ఉన్నత విద్యారంగం: సమస్యలు - సవాళ్ళు

No comments
ప్రముఖ విద్యావేత్త డి.ఎస్‌.కొఠారి ఉన్నత విద్యా లక్ష్యాలను పేర్కోంటూ విద్య సామాజిక అవసరాలకు అనుగుణంగా  ఉంటూ,సామాజిక చైతన్యానికి హృదయంలా పనిచేసి తాను పనిచేస్తున్న సామాజిక జీవన విధానాన్ని విమర్శనాత్మకంగా  విశ్లేషించే సాధనంగా ఉండాలి అని పేర్కోన్నాడు. దీనికి భిన్నంగా నేషనల్‌ నాలెడ్జ్‌ కమీషన్‌ ఛెర్మన్‌ శ్యాం పెట్రోడా విద్య ద్వారా ఉత్పత్తి పెంచి, పెంచిన ఉత్పత్తికి వినియోగించే శక్తిని కల్పించాలని పేర్కోన్నాడు. ఈ రెండు దృక్పథాలు నిజానికి రెండు భిన్న ధృవాలు. విశ్వవిద్యాలయాల పాత్ర ఏ దృక్పథం మీద ఆధారపడి ఉంటున్నదనేది ప్రధాన సవాళు. సమాజ శ్రేయస్సు,సమిష్టి జీవన మలువనుపెంచే దిశగా విద్యావ్యవస్థ ఉండాలి. నిజానికి విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి అర్థం అవి రాజ్యాధికారం నుండీ మార్కెట్‌ శక్తులనుండి కాపాడబడాలనే కాని సామాజిక బాధ్యతలేదని కాదు. ఉన్నత విద్య నిరంతరంగా ప్రజకు బాధ్యతవహించి ప్రజల ఆకాంక్షకనుగుణంగా, వాళ్ళ సమస్యలకు ధర్పణంగా, సామాన్య, శ్రమజీవు జీవితం మెరుగపడే మార్గాలు వెతకాలి. పౌర సమాజ నిర్మాణంలో దేశ వ్యాపితంగా యువతను భాగస్వాములను చేయడంలో విద్య కీలక పాత్ర నిర్వహించాలి. విద్యా విదానం వ్యక్తి ప్రతిభను ఎంత పెంచినా ఆ వ్యక్తి తన చుట్టూ ఉండే పరిస్థితులకి స్పందించకపోతే అతను మానవత్వాన్ని కొల్పోయే ప్రమాదం ఉంటుంది. మానవీయ దృక్పథాన్ని విస్మరించి విద్య వ్యక్తి ప్రయోజనం కొరకే అనే అమానుష భూమిక మీద ఇప్పుడు విశ్వవిద్యాయాలని నిర్మించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాయాలను అహ్వానిస్తున్నారు.
 
భారత ప్రభుత్వం దేశంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)తో నడిచే విద్య సంస్థల ఏర్పాటుకు కూడా అమోదం తెలిపింది. దీంతో ఉన్నత విద్యారంగంలో లాభదాయకమైన సంస్థను నెలకొల్పుకునేందుకూ, ప్రయివేట్‌, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుకు భారీ ఎత్తున అవకాశాలు కల్పించేందుకూ బడా వ్యాపార సంస్థలు సిద్ధపడుతున్నాయి. విద్యారంగంలో చోటుచేసుకున్న ఈ మార్పు నేపధ్యంలో మొదటిసారిగా ప్రపంచ వాణిజ్య సంస్థ (ఉబ్ల్యుటీవో) చర్చ అజెండాలో విద్యరంగాన్ని కూడా చేర్చారు. ‘‘సేవల్లో వ్యాపారంపై సాధారణ ఒప్పందం’గాట్స్‌ 2000’’ అనే శీర్షిక కింద ఈ చర్చ జరిగాయి.
