నెత్తురోడిన లక్షింపేట

No comments

లక్షింపేట దళితుడు పిడికెడు ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలుచున్నందుకు అగ్రకుల నరమేధానికి గురికావల్సి వచ్చింది. ఈ దేశంలోని దళితులకి ఇలాంటి దాడులు కొత్తేమికాదు. అంటరానితనం అవమానాలు,అణిచివేతలు ఇక్కడి దళితులకి నిత్య అనుభవాలే. కారంచేడు,చుండూరు,తిమ్మసముద్రం,వేంపేంటలలో దళితులపై జరిగిన దాడులను మరువకముందే  లక్షింపేట మాలపల్లె అగ్రకుల నరమేధానికి బలైంది. దళితులపై జరుగుతున్న దాడుల్లో ప్రాంతాలు వేరుకావచ్చు. పాత్రదారులు వేరుకావచ్చు. రెండ్లు,కమ్మల స్థానంలో కొత్తగా తూర్పు కాపులు రావొచ్చు కాని దళితులే లక్ష్యంగా సాగుతున్న అగ్రకుల దాడుల్లో ఒకటే తీరు కనిపిస్తుంది. ఆర్థికంగా పైకెదుగుతూ, ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలుచున్న ప్రతిసారి ఆయా సామాజిక వర్గాలు, తమ ఆధిపత్యాన్ని, కుల దురంహకారాన్ని  ప్రదర్శించడం కోసం నిరుపేదలైన నిరాయుధులైన దళితులపై దాడులు చేయడం పరిపాటయ్యింది. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేటలో జూన్‌ 12న జరిగిన సంఘటనని రెండు సామాజిక వర్గాల మధ్య పాత కక్షల వల్ల అనుకోకుండా జరిగిన ఘటనగా పాలక వర్గాలకు వత్తాసు పలుకుతున్న మీడియా ప్రచారం చేస్తుంది. కానీ ఈ నరమేధానికి ఒక ఆర్థిక,సామాజిక నేపథ్యముంది. ముఖ్యంగా ఈ సమస్య భూమి చుట్టూ అల్లుకొని ఉంది. ఉత్తర కోస్తాలో సంఖ్యారీత్యా బలంగా వున్న తూర్పున కాపులు గత పది,పదిహేను ఏండ్లుగా భూమి మీద ఉన్న పట్టుతో రాజకీయంగా అధికారానికి ఎగబాకారు. తూర్పు కాపులు పేరుకి మాత్రమే బి.సిలుగా చెలామణి అవుతున్నా ఆర్థికంగా, రాజకీయంగా బలిసిన కులంగా ఎదిగింది. మరోవైపు సంఖ్యారీత్యా అంతే బలంగా వున్న దళితులు భూమి, అధికారం వంటివి లేకపోయిన ఆత్మగౌరవంతో తలెత్తుకొనే స్థాయిలో ఉన్నారు. రాజ్యంగ పరంగా తమకున్న హక్కులను పోరాటం ద్వారా పరిరక్షించుకోవాలన్న స్పృహ కలిగివున్నారు. దీంట్లో భాగంగానే 2006 ఎన్నికల్లో సర్పంచు సీటు ఎస్సీ మహిళకు రిజర్వు అయితే మాలపల్లె అంతా ఐక్యమత్యంతో చిత్తిరి సింహాలమ్మను ఏకగ్రీవంగా ఎనుకున్నారు. మాలపల్లె ఐక్యమత్యాన్ని, ఆత్మగౌరవాన్ని, జీర్ణించుకోలేని తూర్పుకాపులు కుల దురంహకారంతో బాంబులతో,బరిసెలతో, బండరాళ్లతో,గొడ్డల్లతో దళితులపై పాశవికంగా దాడి చేసి ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నరమేధానికి ఒడిగట్టారు. మూకుమ్మడిగా చేసిన ఈ డాడికి మాలపల్లె విలవిల లాడింది.

దాడికి అసలు కారణం
వంగర,రేగడి అముదాల వలస, సంతకవిటి, జి.సిగడాం, పొందూరు మండలాల్లో 104 గ్రామాల్లోని 24,700 ఎకరాల సాగుభూమికి నీరందించే ఉద్దేశ్యంతో సువర్ణముఖి,వేగావతి నది సంగమ ప్రాంతంలో మడ్డువలస ప్రాజెక్టును 1976వ సంవత్సరంలో ప్రారంభించారు.ఈ ప్రాజెక్టు కింద 7 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రభుత్వం ముంపునకు గురవుతున్న  భూములతోపాటు, నివాసిత గ్రామాలకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చట్టం కింద భూమిని తీసుకున్నారు. భూములు కోల్పోయిన  తూర్పుకాపులకు నష్టపరిహారంగా ఎకరానికి రెండున్నర లక్షలు, గృహాలకు రూ. 50 వేల నుండి రెండు లక్షల వరకు చెల్లించారు. భూములు,ఇళ్లు కోల్పోయిన తూర్పు కాపులకు, మాలలకు ముత్యాలమ్మ ట్యాంకు సమీపంలో (ప్రస్తుతం మాలలు నివాసం ఉంటున్న ప్రాంతం) పునరావాసం కల్పించారు. పునరావాస ప్రాంతానికి మాలలు 2000 సంవత్సరంలో వచ్చి స్థిరపడ్డారు. ఆ తరువాత రెండు సంవత్సరాలకు తూర్పు కాపులు అక్కడి వచ్చి స్థిరపడ్డారు. పునరావసం క్రింద తూర్పు  కాపులకు 40 ఉద్యోగాలు ప్రాజెక్టులో ఇచ్చారు కానీ ఒక్క దళితుడికి ఉద్మోగం ఇవ్వలేదు. దళితులకు భూమిలేకపోవడంతో పూరి ఇళ్లు అయినందుకు వారికి రూ.8 వేల నుండి 10 వేల వరకు ఇచ్చారు. కానీ ఈ 8 వేలల్లో కూడా గ్రామంలో గుడి కడతామంటూ గ్రామ కాపులు ప్రతి దళిత కుటుంబం నుంచి 3 వేల రూపాయలను వసూలు చేశారు. అయితే మడ్డువలస ప్రాజెక్టు కోసం సేకరించిన మొత్తం భూమిలో సుమారు 250 ఎకరాల భూమి ముంపునకు గురికాకుండా మిగిలిపోయింది. ఈ భూమి ఖాళీగా ఉండటం వల్ల లక్షింపేట కాపులు 190 ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. మిగిలిన 60 ఎకరాలు అలాగే ఉన్నది. అందులో 40 ఎకరాలు పక్క గ్రామమైన దేవకవాడ వాళ్లది. వాళ్లు భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసి నష్టపరిహారం తీసుకొని పక్కగ్రామానికి వెళ్లి స్థిరపడిపోయారు. తర్వాత ఆ గ్రామం వైపు ఎప్పుడు తిరిగిచూడలేదు. ఇక మిగిలిన 20 ఎకరాలు లక్షింపేట కాపులవే కానీ ఆ కాపు కుటుంబాలు కూడా ఇప్పుడు అక్కడ లేవు. వారు ఎక్కడికో వెళ్లి స్థిరపడిపోయారు. ఆ 60 ఎకరాల భూమి ఖాళీగా ఉండటంతో గత 12 ఏండ్లుగా లక్షింపేట మాలలు ఒక్కొక్కరు 45 సెంట్ల చొప్పున దీనిని సాగుచేయటం మొదలుపెట్టారు. భూమిని సాగుచేసుకుంటున్నందుకు భూమి శిస్తు కూడా చెల్లిస్తున్నారు.  వాస్తవానికి ఈ మొత్తం 250 ఎకరాల మీద లక్షింపేట,దేవకవాడ కాపులకు ఏ సంబంధమూ లేదు. ఎందుకంటే వారు నష్టపరిహారం తీసుకున్నారు కాబట్టి.  కాపులు సాగుచేసుకుంటున్న 190 ఎకరాలు, మాలలు సాగుచేసుకుంటున్న 60 ఎకరాలు మొత్తం 250 ఎకరాలు కలిసే ఉంది. లక్షింపేటలో తమ ఇళ్ల పక్కనే మాలల ఇళ్లు ఉండటం, తమతో పాటు మాలలు భూమిని సాగుచేసుకోవడాన్ని, వాళ్లు ఆర్థికంగా ఎదగడాన్ని సహించలేని కాపులు ఏవిధంగానైనా మాలలను ఆ గ్రామం నుంచి తరిమివేయాలని కంకణం కట్టుకున్నారు.

