"పోలవరం" గిరిజనుల పాలిట శాపం

No comments
పోలవరం. అత్యంత వివాదాస్పద ప్రాజెక్టు. 
వందలాది గ్రామాల్లో గిరిజన సంస్కృతిని ధ్వంసం చేసే ప్రాజెక్టు. 
అతిపెద్ద మానవ విధ్వాంసానికి కారణమవుతున్న ప్రాజెక్టు. 
హక్కుల ,పర్యావరణ సంఘాలు అడ్డుకుంటున్నప్పటికీ నిర్మిస్తున్న ప్రాజెక్టు. 
ఎటువంటి అనుమతులు లభించనప్పటికీ నిర్మిస్తున్న ప్రాజెక్టు. 
 ప్రత్యామ్నాయాలను సహితం పట్టించుకోకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టు.


పొలవరం ప్రాజెక్ట్ పై తమ అభిప్రాయం చెబుతున్న ముంపు గ్రామస్తులు

     ఈ ప్రాజెక్టుపై ఇంత వ్యతిరేకత, విధ్వంసం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభ్వుతం ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి ముందుకు కదలడంతో గిరిజనుల్లో ఆందోళన మొదలయ్యింది. ఉగ్ర గోదారి ఉప్పెనై వచ్చినా ఊళ్లు వదలని ఆదివాసులను గుప్పెడు మంది పెట్టుబడిదారుల స్వలాభం కోసం, పట్టాణాల అవసరాలకోసం బలిపశువులను చేస్తున్నారు. కరువు కరాల నృత్యం చేసిన ఆ ఆడవి మీద నమ్మకంతో అక్కడే ఉన్న వాళ్ళను అడవి నుంచి తరిమేస్తున్నారు. చెట్టును, పుట్టను నమ్ముకొని అడవితో పెనవేసుకున్న జీవితాలను చెల్లా చెదరుచేసేందుకు పాలకులు కంకణం కట్టుకున్నారు. ఈ కుట్ర వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ఈ పథక రచన వెనుక రాజకీయ పార్టీల స్వప్రయోజనాలు ఉన్నాయి. ఈ విధ్వంసం వెనుక అనేక దశాబ్దాల చరిత్ర ఉంది. ఈ విధ్వంసక ప్రాజెక్టు వెనుక చరిత్రను తెలుసుకుంటే తప్ప, జరగబోయే మానవ విధ్వంస మనకు అర్థం కాదు. ఆ కుట్రను తెలిపేందుకే ఈ కథనం.  
ప్రాజెక్ట్ నిర్మాణ పనులు
ప్రాజెక్ట్ చరిత్ర... 
పోలవరానికి 70 ఏండ్ల చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలనా కాలంలోనే పోలవరానికి బీజం పడింది. 1941లో దీవాన్ బహదూర్ ఎల్. వెంకటకృష్ణ అయ్యర్ అనే ఇంజనీర్ ఈ ప్రాంతంలో సర్వే చేసి పొలవరం దగ్గర ప్రాజెక్టు కోసం రూపకల్పన చేశారు. వర్షాకాలంలో గోదావరి వరదంతా సముద్రం పాలవుతోందని, జనవరి నుండి ఎప్రిల్ వరకు రబీ పంటకు, ఇతర మెట్ట పంటలకు నీరు లేక గోదావరి జిల్లాల రైతులు ఇబ్బందుల పడుతున్నారని, ఈ సమస్యను అధికమించాలంటే పొలవరం అనివార్యమని భావించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 3 లక్షల 50 వేల ఎకరాలకు రెండు కాలాలలో నీళ్లు అందించడమే కాకుండా 40 మేగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చుని ప్రణాళిక రూపొందించాడు. పాపికొండల గుండా ప్రవహించిన గోదావరి బయటకు రాగానే పోవవరం వద్ద ప్రాజెక్టును నిర్మించవ్చని సలహా ఇచ్చాడు. ఇక్కడ నిర్మించే ప్రాజెక్టును సాధ్యమైనంత ఎత్తున నిర్మించాలని,అయితే భద్రాధిలోని రాముని పాదాల కన్నా ఎత్తులో ఉంటకూడదన్నాడు. అందుకే ఈ ప్రాజెక్టుకు 'రామపాదసాగర్' అని ఆయన నామకరణం చేశారు. అప్పుడు ఈ ప్రాజెక్టు ఖర్చు 130 కోట్లని అంచనా వేశారు. ఆహార ధాన్యాల దిగుమతుల కోసం భారతదేశం ఇంతకన్నా ఎక్కువే విదేశాలు చెల్లిస్తుంది కాబట్టి, దీని నిర్మాణాన్ని పూర్తిచేస్తే దిగుమతులమీద ఆధారపడాల్సిన అవసరం లేదని నాటి పాలకులు భావించారు. అయితే ప్రాథమిక క్షేత్ర అధ్యయనాలు, సవివర అధ్యయనాలు, విదేశీ నిపుణుల సలహాలు సంప్రదింపులు అన్నీ పూర్తయినా అనేక కారణాల వల్ల ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. 
     ఇంజనీర్ ఉద్దండుడు కె.ఎల్ రావు ఈ ప్రాజెక్టు గురించి తన గ్రంధంలో చర్చించడంతో పాటు దీని నీళ్లను కృష్ణా బేసీన్ వరకు విస్తరించడం వలన అదనపు ఉపయోగం ఉంటుందని కొత్త ప్రణాళికను రూపొందించాడు. అయితే ఈ ప్రాజెక్టుకు,అమెరికాలోని కోలరాడో రాష్ట్రంలో పార్కర్ డ్యాంకు ఒకే పోలీక ఉందని, దీన్ని నిర్మించాలంటే ఆధునిక పరిజ్ఞానాన్ని వాడుకోవాల్సి ఉంటుందన్నాడు కె.ఎల్.రావు. ఇదే సమస్య అమెరికాకు వస్తే అక్కడి ఇంజనీర్లు దాన్ని అధిగమించారని, వాళ్ళ అనుభవంతో ఈ సమస్యలను అధికమించవచ్చని ఆయన సూచించాడు. బ్రిటీష్ హాయంలో బీజం పడినప్పటికీ స్వాతంత్య్రం వచ్చా కూడా చాలా తతంగం నడిచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్ అంశాల పైన, ముంపు గ్రామాల పైన, వారికి కల్పించాల్సిన పునరావాసం పైనా అనేక సెమినార్లు, సదస్సులు జరిగాయి. ఎందరో నిపుణులు పోలవరంపై తమ తమ అభిప్రాయాలకు అక్షర రూపం ఇచ్చారు. కానీ స్వాతంత్య్రం వచ్చాక కూడా దాదాపు 20 ఏండ్ల ఈ ప్రత్యామ్నాయాలను పట్టించుకున్న వారు లేరు. 
     మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరణ వంటి కారణాలు ఈ ప్రాజెక్టుకు ఆటంకంగా మారాయి. ఇదంతా కుదుట పడ్డాక రాష్ట్రంలో మళ్ళీ పోలవరంపై ఫైల్లు 1969లో కదిలాయి. 'రామపాద ప్రాజెక్టును' పోలవరం ప్రాజెక్టుగా పేరు మార్చారు. గోదావరి ట్రిబ్యూనల్ ముందు పోలవరం ప్రాజెక్టు గురించి రాష్ట్ర పాలకులు ప్రస్తావించారు. 1970లో ప్రభుత్వం పోలవరంపై మళ్ళీ ఓ రిపోర్టును సిద్ధం చేసింది. అందులో 145 అడుగుల ఎత్తులో డ్యాం నిర్మాణం. రెండు కాల్వలు తొవ్వాలని పేర్కోంది. కానీ 1978లో పోలవరంపై మరో రీపోర్టును సిద్ధం చేసింది. అందులో ప్రాజెక్టు ఎత్తును 150 అడుగులుగా పేర్కొంది. ఆ ప్రాజెక్టు రీపోర్టును కేంద్ర జల సంఘానికి పంపింది. గోదావరి అంతరాష్ట్ర నది కావడం మూలంగా మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్, కర్నాటకలతో కూడా ఆంధ్రప్రదేశ్ చర్చించాల్సి వచ్చింది ఫలితంగా 1978 ఆగస్టు 4వ తేదీన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలతో 1979 జులై 11న మధ్యప్రదేశ్తో,1980 ఎప్రిల్ 2న ఓరిస్సాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు పనులు ముందుకు కదులుతున్న క్రమంలోనే రాష్ట్రంలో రాజకీయాలలో మార్పులు జరగడం. నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలనకు ఎన్టీయార్ చరమగీతం పాడటంతో ప్రాజక్టు మళ్ళీ ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకుపోయేందుకు నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించించింది. 1985లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మరోక రిపోర్టు సిద్దం చేసింది. 1987లో ఈ రిపోర్టును కేంద్ర జలసంఘానికి పంపింది. కానీ కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దగా సహాకరించకపోవడంతో ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు పోలవరం తెరమరుగైంది. 
     2004 అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. జలయజ్ఞంలో భాగంగా పోలవరం ఫైల్ను మళ్ళీ కదిలించాడు.కానీ పొలవరం మీద ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైన, గిరిజనులు ఎంత వ్యతిరేకించిన, తెలంగాణ మేధావులు ప్రత్యామ్నాయాలు చూపించిన కేంద్రం, సుప్రీంకోర్టు అనుమతులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద పనులు మొదలుపెట్టింది. ఆ తర్వాత జరుగుతున్నదంతా నడుస్తున్న చరిత్రే. 

ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం - ప్రభుత్వం చెబుతున్న కారణాలు: 
ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగునీరు. గోదావరి జలాలను కృష్ణా జలాలకు మళ్లీంచడం మరియు కృష్ణా, గోదావరి డెట్టాలకు భద్రత కల్పించే లక్ష్యాలతో భద్రాచలం నుంచి 125 కిలోమీటర్ల దూరంలో, దవళేశ్వరానికి 42 కిలోమీటర్ల ఎగువన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం దగ్గర ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గోదావరి నదిలో పోలవరం దగ్గర 150 అడుగుల ఫుల్ రిజర్వాయర్ లెవల్లో ఆనకట్ట కట్టి దీని ద్వారా పోలవరం జలాశయంలో 194.5 టీఎంసీల జలాశయం నిల్వ చేయవచ్చునని చెబుతుంది. ఈ జలాశయం ఆధారంగా 940 మేగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ కష్టాలను కూడా అధికమించవచ్చునని ప్రభుత్వం యోచన. ఈ ప్రాజెక్టుకు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలా గుండా 174 కిల్లో మీటర్ల కాల్వ తొవ్వడం ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో 3.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ప్రభుత్వం పథకం. అంతే కాకుండా ఈ కాలువను ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణ నదిలో కలపడం ద్వారా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణ జలాల్లో కలపడం ద్వారా రాయలసీమ జిల్లాలకు కూడా నీటిని అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఎడమ కాలువను తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకులం వరకు తవ్వడం వలన ఈ నాలుగు జిల్లాల్లో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా కోస్తా కారిడార్లోని పరిశ్రమలకు నీరు, దారిపొడవున ఉన్న పట్టణాలకు, పల్లెలకు తాగునీరు అందించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతుంది. ఇది బహుళ ప్రయోజనాలతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి దీని వ్యయం కూడా దాదాపు 20 వేల కోట్ల రూపాలపైనే ఉంటుందని, ఈ నిర్మాణానికి అందరూ సహకరించాలని ప్రభుత్వం చెబుతోంది. 

