"సెజ్‌ు ` ఓ కడుపు మండే నిజం

No comments

 ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న సమస్య సెజ్‌కు భూమును కేటాయించడం. మహానేతో...అంతకుముందే నేతో....ఎవరైతేనేం. జనా నోట్లో మన్నుకొట్టి అడ్డగోుగా జరిపిన భూ కేటాయింపు వెనక చాలా పెద్ద తతంగమే ఉంది. రాజ్యాంగానికి లొంగని, చట్టాు వర్తించని, ప్రత్యేక అధికారాు పొందే ఈ సెజ్‌ గురించి పూర్తిగా తొసుకోవానుంటే చదవండి...
 అసలీ సెజ్‌ (స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌`ప్రత్యేక ఆర్థిక మండలి) అంటే అసలైన అర్థం ఏమిటో తెలిస్తే కడుపు రగిలిపోతుంది. గుండె మండిపోతుంది. ప్రభుత్వాూ, నేతూ, మన జీవితాతో ఆడుకుంటున్నా...భావితరాకు సొంతభూమి అనేదే లేకుండా చేస్తున్నా నిర్వికారంగా, నిరామయంగా జీవితాు గడిపేస్తున్న మన మనస్తత్వం మీద మనకే అసహ్యం వేస్తుంది.

 ‘‘అభివృద్థి చెందిన దేశాు... చెందుతున్న దేశాూ...అంటూ’’ చిన్నప్పటి నుంచీ మనమందరం పాఠాల్లో ఈ ముక్క చదువుకుంటూనే ఉన్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాుగా చెప్పుకుంటున్న దేశాు గత పాతికేళ్లుగానో, యాభైయేళ్లుగానో  ఇంకా అలాగే ఎందుకు ఉండిపోయాయి, అందుకు కారణమేంటో మనం చెప్పకముందే అభివృద్ధి చెందుతున్న దేశాు చెప్పేశాయి. ఏ చెప్పాయీ అంటే ‘‘అబ్బే, అభివృద్ధి చెందాంటే మీలా వ్యవసాయం ఒక్కటే చేస్తే సరిపోదు, మాలాగా ఎగుమతు కూడా చెయ్యాలి’’ అని. దానికి అభివృద్ధి చెందుతున్న దేశాలేమన్నాయంటే..అట్లనా?, మరి ఎగుమతు ఎలా చెయ్యాలో చెప్పరూ ప్లీజ్‌ అన్నాయి.. ‘‘అదెలాగో మే చెబుతాం గానీ, మరి మమ్మల్ని మీ దేశానికి రానివ్వండి. విదేశీ పెట్టుబడుపై ఆంక్షు ఎత్తెయ్యండి. మాకు బ్డోంత భూమినివ్వండి, కరెంటివ్వండి, నీళ్లివ్వండి, పన్పుల్లో రాయితీనివ్వండి. మరి కార్మికుతో పని సవ్వంగా జరిపించుకోవాంటే మా తడఖా ఏంటో చూపించాలి కాబట్టి చట్టాల్లో వెసు బాటు కూడా ఇవ్వండి. ఇన్నీ ఇస్తే మీ దేశ ఆర్థికవ్యవస్థని పరుగు పెట్టించకపోతే చూడండి’’ అన్నాయి. అసలేె కుట్ర తెలియని అభివృద్ధి చెందుతున్న దేశాు అన్నింటికీ ఊకొట్టి అడిగినవన్నీ సమకూర్చాయి. సెజ్‌ అనబడే కాన్సెప్టు పుట్టిన క్షణమది.
