నడుస్తున్న చరిత్ర

పెట్టుబడి వికృత రూపమే ప్రేమోన్మాద దాడులు


'ప్రేమ' తరం అమ్మాయిల వెన్నుల్లో వణుకు పుట్టిస్తోన్న పదం ఇది. అమ్మాయిల తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పదం కూడా ఇది. ఆరేండ్ల క్రితంరాష్ట్ర వరంగల్నగరం నడిబొడ్డున స్వప్నిక, ప్రణితలపై  యాసిడ్దాడి జరిగితే మనమంతా అవాక్కైపోయాం. గుంటూరులో తరగతి గదిలో ప్రసన్న లక్ష్మి దారుణంగా బండకత్తికి బలైతే మనం గుండెలు బాడుకున్నాం. ఇదేవరుసలో నిన్న రూప  ,రవళి, మొన్న స్నేహ, శ్రీలక్ష్మి, భార్గవి,వేముల పద్మ, ఆయేషా మీరా, అనుష తదితరులు బలైపోయారు. గతంలో ఒకడు ఒంగోలు జిల్లా నాగులపాలెంకు చెందిన ఇంటర్చదువుతున్న దిల్షాద్ను కొట్టి చంపేశాడు. చిత్తూరు జిల్లా ధర్మాచెరువు దళిత వాడకు చెందిన సువార్త  అనే ఇంటర్విద్యార్థిని ఒకడు ఉరేసి చంపాడు. బి.పార్మసీ చదువుతున్న ఆయేషా మీరా తానుంటున్న హాస్టల్లోని బాత్రూంలో అత్యంత జుగుస్సాకరంగా శవమై కనిపించింది. రాష్ట్ర రాజధానిలోని  ఒక ఇంజనీరింగ్కాలేజీలో చదువుతున్న స్వాతిని ఒకడు కత్తితో పొడిచి చంపబోయాడు. స్వాతి ఎలగొలా తప్పించుకోగలిగింది. కానీ తీవ్ర గాయాలతో హాస్పిటల్పాలయ్యింది. హైదరాబాద్లో ఒకడు తనను తాను పెట్రోల్పోసుకొని తగలబెట్టుకొని అవే మంటలతో ఐశ్వర్య అనే అమ్మాయిని కూడా చంపాలని చూశాడు.
రవళి
      రవళిని ఎందుకు చంపాలని చూశాడు? సువార్తని ఎందుకు ఉరేసి చంపాడు? ఆయేషా మీరా ఎందుకు శవమైంది? స్వాతి ఎందుకు కత్తిపోట్లకు గురైంది. ఐశ్వర్యను ఎందుకు చంపాలని చూశాడు? అసలు స్వప్నిక, ప్రణితలపై యాసిడ్దాడి ఎందుకు జరిగింది? ప్రసన్న లక్ష్మి ఎందుకు బండ కత్తికి బలైంది? వీరిలో కొందరిని జీవచ్ఛవాలుగా చేసింది, కొందరికి జీవితమే లేకుండా చేసింది ఒకే ఒక కారణం వల్ల అది - అమ్మాయిల తమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించుకోవడం, తమ జీవితాల మీద తమకు నిర్ణయాధికారం ఉందని భావించడం వల్ల్ల.
