‘ఉప’నిధుల ‘స్వాహా’కారాలు!

No comments
 అరవై నాలుగు సంవత్సరాల ‘స్వతంత్ర’ భారతావనిలో దళితుల, గిరిజనుల సమస్యలు పరిష్కారం కాకపోగా, పెరుగుతూ వస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలేవీ వారి జీవితాల్లో మార్పు తీసుకొని రాలేక పోయాయి. రాష్ర్టంలో దళితులు, గిరిజ నుల జనాభా 22.08 శాతం ఉంది. 56 వేల దళిత వాడలు, 20 వేల గిరిజన ఆవాసాలు ఉన్నా యి. ఈ వర్గాల అభివృద్ధికి నామమాత్రపు బడ్జెట్‌ కేటాయింపులతో సరిపెట్టడమే కాకుండా, వాటిని కూడా వారి కోసం ఖర్చు చేయడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విఫలమౌతూ వస్తున్నాయి. షెద్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల కోసం కేటాయించే ఉప ప్రణాళికా నిధులు వారి అభివృద్ధి కోసమే ఖర్చు చేయాలనే ఆందోళన కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ 20 లక్షల దళిత, గిరిజన కుటుంబాలకు ఇండ్ల స్థలాలను ప్రభుత్వం సమకూర్చలేక పోయింది. 60 శాతం ఇండ్లకు మంచినీటి సౌకర్యం, 80 శాతం కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేక అనేక అవస్థలు పడుతున్నారు. రోడ్ల నిర్మాణం, డ్రైనేజి సౌకర్యం పూజ్యం. రాష్ర్టంలో 40 శాతం దళిత కుటుంబాలకు, 12 వేల గిరిజన కుటుంబాలకు విద్యుత్‌ సౌకర్యం లేదు. 15 వేల గ్రామాలకు స్మశాన వాటికలు సైతం లేవు.

షెడ్యూలు కులాల, తెగల ఉపప్రణాళిక ప్రకారం- రాష్ర్ట ప్రణాళికా బడ్జెట్‌లో వీరి జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేయాల్సి ఉంది. అంటే రాష్ర్టంలో జనాభా నిష్పత్తి ప్రకారం దళితులకు 13.2 శాతం, గిరిజనులకు 6.6 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాలి. కేటాయింపులు అరకొరగానే చేసినా, వాటిని కూడా ఖర్చు చేయటంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైంది. కేటాయింపుల్లో 7 శాతం నిధులు కూడా ఖర్చు పెట్టలేదని స్వచ్ఛంద సంస్థల సర్వేలలో బయట పడింది. దారిమళ్ళించిన నిధులతో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు, హుస్సేన్‌సాగర్‌ ఆధునికీకరణ, జలయజ్ఞంల కోసం 4 వేల కోట్లు మళ్లించారు. 2004-5 నుంచి 2010-11 వరకు షెడ్యూల్డ్‌ కులాల, తెగల ఉప ప్రణాళికలో రూ. 25,647 కోట్లు కేటాయించవలసి ఉండగా రూ.12,476 కోట్లు మాత్రమే ఖర్చుచేసినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. మిగతా రూ.13,171 కోట్లు ఇతర రంగాలకు మళ్లించారు.

దళిత, గిరిజనుల పిల్లలు చదువుకోవడానికి, ఉద్యోగాలు పొందటానికి రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించామని, ఉచిత చదువు, హాస్టల్‌ సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నా ఆచరణ అందుకు భిన్నంగా ఉంది. పాలకుల విధానాల ఫలితంగా అనేక గిరిజన జాతులు అంతరించే ప్రమాదంలో పడ్డాయి. గిరిజన పిల్లలలో అత్యధికులు ఇప్పటికీ విద్యకు దూరంగానే ఉంటున్నారు. గిరిజన విద్యార్థులకు గత సంవత్సరం బడ్జెట్‌లో రూ. 385.52 కోట్లు కేటాయించారు. ఖర్చు పెట్టింది మాత్రం రూ.274.57 కోట్లే.
గిరిజన సంక్షేమశాఖ పరిధిలో రాష్ర్టంలో 442 వసతి గృహాలుండగా, బాలురకు 331, బాలికలకు 111 కేటాయించారు. వీటిలో 72,420 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక్కొ క్క వసతి గృహంలో 2 వం దల మంది వరకు ఉండడం వల్ల వారు అవస్థలు పడుతు న్నారు. అవసర మైనన్ని మరుగుదొడ్లు, స్నానాల గదులు లేవు. ఉన్నవి కూడా నిర్వహణా లో పం వల్ల వినియోగానికి అనుగుణంగా లేవు.

గిరిజన హాస్టళ్ళ విద్యార్థుల ఎడల అధి కారులకే కాక, వార్డెన్లకు, సిబ్బందికి కూడా చిన్న చూపు ఉంది. మెస్‌ ఛార్జీల కేటాయింపులు నామమాత్రంగా ఉండటంతో పాటు, సిబ్బంది అవినీతి వల్ల నాసిరకం ఆహారమే విద్యార్థులకు అందుతోంది. ఫలితంగా డయేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు. గిరిజన బాలికలను భయపెట్టి వారిపై కొందరు వార్డెన్లు, సిబ్బంది అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అత్యాచారానికి గురై గర్భవతులైన గిరిజన బాలికల ఉదంతాలు నిత్యం బయటపడుతూనే ఉన్నాయి. విద్యను కొనసాగించడంలో గిరిజనులు వెనుకబడి ఉన్నారు. వారు నివసిస్తున్న ప్రాంతాలలో పాఠశాలలు నామమాత్రం. చదువు కోవడానికి పట్టణ ప్రాంతాలకు పంపలేక పిల్లలను గిరిజనులు చదివించుకోలేక పోతున్నారు. ప్రాథమిక విద్యతోనే ఎక్కువ మంది గిరిజన విద్యార్థులు చదువు చాలిస్తున్నారు.

2001-10 సంవత్సరాల మధ్యకాంలో రాష్ర్ట వ్యాపితంగా 3,12,308 మంది గిరిజన బాల, బాలికలు 1వ తరగతిలో చేరినా 2009-10 నాటికి చదువు కొనసాగించిన వారి సంఖ్య 72,606కి తగ్గిపోయింది. గిరిజనులకు గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకొంటున్నది. 272 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 84, 876 మందికి విద్య, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెబుతున్నది. ఇవే కాక, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి 84,675 మందికి విద్య, వసతిని ఒకే చోట కల్పిస్తున్నట్లు విద్యాశాఖ తెలియచేస్తోంది. ఈ పాఠశాలల్లో 48 ప్రాథమిక పాఠశాలలు, 223 ప్రాథమికోన్నత పాఠశాలలు, 330 ఉన్నత పాఠశాలలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ వీటిలో ప్రాథమిక పాఠశాలలు 48 మాత్రమే ఉండడం వల్ల- మొత్తం ఆశ్రమ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది.

ఈ పాఠశాలల్లోనూ సౌకర్యాలు సంక్షేమ హాస్టళ్ళకు భిన్నంగా లేవని విద్యార్థులు చెబుతున్నారు. ఇందుకు బడ్జెట్‌ కేటాయింపులు తక్కువగా ఉండడమే కారణం. అంతే కాకుండా కేటాయించిన బడ్జెట్‌లను పూర్తిగా విడుదల చేయకపోవటం, విడుదల చేసిన నిధులను పూర్తిగా ఖర్చుపెట్టటం కూడా జరగ డం లేదు. బడ్జెట్‌ కేటా యిం పులు, మంజూరు, ఖర్చు పరిశీలిస్తే, ఈ పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సదుపాయా లకు, భోజనవసతికి ఏమాత్రం సరిపోదని అర్థమౌతుంది. వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టామని, అందుకు నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వప్రచారం సాగుతూనే ఉన్నా, వాస్తవంలో వీరు నిర్లక్ష్యానికి గురవు తున్నారు. వారికి కేటాయించిన నిధుల్ని కూడా దారిమళ్ళిస్తున్నారు. దళితుల జనాభా ప్రకారం బడ్జెట్‌లో కేటాయింపులు జరగడం లేదు.