2010 నుంచి మాలలపై జరిగిన దాడులు:
గత రెండేళ్లుగా మాలన్ని ఈ భూమి సాగుచేసుకోవద్దని బెదిరించడం, అడపదడప దాడులకు పాల్పడడం చేస్తున్నారు. 2010లో మాలవాడకు చెందిన దడాసి లత, కలమటి చిన్నమ్మడు ప్రాజెక్టు మిగులు భూమిలో పుల్లలు ఏరుకుంటుండగా తూర్పుకాపులు కర్రలతో దాడిచేసి కులంపేరుతో దూషిస్తూ వారిని కొట్టారు. మాలలు ఈ దాడికి పాల్పడిన తూర్పు కాపులపై వంగర పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికి కేసు రిజిష్టర్‌ చేయలేదు. 
గత సంవత్సరం ఆగస్టు 22వ తేదీన నివర్తి రాముడమ్మ పిడకల కోసం ప్రాజెక్టు భూముల్లో పేడ పోగుచేసుకుంటుండగా తూర్పు కాపులు ఆమెను కులం పేరుతో అసభ్యంగా తిడుతూ కర్రలతో దాడిచేసి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు కేసు నమోదు చేయలేదు. తీవ్రంగా గాయపడిన రాముడమ్మ ఆ తర్వాత మరణించడం జరిగింది.
తూర్పు కాపులకు చెందిన పొలంలో పశువులు పడ్డాయనే నెపంతో చిత్తిరి శ్రీదేవిని కులం పేరుతో దుర్భాషలాడి కర్రలతో దాడిచేశారు. అప్పుడు కొత్తగా వచ్చిన సబ్‌డివిజన్‌ పోలీసు అధికారికి ఈ దాడి విషయం ఫిర్యాదు చేయగా ఎస్సీ,ఎస్టీ యాక్ట్‌ 1989 కింద కేసు రిజిస్టర్‌ చేశారు. ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించగా మూడోరోజు బెయిలు మీద వచ్చి మా మీదనే కేసులు పెడతారా అని మాలపల్లెలో మూడు నాలుగు శాల్తీలు లెస్తేకానీ, భూములు వదిలి, ఊరు వదిలి వెళ్లరని బెదిరించారు.

పథకం ప్రకారం దాడి:
కాపులతో సమానంగా ఆర్థికంగా,రాజకీయంగా ఎదుగుతున్న మాలలను సహించని కాపులు వారిపై పథకం ప్రకారం దాడిచేయడానికి కాచుకొని కూర్చున్నారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు వారికి ఆ అవకాశాన్ని తెచ్చి పెట్టాయి. గ్రామంలో అడపదడప కాపులకు, మాలలకు భూమి కోసం గొడవలు జరుగుతూ ఉంటే 6 నెలల క్రితం పోలీసులు పికెటింగ్‌ ఏర్పాడు చేశారు. కానీ జూన్‌ 12న నరసన్నపేట ఉప ఎన్నికల దృష్ట్యా లక్షింపేట గ్రామంలో జూన్‌ 11 ఉదయం ఉన్న పోలీసు పికెట్‌ను ఎత్తివేశారు. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న కాపులు 11వ తేదీ రాత్రి చుట్టుపక్కల గ్రామాల తూర్పు కాపులను మూడు ఆటోలలో, ఒక ట్రాక్టర్‌లో లక్షింపేటకు తరలించారు. బాంబులు, కత్తులు, బడిసెలు, శూలాలు, గొడ్డలు, కారం తదితర మరణాయుధాలను సమకూర్చుకున్నారు. పక్కా పథకం ప్రకారం 12వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో సద్ది అన్నం తిని పనికి వెళ్లడానికి సిద్ధమౌతున్న మాలలపై పాశవికంగా దాడికి పాల్పడ్డారు. మాలపల్లెపై ఈ మూకుమ్మడి దాడిని గమనించిన ఊరి సర్పంచు చిత్తిరి సింహాలమ్మ భర్త గంగులు వంగర పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. కానీ లక్షింపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగర పోలీసులు సరైన సమయంలో స్పందిచకపోవడంతో దీనికి అవకాశంగా తీసుకున్న కాపులు పథకం ప్రకారం గ్రూపులుగా విడిపోయి మాలపల్లెను నాలుగు వైపుల నుంచి చుట్టు ముట్టి దాడికి పాల్పడ్డారు. మాలలను భయభ్రాంతులను చేసేందుకు మొదట బాంబులు వేయడంతో మాలలు భయపడి ఇంట్లోకి పారిపోయారు, పారిపోతున్న మాలలపై కాపులు వెంటాడి, దాడి చేసి మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో కాపులకు తోడుగా వారి స్త్రీలు,పిల్లలు కారం పొడి ,రాళ్లను అందిచి పాశవికానందం పొందారు. దాదాపు నాలుగు గంటలపాటు తూర్పు కాపులు బరిసెలతో, బండరాళ్లతో,గొడ్డల్లతో దళితులపై పాశవికంగా దాడి చేశారు. ఈ మారణకాండలో నివర్తి సంగమేశు, నివర్తి వెంకట్రావు, బురాడ సుందర్రావు, చిత్తిరి అప్పడు అక్కడిక్కడే మరణించారు. దాడిలో తీవ్రంగా గాయపడి రెండు కళ్లుపోయి, మూత్రపిండాలు ఛిద్రమై విశాఖలోని కెజిహెచ్‌లో చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత బొద్దూరి పాపయ్య  మరణించాడు.   ఈ హంతక డాడిలో 20 మంది తీవ్రంగా గాయపడి కాళ్లూ, చేతూలూ విరిగిపోయి, తలలు పగిలి, పిల్లలు, వృద్దులు, స్త్రీలు, పురుషులు జీవశ్చావాల్లా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాడితో గాయపడి మరణించిన నివర్తి సంగమేష్‌  43 కత్తిపోట్లకు గురయ్యాడని డాక్టర్‌ రిపోర్టులో రాశాడంటే దుండగులు పథకం ప్రకారం ఎంత నరమేధం సాగించారో అర్థంచేసుకోవచ్చు. నాలుగు గంటలపాటు కాపు  హంతకముటా  చేసిన పాశవిక దాడిలో లక్షింపేట దళితవాడ రక్తపు మడుగుతో నిండిపోయింది. తమపై కాపులు దాడిచేస్తున్నారని సర్పంచు భర్త చిత్తిరి గంగులు ఉదయం 7 గంటలకు పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు ఈ నరమేధం ముగిసాకా  మధ్యాహనం 12:30 గంటలకు ఆ గ్రామానికి తాపీగా చేరుకున్నారు. 
ఒక మాల కులానికి చెంది కొండ్రు మురళి ఎమ్మెల్యే మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తన కులానికే చెందిన ప్రజలు తూర్పుకాపుల పాశవిక నరమేధానికి గురయ్యారు. దళితుల ఓట్లతో గెలిచి మంత్రిగా కొనసాగుతున్న కొండ్రు మురళి వారికి  అండగా ఉండాల్సిందిపోయి అధికార పార్టీకి దళారిగా వ్యవహరిస్తూ కాపుకుల దురంకారులకే కొమ్ముకాస్తూ తన పదవిని కాపాడుకోవటానికే పరిమితమయ్యాడు తప్పా లక్షింపేట దళితుల సమస్యను చొరవతీసుకొని పరిష్కరించేందుకు, వారికి అండగా నిలిచేందుకు ప్రయత్నించలేదు. 
దళితులపై జరుగుతున్న సాగుతున్న ఈ దాడులకు మూలం భూమి సమస్యతో ముడిపడి ఉంది. దళితులంతా మెజారిటీగా  గ్రామీణ ప్రాంతాల్లో భూమిపై ఆధారపడి వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ భూమిపై హక్కు, అధికారం కలిగివున్నవారంతా ప్రధానంగా అగ్రకుల పెత్తందారీ భూస్వామ్య వర్గంగాను, అధికార రాజకీయ పలుకుబడి గలవారుగానూ ఉన్నారు. కనుక గ్రామీణ ప్రాంతంలో భూస్వామ్య, అగ్రకుల పెత్తందార్ల అధికారానికి, అహంకారానికి మూలమైన, ప్రధాన ఉత్పత్తి సాధనమైన భూమిపై హక్కు సాధించకుండా దళిత సమస్యలకు మౌళిక పరిష్కారం లేదు. ప్రభుత్వాలు ప్రవచించే 'భూసంస్కరణలు' వంటివేవీ భూసంబంధాల్లో మార్పులు తీసుకురావని, తీసుకురాలేవని రుజువైన వాస్తవం. దున్నేవానికి భూమి నినాధంగా వ్యవసాయక విప్లవం ఇరుసుగా దళితులపై జరిగే దాడులకు, అంటరానితరాన్ని సమూలంగా పరిష్కరించగలుగుతుంది. దళితులపై  దాడులకు , అణచివేతకు వ్యతిరేకంగా సాగే ఉద్యమాలు, తక్షణ డిమాండ్ల సాధనతో పాటు ఈ దాడులకు మూలమైన వ్యవస్థపై ఎక్కుపెట్టే దిశగా సాగాలి.