మొదట్లో దక్షిణ అమెరికా దేశాకు పరిమితమైన బహుళజాతి కంపెనీు అక్కడి భూమును క్లొగొట్టడం పూర్తయ్యాక మూడో ప్రపంచదేశాల్లోకీ అడుగుపెట్టాయి. ఆసియాలో మొదటి సెజ్‌ను డెంగ్‌జియావో పింగ్‌ చైనాలోని షెన్‌జెన్‌ అనే నగరంలో ఏర్పాటు చేశాడు. అక్కడికి ఓ సారి అధికారిక పర్యటనకు వెళ్లిన మురసోలీ మారన్‌ అనే దిక్కుమాలిన నేత షెన్‌జెన్‌ అభివృద్ధిని చూసి సెజ్‌ కాన్సెప్టును ఖర్మకాలిపోయి మన దేశానికి దిగుమతి చేశాడు. (ఆఫ్‌కోర్స్‌, ఆయన నిమిత్తమాత్రుడే. మారన్‌ కారపోతే మరో పారన్‌. వంద కోట్లకుపైగా జనాభా/విస్తృత మార్కెట్‌ ఉన్న భారతదేశంలో అడుగుపెట్టడానికి బహుళజాతి కంపెనీకు ఒక మనిసే దొరక్కపోడా!)
రోజురోజుకీ రూపాయి మివ తగ్గిపోతోంది. భూము మివ ఆకాశాన్నంటుతోంది. రోజురోజుకీ చిక్కిపోతున్న రూపాయను ప్రజకు అంటగట్టి మివ పెరుగుతున్న/పెరిగే భూమిని చేజిక్కించుకుని రియలెస్టేట్‌ దందా నడిపే మోసానికి ఒక అందమైన పేరు సెజ్‌.
 అసు సెజ్‌ ఏర్పాటులో అన్నిటికన్నా పెద్ద ఫార్సు భూసేకరణ వ్యవహారం. నిజానికైతే...సెజ్‌ కోసం భూసేకరణచేసే బాధ్యత డెవపర్‌దే. అనగా సెజ్‌ పెడతామని వచ్చే వ్యక్తి లేదా వ్యక్తు సముహం లేదా సంస్థదే. సింపుల్‌గా చెప్పుకోవాంటే ఎవడైతే సెజ్‌ని పెడతానని ముందుకొస్తాడో వాడే ముందు భూమిని సమకూర్చుకోవాలి. అందుకోసం వాళ్లేం చేస్తారో తొసుకుందాం. ఏ ప్రాంతంలోనైనా సరే, మంచి ధర వస్తే భూము అమ్ముకుందామనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. ముందుగా ఈ డెవపర్ల మాయలో పడేది వాళ్లే. తమకు నచ్చిన ధర రాగానే భూము ఆమ్మేస్తారు. అలా కొంతమంది దగ్గర భూము కొన్నాక ఆ డెవపర్‌ ఏ చేస్తాడంటే. పక్కనే ఉన్న పొం/భూమి యజమాని దగ్గరికి వెళ్లి ‘మీ చుట్టు పక్క వాళ్లందరూ భూమిని నాకు అమ్మేశారు, నువ్కొక్కడివే ఏ చేస్తావు. నాకు నీ పొలాన్ని ఆమ్మెయ్‌’ అంటాడు. అందుకు ఆ భూమి/పొం యజమాని ఒప్పుకొంటే సరేసరి లేకపోతే వ్యవహారం బెదిరింపు దశలోకి దిగుతుంది. ‘ఇప్పుడు నాకు అమ్మేస్తే మంచి ధర వస్తుంది. ప్రభుత్వం భూసేకరణకు రంగంలోకి దిగితే నీకు మార్కెట్‌ రేటు రాదు’ అని అవతలి వ్యక్తి మనసులో భయాన్ని ప్రవేశపెడతాడు. ఈ గోంతా ఎందుకు అనుకునే డెవపర్స్‌ భూసేకరణ బాధ్యతను కూడా  ప్రభుత్వానికే అప్పజెప్తారు ( అందుకోసం కొంత డబ్బును కూడా ముట్టజెప్తారు) అప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగి భూమిని సేకరించి తక్కువ ధరకు సెజ్‌ ఓనరుకు కట్టబెడుతుంది. (అందకు ప్రతిఫంగా సదరు సెజ్‌ ఓనరు భూమిని కట్టబెట్టిన నేత లేదా ఆయన తాూకూ బంధువు వ్యాపారాల్లో పెట్టుబడు పెడతాడు. ఇదో విషవయం.)