స్పెషల్‌ కాంపొనెంట్‌ ప్లాన్‌ ప్రకారం ఎస్సీలకు నిధులు కేటాయించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. 2004-05 నుండి 2010-11 వరకు సబ్‌ ప్లాన్‌ ప్రకారం బడ్జెట్‌ కేటాయింపులు, ఖర్చులు, మళ్లించిన నిధులు పరిశీలిస్తే వెనుకబడిన కులాల అభివృద్ధి పట్ల పాలకుల నిర్లక్ష్యం తేటత్లెమౌతుంది. ఈ ఆరు ఏళ్ళ బడ్జెట్‌ మొత్తం రూ,1,58,313 కోట్లు కాగా, ఎస్సీలకు కేటాయించింది రూ. 25,648, విడుదల చేసింది రూ.21,309, ఖర్చు చేసింది రూ.12,476, దారి  మళ్లించినది రూ.13,171 కోట్లు. అంటే ఖర్చు చేసిన దానికంటె దారి మళ్లించిందే ఎక్కువ.

వెనుకబడిన కులాల వారు ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడి ఉండటం వలన చదువులో వారి పిల్లలు ముందుకు సాగలేక పోతున్నారు. ప్రాథమిక విద్యతోనే అత్యధికులు చదువుకి దూరమవుతున్నారు. గత 10 సంవత్సరాలలో 4,76,514 మంది పిల్లలు ఒకటవ తరగతి చేరగా, పదో తరగతికి 1,76,514 మంది మాత్రమే చేరుకోగా, దాదాపు మూడువంతుల పిల్లలు చదువు మానుకోవలసి వచ్చింది.దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడి ఉండడానికి, దుర్భరమైన జీవితాలు గడపటానికి భూ పంపిణీ జరగక పోవటమే కారణం. నేటికి 80 శాతం దాకా వ్యవసాయ భూము లు భూస్వాముల, సంపన్న వర్గాల చేతుల్లో ఉన్నాయి.

ఈ భూములు పేదల పరమైతే, ఆ సేద్యం ద్వారా వచ్చే ఆదాయం బడుగు బలహీన్వర్గాల వారి జీవితా ల్లో మార్పు తీసుకొస్తుంది. సాంస్కృతిక మార్పుతో బాటు వారి పిల్లలను చదివిం చుకోగలిగే స్థితి ఏర్పడుతుంది. భూస్వామ్య ప్రతినిధి వర్గాలైన పాలకులు భూ కామందుల వద్దనున్న భూములను పేదలకు పంచలేరని 64 సంవత్సరాల ‘స్వతంత్ర’పాలన స్పష్టంచేసింది. అన్ని కులాలలోని పేదలు ఉద్యమించి పంచుకో వడం ద్వారానే వారికి భూమిపైహక్కు ఏర్పడుతుంది. ఆ దిశగా గిరిజనులు, వెను కబడిన కులాలు, ఇతర కులాల పేదలు ఐక్యంగా పోరాటాన్ని నిర్వహించాలి.

 (సూర్య 31-3-12)

No comments :

Post a Comment

ఉదయించిన సూరీడు భగత్‌ సింగ్‌

No comments


ఇరవై మూడు సంవత్సరాల చిన్న జీవితంలో యావజ్జాతిలో స్వాతంత్య్ర జ్వాలను రగిలించిన వీరుడు సర్దార్‌ భగత్‌సింగ్‌. ఆయన అమరత్వం సాధించి నేటికి 81 సంత్సరాలు గతించిపోయాయి. మనల్ని చీల్చుకుని వెళ్లిపోయిన ఇవాళ్టి పాకిస్థాన్‌లో ఒక రాష్ర్టం పంజాబ్‌. అందులోని లాయల్‌పూర్‌ జిల్లా ఖట్‌ఖర్‌ కలాన్‌ గ్రామంలో సాధారణ సింధూజాట్‌ కుటుంబంలో 1907 సెప్టెంబర్‌ 28న భగత్‌సింగ్‌ అనే వెలుగు మొలక మొగ్గ తొడిగింది. ఈ మొలకే అనతికాలంలో మహా విప్లవ జ్వాలగా పరిణమిస్తుందని తండ్రి కిషన్‌సింగ్‌ కానీ, తల్లి విద్యావతి కానీ ఎంత వరకు ఊహించారో తెలియదు.

భగత్‌సింగ్‌ తన 12వ ఏట 1919 ఏప్రిల్‌ 13న లో అమృత్‌సర్‌లోని జలాయన్‌వాలాబాగ్‌లో జరిగిన మారణహోమాన్ని చూసి చలించిపోయాడు. ఈ దురంతరం తర్వాత ప్రజలంతా పంజా బ్‌లో అన్ని పట్టణాల్లో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. 1922లో ఫిబ్రవరి 4న ఉత్తర ప్రదేశ్‌లోని చౌరీ చౌరాలో రెండు వేల మంది ఉద్యమ కారులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన ప్రారంభించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. నిరసనకారులు తిరగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పింది. పోలీసు కాల్పుల్లో ఉద్యమకారులు పోలీస్‌ స్టేషన్‌పై దాడిచేశారు. దాదాపు 22 మంది పోలీసులను స్టేషన్‌లో బంధించి సజీవ దహనం చేశారు. ఈ ఘటనతో గాందీజీ సహాయ నిరాకర ణోద్యమాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు. ఇది భగత్‌సింగ్‌ను ఆయన ఆనుయాయులను కలచివేసింది. మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతంతో భగత్‌సింగ్‌ తదితర విప్లవకారులు విభేదించారు.
భగత్‌సింగ్‌ హిందుస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌లో సభ్యుడయ్యాడు.

రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ మొదలైన వారు విప్లవ కార్యక్రమాలను అమలు పరిచేవారు. వారిమీద సోషలిస్ట్‌ భావాల ప్రభావం కూడా ఉంది.1928లో భారత్‌లో అప్పటి రాజకీయ వాతావరణాన్ని అంచనా వేసేందుకు సర్‌జాన్‌ సైమన్‌తో బ్రిటిష్‌ సర్కారు ఓ కమిషన్‌ను వేసింది. ఈ కమిషన్‌ రాకను వ్యతిరేకిస్తూ దేశమంతటా నిరసనలు మిన్నుముట్టాయి. లాహోర్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతిరాయ్‌ నిరసనకు నాయకత్వం వహించారు. ఆయనపై పోలీసులు లాఠీ ఝళిపించారు. తీవ్ర గాయాలతో లాలా లజపతిరాయ్‌ కొన్నాళ్ల తర్వాత కన్నుమూశాడు. ఈ ఘటనకు భగత్‌సింగ్‌ ప్రత్యక్ష సాక్షి. ఇందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భగత్‌సింగ్‌ అనుయాయులు నిశ్చయించుకున్నారు. లాలాను చిత్రహింసలకు గురిచేసిన పోలీసు చీఫ్‌ స్కాట్‌ను కాల్చి చంపాలని డిసెంబర్‌ 17న భగత్‌సింగ్‌, ఆజాద్‌, రాజ్‌గురు పధకం వేశారు కానీ పొరపాటున స్కాట్‌కు బదులు సాండర్స్‌ను కాల్చారు. పోలీసులు వీరిని పట్టుకోవడానికి ప్రయత్నించడంతో మారు వేషంతో తప్పించుకున్నారు.

