అమ్మాయిలపై ప్రేమోన్మాధ దాడులు - పరిశీలన

No comments

‘‘ప్రేమించాని విద్యార్థినిపై కత్తితో దాడి’’
‘‘విద్యార్థిని గొంతుకోసిన ప్రేమోన్మాది’’
‘‘కళాశాలోనే విద్యార్థినిపై దాడి’’
‘‘యువతిపై వేడినూనే పోసిన ఉన్మాదీ’’
‘‘కత్తిదూసిన ప్రేమోన్మాదం’’
మొన్న శ్రీక్ష్మీ, ప్రసన్న క్ష్మీ.....నిన్న అయేషా మీరా,సమీరా,లావణ్య,మాధురి,నాగక్ష్మీ.అనూష.
ఇవి రోజురోజుకు కళాశాలో చదువుతున్న అమ్మాయిపై ప్రేమోన్మాద దాడు....
మరోవైపు
‘‘ఆనాధ బాలికను చేరదీసి అత్యాచారం’’
‘‘కామంతో మతిస్థిమితం లేని సొంత చెల్లెలిపై అన్న అత్యాచారం’’
‘‘కన్న కూతురుపై కన్నెసిన కసాయి తండ్రి’’
‘‘కీచక టీచర్‌ విద్యార్థినిపై అత్యాచారం’’
‘‘పుటుపాత్‌పై నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్ళి సామూహిక అత్యాచారం’’
‘‘మూడు నెలుగా మహిళపై ఖాకీ అత్యాచారం.’’
ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో మూన అమ్మాయిపై, దాడు, అత్యాచారాు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటను జరిగినప్పుడు మీడియా హడావిడి చేస్తుంది... ప్రభుత్వం చట్టాు చేస్తుంది... పోలీసు కౌన్సిలింగ్‌ చేస్తున్నారు... మహిళా సంఘాు, విద్యార్థి సంఘాు, ప్రజాసంఘాు ధర్నాు...రాస్తారోకోు చేస్తున్నారు.... నాటి వ్యవసాయ విశ్వవిద్యాయం విద్యార్థిని అనురాధ నుండి నేటి ప్రణీత, అనుష వరకు... నాటి ఆయేష మీరా నుండి నేటి సమీరా వరకు  ఇలాంటీ సంఘటను  ప్రతి రోజు ఏదో ఒక మూన పునరావృతం అవుతూనే వున్నాయి. మళ్ళీ....మళ్ళీ తిరిగి ఇదే తంతూ. అసు మానవ సంబంధాు ఇంత హీనంగా ఎందుకు దిగజారుతున్నాయి? మనిషి పట్ల మనిషికి ఉండాల్సిన స్నేహబంధం స్పందన ఎందుకు కరువవుతుంది?. ఈ సంఘటను మళ్ళీ మళ్ళీ ఇలా సంభవించటానికి కారణం ఏమిటి? ఇందుకు నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులే కారణమా? లేక వ్యక్తులోని మానసిక దౌర్బ్యం... మనసిక బహీనతలే ఈ చర్యకు కారణమా? అనేది పరిశీలించాలి.
ఇలాంటి సంఘటను జరిగినప్పుడు ప్రభుత్వం హామీు గుప్పిస్తూ బాధితుకు న్యాయం చేస్తామంటూ వాగ్ధానాు ఇస్తుంది. కానీ దాడుకు కారణాను మాత్రం వెతికి పట్టుకోలేకపోతుంది.  అమ్మాయిపై ఇలాంటి దాడుకు ప్పాడటానికి అసు ఎలాంటి కారకాు పనిచేస్తున్నాయో పరిశీలిస్తే దానిని నివారించవచ్చు. కాని ప్రభుత్వం అటువైపుగా ఆలోచించటం లేదు, చిత్తశుద్ధితో ప్రయత్నించటం లేదు.