ముంపు బాధితుల గోడు: 
పోలవరం ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా జలదీక్ష చేస్తున్న ఆదివాసులు

పొలవరం ప్రాజెక్టు కట్టడం వలన లబ్ది కన్నా నష్టమే ఎక్కువే జరుగుతుందని గిరిజన సంఘాలు, పర్యావరణ వేత్తలు అభ్యంతరం చెబుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రస్తుత అభివక్త రాష్ట్రంలో 280 గ్రామాలు, ఛత్తీస్ఘడ్లో 13 గ్రామాలు, ఒరిస్సాలో 7 గ్రామాలు ముంపుకు గురువుతాయని, వీటితో పాటు 3 లక్షల మంది ఆదివాసులు నిర్వాసితులు అవుతారని, అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుక అమాయకులైన గిరిజనులను బలిపశువులను చేస్తున్నారని హక్కుల సంఘాలు ఆందోళన చేస్తున్నారు. 20 వేల కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తిచేసినా దాని ద్వారా వచ్చే లాభం తక్కువే అంటున్నారు. ప్రాజెక్ట్ ముంపు ప్రాంతమంతా 5వ షెడ్యూల్ ఏరియాలో ఉంది. ముంపుకు గురయ్యేవాళ్ళంతా గిరిజనులు.ముఖ్యంగా భద్రాచలం ప్రాంతంలోని కొండలపై నివసించే కొండరెడ్ల ఆదివాసీ తెగ ఈ ముంపుతో కనుమరుగయ్యే అవకాశం ఉంది. వాళ్లకు కంప్యాన్షేషన్, రిహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ పాలసీ-2003 (ఆర్ అండ్ ఆర్) ఇవ్వాలన్నా వాళ్ళకు లాండ్ టూ లాండ్ ఇవ్వాల్సి వస్తుంది. ల్యాండ్ టూ ల్యాండ్ ఇవ్వాల్సి వస్తే, అది ప్రాజెక్టు కానీ భూమి ఇవ్వాలి. జనరల్గా ఆర్అండ్ ఆర్ పాలసీ ప్రకారం 50 వేల కన్న ఎక్కువ మంది ముంపునకు గురవుతే అక్కడ ప్రాజెక్టు నిర్మించకూడదని పాలసీ చెబుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ను రద్దుచేసుకోవాలని ఆందోళన నిర్వహిస్తున్నారు. 
2011 జనాభా లెక్కల ప్రకారం ముంపు మండలాల్లో ఉన్న జనాభా 

హక్కుల సంఘాలు, పర్యావరణవేత్తల అభ్యంతరం : 
పోలవరం ప్రాజెక్టు వలన దాదాపుగా ఖమ్మం జిల్లాలోని గిరిజన సమాజమంతా నిర్వాసితులయ్యే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో నివశించే కోయలు, గుత్తికోయలు, కొండరెడ్లతోపాటు ఇతర చెంచు జాతులు హరించుకుపోయే ప్రమాదముందంటున్నారు. వీరికి ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, భాష, వేష, కట్టుబాట్లు ఉన్నాయని, వీరు ప్రస్తుత సమాజానికి దూరంగా జీవిస్తున్నారు. వీరి ఆహార అలవాట్లు, జీవన శైలి మొత్తం అడవిపైనే ఆధారపడి ఉండటం వలన పోలవరం మూలంగా వీరి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందంటున్నారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో నివసించే కొండరెడ్లకు ప్రభుత్వాలు ఎన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీలు ఇచ్చినా కొండదిగి రాలేదని, చాలా మంది కొండ దిగి బాహ్య ప్రపంచాన్ని చూడకుండానే తనవు చాలిస్తున్నారని, ఈ ప్రాజెక్టు వలన ముంపు తప్పదని హెచ్చరిస్తున్నారు. దీనితోపాటు ప్రసిద్ధ పర్యాక కేంద్రాలైన 'పాపికొండలు', పేరాంటాల పల్లి, భద్రాచలం మొదలైన ప్రాంతాలు నామరూపంలేకుండా పోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 


పోలవరం ముంపు ప్రాంతంలోని కొండ రెడ్డి కుటుంబం 

ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం అతి త్వరలో అంతరించిపోయే జాతుల్లో కొండరెడ్లు ఉన్నారు. వీరిని కాపాడాల్సిన ప్రభుత్వాలే వీరిని హరిస్తున్నారు. అంతే కాకుండా ప్రాజెక్టును నిర్మించడం మూలంగా జలాశయం కింద విలువైన ఖనిజ సంపద మునిగిపోతుంది. అడవులు, అభయరణ్యాలు మునిగిపోతాయని ఇది జంతువుల హక్కులను కాలరాయడమే అవుతుందంటున్నారు. ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు ప్రత్యామ్నాయాలను కూడా చూడాలని కేంద్ర పర్యావరణ,అటవుల చట్టం చెబుతున్న ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాల గురించి పట్టించుకోకుండా ఆదివాసులను బలిపెట్టెందుకు చట్టాలను సహితం తుంగలో తొక్కుతున్నారంటున్నారు. ఇది పర్యావరణ చట్టం -1986, అటవీ చట్టం-1980, పెసా (గిరిజనుల హక్కులకు సంబంధించి) చట్టాలను ఉల్లంఘించడమంటున్నారు. 