గాట్స్‌ ఆధారంగా ఉన్నత విద్యా వ్యవస్ధ తలుపులు తెరిస్తే ప్రయివేటీకరణ, వ్యాపారీకరణ, ప్రపంచీకరణ, ఉన్నత విద్యపై నియంత్రణ తొగింపు పెద్దఎత్తున చోటుచేసుకుంటాయి. అంతేకాకుండా ప్రభుత్వం నిధులను కుదిస్తుంది. ఉన్నత విద్య సరళీకరించబడి విదేశీ, స్వదేశీ స్వయం నిర్వహణ (సెల్ఫ్‌ఫైనాన్స్‌) సంస్ధలు పెరుగుతాయి. గాట్స్‌ 2000 చర్చ ఒప్పందం తరువాత మనదేశంలో విద్య వ్యాపారీకరణ వేగవంతమయింది. విద్యా వ్యాపారు లాభార్జనకు అవకాశాలు పెరిగాయి. ఉన్నత విద్యలో పెరుగుతున్న డిమాండ్‌ను ప్రయివేట్‌ సంస్ధలు అందుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నియంత్రణను గాలికొదిలేస్తోంది. గాట్స్‌ చర్చలు ఈ ధోరణికి మరింత ప్రోత్సాహం కల్పిస్తున్నాయి. ఉన్నత విద్యారంగంపై నియంత్రణ తొలగింపు, సరళీకరణలు తీవ్రమైన దుష్బ్రవాన్ని చూపుతున్నాయి నాణ్యత లేకుండా ప్రయివేటు విద్యాసంస్ధలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. పేద ప్రజలు, ముఖ్యంగా సామాజిక వివక్ష నెదుర్కొంటున్న బహినవర్గ ప్రజలు విద్యకు దూరమవుతున్నారు.  విద్య వ్యాపారీకరణను అరికట్టాని, విద్యరంగ సరళీకరణను తొగించాని భవిష్యత్తులో ప్రభుత్వాలు భావించినప్పటికి అది అమలు చేయడం కష్టమౌతుంది. ఎందుకంటే ‘గాట్స్‌ 2000’ చర్చ ప్రకారం అలాచేస్తే వ్వాపార భాగాస్వామికి సష్టపరిహారం చెల్లించాల్సి  ఉంటుంది. ఈ నిబంధన వల్ల ఉన్నత విద్యలో అసమానతలు పెరుగుతాయి. మన విద్యవిధానం స్వతంత్రతను కోల్పోయి, ఇతర దేశా సంస్ధమీద అధారపడే స్థితికి పోతుంది.
 
గాట్స్‌ చర్చ ద్వారా విదేశీ విద్య సంస్థకు మన విద్య వ్యవస్థ ద్వారాలు తెరవడం వల్ల సంభవించే నష్టాలను అంచనా వేయడంలో కేంద్ర విద్య సహాయమండలి (సిఎబిఇ) విఫలమైంది. దానివల్ల భారత అభివృద్ధికి జరిగే నష్టాలను సిఎబిఒ నివేదిక విస్మరించింది. విద్య అంతర్జాతీయ వ్యాపార వస్తువుగా మారిన తర్వాత ఉన్నత విద్యను నియంత్రిచండంలో డబ్ల్యుటీవో, ప్రపంచబ్యాంక్‌, ఇతర బహుళజాతి సంస్థల  ప్రభావం పెరిగింది. ఉన్నత విద్యలో వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఉన్నత విద్యను ప్రపంచీకరించారు. ఇతర దేశాలకు వెళ్ళకుండానే స్వదేశంలో విదేశీ చదువు సాగించే వ్యక్తుల సంఖ్య ఈ కాలంలో బాగా పెరిగింది. 