(ఈ వ్యాసం రచయిత లక్షింపేట బాధితులను సందర్శించాక రాయబడింది.)


No comments :

Post a Comment

ఉన్నత విద్యారంగం: సమస్యలు - సవాళ్ళు

No comments
ప్రముఖ విద్యావేత్త డి.ఎస్‌.కొఠారి ఉన్నత విద్యా లక్ష్యాలను పేర్కోంటూ విద్య సామాజిక అవసరాలకు అనుగుణంగా  ఉంటూ,సామాజిక చైతన్యానికి హృదయంలా పనిచేసి తాను పనిచేస్తున్న సామాజిక జీవన విధానాన్ని విమర్శనాత్మకంగా  విశ్లేషించే సాధనంగా ఉండాలి అని పేర్కోన్నాడు. దీనికి భిన్నంగా నేషనల్‌ నాలెడ్జ్‌ కమీషన్‌ ఛెర్మన్‌ శ్యాం పెట్రోడా విద్య ద్వారా ఉత్పత్తి పెంచి, పెంచిన ఉత్పత్తికి వినియోగించే శక్తిని కల్పించాలని పేర్కోన్నాడు. ఈ రెండు దృక్పథాలు నిజానికి రెండు భిన్న ధృవాలు. విశ్వవిద్యాలయాల పాత్ర ఏ దృక్పథం మీద ఆధారపడి ఉంటున్నదనేది ప్రధాన సవాళు. సమాజ శ్రేయస్సు,సమిష్టి జీవన మలువనుపెంచే దిశగా విద్యావ్యవస్థ ఉండాలి. నిజానికి విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి అర్థం అవి రాజ్యాధికారం నుండీ మార్కెట్‌ శక్తులనుండి కాపాడబడాలనే కాని సామాజిక బాధ్యతలేదని కాదు. ఉన్నత విద్య నిరంతరంగా ప్రజకు బాధ్యతవహించి ప్రజల ఆకాంక్షకనుగుణంగా, వాళ్ళ సమస్యలకు ధర్పణంగా, సామాన్య, శ్రమజీవు జీవితం మెరుగపడే మార్గాలు వెతకాలి. పౌర సమాజ నిర్మాణంలో దేశ వ్యాపితంగా యువతను భాగస్వాములను చేయడంలో విద్య కీలక పాత్ర నిర్వహించాలి. విద్యా విదానం వ్యక్తి ప్రతిభను ఎంత పెంచినా ఆ వ్యక్తి తన చుట్టూ ఉండే పరిస్థితులకి స్పందించకపోతే అతను మానవత్వాన్ని కొల్పోయే ప్రమాదం ఉంటుంది. మానవీయ దృక్పథాన్ని విస్మరించి విద్య వ్యక్తి ప్రయోజనం కొరకే అనే అమానుష భూమిక మీద ఇప్పుడు విశ్వవిద్యాయాలని నిర్మించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాయాలను అహ్వానిస్తున్నారు.
 