తెలంగాణ వాదుల అభ్యంతరాలు : 
గోదావరి క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో 78 శాతం ఉంటే, ఆంధ్రలో కేవలం 22 శాతం మాత్రమే ఉంది. 700 వందల కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహించే గోదావరిలో ఒక్క శ్రీరాం సాగర్ ప్రాజెక్టు తప్పా ఇంకేమి లేదు. ఇవ్వాళ వలసవాద ప్రభుత్వం పొలవరం దగ్గర ప్రాజెక్ట్ కట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడి నుంచి 80 టీఎంసీలను కృష్ణా నదిలోకి తరలించడం ఆ తర్వాత పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. (1 టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ మీటర్స్) శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్ళు తరలించుకుపోయిన తరువాత అక్కడ కొరత ఏర్పడితే దాన్ని దుమ్ముగూడ ప్రాజెక్టు ద్వారా నాగర్జున సాగర్ లోకి నీళ్ళు తీసుకుపోయేందుకు రెండు ప్రాజెక్టులు కడుతున్నారు. తమ ప్రాంత ప్రయోజనాలకోసం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాలు శాశ్వతంగా కరువు కోరల్లో చిక్కుకోవాల్సి వస్తుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కోస్తాంధ్ర జిల్లాలకు, వలస కాలనీలకు నీళ్లు తరలించుకు పోవడానికి ఆదివాసులను బలిపశువులను చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. 

     తమ ప్రాంతపై అభిమానాన్ని చూపిస్తున్న పాలకులు ఆదిలాబాద్, కరీంనగర్, నిజమాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు నీళ్ళు అందించేందుక తెలంగాణ ఇంజనీర్లు ప్రాణహిత-చేవేళ్ళ ప్రాజెక్టును రూపొందిస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు. తెలంగాణకు ప్రాణాధారమైన ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు మాత్రం మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు కావాలని అడ్డంకులు పెడుతుంది కానీ ఇక్కడేమో ఏ అనుమతులు లేకున్నా ఆగమేఘాలమీద నిర్మాణం చేపడుతున్నది విమర్శిస్తున్నారు. తెలంగాణలోని పది జిల్లాల్లోని 50 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిన తర్వాత కానీ ఆంధ్రకు తీసుకెళ్ళడానికి వీలు లేదు. దీనికి చట్టం, అంతర్జాతీయ నాయ్యసూత్రాలు ఒప్పుకోవంటున్నారు. ఇప్పటికే కోస్తాంధ్ర ప్రభుత్వం హైదరాబాద్కు త్రాగునీళ్ళు అందించేందుకు సింగూరు జలాలను తరలించి ఆ ప్రాంతాన్ని ఎడారిగా మార్చివేశారని చెబుతున్నారు. వాస్తవానికి హైదరాబాద్ నగరం కృష్ణాబేసిన్లో ఉన్నది. దీనికి గోదావరి బేసీన్తో సంబంధం లేదు.ఇప్పటికే రెండు ఫెజ్లుగా కృష్ణా నీళ్లు హైదరాబాద్కు తరలిస్తున్నారు. ఇప్పుడు అది కాకుండా గోదావరి నీళ్లని రాయలసీమకు తరలించుకుపోయే కుట్రలో భాగంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని విమర్శిస్తున్నారు. 

మేధావులు, నిపుణుల అభ్యంతరం: 
పోలవరం నిర్మాణం ప్రాంతంలో 200 అడుగుల లోతు వరకు కేవలం ఇసుక మేట మాత్రమే ఉంది. ఎలాంటి రాతి పొర లేకపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థంకగా మారే ప్రమాదం ఉంది.అధికారుల లెక్కల ప్రకారం నిత్యం గోదావరిలో 43 అడుగుల మేర నీటి ప్రవాహం ఉంటుంది. వరద ఉధృతి సమయంలో పోలవరం నీటి ప్రవాహం ఇంకా ఎక్కువుంటుంది. రెండు రోజుల భారీ వర్షాలకే తరచుగా 52 అడుగులకు నీరు చేరుతుంది. ఇక నిర్మాణం పూర్తవుతే తోదావరి 200 అడుగులకు మించి ప్రవహించే అవకాశం ఉంటుంది. అటువంటి సమయంలో ఒకవేళ గేట్లు మూస్తే ఖమ్మం జిల్లా, గేట్లు తెరిస్తే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు నీట మునిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
2005 లొ వచ్చిన వరదల్లో నీటమునిగిన భద్రాది రామాలయం

అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పొరుగున ఉన్న రెండు రాష్ట్రాలు , ఒక రాజకీయ పార్టీ వేసిన కేసులు విచారణలో ఉండగానే, సుప్రీం కోర్టు తీర్పు రాకుండానే ఇది ''.జాతీయ ప్రాజెక్టు''గా కేంద్రం ప్రకటించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అంటున్నారు. బ్యారేజీ నిర్మాణం ప్రారంభం కాకముందే కాల్వలు తొవ్వి పెట్టడం. అంతరాష్ట నది నది జలాలు, పర్యావరణ అనుమతులు, ముంపు బాధితుల పునరావాసం ఇలా అనేక సమస్యలు పరిష్కారించాల్సి ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్టును ప్రారంభించడంలో ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