1991 నూతన ఆర్థిక విధానాు ప్రారంభమైన తర్వాత పాక వర్గాు అవంభిస్తున్న విధానాు ఇలాంటి సంఘటను జరగటానికి కారణమవుతున్నాయి. 1991 కంటే ముందు వరకు భారత సాంఘిక పరిస్థితుల్లో ఇంతగా మార్పు రాలేదు. ఈ ఆర్థిక విధానా మూంగా వ్యవస్థలో క్రమంగా మార్పు  రావడం ప్రారంభమైంది. విదేశీ వస్తు వ్యామోహం, బోగలాసత్వం, వినిమయ సంస్కృతి వ్యక్తుల్లో బాగా పెరిగిపోయింది. వినిమయ సంస్కృతిలో భాగంగా సాటి వ్యక్తును కూడా వస్తువుగా చూసే క్రమం ప్రారంభమైంది. సాంఘిక మిమ క్రమేనా మారుతూ మనుషుంటే కేవం ఆట వస్తువుగా మారిపోయారు. సరళీకరణ విధానా మూంగా అభివృద్ధిచెందిన టెక్నాజి సామాన్యునికి అందుబాటులో రావడంతో దీనిని సాకుగా చేసుకున్న మానవుడు కేవం యాంత్రిక జీవితానికి అవాటు పడి వ్యక్తి గత ప్రయోజనా గురించి  తప్పా ఇంకేం పట్టించుకోవడం లేదు.

సరళీకరణ విధానా ప్రారంభం కంటే ముందు ఈ దేశంలో కాని రాష్ట్రంలో కాని ప్రజాఉద్యమాు బంగా ఉండేవి. నాటి యువతరం స్వాతంత్రోద్యమ నాయకులైన  సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌సింగ్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌ మొదలైన వారిని ఆదర్శంగా తీసుకొని. ఏదో ఒక ఉద్యమంలో పనిచేస్తూ తమ వంతుగా కనీసం సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేవారు. నాటి యువత అంతర్జాతీయంగా వస్తున్న మార్పును ఎప్పటికప్పుడు గమనిస్తూ, సమాజంలో మార్పుకై తమ శక్తిమేరకు పనిచేసేవారు. ఆనాటి సామాజిక పరిస్థితు, విద్యావిధానం విద్యార్థులో, యువతలో దేశభక్తిని పేంచేవిధంగా ఉండేది. అంతేకాకుండా నాడు విద్యార్థి ఉద్యమాు దేశంలో, రాష్ట్రంలో కీక పాత్ర వహించి యువతకు దిశానిర్ధేశం చేసేవిధంగా ఉండేవి. టీనేజిలో ఉన్న యువత శక్తిని సరిjైున మార్గంలో పెట్టకపోతే, వారికి ఒక గమ్యం అంటూ చూపించకపోతే వారు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. నాటీ శ్రీకాకుళ సాయుథపోరాటం, 1969 పజాస్వామ్య  తెంగాణ రాష్ట్ర ఉద్యమం వంటివి యువతను ఆలోచింపజేసి వారిని ప్రజాఉద్యమావైపు మళ్లేటట్లు చేశాయి. నేడు రాష్ట్రంలో అలాంటి బమైన విద్యార్థి, ప్రజాఉద్యమాు లేకపోవడం, ప్రభుత్వ విద్యాసంస్థ స్థానంలో ప్రయివేట్‌, కార్పోరేటు విద్యాసంస్థు రావడం వన. విద్యార్థును మరమనుషుగా మార్చి వారిని సమాజం గురించి ఆలోచించకుండా, నాుగు గోడ మధ్య బంధించి పనిచేసే యంత్రాుగా మారుస్తున్నాయి. ఒకనాడు ప్రభుత్వ విద్యా సంస్థలో అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయు తమకంటూ ఒక క్ష్యం కలిగివుండి దానిని ఆచరిస్తూ, విద్యార్థుకు మార్గనిర్ధేశం చేసేవారు. కానీ నేటి ప్రయివేట్‌, కార్పోరేటు విద్యాసంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయు కేవం డబ్బుకోసమే పనిచేస్తూ విద్యార్థును యాంత్రిక వస్తువుగా తయారు చేస్తున్నారు.