1995`2005 మధ్యకాలంలో ఈ విధంగా చదువుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 15 క్ష నుండి 25 ల్లక్షకు అంటే దాదాపు 60 శాతం పెరిగింది. పూర్తి దూర విద్యా కోర్సుల్లో చేరడం ద్వారానో లేక విదేశాల్లోని యూనివర్శిటీలు, కాలేజీలు లేదా విదేశీ ఎగ్జామినేషన్‌ బోర్డు భాగాస్వామంతో ఏర్పరచిన స్థానిక ప్రభుత్వ లేదా ప్రయివేట్‌ సంస్థల్లో అధ్యయనం ద్వారానో వీరంతా విదేశీ విద్యర్హతలు పొందుతున్నారు. అగ్నేయాసియాలో ఉమ్మడి ఒప్పందాలు సర్వసాధారణమయ్యాయి. ఈ విధమైన సంస్థాపరమైన ఒప్పందాల ద్వార విదేశీ యూనివర్సిటీనూ, విదేశీ ప్రయివేట్‌ ఉన్నత విద్య సంస్థనూ ఏర్పాటు చేసి కోర్సును నిర్వహిస్తూ డిగ్రీ పట్టాను అందిస్తున్నాయి. స్వదేశీ సంస్థలు విదేశీ ‘భాగాస్వామ్యంతో’ విద్యాయాలు నడుపుతూ వారి కోర్సు ‘స్వదేశం’లో చెల్లుబాటు అయ్యేలా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. విదేశీ భాగాస్వామికి చెందిన బోధనాపద్థతులు, పరీక్ష ప్రమాణాలు కూడా చెల్లుబాటు  అవుతున్నాయి. విదేశీ సంస్థలు దేశంలో తమ స్వంత విద్య కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి.
విద్య ఎగుమతుల్లో అగ్రగామి అమెరికా:
2005లో ఉన్నత విద్యరంగంలో 500 కోట్ల డాలర్ల అంతర్జాతీయ వ్యాపారం జరిగిందని అంచనా. ఇది ఒఇసిడి (అభివృద్థిచెందిన) దేశాల్లోని మొత్తం సేవ వ్యాపారంలో మూడవ శాతానికి సమానం. విద్యసేవల్లో అంతర్జాతీయ వ్యాపారం త్వరలోనే 1000 కోట్ల డాలర్లు దాటుతుందని గ్రాండ్‌ అయెన్స్‌ ఫర్‌ ట్రేడ్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ (బిఎటిఇ) అంచనా వేసింది. విద్య సేవను ఎగుమతి చేయడంలో అమెరికా అగ్రభాగాన ఉండగా అ తరువాత స్థానాల్లో బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌ ఉన్నాయి. అమెరాకాలో విద్యాసేవ ఎగుమతి వ్యాపారం 2005 లో 200 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇది అన్ని రకాల సేవ ఎగుమతిలో ఐదో స్థానంలో ఉంది. విద్యా ఉన్నత విద్య సేవలు అమెరికాకు మంచి వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో 40 లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్న విద్యాసేవల వ్యాపారాన్ని విస్తరించుకోవాని ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉన్నత విద్యలో అమెరికాకు 64 శాతం మార్కెట్లు ఆసియా దేశాలైన చైనా, జపాన్‌ కొరియా,భారత్‌, తైవాన్‌, ధాయ్‌లాండ్‌, ఇండోనేషియా, మలేషియాలో లభిస్తుండగా మిగిలిన మార్కెట్‌ యూరప్‌, లాటిన్‌ అమెరికా దేశాల్లో ఉంది. బ్రెజిల్‌, చైనా, భారత్‌ కొరియా, మలేషియా దేశాల్లో విద్యకు పెరుగుతున్న గిరాకీ రీత్యా విద్యావ్యాపార విస్తరణకు అవకాశాలు పెరుగుతున్నాయి.
