స్వతంత్య్ర పుటల్లో రక్తచరిత్ర 'జలియన్‌వాలాబాగ్‌'

No comments


జలియన్వాలాబాగ్దురంతం. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత అమానవీయమైన సంఘటన. ఉత్తర భారతదేశంలోని అమృత్సర్పట్టణంలో జలియన్వాలాబాగ్అనే ఒక తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు మరియు పిల్లలపైన . ఏప్రిల్‌ 13, 1919 బ్రిటిష్సైనికులు జనరల్డయ్యర్సారథ్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బ్రిటీష్సైనికులు నిరాయుధులపై పదినిమిషాలపాటు దాదాపు 1650 రౌండ్లు కాల్పులు జరిపారు. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం ఘటనలో 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ  వేయి మందికి పైగా మరణించారని, 2 వేల మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది
      మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం (1914-1918) లో ఆంగ్లేయులు, భారతీయులను సహాయం కోసం అడిగితే తిరుగుబాటు చేస్తారని భావించారు. కానీ వారి భయానికి విరుద్ధంగా ప్రధాన రాజకీయ నాయకత్వాల నుంచి విశేషంగా స్పందన లభించింది. వారికి యుద్ధంలో సహాయపడటం ద్వారా వారినుంచి స్వాతంత్యం పొందవచ్చని రాజకీయ నాయకులు భావించారు. యుద్ధాంలో 13 లక్షల మంది భారతీయ సైనికులు యూరోపు, ఆఫ్రికా, మధ్యప్రాచ్చ దేశాల్లో తమ సేవలందించారు. భారతీయ రాజులు తమ శక్తి మేరకు ధనాన్ని, ఆహారాన్ని, ఆయుధాలను పంపించారు. ఫలితంగా 43 వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయ్యారు. కానీ బెంగాల్‌, పంజాబ్లాంటి ప్రాంతంలో మాత్రం వలసవాదులకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. బ్రిటీష్వారికి వ్యతిరేకంగా మొదటి ప్రపంచ యుద్ధం  ప్రారంభం నుంచే అమెరికాలోనూ, కెనడా, జర్మనీలలో ఉంటున్న కొద్దిమంది భారతీయులు బెర్లిన్కమీటీ, గదర్పార్టీ నేతృత్వంలో ఐరిష్రిప్లబికన్ఆర్మీ , జర్మనీ మరియు టర్కీల సహాయంతో 1857 సిపాయిల తిరుగుబాటు తరహాలో ఉద్యమం లేవదీయాలని చూశారు. దీన్నే హిందూ జర్మన్కుట్ర అని అంటారు. దీనిలో భాగంగా బ్రిటీష్వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు లేవదీసి విఫలం చెందారు. కానీ భారతీయ ఉద్యమకారులు నిర్వహించిన ఉద్యమాలు విస్తృతమైన గుఢచార సమాచారంతో, కఠినమైన రాజకీయ శాసనాల మూలంగా అణచివేయడం జరిగింది.
      అయితే యుద్ధంలో ఆంగ్లేయులకు భారతీయులు చేసిన సహాయానికి ప్రతిఫలంగా తమకు పూర్తి స్వాతంత్య్రం ఇస్తుందని భావించారు. కానీ బ్రిటీష్ప్రభుత్వం వారు ఆశించింది చేయకపోగా విపరీతమైన సంస్కరణలను ప్రవేశపెట్టింది. దీంతోపాటు పంజాబ్మరియు బెంగాల్తదితర ప్రాంతాల్లో నానాటికీ పెచ్చరిల్లుతున్న విప్లవోద్యమాన్ని, భారత ప్రజల్లో నానాటికీ రగులుతున్న ఆసంతృప్తి (ముఖ్యంగా బాంబే మిల్వర్కర్స్లో) మొదలైన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ప్రభుత్వం 1918లో ఆంగ్లేయ న్యాయమూర్తియైన సిడ్నీ రౌలట్ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనినే రౌలట్కమిటీ అంటారు. కమిటీ భారతదేశంలో (ముఖ్యంగా పంజాబ్మరియు బెంగాల్ప్రాంతాలలో ) జరుగుతున్న మిలిటెంట్ఉద్యమానికీ, రష్యా, జర్మనీ దేశాలకు ఏదైనా సంబంధం ఉందేమో కనుగొని బ్రిటీష్ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కోరింది. రౌలట్కమిటీ ప్రతిపాదనను అనుసరించి ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలను అణచివేసేందుకు బ్రిటీష్ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్చట్టాన్ని ప్రతిపాదించింది. చట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచివేయడానికి వైస్రాయ్లకు విశేష అధికారాలని కట్టబెట్టారు. పత్రికల నోళ్లను కట్టేయడానికీ, విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్భంధించడం, తిరుగుబాటు దారునిగా అనుమానితులైన వ్యక్తులను వారంటు లేకుండా అరెస్టు చేయడం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో పొందపరిచారు. చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆగ్రవేశాలు వ్యక్తమయ్యాయి.
      1919, ఏప్రిల్‌ 13 పంజాబ్రాష్ట్రంలోని అమృత్సర్లో గత స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్వాలాబాగ్లో సిక్కుల ఆధ్మాత్మిక మాసమైన వైశాఖ మాసంలో దాదాపు 20 వేల మంది ప్రజలు సమావేశమయ్యారు. అనేక విమర్శలకు గురైన రౌలట్చట్టం క్రింద సత్యపాల్‌, మరియు సైనుద్ధీన్కిచ్లూలను అక్రమంగా నిర్భంధించడాన్ని వ్యతిరేకంగా అక్కడ సమావేశం ఏర్పాటు చేయబడింది. చట్టాన్ని ధిక్కరిస్తూ సభను ఏర్పాటు చేశారనే కారణంతో ప్రజలను అణిచివేసేందుకు వివిద విభాగాలకు చెందిన 90 మంది సైనికుల (ఇండియన్ఆర్మీ)తో పాటు  రెండు వాహనాలతో అక్కడికి చేరుకున్నాడు. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు లోపలికి వెళ్లలేకపోయినప్పటికీ  జలియన్వాలా బాగ్‌ (పార్కు)లోకి వెళ్ళి దారులన్నింటిని చుట్టుముట్టిన సైన్యంతో డయ్యర్కాల్పులు జరిపించాడు. చుట్టూముట్టూ దారులన్నీ మూసివేయడం మూలంగా అనేకమంది అక్కడ ఉన్న బావీలోకి దూకి చనిపోయారుఆంగ్లేయ ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం ఘటనలో మొత్తం 379 మంది (337 మంది పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు) మరణించారు. 200 మంది గాయపడ్డారని తెలిపింది. అక్కడ స్మారక చిహ్నంపైన వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడి బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు. అయితే అధికారిక గణాంకాలు సరికాదని తరువాత జరిపిన విచారణ తేలింది
   
