‘ఈలం’ ఆకాంక్ష బతికే ఉంటుంది!

No comments

‘‘ప్రభాకరన్‌ చచ్చిపోవచ్చు
అతని కొడుకూ చచ్చిపోవచ్చు
ఎన్నికల ప్రజాస్వామ్యానికి కదా కుటుంబ పాలన అవసరం
ఈలం ఏర్పడడానికి జాతి బతికి ఉంటే చాలు
జాఫ్నా బతికి ఉంటే చాలు
అక్కడి గాలీ, నేలా, నీళ్లూ
బతికుంటే చాలూ
నెత్తురోడుతూ
గాయాలు తడుముకుంటూ
కన్ళీళ్లు తుడుచుకుంటూ
కలలు కంటూ
తమ దేశంలోనే నిర్వాసితుగానైనా సరే
ప్రవాసంలోనైనా సరే
ప్రజలు బ్రతికుంటే చాలూ’’
‘ఈలం’ ఆకాంక్ష బతికుంటుంది ’’

అని విప్లవ కవి వరవర రావు ప్రభాకరన్‌ మరణం తర్వాత రాశాడు.


ఇవ్వాళ శ్రీలంకలో జరుగుతున్నది కూడా అదే. ప్రభాకరన్‌ మట్టుబెట్టిన తర్వాత శ్రీలంకలోని తమిళుల హక్కులను, అస్తిత్వాన్ని నామరూపంలేకుండా చేశామని విర్రవీగుతున్న శ్రీలంక ప్రభుత్వానికి గత సంవత్సరం సెప్టెంబర్‌లో శ్రీలంక నార్త్‌ ప్రావిన్స్‌ ఎన్నికల్లో  తమిళులు తమ ఆకాంక్షను నిర్భాందాల మాటున నిరూపించి చూపారు. మానవ హక్కులను తన ఉక్కుపాదంతో తొక్కివేసిన శ్రీలంక ప్రభుత్వం, సుదీర్ఘ యుద్ధం తర్వాత, అంతర్జాతీయ ఒత్తిడి మేరకు అనివార్య పరిస్థితిలో నిర్వహించిన ఎన్నికల్లో మైనారిటీ తమిళుల చేతిలో చావుదెబ్బ తినాల్సి వచ్చింది.


సెప్టెంబర్‌లో జరిగిన ఉత్తర శ్రీలంక ఎన్నికలో తమిళ జాతీయ కూటమి (తమిళ్‌ నేషనల్‌ అయోన్స్‌ ` టిఎన్‌ఎ) సాధించుకున్న అసాధారణ, అఖండ విజయం విస్తృత స్వయం పాలనాధికారా కోసం అక్కడి తమిళులు పడుతున్న అరాటాన్ని చాటిచెప్పింది. 38 మంది సభ్యులుగల ఉత్తర శ్రీంక రాష్ట్రీయ మండలి (ప్రావిన్స్‌)కి జరిగిన ఎన్నికల్ల్లో టిఎన్‌ఏ 30 స్థానాలు గెలిచి, తమిళుల్లో రగులుతున్న ఆత్మగౌరవ స్పృహ, స్వయం పాలన ఆకాంక్ష దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించే తీర్పు నిచ్చాయి. ఇరవై ఆరు సంవత్సరాల చరిత్రాత్మక సాయుధ తిరుగుబాటులో జాతి ఆకాంక్ష కోసం ఎంతో ప్రాణ నష్టాన్ని, మరెంతో విధ్వంసాన్ని చవిచూసింది శ్రీలంక తమిళగడ్డ. బప్రయోగంతో, మానవ హక్కును ఉ్లంఘించి అణచివేతను అనుభవించిన తమిళ ప్రజలు అంతర్జాతీయ ఒత్తిడుల మూలంగా అందివచ్చిన నామమాత్రపు ప్రజాస్వామిక ఘట్టమైన ఎన్నికలను తమ స్వయం నిర్ణయాధికారపు హక్కు కోసం ఉపయోగించుకున్నారు. తమలో జాతి ఆకాంక్ష ఇంకా ఉందని ప్రస్ఫుటం చేయడానికి ఈ ఎన్నికను ఉపయోగించుకుని అత్యధిక స్థానాలు సాధించడంద్వారా తమ నిర్ణయాన్ని వ్లెడించారు.


