నెత్తురోడుతున్న గాజా

No comments

యూదు జాత్యహంకార దాడులకు ‘గాజా’ మరోమారు రక్తమోడుతుంది. గత కొంత కాలంగా ఇజ్రాయెల్‌ విసురుతున్న ఆధునిక క్షిపణి దెబ్బకు అతి పెద్ద బహిరంగ జైలుగా ప్రసిద్ది గాంచిన గాజా నేడు నిలువెల్లా గాయాతో తడిసిపోతుంది. జాత్యహంకారంతో దురాక్రమణపూరితంగా ఒక జాతి మొత్తాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్‌ మరణహోమాన్ని సృష్టిస్తుంటే, మౌనంగా వున్న ప్రపంచ అత్యున్నత వ్యవస్థ చేతగాని తనాన్ని గాజా ప్రశ్నిస్తోంది. పౌరుల ఆవాసానే యుద్ధ క్షేత్రాలుగా మిగిల్చిన దశాబ్దాల ఇజ్రాయెల్‌ దురాక్రమణ ముందు తానే దురాక్రమణదారుగా చిత్రీకరించబడుతున్న వైనాన్ని నివ్వెరపోయి చూస్తోంది. ముగ్గురు ఇజ్రాయెలీ యువకులను కిడ్నాప్‌ చేసి, హత్య గావించారనే సాకుతో ఈ సారి అమానవీయ దాడులకు ప్పాడుతున్న ఇజ్రాయెల్‌, మహిళలను,`పిల్లలనే టార్గెట్‌గా చేసుకొని దాడలకు ప్పాడుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇజ్రాయెల్‌ పాస్తీనీయుల్ని అడపాదడపా కవ్విస్తున్నప్పటికీ. ఈమధ్య కాలంలో తన జాత్యాంహంకారాన్ని నగ్నంగా ప్రదర్శిస్తూ ప్రత్యక్ష యుద్ధానికి కాలుదువ్వుతున్నది. గత 20 రోజుగా సాగుతున్న ఈ దాడుల్లో వందలాది మంది అమాయకులు మృత్యువాత పడుతున్నారు. ముగ్గురు ఇజ్రాయెలీ యువకుల హత్యకు తామే బాధ్యులమని ఇస్లామిక్‌ జిహాది సంస్థ ప్రకటించుకున్నప్పటికీ ఇజ్రాయెల్‌ ప్రధాని మాత్రం కళ్ళూ, చెవులూ మూసుకుని ‘‘హమాస్‌’’ సంస్థదే బాధ్యత అని ప్రకటిస్తూ గాజా పౌరులపై ప్రతీకారం అమలు చేస్తున్నాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇజ్రాయెల్‌ తోడేలు న్యాయం ఎలా ఉందో!
అగ్రదేశాల కుట్రలకు బలైన పాలస్తీనా:    
రెండో ప్రపంచ యుద్ధం వరకు గాజా తదితర ప్రాంతాల్లో పాస్తీనీయులే తమ భూభాగంగా ప్రకటించుకొని అక్కడ నివాసం ఏర్పాటుచేసుకున్నప్పటికి అమెరికా, ఇంగ్లాండ్‌ దేశాలు తమ స్వప్రయోజనాలకోసం  జాతివిద్వేషాలు రెచ్చగొట్టడంతో ఈ ప్రాంతం గత డెభై ఏళ్లుగా యుద్ధాతో మునిగితేలాల్సి వచ్చింది. ఈ భూభాగంలోనే పాస్తీనీయులు, యూదులు గతంలో కలిసి నివసిస్తుండేవారు. ఈ ప్రాంతంపైన గ్రీకు, రోమన్లు ఈజిష్షియన్లు అనేక సార్లు దండయాత్రలు చేసి పాలించారు. ఈ దండయాత్ర కాలంలో యూదుల్ని అక్కడినుంచి వెళ్లగొట్టడంతో వారు ప్రపంచంలో అన్ని వైపుకి వలస వెళ్ళారు. పాస్తీనీయుల్ని కూడా వెళ్ళగొట్టిన సందర్భాలున్నాయి. కానీ వాళ్ళు ఆ దాడును, దండయాత్రలను ప్రతిఘటిస్తూ అన్ని కాలాల్లో ఎక్కువమంది అక్కడే నివసించారు. యూరప్‌ దేశాకు వెళ్ళి అక్కడ స్థిరపడిన యూదులు ఆ దేశాల్లో  నివాసాలు ఏర్పాటు చేసుకొని అత్యధిక మంది తక్కువ కాలంలోనే ధనవంతుగా మారారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ హిట్లర్‌ జాత్యాంహకారం శృతిమించడంతో యూరప్‌లోని యూదుల పరిస్థితి ప్రమాదంలో పడింది. నాజీ సైనికులు యూదుల్ని యూరప్‌ నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు. హిట్లర్‌ అయితే అమానుషంగా లక్షలాది మందిని ఊచకోత కోశాడు. ఇదే సందర్భంలో తమ దేశాల్లో కూడా వచ్చి స్థిరపడిన యూదుల్ని తరిమేసి వారికి చెందిన ఆస్తులను వశపరచుకోవాని ఎన్నో ఏళ్ళుగా అనుకుంటున్న అమెరికా, ఇంగ్లండ్‌ దేశాలు ఈ పరిణామాలు కలిసివచ్చాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న