నేటి తరం యువతకు నాటి స్వాతంత్రోద్యోమ  నాయకు త్యాగా గురించి తెలియకపోవడం , వారు ఏ ఆశయం కోసమైతే తమ జీవితాను త్యాగం చేశారో  తెలిపేందుకు సరిjైున పాఠ్యంశాు లేకపోవడం మూంగా సరిjైున క్ష్యం, గమ్యం లేకుండా కేవం  వారి చుట్టూ ఉన్న గ్లామర్‌ ప్రపంచం వైపు పరుగు తీస్తూ ఎలాంటి క్ష్యం లేకుండా జీవిస్తున్నారు. ఈనాడు యువతను తాము చదువుతున్న చదువు కంటే కూడా సినిమాు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. నేడు  ప్రేమ పేరుతో తీస్తున్న సినిమాు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. చట్టాు పెళ్లి చేసుకోవడానికి కనీస వయసు అబ్బాయికు 21 సంవత్సరాు, అమ్మాయికు 18 సంవత్సరాు అని నిర్ణయించాయి కానీ అంతకంటే చిన్న ప్లితో ప్రేమ నేపథ్యంతో  సినిమాు తీస్తుంటే వాళ్ళను ఏ చట్టాు శిక్షించలేకపోతున్నాయి. చిత్రం, టెంత్‌క్లాస్‌, ప్రేమిస్తే, కొత్తబంగారు లోకం వంటి  సినిమాు చిన్నప్లితో తీస్తూ విద్యార్థును యువతను తప్పదారి పట్టిస్తున్నారు. ఈ సినిమా ప్రభావానికి ఆకర్షితువుతున్న విద్యార్థు ప్రేమ పేరుతో తమ జీవితాను నాశనం చేసుకుంటున్నారు. మొన్న ఖమ్మం జిల్లాలో 6వ తరగతి చదువుతున్న 11 సంవత్సరా షేక్‌ రేష్మా అనే అమ్మాయి 9వ తరగతి చదువుతున్న 15ఏళ్ళ షేక్‌ నాగుల్‌మీరాను ప్రేమించానని,  తమ ప్రేమను తల్లిదండ్రు ఒప్పుకోవడం లేదని సెల్‌టవర్‌ ఎక్కి చనిపోతానని బెదిరించిన విషయం తెలిసిందే. ప్రేమంటే ఏంటో కూడా తెలియని పసి వయసులో విద్యార్థు ప్రేమ పేరుతో చేస్తున్న వికృత చేష్టు, దాడును చూస్తుంటే ఆందోళన కుగుతుంది.  ఒక సర్వే ప్రకారం దేశంలోనే అత్యధికంగా సినిమా హాల్స్‌ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. ఈ రాష్ట్రంలో ప్రతి రోజు 6 క్ష మంది యువత సినిమాు చూస్తారని ఆ సర్వే పేర్కోంది. ఈ సర్వే భయాందోళన కలిగించే వివరాను తెలిపింది. నూతన ఆర్థిక విధానాు ప్రారంభమైన 1991 నుండి నిన్నటి మగధీర సినిమా  వరకు మొత్తం ఆంధ్రరాష్ట్రంలో 1775 సినిమాు విడుదలైతే వీటికి దాదాపు 928 సినిమాు కేవం ‘‘ప్రేమ’’ నేపథ్యంతో వచ్చిన సినిమాు ఉన్నాయి. ఇన్ని సినిమాు యువతకు ప్రేమే జీవితం అని భోదిస్తూంటే, ప్రేమలేకుంటే లైఫ్‌ వేస్ట్‌ ఆంటూ యువత చెవుల్లో నిరంతరం మారుమ్రోగుతుంటే యువతను ఏ ఉద్యమాు ఆకర్షించుకోగుగుతాయి? ఏ ఆశయం వైపు మళ్లిస్తాయి?. ఈ సంవత్సరం గత ఆగస్టు వరకు రాష్ట్రంలో 75 సినిమాు విడుదలైతే వాటిలో దాదాపు 48 సినిమాు కేవం ‘‘ప్రేమ’’ కథ వస్తువుగా సినిమాు తీయడం  జరిగింది. ఇన్ని సినిమాు ప్రేమగురించి బోధిస్తూ, ప్రేమేజీవితం అంటూంటే  యువత ఎందుకు అమ్మాయిను ప్రేమ పేరుతో వేధించడు?, దాడుకు ప్పాడడు?. నేడు రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అదే. ఈ సంవత్సరం జనవరి నుంచి  అక్టోబర్‌ వరకు రాష్ట్రవ్యాపితంగా అమ్మాయిపై ప్రేమ పేరుతో 32 దాడు జరిగాయి. 