1929 ఏప్రిల్‌ 8న పారిశ్రామిక వివాదాల బిల్లుపై సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. సభాధ్యక్షు డు విఠలబాయ్‌ పటేల్‌ ఓటింగ్‌ ఫలితాన్ని ఇక ప్రకటించబోతారనగా భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌ దత్‌లు ఇద్దరూ చెరో బాంబును పార్లమెంట్‌లో విసిరారు.పార్లమెంట్‌ భవనమంతా పొగతో నిండిపోయింది. అందరూ నలువైపుల నుంచి పలుగురు తీశారు. ప్రేక్షకుల గ్యాలరీలో నుంచి భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌ దత్‌లు ‘సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లాలి, కార్మిక వర్గం వర్థిల్లాలి’ అంటూ నినాదాలు ఇస్తూ భవనంలో కరపత్రాలను వెదజల్లారు. బాంబులు వేసిన కొద్ది సేపటికి పోలీసులు అట్టహాసంగా వచ్చారు.
ఒక సార్జంట్‌ ముందుకు వచ్చి భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌ దత్‌లను అరెస్టు చేశాడు. భగత్‌సింగ్‌, బటుకేశ్వర్‌ దత్‌లపై హత్యానేరారోపణపై విచారణ జరిపించి యావజ్జీవ శిక్ష విధించారు. బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా కుట్ర పన్నాడని భగత్‌సింగ్‌పై మరో 24 కేసులు నమోదు అయ్యాయి. 1930 అక్టోబర్‌ 3న ట్రిబ్యునల్‌ తన 50 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరిస్తూ రాజ ద్రోహానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలని ఆదేశించింది. 1931 మార్చి 23 రానే వచ్చింది. బ్రిటిష్‌ పాలకులు వేళకాని వేళలో రాత్రి 7.30 గంటలకు భగత్‌సింగ్‌, అతని సహచరులు రాజగురు, సుఖ్‌దేవ్‌లను ఉరికొయ్యపై ఎక్కించి ఉరి తీశారు. దేశం కోసం ప్రాణాల్ని త్యాగం చేసిన ఆ విప్లవ ధృవతారలు నేటి యువతరానికి ఆదర్శంగా చెప్పవచ్చు.


మార్చి 23 భగత్‌ సింగ్‌ వర్ధంతి

No comments :