భారత ప్రభుత్వం దేశంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)తో నడిచే విద్య సంస్థల ఏర్పాటుకు కూడా అమోదం తెలిపింది. దీంతో ఉన్నత విద్యారంగంలో లాభదాయకమైన సంస్థను నెలకొల్పుకునేందుకూ, ప్రయివేట్‌, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుకు భారీ ఎత్తున అవకాశాలు కల్పించేందుకూ బడా వ్యాపార సంస్థలు సిద్ధపడుతున్నాయి. విద్యారంగంలో చోటుచేసుకున్న ఈ మార్పు నేపధ్యంలో మొదటిసారిగా ప్రపంచ వాణిజ్య సంస్థ (ఉబ్ల్యుటీవో) చర్చ అజెండాలో విద్యరంగాన్ని కూడా చేర్చారు. ‘‘సేవల్లో వ్యాపారంపై సాధారణ ఒప్పందం’గాట్స్‌ 2000’’ అనే శీర్షిక కింద ఈ చర్చ జరిగాయి.
గాట్స్‌ ఆధారంగా ఉన్నత విద్యా వ్యవస్ధ తలుపులు తెరిస్తే ప్రయివేటీకరణ, వ్యాపారీకరణ, ప్రపంచీకరణ, ఉన్నత విద్యపై నియంత్రణ తొగింపు పెద్దఎత్తున చోటుచేసుకుంటాయి. అంతేకాకుండా ప్రభుత్వం నిధులను కుదిస్తుంది. ఉన్నత విద్య సరళీకరించబడి విదేశీ, స్వదేశీ స్వయం నిర్వహణ (సెల్ఫ్‌ఫైనాన్స్‌) సంస్ధలు పెరుగుతాయి. గాట్స్‌ 2000 చర్చ ఒప్పందం తరువాత మనదేశంలో విద్య వ్యాపారీకరణ వేగవంతమయింది. విద్యా వ్యాపారు లాభార్జనకు అవకాశాలు పెరిగాయి. ఉన్నత విద్యలో పెరుగుతున్న డిమాండ్‌ను ప్రయివేట్‌ సంస్ధలు అందుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నియంత్రణను గాలికొదిలేస్తోంది. గాట్స్‌ చర్చలు ఈ ధోరణికి మరింత ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. ఉన్నత విద్యారంగంపై నియంత్రణ తొలగింపు, సరళీకరణలు తీవ్రమైన దుష్బ్రవాన్ని చూపుతున్నాయి నాణ్యత లేకుండా ప్రయివేటు విద్యాసంస్ధలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. పేద ప్రజలు, ముఖ్యంగా సామాజిక వివక్ష నెదుర్కొంటున్న బహినవర్గ ప్రజలు విద్యకు దూరమవుతున్నారు.  విద్య వ్యాపారీకరణను అరికట్టాని, విద్యరంగ సరళీకరణను తొగించాని భవిష్యత్తులో ప్రభుత్వాలు భావించినప్పటికి అది అమలు చేయడం కష్టమౌతుంది. ఎందుకంటే ‘గాట్స్‌ 2000’ చర్చ ప్రకారం అలాచేస్తే వ్వాపార భాగాస్వామికి సష్టపరిహారం చెల్లించాల్సి  ఉంటుంది. ఈ నిబంధన వల్ల ఉన్నత విద్యలో అసమానతలు పెరుగుతాయి. మన విద్యవిధానం స్వతంత్రతను కోల్పోయి, ఇతర దేశా సంస్ధమీద అధారపడే స్థితికి పోతుంది.
 
