దండకారణ్యంలో యుద్దం

No comments
సోవియట్‌ రష్యా పతనం, జర్మనీ ఏకీకరణ పెట్టుబడిదారీ పంథా విజయపరంపరకు గీటురాళ్లుగా నిలిచాయి. కమ్యూనిజం లేదా మార్క్సిస్టు లెనినిస్టు పంథా లేదా భావజాలానికి ఇక మనుగడ లేదని క్యాపిటలిస్టు సామ్రాజ్యవాద సమర్థకులు గట్టిగా వాదించడం మొదలుపెట్టారు. మాస్‌ మీడియా వారి వాదనలకు విపరీతమైన ప్రచారం కల్పించింది. ఈ సమాంతర చరిత్రలో నక్సల్బరీ ఉద్యమాన్ని విశ్లేషించవలసిన అవసరం ఉంది.భారతదేశ వామపక్ష ఉద్యమ చరిత్రలో అనేక సంక్షోభాలు తలెత్తాయి. వాటిలో మొదటిది 1964లో భారతీయ కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన చీలిక. సిపిఐ రివిజనిస్టు పంథాను నిరసిస్తూ పుచ్చలపల్లి సుందరయ్య నేతృత్వంలో ఏర్పడిన చీలిక వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు)గా అవతరించింది. మార్క్సిస్టు పార్టీలో జరిగిన భావజాల సంఘర్షణ 1967 నాటికి పతాక స్థాయికి చేరుకుంది.

చారూ మజుందార్‌, కానూ సన్యాల్‌ తదితరులు సాయుధ విప్లవ పోరాటం వెైపు మొగ్గు చూపారు. పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరీలో ప్రారంభమైన ఈ సాయుధ ప్రతిఘటన నక్సల్బరీ ఉద్యమంగా ప్రఖ్యాతి గాంచింది. అనతికాలంలోనే ఈ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదించింది. బెంగాల్‌లో ఉద్యమం నీరుగారి పోయింది. 1969 శ్రీకాకుళ రెైతాంగ సాయుధ పోరాటం చారిత్రక ఘటనగా మిగిలిపోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం కోసం 1969లో జరిగిన పోరాటంలోనూ నక్సలెైట్లు క్రియాశీల పాత్ర పోషించారు. ఆంధ్రతో సమానంగా బీహార్‌లోనూ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ (ఎంసిసి) దళితులు, వెనుకబడిన తరగతుల వారి సహాయంతో బలపడింది. 1970 దశకంలో ఆంధ్ర నక్సల్‌ ఉద్యమం క్రమంగా విస్తరించింది. 1975 ఎమర్జెన్సీ కాలంలో నక్సల్‌ ఉద్యమంపెై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కేరళలో రాజన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కబళించింది. ఎన్‌కౌంటర్ల విధానం అన్ని రాష్ట్రాలలో సర్వసాధారణ మైపోయింది.
ఎమర్జెన్సీ అనంతర కాలంలో కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో నక్సల్‌ ఉద్యమం తనవ్యూహాన్ని మౌలికంగా మార్చుకుంది.తర్వాత సిపిఐ (ఎంఎల్‌) పీపుల్స్‌ వార్‌ గ్రూప్‌ను స్థాపించారు.

ప్రజాసంఘాల ఉద్యమ కార్యకలాపాల కంటే సాయుధ దళాల ఏర్పాటుపెైనే దృష్టి సారించారు. దీని కారణంగా ప్రజాక్షేత్రంలో ఉద్యమ సంఘాల ప్రభావం క్షీణించింది.1980 దశకంలో పీపుల్స్‌ వార్‌ క్రమంగా ప్రజా మద్దతును కోల్పోయింది. మరోవెైపు రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక బలగాలను మోహరించి సాయుధ దళాలను నిర్వీర్యం చేశాయి. 1991లో రాజీవ్‌ గాంధీ హత్యకు గురయ్యాడు. అనంతరం ఆంధ్రలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పీపుల్స్‌వార్‌పెై నిషేధం విధించింది. తెలంగాణ నుండి తరలిపోయి అప్పటి మధ్యప్ర దేశ్‌లోని దంతేవాడ ప్రాంతంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న నక్సలెైటు ఉద్యమ నాయకులు స్థానిక పోరాటాలతో గిరిజనులలో తమ పట్టు పెంచుకున్నారు. బహుళ జాతి సంస్థలు, మైనింగ్‌ కంపెనీలు, భారీ విద్యుత్‌, నీటిపారుదల ప్రాజెక్టులతో తమ భూములను, ఇళ్లను కోల్పోతామని ఆందోళనచెందిన గిరిజనులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకున్నారు. వీరికి సాయుధ నక్సల్‌ దళాలు రాజకీయ నాయకత్వం వహించాయి.