Post a Comment

దళితుల తొలి విప్లవ పోరాటం

1 comment

1927 మార్చి 20వ తేదీ అది దళితులు విప్లవానికి శంఖారావం పూరించిన దినం. భారతదేశపు జాతీయ జీవితంలోనూ, సాంఘిక జీవితంలోనూ ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన దినం.దళిత సమాజం మొట్టమొదటి సారిగా వాస్తవమైన ఆందోళనలో పాల్గొన్న దినం. ఒక అస్పృశ్యుడి నాయకత్వంలో తరతరాలుగా తమను అంటరానివారిగా చూస్తూ, సాటి మానవుని కంటే హీనంగా చూస్తున్న మనువాద సమాజానికి సమాధి కట్టేెందుకు అంకురార్పన చేపట్టిన దినం. అదే తొలి దళిత విప్లవ పోరాటానికి నాంది. ''చవదార్‌ చెరవులో'' (మహాద్‌్‌ చెరువు) నీళ్ళు తాగి తతిమ్మా జనం లాగే దళితులు మనుషులే అని చాటి చెబుతూ డా|| బి.ఆర్‌ అంబేద్కర్‌ నాయకత్వాన సమానత్వానికై జరిగిన పోరాటానికి ప్రారంభ సూచిక అయిన చవ్‌దార్‌ చెరువు ఘటన జరిగి మార్చి 20 నాటికి  85 సంవత్సరాలు గడుస్తూంది.  ఈ సందర్భంగా ఈ ఘటనను స్మరించుకోవాల్సిన బాధ్యత మనందరిది.
డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ అప్పటి వరకు అస్పృశ్య సమాజంలో ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని మేలుకొల్పడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. దళిత సమాజంతో ఆత్మగౌరవం కలిగేటట్టు చూశాడు. మానసికంగా అస్పృశ్య సమాజం ఎంత ముందుకు వెళ్ళిందో అంచనా వేసుకున్నాడు. అస్పృశ్యుల గుండెల్లో ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని అయితే నాటగలిగాడు కాని వస్తాదుకు పోటిలో దిగేంతవరకూ తన శక్తి మీద తనకు నమ్మకం కుదరదు, తన బలాన్ని శత్రు సైనిక బలంతో పోల్చి అంచనా వేయడం కుదరదు. అట్లాగే ప్రయత్న పూర్వకంగా పోరాటంలోకి దిగిన తర్వాతే అస్పృశ్య సమాజానికి ఉన్న శక్తి ఎంత అనేది పరీక్షించడానికి వీలు కలుగుతుంది. డాక్టర్‌ అంబేద్కర్‌కు కూడా ఇదే భావం కలిగింది. అస్పృశ్య సమాజం తన శక్తి సామార్థ్యాలను నిరుపించుకునేందుకు సమయం ఆసన్నమైంది, దానికి మూహుర్తాన్ని మార్చి 20న నిర్ణయించారు. నిచ్చనమెట్ల కుల సమాజంలో మూడువేల సంవత్సరాలుగా  పంచమ కులంగా అగ్రవర్ణ సమాజంచే చీదరించబడుతూ, మంచినీటి చెరువులకు, నదులకు, ఆస్పత్రులకు, విద్యాసంస్థలకు, కోర్టులకు, దేవాలయాలు లాంటి సార్వజనిన స్థలాలన్నింటికి దూరంగా ఉంచిన మనుధర్మాన్ని ధిక్కరించడానికి పూనుకున్నాడు. దీనికి వేదికగా మహాద్‌్‌ను ఎన్నుకున్నాడు. దీనికి కారణం మహాద్‌్‌ ఆయనకు బాగా తెలిసిన ప్రాంతం. సైనిక ఉద్యోగాల నుంచి పెన్షన్‌ పుచ్చుకున్న మహార్‌ జాతికి చెందిన జనం మహాద్‌్‌లోనే నివాసాలు ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా అక్కడ నివశిస్తున్న వారిలో చాలామందికి సాంఘీక కార్యకలాపాల గురించి అవగాహన ఉంది. వీళ్ళందరూ అవసరం వచ్చినప్పుడు జాతికోసం తమ ప్రాణాలని సైతం ఫణంగా పెట్టడానికి సిద్దపడతారనే నమ్మకం బాబాసాహెబ్‌కు ఉంది. అంతేకాకుండా వాళ్ళందరూ సైన్యం నుంచి రిటైర్‌ అయి వచ్చిన వాళ్ళవడం చేత క్రమశిక్షణ వాళ్ళ రక్తంలో ఉంది. 
అనుకున్నట్టుగానే మార్చి 19వ తేదిన మహాద్‌్‌లో పరిషత్‌ను ప్రారంభించడానికి నిర్ణయించారు. దీనిలో పాల్గోనడానికి గుజరాత్‌, మహారాష్ట్రకి చెందిన పల్లెలనుండి సుమారు ఐదువేల మంది జనం వచ్చారు. సాయంత్రం పరిషత్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా చేయబోయే కార్యాన్ని గురించి బాబసాహెబ్‌ ప్రారంభ సూచకంగా ఉత్సాహపూరితమైన ప్రసంగాన్ని ఇచ్చాడు. ఈ ప్రసంగంలో మూడు సూత్రాలను చేపట్టమని బాబాసాహెబు పిలుపిచ్చాడు. 
అవి 1. చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడం మానెయ్యండి. 2. ఎంగిలి భోజనాన్ని స్వీకరించకండి. 3. పెద్దా, చిన్నా అన్న ఊహని మనస్సులోంచి తీసేసి ఉన్నత వర్గాల జీవన విధానాలని స్వీకరించండి. అస్పృశ్య వర్గం వ్యవసాయాన్ని కూడా వృత్తిగా చేపట్టండి అని సలహా ఇచ్చాడు. దళితుల ఆత్మగౌరవాన్ని మేలుకొలిపేటట్లు ఆయన ఉపన్యసించాడు. ఈ ఉపన్యాసం ఆయన కోరుకున్న ప్రభావాన్ని జనంలో కలిగించింది.మహాద్‌్‌ చెరువు విషయంలో ఆ సమయంలోనే మహాద్‌ మున్సిపాలిటీ ఒక తీర్మానం చేసింది. '' ఈ చెరువు సార్వజనికమైనదని దీని నీటిని అస్పృశ్యులతో పాటు జనం యావన్మందీ వాడుకోవచ్చని'' ఈ తీర్మానం సారాంశం. ఈ తీర్మానం  బాబాసాహెబ్‌కు పోరాటానికి మార్గాన్ని సులభతరం చేసినట్టయింది. రెండవరోజు మార్చి 20వ తేదిన ఉదయం తొమ్మిది గంటలకు సమావేశం మొదలయ్యింది. ముందస్తుగా మహాద్‌్‌ మున్సిపాలిటి చేసిన తీర్మానాన్ని అమోదించారు. ఈ తీర్మానాన్ని వెంటనే అమలు పెట్టాలని లక్ష్యంతో బాబాసాహెబు ముందు నడవగా ఐదువేల మంది దళిత సమాజం ఊరేగింపుగా, ఉత్సాహాంగా పాటలు పాడుతూ చవ్‌దార్‌ చెరువు గట్టుకు చేరుకున్నారు. బాబాసాహెబ్‌, ఆ తర్వాత దళిత సమాజం అంతా తరతరాలుగా తమ జాతికి దూరంగా ఉంచబడిన మంచి నీటిని దోసిట్లోకి తీసుకుని తృప్తిగా తాగి మనుధర్మాన్ని ధిక్కరించారు. ఒక పౌరుడిగా, మనిషిగా, మా హక్కుగా మేము తాగుతున్నాం అని మంచినీటిని తాగి తమ హక్కుని ఋజువు  చేశారు. నీళ్ళు తాగిన వారందరి మొహాల్లోనూ వింతైన ఉత్సాహం, సంతోషం తాండవించాయి.ఈ ఉత్సాహంలో బాబాసాహెబ్‌ నాయకత్వంలో దేన్నయిన సాధించవచ్చనే నమ్మకం ఏర్పరచుకున్నారు. ఒక్కోక్కరుగా నీటిని త్రాగిన జనం జట్లుజట్లుగా విడిపోయి తిరిగి సభాస్తలికి చేరుకున్నారు. తరతరాలుగా తాము పవిత్రంగా భావిస్తున్న మనుధర్మానికి ఈ ఘటనతో  పగుళ్ళు ఏర్పడ్డాయని భావించిన సనాతనులు దళితులను ఎదురుదెబ్బ తియడానికి రహస్య మంతనాలు మొదలెట్టారు. మతం విపత్తులో పడిందని  సర్వత్రా ప్రచారం నిర్వహించారు. తమతమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళడానికి సిద్ధపడుతున్న దళితులపై  అకస్మాత్తుగా సనాతన గుండాలు దండెత్తి వచ్చి లాఠీల వర్షం కురిపించారు. ఊరంతా తిరుగుతూ కనిపించిన ప్రతినిధులను కొట్టడం మొదలెట్టారు. ఈ వార్త బాబాసాహెబ్‌కు చేరింది. స్పృహ తప్పి పడిపోయిన జనాన్ని, దెబ్బల బాధని సహించలేక గిలగిల కొట్టుకుంటున్న ప్రతినిధులని చూసి  బాబాసాహెబ్‌ నెత్తురు ఉడుకెత్తింది. అయిన తన కోపాన్ని అదుపులోకి తెచ్చుకొని ఎంతో గాంభీర్యంతో ఈ తరుణంలో మీరు కోపంతో ఉద్రిక్తులు కావద్దు, చెయ్యి చేసుకొవద్దు. మీరు మీ కోపాన్ని దిగమింగుకొని వారి దెబ్బలను సహిస్తూ ఈ సనాతనులకి అహింస మహాత్తు ఎంతో చూపించాలి అని దళిత సమూహానికి బోధించాడు. ప్రతికారేచ్చతో రగిలిపోతున్న దళిత సమాజం, ఆప్ఘను యుద్ధంలోనూ, తదితర యుద్ధాల్లోనూ తమ పరాక్రమాన్ని, వీరత్వాన్ని ప్రదర్శించిన సైనికులు తమ కోపాన్ని దిగమింగుకొని  సనాతులు కురిపిస్తున్న రాళ్ళ వర్షానికి దెబ్బలు తగిలి ఒకరి తర్వాత ఒకరు నేలవాలిపోతున్న అస్పృశ్యులు తిప్పి కొట్టలేదు. తమ నాయకుడి అదేశాన్ని శిరసావహించి సహానం ప్రదర్శించారు. ఒకవేల  అస్పృశ్యులు ఎదురు దెబ్బతియ్యాలని సంకల్పించుకోని ఉంటే, దాడిచేసి ఉంటే  సనాతుల ప్రాణాలను కాపాడడం ఎవరి తరం కాకపోయేది. దెబ్బలు తిన్న వారిని బాబాసాహెబ్‌ స్వయంగా ఆస్పత్రితో చేర్చాడు, ఈ ఘటన జరిగాక సనాతన గుండాలపై కేసులు నమోదు చేయించాడు. 