అయితే ప్రస్తుతం విద్యాసేవ వ్యాపారంలో అమెరికాకు ఆస్ట్రేలియా, బ్రిటన్‌ నుండి పోటి ఎదురవుతుంది. ఈ వ్యాపారానికి స్వేచ్ఛా మార్కెట్‌ లేక పోవడం బడా వ్యాపార వర్గాల్లో అసంతృప్తిని పెంచుతొంది. అసియా దేశాల విద్యార్థుల కోసం ప్రధానంగా పోటి నెలకొంది. ఈ దేశాల్లో ప్రాధాన్యత వారీగా వ్యాపార అస్థిత్వాన్ని సుస్థిరం చేసుకొవాలని లేదా విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులు పెట్టాలని బడా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి, డబ్ల్యుటీవో చర్చ ద్వారా జాతీయ అడ్డంకులను తొగించుకొని ఈ దేశాల్లో ప్రయివేట్‌ ఉన్నత విద్యా మార్కెట్‌ను విస్తరించుకోవాని బడా వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. అభివృద్ది చెందుతున్న దేశాల్లో విద్యారంగ రక్షణకు అనేక చట్టపరమైన నియంత్రణలున్నాయి. జాతీయ ప్రయోజానాలు, ఆర్థిక అవసరా రీత్యా ఈ నియంత్రణలు, పరిమితలు ఖచ్చితంగా అవసరం. అయితే వీటిని అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ు ఆటంకాలుగా పేర్కోన్నాయి. విద్యా వ్యాపారంలో డబ్ల్యుటివో గుర్తించిన నాుగు విభాగాల్లోనూ సభ్యదేశా మధ్య ఒప్పందం జరగాని ఈ దేశాు కోరుతున్నాయి.
ఈ నిబంధనను అమోదించే ముందు విద్య సేవల్లో అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహించాడం ద్వారా ఉత్పన్నమయ్యే అన్ని పరిణామాల గురించి మన దేశంలో  విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరంముంది. గాట్స్‌ చర్చు నేటికి అస్పస్టంగానే ఉన్నాయి. చర్చ ఫలితమే కాదు, గాట్స్‌ సాధారణ నిబంధనల్లో కూడా అస్పస్టత నెకొని ఉంది. ఉదాహారణకు జాతీయ స్థాయిలో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ నిబంధను మొత్తం భారత విద్యారంగ మంతటికీ అంటే రాష్ట్రాకు కూడా వర్తిస్తాయా అనేది సందిగ్థం. ఒకవేళ వర్తిస్తే లాభా కోసం స్థాపించే విదేశీ విద్య సంస్థలు కూడా ప్రభుత్వ నిధుల కోసం జాతీయ విద్య సంస్థతో పోటిపడతాయి. ప్రభుత్వ నిధుల్లో కోతపెట్టే అవకాశం ఉంది. ఈ స్థితి అధిక ఫీజుకు కారణమై విద్యారంగంలో అసమానతను తీవ్రంగా పెంచుతుంది.
గాట్స్‌ చర్చల్లో భారత స్థానం :డబ్ల్యుటివో చర్చల్లో భాగంగా ఉన్నత విద్యను సరళీకరిస్తామని అమెరికా, యురోపియన్‌ యూనియన్‌, కెనడా, ఆఫ్రికన్‌  అరబ్‌ దేశాతో పాటు పొరుగు దేశాలు కూడా హామీ ఇవ్వాని భారత్‌ కోరుతుంది. గాట్స్‌ ప్రతిపాదన వల్ల దీర్ఘకాంలో విద్యా నాణ్యత దెబ్బతినడమే కాకుండా ప్రజాప్రయోజనాలకు కూడా నష్టం కుగుతుంది. ఎందుకంటే గాట్స్‌ నిబంధన వల్ల విద్యా వ్యవస్థపై ప్రభుత్వాలకు పట్టు, నియంత్రణ లేకుండా పోతుంది. నాలుగు రకాల వ్యాపార విధానాలతో మార్కెట్‌ను సరళీకరించడం వైపే భారత ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. విదేశీ విద్యా సంస్థలు భారత విద్యార్థులకు బయోటెక్నాజీ, కంప్యూటర్‌ సైన్సెస్‌, మెటీరియల్‌ సెన్స్‌ లాంటి అభివృద్థి చెందుతున్న సైన్స్‌ కోర్సులను అందిస్తాయని భారత ప్రభుత్వం భావిస్తోంది. కీలక అంశాల్లో విదేశీ పెట్టుబడును ఆకర్షించేందుకు వాటిని 74 శాతానికి మాత్రమే పరిమితం చేసి ప్రోత్సాహాకాలు ఇవ్వడం ద్వారా విదేశీ విద్యా సంస్థను నియత్రించవచ్చునని అది పేర్కోంటోంది. అయితే సాంకేతిక వ్యవహారాలను ప్రభుత్వమే నేరుగా నియంత్రించినప్పుడు మాత్రమే మనకు విదేశానుండి నాణ్యమైన సాంకేతిక పరిజ్ఞానం భిస్తుందని లేకుంటే మనం పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని మన ప్రభుత్వ విస్మరిస్తోంది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుపై పరిమిత రూపంలో పరోక్ష నియంత్రణలు ఉండాని ప్రభుత్వం అంటోంది. కాని ఇది కనీసం మనకు దిగుమతి అవుతున్న టెక్నాజీ ఏమిటనే విషయం తొనుకునేందుకు కూడా సరిపోదు. గత 50 ఏళ్ళ అనుభవాన్ని గమనిస్తే విదేశీ కంపెనీలు తమ ముఖ్యమైన టెక్నాజీలను ఇతరులకు పంచాలని ఎన్నడూ ప్రయత్నించలేదు.ఉక్కు చమురు, ఎక్ట్రానిక్స్‌, ఔషదాలు, సూపర్‌ కంప్యూటరింగ్‌లో మన అనుభవాలను ఎలా మరిచిపోగం?
భారత ప్రభుత్వం విద్యారంగంలో 100 శాతం ఎఫ్‌డిఐను ఆహ్వానించింది. ఎఐసిటిఇ, యుజిసి గుర్తింపు పొందిన సంస్థ కేటగిరీ కింద విదేశీ సంస్థను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఐదేళ్ళ కాంట్రాక్ట్‌ కింద ఈ సంస్థను అనుమతిస్తున్నారు. సరిగ్గా నిర్వహించకుంటే మూడేళ్ళ తరువాత వాటి అనుమతిని సమీక్షించే నిబంధన కూడా కాట్రాక్ట్‌లో పొందపరుస్తున్నారు. 1990 నుండి వ్యాపార వర్గ ప్రయోజనాకు అనుగుణంగా భారతపాలకులు మన విద్యా విధానాన్ని రుపొందిస్తున్నారు. ఈ పరిణామాు భారత ఉన్నత విద్యలో ప్రయివేటీకరణ. లాభార్జనను విపరీతంగా పెంచాయి. ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా సామార్థ్యాన్ని పెంచుకొవడానికి ప్రయివేట్‌ నిధులు సమీకరించుకోవాలని, ఆ నిధులతో కొత్త సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సు ప్రారంభించాని వాటిపై ఒత్తిడి వస్తోంది.
ఉన్నత విద్యా సంస్థల స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఉన్నత విద్య సరళీకరణ, ప్రయివేటీకరణను మరింత వేగవంతం చేయాని ఈ కమిటీ కూడా ప్రతిపాదించింది. దీనికితోడు మన ఉన్నత విద్యా రంగంలోని సంగీతం, ఆర్ట్స్‌ అండ్‌ క్చర్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాజీ విభాగాలను ప్రపంచస్థాయిలో మార్కెటింగ్‌ చేసుకోవాలని దేశంలోని ఎగువ మధ్యతరగతి వర్గం భావిస్తున్నది. మేనేజ్‌మెంట్‌ విద్య, ఆయుర్వేద, ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్, ఇంజనీరింగ్‌, ఐటి విద్య, యోగా మరియు విదేశీ భాష విద్య వ్యవసాయం, గ్రామీణాభివృద్థి విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు మార్కెట్‌ అవకాశం కల్పించాని గాట్స్‌ చర్చల్లో భారత్‌ కోరుతోంది.