6 గురు అమ్మాయిు ప్రాణాు కోల్పోయారు. రాజమండ్రిలో అనుష అనే అమ్మాయి తన తల్లిదండ్రును ప్రేమోన్మాది దాడిలో కోల్పోయి తన ఇద్దరి చెల్లె భారం మోస్తూ ప్రభుత్వం నుంచి సరిjైున సహాయం అందక దిక్కుతోయని స్థితిలో ఒక ప్రయివేట్‌ టీవీని ఆశ్రయించడం జరిగింది.  మమ్మల్ని  ఆదుకొండని ఆ అమ్మాయి సమాజాన్ని అడుక్కొనే స్థితి ఎందుకు వచ్చింది?. ప్రేమే జీవితం అంటూ సినిమాు యువతను తప్పుడు మార్గం వైపు మళ్లీస్తుంటే వారిని అరికట్టలేని చట్టాు, ప్రభుత్వం.  ప్రేమ పిచ్చితో దాడుకు ప్పాడుతున్న వారిని ఎన్‌కౌంటర్లు చేసి శిక్షించాం  అంటూ చేతు దుపుకుంటున్నారు.  అసు ప్రేమోన్మాద దాడుకు కారణమైన సినిమాను, సినిమాు తీసే సిని పెద్దను శిక్షించకుండా, విద్యార్థును యంత్రాుగా మారుస్తున్న విద్యాసంస్థలో మార్పు తీసుకురాకుండా వదిలేస్తే ఇలాంటి దాడు పునరావృతమవుతూనే ఉంటాయి.
మరోవైపు రాష్ట్రంలో 3 సంవత్సరాు పసి ప్లి నుంచి 80 ఏళ్ల పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో అత్యాచారాకు గురవుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటను జరిగినప్పటికి నేడు జరుగుతున్న ఘటనను చూస్తుంటే ఆందోళన కుగుతుంది. తన రక్త మాంసాతో కనిపెంచిన కన్న తండ్రి, అమ్మా నాన్న తర్వాత రక్షణగా
ఉండాల్సిన తొడబుట్టిన సోదరుడు, విద్యాబుద్ధు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరును తయారు చేసి అందించాల్సిన ఉపాధ్యాయుడు, రక్షణ కల్పించాల్సిన పోలీసు అమ్మాయిపై అత్యాచారాకు ప్పాడుతుంటే ఇక అమ్మాయికు ఈ సమాజంలో ఎక్కడ రక్షణ దొరుకుతుందనేది ప్రశ్నర్థాకంగా మారింది. రాష్ట్ర రాజధాని నగరం బోయిన్‌ పల్లిలో గత జూన్‌ నెలో తండ్రిచేత అత్యాచారానికి గురికాబడిన బాలిక, కావలి పట్టణంలో సొంత అన్నచేత అత్యాచారానికి గురయిన అమ్మాయి, రక్షణ కల్పించాల్సిన పోలీసు వృత్తిలో వున్న సొంత అన్నచేత గత కొన్ని సంవత్సరాుగా అత్యాచారానికి గురవుతున్న మతి స్థిమితం లేని మహాక్ష్మీ, ప్లిు లేరని  కన్న కూతురుగా చూసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకుకెళ్లి అత్యాచారానికి ప్పాడిన  వ్యక్తును ఈ అమ్మాయిు ఏలా చూస్తారూ?. ఎలా అర్థం చేసుకుంటారూ?. ఈ సమాజాన్ని చూసి ఎంత భయాందోళనకు గురవుతారనేది అందోళన కలిగిస్తుంది.  కన్న తండ్రు, తొబుట్టువు, పవిత్ర వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులే  తోడేళ్లవుతుంటే.... కడుపులో పెట్టుకు కాపాడాల్సిన కన్నవారింట్లోనే రక్షణ కరువవుతుంటే ఇక అమ్మాయికు రక్షణ కల్పించాల్సింది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది.