      
     వరంగల్కిట్స్విద్యార్థిని స్వప్నికను శ్రీనివాసరావు ప్రేమిస్తున్నానన్నాడు. స్వప్పిక ప్రేమను తిరస్కరించింది దీనికి కక్షకట్టిన శ్రీనివాసరావు తన స్నేహితులు హరిక్రిష్ట,సంజయ్లతో కలిసి స్వప్పికపై యాసిడ్దాడికి పాల్పడ్డాడు.ఈదాడిలో స్వప్పిక ప్రాణాలు కోల్పోగా, ప్రణిత తీవ్రంగా గాయపడింది. పాతికేళ్ల క్రితం ఇలాంటి సంఘటనే హైదరాబాద్నడిబొడ్డున జరిగింది. ఎన్జీరంగా అగ్రికల్చర్యూనివర్సిటీలో బీ.ఎస్సీ విద్యార్థినైన అనురాధను శ్రీనివాస్రెడ్డి ప్రేమిస్తున్నానని అన్నాడు. అనురాధ  'ప్రేమ'ను నిరాకరించింది. ఫలితమే కాలేజీ బ్యూటీ అనురాధ ముఖంపై శ్రీనివాస్రెడ్డి యాసిడ్గుప్పించాడు. దాడిలో అనురాధ తన  ముఖ సౌందర్యాన్ని మాత్రమే కోల్పోలేదు. వినికిడి శక్తి కూడా బాగా దెబ్బతింది. అలా శ్రీనివాస్రెడ్డి 'ప్రేమ' అనురాధను జీవితాంతం వెంటాడే పీడ కలగా దాపురించింది  తరువాత ఇంటర్చదువుతున్న ప్రసన్న లక్ష్మీ కూడా అదే చేసింది. షేక్సుభానీ అనే కారు డ్రైవర్‌ 'ప్రేమ'ను నిరాకరించింది. ఫలితంగా ప్రేమ మృత్యువై  ప్రసన్న లక్ష్మీని కబలించింది. ప్రసన్న తల్లి దండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ. ఎన్ని ఆశలు అల్లుకున్నారో ఆమె చుట్టు. ఇప్పుడు బతికుంటే పాతికేళ్ల యువతిగా తల్లిదండ్రుల కంటి వెలుగుగా వుండేది కానీ 'వెలుగు' చీకటి గర్భంలో కలిసిపోయింది
     

     అనురాధ,ప్రసన్న లక్ష్మీల విషాదగాథలు మళ్లీ మళ్లీ పునరావృతం అవుతున్నాయి. శ్రీనివాస్రెడ్డి, సుభానీలు మళ్లీ మళ్లీ పడగవిప్పి కాటేస్తునే వున్నారు. ఇక్కడ పాత్రలు మారిపోతున్నాయి. అనురాధ, ప్రసన్నల స్థానాల్లోకి నేడు రవళిలు, రూపలు బలవంతంగా ఈడ్చబతుతున్నారు. శ్రీనివాస్రెడ్డి, సుభానీల స్థానాలను సుదీర్‌, మహ్మద్సాజిద్లు అక్రమించడానికి పోటిపడుతున్నారు. కానీ అదే గాథ, అత్యంత విషాద గాథ, హృదయ విదారకరమైన గాథ, మనసుల్ని కలిచివేసే గాథ, మెదడు స్పందనలను బండబారుస్తున్న గాథ మళ్లీ మళ్లీ పునరావృతమౌతూనే ఉంది.
      పాతికేేళ్ల క్రితం శ్రీనివాస్రెడ్డి అత్యంత క్రూరంగా, మన ఒళ్లు జలదరించేలా చెప్పిన మాట, ''నా ప్రేమను నిరాకరించినందుకు...'' అనే మాట, నాటి నుండీ నేటికీ అమ్మాయిల పాలిట మరణ శాసనమే అయింది. ప్రేమోన్మాదుల నోట 'వేదవాక్కే' అయింది.

'ప్రేమ'ను నిరాకరించినందుకు అమ్మాయిలపైనే కాక వారి కుటుంబ సభ్యులపైనా దాడులు చేస్తున్న సంఘటనలూ టుచేసుకుంటున్నాయి. మొన్న హైదరాబాద్లోని నాగోల్లో శాంతి అనే అమ్మాయి తన మను నిరాకరించినందుకు ప్రేమోన్మాది కళ్యాణ్శాంతి తల్లిపై కూడా దాడి చేశాడు.
      'ప్రేమ' వేధింపులకు పరాకాష్టగా ప్రేమోన్మాదులు చేస్తున్న దాడులూ, హత్యలకూ తోడు, వేధింపులు భరించలేక అమ్మాయిలే ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలూ జరుగుతున్నాయి. కృష్ణజిల్లా పుబొట్ల పాలెం గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే అమ్మాయి సత్యనారాయణ అనే ఉన్మాది వేధింపులను భరించలేక వంటికి నిప్పంటిచుకుంది. ఎనభై శాతం గాయాలతో కొన ఊపిరితో ఆస్పత్రి పాలయింది. అంతకు ముందొకసారి అమ్మాయి ఇదే సత్యనారాయణ వేధింపు భరించలేక పురుగుల మందు తాగింది. తల్లిదండ్రులు సకాలంలో గమనించడంతో ఆనాడు ఆమె చావు నుండి బయట పడింది. మరణం అంచుల వరకూ వెళ్లి తిరిగి వచ్చినప్పటికి మళ్లీ చచ్చిపోవాలనే నిర్ణయించుకుందంటే ఆమె ఎదుర్కొన్న వేధింపు తీవ్రతను ఆర్థం చేసుకోవచ్చు.
      నేడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా దాపురించిందంటే ఒక అమ్మాయికి ఎవరైనా 'నిన్ను ప్రేమిస్తున్నాను' అని చెప్తే ఆమ్మాయికి కూడా అతడి మీద అటువంటి ఉద్దేశమే వుంటే అది వేరే సంగతి కానీ అమ్మాయికి అతడిపై ఉద్దేశం లేకుంటే, అతడిది ఏకపక్ష ప్రేమ అయితే ఇక అమ్మాయి పరిస్థితి అభద్రతలో పడ్డట్లే. పరిస్థితి అమ్మాయిల కుటుంబాల్లోనూ తీవ్ర అభద్రతను కల్పిస్తుంది. పరిస్థితి వల్ల ఇప్పటికే మన రాష్ట్రంలో 40 శాతం అమ్మాయిలకు డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగానే పెళ్లిళ్లు చేస్తున్నట్టు ఒక సర్వే చెప్తొంది. ఇప్పడిప్పుడే కాస్తో కూస్తో అవకాశాలున్న కుటుంబాల్లోనైనా పెరుగుతున్న అమ్మాయిల చదువులకు పరిస్థితి తీవ్ర ఆటంకంగా  మారుతుంది. మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాడులను గమనిస్తే సమస్య రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఒకేవిధంగా వున్నట్లు తెలుస్తోంది. పట్టణాల్లోనే కాదు పల్లెలోనూ ఇటువంటి దాడులు జరుగుతున్నాయని గమనిస్తే సామ్రాజ్యవాదం పల్లెలనూ కబళిస్తోన్న తీరు అర్థమవుతుంది. దాడులకు పాల్పడుతున్న వారిలోనూ అన్ని రకాల వారు వుంటున్నారు. దిల్షాద్ను చంపినవాడు ఒక టీచర్‌. కల్పన మీద యాసిడ్పోషినవాడు ఒక లెక్చరర్‌, ఐశ్వర్యకు నిప్పంటించినవాడు ఒక కారు డ్రైవర్‌, సువార్తకు వురేసినవాడు ఒక విద్యార్థి. వివక్ష చూపకుండా అన్ని రకాల సామాజిక నేపథ్యాలున్న వారినీ సామ్రాజ్యవాదం ఒకే విధంగా ఆకర్షిస్తున్నదనడానికి నిదర్శనమిది.

      ప్రతి రోజు రాష్ట్రంలో ఏదో మూలన అమ్మాయిలపై, దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీడియా హడావిడి చేస్తుంది... ప్రభుత్వం చట్టాలు చేస్తుంది... పోలీసులు కౌన్సిలింగ్చేస్తున్నారు... మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలు ధర్నాలు...రాస్తారోకోలు చేస్తున్నారు.... నాటి వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థిని అనురాధ నుండి నేటి ప్రణీత, అనుషల వరకు... నాటి ఆయేష మీరా నుండి నేటి రవళి, రూపల వరకు  ఇలాంటీ సంఘటనలు  ప్రతి రోజు ఏదో ఒక మూలన పునరావృతం అవుతూనే వున్నాయి. మళ్ళీ....మళ్ళీ తిరిగి ఇదే తంతూ. అసలు మానవ సంబంధాలు ఇంత హీనంగా ఎందుకు దిగజారుతున్నాయి? మనిషి పట్ల మనిషికి ఉండాల్సిన స్నేహబంధం స్పందన ఎందుకు కరువవుతుంది?. సంఘటనలు మళ్ళీ మళ్ళీ ఇలా సంభవించటానికి కారణం ఏమిటి? ఇందుకు నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులే కారణమా? లేక వ్యక్తులలోని మానసిక దౌర్బల్యం... మనసిక బలహీనతలే చర్యలకు కారణమా? అనేది పరిశీలించాలి.
     ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం హామీలు గుప్పిస్తూ బాధితులకు న్యాయం చేస్తామంటూ వాగ్ధానాలు ఇస్తుంది. కానీ దాడులకు కారణాలను మాత్రం వెతికి పట్టుకోలేకపోతుందిఅమ్మాయిలపై ఇలాంటి దాడులకు పాల్పడటానికి అసలు ఎలాంటి కారకాలు పనిచేస్తున్నాయో పరిశీలిస్తే దానిని నివారించవచ్చు. కాని ప్రభుత్వం అటువైపుగా ఆలోచించటం లేదు, చిత్తశుద్ధితో ప్రయత్నించటం లేదు.
     1991 నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైన తర్వాత పాలక వర్గాలు అవలంభిస్తున్న విధానాలు ఇలాంటి సంఘటనలు జరగటానికి కారణమవుతున్నాయి. 1991 కంటే ముందు వరకు భారత సాంఘిక పరిస్థితుల్లో ఇంతగా మార్పులు రాలేదు. ఆర్థిక విధానాల మూలంగా వ్యవస్థలో క్రమంగా మార్పులు  రావడం ప్రారంభమైంది. విదేశీ వస్తు వ్యామోహం, బోగలాలసత్వం, వినిమయ సంస్కృతి వ్యక్తుల్లో బాగా పెరిగిపోయింది. వినిమయ సంస్కృతిలో భాగంగా సాటి వ్యక్తులను కూడా వస్తువులుగా చూసే క్రమం ప్రారంభమైంది. సాంఘిక విలువలు క్రమేనా మారుతూ మనుషులంటే కేవలం ఆట వస్తువులుగా మారిపోయారు. సరళీకరణల విధానాల మూలంగా అభివృద్ధిచెందిన టెక్నాలజి సామాన్యునికి అందుబాటులో రావడంతో దీనిని సాకుగా చేసుకున్న మానవుడు కేవలం యాంత్రిక జీవితానికి అలవాటు పడి వ్యక్తి గత ప్రయోజనాల గురించి  తప్పా ఇంకేం పట్టించుకోవడం లేదు.
   సరళీకరణ విధానాల ప్రారంభం కంటే ముందు దేశంలో కాని రాష్ట్రంలో కాని ప్రజాఉద్యమాలు బలంగా ఉండేవి. నాటి యువతరం స్వాతంత్రోద్యమ నాయకులైన  సుభాష్చంద్రబోస్‌, భగత్సింగ్‌, చంద్రశేఖర్ఆజాద్మొదలైన వారిని ఆదర్శంగా తీసుకొని. ఏదో ఒక ఉద్యమంలో పనిచేస్తూ తమ వంతుగా కనీసం సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేవారు. నాటి యువత అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, సమాజంలో మార్పుకై తమ శక్తిమేరకు పనిచేసేవారు. ఆనాటి సామాజిక పరిస్థితులు, విద్యావిధానం విద్యార్థులలో, యువతలో దేశభక్తిని పేంచేవిధంగా ఉండేది. అంతేకాకుండా నాడు విద్యార్థి ఉద్యమాలు దేశంలో, రాష్ట్రంలో కీలక పాత్ర వహించి యువతకు దిశానిర్ధేశం చేసేవిధంగా ఉండేవి. టీనేజిలో ఉన్న యువత శక్తిని సరియైన మార్గంలో పెట్టకపోతే, వారికి ఒక గమ్యం అంటూ చూపించకపోతే వారు తప్పుదోవ పట్టే అవకాశంఉంది
     నాటీ శ్రీకాకుళల సాయుథపోరాటం, 1969 పజాస్వామ్య  తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వంటివి యువతను ఆలోచింపజేసి వారిని ప్రజాఉద్యమాలవైపు మళ్లేటట్లు చేశాయి. నేడు రాష్ట్రంలో అలాంటి బలమైన విద్యార్థి, ప్రజాఉద్యమాలు లేకపోవడం, ప్రభుత్వ విద్యాసంస్థల స్థానంలో ప్రయివేట్‌, కార్పోరేటు విద్యాసంస్థలు రావడం వలన. విద్యార్థులను మరమనుషులుగా మార్చి వారిని సమాజం గురించి ఆలోచించకుండా, నాలుగు గోడల మధ్య బంధించి పనిచేసే యంత్రాలుగా మారుస్తున్నాయి. ఒకనాడు ప్రభుత్వ విద్యా సంస్థలలో అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు తమకంటూ ఒక లక్ష్యం కలిగివుండి దానిని ఆచరిస్తూ, విద్యార్థులకు మార్గనిర్ధేశం చేసేవారు. కానీ నేటి ప్రయివేట్‌, కార్పోరేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కేవలం డబ్బులకోసమే పనిచేస్తూ విద్యార్థులను యాంత్రిక వస్తువులుగా తయారు చేస్తున్నారు.