బ్రిటన్‌, యూదులు తదాచుకోవడానికి వారికొక దేశం కావాలని ప్రతిపాధించింది. ఈ ప్రతిపాధనకు ఇతర యూరప్‌, అమెరికా దేశాలు వంతపాడాయి. ఇట్లా తమ స్వప్రయోజనా కోసం ఇజ్రాయెల్‌ అనే దేశాన్ని సృష్టించారు. వాస్తవానికి పశ్చిమ దేశాల్లోని యూదులపై మారణహోమానికి  ప్పాడింది హిట్లర్‌ నేతృత్వంలోని జర్మనీ. బాధితులు ఐరోపా దేశాలకు చెందిన యూదులు. వారికి అండగా నిలవాల్సింది,వారిని ఆదుకోవాల్సింది కూడా ఇంగ్లండ్‌, అమెరికా వంటి దేశాలే.  కానీ న్యాయం పేరుతో జరిగిన కుట్రలో ఏమాత్రం సంబంధం లేని పాలస్తీనా బలిపశువుగా మారిపోయింది. పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా అక్రమించి 1948 మే 15 తేదీన అమెరికా, బ్రిటన్‌లు ఇజ్రాయెల్‌ దేశాన్ని స్థాపించాయి. లక్ష మంది పాస్తీనీయును వారి ఇళ్ళ నుండి భూముల నుండి బవంతంగా తరిమేసి వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెలీయులను పాలస్తీనాకు రప్పించారు. పాలస్తీనీయులకు ఆస్తులు, భూములను కట్టబెట్టారు. అలా తరిమివేయబడ్డ పాలస్తీనీయు తమ స్వస్థలాకు తిరిగి రావడానికి ప్రయత్నించడంతో తిరిగి ఘర్షణలు తలెత్తుతున్నాయి.


స్వంత గడ్డపైనే నిర్వాసితుగా మారిన పాలస్తీనియన్లు!
అమెరికా అండతో ఇజ్రాయెల్‌ సాగించిన మారణహోమం మూలంగా దాదాపు పది లక్షల మంది పాలస్తీనియన్లు పక్క దేశాలకి వలస వెళ్ళి అక్కడ శరణార్థుగా ఉంటున్నారు. వివిధ ప్రాంతాల్లో వున్న పాలస్తీనీయు తమ స్వస్థలానికి తిరిగిరావడానికి చాలాసార్లు ప్రయత్నించారు. ఈ చర్యను వ్యతిరేకిస్తూ పొరుగున ఉన్న అరబ్‌ దేశాలన్నీ 1967లో ఇజ్రాయెల్‌ పైన యుద్ధానికి దిగాయి. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్‌ అమెరికా అండదండతో ఆరబ్‌ దేశాల్ని ఆరు రోజుల్లోనే ఓడించి పాలస్తీనా భూభాగాన్ని ఇంకా ఆక్రమించింది. ఈజిప్టు,సిరియా,జోర్డాన్‌ దేశాల భూభాగాల్ని కూడా ఆక్రమించింది. తర్వాత కాలంలో ఈజిప్టు ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకుని అమెరికా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌కు మిత్రదేశంగా ఉంటూ వచ్చింది. తమ నిులువు నీడ కోల్పోయిన పాలస్తీనీయులు ఉత్తరానా లెబనాన్‌, సిరియాల్లో, దక్షిణాన ఈజిప్టు,గాజా, తూర్పున వెస్టు బ్యాంకుల్లో తలదాచుకుంటున్నారు. భయానక పరిస్థితుల మధ్య అక్కడే మిగిలిపోయి జీవనం సాగిస్తున్న పాలస్తీనీయులకు కనీస అవసరాలు తీరకుండా ఇజ్రాయెల్‌ అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. తాగునీరు, సాగునీరు కూడా వారికి అందకుండా అడ్డుకుంటోంది. పాలస్తీనాలో ప్రధాన నీటి వనరులు కుంటలు, సరస్సులే. ఈ నీటి వనరుల వద్దకు పాలస్తీనీయు రాకుండా ఇజ్రాయెలీ సెటిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పాలస్తీనీయుకు జీవనాధారమైన నీటి కుంటలు, సరస్సులను టూరిస్టు కేంద్రాలుగా మారుస్తు వారిని వ్యవసాయం నుండి తరిమేస్తున్నారు. ఆయుధాలు ధరించిన యూదు తీవ్రవాదులు పాలస్తీనీయుపై దాడులు చేస్తూ వారి ఇండ్ల నుంచి తరిమి కొట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. వారికి ఇజ్రాయెల్‌ పోలీసులు, సైన్యం సహాయంగా వస్తున్నారు. వీరి దుర్మార్గాను ప్రశ్నించే వారిని అరెస్టు చేసి విచారణ లేకుండా సంవత్సరాల తరబడి జైళ్ళలో కుక్కుతున్నారు.