గాట్స్‌ చర్చ ద్వారా విదేశీ విద్య సంస్థకు మన విద్య వ్యవస్థ ద్వారాలు తెరవడం వల్ల సంభవించే నష్టాలను అంచనా వేయడంలో కేంద్ర విద్య సహాయమండలి (సిఎబిఇ) విఫలమైంది. దానివల్ల భారత అభివృద్ధికి జరిగే నష్టాలను సిఎబిఒ నివేదిక విస్మరించింది. విద్య అంతర్జాతీయ వ్యాపార వస్తువుగా మారిన తర్వాత ఉన్నత విద్యను నియంత్రిచండంలో డబ్ల్యుటీవో, ప్రపంచబ్యాంక్‌, ఇతర బహుళజాతి సంస్థల  ప్రభావం పెరిగింది. ఉన్నత విద్యలో వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఉన్నత విద్యను ప్రపంచీకరించారు. ఇతర దేశాలకు వెళ్ళకుండానే స్వదేశంలో విదేశీ చదువు సాగించే వ్యక్తుల సంఖ్య ఈ కాలంలో బాగా పెరిగింది. 1995`2005 మధ్యకాలంలో ఈ విధంగా చదువుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15 క్ష నుండి 25 ల్లక్షకు అంటే దాదాపు 60 శాతం పెరిగింది. పూర్తి దూర విద్యా కోర్సుల్లో చేరడం ద్వారానో లేక విదేశాల్లోని యూనివర్శిటీలు, కాలేజీలు లేదా విదేశీ ఎగ్జామినేషన్‌ బోర్డు భాగాస్వామంతో ఏర్పరచిన స్థానిక ప్రభుత్వ లేదా ప్రయివేట్‌ సంస్థల్లో అధ్యయనం ద్వారానో వీరంతా విదేశీ విద్యర్హతలు పొందుతున్నారు. అగ్నేయాసియాలో ఉమ్మడి ఒప్పందాలు సర్వసాధారణమయ్యాయి. ఈ విధమైన సంస్థాపరమైన ఒప్పందాల ద్వార విదేశీ యూనివర్సిటీనూ, విదేశీ ప్రయివేట్‌ ఉన్నత విద్య సంస్థనూ ఏర్పాటు చేసి కోర్సును నిర్వహిస్తూ డిగ్రీ పట్టాను అందిస్తున్నాయి. స్వదేశీ సంస్థలు విదేశీ ‘భాగాస్వామ్యంతో’ విద్యాయాలు నడుపుతూ వారి కోర్సు ‘స్వదేశం’లో చెల్లుబాటు అయ్యేలా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. విదేశీ భాగాస్వామికి చెందిన బోధనాపద్థతులు, పరీక్ష ప్రమాణాలు కూడా చెల్లుబాటు  అవుతున్నాయి. విదేశీ సంస్థలు దేశంలో తమ స్వంత విద్య కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి.
విద్య ఎగుమతుల్లో అగ్రగామి అమెరికా:
2005లో ఉన్నత విద్యరంగంలో 500 కోట్ల డాలర్ల అంతర్జాతీయ వ్యాపారం జరిగిందని అంచనా. ఇది ఒఇసిడి (అభివృద్థిచెందిన) దేశాల్లోని మొత్తం సేవ వ్యాపారంలో మూడవ శాతానికి సమానం. విద్యసేవల్లో అంతర్జాతీయ వ్యాపారం త్వరలోనే 1000 కోట్ల డాలర్లు దాటుతుందని గ్రాండ్‌ అయెన్స్‌ ఫర్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (బిఎటిఇ) అంచనా వేసింది. విద్య సేవను ఎగుమతి చేయడంలో అమెరికా అగ్రభాగాన ఉండగా అ తరువాత స్థానాల్లో బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ ఉన్నాయి. అమెరాకాలో విద్యాసేవ ఎగుమతి వ్యాపారం 2005 లో 200 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇది అన్ని రకాల సేవ ఎగుమతిలో ఐదో స్థానంలో ఉంది. విద్యా ఉన్నత విద్య సేవలు అమెరికాకు మంచి వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో 40 లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న విద్యాసేవల వ్యాపారాన్ని విస్తరించుకోవాని ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉన్నత విద్యలో అమెరికాకు 64 శాతం మార్కెట్లు ఆసియా దేశాలైన చైనా, జపాన్‌ కొరియా,భారత్‌, తైవాన్‌, ధాయ్‌లాండ్‌, ఇండోనేషియా, మలేషియాలో లభిస్తుండగా మిగిలిన మార్కెట్‌ యూరప్‌, లాటిన్‌ అమెరికా దేశాల్లో ఉంది. బ్రెజిల్‌, చైనా, భారత్‌ కొరియా, మలేషియా దేశాల్లో విద్యకు పెరుగుతున్న గిరాకీ రీత్యా విద్యావ్యాపార విస్తరణకు అవకాశాలు పెరుగుతున్నాయి.
అయితే ప్రస్తుతం విద్యాసేవ వ్యాపారంలో అమెరికాకు ఆస్ట్రేలియా, బ్రిటన్‌ నుండి పోటి ఎదురవుతుంది. ఈ వ్యాపారానికి స్వేచ్ఛా మార్కెట్‌ లేక పోవడం బడా వ్యాపార వర్గాల్లో అసంతృప్తిని పెంచుతొంది. అసియా దేశాల విద్యార్థుల కోసం ప్రధానంగా పోటి నెలకొంది. ఈ దేశాల్లో ప్రాధాన్యత వారీగా వ్యాపార అస్థిత్వాన్ని సుస్థిరం చేసుకొవాలని లేదా విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులు పెట్టాలని బడా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి, డబ్ల్యుటీవో చర్చ ద్వారా జాతీయ అడ్డంకులను తొగించుకొని ఈ దేశాల్లో ప్రయివేట్‌ ఉన్నత విద్యా మార్కెట్‌ను విస్తరించుకోవాని బడా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అభివృద్ది చెందుతున్న దేశాల్లో విద్యారంగ రక్షణకు అనేక చట్టపరమైన నియంత్రణలున్నాయి. జాతీయ ప్రయోజానాలు, ఆర్థిక అవసరా రీత్యా ఈ నియంత్రణలు, పరిమితలు ఖచ్చితంగా అవసరం. అయితే వీటిని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ు ఆటంకాలుగా పేర్కోన్నాయి. విద్యా వ్యాపారంలో డబ్ల్యుటివో గుర్తించిన నాుగు విభాగాల్లోనూ సభ్యదేశా మధ్య ఒప్పందం జరగాని ఈ దేశాు కోరుతున్నాయి.
ఈ నిబంధనను అమోదించే ముందు విద్య సేవల్లో అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహించాడం ద్వారా ఉత్పన్నమయ్యే అన్ని పరిణామాల గురించి మన దేశంలో  విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరంముంది. గాట్స్‌ చర్చు నేటికి అస్పస్టంగానే ఉన్నాయి. చర్చ ఫలితమే కాదు, గాట్స్‌ సాధారణ నిబంధనల్లో కూడా అస్పస్టత నెకొని ఉంది. ఉదాహారణకు జాతీయ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ నిబంధను మొత్తం భారత విద్యారంగ మంతటికీ అంటే రాష్ట్రాకు కూడా వర్తిస్తాయా అనేది సందిగ్థం. ఒకవేళ వర్తిస్తే లాభా కోసం స్థాపించే విదేశీ విద్య సంస్థలు కూడా ప్రభుత్వ నిధుల కోసం జాతీయ విద్య సంస్థతో పోటిపడతాయి. ప్రభుత్వ నిధుల్లో కోతపెట్టే అవకాశం ఉంది. ఈ స్థితి అధిక ఫీజుకు కారణమై విద్యారంగంలో అసమానతను తీవ్రంగా పెంచుతుంది.
గాట్స్‌ చర్చల్లో భారత స్థానం :డబ్ల్యుటివో చర్చల్లో భాగంగా ఉన్నత విద్యను సరళీకరిస్తామని అమెరికా, యురోపియన్‌ యూనియన్‌, కెనడా, ఆఫ్రికన్‌  అరబ్‌ దేశాతో పాటు పొరుగు దేశాలు కూడా హామీ ఇవ్వాని భారత్‌ కోరుతుంది. గాట్స్‌ ప్రతిపాదన వల్ల దీర్ఘకాంలో విద్యా నాణ్యత దెబ్బతినడమే కాకుండా ప్రజాప్రయోజనాలకు కూడా నష్టం కుగుతుంది. ఎందుకంటే గాట్స్‌ నిబంధన వల్ల విద్యా వ్యవస్థపై ప్రభుత్వాలకు పట్టు, నియంత్రణ లేకుండా పోతుంది. నాలుగు రకాల వ్యాపార విధానాలతో మార్కెట్‌ను సరళీకరించడం వైపే భారత ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. విదేశీ విద్యా సంస్థలు భారత విద్యార్థులకు బయోటెక్నాజీ, కంప్యూటర్‌ సైన్సెస్‌, మెటీరియల్‌ సెన్స్‌ లాంటి అభివృద్థి చెందుతున్న సైన్స్‌ కోర్సులను అందిస్తాయని భారత ప్రభుత్వం భావిస్తోంది. కీలక అంశాల్లో విదేశీ పెట్టుబడును ఆకర్షించేందుకు వాటిని 74 శాతానికి మాత్రమే పరిమితం చేసి ప్రోత్సాహాకాలు ఇవ్వడం ద్వారా విదేశీ విద్యా సంస్థను నియత్రించవచ్చునని అది పేర్కోంటోంది. అయితే సాంకేతిక వ్యవహారాలను ప్రభుత్వమే నేరుగా నియంత్రించినప్పుడు మాత్రమే మనకు విదేశానుండి నాణ్యమైన సాంకేతిక పరిజ్ఞానం భిస్తుందని లేకుంటే మనం పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని మన ప్రభుత్వ విస్మరిస్తోంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుపై పరిమిత రూపంలో పరోక్ష నియంత్రణలు ఉండాని ప్రభుత్వం అంటోంది. కాని ఇది కనీసం మనకు దిగుమతి అవుతున్న టెక్నాజీ ఏమిటనే విషయం తొనుకునేందుకు కూడా సరిపోదు. గత 50 ఏళ్ళ అనుభవాన్ని గమనిస్తే విదేశీ కంపెనీలు తమ ముఖ్యమైన టెక్నాజీలను ఇతరులకు పంచాలని ఎన్నడూ ప్రయత్నించలేదు.ఉక్కు చమురు, ఎక్ట్రానిక్స్‌, ఔషదాలు, సూపర్‌ కంప్యూటరింగ్‌లో మన అనుభవాలను ఎలా మరిచిపోగం?
భారత ప్రభుత్వం విద్యారంగంలో 100 శాతం ఎఫ్‌డిఐను ఆహ్వానించింది. ఎఐసిటిఇ, యుజిసి గుర్తింపు పొందిన సంస్థ కేటగిరీ కింద విదేశీ సంస్థను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఐదేళ్ళ కాంట్రాక్ట్‌ కింద ఈ సంస్థను అనుమతిస్తున్నారు. సరిగ్గా నిర్వహించకుంటే మూడేళ్ళ తరువాత వాటి అనుమతిని సమీక్షించే నిబంధన కూడా కాట్రాక్ట్‌లో పొందపరుస్తున్నారు. 1990 నుండి వ్యాపార వర్గ ప్రయోజనాకు అనుగుణంగా భారతపాలకులు మన విద్యా విధానాన్ని రుపొందిస్తున్నారు. ఈ పరిణామాు భారత ఉన్నత విద్యలో ప్రయివేటీకరణ. లాభార్జనను విపరీతంగా పెంచాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా సామార్థ్యాన్ని పెంచుకొవడానికి ప్రయివేట్‌ నిధులు సమీకరించుకోవాలని, ఆ నిధులతో కొత్త సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సు ప్రారంభించాని వాటిపై ఒత్తిడి వస్తోంది.
ఉన్నత విద్యా సంస్థల స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఉన్నత విద్య సరళీకరణ, ప్రయివేటీకరణను మరింత వేగవంతం చేయాని ఈ కమిటీ కూడా ప్రతిపాదించింది. దీనికితోడు మన ఉన్నత విద్యా రంగంలోని సంగీతం, ఆర్ట్స్‌ అండ్‌ క్చర్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాజీ విభాగాలను ప్రపంచస్థాయిలో మార్కెటింగ్‌ చేసుకోవాలని దేశంలోని ఎగువ మధ్యతరగతి వర్గం భావిస్తున్నది. మేనేజ్‌మెంట్‌ విద్య, ఆయుర్వేద, ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్, ఇంజనీరింగ్‌, ఐటి విద్య, యోగా మరియు విదేశీ భాష విద్య వ్యవసాయం, గ్రామీణాభివృద్థి విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు మార్కెట్‌ అవకాశం కల్పించాని గాట్స్‌ చర్చల్లో భారత్‌ కోరుతోంది.
 