పరిష్కారమార్గాలు: 
ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు అనేక సమస్యలు ముందుకు వచ్చాయి. నర్మదా నదిపై నిర్మించిన ప్రాజెక్టుపై కూడా దీర్ఘకాల ఆందోళనలు నడిచాయి. కోర్టులో కేసులు నడిచాయి. నర్మాదా వివాదంలో నాటి ప్రధాని ప్రత్యామ్నాయాన్ని చూసించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది కానీ నేటి పాలకులు ఆమె పేరు పెట్టుకున్న ప్రాజెక్టు విషయంలో ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడం లేదంటున్నారు. ప్రాజెక్టుల విషయంలో పరిష్కారాలు దొరకని సమస్యలే లేవని విశ్లేషకులు చెబుతున్నారు. పోలవరంపై అనేకమంది నిపుణులు, రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు నీటి పారుదల నిపుణులు అనేక పరిష్కారాలు చూపినప్పటికీ ప్రభుత్వం ప్రత్మామ్నాయాల గురించి ఆలోచించడం లేదు. ఎజెన్సీ ఏరియాలో గ్రామ సభల ద్వారా అనుమతి తీసుకొని ప్రాజెక్టును ప్రారంభించాలి. కానీ గ్రామ సభల అనుమతులు లేకుండానే నిర్మాణం చేపట్టడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్వాసితుల పరిహారం చెల్లించే విషయంలో పారదర్శకంగా ఉండటం లేదని ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 26 గ్రామాలు ముంపుబారిన పడతాయని అంచనావేశారు. కానీ తీరా 7 గ్రామాల గిరిజనులకే కొంత నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంది. దేవరిగొంది అనే గ్రామంలోని నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోగా నిర్వాసితుల ఇళ్లను కూడా తొలగించడం వివాదస్పదమైంది. ఇన్నాళ్లు అడవినే నమ్ముకుని బతుకుతున్న తమను కట్టుబట్టలతో వెళ్లగొడితే ఎలా బలకాలని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వారి ఇవ్వాల్సిన హక్కు పత్రాలు ఇవ్వకపోగా నీళ్లు కరెంట్ సరఫరా నిలిపివేసి నిర్వాసితులపట్ట నిర్ల్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు . విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దీని వెనుక పాలక వర్గాల స్వప్రయోజనం దాగుందంటున్నారు.

No comments :

Post a Comment

బతుకుపోరులో ... ఓయూ ''స్వీపర్స్‌''