1927 జూన్‌ 6 వ తేదిన తొమ్మిది మంది నేరస్థుల్లో ఐదుగురికి కఠిన కారగార శిక్ష పడింది. ఈ సందర్భంగా '' ఈ కొట్లాట తరుణంలో హిందుయేతర అధికారులు ఉండి ఉండకపోతే విచారణ పక్షపాత రహితంగా జరగడం కష్టం అయ్యేది'' అని అంబేద్కర్‌ అన్నారు. ఆ తర్వాత ఊరూర పల్లెపల్లెలో అస్పృశ్యుల మీద హిందువులు చేసే అత్యాచారాలను, బహిష్కరణలను వారు ఎదుర్కోవలసి వచ్చింది. యావత్‌ భారతదేశంలో అక్కడక్కడా దీనికి ప్రతిస్పందన కనిపించింది. తరువాత సనాతులంతా కలిసి చావదార్‌ చెరువును శుద్ధి చేయ్యాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం చావదార్‌ చెరువులోంచి 108 బిందెల నీళ్ళు తీయించారు. ఇంటింటి నుంచి పేడ, గోమూత్రం పోగుచేసి పాలు, పెరుగు బిందెల్లో కలిపారు. మొత్తం వాటన్నింటిని చావదార్‌ చెరువులో పోసి, శుద్ధి అయ్యిందని ప్రకటించారు. ''మనువాద సమాజంలో మనిషి స్పర్శతో పోల్చితే ఆవుపేడా, గోమూత్రం అధిక పరిశుద్థంగా ప్రకిటించడంలో మనువాద సమాజంలో అస్పృశ్యుల స్థితి ఎలాంటీదో తెలియజేస్తూంది''.
ఈ ఘటన అనంతరం ఆగష్టు 4వ తేదిన మహాడ్‌ మునిసిపాలిటీ ఒక కొత్త తీర్మానాన్ని అమోదించి గతంలో ప్రకటించిన తీర్మానాన్ని రద్దుచేసుకుంది. ఈ తీర్మానాన్ని అంబేద్కర్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు చవ్‌దార్‌ చెరువులో సనాతులతో సమానంగా అస్పృశ్యులు హక్కుగా పొందేవరకు పోరాడాలని నిక్షయించుకున్నాడు. భవిష్యత్‌ కార్యక్రమాన్ని డిసెంబర్‌ 25 వ తేదికి పిలుపునిచ్చాడు, ఈ పిలుపును వ్యతిరేకిస్తూ సనాతులు కోర్టుకు వెళ్ళిన బాబాసాహెబు వెనక్కి తగ్గలేదు. ఈ సందర్భంగా బాబాసాహెబ్‌ మాట్లాడుతూ '' చవ్‌దార్‌ చెరువులోని  నీళ్ళు మనం తాగకపోతే మన ప్రాణాలు ఏమీపోవు, అయితే తతిమ్మా జనంలాగా మనమూ మనుషులమే అని వారందరికి చెప్పాలని మనం వాంఛిస్తున్నాం. సమానత్వానికి శ్రీకారం చుట్టడానికే ఈ ఘటన అని ఆయన పేర్కోన్నాడు''. ఈ హిందు సమాజాన్ని పునర్నిర్మాణం చేయ్యాలని దానికోసం సమానత్వం, జాతిరహిత సహాజం అనేవి మన లక్ష్యాలు కావాలని పిలుపునిచ్చాడు.1789 మే 5వ తేదిన ఫ్రాన్సులోని బర్సాయ దగ్గర జరిగిన  జాతీయసభతో ఈ పరిషత్‌ సభను పోల్చుతూ ''ఫ్రెంచి విప్లవం కోసం వారు ఎలాగు  సంఘటితం కావల్సివచ్చిందో అలాగే మనం కూడా సంఘటితం కావాల్సి ఉంది.ఈ సభలో నిర్దేశించబడిన మార్గమే హిందు సమాజపు అభ్యుదయానికి కావలసిన అత్యవసరమైన మార్గం'' అని చెప్పాడు.  ''పుట్టుకరీత్యా అందరూ సమానంగా పుడతారు వారు చనిపోయేదాక సమానంగా ఉండాలి'', ''మనుస్మృతిని'' దగ్థం చేసేందుకు తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ తీర్మానానికి  పరిషత్‌లో పాల్గోన్న సమాజమంతా ముక్తకంఠంతో అమోదం తెలిపారు. అనుకున్నదే తడువుగా రాత్రి తొమ్మిది గంటలకు  ఒక వేదిక మీద '' మనుస్మృతిని'' దగ్థం చేశారు. అనంతరం చెరువు విషయంలో మహద్‌్‌ మునిసిపాలిటీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం డాక్టర్‌ అంబేద్కర్‌ మహడ్‌ సబ్‌జడ్జీ ఎదుట ''విధించిన నిషేదాజ్ఞలకు'' వ్యతిరేకంగా తిరుగులేని వాదన చేశారు. అయన వాదాన్ని ఖండించడం అసంభమయ్యింది. ఫిబ్రవరి 23వ తేదిన జడ్జి ఆ ఆదేశాన్ని రద్ధు చేస్తూ తీర్పు నిచ్చాడు. ఈ సందర్భంగా మహాద్‌్‌లో జరిగిన విప్లవం గురించి డా|| అంబేద్కర్‌ మాట్లాడుతూ ''నోరు వాని లేని పీిడిత ప్రజలు, చెప్పకోదగిన ఏ ఆఘాయిత్యం జరగకుండా, అతి తక్కువ సమయంలో, సమాన హక్కులను పొందడం అన్నది ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ జరగని, అనుకోని, ఆశించని విప్లవం'' అని పేర్కోన్నారు.
అయితే ఈ తొలి దళిత విప్లవ పోరాటానికి నాంది అయిన సంఘటన జరిగి నేటికి 86 సంవత్సరాలు గడిచిపోయింది. స్వాతంత్య్రం వచ్చి 60 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా కులవివక్షత, అంటరాతనం వివిధ రూపాల్లో నేటికి కోనసాగుతోంది. గతంలో సాక్షి హ్యూమన్‌ రైట్స్‌ నిర్వహించిన సర్వేలో నేటికి 74 శాతం గ్రామాల్లో మంచినీటిసేకరణ వద్ధ, 86 శాతం గ్రామాల్లో ఆలయ ప్రవేశం విషయంలో, 92 శాతం గ్రామాల్లో ఇళ్ళు అద్దెకు ఇవ్వడం దగ్గర, 54 శాతం గ్రామాల్లో హోటల్ల దగ్గర, 90 గ్రామాల్లో బట్టలుతకడం దగ్గర, 82 శాతం గ్రామాల్లో క్షౌరం దగ్గర వివక్ష కొనసాగుతుందని తెలియజేసింది. వీటి నిర్మూలన కోసం అనేక చట్టాలు వచ్చిన అంటరాని తనాన్ని కానీ, కులవివక్షను కాని అరికట్టలేక పోతున్నాయి. అంబేద్కర్‌ వారసులమని చెలామని అవుతున్న నాయకులు కాని సంఘాలు కాని వీటికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించలేకపోతున్నాయి. దళితులపేరు చెప్పుకొని దళిత ప్రతినిధులుగా చట్టసభల్లో ఎన్నికయిన నాయకులు చట్టసభల్లో వీటిగురించి పల్లెత్తు మాటైన మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఓట్లదగ్గర, సీట్లదగ్గర కులాన్ని వాడుకోనే నాయకులు అంబేద్కర్‌ వారసులుగా కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా నిర్మించిన పోరాటాల్లో,  తమ భాగస్వామ్యం ఎంతో బేరీజువేసుకోవాలి.  అంబేద్కర్‌ వారసులంగా ''బోధించు, సమీకరించు, పోరాడు'' అనే నినాదాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత,వీటికి వ్యతిరేకంగా పోరాడిల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.అదే డా|| బి.ఆర్‌ అంబేద్కర్‌ నాయకత్వాన జరిగిన తొలి దళిత విప్లవ పోరాటం ఇచ్చిన పిలుపు.