   

 నేటి తరం యువతకు నాటి స్వాతంత్రోద్యోమ  నాయకుల త్యాగాల గురించి తెలియకపోవడం , వారు ఆశయం కోసమైతే తమ జీవితాలను త్యాగం చేశారో  తెలిపేందుకు సరియైన పాఠ్యంశాలు లేకపోవడం మూలంగా సరియైన లక్ష్యం, గమ్యం లేకుండా కేవలం  వారి చుట్టూ ఉన్న గ్లామర్ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ఎలాంటి లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు. ఈనాడు యువతను తాము చదువుతున్న చదువు కంటే కూడా సినిమాలు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. నేడు  ప్రేమ పేరుతో తీస్తున్న సినిమాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. చట్టాలు పెళ్లి చేసుకోవడానికి కనీస వయసు అబ్బాయిలకు 21 సంవత్సరాలు, అమ్మాయిలకు 18 సంవత్సరాలు అని నిర్ణయించాయి కానీ అంతకంటే చిన్న పిల్లలతో ప్రేమ నేపథ్యంతో  సినిమాలు తీస్తుంటే వాళ్ళను చట్టాలు శిక్షించలేకపోతున్నాయి. చిత్రం, టెంత్క్లాస్‌, ప్రేమిస్తే, కొత్తబంగారు లోకం వంటి  సినిమాలు చిన్నపిల్లలతో తీస్తూ విద్యార్థులను యువతను తప్పదారి పట్టిస్తున్నారు. సినిమాల ప్రభావానికి ఆకర్షితులవుతున్న విద్యార్థులు ప్రేమ పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు

     మొన్న ఖమ్మం జిల్లాలో 6 తరగతి చదువుతున్న 11 సంవత్సరాల షేక్రేష్మా అనే అమ్మాయి 9 తరగతి చదువుతున్న 15ఏళ్ళ షేక్నాగుల్మీరాను ప్రేమించాననితమ ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని సెల్టవర్ఎక్కి చనిపోతానని బెదిరించిన విషయం తెలిసిందే. ప్రేమంటే ఏంటో కూడా తెలియని పసి వయసులో విద్యార్థులు ప్రేమ పేరుతో చేస్తున్న వికృత చేష్టలు, దాడులను చూస్తుంటే ఆందోళన కలుగుతుందిఒక సర్వే ప్రకారం దేశంలోనే అత్యధికంగా సినిమా హాల్స్ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. రాష్ట్రంలో ప్రతి రోజు 6 లక్షల మంది యువత సినిమాలు చూస్తారని సర్వే పేర్కోంది. సర్వే భయాందోళన కలిగించే వివరాలను తెలిపింది. నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైన 1991 నుండి నేటివరకు విడుదలవుతున్న సినిమాల్లో అత్యధికం ప్రేమపేరుతో వస్తున్న  సినిమాలే వుంటున్నాయి. మన తెలుగు సినిమా ఇండ్రస్ట్రీట్లో మొత్తం వంద సినిమాలు విడుదలైతే అందులో దాదాపు 60 శాతం సినిమాలు 'ప్రేమఇతివృత్తంగా, 20 శాతం సినిమాలు అస్లీలం, క్రైమ్నేపథ్యంలో వస్తున్నాయని సర్వే తేల్చింది. ఇన్ని సినిమాలు యువతకు ప్రేమే జీవితం అని భోదిస్తూంటే, ప్రేమలేకుంటే లైఫ్వేస్ట్ఆంటూ యువత చెవుల్లో నిరంతరం