ఈ ఎన్నికల్లో తమిళ నేషనల్‌ అయెన్స్‌ సాధించుకున్న అఖండ విజయం 1983కి ముందు ప్రాంతీయ స్వయం పాలన అధికారాల కోసం తమిళులు చేస్తూ వచ్చిన డిమాండ్‌ను అత్యంత బలంగా పునరుద్ధరింప చేస్తున్నది. సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహించిన  ఈ ఎన్నికలో గెలుపు కోసం శాయశక్తులా కృషి చేసిన శ్రీంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సేకు చెందిన పాలక కూటమి యునైటెడ్‌ ఫ్రీడమ్‌ అయెన్స్‌ కేవలం ఏడు స్థానాతోనే సరిపుచ్చుకోవడాన్ని చూస్తే శ్రీలంక ప్రభుత్వంపైన తమిళులు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అధ్యక్షుడి అధికారం గాని, డబ్బు గాని తమిళుల జాతి ఆకాంక్ష ముందు దిగదుడుపే అని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. ఈలం కోసం ఎల్‌టిటిఇ సాగించిన హింసాయుత పోరాటాన్ని టెర్రరిస్ట్‌ సంస్థ పేరుతో అంతర్జాతీయంగా ఒంటరిని చేసి, ఎల్‌టిటిఇని, నాయకత్వాన్ని నామరూపం లేకుండా చేయడంతో విజయం సాధించిన రాజపక్సే ప్రభుత్వాన్ని, తమ నామ మాత్రపు ప్రజాస్వామంతో, తమ ఓతు బ్యాంక్  ద్వారా తిప్పికొడుతూ స్వయం పాలన డిమాండ్‌ మరోసారి పాలక వర్గం ముందు ఉంచింది.


శ్రీలంక సింహళ, తమిళ ప్రాంతాల మధ్య రాజకీయ సంధి, సమన్వయం కుదర్చడానికి ఈ ఎన్నికలు ఒక మంచి అవకాశమని ఐక్యరాజ్య సమితి ఎన్నిక సందర్భంలో వ్యాఖ్యనించింది. అధ్యక్షుడు రాజపక్సే ఈ ఎన్నికల ఫలితాలిచ్చిన సందేశాన్ని అర్థం చేసుకొని అందుకు తగు రీతిలో నిర్ణయాలు తీసుకోవసి ఉంటుందని కూడా పరోక్షంగా హెచ్చరించింది. అంతర్యుద్ధ కాలంలో ఎల్‌టిటిఇకి శ్రీలంక సేనలకు మధ్య జరిగిన కాల్పుల్లో చిక్కుకున్న జాఫ్నా ప్రాంతంలో క్షతగాత్రులై, నిర్వాసితులై, కొంప గూడు కోల్పోయి ఇప్పటికీ శరణార్థుల శిబిరాలో మగ్గుతున్న లక్షలాది మంది తమిళులకు గౌరవ ప్రదమైన భద్రాతాయుతమైన జీవనాన్ని పునరావాసాన్ని కల్పించవసి ఉన్నదని, ఏడు లక్షలకు పైగా తమిళ ఓటర్లు ఎనుకున్న ప్రొవిన్షియల్‌ కౌన్సిల్‌కు ప్రభావవంతమైన అధికారాలకు తగినన్ని నిధును ఇవ్వలిసిన బాధ్యత రాజపక్సే ప్రభుత్వంపై ఉన్నదని శ్రీంక ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించింది. ప్రొవిన్సియల్‌ కౌన్సిల్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన టిఎన్‌ఎ నేత విఘ్నేశ్వరన్‌ కూడా శ్రీలంక కేంద్ర ప్రభుత్వంతో చర్చల ద్వారా తమ ప్రాంతానికి చెందవసిన అధికారాను నిధును సాధించుకుంటామని ఆమేరకు రాజపక్సే నుండి తగిన సహకారం లభించని పక్షంలో అంతర్జాతీయ సమాజం జోక్యాన్ని కోరుతామని సెవిచ్చాడు.

అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఉన్న సి.వి.విఘ్నేశ్వరన్‌, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్‌టిటిఇ దివంగత నేత ప్రభాకరన్‌ను ‘‘మహావీరుని’’గా పొగిడి, తమిళుల స్వయం నిర్ణయాధికారం కోసం పాటుపడతానని హామీ ఇచ్చాడు.   అయితే తమిళుల స్వయం నిర్ణయాధికార ఆకాంక్షలు రాజ్యాంగానికి లోబడి అయిన నేరవేర్చాంటే శ్రీంక ప్రభుత్వంతో అనివార్యంగా ఘర్షణ తప్పదు. ప్రస్తుత శ్రీలంక చట్టాల ప్రకారం  కౌన్నిళ్లచే ఎన్నుకోబడిన వ్యక్తి కన్నా దేశ అధ్యక్షుడు నియమించే గవర్నర్‌కే అధికారాలు ఎక్కువ ఉంటాయి. దీంతో ఫెడరల్‌ ప్రభుత్వంతో ఘర్షణ అనివార్యమని తొస్తుంది. ప్రజ ఆకాంక్షలు, హక్కులు తిరస్కరించబడితే గతం పునరావృతంకాకుండా మానదు. గత చరిత్ర చెబుతున్న పాఠం కూడా అదే.

గత చరిత్రలో ఉ్లంఘనలు : 
1948లో బ్రిటిష్‌ వలస పాలన నుంచి స్వాతంత్య్రం అనంతరం కూడా ఉత్తర తూర్పు ప్రాంతాలోని తమిళులు తమకు ప్రాంతీయ స్వయం పానాధికారాలు కల్పించాని డిమాండ్‌ చేస్తూ వచ్చారు. అయితే 1948లో డిఎస్‌ సేనానాయకే నాయకత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిలోన్‌ పౌరసత్వపు చట్టం భారతీయ సంతతి వారికి పౌరత్వాన్ని నిరాకరించే పేరుతో తమిళులందరి పౌరసత్వాన్ని రద్దుచేసింది. ఆ దుర్మార్గ చట్టాన్ని ఎత్తివేయించడానికి సుప్రీంకోర్టుకూ, చివరికి బ్రిటన్‌లోని ప్రైవీ కౌన్సిల్‌కూ మొరపెట్టుకుని ఓడిపోవడంతో తమిళుల ఆత్మగౌరవపోరాటం ప్రారంభమయింది. 1956లో దేశంలో సింహళాన్ని ఏకైక అధికార భాషగా ప్రకటిస్తూ మరొక చట్టం తేవడంతో సింహళ పాకవర్గాలు ఉద్దేశ్యాలు మరింతగా స్పష్టమయ్యాయి. 1947లోనే తమిళులకు కల్పించిన రక్షణను తొగిస్తూ శ్రీలంక ప్రభుత్వం 1972లో రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. మెజారిటీ సింహళీయుల ఆధినంలోని శ్రీలంక ప్రభుత్వం తమిళుల హక్కులను కాలరాచే చట్టాను తీసుకురావడంతో ఆ చట్టాన్నిటిని వ్యతిరేకిస్తూ తమిళ ప్రజాప్రతినిధులు  శాంతియుత సత్యాగ్రహాన్ని నిర్వహిస్తే, సింహళ సంస్థలు ఆ ఆందోళనను హింసాత్మకంగా అడ్డుకుని, తమిళులను ఊచకోత కోశాయి.