No comments

ఫోటో గూగుల్ నుంచి సేకరణ
ఇళ్లు అందంగా ఉందంటే  గొప్పతనం  ఇంటి ఇళ్లాలికే చెందుతుంది.అలాగే యూనివర్సిటీ అందంగా ఉందంటే కూడా  క్రెడిట్‌ అంతా యూనివర్సిటీలో పనిచేసే మహిళలకే చెందుతుంది.దేశంలోనే అతి పెద్ద యూనివర్సిటైన ఓయూను తమ సొంత ఇంటిలా భావించి అద్దంలా తీర్చిదిద్దుతున్న వర్కర్స్ జీవితాల గురించి చాలామందికి తెలియదు. ఒక్కరోజు మన ఇళ్లు శుభ్రంగా లేకుంటే ఎంత చిరాగ్గా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఒక పదిరోజులు మన స్వీపర్స్డ్యూటీ చేయకుంటే ఎలాగుంటుందో ఊహించుకోండిఊహే భయంగా ఉంది కదూ?విద్యార్థులు నానా గొడవచేసి పత్రికలకు ఎక్కుతారు. అలాంటి యూనివర్సిటీ మురికికూపంగా,డంప్‌ యార్డ్గా మారకుండా నిరంతరం తమ శ్రమశక్తిని ధారపోస్తున్నారు వీళ్లు. యూనివర్సిటీ పరిధిలో పనిచేసే  ఆడపడుచుల కష్టాలు,సంతోషాల జీవన శైలీని భయటి ప్రపంచానికి చెప్పాలనే చిరు ప్రయత్నమే ఇది.
      రోజంతా దుమ్మూ దూళితో నిండే యూనివర్సిటీ పరిసరాళ్లు వీళ్ల చేతులు పడందే పవనం కాదు. అందరి ఆడవాళ్లు తమ ఇంటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ చిరుద్యోగులు యూనివర్సిటీ గురించి ఆలోచించే పెద్ద మనసున్న మనుషులు. ఒక రకంగా చెప్పాలంటే యూనివర్సిటీని తమ సొంత ఇంటిగా భావిస్తారని చెప్పవచ్చు. చీపురు కట్టను తమ శరీరంలో ఒక భాగంగా చేసుకున్న స్వీపర్లు పనిలోకి దిగారంటే ప్రపంచాన్నే మరిచిపోతారు. యూనివర్సిటీ పరిసరాలను ఊడ్చి ఊడ్చి వీళ్ల నడుములు ఒంగిపోతున్నా పని పూర్తికానిదే విశ్రమించరు. చేతుల్లో ఉన్న చీపురుతో రోడ్లను చీల్చి చెండాడే మహిళలు దుమ్మూ దూళిని కూడా కడుపులోనే దాచుకుంటారు. ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన వీళ్లు 8 గంటలకు పనిని ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకల్లా యూనివర్సిటీ పరిసరాలను అద్దంలా మార్చి 5 గంటలకు ఇళ్లకు చేరుకుంటారు. క్లుప్తంగా ఇది వీరి దినచర్య. ఒకరకంగా కుటుంబ సభ్యులతో కంటే వీళ్లతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారు వీళ్లు. బాధైనా, సంతోషమైనా వాళ్ల గ్రూపుల సహచరులతోనే పంచుకుంటారు. స్వీపర్పనిచేసేవాళ్లలో కొద్దిమంది పురుషులు ఉన్నా  సగానికి పైగా మహిళలే ఉన్నారువాళ్ల కష్టాలు, సంతోషాలుఫ్యామిలీ మ్యాటర్స్అన్నీ డ్యూటీలోనే షేర్చేసుకుంటారు.పాటలు పాడతారు.జోకులు వేసుకుంటారు.నవ్వుతారు. నవ్విస్తారు.
      సాధారణ సర్కార్లెక్కల్లో చెప్పే జీవితాలకు, వీళ్ల  జీవితాలకు అసలు పోలీకే ఉండదు. "యూనివర్సిటీలో ఉద్యోగం" అన్న సంతోషం తప్ప వీళ్ల జీవితం మొత్తం చీకట్లోనే గడుస్తుందిప్రతిరోజు సూపర్వైజర్వీళ్లకు అప్పగించిన పనులను పూర్తిచేయడం వీళ్ల బాధ్యత. ప్రతి పదిహేను మందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి వాళ్లకు ఊడ్చే బాధ్యతను అప్పగిస్తారు. ఒక్కోక్క గుంపు  ఒక ఏరియాను ఎంచుకొని విధులు నిర్వహిస్తారు. ప్రతి రోజు కనీసం 5 నుండి 6 ప్రాంతాలు వీళ్లు శుభ్రపరచాల్సి ఉంటుందిఏముందిలే పని తూతూ మంత్రంగా చేద్దాంలే అనుకుంటే కుదరదు. పని పక్కాగా ఉండాలి. వీళ్ల సూపర్వైజర్అన్నీంటిని అబ్జర్వ్చేస్తుంటాడు.