   
ఇజ్రాయెల్‌  గతంతో తాను ఆక్రమించిన వెస్ట్‌బ్యాంక్‌ భూభాగంపై అక్రమ సెటిల్‌మెంట్‌ నిర్మాణం వేగవంతం చేయడంతో అక్కడి పాలస్తీనీయు ఈ అక్రమ నిర్మాణాను తీవ్రంగా ప్రతిఘటిస్తూ వస్తున్నారు. అయితే అమెరికా అండదండు పుష్కంగా ఉన్న ఇజ్రాయెల్‌  ఈ ప్రతిఘటనను తన ఆయుధ సంపత్తితో సమర్తవంతంగా తిప్పికొడుతూ గాజా పట్టణాన్ని చుట్టుముట్టి తీవ్ర నిర్భందాలకు గురిచేస్తుంది. ప్రపంచ పెద్దన్నలా వ్యవహరిస్తున్న అమెరికా ఈ రెండు దేశాల మధ్య జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరిస్తామని గత ఐదు దశాబ్దాలుగా చెబుతున్నప్పటికీ ప్రత్యక్షంగా ఇజ్రాయెల్‌నే సమర్థిస్తూ పాస్తీనాపై యుద్ధానికి పురికొల్పుతుమ్న్నది. పాలస్తీనా భూభాగాను అక్రమంగా ఆక్రమించుకుని నిర్మించిన సెటిల్‌మెంట్లపై విచారణ చేయాలని, ఇజ్రాయెల్‌ ఆక్రమిత పాలస్తీనా భూభాగాల్లో పాలస్తీనీయల ఆస్తులను కాపాడాని, పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్‌ సెటిలర్ల హింసాత్మక దాడులను నివారించానీ, గతంలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కు సంస్థ కోరింది. 47 మంది సభ్యులు గల ఐక్యరాజ్య సమితి మానవ హక్కు సంస్థల్లో, తీర్మానానికి అనుకూలంగా 36 దేశాలు ఓటు వేయగా పది దేశాలు ఓటింగ్‌లో పాల్గోనలేదు. అమెరికా ఒక్కటే తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ తీర్మాణాన్ని బట్టే తొస్తోంది అమెరికా ఎవరి వైపు నిలుచున్నదనేది తొసుకోవడానికి. మానవ హక్కులను హరించడంలోనూ, దారుణమైన యుద్ధ నేరాలకు పాల్పడడంలోనూ, మానవతా వ్యతిరేక నేరాలు సాగించడంలోనూ తిరుగులేని రికార్డ్స్ ఉన్న అమెరికా, అటువంటి నేరాల్లో అమెరికాకు జూనియర్‌ పార్టనర్‌గా ఉన్న ఇజ్రాయెల్‌కు వత్తాసుగా రావడం ఆశ్చర్చకరమేమీ కాదు. ఇజ్రాయెల్‌ సెటిల్‌మెంట్లు నిర్మించడం ఆపేస్తే తప్ప పాలస్తీనా సమస్య పరిష్కారం సాధ్యం కాదని ఒకవైపు  ప్రకటించిన ఒబామా, సదరు సెటిల్‌ మెంట్ల నిర్మాణాన్ని అరికట్టడంలో క్రియాశీలక పాత్ర నిర్వహించడానికి సిద్ధంగా లేడని అమెరికా వ్యతిరేక ఓటు ద్వారా స్పష్టం అవుతోంది.