 
ఉన్నత విద్యపై గాట్స్‌ ప్రభావం
 ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి విద్యారంగ బడ్జెట్‌ 10,000 కోట్ల డార్ల వరకు ఉంది. ఈ రంగం ఐదు కోట్ల మంది ఉపాధ్యాయుకు ఉపాధి కల్పిస్తుండగా ఏడాదికి 10 కోట్ల మంది విద్యార్థు చేరుతున్నారు. విద్యా సేవల్లో వ్యాపార ధోరణి పెరగడం వ్ల విద్యారంగంలో అంతర్జాతీయ సహాకార ప్రక్రియ దెబ్బతింటుంది. ఇప్పటి వరకు వర్థమాన దేశాు ఈ సహాకారంతోనే తమ ప్రభుత్వరంగ సంస్థను అభివృద్థి చేసుకుంటూ వస్తున్నాయి. ఉదాహారణకు మనదేశంలో ఐఐటిు. గత 20 ఏళ్ల కాంలో విద్యకు ప్రభుత్వ నిధుల్లో కోత విదించడం, ఉన్నత విద్యపై నియంత్రణ తొగించడం వ్ల ఇప్పటికే భారత విద్య వ్యవస్థ పెద్ద ఎత్తున నష్టపోయింది. ప్రభుత్వ యూనివర్శిటీు, ఇతర వృత్తి సంస్థనుండి నాణ్యమైన విద్యను పొందగమనే నమ్మకం మధ్యతరగతి ప్రజల్లో సడలింది ఈ నేపధ్యంలో ఉన్నత విద్యలో బలీయమైన శక్తిగా ఎదుగుతున్న బడా వ్యాపారవర్గం భారత్‌లో ప్రవేశించింది.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు ఉన్నత విద్యారంగంలోకి వస్తాయనే ఆశతో భారత ప్రభుత్వం గాట్స్‌ చర్చలో పాల్గోంది.విదేశీ యూనివర్శిటీు అందించే కోర్సుపై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎన్‌ఐఇపిఎ) చేసిన విశ్లేషణ నిజానికి చేదు అనుభవాు తొపుతుంది. అవి అందించే కోర్సుల్లో అత్యధిక భాగం హాస్పిటాలిటీ సర్వీసు, మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాజీకి సంబంధించినవి. చాలా కోర్సులో ఏక కాంలోనే రెండు డిగ్రీను అందిస్తున్నాయి. ప్రవేశానికి మార్కు శాతం లాంటి కనీస అర్హతను కూడా పాటించడం లేదు. డిగ్రీకోర్సు కావ్యవధి అదే డిగ్రీకు మనదేశంలో అమల్లో ఉన్న కా వ్యవధికన్నా తక్కువగా ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ స్థాయిలో మంచి ప్రతిభ చూపలేని విద్యార్థు మాత్రమే విదేశీ డిగ్రీు కావానుకుంటున్నారన్న విషయం స్పష్టంగా అర్థమౌతుంది. భారత యూనివర్శిటీు, కాలేజీల్లో ప్రవేశం పొందలేని వారే అత్యధికంగా విదేశీ డిగ్రీు కావానుకుంటున్నారు.