చలికాలంలోనైనా, వర్షాకాలంలోనైనా వీళ్లకు మినహాయింపులు ఉండవనే చెప్పాలి. వర్షాకాలంలో అయితే తీరిక ఉండక నడుం పడిపోయే పరిస్థితి వస్తుందంటున్నారు స్వీపర్లుఇందులో పనిచేస్తున్నవాళ్లు గత పదినుంచి పదిహేనేండ్లుగా ఇదే పనిచేస్తున్నారు. ఇంత చేస్తున్నా  డ్యూటీలో ఏమైనా జరిగినా వాళ్లకు న్యాయం జరిగే దిక్కులేదు. ఎందుకంటే వీళ్లు పర్మినెంట్ఉద్యోగులు కారు కాబట్టి. కాంట్రాక్ట్ కింద పనిచేసే వీళ్లకు మొదట్లో చాలా తక్కువ జీతం ఉంటే దాన్ని మధ్యనే ఉద్యమాల ఫలితంగా కొంత పెంచారు. ఇంత చేస్తున్నా వీళ్ల జీతాలు మాత్రం వీళ్ల కడుపు నింపలేవు. శాఖలోనైనా ఐదు సంవత్సరాలకే పర్మినెంట్చేసే సర్కార్‌, దుమ్ములోనే బతుకుతున్నవీళ్లను మాత్రం తమ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. అంటే పర్మినెంట్చేయడం లేదు. అలాగే వీళ్ల జీతాలైన పనికి తగ్గ ఉన్నాయా అంటే అదీ లేదు. 2 వేల నుంచి 4 వేలకు చేరడానికి 15ఏండ్లు పట్టిందంటా!. 
     స్వీపర్‌ పనిచేసే వాళ్లలో యువతులే కాదు. తల్లులు, వృద్దులు కూడా ఉన్నారు. మాటలైన రానీ పిల్లలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పి విధులను నిర్వహిస్తున్నవారు కొందరైతే, వయసు మీరిన తల్లిదండ్రులను ఒంటరిగా ఇంట్లో వదిలేసి వచ్చినవారు ఇంకొందరు. ఎప్పటికైనా తమ ఉద్యోగం సర్కార్రికార్డుల్లో చేరకపోతుందా అన్న చిన్న ఆశ వీళ్ల చూపుల్లో కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా యూనివర్సిటీ మొత్తం ఆనందంలో మునిగితేలుతుంటే...స్వీపర్ల జీవితాల్లో మాత్రం వెలుగు కనిపించడం లేదు. స్వీపర్ల సుఖదు:ఖాలను తెలుసుకునేందుకు క్యాంపస్వాయిస్ప్రయత్నించగా, వారు తమ కష్టాల్ని తమ కుటుంబ సభ్యులతో బాధలను పంచుకున్నట్లుగా పంచుకున్నారు. స్వీపర్ల సుఖ, దు:ఖాన్ని వారి మాటల్లోనే తెలుసుకోండి.
      "నా పేరు హబీబున్నిసా. మాణికేశ్వర్నగర్లో ఉంటున్నాను. నలుగురు అమ్మాయిలు ఉన్నారు. అందరికి పెళ్లి అయ్యింది. మా ఆయన ఎగ్జామీనేషన్బ్రాంచ్లో పనిచేసేవాడు. 12 ఏండ్ల క్రితం వర్క్లోనే ఏమైందో ఏమో తెలియదు. పనిచేస్తూ కిందపడిపోయాడు. ఆసుపత్రికీ తీసుకెళ్లే వరకు చనిపోయిండని తెలిసింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన జాబు నాకు ఇచ్చారు. మొదట మూడు సంవత్సరాలు డేలీ వైజ్వర్కర్గా ఎగ్జామీనేషన్బ్రాంచ్లో పనిచేశాను. సులేమాన్సిద్దిఖీ సాబ్వీసీగా ఉన్న కాలంలో నా ఉద్యోగం పర్మినెంట్అయ్యింది. మొదట్లో నాకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తుండ్రీ, కానీ తర్వాత పర్మినెంట్అయ్యాక జీతం పెరిగింది. మొదట్లో చాలా మంది పర్మినెంట్వర్కర్స్ఉండేవాళ్లు. కానీ అంతా రిటైర్మెంట్కావడంతో డైలీ వైజ్వర్కర్స్తో పనిచేయిస్తున్నారు. ఇప్పుడు నేను ఇంకో ఇద్దరు మాత్రమే పర్మినెంట్వర్కర్స్మి ఉన్నాం. నేను కూడా వచ్చే సంవత్సరం మేలో దిగిపోతున్నాను". అందరిలో పెద్దదైన హబీబున్నిసా గారు తను పనిచేస్తున్న గుంపులో తను మాత్రమే పర్మినెంట్స్వీపర్అయినప్పటికీ తనలో ఏమాత్రం గర్హం తొనికిసలాడకుండా తోటివాళ్లుఇంకా పర్మినెంట్‌ కాకుండానే దిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది.చిన్నవాళ్లతో కూడా కలిసిపోయి, తోటి వాళ్ల సుఖ, దు:ఖాల్లో పాలు పంచుకుంటుందంటుంది. కనీసం తెలంగాణ సర్కారులోనైనా వాళ్లకు పర్మినెంట్అవుతే బాగుండని తోటి వాళ్ల జీవితాల గురించి ఆలోచిస్తుందీ పెద్దావిడ హబీబున్నిసా.
     
