి ఘోష్ కమిలీ, స్వామినాథన్ కమిటీ అనేక సూచనలు చేసింది కానీ పాలకులు వీటిని పట్టించుకోకపోవడంతో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఆహారసంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వ్యవసాయ రంగానికి నిధులు పెంచడం ఒక్కటే పరిష్కారమని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి కార్యదర్శి బాన్‌కిమూన్ సెలవిచ్చాడు. వ్యవసాయానికి ఉపయోగపడే భూములను వ్యవసాయేతర రంగాలకు మళ్లించకుండా సమగ్ర చట్టం చేయాలి. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. పండించే పంట నిల్వచేసుకునేందుకు గ్రామాల్లోనే శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. అప్పుడే ఆహారభద్రత ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగానికి ప్రత్యేక దృష్టిపెట్టి అధిక నిధులు కేటాయించని పక్షంలో ఆహారం కోసం అలమటించేవారి సంఖ్య రాబోయే రోజుల్లో అనుహ్యంగా పెరిగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
నిజానికి మొన్నటి పాత 'పనికి ఆహార పథకమూ', నేటి కొత్త 'ఆహార భద్రతా పథకమూ' బడా కార్పోరేటు ఆర్థిక వ్యవస్థ బుర్రలో పుట్టిన పథకాలే? ఇవేవి సోషలిస్టు, లేదా సోషటిస్టు తరహా భావాల నుంచి పుట్టినవి కావు. పెటుట్బడిదార్ల కోసం, పెట్టుబడి దార్ల చేతి, పెట్టుబడిదార్ల యొక్క పథకాలు ఇవి. విస్తృతమైన మన గ్రామీణ వ్యవస్థను కార్పోరేటు వాణిజ్య, పారిశ్రామిక వ్యవస్థకు అనుసంధానం చేసే ప్రణాళికలో భాగంగానే రూపొందిన పథకాలివి. పనికి ఆహార పథకం తమను రాజకీయ సంక్షోభం నుంచి కాపాడిందని నిర్ధారించుకున్నాయి. దాని వల్ల గ్రామీణ ప్రజల చేతికి అందిన సొమ్ముతో సాగించిన అదనపు కొనుగోళ్ళ కష్టకాలంలో తమకు ఒకింత చేయూత నిచ్చినట్లు కార్పొరేటు కంపెనీలు గుర్తించాయి. ఆ స్పూర్తితో అలాంటి మరికొన్ని సంక్షేమ పథకాలను రూపకల్పన చేశాయి. అందులో భాగమే తాజా ఆహార భద్రత. పట్టణ మధ్య తరగతి కుటుంబం తమ ఆదాయంలో 20-30 శాతం సొమ్మునే ఆహారావసరాలకు ఖర్చు చేస్తున్నది. మిగిలిందే ఆహారేతర వస్తే సామాగ్రికి, ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నది. కానీ కోట్లాది గ్రామీణ పేదలు తమ అల్ప రాబడిలో 60 శాతం పైగా ఆహారావసరాలకే ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా నిరుపేదల విషయంలో ఉపాధి హామీ సొమ్ములో తొంభై శాతం ఆహారావసరాలకే మళ్లించబడుతున్నదని అవి నిర్ధారించాయి. గ్రామీణ పేదల ఆహార బడ్డెట్ వ్యయాన్ని తగ్గిస్తే తప్ప తమకు తగినంత లాభం చేకూరదని కూడా అవి గుర్తించాయి. అందుకే రాజకీయ వ్యవస్థ ద్వారా ప్రజాధనంతో తక్కువ ధరలకు పేద ప్రజల ఆహారావసరాలను తీర్చదలచింది. తద్వారా వారి డబ్బును ఆహారేతర ఖాతాలోకి మళ్ళించి పథకం పన్నింది. అందుకోసం ప్రభుత్వం ప్రజాధనాన్ని ఆహార భద్రత, జాతీయఉపాధి పథకం. ఇలాంటిదే ఆరోగ్యశ్రీ పథకమైనా! అంతిమంగా డబ్బు ప్రవహించేది కార్పోరేట్ ఆసుపత్రులకే మరి! ఆ రూపంగా ఓ ప్రక్క ఓటు కొనుగోలు చేసుకుంటుంది. మరో ప్రక్క కార్పోరేటు కంపెనీలకి చైతన్యానిచ్చే వ్యాపారాన్ని ప్రవహింపచేస్తున్నది. బదులుగా కంపెనీల నుండి భారీ మొత్తాలని పార్టీ ఫండులుగా, వ్యక్తిగత కానుకలుగదా లేదా లంచాలుగా రాబట్టుకుంటుంది. ఇలా ఇదో వలయం, దోపిడి మూలం.
18-12-12
18-12-12
Subscribe to:
Posts
(
Atom
)