అభివృద్ధి చెందిన టెక్నాజీ మూంగా ఈ రోజు వీధి వీధిలో ఇంటర్నెట్‌ సెంటర్స్‌ వెలిశాయి. వీటిని తమ చదువులో అభివృద్దికోసం ఉపయోగించుకోవాల్సిన విద్యార్థు, యువత,వాటిని అశ్లీ చిత్రాను, సినిమాను బొమ్మను చూసేందుకు ఉపయోగించుకుంటున్నారు. నేడు ఇంటర్నెట్‌ సెంటర్స్‌ను ఆశ్రయించే వాళ్ళలో అత్యధికు 12 నుంచి 20 సంవత్సరా వయసులోని విద్యార్థు ఉంటున్నారు. వీరి బహీనతను డబ్బు రూపంలో మార్చుకోవాని కొందరు ఇంటర్‌నెట్‌ నిర్వాహాకు అశ్లీ బొమ్మను విద్యార్థుకు చూపిస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు.
మరోవైపు  టెలివిజన్‌లో ప్రతిరోజు ప్రసారమవుతున్న నేరాు`ఘోరాు, క్రైమ్‌వాచ్‌ వంటి కార్యక్రమాు ఏలా హత్యు చేయాలో, ఎలా మానభంగాు చేయాలో ఆకట్టుకునే విధంగా చూపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్రంగా కవరపెట్టిన ఆయేషా హత్య కేసు నిందితుడు సత్యంబాబు మరియు ఆరు నెల క్రితం హైదరాబాదు శివార్లలో ఒక మహిళను హత్య చేసిన నిందితుడు పోలీసు ఇంటరాగేషన్‌లో తాము టీవీలో క్రైం కార్యక్రమాు చూసే ఈ హత్యకు ప్రేరణ పొందామని చెప్పారు. టీవీ కార్యక్రమా మూంగా కూడ నేడు రాష్ట్రంలో మహిళపై విచ్చవిడిగా దాడు, మానభంగాు పేరిగిపోయాయి. సినీనటుడు నూతన్‌ ప్రసాద్‌ వ్యాఖ్యానంతో ఈటీవి`2 లో మొదలైన ‘‘నేరాు`హోరాు’’ ఈ రకమైన క్షుద్ర కార్యక్రమాను ప్రారంభించింది. తరువాత కాంలో వచ్చిన టీవీ9 ఈ కార్యక్రమాకు మరింత మసాళా జోడిరచి  ప్రసారం చేయడం మొదలెట్టింది. నేడు రాష్ట్రంలో ప్రసారం అవుతున్న ప్రతి తొగు ఛానల్స్‌ ఈ రకమైన క్షుద్ర కార్యక్రమాను ప్రసారం చేస్తున్నాయి. అమ్మాయిపై దాడు జరిగినప్పుడు  లైవ్‌ ప్రోగ్రామ్స్‌తో ముందుండే టీవీ మీడియా, దాడుకు గురవుతున్న వారితో చర్చా కార్యక్రమాు నిర్వహించి తమ రేటింగ్స్‌ను పెంచుకుంటున్న టీవీ ఛానల్స్‌, అనుష లాంటి అమ్మాయిు ప్రేమెన్మాదు దాడుకు గురికావడానికి, తన తల్లిదండ్రును కొల్పోయి ఒంటరిగా మిగడానికి  తాము ప్రసారం చేస్తున్న  క్రైమ్‌ కథనాు కూడా కారణం అని గుర్తించాలి.