ఇందులో ఘోరమైన విషయం ఏంటంటే.. మన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసమే ప్రత్యేకంగా ఒక విభాగాన్ని కూడా వినియోగించుకుంటోంది. దాని పేరు పారిశ్రామిక మౌలికవసతు క్పన విభాగం అనగా ఏపిఐఐసి. సెజ్‌ కోసం భూసేకరణ అంటే కొంచెం రిస్కుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి. ‘పారిశ్రామిక అవసరా నిమిత్తం’ అనే అందమైన ముసుగు తొడిగి భూమిని సేకరిస్తుందీ విభాగం. ఇక్కడో దారుణమైన విషయం గురించి చెప్పకపోతే ఈ వ్యాసం ఉద్ధేశం నెరవేరదు భూసేకరణ వ్యవహారం డెవపర్‌ చేస్తేనే కొంతలో కొంత నయం. ఆ పనిని ప్రభుత్వం చేపట్టిందంటే భూమి సొంతదాయి పూర్తిగా నాశనమైపోతారు. ఎందుకంటే ఇలా ప్రభుత్వాు చేపట్టే భూసేకరణలో నష్టపరిహారాు ఎప్పుడో 1894లో చేసిన చట్టాను అనుసరించి ఇస్తారు. ఇదెంత అమానుషమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా ‘‘తొండు కూడా గుడ్లు పెట్టని భూమికి క్షకు క్ష నష్టపరిహారం ఇస్తున్నామని’ నేతు చెబుతున్నారు. ఇది అన్నిటికన్నా పెద్ద అబద్దం. రాష్ట్రంలో సెజ్‌ు ఏర్పాటు చేసిన భూముల్లో అత్యధిక శాతం వ్యవసాయ భూములే.
సరే ఆ విషయాన్ని పక్కనబెట్టి ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ వ్యవహారం ఎంత రంజుగా సాగుతుందో చూద్దాం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ తమ భూమున్నాయో, ఆచుట్టు పక్క ప్రాంతాల్లో సెజ్‌ు పెట్టేందుకు అనుమతు వచ్చేలా పైరమీ జరుపుతారు నాయకు (సాధారణంగా ఇలా చేసేది అధికార పార్టీ నాయకులే అయి ఉంటారు. ఎందుకంటే సెజ్‌ వాసన అంతరికన్నా ముందు వారి ముక్కపుటాకే గాఢంగా తొస్తుంది మరి. అప్పుడప్పుడూ ప్రతిపక్ష పార్టీ నేతు కూడా ఇందులో కుస్తారు. వాటా దగ్గర తేడాలొస్తే సెజ్‌ ఏర్పాటయ్యాక అందరికన్నా ముందు రైతును ఉసిగొల్పి ఉద్యమాు లేవదీసేది ప్రతిపక్షనేతలే).
దాంతో.... వారి భూముకు సమీప ప్రాంతాల్లో ఉండే బడుగుబహీన వర్గాకు చెందిన భూమిని సేకరిస్తుంది. ఏపిఐఐసీ. లేదా తమకు అందిన సమాచారాన్ని బట్టి సెజ్‌ ఏర్పాటయ్యే అవకాశం ఉన్న ప్రాంతా చుట్టుపక్క భూమును ముందే కొనేసుకుంటారు. బ్డోంత భూమి జమయ్యాక సెజ్‌ పెడతామని ముందుకొచ్చే డెవపర్‌కి ‘మా దగ్గర భూమి సిద్ధంగా ఉంది, మీరు సెజ్‌ పెట్టుకోవడమే తరువాయి’ అంటూ రెండు చేతుూ బార్లా చాచి ఆహ్వానం పుకుతుంది. రాష్ట్ర సర్కారు. డెవపర్‌ అనందంగా సెజ్‌ ఏర్పాటు చేస్తాడు. వెంటనే ఆ చుట్టు పక్క అప్పటికే భూమున్న నేతూ అధికాయీ రంగంలోకి దిగి సెజ్‌వచ్చింది కాబట్టి ఆ ప్రాంతం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందిందనీ ఊదరగొట్టి తమ భూముల్ని రియలెస్టేట్‌ ప్లాట్టు కింద విభజించి కోట్ల రూపాయకు అమ్ముకుంటారు. ఆ మాటల్ని నమ్మి మధ్యతరగతి జనం ఎగబడి కొంటారు.