1958, 1977, 1981, 1983 లో శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన జాతి పోరాటంలో వేలాది మంది బలి అయ్యారు. రెట్టింపు సంఖ్యలో నిరాశ్రయుగా మారిపోయారు. తమిళుల సమస్య పరిష్కారం ఇక సమైక్య శ్రీలంకలో పరిష్కారం కాదనీ, తూర్పు, ఉత్తర ప్రాంతాలతో స్వతంత్ర ఈలం (చరిత్రలో తమిళ స్వతంత్ర రాజ్యంగా కొనసాగిన సామ్రాజ్యం) స్థాపించుకోవడం ఒక్కటే మార్గమని భావించారు. 1976లో వెడ్డుకొట్టైలో జరిగిన ఒక సదస్సులో ప్రత్యేక తమిళ ఈలం మాత్రమే పరిష్కారమని తీర్మానం చేశారు. ఇదే చారిత్రాత్మక వెడ్డుకొట్టై తీర్మానంగా ప్రసిద్ధి చెందింది. దీన్నే ఎన్నిక మేనిఫెస్టోగా ప్రకటిస్తూ తమిళ పార్టీనన్నీ అప్పటి ప్రముఖ తమిళ నేత చ్లనాయగం నేతృత్వంలో ‘తమిళ యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌’ (టి.యు.ఎల్‌.ఎఫ్‌)గా ఏర్పడ్డారు. దీనికి తమిళ ప్రజ నుండి పూర్తిస్థాయిలో ఆమోదం లభించింది. ఐతే ఈ పరిణామా అనంతరం తమిళ ఐక్యతను జీర్ణించుకోలేని సింహళ పాలక వర్గాలు 1977లో ఒక సామూహిక హత్యాకాండ సాగించారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తమిళులపై హత్యులు, అత్యాచారాలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇక స్వతంత్య్ర ఈలం ఏర్పాటు ఇక ఎంత మాత్రం శాంతియుత పోరాటపద్ధతుతో సాధ్యం కాదని, గత అనుభవాల రిత్యా తమ పోరాట రూపాన్ని మార్చుకున్నారు. వేలుపిళ్లై ప్రభాకరన్‌ నేతృత్వంలో ఏర్పడిన తమిళ  న్యూ టైగర్స్‌ (టి.ఎన్‌నటి) లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ ఈలం (ఎల్‌.టి.టి.ఇ)గా పరిణామం చెంది. అదే సమంయలో అనేక సాయుధ పోరాట సంస్థలు పుట్టుకొచ్చాయి. అలాంటి దాదాపు డజను సంస్థలో ఒక్కొక్కదాన్నీ  పద్దతి ప్రకారం నిర్మూలిస్తూ ఎల్‌టిటిఇ బలమైన సంస్థగా అభివృద్థి చెందింది.  దీని నాయకుడుగా ప్రభాకరన్‌ ఉండి ఎల్‌టిటిఇని శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దాడు. కొన్ని సంస్థలు ఎల్‌టిటిఇ యొక్క స్వతంత్ర దేశ విధానాన్ని వ్యతిరేకించి ప్రధాన రాజకీయాల్లో చేరి చట్టబద్ధ పార్టీలుగా మారిపోయినప్పటికీ ఎల్‌టిటిఇ మాత్రం ఈలం ఏర్పాటు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజల పోరాటకారుల మద్దతు కూడగట్టుకుంటూ ఆర్థిక శక్తినీ, సైనిక శక్తినీ సమకూర్చుకుంది. ఒక దశలో భారత సైనిక బలగాలనుంచి శిక్షణనూ, ఆయుధాలనూ పొందింది. తనకు అనువైన నైసర్గిక వాతావరణంలో శ్రీలంక సైనిక బలగాను మాత్రమే కాదు, అంతకన్నా చాలా బలమైన భారత సైనిక బగాను కూడా మట్టికరిపించి సమాంతర ప్రభుత్వాన్ని నడిపింది. బహుశా ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా సొంత విమానాలను, ఓడలను, జతాంత్గాములను సంపాదించుకున్న పోరాట సంస్థగా ఘనతను సంపాదించింది. అంతర్జాతీయ స్థాయిలో పరపతిని కూడా పెంచుకుని తన తరపున అంతర్జాతీయ సంస్థల్లో, నెదర్లాండ్స్‌ ప్రభుత్వం వంటి ప్రభుత్వంలో వకాల్తా పుచ్చుకునే పరిస్థితి కల్పించింది. సుదీర్గకాలం లక్ష్య సాధన కోసం అహింసాయుత పద్ధతుతోనే సాగటంతో శ్రీంక సైన్యానికి, తమిళ సాయుధ బృందాకు మధ్య పోరు మొదలైంది. దాదాపు మూడ దశాబ్దాల తమిళ జాతి పోరాటంలో అనేక ఉత్థాన పతనాలను చవిచూసి పాలక సైన్యాల క్రూరత్వానికి బలైపోయింది. ఈ క్రమంలో అనేక అణిచివేతలు, హక్కు ఉ్లంఘనలను, చిత్రహింసలు, ఊచకోతలను శ్రీలంక తమిళ సమాజం అనుభవించింది.