అయితే గత కొన్ని దశాబ్దాలుగా ఈ పరిణామాని గమనిస్తున్న ఐక్యరాజ్య సమితి పాలస్తీనీయుకు అండగా నిలిచి, 1967 యుద్ధానికి ముందున్న సరిహద్దుకి వెనక్కి వెళ్ళాని తిర్మానం చేసింది. ఆ యుద్ధంలో చేసిన ఆక్రమణలు చట్టవిరుద్ధమని ఇప్పటికీ వెస్ట్‌ బ్యాంక్‌లో కడుతున్న సెటిల్‌మెంట్లు చట్టవిరుద్ధమని సమితి తీర్మానం ఉన్నాయి. కానీ అమెరికా యూరప్‌ అండవలన అవి అమలు కావడం లేదు. ఇజ్రాయెల్‌ ఇప్పుడు 1967 సరిహద్దుకి వెళ్ళడానికీ ఒప్పుకోవడం లేదు. పెద్ద గుండాలాగా తయారయ్యింది. ప్రపంచానికి అమెరికా పోలీసైతే మధ్యప్రాచ్చానికి (పశ్చిమాసియా) ఇజ్రాయెల్‌ జూనియర్‌ పోలీసుగా అవతారం ఎత్తింది. ఇజ్రాయెల్‌ పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించుకుని  జాతి వివక్ష పాటిసు జాత్యహంకారిగా వ్యవహరిస్తుంది. అమెరికాలో ఏ అధ్యక్షుడైనా పాలస్తీనాకి అనుకూంగా ఉన్నా త్వరలోనే తన విధానాన్ని మార్చుకునేలా యూదులు వారిపై ఒత్తిడి తెస్తారు. అమెరికాలో ఉన్న యూదుల్ని ఇజ్రాయెల్‌ ఆర్గనైజ్‌ చేస్తు , వారు పెద్ద లాబీగా ఏర్పడి అమెరికా విధానాల్ని ప్రభావితం చేస్తారు. అమెరికాలో యూదుల లాబీ అత్యంత శక్తివంతమైనది. వాళ్ళ డబ్బు వారికా శక్తిని ప్రసాదించింది. చాలా పత్రికా సంస్థలు, బహుళజాతి సంస్థలు యూదువి. గూగుల్‌ని యూదులు స్థాపించిందే.
మౌనం వహిస్తున్న అంతర్జాతీయ సమాజం:   
ఇజ్రాయెల్‌ సాగిస్తున్న ఈ దురన్యాయాలను అంతర్జాతీయ సమాజం గత యాభై సంవత్సరాలుగా చూస్తూ కూడా మౌనం పాటిస్తూ వచ్చింది. సిరియాలో లేని తిరుగుబాట్లను కిరాయి ఇచ్చి నడుపుతున్న అమెరికా, యూరప్‌ యాభై యేళ్ళ నుండి సాగుతున్న ఇజ్రాయెల్‌ వలస పాలననూ, మానవ హక్కుల ఉళ్లంగననూ, పాలస్తీనీయుపై సాగుతున్న దమనకాండనూ అంతం చేయడానికి ప్రయత్నించలేదు. తామూ ప్రయత్నించకపోవడమే కాక ఇతరులు చేసిన ప్రయత్నాలను అవి నీరుగారుస్తూ వచ్చాయి. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమెన్‌ నేతన్యాహూ యుధావిధిగా మానవ హక్కుల సంస్థ తీర్మానంపై విషం కక్కాడు. ‘‘మానవ హక్కు సంస్థ తన తీర్మానానికి తానే సిగ్గు పడాలి’’ అని హుంకరించాడు.