 సరే, భూసేకరణ జరిపోయింది. సెజ్‌కి అనుమతి వచ్చేసింది అనుకుందాం. ఇక్కడ మళ్లీ సెజ్‌ ఏర్పాటు నిర్వహణ చట్టాు రంగంలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న సదరు చట్టా ప్రకారం ఏ సెజ్‌లోనైనా వాళ్లు చేస్తామని చెప్పే ఉత్పత్తి కార్యక్రమం అక్కడి భూమిలో 25 నుంచి 35 శాతం మే చేస్తే చాు. మిగతా 64 శాతం భూమిలో ‘అనుబంధ అభివృద్ధి కార్యక్రమాు’ చేపట్టే అవకాశం ఉంటుంది. ‘అనుబంధ అభివృద్ధి కార్యక్రమాు’ అంటే రోడ్లూ కరెంటు లాంటి వసతు క్పన అనుకునేరూ. అక్కడ నిర్మొహమాటంగా, నిరభ్యతరంగా రియల్‌ ఎస్టేట్‌ దందా చేసుకోవచ్చు. ఒక్క అమ్ముకోవడం తప్ప.. షాపింగ్‌ కాంప్లెక్సు కట్టి లీజుకిచ్చుకోవచ్చు, ఆసుపత్రి కట్టి అద్దెకిచ్చుకోవచ్చు. (ఇదంతా చదివాక మీకు లాంకోహిల్స్‌, సింగపూర్‌ టౌన్‌షిప్‌ లాంటివి గుర్తుకోస్తే అది యాదృచ్ఛికమే).  
సెజ్‌ కేటాయింపుకు ముందు జరిగే ఒప్పందా ప్రకారమే స్థానికుకు ఉపాధి కల్పించాలి. కల్పిస్తారు...అన్నాళ్లూ సొంత భూమిలో సగౌరవంగా బతికిన రైతుకు వాచ్‌మెన్లుగా, స్వీపర్లుగా, పనివాళ్లుగా బోలెడన్ని ఉద్యోగాు కల్పిస్తారు. వాళ్లకి  కూడా కార్మిక చట్టాు వర్తిస్తాయనుకుంటున్నారేమో అ పప్పులేమి ఉడకవు. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ఆర్థిక మండళ్లలో పనిగంట పరిమితిపై నిబంధను ఎత్తేసింది. మాము కంపెనీల్లోనైతే కార్మికుతో రోజుకు ఎనిమిది గంటకు మించి పనిచేయించుకుంటే ప్రభుత్వం ఊరుకోదు. చట్టం ఒప్పుకోదు. యూనియన్లు గోపెడతాయి. సమ్మెూ, బందుూ, నిరాహారదీక్షూ మానవహక్కుూ....ఇలా సవాక్ష అంశాు బయటికొస్తాయి. కానీ సెజ్‌లో ఇవేవి ఉండవు.
డబ్బు పారేసి ఎంత కావాంటే అంత పనిచేయించుకో. ఎన్ని ఎక్కువ గంటు పనిచేస్తే అంత సొమ్ము, కార్మికచట్టాూ గిట్టాూ జాన్తానై. పోనీ కనీస వేతనాలైనా ఇస్తారా అని పొరపాటున కూడా అడక్కూడదు. అందుకు సంబంధించిన రిజిస్టర్లను   కూడా నిర్వహించక్కల్లేదు సెజ్‌ చట్టా ప్రకారం. సెజ్‌ సొంతదారు ఏంచెప్తే అది నమ్మి తీరాల్సిందే. పోనీ కార్మికసంఘం ఒకటి స్థాపించుకుంటే వాళ్లైనా ఇవన్నీసెజ్‌ యాజమానితో మాట్లాడొచ్చు కదా అనుకుంటున్నారా.. అందుకూ తగిన బందోబస్తు కల్పించింది ప్రభుత్వం. సెజ్‌లో కార్మిక సంఘం పెట్టాంటే ఉద్యోగుల్లో కనీసం 30 శాతం మందైనా అందులో సభ్యుగా ఉండి తీరాల్సిందే దటీజ్‌ సెజ్‌.