మహారాష్ర్ట, ఒరిస్సా, జార్ఖండ్‌, బీహార్‌ (ఇక్కడ ఎంసిసి రూపంలో), కర్ణాటక, గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలలో నక్సల్‌ ఉద్యమం త్వరితగతిన విస్తరించింది.
2004 నాటికి బీహార్‌, జార్ఖండ్‌, తదితర ప్రాంతాలలో పట్టు కలిగిన ఎంసిసి, దేశంలోనే ప్రధాన విప్లవ పార్టీ అయిన సిపిఐఎంఎల్‌ పీపుల్స్‌వార్‌లు విలీనమై సిపిఐ (మావోయిస్టు)గా అవతరించాయి. 2009 ఆగస్టులో కేంద్ర బలగాల నాయకత్వం, బెంగాల్‌ సాయుధ పోలీసులు లాల్‌గఢ్‌ గిరిజనులపెై నిర్బంధకాండను మొదలుపెట్టాయి. మావోయిస్టులఏరివేత పేరుతో అమాయక గిరిజన యువకుల తోపాటు మహిళలను సైతం తీవ్రఅత్యా చారాలకు గురిచేశారు. ఈ క్రమంలోనే సిపిఎం ముఖ్య కార్యకర్తలను మావోయి స్టులు ముట్టబెట్టడం మొదలుపెట్టారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు, భావజాలం వ్యాప్తి చెందుతుండడం, వాటికి అడ్డుకట్ట వేయడంలో ఆయా రాష్ట్రాలు విఫలం కావడం తో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగింది.

ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరుతో చత్తీస్‌గఢ్‌ రాష్ర్టంలో కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా జరిగిన భీకర పోరులో 76 మంది మృతి చెందారు. అయితే కేంద్ర బలగాలకు కోలుకోలేని దెబ్బతగలడంతో ఐదు రోజులకే ఈ ఆపరేషన్‌ను ముగించారు. పారామిలిటరీ దళాల జవాన్లు వందల సంఖ్యలో మృత్యువాతపడ్డా ఈ సమాచారాన్ని కేంద్ర హోం శాఖ బహిరంగంగా వెల్లడించ లేదు. దీనికి తోడు మహారాష్ర్ట గడ్చిరోలీ జిల్లాలో అక్టోబరు 8న మావోయిస్టు పార్టీ కేంద్ర బలగాలపెై దాడి చేసి 27 జవాన్లను హతమార్చి విలువెైన ఆయుధసామాగ్రిని పట్టుకెళ్లింది. ఆంధ్ర సరిహద్దుల్లో కూడా 2008లో బలిమెర్ల వద్ద మావోయిస్టులు గ్రేహౌండ్స్‌ దళాలపెై ఇదే విధంగా దాడి చేసి 57 మంది జవాన్లను బలితీసుకు న్నారు.
అప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో పెద్ద సంఘటనలు జరగకపోయినా 2009 మే 24న మావోయిస్టు సాయుధ వ్యూహకర్త పటేల్‌ సుధాకర్‌రెడ్డి వరంగల్‌ జిల్లా లవ్వాల గ్రామంలో ఎన్‌కౌంటర్‌కు గురి కావడంతో మావోయిస్టులు దేశవ్యాప్తంగా హింసకు పాల్పడ్డారు.

మహారాష్ర్ట, బీహార్‌, ఒరిస్సా, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, బెంగాల్‌ తదితర రాష్ట్రాలలో అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. అక్టోబరు 2009 నాటికి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని దేశ భద్రతకు ఎదురవుతున్న గొప్ప సవాలుగా ప్రకటించింది. మేధావుల విజ్ఞప్తితో ఆయుధాల మాట పక్కన పెట్టి హింసను ఆపాలని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మావోయిస్టులను కోరారు. హింసను ఆపితేనే చర్చలకు అవకాశం ఉంటుందని హోం మంత్రి స్పష్టం చేశారు.మరోవెైపు మహారాష్ర్ట, ఒరిస్సా, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌- బెంగాల్‌లోని లాల్‌గఢ్‌ల లో కేంద్ర బలగాలు మావోయిస్టు ఏరివేత కార్యకలాపాలను ముమ్మరం చేశాయి.

ఈ పోరాటంలో వందలాది మంది అమాయక గిరిజనులు ప్రాణాలు కోల్పోతు న్నారు. వేలాది మంది రోజూ ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. మావోయిస్టులను ఏరివేసిన తర్వాతే అభివృద్ధి ప్రకియను చేపడతామని కేంద్రప్రభుత్వం వాదిస్తోంది. ప్రజా పునాదిని పెంచుకొంటూ దేశవ్యాప్తంగా విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయాలని సర్వశక్తులు ఒడుతున్న మావోయిస్టు ఉద్యమం ఒకవెైపు, రాజ్య గుత్తాధికారాన్ని బలంగా చాటాలని తహతహలాడుతున్న

No comments :

Post a Comment