భారత పాలకుల కపట ప్రేమ:
లక్షలాది మంది తమిళులు చిత్రహింసకు, ఊచకోతకు గురికాబడుతూ స్వదేశంలోనే నిరాశ్రయుగా మారుతున్నా పట్టించుకోనిది  ఈ దేశ పాలక వర్గా విధానం. తమిళలు ప్రత్యేక ఈల కోసం పోరాడిన ఎల్‌టిటిఈ పై శ్రీంక సైన్యం పాశవికంగా దాడు చేసి, పసివారిపై, అమాయకుపై విచక్షణరహితంగా బాంబుల వర్షం కురిపించి,ప్రాణాతో దొరికిన తమిళ పౌరులను నగ్నంగా నిబెట్టి కాల్చిచంపి యుద్ధ నేరాలకు ప్పాడింది.. శ్రీలంక సైన్యం దుర్మార్గాలను స్వీడన్‌కు చెందిన చానల్‌`4 బయటపెట్టేవరకు మనదేశ పాలక వర్గాలు నిమ్మకునీరేత్తినట్లు ఉండిపోయారు. తమిళజాతి నిర్మూనకు శ్రీలంక సైన్యం చేస్తున్న దాడులపై ఐక్యరాజ్యసమితిలో వ్యతిరేకంగా ఓటువేయాలని కేంద్రంపై తమిళులు, పార్టీలు ఒత్తిడిచేస్తే తప్ప దేశ పాక వర్గాలు కదలేని స్థితి. అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కులను యధేచ్చగా ఉల్లంఘిస్తూ నిరాయుధిరాలుగా మారిన ఇసాన్‌ ప్రియా అనే ఒక మహిళ న్యూస్‌ రీడర్‌ను, ఎల్‌టిటిఇ అనుకూల ఛానల్‌లో పనిచేసిందనే కారణంగా మానవత్వాన్ని మరిచి శ్రీంక సైనికు రేప్‌ చేసి అత్యంత కిరాతకంగా హత్య గావించిన మన పాలకులకు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయారు. శ్రీలంక మానవహక్కు ఉల్లంఘన, యుద్ధనేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని కెనడా ప్రభుత్వం ఆరోపించి, తమ దేశంలో నివసిస్తున్న ప్రవాస తమిళుల ఆందోళన దృష్ట్యా గత సంవత్సరం నవంబర్‌ 15న కొంంబోలో జరిగిన కామన్‌వెల్త్‌ దేశాల ప్రభుత్వాధినేత సమావేశాన్ని (చోగం) కెనడా బహిష్కరిస్తే, మన దేశం తరపున ప్రతినిధిగా సల్మాన్‌ ఖుర్షిద్‌ను పంపి తన భక్తిని చాటుకున్నాడు. ఇది మన పాలక వర్గాలకు పొరుగుదేశంలో ఉన్న తమిళు పట్ల ఉన్న ప్రేమ. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలోని రాంనగర్‌ బహిరంగ సభలో మాట్లాడుతూ తాము అధికారంలోకి రావడం తధ్యమని, కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్‌ నుంచి ఎవరైతే హిందువు ఇండియాకు  శరనార్థులుగా వచ్చారో వారిని మాతోపాటు ఉండేందుకు అవకాశాన్ని ఇస్తామని హామీ ఇచ్చాడు. హిందువు ఎక్కడకు వెళ్లగరు? భారత దేశం మాత్రమే వారిని హక్కున చేర్చుకుంటుందని అన్నాడు. కానీ ఇదే హామీని మోడీ తమిళనాడు ఎన్నిక ప్రచారంలో శ్రీంక తమిళులకు ఇవ్వలేక పోయాడు. బహుశా నరేంద్ర మోడీకి దృష్టిలో ఈ దేశ పౌరుంటే బంగ్లాదేశ్‌లోని హిందువు మాత్రమే కనిపిస్తున్నట్లుంది!.