ఉన్నత విద్యపై గాట్స్‌ ప్రభావం
 ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి విద్యారంగ బడ్జెట్‌ 10,000 కోట్ల డార్ల వరకు ఉంది. ఈ రంగం ఐదు కోట్ల మంది ఉపాధ్యాయుకు ఉపాధి కల్పిస్తుండగా ఏడాదికి 10 కోట్ల మంది విద్యార్థు చేరుతున్నారు. విద్యా సేవల్లో వ్యాపార ధోరణి పెరగడం వ్ల విద్యారంగంలో అంతర్జాతీయ సహాకార ప్రక్రియ దెబ్బతింటుంది. ఇప్పటి వరకు వర్థమాన దేశాు ఈ సహాకారంతోనే తమ ప్రభుత్వరంగ సంస్థను అభివృద్థి చేసుకుంటూ వస్తున్నాయి. ఉదాహారణకు మనదేశంలో ఐఐటిు. గత 20 ఏళ్ల కాంలో విద్యకు ప్రభుత్వ నిధుల్లో కోత విదించడం, ఉన్నత విద్యపై నియంత్రణ తొగించడం వ్ల ఇప్పటికే భారత విద్య వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోయింది. ప్రభుత్వ యూనివర్శిటీు, ఇతర వృత్తి సంస్థనుండి నాణ్యమైన విద్యను పొందగమనే నమ్మకం మధ్యతరగతి ప్రజల్లో సడలింది ఈ నేపధ్యంలో ఉన్నత విద్యలో బలీయమైన శక్తిగా ఎదుగుతున్న బడా వ్యాపారవర్గం భారత్‌లో ప్రవేశించింది.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు ఉన్నత విద్యారంగంలోకి వస్తాయనే ఆశతో భారత ప్రభుత్వం గాట్స్‌ చర్చలో పాల్గోంది.విదేశీ యూనివర్శిటీు అందించే కోర్సుపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఐఇపిఎ) చేసిన విశ్లేషణ నిజానికి చేదు అనుభవాు తొపుతుంది. అవి అందించే కోర్సుల్లో అత్యధిక భాగం హాస్పిటాలిటీ సర్వీసు, మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాజీకి సంబంధించినవి. చాలా కోర్సులో ఏక కాంలోనే రెండు డిగ్రీను అందిస్తున్నాయి. ప్రవేశానికి మార్కు శాతం లాంటి కనీస అర్హతను కూడా పాటించడం లేదు. డిగ్రీకోర్సు కావ్యవధి అదే డిగ్రీకు మనదేశంలో అమల్లో ఉన్న కా వ్యవధికన్నా తక్కువగా ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ స్థాయిలో మంచి ప్రతిభ చూపలేని విద్యార్థు మాత్రమే విదేశీ డిగ్రీు కావానుకుంటున్నారన్న విషయం స్పష్టంగా అర్థమౌతుంది. భారత యూనివర్శిటీు, కాలేజీల్లో ప్రవేశం పొందలేని వారే అత్యధికంగా విదేశీ డిగ్రీు కావానుకుంటున్నారు.
విదేశీ విద్య సంస్థు విద్యార్థును ఆకర్షించేందుకు అనేక జిమ్మిక్కుకు ప్పాడుతున్నాయి. విద్యార్థుకు ఇంటివద్దనే విద్య అందిస్తున్నాయి. కాని దీనివ్ల విద్యార్థు నాణ్యమైన విద్య పొందలేకపొతున్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో అనేక విద్యా కేద్రాను నెకొల్పిన ఆస్ట్రేలియా ఇందుకు పెద్ద ఉదాహరణ. ఈ సంస్థల్లో విద్యా నాణ్యత ప్రమాణాను అధ్యయనం చేసిన సంస్థు వ్లెడిరచిన వివరా ప్రకారం ఇవి ఆస్ట్రేలియా ఉన్నత విద్య సంస్థకు గుదిబండుగా మారిపోయాయి. దీంతో ఆ సంస్థల్లో ఖర్చును తగ్గించుకునేందుకు అవి అందించే చాలా సౌకర్యాల్లో కోత విధిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఈ సంస్థు అందిస్తున్న విద్య నాణ్యత ప్రమాణాపై ప్రభావం చూపుతుంది. బహుజాతి సంస్థ అవసరాల్లో వచ్చిన మార్పు దృష్ట్యా కొన్ని ఎంపిక చేసిన వృత్తివిద్యా కోర్సు కోసం భారత్‌లో విద్యావ్యాపారం చేయాని ప్రపంచ మార్కెట్‌ శక్తు ఆసక్తి గా ఉన్నాయి. ఈ విదేశీ సంస్థు కొత్త కోర్సుల్లో విద్యా సంస్థు తెరవడం కాకుండా స్థానికు కూడా సునాయసంగా  నిర్వహించగల్గిన మార్కెట్‌ను కైవసం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. వృత్తి సేమ అంతర్జాతీయీకరించబడుతున్న కొద్దీ ఉన్నత విద్య ప్రపంచీకరణ ప్రక్రియ వేగవంతమవుతోంది. లాభాు ఆర్జించే మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌, ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ కోర్సు మంచి అవకాశాు కల్పించేందుకు సిద్థంగా ఉన్నాయి. అందుకే ఆంగ్ల భాషా ప్రావీణ్యం కల్గిన భారత యువతను బుట్టలో వేసుకునేందుకు భారత్‌లో విద్యా వ్యాపార సంస్థు నెకొల్పాని ప్రపంచ మార్కెట్‌ శక్తు భావిస్తున్నాయి. అటానమస్‌ విద్యాసంస్థకు అనుమతివ్వడం ద్వారా ప్రభుత్వం విదేశీ విద్యసంస్థకు తుపు తెరిచింది.
భారత్‌లో ఉన్నత విద్య ఇప్పటికీ వేగంగా అభివృద్థిచెందుతున్న రంగమే. అయితే ఈ రంగలో ప్రభుత్వ ఖర్చు తగ్గిపోబట్టే ప్రయివేట్‌ మార్కెట్‌కు డిమాండ్‌ ఏర్పడిరది. ప్రభుత్వ ఖర్చు ఉన్నత విద్యపై ప్రణాళికా వ్యయంలో 1.24 శాతం నుండి 0.35 శాతానికి తగ్గిపొయింది. దాదాపు 75 శాతం కాలేజీు ప్రయివేట్‌ రంగంలోనే ఉన్నాయి. ఉన్నత చదువుకయ్యే ఖర్చును విద్యార్థులే భరించానే ధోరణి రోజురోజుకీ పెరుగుతోంది. అధిక ఆదాయాున్న కుటుంబాకు చెందినవారు అత్యధిక ప్రయోజనాను చేజిక్కించుకుంటున్నారు. మరోవైపు ప్రయివేట్‌ కాలేజీ పెరుగుద వ్ల విద్యప్రమాణా నాణ్యత క్షీణిస్తోంది. ఉన్నత చదువు ఖర్చును విద్యార్థులే భరించడం పేదకు సాధ్యంకాదు. ఉన్నత విద్య ప్రయివేటీకరించబడితే అది పేదకు శాశ్వతంగా దూరమైపోతుంది.
                                                                                                 తెంగాణ విద్యార్థి గళం, జులై`ఆగస్టు 2012 
 