(సూర్య 20-3-2012)

1 comment :

Post a Comment

No comments
భారతావనికి పచ్చని వడ్డాణంలా, అపార ఖనిజ నిక్షేపా నియంగా విరాజిల్లిన దండకారణ్యం నేడు రణక్షేత్రంగా మారుతోంది. దట్టమైన కీకారణ్యంలో సంప్రదాయ  జీవనం సాగించే గిరిజన సమాజంపై పరచుకున్న విప్లవ మేఘం అరుణారుణ రూపం సంతరించుకుంటోంది. ‘‘ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌’’ పేరిట రాజ్యం తపెట్టిన సాయుధ కార్యక్రమం అక్కడి పచ్చదనాన్ని పొట్టనపెట్టుకునే దిశగానే సాగుతోందంటే అతిశయోక్తి కాదు. బయటకు మావోయిస్టు ఏరివేత క్ష్యంగా కనిపిసున్నా, దాని వెనుక గిరిజన సమాజాన్ని స్థానభ్రంశం చేయడం, అనంతరం అక్కడి అపార ఖనిజ నిక్షేపా వెలికితీతకు మార్గం సుగమం చేయడం, వాటని బహుళజాతి సంస్థకు కట్టబెట్టడం అసు ఉద్దేశం అన్నది నిర్వివాదం. ఈ పోరు ఫలితంగా ఖాళీ అయిన దండకారణ్యంలోని గను తవ్వకాు గుత్తేదారుకు కాసు వర్షం కురిపించవచ్చు. ‘రాయల్టీ రూపేణా ప్రభుత్వాకు కొంతమేర నిధు సమాకూర్చవచ్చు. కానీ ఈ మొత్తం వ్యవహారంలో చిన్నాభిన్నమయ్యేది గిరిజన సమాజమే. రాజ్యం చేపట్టిన హరిత వేటలో సమిధు గిరిజనులే.
జగిత్యా జైత్రయాత్ర తరువాత వామపక్ష విప్లవోద్యమం గోదావరి నది దాటి సిరొంచ, గడ్చిరోలి మీదుగా బస్తర్‌ ప్రాంతానికి, దండకారణ్యానికి విస్తరించింది. దండకారణ్యం కేంద్రంగా దాని చుట్టూ ఉన్న ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, ఒరిస్సా, మహారాష్ట్రాల్లో కార్యకలాపాు నిరాటంకంగా సాగిస్తోంది. 1990లోనే దండకారణ్యంలో నక్సలైట్ల ప్రాబల్యాన్ని నిరోధించడానికి ప్రయత్నాు మొదయ్యాయి. అవన్నీ కేవం గిరిజన సమాజాన్ని తమ వైపు తిప్పుకొని రాజకీయంగా ఎదిగేందుకు కొందరు గిరిజన నేతు చేసిన ప్రయత్నాు మాత్రమే. ఇప్పటి ప్రభుత్వా మాదిరిగా భారీ సంక్పంతో చేసినవి కావు. అందువ్ల గిరిజన సమాజం చెక్కుచెదరలేదు. వామపక్ష విప్లవోద్యమ విస్తృతీ తగ్గలేదు. 1991లో కాంగ్రెస్‌ నాయకుడు మహేంద్రవర్మ బస్తర్‌ ప్రాంతంలో నక్సలైట్లకు వ్యతిరేకంగా జన జాగరణ్‌ అభియాన్‌ అనే సంస్థను ఈ విధంగానే ఏర్పాటు చేశారు. నక్సలైట్ల తీవ్ర ప్రతిఘటనతో ఈ సంస్థ ఎక్కువ కాం మనలేకపోయింది. దాదాపు 15 ఏళ్ల పాటు వామపక్ష విప్లవోద్యమం దండకారణ్యంలో అవిచ్ఛిన్నంగా విస్తరించింది. దండకారణ్యంలోని చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మావోయిస్టుకు కీక స్థావరంగా మారిపోయింది. 2005 జూన్‌లో అప్పటి కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేతగా ఉన్న మహేంద్రవర్మ మళ్లీ శాంతిసేన పేరిట సల్వాజుడుం అనే సంస్థను ఏర్పాటుచేశారు. వసపాకు వదిలిపోయిన ‘విభజించి...పాలించు’ సిద్ధాంతం అసరాగా ఏర్పడిన సల్వాజుడుం గిరిజనును తెగ పేరిట విడదీసింది.