మైఖల్‌  డయ్యర్
  
ఘటనపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఉదంతంపై విచారణ జరపడానికి 1919లో 'హంటర్కమిషన్‌' ఏర్పరచారు. కమిషన్సమక్షంలో హజరైన డయ్యర్‌, తనకు మీటింగ్గురించి 12:40 తెలిసిందనీ, దానిని నిలపడానికి తానేవిధమైన ప్రయత్నమూ చేయలేదనీ, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ వివరించాడు. 'బహుశా కాల్పులు జరపకుండా గుంపును చెదరగట్టడం సాధ్యం అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను. కానీ వాళ్లంతా మళ్ళీ తిరిగి వచ్చి నన్నుఅవహేళన చేసేవారు. నేను చేతగానివాడినయ్యుండేవాడిని' అని కమీషన్ముందు వివరించాడు. బ్రిటీష్ప్రభుత్వం కంటితుడుపు చర్యగా లెప్టినెంట్జనరల్మైఖల్ డయ్యర్ను తొలగించి ప్రయోషన్పై సొంత దేశానికి పంపించారు. ఘటనకు సంబంధించిన విషయాన్ని జవహర్లాల్నెహ్రూ తన ఆత్మకథలో రాస్తూ, ఒకసారి అమృత్సర్నుంచి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తున్న సమయంలో అదే రైలులో ప్రయాణిస్తున్న డయ్యర్ఇతర బ్రిటీష్అధికారులతో మాట్లాడుతూ 'పట్టణం అంతా నా దయమీద ఆధారపడిఉందని, దానికి బూడిద చేసేద్దామనుకొన్నాను కానీ దయదలచి వదిలేశానని'' అన్నాడని రాశాడు.