No comments :

Post a Comment

ప్రపంచీకరణ యుగంలో దళిత యువత భవిష్యత్తు ఏమిటి?

No comments
 
నూతన ఆర్థిక విధానాు ప్రభుత్వ రంగాన్ని రోజు, రోజుకి కుదించి వేస్తున్నాయి. ఉన్న ఉపాధి హరించుకు పోతోంది. పాకు చెబుతున్న ప్రయివేటు, విదేశీ పెట్టుబడులో పెరుగుద కనిపిస్తోంది. కానీ ఉపాధికి మాత్రం పెరగడం లేదు. ప్రయివేటు పెట్టుబడి వీలైనన్ని తక్కువ ఉద్యోగాను, తక్కువ వేతనాను ఇచ్చే ఉద్యోగాును మత్రమే సృష్టిస్తోంది. దీని వన యువత విపరీతంగా నష్టపోతోంది. ఈ ప్రక్రియలో మొదట బవుతున్నది దళిత యువతే. తరతరా నుంచి అణగదొక్కబడి విద్యా, ఉద్యోగాకు దూరంగా ఉంచబడిన దళితు రాజ్యాంగం కల్పించిన రాయితీ కారణంగా వాటిలోకి ప్రవేశించగలిగారు. ప్రస్తుతం ప్రభుత్వాు తెస్తున్న సంస్కరణు రాజ్యాంగం దళితుకు కల్పించిన భద్రతను సవాు చేస్తున్నాయి.  
1990లో ప్రకటించిన పారిశ్రామిక విధానంలో కేవం ఆరు నుంచి ఎనిమిది రకా పరిశ్రమను మాత్రమే ప్రభుత్వ ఆజమాయిషీ కింద ఉంచి మిగిలిన వాటిలోకి ప్రయివేట్‌ సంస్థను అనుమతించింది. ప్రస్తుతం వాటిని కూడా ప్రయివేట్‌ వారికే అప్పగించి తను తప్పుకునే ప్రయత్నాలో ఉంది. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగాు పొందుతున్న దళితు ప్రస్తుతం ఉద్యోగాకు దూరమవుతున్నారు. ఇప్పటి వరకు విద్య, ఉద్యోగాలో వాటాను పొందుతున్న వారు నేడు ప్రభుత్యోగాపై ఆశు వదుకొని చేతి వృత్తు చేసుకుంటున్నారు. అనేక మంది దళిత గ్రాడ్యుయేట్లు నగరాకు వస వచ్చి పను వెతుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దళిత యువత భవిష్యత్తు ఆందోళనలో పడుతోంది. ప్రస్తుతం పాకు సంస్కరణతో అభివృద్ధిని నిలిపివేసి స్వాతంత్య్రనికి పూర్వపు రోజును ప్రసాదించబోతున్నారా అనే అనుమానం కుగుతోంది.
దళితు ఉపాధి ఎలా ఉంది:
2001 జనాభా లెక్క ప్రకారం రాష్ట్రంలో దాదాపు కోటి యాబై క్ష మంది దళితున్నారు. వారిలో 10 క్ష మంది దారిద్య్ర రేఖకు ఎగువన ఉండగా, మిగిలిన కోటీ నభై క్ష మంది రెక్క కష్టంపై ఆధారపడి బతుకుతున్నారు. దళితులో అక్షరాస్యత దాదాపు 40 శాతం ఉన్నా కేవం 10 నుండి 15 శాతం మాత్రమే ఉద్యోగాకు అర్హత సంపాదించగుగుతున్నారు. రిజర్వేషన్ల వ్ల విద్య, ఉద్యోగాలో చోటు సంపాదించుకున్న ఈ సెక్షనే ప్రస్తుతం దళితులో కొంత మెరుగైన జీవితం గడుపుతున్నది. మిగిలిన వారిలో ఎక్కువ మంది వ్యవసాయ కార్మికుగాను, దిగువ స్థాయి కార్మికుగాను జీవితాను వెళ్ళదీస్తున్నారు. ప్రస్తుతం జనాభాలో నాుగు శాతం ఉన్న ప్రభుత్వోద్యోగాు ప్రభుత్వాు అనుసరిస్తున్న విధానా వన రోజు రోజుకీ తగ్గిపోతున్నాయి. దీని వస ఙప్రపంచీకరణ యుగంలో యువత భవిష్యత్తు ఏమిటి?యువకుకు ఉపాధి మార్గాు మూసుకుపోతున్నాయి.
దళితు ప్రత్యేకించి కోల్పోతున్నదేమిటి?
ప్రయివేటీకరణ వన ప్రత్యేకంగా, అతి ఎక్కువగా నష్టపోతున్నది దళిత యువతే. రాష్ట్రంలో రిజిస్టేషన్‌ చేయించుకున్న దళిత నిరుద్యోగు 9.5 క్ష మంది ఉన్నారు. మిగిలిన వర్గాలో ఇంత కంటే ఎక్కువ మందే ఉన్నా ఈ పరిస్థితి లేదు. వారు ప్రభుత్వోద్యోగాపై ఎక్కువ ఆశ పెట్టుకోకుండా వేరే ఉద్యోగాను వ్యాపారాను చూసుకుంటున్నారు. ప్రభుత్వోద్యోగాలో వారి ప్రతిభకు తగ్గ రీతిలో ప్రాతినిధ్యం లేదన్న అసంతృప్తి ఉంది. వారు తమకున్న పరిచయా ద్వారాను, కొంత కష్టపడి ఇతర రంగాలో రాణించగుగుతున్నారు. ప్రయివేటు రంగంలో ఉన్న ఉద్యోగితను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ప్రయివేటు సంస్థలో దళితు ప్రధానంగా ఆన్‌స్కిల్డ్‌ కార్మికుగా ఉండగా దళితేతయి మేనేజ్‌మెంట్‌, క్లరికల్‌ స్థాయిలో ఉంటున్నారు. డిగ్రీు చదివిన తరువాత దళితుకు ప్రభుత్యోద్యోగాు రాకపోతే ఆటో డ్రైవర్లుగానో రాడ్‌ బెండిరగ్‌ వర్కర్లుగానో, మరే ఇతర సాధారణ కార్మీకుగా స్థిరపడుతున్నారు. మరలా ప్రభుత్యోగాు వస్తేనే వీరి జీవితాకు మెగు. లేదంటే క్రింది స్థాయి వృత్తులో స్థిరపడసి వస్తోంది. వీరికి వస్తే ప్రభుత్యోగాు లేదంటే మరే ఉద్యోగాు రావడం లేదు. పరిశ్రము అధికంగా ప్రయివేటు రంగంలో వస్తున్నాయి. వీటిలో రిజర్వేషన్లకు స్థానం లేదు. దీనిలో దళితుకు ఇక్కడ ప్రవేశం దుస్సాధ్యమవుతోంది. స్వదేశీ పరిశ్రము కానీ, వీదేశీ కంపెనీ అనుబంధ సంస్థు, ఏజెన్సీు అన్నీ అగ్రవర్ణా చేతుల్లోనే మెస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న, కొత్తగా ఏర్పడుతున్న పరిశ్రము దాదాపుగా పూర్తిగా దళితేతర వర్గా చేతుల్లోనే ఉన్నాయి. ప్రయివేట్‌ సంస్ధల్లో ఉద్యోగాకు ప్రతిభతోబాటు బంధుత్వాు, పరిచయాలే అర్హతుగా పనిచేస్తున్నాయి. చదువు పూర్తి చేసుకున్న అగ్ర వర్ణా యువత వాటితో ఉద్యోగాు దక్కించుకోగుగుతున్నారు. అగ్రవర్ణా కోటల్లోకి దళితు ప్రవేశం ఎలా సాధ్యం? అంతేకాక వారిలో ఇన్నాళ్ళుగా ఉన్న రిజర్వేషన్‌ వ్యతిరేకత కూడా ఇక్కడ బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. దళితు చేతులో ఉపాధిని ఇవ్వగలిగే పరిశ్రము గానీ, భూఖండాు గానీ లేవు. దీని వన వారికి ఉద్యోగా భ్యత ఇబ్బందిగా మారింది. రాజ్యాంగం దళితుకు కల్పించిన రక్షణు ప్రపంచీకరణ గాలివానకు కుప్పకూుతున్న తీరిది. అగ్రవర్ణాకు ఉన్న సంబంధాు, పరిచయాు వారిని కొంత మేరకు రక్షిస్తుండగా, దళిత యువకుకు మాత్రం దుర్భర పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న టీచర్‌, పోలీసు ఉద్యోగాు కూడా రాకపోతే వీరు మరిన్ని ఇబ్బందు ఎదుర్కొనేవాటరు. రానున్న కాంలో ఈ పరిస్థితిని కూడా చూడవచ్చు.