నక్సలైట్లకు వెన్నుదన్నుగా గొత్తికోయు నిలిస్తే ` వారితో తెగరిత్యా విభేదాున్న రాచకోయతో సల్వాజుడుం ఏర్పాటుచేయడంతో గిరిజన సమాజం చీలికు పేలికలైంది. దాదాపు 40వే మంది సభ్యున్న ఈ సేనలో 10 వే మందికి పైగా సాయుధును ప్రత్యేక పోలీసు అధికారు (ఎన్‌.పి.ఒ) హోదాతో నక్సలైట్లను తుదముట్టించడానికి నియమించారు. మావోయిస్టును ఎదుర్కొనే క్ష్యంతో ప్రారంభమైన సల్వాజుడుం చివరకు ూఠీకు, హత్యకు, అత్యాచారాకు, గృహదహనాకు దారితీసింది. గ్రామకు గ్రామానే దహనం చేశారు. మవోయిస్టు సానుభూతిపరునే పేరిట సామూహిక హత్యాకాండతో దంతెవాడ, కుంట, నారాయణపూర్‌, బస్తర్‌ ప్రాంతాల్లో సల్వాజుడుం కార్యకర్తు ఎన్‌.పి.ఒ ు తెగబడ్డారు.  సల్వాజుడుం ఆగడాతో వెయ్యిమందికి పైగా గిరిజను ప్రాణాు కోల్పోయారు. 644 గ్రామాు జనసంచారానికి దూరమయ్యాయి. దాదాపు 3.5 క్ష మంది నిర్వాసితుయ్యారు. రెండు క్షమంది గిరిజను ఆచూకీ ఇప్పటికీ ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం కనుగొనలేకపోయింది. సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్ర, ఒరిస్సాల్లో సుమారు 60 వే మంది తాత్కాలిక నివాసాు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మరో 70 వే మంది వరకు సల్వాజుడుం ఏర్పాటుచేసిన శిబిరాల్లో తదాచుకుంటున్నారు. నక్సల్స్‌కు వ్యతిరేకంగా ` శాంతికోసం ఏర్పాటైనట్లు ప్రచారం పొందిన ఉద్యమమే గిరిజన సమాజాన్ని ఇంతగా అతలాకుతం చేస్తే ` ‘హరిత వేట’ పేరిట ప్రస్తుతం భద్రతాదళాు జరిపే దమనకాండ ఎక్కడికి దారితీస్తుందో సుభంగానే ఊహించవచ్చు. షెడ్యూల్డ్‌ తెగ చట్టం 1996 ప్రకారం ఆదివాసు గ్రామాకు సంబంధించిన నిర్ణయాన్నీ గ్రామసభ తీర్మానా మేరకే తీసుకోవాలి. ఎటువంటి తీర్మాణాూ లేకుండానే ఆదివాసీ గూడేను పోలీసు బగాు ఆక్రమించేస్తున్నాయి. గిరిజను కనీస అవసరాకు ఉపయోగపడే సంతు, పాఠశాలు, అంగన్‌వాడీ కేంద్రాు, ఆరోగ్య కేంద్రాను సాయుధ బగాు ఆక్రమించి తమ కార్యకలాపాకు కేంద్రాుగా మార్చుకున్నాయి. ఇది అంతర్జాతీయ ఒప్పందాను ఉ్లంఘించడమే అయినా ఖాతరు చేయడంలేదు. అడవుల్లో దాగిన మావోయిస్టుకు ఆహార పదార్ధాు అందకూడదనే ఉద్దేశంతో సంత నిర్వహణను పోలీసు నిషేధించారు. అటవీ సంపద అయిన చింతపండు, సీతాఫం, ఇప్పపువ్వు, తునికాకు, అడ్డాకు, కర్రబోగ్గు తదితరా సేకరణే గిరిజనుకు జీవనోపాధి. తాము సేకరించిన వస్తువును సంతల్లో వస్తుమార్పిడి విధానంతో వ్యాపారుకు అమ్ముకుని అహారధాన్యాు, ఇతర నిత్యావసరాను సమకూర్చుకుంటుంటారు. అటువంటి సంతపై నిషేదం విధించడం ద్వారా గిరిజను ఆహార భద్రపైనే దెబ్బకొట్టేందుకు ప్రభుత్వాు ప్పాడుతున్నాయి. ఈ నిర్ణయం ఆదివాసును ఆకలి మంటల్లోకి నెట్టేస్తోంది.
దండకారణ్యంలో విప్లవోద్యమం వేళ్లూనుకుంటున్న సమయంలో ` దేశీయంగా నూతన ఆర్థిక విధానా అములో భాగంగా పెట్టుబడిదాయి, బహుళజాతి సంస్థకు ద్వారాు తెరవడం మొదలైంది. దండకారణ్యంలోని ఇనుప గను, అబ్రకం, డోమైట్‌, బాక్సైట్‌, సున్నపురాయి. తగరం, యురేనియం మొదలైన 39 రకా ఖనిజాపై బహుళజాతి సంస్థ కన్నుపడిరది. దేశంలో 90శాతం బాక్సైట్‌ ఒరిస్సా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని అటవీ ప్రాంతాల్లోనే ఉంది. ఈ రాష్ట్రాల్లో సాగుతున్న ఖనిజ తవ్వకాు ఆదివాసు మనుగడకు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. రాబోయే ఆరేళ్లలో గనుపై ఐదు క్ష కోట్ల రూపాయ పెట్టుబడును విదేశీమారక ద్రవ్యం రూపంలో ఆకర్షించడం, పది క్ష ఉద్యోగా క్పన క్ష్యంగా రూపొందించిన నూతన ఖనిజ విధానం అడవు పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటికే విశాఖ మన్యంలో జిందాల్‌, అన్‌రాక్‌, రన్‌ ఆల్‌ ఖైమా, ఒరిస్సాలో ఎస్సార్‌, వేదాంత, జిందాల్‌ తదితర సంస్థకు రాష్ట్ర ప్రభుత్వాు గనును ధారదత్తం చేశాయి. ఆదివాసు జీవితాల్లో మెగు నింపేందుకు చేస్తున్న అభివృద్ధిగా ప్రభుత్వాు మభ్యపెడుతున్నాయి. వాస్తవానికి పెట్టుబడిదాయి, బహుళజాతి కంపెనీలే వీటివ్ల లాభపడుతున్నాయి. ఆయా రాష్ట్రా ఆర్థిక పరిపుష్టికి సైతం ఇవి పెద్దగా దోహదపడటం లేదన్నది నిర్వివాదం. ఆర్థిక వెసుబాటుకు ఖనిజ నిక్షేపాపైనే అధికంగా అధారపడుతున్న జార్ఖండ్‌, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రా తసరి ఆదాయం ఇతర రాష్ట్రా కంటే తక్కువగా ఉండటం ఇందుకు తిరుగులేని నిదర్శనం. ఒరిస్సాలో అత్యధికంగా గను తవ్వకం సాగుతున్న కిరండోల్‌, కహండి ప్రాంతాల్లో 60 శాతానికి పైగా ఆదివాసు దుర్భర దారిద్య్రంలో మగ్గుతున్నారు. అవకాశా స్వర్గంగా పిలిచే ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఆపార ఖనిజ నిక్షేపాలే నేటి ఆ రాష్ట్ర అంతర్యుద్ధ పరిస్థితుకు ప్రధాన కారణం. దీని ప్రభావం మావోయిస్టు ప్రాబ్యమున్న సరిహద్దు రాష్ట్రాల్లోనూ ప్రతిఫలిస్తోంది. గిరిజనును సభ్యసమాజానికి దూరంగా అడవుల్లోనే ఉంచేయాని ఎవరూ అనరు. స్వాతంత్య్రానంతరం భారత దేశం సాధించిన అభివృద్ధి ఫలాు అదివాసుకు కనీస స్థాయిలోనైనా అందడం లేదు. షెడ్యూల్‌ కులాు, తెగ వారికోసం ప్రత్యేక ప్రణాళిక నిధు కేటాయించి ఉప ప్రణాళికు అముచేయడంపైనా ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ తదితర 11 రాష్ట్రా ప్రభుత్వాు శ్రద్ధవహించడం లేదు. మావోయిస్టున్నందు వల్లే గిరిజన ప్రాంతాు అభివృద్ధికి నోచుకోవడం లేదని, వారిని ఏరివేస్తే ఆయా ప్రాంతాను ప్రగతిపథంలో నడిపించగమనే అభిప్రాయం పసలేనిది. సాగునీటి ప్రాజెక్టు, జవిద్యుత్‌ పథకాు, గను, పరిశ్రము, అభివృద్ధి పేరిట గిరిజనును అడవినుండి వెళ్లగొడుతున్నారు. పోవరం ప్రాజెక్టు పేరిట ఖమ్మం, గోదావరి జిల్లాల్లో 300 గిరిజన అవాసాు తొగించారు. కొమురం భీం ప్రాజెక్టు పేరిట అదిలాబాద్‌ జిల్లాలో, బాక్సైట్‌ మైనింగ్‌ కోసం విశాఖ, విజయనగరం జిల్లాల్లో, ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ పేరిట అదిలాబాద్‌,కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో అటవీ ప్రాంత వాసు నిరాశ్రయువుతున్నారు. పు పేరిట శ్రీశైం  అడవు, ఏనుగు పేరిట చిత్తూరు, విజయనగరం శ్రీకాకుళం గిరిజనును అడవుకు దూరం చేసే ప్రయత్నాు జరుగుతున్నాయి. గత 6 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల కార్యకలాపాు పూర్తిగా అడుగంటాయి. ఆ సమయంలో అదిలాబాద్‌ నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న గిరిజన ప్రాంతాల్లో కనీస వైద్యసౌకర్యాు మెరుగపడలేదని మలేరియా పీడిత పల్లెలే చెబుతున్నాయి.
సంస్కృతిపై దాడి:
 భయోత్పాతం సృష్టించి అడవుల్లో భద్రత లేదనే అభిప్రాయం కల్పించి, గిరిజనును మైదాన ప్రాంతాకు తరలించానే ప్రభుత్వా ప్రయత్నాను గిరిజన సమాజ సంస్కృతీ, సంప్రదాయాపూ దాడిగానే పరిగణించాలి. దేశవ్యాపితంగా విస్తరించిన బహుళ జాతి సంస్ళ వ్ల ఇప్పటికే మైదానప్రాంతాల్లో సంప్రదాయ చేతివృత్తు కనుమరుగైపోయాయి. పల్లెల్లో సైతం తాగునీటిని కొనుగోు చేయాల్సిన దుస్థితి దాపురించింది. ప్రస్తుతం స్వచ్ఛమైన నీరు. భూమి, సహజ వనయి, ఖనిస నిక్షేపాు అడవుల్లోనే మిగిలి ఉన్నాయి. వాటిని కబళించే ఉద్దేశంతో అదివాసు తరలింపునకు సాగుతున్న ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ వ్ల భవిష్యత్తరాకు గిరిజన సమాజం చరిత్ర పాఠ్యాంశాకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. నక్సలైట్ల హింసా విధ్వంసాను, వారి రాజకీయ పంథాను ఆమోదించలేం కానీ` ఆ ఉద్యమం నిర్భాగ్యు పాలిట ఆంబనగా మారడమనేది, అంగీకరించక తప్పని వాస్తవం. అభివృద్ధి పేరిట ప్రస్తుతం రాజ్యం చేసే విధ్వంసం నిర్వాసిత ఆదివాసు సమస్యను మరింత జటిం చేస్తుందనడం నిష్ఠుర సత్యం.

No comments :

Post a Comment

మహిళా బిల్లును మరిచామా?

No comments

భారతదేశ పార్లమెంట్‌ చరిత్రలో మెజారిటీ ఉండికూడా చట్టంగా రూపుదాల్చని వాటిలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఒకటి. దేశంలో ఏకాభిప్రాయం లేని కారణంగా ఇది ఎన్నో సంవత్సరాలనుండి పార్లమెంట్‌లో చట్టంగా రూపుదాల్చలేక పోతోంది. ప్రస్తుత ప్రభుత్వమైనా తన ప్రభుత్వ పదవీకాలం ముగిసే లోపు ఇది చట్టరూపం దాల్చేలా కృషిచేసేందుకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అం దరూ దీక్ష పూనాల్సిన అవసరం ఉన్నది. 

అన్ని వివక్షల్లో కెల్లా స్త్రీ వివక్ష చాలా ప్రమాదకరమైనది. సమాజంలోని లింగవివక్షను రూపుమాపి మహిళల సాధికారికతకు దోహదం చేయాలంటే మహిళా రిజర్వేషన్‌లు తప్పనిసరి. నేటి సమాజంలో మహళా సాధికారికతకు దోహదం చేసే ప్రభుత్వ పథకాలన్నీ సమర్ధవంతంగా అమలు జరగాలంటే ఆ పథకాల నిర్మాణంలో, అమలులో వారి భాగస్వామ్యం తప్పనిసరి. తద్వారా మహిళా సాధికారికత సాధించడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా మహిళలు స్వావలంభన పొందగలుగు తారు. అదే విధంగా ప్రభుత్వ విధానాలను మహిళలకు అనుకూలంగా మార్చేందుకు కృషి చేస్తారు. అందువల్ల ప్రభుత్వ విధానాల తయారీలో మహిళల భాగస్వామ్యం పెంచాలంటే వారికి రాజకీయ భాగస్వామ్యం కల్పించాలి.