కామన్‌వెల్త్‌ సమావేశాకు హాజరైన బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ ఉత్తర ప్రావిన్స్‌లోని తమిళ ప్రాబ్యప్రాంతమైన జాఫ్నాను సందర్శిస్తే తమిళ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఎల్‌టిటిఇలో పనిచేసిన చాలా మంది ప్రతిరోజు కనిపించకుండా పోతున్నారని, అనుమానించదగిన వ్యక్తులు అనే కారణంతో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి శ్రీలంక తమిళును తీసుకెళుతున్నారని దీనిపై విచారణ జరిపించాని, అంతర్జాతీయ సమాజం శ్రీలంక ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి స్వతంత్ర విచారణ జరిపించాలని వాళ్లు డిమాండ్‌ చేశారు. అయితే డేవిడ్‌ కామెరాన్‌ శ్రీలంక ఉత్తర ప్రాంత సందర్శన సందర్భంగా ఆందోళనకు నాయకత్వం వహించిందనే కారణంతో జయకుమారి బాలేంద్రన్‌ను ఆమె 17 సంత్సరా కుమార్తెను పోలీసు అక్రమంగా నిర్భందించారు. జయకుమారి కొడుకు 2009లో జరిగిన శ్రీలంక అంతరుద్యంలో తర్వాత శ్రీలంక సైన్యం ముందు లోంగిపోయాడు కానీ ఆమె కుమారుడు అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. తన కుమారుడులాంటి ఎంతో మంది పిల్లలు యుద్ధం ముగిసిన తర్వాత కనిపించకుండా పోతున్నారని వారి ఆచుకి తెపాని అక్కడి మహిళలు ఆందోళ నిర్వహిస్తున్నారు. ఈ మహిళలు  యుద్ధంపేరుతో తమపై జరిగిన అమానుష దాడును ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రాంత పర్యటన అనంతరం కామెరాన్‌ మాట్లాడుతూ ‘స్వయంగా చూశాక గానీ మీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం కాలేద’ని విలేఖరుతో అన్నారు. స్వదేశంలోనే నిరాశ్రయుగా, చీకటి కొట్లాంటి పునరావాస శిబిరాల్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తుంటే మన పాలకులకు మాత్రం ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

శరనార్థుల పట్ల కనికరం చూపని ఈ దేశ పాలకులు:
యుద్ధంలో సర్వం కోల్పోయి, నిలువనీడలేక కన్న ఊరు కాదంటే , తదాచుకోవడానికి పొరుగున ఉన్న తమిళనాడుకు   శరణార్థిగా వస్తే మన పాలకు మాత్రం బహిరంగ చరసా లాంటి ప్రదేశాల్లో వీళ్లను ఉంచి ఖైదీకంటే క్రూరంగా చూస్తుంది. 2009 యుద్ధం తర్వాత దాదాపు లక్ష 20 వేల మంది శ్రీలంక తమిళులు దేశ సరిహద్దుదాటి తమిళనాడు చేరుకున్నారు.   ఓట్ల కోసం తమిళ ఈలం జపం చేసే  రాజకీయ పార్టీలు మాత్రం వీళ్లను మనుషుకంటే నీచంగా చూస్తూ అంతర్జాతీయ ఒప్పందాను కూడా అమలు చేయడం లేదని పియూసిఎల్‌ లాంటి సంస్థలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడు ప్రభుత్వం దాదాపు వంద సాధారణ క్యాంపులు, 3 స్పెషల్‌ క్యాంపులు నిర్వహిస్తుందని వీటిలో ఎక్కడా కూడా సరైన సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం వీళ్లపట్ల యుద్ధఖైదీ కంటే ఘోరంగా వ్యవహరిస్తుందని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి
.   

No comments :

Post a Comment