అయితే గతంలో అలీనోద్యమంలో కీలక పాత్రను పోషించిన భారత్‌ నేడు మౌనంగా వహిస్తుంది. అంతర్జాతీయ చట్టాలను, న్యాయాన్ని యధేచ్ఛంగా ఉళ్లంగిస్తూ ఇజ్రాయెల్‌ మరణహోమానికి పాల్పడుతుంటే ఇరుదేశాలు సంశమనం పాటించాని భారత్‌ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఉపదేశం చేస్తుంది!. పాలస్తీనా సమస్యకు త్వరిత గతిన పరిష్కారం కనుగోవాలని పిలుపు నిచ్చిన మనం ఈరోజు మౌనంగా ఉండడం జాత్యహంకారులకు వత్తాసు పకడమే అవుతుంది. వాస్తవానికి ఏడు దశాబ్దాలుగా పాలస్తీనా సమస్యపై ప్రపంచ దేశాులు చేసిందేమి లేదు. 2012లో రెండు లక్షల మంది నివసించే అతి చిన్న పాలస్తీనా భుభాగంపై దురహంకార ఇజ్రాయెల్‌ అత్యాధునికి ఆయుధ సంపత్తితో ఏకపక్షంగా విరుచుకుపడి 1400 మంది ఆమాయక పౌరును బలితీసుకుంటే ఇరాన్‌ తప్ప నోరు మెదిపిన అలీన దేశమే లేదు.

గాజాపై దాడుల అసలు లక్ష్యం:
1947లో ఐరాస ఇజ్రాయెల్‌ను ఏర్పాటు చేసినప్పుడు దానికి కేటాయిచింది దాదాపు 50 శాతం పాలస్తీనా భుభాగం కాగా పాలస్తీనాకు నేడు వెస్ట్‌బ్యాంక్‌, గాజాలు మాత్రమే మిగిలాయి. హమాస్‌కు ఉగ్రవాద నేపథ్యం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారానే గాజాలో అధికారంలోకి వచ్చింది కానీ హమాస్‌పై ఉగ్రవాద సంస్థగా ముద్రవేసి ఇజ్రాయెల్‌, అమెరికా గాజాపై దిగ్బంధాన్ని సాగిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా గాజాలో విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేస్తూ, ఆహారం,మందు అందకుండా చేస్తున్నారు.ఈ ప్రాంతంలోకి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను అనుమతించాని తమ సుప్రీంకోర్టు ఆదేశాను సైతం వారు పాటించలేదు.  కేవలం 40కి.మీ పొడవు, 10 కి.మీ వెడల్పు ఉన్న అతి చిన్న భూభాగం గాజా. ఈ భూభాగంలో 17 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రత్యేకంగా యుద్ధ క్షేత్రాలను నిర్మించుకునే వసతి కూడా గాజాలో లేదు. గాజా ప్రజలు ఏమి చేసినా ఆ పరిమిత భూభాగంలోనే జరుపుకోవాలి. ప్రభుత్వ భవనాలు, జనవాసాలు, మిలట్రీ బ్యారక్‌ అంటూ  వేరుగా నిర్మించుకునే వసతి అక్కడ లేదు. నిజానికి గాజాపై ఇజ్రాయెల్‌ తరచుగా చేసే విశృంఖ దాడులకు అదే అసలు కారణం. గాజా ప్రజలను ఎంత గట్టిగా, ఎంత సూటిగా, ఎంత భారీ నొప్పి కలిగేంతగా బాధిస్తే వారు అంత కుక్కిన పేనుల్లా పడి ఉండారని ఇజ్రాయెల్‌ భావిస్తుంది. అందుకోసం ఒక జాతిమొత్తాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకొని తరచుగా మరణహోమాన్ని సృష్టిస్తుంది.          అయితే పాలస్తీనియన్లకు యుద్ధం అన్నది కొత్తకాదు. ఏడున్నర దశాబ్దాల నిరంతర పోరాటంలో యుద్ధం వారి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఈ సుదీర్ఘ యుద్ధంలో ఇజ్రాయెల్‌ సైనికులు నిత్యం సాగిస్తున్న మారణహోమానుండి స్వజాతిని రక్షించుకోవడానికి ప్రతి ఇంటినీ యుద్ధ శిబిరంగా ముచుకోనే దుస్థితి అగ్రరాజ్యాలు కల్పించాయి. ఇవ్వాళ స్వస్థంలోనే పాలస్తీనియన్లు దురాక్రమణదారులుగా , టెర్రరిస్ట్‌గా చిత్రీకరించబడుతుడున్నాడు. జాత్యంహకార ఆధిపత్యంతో, ఆధునిక ఆయుధ సంపత్తితో, అగ్రరాజ్య అండదండతో మారణహోమానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ను అంతర్జాతీయ సమాజం నిలువరించకపోతే ఒక జాతిమొత్తం హరించుకుపోయి చివరకు మిగిలేది ఇజ్రాయెల్‌ మాత్రమే. సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్యానికి, జాత్యహంకారానికి వ్యతిరేకంగా పాలస్తీనియన్లు నిర్వహిస్తున్న పోరాటానికి ప్రజాస్వామికవాదులు మద్దతుగా నివాల్సిన అవసరం ఉంది.     