      జలియన్వాలాబాగ్దురంతానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆగ్రవేశాలు వ్యక్తమయ్యాయి. ఘటన  పంజాబ్లో జరుగుతున్న స్వాతంత్రోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. భగత్సింగ్విప్లవకారుడిగా మారడానికి కూడా సంఘటనే కారణమయ్యిందిమారణహోమాన్ని చూసి చలించిపోయిన విశ్వకవి రవీంద్రనాథ్టాగూర్‌, బ్రిటీష్ప్రభుత్వం తనకిచ్చిన సర్బిరుదును ఇంగ్లండ్ప్రభువుకు తిరిగి ఇచ్చేశాడు.

ప్రతీకారం తీర్చుకున్న ఉద్దం సింగ్‌: 

జలియన్వాలాబాగ్ఘటన మాత్రం ఒక యువకుని మధిలో చెరగని ముద్ర వేసింది. అతడే షహిద్ఉద్దమ్సింగ్‌.పంజాబ్లోని దళిత సామాజిక వర్గానికి చెందిన ఉద్దమ్సింగ్భగత్సింగ్ను తన గురువుగా ప్రకటించుకునాన్నాడు. అమాయకులైన దేశభక్త ప్రజల మరణానికి కారణమైన డయ్యర్ను చంపడానికి ఉద్దమ్సింగ్దాదాపు 21 ఏళ్లు నిరీక్షించాడు. చివరకు 1940, మార్చి 13 లండన్లోని క్యాక్సటన్హాలులో ఒక ముఖ్యమైన సమావేశానికి వచ్చిన మైఖల్ డయ్యర్ను రివాల్వర్తో కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు. ''భారతీయుల బతుకులను బుగ్గిచేస్తున్న బ్రిటీష్ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించేంఏదుకే దుర్మార్గుడైన డయ్యర్ను కాల్చి చంపానని, నాకు ప్రాణభిక్ష అవసరం లేదు. నేను దేశం కోసం జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. రక్తం తాగే జలగల్లాంటి సామ్రాజ్యవాదులైన మీరు నా దేశం నుంచి వెళ్ళిపోండి. మా దేశ ప్రజలకు స్వేచ్ఛనూ, నిజమైన జీవితాన్ని ఇవ్వండీ'' అంటూ బ్రిటీష్కోర్టులో గర్జించాడు. కుల మత, వర్గ విభేదాలు సృష్టించి విభజించు - పాలించు అన్న సిద్ధాంతాన్ని మీ పాలకులు అనుసరిస్తున్నారే అందుకే నేను నా పేరును రామ్మహ్మద్సింగ్ఆజాద్గా మార్చుకున్నానని హెచ్చరించాడుధైర్య సాహసానికి, త్యాగానికి ప్రతీక అయిన ఉద్దమ్సింగ్ను బ్రిటీష్ప్రభుత్వం ఇంగ్లండ్జైలులో  1940 జులై 31 ఉరితీసింది
జలియన్వాలాబాగ్స్మారక స్థూపం:     

      
1920లో దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్థూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్తీర్మానించింది. 1923లో ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్పోల్క్అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపాన్ని రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్‌ 13 అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్చేతులమీదుగా, జవహర్లాల్నెహ్రు వంటి నాయకుల సమక్షంలో స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే ఆఖండ జ్వాలను తరువాత జోడించారు.  

No comments :

Post a Comment