దళితుపై ప్రపంచీకరణ ప్రభావం
 ప్రపంచీకరణ ఫలితా గురించి తొసుకుంటున్న దళితు ఈ ప్రపంచీకరణే తమ పరిస్థితికి కారణమంటున్నారు. ప్రపంచీకరణ వ్ల వేగంగా ప్రభుత్వ రంగం హరించుకపోతోందన్న ఆందోళన వీరిలో కనిపిస్తోంది. ఉత్పత్తిలో ప్రభుత్వ పాత్ర తగ్గి మార్కెట్‌ శక్తు పాత్ర పెరగడం వన దళిత యువకుకు అవకాశాు రోజు రోజుకూ కుచించుకు పోతున్నాయి. దీనీ వ్ల ప్రపంచీకరణపై దళితు నిరసన పెరుగుతోంది. ఇదే సమయంలో ప్రపంచీకరణ వ్ల దళితుకు మేు జరుగబోతుందని, అమెరికా, నుంచి వచ్చిన దొరు అక్కడి న్లవారిని చూసినట్లే దళితును ఉద్ధరిస్తారని, కనుక బహుళజాతి సంస్థను ఆహ్వానించాని చంద్రభాను ప్రసాద్‌ వంటి దళిత మేధావు చెబుతున్నారు. కానీ ఆమెరికన్లు తమ దేశ:లో చేసుకున్న చట్లాలే విదేశీయు చేస్తే ఊరుకోరన్న విషయం ఆయనకు తెలియనట్లుంది. ఆమెరికాలో ఉన్న పెటేంట్‌ చట్టం, గుత్తాధిపత్య వ్యతిరేక చట్టం వంటివి విదేశాు చేస్తే అమెరికా సహించదు. తన పౌరును ప్రేమగా చూసుకునే అమెరాకి పాకు వేరే దేశా పట్ట వివక్ష భావంతోనే ఉంటున్నారన్నది స్పష్టం. వారు ఇక్కడ వ్యాపారం కోసం బం, బగం ఉన్న భూస్వాము, జాతీయ పెట్టుబడిదారు వైపై ఉంటారన్నది. తిరుగులేని సత్యం. అంతే కాకుండా అమెరికాలో న్ల జాతి ప్రజు సుధీర్ఘ పోరాటం నడిపిన తర్వాత వారికి విముక్తి భించింది. బహుళ జాతి సంస్థ దయా దాక్షిణ్యా వ్ల కాదు. అయినా ఇప్పటికీ అక్కడ న్లజాతి వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. న్లవారు ఎక్కువగా క్రిందిస్థాయి ఉద్యోగాలోనూ, సైన్యంలోనూ పనిచేస్తున్నారు. సంపద ప్రధానంగా త్లెజాతి వారి చేతులో ఉండగా న్లవారు గెట్టోుగా పివబడే మురికివాడలో జీవిస్తున్నారు. బహుళజాతి సంస్థు దళితు ప్రయోజాకు అనుకూమని చేస్తున్న ప్రచారం ఎవరికి అనుకూమో త్చేుకోవచ్చు.

 ప్రభుత్వ సంస్థ ప్రయివేటీకరణను గట్టిగా వ్యతిరేకించని దళిత సంస్థు నేడు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కావాని కోరుతున్నాయి. సంస్థలో ఉన్న కార్మికు ప్రాథమిక హక్కునే లాక్కోజూస్తున్న ప్రభుత్వాు కొత్తగా దళితుకు రిజర్వేషన్లు ఇస్తాయని అనుకోలేము. యాజమాన్యా మెప్పు కోసం బరి తెగిస్తున్న ప్రభుత్వాు ఇటువంటి సాహసోపేత నిర్ణయాను ఎట్టి పరిస్థితిలోను తీసుకోవు. ఎందుకంటే పరిశ్రమాధిపతు నుండి ఈ ప్రతిపాదనకు వ్యతిరేకత ఎదురు కావచ్చు. ప్రస్తుతం ప్రభుత్యోద్యోగాు లేక, ప్రయివేటు ఉద్యోగాు రాక దళిత యువకు భవిష్యత్తు అంధకారమయమవుతోంది. నిపుఉ గప్పిన నిప్పులా ఉన్నఈ ప్రమాదం నానాటికీ పెరుగుతున్నది. రాబోయే రోజులో ప్రపంచీకరణ ప్రదర్శించబోయే విశ్వరూపం దళిత యువతి, యువకు భవిష్యత్తును పూర్తిగా నాశనం చేయ్యక ముందే దానిని ప్రతిఘటించి తిప్పికొట్టాలి. దళిత యువత ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమాలో పాు పంచుకోవాలి. 

No comments :

Post a Comment