అత్యధిక సంఖ్యలో ప్రజలకు రాజకీయ పాలనలో భాగస్వామ్యం కల్పించేదే ప్రజాస్వామ్యం. అయితే సమాజంలో దాదాపు సగం వరకు మహిళలకు రాజ కీయ పాలనలో, ప్రభుత్వ విధానాల నిర్మాణంలో వారికి సరియైన ప్రాతినిధ్యం లభించుట లేదు. దేశ జనాభాలో 50 శాతాన్ని ఆక్రమించిన మహిళలు రాజ కీయ పదవులలో ఎన్నడూ 8.4 శాతానికి మించిలేరు. కాని ప్రపంచ దేశాలలో చాలా దేశాలు మహిళలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడంలో భారతదేశం కంటే ముందువరుసలో ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలోని మొజాంబిక్‌, దక్షిణ ఆఫ్రికా దేశాలలో మొత్తం మహిళలలో 30శాతం నుండి 35 శాతం మంది అక్కడి పాలనలో భాగస్వామ్యం పొందుతున్నారు. మన పొరుగు దేశం పాకిస్థా న్‌లోసైతం దాదాపు 23 శాతం మంది మహిళలు పాలనలో భాగస్వామ్యం పొందుతున్నారు. మొత్తంమీద ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15 శాతం మంది మహిళలు పాలనలో భాగస్వామ్యం పొందుతున్నారు. మన దేశంలో ప్రపంచ సగటుకన్నా తక్కువగా 8.4 శాతం మాత్రమే మహిళలు భాగస్వామ్యం వహిస్తు న్నారు. అందువల్ల ప్రజాస్వామ్యాన్ని మరింతగా పరిపుష్ఠం చేయడానికి, సుసంపన్నం చేయడానికి మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్‌లను కల్పించడం తప్పనిసరి.

అభివృద్ధి అజెండాను మార్చేందుకు మహిళా రిజర్వేషన్‌ చాలా అవసరం. నేడు ఆర్ధికాభివృద్ధిలో భారతదేశం పురోగమిస్తోంది. కాని మానవాభివృద్ది నివేది కలో ఇప్పటికే చాలా వెనకబడి ఉన్నాము. ప్రభుత్వ పాలనలో మహిళల భాగస్వా మ్యం పెరిగితే ప్రభుత్వ విధానాల్లో మానవాభివృద్ధి ప్రధాన అజెండాగా వస్తుంది. ఎందుకంటే మానవాభివృద్ధి సూచిక అంశాలలో మహిళలకు కల్పించే సౌకర్యాలని కూడా ఒక అంశంగా పరిగణిస్తారు. మంచినీటి వసతి, పిల్లల ఆరోగ్య విషయాలు, పౌష్ఠికాహార కల్పనలలో తల్లి ఎక్కువగా కృషిచేస్తుంది. అందువల్ల మహిళలకు ప్రభుత్వపాలనలో భాగస్వామ్యం కల్పించడం వల్ల వారు సమాజానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపొందించుటకు అవకాశం ఉంటుది.నేటి నేరపూరిత, అవినీతి పూరిత రాజకీయాల్ని తగ్గించేందుకు కూడా రాజకీయాలలో మహిళల భాగస్వామ్యం దోహదం చేసి, రాజకీయ ప్రక్షాళాన జరిపేందుకు అవకాశం ఉంది. కాని గత 50 ఏళ్ల పార్లమెంట్‌ చరిత్రలో ఏ రాజకీయపార్టీ స్వచ్ఛందంగా మహిళలకు ప్రాధాన్యతఇచ్చి వారిని ప్రభుత్వ విధానాల రూపకల్పనలో భాగస్వాములను చేయుటకు ముందుకు రాలేదు. సంకీర్ణ రాజకీయాలలో ప్రతి సీటు చాలా ప్రాముఖ్యత వహించిందని, అందువల్ల ఎక్కువ సీట్లను మహిళలకు కేటాయించడం లేదని అన్ని పార్టీలూ సమర్ధించుకుంటున్నాయి. అయితే పరోక్ష ఎన్నికలకు అవకాశం ఉన్న శాసన మండలి, రాజ్యసభ సీట్లలో కూడా స్ర్తీలకు తగిన అవకాశాలను కల్పించడంలో రాజకీయపక్షాలు వెనకాడుతున్నాయి.

మహిళా రిజర్వేషన్‌లపై ప్రధాన అభ్యంతరం ఏమిటంటే- అగ్రకులాలకు చెం దిన మహిళలే అధింగా లాభపడి, సామాజికంగా వెనుకబడిన వర్గాల మహి ళలకు అన్యాయం జరుగుతూ చట్టసభల సామాజిక పొందిక దెబ్బతింటుంద నేది. అగ్రకులాల మహిళలతో వెనకబడిన కులాలకి చెందిన మహిళలు పోటిప డలేరు. ఈ అభ్యంతరం వల్లనే మహిళా రిజర్వేషన్‌ బిల్లు చట్టరూపం దాల్చలేక పోతోంది. దీనిని పరిశీలిస్తే ఇది న్యాయమైన వాదనగా అర్ధమవుతుంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలు చేసినట్లయితే వాస్తవానికి సామాజికంగా వెనకబడిన వర్గాలకు సరియైన ప్రాతినిధ్యం లభించకపోవచ్చు. లింగవివక్షతను అధిగమిం చాలంటే ఉప కోటాతో సహా మహిళారిజరేషన్‌ బిల్లు అమలుపరచడం అవసరం. అయితే ప్రస్తుతంఉన్న రూపంలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు పరచడం వల్ల వెనకబడిన వర్గాల మహిళలకు నష్టం కలుగుతుంది.

భారతదేశంలో కులం ఒక బలమైన వ్యవస్థ. ఇది దేశరాజకీయాల్ని నిర్దేశిం చగలుగుతోంది. రాజకీయ సమీకరణకు కులం ఒక ప్రాతిపాదిక. మండల్‌ కమిషన్‌ సిఫార్స్‌ల అనంతరం దేశరాజకీయాలల్లో సామాజికా మధనం ప్రారంభమైంది. దీని ప్రకారం దేశరాజకీయాలలో వెనకబడిన వర్గాలకు చెందిన వారి రాజకీయ ప్రాబల్యం పెరిగింది. మహిళా రిజర్వేషన్‌లను ప్రవేశపెట్టి ఉప కోటా అమలుచేయవచ్చు. ప్రస్తుత రూపంలో మహిళా రిజర్వేషన్‌లు పూర్తిగా పలుకుబడి గలవారికే ఉపయోగప డతాయి. దక్షిణాసియా దేశాలలో మహిళలలో ఎక్కువమంది పలుకుబడి కలిగిన వర్గాలనుండివచ్చి రాణించినవారే అధికం. రాజ్యాంగం స్థానిక సంస్థలలో 33 శాతం సీట్లను స్త్రీలకు కేటాయించడం ద్వారా నేడు సుమారు 10 లక్షలమంది మహిళలు పాలనలో పాల్లోనే అవకాశంవచ్చింది.

వారిలో ఎందరో జడ్పీటీసీలు గా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, సర్పంచ్‌లుగాపనిచేస్తున్నారు. వీరు కూడా తమకు అవకాశాలు వస్తే రాజకీయ రంగంలో అద్భుతాలు చేయగలమని నిరూ పించారు. కాబట్టి మహిళలను నైపుణ్యం లేనివారని తక్కుగా అంచన వేయడం సరియైనదికాదు. ప్రతి రాజకీయపార్టీ మహిళా రిజర్వేషన్‌ చట్టం రూపం దాల్చేందుకు పురుష్యాధిక్యతను పక్కకుపెట్టి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.

No comments :

Post a Comment