ఇన్ని అవక్షణాుండే సెజ్‌కు భూమి సేకరించిపెట్టడమే కాదు, ఇతర మౌలిక సదుపాయాను కల్పించే బాధ్యత కూడా సర్కారుదే. అనగా కరెంటూ, నీళ్లూ లాంటివాటిని సరఫరా చేయడం అన్నమాట. అదీ అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాకు అనుగుణంగా. అక్కడితో అయిపోలేదు. వారికి ఎగుమతి, దిగుమతి సుంకా నుంచి మినహాయింపు కూడా ఇస్తుంది. సెజ్‌ డైరెక్టర్లుగా వ్యవహరించే వ్యక్తుకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి కూడా మినహాయింపు భిస్తుంది. ప్రభుత్వం నుంచి అటు అన్ని సేమ పొంది... ఇటు పన్నుూ కట్టక, చట్టాకూ లొంగక ఎందుకీ సెజ్జు? నెత్తికేసి కొట్టుకోవడానికా?
చివరగా ఒక చిన్న కథ చెప్పుకొందాం....అనగనగా హైదరాబాద్‌కు సమీపంలో జడ్చర్ల అనే ప్రాంతం ఉంది. 2003లో అధికారం వెగబెడుతున్న తొగుదేశం పార్టీ అక్కడో ‘ఇండస్ట్రియల్‌ గ్రోత్‌ కారిడార్‌’ నిర్మిద్దామని నిర్ణయించింది. వెంటనే ఏపిఐఐసీని రంగంలోకి దించి పోలేపల్లి, ముదినేపల్లి, గుండ్లగడ్డతాండాకు చెందిన వెయ్యి ఎకరా భూమిని కొనుగోుకు నోటిఫికేషన్‌ జారీ చేసి  ఏపీఐఐసీకి రూ. ఐదు కోట్లు నిధు కేటాయించింది. ఆ సొమ్ములో భూము కొనుగోు చేసింది ఏపీఐఐసీ. కొనుగోు అంటే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా కాదు 1894 నాటి భూసేకరణ చట్టా ప్రకారం ఎకరాకు రూ. 16మే నష్టపరిహారం ఇచ్చి మరీ...
కట్‌చేస్తే... ఖాళీ భూము ఎక్కడున్నా గద్దలా వాలిపోయే ‘రాజా’వారి సర్కారుకు ఏపీఐఐసీ దగ్గరున్న వెయ్యెకరాూ బంగారుగనిలా కనిపించాయి. ఇంకేముంది అందులో మూడోంద ఎకరాకు ఫార్మాసెజ్‌ పేరుతో టెండరు పెట్టారు. కైంకర్యానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడా భూమున్నీ వందరెట్లు ఎక్కువ ధరకు రియలెస్టేట్‌ పాయ్యాయి. ముందుగా అక్కడ ఫార్మా సెజ్‌ పెడతామన్న కంపెనీు ఏమయ్యాయో తెలీదు. ఈ మొత్తం విషయంలో దారుణంగా మోసపోయింది మాత్రం అమాయకులైన గిరిజనుూ, దళితుూ పేదు. మూడోంద ఎకరాు పోగా మిగతా 700 ఎకరాూ ఇంకా సర్కారు ఆధీనంలోనే ఉన్నాయి వాటిలో ఏకార్యక్రమమూ చేపట్టలేదు. మరి ఆ ఇంత మాత్రానికి అన్ని ఎకరా భూమిని బవంతంగా భూసేకరణ ఎందుకు జరిపినట్టు? అని కాగ్‌ అక్షింతలేసినా మన సర్కారుకు సిగ్గులేదు. ఆనాడు భూము పోగోట్టుకున్న పోలేపల్లి సెజ్‌ బాధిత రైతుల్లో 13 మంది 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.
డబ్బు మదం బలిసిన దున్నపోతుల్లాంటి రాజకీయనాయకున్న మన దేశంలో లేగదూడలాంటి రైతులెంత... వాళ్ల బతుకెంతా!...ఈనాటికీ వాళ్ళు బాధితుగా పోరాడుతూ ఉండటమే ఇందుకు ప్రబమైన నిదర్శనం.
విద్యార్థి గళం

No comments :

Post a Comment