గాజా పౌయి వెయ్యి మందికి పైగా మరణించినా పశ్చిమ కార్పోరేట్‌ పత్రికు వారి మరణాకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. బి.బి.సి, సిఎన్‌ఎన్‌, న్యూయార్క్‌ టైమ్‌, బ్లూమ్‌ బర్గ్‌లాంటి పత్రికు ఐరన్‌ డోమ్‌ పనితనాన్ని రిపోర్టు చేయడానికి ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. బిబిసి ప్రకారం గాజా నుండి మొత్తం 1506 మిసైళ్లు ప్రయోగించగా వాటిని అడ్డుకోవడానికి ఐరన్‌ డోమ్‌ 573 సార్లు స్పందించి 421 మిసైళ్లను విజయవంతంగా అడ్డుకుంది. పశ్చిమ కార్పోరేటు పత్రికు ఈ లెక్కన రోజువారీగా నివేదించడం దావరా ఇజ్రాయెల్‌, అమెరికా ఉద్దేశ్యాను పరోక్షంగా తెలియజేశాయి.
యూరోపియన్‌ దేశా కుట్రకు పావుగా మారిన పాస్తీనా:
వేల సంవత్సరా క్రితం కలిసిమెలిసి సహజీవనం సాగిస్తున్న యూదు, పాస్తీనీయు మధ్య యూరోపియన్‌ దేశాలు చేసిన దండయాత్రలు ఇరువర్గావారిని శత్రువుగా తయారుచేశాయి. పాలస్తీనాపై గ్రీకు, రోమన్లు చేసిన దండయాత్ర మూంగా యూదు ప్రపంచంలోని అన్నివైపుకు వస వెళితే,  పాలస్తీనీయులు మాత్రం యూరోపియన్‌ దేశాతో పోరాడుతూ, మరణిస్తూ అక్కడే జీవించారు. వలస వెళ్ళిన యూదులు వివిధ దేశాల్లో స్థిరపడి ధనవంతుగా మారారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జాత్యాంహంకారంతో రెచ్చిపోయిన హిట్లర్‌, యూదుల్ని ఉచకోత కోయడంతో వారి జీవితం ప్రశ్నార్థంగా మారింది. యుద్దానంతరం యూదుల ఆస్తుపై కన్నువేసిని అమెరికా, ఇంగ్లాండ్‌ దేశాలు హిట్లర్‌ యూదుపై జరిపిన జాతి హత్యకాండకు పరిహారం చెల్లించే పేరుతో పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా అక్రమించి 1948 మే 15 తేదీన అమెరికా, బ్రిటన్‌లు ఇజ్రాయెల్‌ దేశాన్ని స్థాపించాయి. లక్షల మంది పాలస్తీనీయును వారి ఇళ్ళ నుండి భూముల నుండి బవంతంగా తరిమేసి వివిధ దేశాల్లో ఉన్న ఇజ్రాయెలీయును పాలస్తీనాకు రప్పించారు. పాలస్తీనీయుల ఆస్తులను, భూమును కట్టబెట్టారు. వాస్తవానికి యూదు హత్యకాండను రచించింది హిట్లర్‌ నేతృత్వంలోని జర్మనీ. బాధితుక్య్ యూదులు. యూదులకు పరిహారం ఇవ్వవసింది జర్మనీ లేదా సాటి యూరోపియన్‌ దేశాలు  కాని న్యాయం (పరిహారం) పేరుతో జరిగిన కుట్రకు యూదు హత్యకాండకు ఏమాత్రం సంబంధం లేని పాలస్తీనీయు బలయ్యారు. బవుతూనే వున్నారు. యూరోపియన్‌ దేశా కుట్ర మూలంగా గత డెబ్బై ఎండ్లుగా పాలస్తీనా యుద్ధక్షేత్రంగా మారిపోయింది.  అగ్రదేశాల అండదండతో లక్షల పాలస్తీనియును ఇజ్రాయెల్‌ సైన్యం వెంటాడి వేటాడిది. తమ ఇళ్ళను వదిలి పక్క దేశాలకు పారిపోయేదాక వెంటబడి తరిమింది. ఆరు దశాబ్దాల నుండి పాలస్తీనా అరబ్బులు తమ సొంత ఇళ్లకూ, పొలాలకూ తిరిగి రావడానికి ప్రయత్నించడంతో ఘర్షణలు తలెత్తుతున్నాయి.  

No comments :

Post a Comment