ఇక గుంపులోనే పెద్దవాడైన రామస్వామీ గారి జీవితం నిత్యం కష్టాలమయమే అని చెప్పవచ్చు. తన కొడుకుల, కూతుళ్ల వయసులో ఉన్న వాళ్లతో కలిసి పనిచేస్తూ ఏటికి ఎదురీదుతున్నాడు. తన కంటే చిన్నవాళ్లైన యువకులు పనిలో తనను ఆటపట్టిస్తూ బనాయిస్తున్న కూడా "వాళ్లు నా పిల్లలాంట్లోళ్లు కదా" అని ఎంజాయ్చేస్తానంటున్నాడు. "వెనకా ముందు ఎవరూ లేరు  నాకు. అందరూ వీళ్లే. ఇదే ప్రపంచం. వాటిని సరదాగా తీసుకుంటేనే బతుకు బండి సాఫిగా సాగుతుందని" అనుభవం నేర్పిన పాఠాన్ని బోధిస్తున్నాడు. 53 ఏండ్ల రామస్వామీది నిత్యం బతుకు పోరాటమే. 40 ఏండ్ల క్రితం ఊన్నఊర్లో సొంత మనుషులే మోసం చేసి,ఉన్న ఏడేకరాల భూమిని, ఇంటినీ కాజేస్తే బతుకుదెరువుకోసం పట్నం బాట పట్టాడు. ముగ్గురు పిల్లలున్న రామస్వామీ తన పిల్లలను పోషించడానికి మొదట్లో ఒక బ్యాంకుల్లో పనిచేశాడు. అది దివాళ తీయడంతో ఉన్న ఉద్యోగం పోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో తెలిసిన బందువుల ద్వారా యూనివర్సిటీలో కాంట్రాక్ట్వర్కర్గా జాయిన్అయ్యాడు. మొదట్లో 2 వేల రూపాయల జీతంతో ప్రారంభమైన రామస్వామీ బతుకు పోరాటం తొమ్మిది సంవత్సరాలకు 4 వేలకు చేరుకుంది. ఇప్పటికే రెండు సార్లు హార్ట్ఆపరేషన్చేయించుకున్న రామస్వామీని దుమ్ములో పనిచేస్తే ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది కదా ? ఇబ్బంది అనిపించదా అంటే?....''ఇబ్బంది అవుతుంది అని కూర్చుంటే పొట్ట నిండదు కదా?...అస్తులు ఎలాగు లేవు. పని దొరికితే అది చేయాలి. ఇక దుమ్మంటావా? అది ఎలాగూ ఉండనే ఉంది. దాంట్లోనే పనిచేయాలి. లేకపోతే లేదు. బతుకే దుమ్ముకొట్టుకుపోయాక ఇక పోయేదేముంది. అంటూ జీవిత సత్యాన్ని ఒడపోస్తున్నాడు.
      ఇక ఇదే గుంపులో పనిచేసే లక్ష్మి (పేరు మార్చాము) పరిస్థితి కూడా ఇంచు మించూ ఇంతే అని చెప్పాలి. గవర్నమెంట్‌ ఉద్యోగం చేసే వ్యక్తికి బిడ్డనిస్తే తన కూతురుని కాలు భయటపెట్టనీయకుండా చూసుకుంటాడన్న తల్లిదండ్రుల అంచనాలు తప్పని తెలుసుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. కట్టుకున్న భర్త ఉద్యోగానికి సరిగ్గా పోకుండా ఇంట్లోనే కూర్చుంటే, ఇళ్లు గడవని స్థితిలో పిల్లల భవిష్యత్తు కోసం గడపదాటాల్సి వచ్చింది. తన జీవితంలో ఎలాగు సుఖపడింది లేదు, కనీసం పిల్లల జీవితాలైన బాగుపడాలనే ఉద్దేశంతో జీతం తక్కువైన తమ పిల్లలను పోషించుకోవడానికి యూనివర్సిటీలో జాయిన్అయ్యి గత ఐదు సంవత్సరాల నుంచి స్వీపర్గా పనిచేస్తుంది. "మా ఉద్యోగాలు పర్మినెంట్అవుతాయనే నమ్మకం ఎలాగు లేదు, కనీసం జీతాలన్నా పెరిగితే బాగుంటుందంటూ" తెలంగాణ సర్కార్మీద ఆశలు పెంచుకుంటుంది లక్ష్మీ గారు.
      వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే ఉన్న ఊరును, కన్న వారిని వదులకొని బతుకుదెరువు కోసం వలస పక్షిలా నగరం బాట పట్టిన స్థితి రహేమున్నిసాది (పేరు మార్చాము) గుంటూరు జిల్లాకు చెందిన రహేమున్నిసా భర్త వికలాంగుడు. అక్కడే ఫ్రూట్బిజినెస్చేసేవాడు. బిజినెస్కాస్త దెబ్బతినడంతో బతుకుదెరువుకోసం పట్నం బాట పట్టారు. వచ్చిన కొత్తలో పని దొరకక ఇబ్బంది పడుతుంటే ఇంటికి దగ్గర్లో ఉండే ఒకామె యూనివర్సిటీలో పనిచూపించి ఆదుకుందిఒకవైపు భర్త ఆలనాపాలన చూసుకుంటునే గత ఐదు సంవత్సరాల నుంచి స్వీపర్గా పనిచేస్తూ బతుకుబండిని లాగుతుంది. మీరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు కదా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో నిన్ను ఎవరూ ఏమీ అనలేదా అని ప్రశ్నిస్తే ''ఎవ్వరూ ఏమీ అనలేదు సార్‌, అప్పుడప్పుడు మాత్రం కామెంట్చేస్తూ, ఎక్కువ చేస్తే ఆంధ్రకు పంపిస్తామని అటపట్టిస్తరు. కానీ తర్వాత అంతా మరిచిపోయి సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నారు. సొంతొళ్లను వదులుకొని వచ్చిన నాకు ఇక్కడ ఉన్న వాళ్లు  తోడ బుట్టిన వాళ్లకంటే ఎక్కువగా చూసుకుంటున్నారంటూ" కళ్ల నిండ నీళ్లు తెచ్చుకుంటుంది. "అయినా బతకడానికి వచ్చినోళ్లకు ప్రాంతాల గొడవేముంటుంది సార్"అంటుంది.
      స్వీపర్లుగా పనిచేస్తున్న వీళ్లందరు ఇంచుమించుగా ఒకేసారి పనిలో చేరినప్పటికీ దాదాపు అందరి పరిస్థితి ఒకేటే నని చెప్పవచ్చుతమ కుటుంబం నడవాలన్నా, పిల్లల భవిష్యత్బాగుండాలన్నా, పనిచేసుకుంటే తప్ప బతుకుబండీ నడవదని చెబుతున్నారు వీళ్లు. గత ఐదు నుంచి 10 సంవత్సరాలుగా ఇదే పనిచేస్తున్నప్పటికీ యూనివర్సిటీ అధికారులు జీతాలు మాత్రం పెంచడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు ఇంటి అద్దెలు, స్కూల్ఫీజులు, కూరగాయల ధరలు పెరుగుతున్న తమ జీతాలు పెరగకపోవడం వల్లా కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు పనిచేసినప్పటికీ ప్రతినెల ఎంతో కొంత అప్పుచేయాల్సి వస్తుందంటున్నారు  స్వీపర్లు. వీళ్లు చేసేది కాంట్రాక్ట్ఉద్యోగం కావడంతో ప్రతి మూడు నెలలకు ఒక సారి రెన్యూవల్చేయాలనే పేరుతో జీతాలు కూడా సరైన సమయానికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట చెప్పుకోవడానికి యూనివర్సిటీలో పనిచేస్తుందనట్లు ఉంది కానీ జీతం మాత్రం నామమాత్రమే అంటున్నారుహైదరాబాద్ వంటి నగరంలో చాలీ చాలని జీతంతో బతకడం మూలంగా అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని, కనీసం వచ్చే తెలంగాణ సర్కార్లోనైన తమ బతుకులు బాగుపడతాయోమో అని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.
      పనిచేస్తున్న సందర్భంలో పైన ఉన్న అధికారులు వేధింపులకు గురిచేస్తరు కదా అట్లాంటివి మీరేమైనా ఎదుర్కొన్నారాఅని ప్రశ్నిస్తే కాసేపు ఒకరి మోకాలు ఒకరు చూసుకొని... "అట్లాంటిది మాకేమి ఎదురు కాలేదు సార్అంటూనేఇంకో ఆమె లేదు సార్ఆమె ఉంటే ఏమీ దాచుకోకుండా అన్నీ చెబుతుండే" అంటూ మౌనంగా ఉండిపోయారు. నిజానికి బతుకు దెరువుకోసం ఇంకొకరిపై అధారపడి ఉన్న స్థితిలో ఇలాంటి నిత్యం మనకు కనిపిస్తుంటాయి. ఆడదాని చీరకొంగు కనిపిస్తే చాలు పిచ్చికుక్కల్లా రెచ్చిపోయే పురుష్యాధిక్య సమాజంలో అనునిత్యం ఆడది బతుకుబండి లాగేందుకు అనేక అవమానాలను, అణిచివేతలను భరిస్తుందనే చెప్పాలి. దీనికి ఓయూ కూడా మినహాయింపేమీ కాదు. నిత్యం ఏదో ఒక మూల వర్కర్స్పై ఇలాంటీ సంఘటనలు జరుగూతూనే ఉన్నాయి. కానీ నోరు విప్పి నిజం చెబితే ఏక్కడ పని కోల్పోవాల్సి వస్తుందో అనే భయంతో అవమానాన్ని పంటికిందే బిగబట్టేస్తున్నారు. బతుకుబండీ లాగే క్రమంలో అనునిత్యం జీవన పోరాటం సాగించే స్వీపర్ల జీవితం కత్తిమీద సామే అని చెప్పవచ్చు. 
 

No comments :

Post a Comment