విదేశీ విద్య సంస్థు విద్యార్థును ఆకర్షించేందుకు అనేక జిమ్మిక్కుకు ప్పాడుతున్నాయి. విద్యార్థుకు ఇంటివద్దనే విద్య అందిస్తున్నాయి. కాని దీనివ్ల విద్యార్థు నాణ్యమైన విద్య పొందలేకపొతున్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో అనేక విద్యా కేద్రాను నెకొల్పిన ఆస్ట్రేలియా ఇందుకు పెద్ద ఉదాహరణ. ఈ సంస్థల్లో విద్యా నాణ్యత ప్రమాణాను అధ్యయనం చేసిన సంస్థు వ్లెడిరచిన వివరా ప్రకారం ఇవి ఆస్ట్రేలియా ఉన్నత విద్య సంస్థకు గుదిబండుగా మారిపోయాయి. దీంతో ఆ సంస్థల్లో ఖర్చును తగ్గించుకునేందుకు అవి అందించే చాలా సౌకర్యాల్లో కోత విధిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఈ సంస్థు అందిస్తున్న విద్య నాణ్యత ప్రమాణాపై ప్రభావం చూపుతుంది. బహుజాతి సంస్థ అవసరాల్లో వచ్చిన మార్పు దృష్ట్యా కొన్ని ఎంపిక చేసిన వృత్తివిద్యా కోర్సు కోసం భారత్‌లో విద్యావ్యాపారం చేయాని ప్రపంచ మార్కెట్‌ శక్తు ఆసక్తి గా ఉన్నాయి. ఈ విదేశీ సంస్థు కొత్త కోర్సుల్లో విద్యా సంస్థు తెరవడం కాకుండా స్థానికు కూడా సునాయసంగా  నిర్వహించగల్గిన మార్కెట్‌ను కైవసం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాయి. వృత్తి సేమ అంతర్జాతీయీకరించబడుతున్న కొద్దీ ఉన్నత విద్య ప్రపంచీకరణ ప్రక్రియ వేగవంతమవుతోంది. లాభాు ఆర్జించే మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌, ఆడిట్‌ అండ్‌ అకౌంట్స్‌ కోర్సు మంచి అవకాశాు కల్పించేందుకు సిద్థంగా ఉన్నాయి. అందుకే ఆంగ్ల భాషా ప్రావీణ్యం కల్గిన భారత యువతను బుట్టలో వేసుకునేందుకు భారత్‌లో విద్యా వ్యాపార సంస్థు నెకొల్పాని ప్రపంచ మార్కెట్‌ శక్తు భావిస్తున్నాయి. అటానమస్‌ విద్యాసంస్థకు అనుమతివ్వడం ద్వారా ప్రభుత్వం విదేశీ విద్యసంస్థకు తుపు తెరిచింది.
భారత్‌లో ఉన్నత విద్య ఇప్పటికీ వేగంగా అభివృద్థిచెందుతున్న రంగమే. అయితే ఈ రంగలో ప్రభుత్వ ఖర్చు తగ్గిపోబట్టే ప్రయివేట్‌ మార్కెట్‌కు డిమాండ్‌ ఏర్పడిరది. ప్రభుత్వ ఖర్చు ఉన్నత విద్యపై ప్రణాళికా వ్యయంలో 1.24 శాతం నుండి 0.35 శాతానికి తగ్గిపొయింది. దాదాపు 75 శాతం కాలేజీు ప్రయివేట్‌ రంగంలోనే ఉన్నాయి. ఉన్నత చదువుకయ్యే ఖర్చును విద్యార్థులే భరించానే ధోరణి రోజురోజుకీ పెరుగుతోంది. అధిక ఆదాయాున్న కుటుంబాకు చెందినవారు అత్యధిక ప్రయోజనాను చేజిక్కించుకుంటున్నారు. మరోవైపు ప్రయివేట్‌ కాలేజీ పెరుగుద వ్ల విద్యప్రమాణా నాణ్యత క్షీణిస్తోంది. ఉన్నత చదువు ఖర్చును విద్యార్థులే భరించడం పేదకు సాధ్యంకాదు. ఉన్నత విద్య ప్రయివేటీకరించబడితే అది పేదకు శాశ్వతంగా దూరమైపోతుంది.
                                                                                                 తెంగాణ విద్యార్థి గళం, జులై`ఆగస్టు 2012 
 

No comments :

Post a Comment