 
‘‘మెరుగైన సమాజం కోసం’’ అంటూ ప్రసారాు ప్రారంభిస్తున్న టీవీ ఛానల్స్‌ ఇలాంటి ప్రోగ్రామ్స్‌ వన సమాజం ఎలా మెరుగవుతుందో ఆలోచించుకోవాలి. మన పొరుగున రాష్ట్రం కర్నాటకలో  ‘‘క్రైం డైరీ’’, ‘‘క్రైం స్టోరీ’’  వంటి కార్యక్రమాపై గత నాుగేళ్ల క్రితమే తీవ్ర చర్చ మొదలైంది. ఏ.వి అమరనాధన్‌ అనే న్యాయవాది ఈ తరహా సీరియళ్లను, క్రైం కథనాను నిషేధించాని 2004 డిసెంబరులోనే కర్నాటక హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖు చేశాడు. ఈ కేసు విచారించిన అక్కడి హైకోర్టు ఇటువంటి సీరియళ్ల కొరకు పోలీసు అధికాయి ఇంటర్వ్యూు ఇవ్వొద్దని, అలాగే ఇటువంటి సిరియళ్లు ప్రసారం చేసే టెలివిజన్‌ సంస్థపై అవసరమైతే ప్రభుత్వం చర్యు తీసుకోవాని అదేశాు జారీ చేసింది. అదేవిధంగా కర్ణాటక ఐ.జి.కెంపయ్య మైసూర్లో జర్నలిస్టు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గోని ఈ క్రైం సీరియళ్లు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని, వారిలో నేర ప్రవృత్తి పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకమైన క్రైం సీరియళ్లను, కథనాను వెంటనే నిషేధించాని కర్ణాటక పోలీస్‌ అధికారు సంఘం ఈ సందర్భంగా కోరింది. కర్ణాటకలో ప్రజ నుండి ఈ క్రైం కథనాపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కర్ణాటక పోలిస్‌ శాఖ ఈటీవీ కన్నడ, ఉదయ టీవీకు క్రైంసీరియళ్లు ప్రసారం చేసినందుకు కేబుల్‌ టెలివిజన్‌ చట్టం కింద నోటీసు జారీ చేసింది. మన రాష్ట్రంలో కూడా ఇటువంటి  వ్యతిరేకత ప్రజ నుండి మేధావునుండి, పోలీసు అధికారు నుండి రావాలి అప్పుడే ఇలాంటి దాడును అరికట్టగుగుతాము. రాష్ట్రంలో వరదు, తుపాను వచ్చినప్పుడు ముందుకు వచ్చి ఆదుకుంటున్న టీవి ఛానల్స్‌ అమ్మాయిపై ఇలాంటి దాడు జరుగుతున్నప్పుడైన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి  క్రైం కథనాను ప్రసారం చేయడం నిలిపివేయాలి.  ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్న దేశం మనది. ఈ యువతను  సక్రమ మార్గంలో పెట్టి వారి యువశక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాు సాధించవచ్చు ఈ యువశక్తికి ఏదైన సాధించానే తెగువ, ధైర్యం ఉంటాయి. అలాంటి యువతకు సరిjైున మార్గాన్ని చూపించకుంటే సమాజానికి ఉపయోగపడకుండా సంఘ విద్రోహుగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం, మీడియా, విద్యావేత్తు అటువైపుగా ఆలోచించాలి.
                                                                                                               క్యాంపస్‌ వాయిస్‌, డిసెంబర్‌ 2009

No comments :

Post a Comment