మారుమ్రోగుతుంటే యువతను ఉద్యమాలు ఆకర్షించుకోగలుగుతాయి? ఆశయం వైపు మళ్లిస్తాయి?. ఇన్ని సినిమాలు ప్రేమగురించి బోధిస్తూ, ప్రేమేజీవితం అంటూంటే  యువత ఎందుకు అమ్మాయిలను ప్రేమ పేరుతో వేధించడు?, దాడులకు పాల్పడడు?. నేడు రాష్ట్రంలో జరుగుతున్నది కూడా అదే. సంవత్సరం జనవరి నుంచి  అక్టోబర్వరకు రాష్ట్రవ్యాపితంగా అమ్మాయిలపై ప్రేమ పేరుతో 32 దాడులు జరిగాయి. 6 గురు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోయారు. రాజమండ్రిలో అనుష అనే అమ్మాయి తన తల్లిదండ్రులను ప్రేమోన్మాది దాడిలో కోల్పోయి తన ఇద్దరి చెల్లెల భారం మోస్తూ ప్రభుత్వం నుంచి సరియైన సహాయం అందక దిక్కుతోయని స్థితిలో ఒక ప్రయివేట్టీవీని ఆశ్రయించడం జరిగిందిమమ్మల్ని  ఆదుకొండని అమ్మాయి సమాజాన్ని అడుక్కొనే స్థితి ఎందుకు వచ్చింది?. ప్రేమే జీవితం అంటూ సినిమాలు యువతను తప్పుడు మార్గం వైపు మళ్లీస్తుంటే వారిని అరికట్టలేని చట్టాలు, ప్రభుత్వంప్రేమ పిచ్చితో దాడులకు పాల్పడుతున్న వారిని ఎన్కౌంటర్లు చేసి శిక్షించాం  అంటూ చేతులు దులుపుకుంటున్నారుఅసలు ప్రేమోన్మాద దాడులకు కారణమైన సినిమాలను, సినిమాలు తీసే సిని పెద్దలను శిక్షించకుండా, విద్యార్థులను యంత్రాలుగా మారుస్తున్న విద్యాసంస్థలలో మార్పు తీసుకురాకుండా వదిలేస్తే ఇలాంటి దాడులు పునరావృతమవుతూనే ఉంటాయి.
      ప్రపంచంలో అత్యధికంగా యువత వున్న దేశం మనది. యువతను సక్రమ మార్గంలో పెట్టి వారి యువశక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. యువతను ఏదైనా సాధించాలనే తెగువ,ధైర్యం ఉంటాయి. అలాంటి యువతను సరియైనా మార్గాన్ని చూపించకుంటే సమాజానికి ఉపయోగపడకుండా సంఘ విద్రోహులుగా మారే అవకాశం ఉంది. సమాజానికి చోదకశక్తులుగా మారే అవకాశమున్న యువతను కాపాడుకోవడం సమాజపు తక్షణ కర్తవ్యం. అందుకు సమాజం నడుం కట్టాలి. ముఖ్యంగా తమ అస్తిత్వానికి సవాల్గా మారిన సమస్య పరిష్కారం కోసం అమ్మాయిలు సమరశీల పోరాటాలకు నడుం కట్టాలి. సమస్య వలన తీవ్ర ఆందోళనకు గురవుతున్న తల్లిదండ్రులు కూడా, ఆందోళన పడుతూ కూర్చుంటే సమస్య తగ్గదని గుర్తించాలి. ఇటువంటి సమస్యలను మనపైన రుద్దుతున్న సామ్రాజ్యవాద దుర్మార్గాన్ని వీరు అర్థం చేసుకోవాలి. దానికి వ్యతిరేకంగా పోరాడాలి. అది ఆధారపడుతూ, కాపాడుతున్న భూస్వామ్యానికి,పితృస్వామ్యానికి వ్యతిరేకంగానూ పోరాడాలి. అప్పుడే కుహనా ప్రేమను సమాజం నుండి తడిచెయ్యగలం. యువతను చోదకశక్తులుగా నిలుపుకోగలం. ప్రభుత్వం మీడియా, ప్రజాసంఘాలు, విద్యావేత్తలు అటువైపుగా ఆలోచించాలి.